సింగపూర్: తమ విమానానికి బాంబు బెదిరింపు వచ్చిందని సింగపూర్ ఎయిర్లైన్స్(ఎస్ఐఏ) స్పష్టం చేసింది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి సింగపూర్కు బయలుదేరిన విమానం ఎస్ క్యూ 001కు ఉగ్రవాదులు బాంబు హెచ్చరికలు చేశారని, దాంతో విమానాన్ని చాంఘీ విమానాశ్రయంవద్ద సురక్షితంగా దించివేశామని చెప్పారు.
దీనివల్ల ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బంది కలిగిందని, వారి సామాను తీసుకునేందుకు దాదాపు రెండున్నర గంటలు ఎదురుచూడాల్సి వచ్చిందని , అందుకు చింతిస్తున్నామని అన్నారు. తొలుత బాంబు బెదిరింపు విషయాన్ని అధికారులకు చెప్పామని, అయితే, భద్రతా కారణాల దృష్ట్యా వివరాలు చెప్పకుండా చాలా జాగ్రత్తగా విమానాన్ని దించివేసేలా చేశామన్నారు. చివరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నామని చెప్పారు.
'మా విమానానికి బాంబు బెదిరింపు నిజమే'
Published Sun, Nov 22 2015 7:54 PM | Last Updated on Tue, Oct 2 2018 8:04 PM
Advertisement