సామాజిక మాధ్యమ వేదికలకు కేంద్రం అడ్వైజరీ
ఉత్తుత్తి హెచ్చరికలను అడ్డుకోవాలని సూచన
న్యూఢిల్లీ: దేశీయ విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. శనివారం మరో 33 విమానాలకు ఈ హెచ్చరికలు అందాయని అధికారవర్గాలు తెలిపాయి. దీంతో, గత 13 రోజుల్లో 300కు పైగా విమానాలకు ఉత్తుత్తి బెదిరింపులు అందినట్లయింది. ఇండిగో, విస్తార, ఎయిరిండియాలకు చెందిన 11 చొప్పున విమానాలకు శనివారం సామాజిక మాధ్య మ వేదికల ద్వారానే చాలా వరకు బెదిరింపులు అందాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సామాజిక మాధ్యమ వేదికలకు అడ్వైజరీ జారీ చేసింది. బెదిరింపులు శాంతియుత వాతావరణానికి, దేశ భద్రతకు భంగం కలిగించడంతోపాటు దేశ ఆర్థిక భద్రతకు ముప్పుగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేసింది. వీటి వల్ల విమాన ప్రయాణికులు, భద్రతా విభాగాలపై ప్రతికూల ప్రభావం చూపిందని, విమానయాన సంస్థలు తమ సాధారణ కార్యకలాపాలు కొనసాగించ లేకపోయాయని తెలిపింది.
ఐటీ నిబంధనల మేరకు ఇటువంటి తప్పుడు సమాచారంపై ఓ కన్నేసి ఉంచాలని, కనిపించిన వెంటనే తొలగించడం లేదా నిలిపివేయాలని కోరింది. భారత సార్వ¿ౌమత్వం, భద్రత, సమగ్రత, ఐక్యతలకు భంగం కలిగించే చర్యలపై ప్రభుత్వానికి సమాచారం అందించడం తప్పనిసరని స్పష్టం చేసింది. ఆయా మాధ్యమ వ్యవస్థలు తమ నియంత్రణ లేదా ఆ«దీనంలో సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా లేదా 72 గంటల్లోగా అందించడంతోపాటు సంబంధిత దర్యాప్తు సంస్థలకు విచారణలో సహకరించాల్సి ఉంటుందని గుర్తు చేసింది.
ఏ యూజర్ అయినా చట్ట విరుద్ధమైన లేదా తప్పుడు సమాచారం ప్రచురణ, ప్రసారం, ప్రదర్శించడం, అప్‌లోడ్, స్టోర్, అప్‌డేట్, షేర్ వంటివాటిని అడ్డుకునేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సామాజిక మాధ్యమ వేదికలదేనని పేర్కొంది. ఉల్లంఘించిన వారిపై ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహిత–2023 ప్రకారం చర్యలుంటాయని తెలిపింది. విషయ తీవ్రత దృష్యా్ట ఈ అడ్వైజరీ జారీ చేస్తున్నట్లు ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ తెలిపింది. విమానయాన సంస్థలకు అందుతున్న ఉత్తుత్తి బెదిరింపులకు సంబంధించిన సమాచారాన్ని అందజేయాలంటూ రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం మెటా, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమ వేదికలను కోరడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment