బాంబు బెదిరింపు‌లు.. సోషల్‌ మీడియాపై కేంద్రం సీరియస్ | Centre Big Caution To Social Media Platforms Over Fake Bomb Threats | Sakshi
Sakshi News home page

బాంబు బెదిరింపు‌లు.. సోషల్‌ మీడియా సంస్థలపై కేంద్రం సీరియస్

Published Sat, Oct 26 2024 8:05 PM | Last Updated on Sat, Oct 26 2024 8:27 PM

Centre Big Caution To Social Media Platforms Over Fake Bomb Threats

న్యూఢిల్లీ: ఇటీవల దేశీయ విమానాలతోపాటు అంతర్జాతీయ విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు భారీగా పెరిగాయి. గత 10 రోజుల్లోనే 250కి పైగా భారతీయ విమానాలకు బాంబు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. బెదిరింపులు విమానయాలన సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా, స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ లైన్లకు వరుసగా బెదిరింపులు రావడంతో కేంద్రం ఈ అంశంపై దృష్టి సారించింది.

ఈ క్రమంలో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి బెదిరింపుల వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ శనివారం ఆదేశించింది. కేంద్రం ఆదేశాలను ధిక్కరించినట్లయితే థర్డ్‌ పార్టీ కంటెంట్‌ను ఆయా ప్లాట్‌ఫామ్‌లు తీసుకునే వెసులుబాటును నిలిపివేస్తామని స్పష్టం చేసింది.

నకిలీ బెదిరింపుల వల్ల విమాన సర్వీసులు ఆలస్యం అవ్వడం నిలిచిపోవడం జరుగుతున్నాయని తెలిపింది. ఆకతాయిలు పెట్టే ఫేక్ బెదిరింపు మెసేజ్‌లను ఎప్పటికప్పుడు గుర్తించి, తొలగించేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఫేక్ బెదిరింపు మెసేజ్‌లను ఎప్పటికప్పుడు తొలగించడంలో విఫలమయ్యే సోషల్ మీడియా కంపెనీలను బాధ్యులుగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement