domestic flights
-
విమానాల్లో వైఫై.. ఫ్రీగా ఇంటర్నెట్
విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) దేశీ, విదేశీ రూట్లలో నడిపే ఫ్లయిట్స్‌లో వైఫై (Wi-Fi) ఇంటర్నెట్ కనెక్టివిటీ సర్వీసులను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఎయిర్‌బస్ ఏ350, బోయింగ్ 787–9 రకం విమానాలతో పాటు నిర్దిష్ట ఎయిర్‌బస్ ఏ321నియో ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.దేశీయంగా ఫ్లయిట్స్‌లో వైఫై సర్వీసులను ప్రవేశపెట్టిన తొలి విమానయాన సంస్థ తమదేనని ఈ సందర్భంగా కంపెనీ తెలిపింది. దేశీ రూట్లలో ప్రస్తుతానికి వీటిని కాంప్లిమెంటరీగా అందిస్తున్నట్లు వివరించింది. క్రమంగా అన్ని విమానాల్లోనూ ఈ సేవలు ప్రవేశపెడతామని పేర్కొంది.విమానాలు 10,000 అడుగుల ఎత్తు దాటాకా ప్రయాణికులు తమ ల్యాప్ టాప్‌లు, టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లను వైఫైకి కనెక్ట్ చేసుకుని ఇంటర్నెట్ సేవలు ఆస్వాదించవచ్చు. ప్రస్తుతానికి ఈ సదుపాయాన్ని ఉచితంగానే అందుబాటులోకి తెచ్చినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించించింది.ఎయిర్ ఇండియా అంతర్జాతీయ రూట్లలో పైలట్ ప్రోగ్రామ్‌గా గతంలో ఈ సర్వీసును ప్రారంభించింది. వీటిలో న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ వంటి ప్రధాన గమ్యస్థానాలు ఉన్నాయి. ఇప్పుడు దేశీయ రూట్లలో కూడా దీన్ని అమలు చేస్తున్నారు. వై-ఫై సేవలను క్రమంగా ఇతర విమానాలకు కూడా విస్తరిస్తారు. -
ఈసారి 33 విమానాలకు బెదిరింపులు
న్యూఢిల్లీ: దేశీయ విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. శనివారం మరో 33 విమానాలకు ఈ హెచ్చరికలు అందాయని అధికారవర్గాలు తెలిపాయి. దీంతో, గత 13 రోజుల్లో 300కు పైగా విమానాలకు ఉత్తుత్తి బెదిరింపులు అందినట్లయింది. ఇండిగో, విస్తార, ఎయిరిండియాలకు చెందిన 11 చొప్పున విమానాలకు శనివారం సామాజిక మాధ్య మ వేదికల ద్వారానే చాలా వరకు బెదిరింపులు అందాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సామాజిక మాధ్యమ వేదికలకు అడ్వైజరీ జారీ చేసింది. బెదిరింపులు శాంతియుత వాతావరణానికి, దేశ భద్రతకు భంగం కలిగించడంతోపాటు దేశ ఆర్థిక భద్రతకు ముప్పుగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేసింది. వీటి వల్ల విమాన ప్రయాణికులు, భద్రతా విభాగాలపై ప్రతికూల ప్రభావం చూపిందని, విమానయాన సంస్థలు తమ సాధారణ కార్యకలాపాలు కొనసాగించ లేకపోయాయని తెలిపింది. ఐటీ నిబంధనల మేరకు ఇటువంటి తప్పుడు సమాచారంపై ఓ కన్నేసి ఉంచాలని, కనిపించిన వెంటనే తొలగించడం లేదా నిలిపివేయాలని కోరింది. భారత సార్వ¿ౌమత్వం, భద్రత, సమగ్రత, ఐక్యతలకు భంగం కలిగించే చర్యలపై ప్రభుత్వానికి సమాచారం అందించడం తప్పనిసరని స్పష్టం చేసింది. ఆయా మాధ్యమ వ్యవస్థలు తమ నియంత్రణ లేదా ఆ«దీనంలో సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా లేదా 72 గంటల్లోగా అందించడంతోపాటు సంబంధిత దర్యాప్తు సంస్థలకు విచారణలో సహకరించాల్సి ఉంటుందని గుర్తు చేసింది. ఏ యూజర్ అయినా చట్ట విరుద్ధమైన లేదా తప్పుడు సమాచారం ప్రచురణ, ప్రసారం, ప్రదర్శించడం, అప్లోడ్, స్టోర్, అప్డేట్, షేర్ వంటివాటిని అడ్డుకునేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సామాజిక మాధ్యమ వేదికలదేనని పేర్కొంది. ఉల్లంఘించిన వారిపై ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహిత–2023 ప్రకారం చర్యలుంటాయని తెలిపింది. విషయ తీవ్రత దృష్యా్ట ఈ అడ్వైజరీ జారీ చేస్తున్నట్లు ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ తెలిపింది. విమానయాన సంస్థలకు అందుతున్న ఉత్తుత్తి బెదిరింపులకు సంబంధించిన సమాచారాన్ని అందజేయాలంటూ రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం మెటా, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమ వేదికలను కోరడం తెలిసిందే. -
ఈసారి 95 విమానాలకు బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థలకు చెందిన దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. గురువారం మొత్తం 95 విమానాల సర్వీసుల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు వచ్చాయి. ఇవన్నీ వట్టివేనని తేలింది. ఇందులో ఆకాశ ఎయిర్‌కు చెందిన 25, ఎయిరిండియా, ఇండిగో, విస్తారలకు చెందిన 20 చొప్పున, స్పైస్ జెట్, అలయెన్స్ ఎయిర్‌లకు చెందిన ఐదేసి విమానాలు ఉన్నాయి. దీంతో గడిచిన 11 రోజుల్లో 250కు పైగా సర్వీసులకు బెదిరింపులు అందినట్లయింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఆగంతకులు చేసిన హెచ్చరికలతో అధికార యంత్రాంగం, రక్షణ బలగాలు, విమా నాశ్రయాల సిబ్బందితోపాటు ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు, అసౌకర్యానికి లోనయ్యారు. విమానయాన సంస్థలకు ఆర్థికంగా నష్టం వాటిల్లింది. ఇండిగోకు చెందిన హైదరాబాద్– గోవా, కోల్‌కతా–హైదరాబాద్, కోల్‌కతా–బెంగళూరు, బెంగళూరు–కోల్‌కతా, ఢిల్లీ–ఇస్తాంబుల్, ముంబై–ఇస్తాంబుల్, బెంగళూరు– ఝర్సుగూడ, హైదరాబాద్–బగ్దోరా, కోచి– హైదరాబాద్ తదితర సర్వీసులున్నాయి. బుధవారం మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఉన్న దుమ్నా విమానాశ్రయాన్ని పేల్చి వేస్తానంటూ ఆ ఆగంతకుడు ఫోన్లో చేసిన బెదిరింపు వట్టిదేనని తేలింది.మెటా, ఎక్స్‌లను సమాచారం కోరిన కేంద్రంవిమానాలకు బాంబు బెదిరింపులు కొనసా గుతుండటాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వీటి వెనుక ఉన్న వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రజా సంక్షేమంతో ముడిపడి ఉన్న అంశం కావడంతో పలు విమానయాన సంస్థలకు పదేపదే అందుతున్న బెదిరింపు హెచ్చరికలకు సంబంధించిన పూర్తి డేటాను అందజేయాలని సామాజిక మాధ్యమ వేదికలైన మెటా, ఎక్స్‌లను కోరింది. -
జెట్ ఎయిర్వేస్: టేకాఫ్‌కు సిద్ధం!
-
జెట్ ఎయిర్వేస్: టేకాఫ్‌కు సిద్ధం!
సాక్షి,ముంబై: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాలా తీసిన ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు మంచిరోజులు రానున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ఎగిరేందుకు మార్గం సుగమమైంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నుంచే దేశీయ విమాన సర్వీసులను పున:ప్రారంభించనుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులు వచ్చే ఏడాది చివరి త్రైమాసికంలో ప్రారంభించనుంది. ఈ విషయాన్ని జలాన్ కల్రాక్ కన్సార్షియం వెల్లడించింది. నిధుల కొరత, మితిమీరిన రుణం భారంతో 2019లో జెట్ ఎయిర్వేస్ తన విమాన సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తదనంతర పరిణామాల నేపథ్యంలో బిడ్డింగ్‌లో జెట్ ఎయిర్వేస్ను దక్కించుకున్న జలాన్ కల్రాక్ కన్సార్షియం దాఖలు చేసిన రుణ పరిష్కార ప్రణాళికకు ఎన్సీఎల్టీ ఈ ఏడాది జూన్‌లో ఆమోదం తెలిపింది. తొలి మూడేళ్లలో 50, వచ్చే ఐదేళ్లలో 100కు పైగా విమాన సేవలను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నామని మురళీ జలాన్ ఇటీవల వెల్లడించారు. ఈ చరిత్రాత్మక ప్రయాణంలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ క్రమంలోనే జెట్ ఎయిర్వేస్ విమానాలు టేకాఫ్‌కు సిద్ధమవుతున్నాయి. చదవండి : Ramya krishna: రమ్యకృష్ణకు హ్యాపీ బర్త్‌డే -
విమాన ప్రయాణికులకు కేంద్రం శుభవార్త
కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో స్తంభించిపోయిన ప్రజల జీవన వ్యవస్థ ఇటీవల కేంద్రం అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా సడలింపులు ఇస్తుండటంతో మళ్లీ సాధారణ స్థితికి అడుగులు వేస్తోంది. దీంతో అన్నిరంగాలు మెల్లమెల్లగా పుంజుకుంటుంన్నాయి. ఈ క్రమంలో ప్రజా రవాణా సైతం మళ్లీ పరుగులు పెడుతోంది. దాదాపు రెండు నెలలు తర్వాత మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటి వరకు పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తుండగా రానురానూ ప్రయాణీకుల సంఖ్య పెరగడంతో విమానాల రాకపోకలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విమాన ప్రయాణికులకు కేంద్రం శుభ వార్త అందించింది. చదవండి: యూఎస్‌కు నాన్‌స్టాప్ ఫ్లైట్స్: విస్తారా కన్ను మే నుంచి నేటి వరకు భారత విమానయాన సంస్థ ప్రీ-కోవిడ్ దేశీయ ప్రయాణీకుల విమానాలలో 70 శాతం నడిపిస్తుండగా. ఇప్పుడు ఆ సంఖ్యను ఈ రోజు(డిసెంబర్3) నుంచి 80 శాతానికి పెంచినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఈ మేరకు మంత్రి ట్వీట్ చేశారు. ‘30 వేల ప్రయాణికులతో మే 25న దేశీయ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అయ్యాయి.. నవంబర్ 30వ తేదీ నాటికి ఆ సంఖ్య 2.52 లక్షల గరిష్టాన్ని తాకింది. ఇప్పుడు.. దేశీయంగా ప్రస్తుతం ఉన్న విమానాలు 70 శాతం నుంచి 80 శాతం వరకు నడుపుకోవచ్చు’. అని ట్వీట్ చేశారు. కాగా కరోనా వైరస్ పరిస్థితుల్లోని డిమాండ్ కారణంగా భారత విమానయాన సంస్థలు తమ ప్రీ-కోవిడ్ దేశీయ ప్రయాణీకుల విమానాలలో 70 శాతం వరకు నడపవచ్చని నవంబర్ 11న మంత్రి తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సంఖ్యను మరింత పెంచడంతో మరిన్ని విమానయాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. Domestic operations recommenced with 30K passengers on 25 May & have now touched a high of 2.52 lakhs on 30 Nov 2020. @MoCA_GoI is now allowing domestic carriers to increase their operations from existing 70% to 80% of pre-COVID approved capacity.@PMOIndia @DGCAIndia — Hardeep Singh Puri (@HardeepSPuri) December 3, 2020 -
రైళ్లు, విమానాల సర్వీసులను ఆపేయండి : మమతా
కోల్‌కతా : భారతదేశంలో కరోనా కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో నమోదవుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దేశంలోనే కోవిడ్ ప్రభావం అధికంగా ఉన్న ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ర్టాల నుంచి దేశీయ విమానాలను నడపకుండా చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రానికి లేఖ రాశారు. ప్రతీరోజూ ఎక్కువ మొత్తంలో విమానాలను అనుమతించడం ద్వారా కరోనా కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని కాబట్టి వారానికి ఒకసారి మాత్రమే ఇతర రాష్ర్టాల నుంచి విమానాల రాకపోకలకు అనుమతించాలని కోరారు.(ఉద్రిక్తతలు సమసేనా..? ) ఇక కోల్‌కతాలో మెట్రో సర్వీసులను తిరిగి ప్రారంభించడంపై అనిశ్చితి నెలకొంది. ఇంతకుముందు మెట్రో, సబర్బన్ సర్వీసులను ఆగస్టు 12 వరకు నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తాజాగా వైద్యులు,పోలీసులు సహ ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్న సిబ్బంది కోసం తిరిగి సేవలను పునః ప్రారంభించే యోచనలో సర్కార్ ఉంది. ఈ నేపథ్యంలోనే వారి రవాణాకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్వరలోనే రైలు సర్వీసులు ప్రారంభమవుతాయని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. దీనికి అనుగుణంగా అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ, హోం శాఖకు కోల్‌కతా మెట్రో అధికారి లేఖ రాశారు. జూలై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం టెలి-మెడిసిన్ సేవలను ప్రారంభించనుందని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. దీని ద్వారా ఆసుపత్రులకి వెళ్లకుండానే వెద్య సహాయం పొందొచ్చని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువవడంతో ప్రతీ ఒక్కరూ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్‌కి వెళ్లకుండా ఫోన్ ద్వారా నేరుగా వైద్యులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. దీంతో ప్రతి జిల్లాకో ప్రత్యేక టెలిఫోన్ సర్వీసు ఏర్పాటుకానుంది. అంతే కాకుండా దాదాపు 30 మిలియన్ ఫేస్ మాస్కులను పాఠశాల విద్యార్థులకు, ఆరోగ్య కార్యకర్తలకు అందివ్వనున్నట్లు మమతా స్పష్టం చేశారు.(ఆ నియామకాలపై కరోనా ప్రభావం తక్కువే..) -
100 విమానాలు; సెంచరీ కొట్టేశారు!
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ సడలింపుల అనంతరం ప్రారంభమైన దేశీయ విమానాల రాకపోకలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ప్రయాణికులు విమాన సేవలను సది్వనియోగం చేసుకుంటున్నారు. మొదట్లో ఒకటి, రెండ్రోజుల పాటు ప్రయాణికులు లేకపోవడంతో పలు నగరాలకు సర్వీసులు రద్దయ్యాయి. మరోవైపు ముంబై, చెన్నై, తదితర నగరాలకు సైతం అక్కడి ప్రభుత్వాలు అనుమతించకపోవడం వల్ల కూడా ఫ్లైట్లు రద్దయ్యాయి. కానీ ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు హైదరాబాద్ నుంచి విమాన సర్వీసులు ఎలాంటి ఆటంకం లేకుండా నడుస్తున్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, పుణే, చెన్నై, కోల్‌కతా, విజయవాడ, వైజాగ్, కడప, త్రివేండ్రం, కొచ్చిన్, బెంగళూరు, భోపాల్, లక్నో.. తదితర 70 నగరాలకు 100 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. (కరోనా: జూలై నెలాఖరుకు పరిస్థితి తీవ్రం) దేశీయ విమాన సర్వీసులను పునరుద్ధరించినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 55 వేల మందికి పైగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించినట్లు అంచనా. మే 25 నుంచి 31 వరకు వారం రోజుల్లోనే సుమారు 28,251 మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేశారు. జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు మరో 28 వేల మందికి పైగా ప్రయాణం చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుమారు 550కి పైగా జాతీయ, అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తాయి. రోజుకు 65 వేల మందికి పైగా ప్రయాణం చేస్తారు. వారిలో 55 వేల మంది దేశీయ ప్రయాణికులే కావడం గమనార్హం. నెమ్మది.. నెమ్మదిగా.. కరోనా వ్యాప్తి దృష్ట్యా మొదట్లో ప్రయాణికులు విమానాల్లో రాకపోకలు సాగించేందుకు వెనుకడుగు వేశారు. ముఖ్యంగా మొదటి మూడ్రోజులు ప్రయాణికులు లేకపోవడంతో పలు విమానాలు రద్దయ్యాయి. కానీ ఆ తర్వాత నెమ్మదిగా సర్వీసులు పెరిగాయి. 2 నెలల లాక్డౌన్ తర్వాత మే 25న మొదటి రోజు 20 విమానాలు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరగా, 19 విమానాలు నగరానికి చేరుకున్నాయి. సుమారు 3 వేల మంది ప్రయాణం చేశారు. హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని విద్యానగర్‌కు బయలుదేరిన మొదటి ట్రూజెట్ విమానంలో కేవలం 12 మంది బయలుదేరటం విశేషం. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచి్చన ఎయిర్ ఏసియా విమానంలో 106 మంది ప్రయాణికులు నగరానికి చేరుకున్నారు. మొదటిరోజు పలు సరీ్వసులు ఆకస్మికంగా రద్దు కావడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. రెండోరోజు 2,500 మంది రాకపోకలు సాగించారు. మూడోరోజు 3,500 మంది ప్రయాణం చేశారు. 41 విమానాలు వివిధ నగరాలకు రాకపోకలు సాగించాయి. ఆ తర్వాత క్రమంగా విమాన సర్వీసుల సంఖ్య పెరిగింది. ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్, ఎయిర్ ఇండియా, ట్రూజెట్, తదితర ఎయిర్‌లైన్స్ సంస్థలు కేంద్ర విమానయాన సంస్థ ఆదేశాలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో విమానాలను నడుపుతున్నాయి. అన్ని మెట్రో నగరాలతో పాటు సూరత్, అహ్మదాబాద్, రాంచీ, బెల్గాం, రాయ్‌పూర్, కొల్హాపూర్, వారణాసి తదితర అన్ని నగరాలకు విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. పటిష్టంగా కోవిడ్ నిబంధనలు ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది, అధికారుల మధ్య భౌతిక దూరం పాటించటంతో పాటు, విమానాల్లోనూ పరిమిత సంఖ్యలోనే ప్రయాణికులను అనుమతిస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు, ప్రయాణికులకు ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్లు అందజేస్తున్నారు. ప్రతిరోజు విమానాశ్రయాన్ని శానిటైజ్ చేయడంతో పాటు వైరస్ నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకున్న వారికి కరోనా నిబంధనలకు అనుగుణంగా 14 రోజుల పాటు ఇంట్లోనే హోంక్వారెంటైన్ పాటించాలని సూచిస్తున్నారు. మరోవైపు ‘ప్యాసింజర్ ఈజ్ ప్రైమ్’సేవల్లో భాగంగా విమానాశ్రయానికి రాకపోకలు సాగించే అన్ని క్యాబ్‌లను కూడా శానిటైజ్ చేస్తున్నారు. డ్రైవర్లకూ థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. -
ఇండిగోలో అత్యధిక కరోనా బాధితులు!
న్యూఢిల్లీ : దేశీయ విమానయాన సేవలు పునః ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే 23 మంది కరోనా బారినపడ్డారు. లాక్డౌన్ కారణంగా అన్ని విమానయాన సర్వీసులు మూసివేసిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా మే 25న అన్ని దేశీయ విమానాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న పలువురు వారి గమ్యస్థానాలకు చేరడానికి తిరుగు పయనమయ్యారు. విమానయాన సేవలు తిరిగి ప్రారంభించిన కేవలం నాలుగు రోజుల్లోనే ఈ స్థాయిలో కేసులు పెరగడంతో తదుపరి చర్యలు ఏం తీసుకుంటారో అన్న దానిపై చర్చ మొదలైంది. (క్వారంటైన్లో 23 లక్షల మంది ) విమానాశ్రయాల్లో పరీక్షల అనంతరం కరోనా సోకినట్లు నిర్థారణ అయిన ప్రయాణికులను వెంటనే క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. అంతేకాకుండా వారితో ప్రయాణించిన మిగతా ప్రయాణికులు, సిబ్బందిని కూడా ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్‌లో ఉంచారు. లాక్డౌన్ 4.0లో భారీ సడలింపులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. దీనిలో భాగంగానే దీశీయ విమాన కార్యకలాపాలు సాగించడానికి అనుమతిచ్చింది. దీంతో దాదాపు రెండు నెలల అనంతరం దేశీయ విమానయాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. భౌతికదూరం పాటించడం, ఫేస్ మాస్క్, శానిటైజేషన్, ప్రయాణికులు రెండు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలి అన్న నిబంధనలు విధిస్తూ విధించింది. అయినప్పటికీ కేవలం నాలుగు రోజుల్లోనే 23 మంది కరోనా బారిన పడ్డారు. ఇంకో ఇంకో ఆందోళనకర విషయం ఏంటంటే..వీరిలో ఎక్కువమంది ఇండిగో విమానంలోనే ప్రయాణించారు. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా పేరున్న ఇండిగోలో అత్యధిక కరోనా బాధితులు ఉండటం గమనార్హం. (హైదరాబాద్ సహా 13 నగరాలపై సమీక్ష ) -
విమానాలు ఎగిరిన తొలిరోజే కరోనా కలకలం!
చెన్నై: విమానయానంపై మల్లగుల్లాలు పడిన అనంతరం దేశీయ విమాన సర్వీసులకి కేంద్రం పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. దీంతో రెండు నెలల తర్వాత విమాన సర్వీసులు నేడు(మంగళవారం) తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే తొలి రోజే ఓ విమానంలోని ప్రయాణికుడికి కరోనా ఉన్నట్లు తేలడం కలకలం రేపుతోంది. తొలి దశలో కొన్ని దేశీయ విమానాలకే అనుమతి లభించింది. అందులో భాగంగా మంగళవారం చెన్నై నుంచి ఇండిగో విమానం కోయంబత్తూరు చేరుకుంది. ఇందులోని ప్రయాణికులందరికీ పరీక్షలు చేయగా ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. (విమానాలకు లైన్ క్లియర్) వెంటనే అధికారులు అతడిని స్థానిక వినాయక ఆసుపత్రిలోని క్వారంటైన్ కేంద్రంలో చేర్పించారు. అనంతరం అక్కడి నుంచి ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ నెల 25వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి విమానాల రాకపోకలకు మార్గం సుగమమైంది. అయితే ప్రయాణికుల విషయంలో నిర్ధిష్టమైన మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో విమాన సర్వీసులు తొలి రోజు పూర్తి స్థాయిలో ప్రారంభం కాని విషయం తెలిసిందే. (ప్రారంభమైన విమాన సర్వీసులు) -
ఏపీలో ప్రారంభమైన విమాన సర్వీసులు
-
ఏపీలో ప్రారంభమైన దేశీయ విమాన సర్వీసులు
సాక్షి, విజయవాడ/విశాఖపట్నం : రెండు నెలల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం ఉదయం నుంచి దేశీయ విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. గన్నవరం, విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ల నుంచి రాకపోకలు ప్రారంభం కావడంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరకుంటున్నారు. ఎయిర్‌పోర్ట్‌లకు చేరకున్న ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ చేసిన తర్వాత అధికారులు లోనికి అనుమతిస్తున్నారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. సిబ్బంది కూడా ప్రత్యేక రక్షణ దుస్తులు ధరించి విధులకు హాజరయ్యారు. గన్నవరం నుంచి బెంగళూరు, ఢిల్లీ, చెన్నైలకు, విశాఖ నుంచి బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌లకు మధ్య విమాన సర్వీసులు నడవనున్నాయి. (చదవండి : 630 విమానాలు రద్దు) ఇప్పటికే బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు ఒక విమానం చేరకుంది. ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రయాణికులకు అధికారులు ప్రత్యేక బస్సుల్లో తరలిస్తున్నారు. ప్రయాణికులు రెండు గంటల ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని గన్నవరం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ మధుసూదన్‌రావు సూచించారు. మరోవైపు ఇండిగో విమానంలో బెంగళూరు నుంచి విశాఖకు 114 మంది ప్రయాణికులు చేరుకున్నారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక కేంద్రాలకు తీసుకెళ్లి స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. స్వాబ్ కలెక్షన్ తర్వాత వారిని హోం క్వారంటైన్‌కు తరలించనున్నారు. కాగా, దేశంలోని పలు ఎయిర్‌పోర్ట్‌లలో సోమవారం నుంచే దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
విమానాలకు లైన్ క్లియర్
విశాఖపట్నం: దేశీయ విమాన సర్వీసులకు లైన్‌క్లియర్ అయింది. తొలి దశలో మంగళవారం నుంచి నాలుగు డొమెస్టిక్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. రెండు నెలల తరువాత ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూర్ల నుంచి విమానాలు విశాఖ విమానాశ్రయానికి వస్తున్నాయి. కరోనా మహమ్మారి నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం మార్చి 23వ తేదీ నుంచి ఇప్పటి వరకు నాలుగు దఫాలుగా లాక్ డౌన్‌ను అమలు చేస్తూ వస్తోంది. అదే నెల 25వ తేదీ నుంచి అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసులను సైతం నిలిపివేసింది. కేవలం కార్గో విమానాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. తాజాగా లాక్డౌన్ 4.0లో కేంద్రం కొన్ని సడలింపులతో ఈ నెల 25వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి విమానాల రాకపోకలకు మార్గం సుగమమైంది. అయితే ప్రయాణికుల విషయంలో నిర్ధిష్టమైన మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో విమాన సర్వీసులు తొలి రోజు ప్రారంభం కాలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుల సౌకర్యంతో పాటు వారి భద్రతను దృష్టిలో పెట్టుకొని కొన్ని మార్గదర్శకాలతో దేశీయ విమాన సర్వీసులకు అనుమతులిచ్చింది. దీంతో మంగళవారం నుంచి విశాఖ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. అధికారుల సుదీర్ఘ సమావేశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం విశాఖ నుంచి విమాన సర్వీసుల ప్రారంభానికి అన్ని శాఖల అధికారులు సోమవారం సమావేశమయ్యారు. నావికాదళం, రెవెన్యూ, పోలీసు, ఇమిగ్రేషన్, ఎయిర్‌టైన్ మేనేజర్లు, ఎయిర్పోర్ట్ అథారిటీ సీనియర్ ఆఫీసర్లు, విమానాశ్రయం డైరెక్టర్, జిల్లా వైద్య, పోలీస్.. ఇలా అన్ని శాఖల అధికారులు విమానాశ్రయంలో సాంకేతికపరమైన అంశాల అమలుతో పాటు ప్రయాణికుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. నాలుగు విమానాలకే అనుమతి తొలి దశలో నాలుగు దేశీయ విమానాలకే అనుమతులు లభించింది. మంగళవారం ఉదయం 6.55 గంటలకు బెంగళూరు నుంచి ఇండిగో విమానం, సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ నుంచి ఇండిగో విమానంతో పాటు రాత్రి 9 గంటలకు బెంగుళూరు నుంచి ఎయిర్ ఏషియా విమానాలు విశాఖ విమానాశ్రయానికి రానున్నాయి. ఉదయం 11.50 గంటలకు హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం రానుంది. ఎయిర్‌పోర్ట్‌లో సాంకేతికాంశాలతో పాటు, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని దశల వారీగా ఈ సర్వీసులను పెంచేందుకు విమానయాన అధికారులు చర్యలు చేపడుతున్నారు. వారికి ఇన్స్టిట్యూషన్ క్వారైంటన్ తప్పనిసరి దేశంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చిన విమాన ప్రయాణికులందరినీ తప్పనిసరిగా క్వారంటైన్ కేంద్రాలకు తరలించనున్నారు. ప్రధానంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా వారం రోజుల పాటు క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాల్సి ఉంటుంది. మంగళవారం రాత్రికి ఢిల్లీ నుంచి వచ్చే విమాన ప్రయాణికులు ఇన్స్టిట్యూషన్ క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలకు గానీ, ప్రైవేట్ హోటళ్లలో గానీ వారి కోరిక మేరకు తరలించి.. ఆరోగ్య పరిస్థితిని వైద్యాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. వారం రోజుల తరువాత వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. అందులో నెగిటివ్‌గా వచ్చిన వారిని ఇళ్లకు పంపించనున్నారు. ఒకవేళ పాజిటివ్‌గా నిర్ధారణైతే వారిని కోవిడ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించనున్నారు. స్వాబ్ పరీక్షల తర్వాతే బయటకు.. బెంగళూరు నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు కరోనా నిర్ధారణ కోసం స్వాబ్ తీసుకొని ఆ తర్వాతే ఇళ్లకు పంపించనున్నారు. ప్రయాణికులందరికీ ప్రాథమిక పరీక్షలు విశాఖ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులందరికీ వైద్యాధికారులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించనున్నారు. ముందుగా వారికి థర్మల్ స్క్రీనింగ్ ద్వారా ఉష్ణోగ్రతలు పరీక్షించనున్నారు. అలాగే బ్యాగేజీల నుంచి బోర్డింగ్ పాస్‌లు.. తనిఖీలు ఇలా ప్రతీ చోటా భౌతికంగా కాకుండా సాంకేతికంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. తొలి దశలో రెండు విమానాలకే అనుమతులు లభించినప్పటికీ.. సాంకేతికంగా ఎటువంటి ఇబ్బందులు లేకపోతే త్వరలోనే దశల వారీగా సర్వీసులు పెంచనున్నారు. – రాజ్‌కిశోర్, విశాఖ విమానాశ్రయం డైరెక్టర్ -
వారికి క్వారంటైన్ లేదు: సోమేశ్ కుమార్
సాక్షి, తెలంగాణ: కేంద్ర పౌరవిమానయాన మార్గదర్శకాల ప్రకారం ఆదివారం అర్ధరాత్రి నుంచి దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాజీవ్‌గాంధీ ఎయిర్ పోర్ట్ నుంచి కూడా డొమెస్టిక్ ఫ్లైట్స్ ప్రారంభమైనట్లు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. సోమవారం రోజున ఎయిర్‌పోర్ట్‌ను సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రయాణికుల ఆరోగ్యంపై పలు జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రయాణికుల్ని టచ్ చేయకుండా సెన్సార్లు కూడా ఏర్పాటు చేశాం. ప్రతి అంశంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రయాణాల్ని సాగించే ప్రతి ప్రయాణికుడి దగ్గర ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి. ఆరోగ్య సేతు యాప్ ఉన్న వాళ్లనే లోపలికి అనుమతిస్తున్నాం. చదవండి: రెడ్ అలర్ట్: ఆ సమయంలో బయటకు రావొద్దు ఇవాళ రాజీవ్‌గాంధీ ఎయిర్ పోర్ట్ నుంచి 19 ఫ్లైట్స్ రావడం మరో 19 ఫ్లైట్స్ వెళ్లడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సెక్యూరిటీ పరంగా, ఆరోగ్య పరంగా ఎయిర్ పోర్ట్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి పరీక్షల అనంతరమే అనుమతిస్తున్నాం. ఎలాంటి కరోనా లక్షణాలు లేని వారికి 14 రోజుల క్వారంటైన్ లేదు. 1600 మంది ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కి వస్తున్నట్లు' సీఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. చదవండి: ఏపీలో మరో 44 కరోనా కేసులు -
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల కష్టాలు..
-
తొలి రోజే ప్రయాణికుల కష్టాలు..
న్యూఢిల్లీ : దాదాపు రెండు నెలల తర్వాత పలు దేశీయ విమాన సర్వీసులు నేటి నుంచి ప్రారంభమయిన సంగతి తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్ట్‌లకు చేరకున్న ప్రయాణికుల్లో కొందరికి నిరాశే మిగిలింది. దేశవ్యాప్తంగా పలు విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్టుగా కేంద్రం ప్రకటించిగానే పలువురు ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లకు క్యూ కట్టారు. అయితే ముందుగా ప్రకటించిన పలు సర్వీసులు రద్దు కావడంతో.. ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లలోనే నిరీక్షిస్తున్నారు. చాలా ప్రయాణికులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సర్వీసులు రద్దు కావడంతో.. గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌తో సహా దేశంలోని పలు ఎయిర్‌పోర్ట్‌లలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు నిలిచిపోయారు. విమాన సర్వీసులు పునరుద్దరించబడ్డ తొలి రోజే ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి 80 సర్వీసులను రద్దు చేసినట్టుగా సమాచారం. మరోవైపు హైదరాబాద్ నుంచి ముంబై, ఛండీగఢ్, విశాఖపట్నం, తిరుపతి, నాందేడ్, బెంగళూరు, కడప, పుణె, త్రివేండ్రం, గోవా, కోయంబత్తూరులకు వెళ్లే విమానాలను రద్దు చేశారు. కాగా, పలు రాష్ట్రాలు పరిమిత సంఖ్యలో మాత్రమే విమాన సర్వీసులకు అనుమతించడం, 14 రోజులపాటు క్వారంటైన్‌కు సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత లేకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు విమాన సర్వీసులు పున: ప్రారంభం కావడంతో ఎయిర్‌పోర్ట్‌ల వద్ద ప్రయాణికులు సందడి నెలకొంది. ఇప్పటికే పలువురు ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. పలు చోట్ల ఎయిర్‌పోర్ట్‌లకు చేరకున్న ప్రయాణికుల చేతుల మీద హోం క్వారంటైన్ ముద్ర వేస్తున్నారు. తెలంగాణ విషయానికి వస్తే.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే బెంగళూరు నుంచి ఎయిర్ ఇండియా విమానం హైదరాబాద్‌కు చేరుకుంది. -
నేటి నుంచి టేకాఫ్..
న్యూఢిల్లీ: నేటి నుంచి దేశీయ విమాన యానం పునఃప్రారంభమవుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్తంగా ప్రకటించిన లాక్డౌన్ కారణంగా గత రెండు నెలలుగా విమాన ప్రయాణాలపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 4.20 గంటలకు ముంబై విమానాశ్రయం నుంచి పట్నాకు తొలి విమానం బయల్దేరనుంది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి కోల్‌కతాకు మరో విమానం ఉదయం 4.30 గంటలకు బయల్దేరుతుంది. ఈ రెండు కూడా ఇండిగో విమాన యాన సంస్థ విమానాలే. అయితే, పలు రాష్ట్రాలు విమానాల పునఃప్రారంభాన్ని వ్యతిరేకిస్తున్నాయి. తమ రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా విస్తృతి తీవ్రంగా ఉందని, ఈ పరిస్థితుల్లో విమాన ప్రయాణాలకు అనుమతించడం సరికాదని మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్ తొలుత వ్యతిరేకించాయి. కాగా, సుమారు 1,050 విమాన సర్వీసుల బుకింగ్స్‌ను విమానయాన సంస్థలు ప్రారంభించాయి. అలాగే, ప్రయాణీకులు, విమాన సిబ్బందికి సంబంధించిన క్వారంటైన్ నిబంధనలు ఒకే తీరులో కాకుండా, వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉండటం పైనా ఉండటంపైనా సందిగ్ధత నెలకొంది. తాము వెళ్తున్న రాష్ట్రాల్లోని క్వారంటైన్ నిబంధనలను ప్రయాణీకులు తెలుసుకోవాలని ఎయిర్ఏసియా ప్రకటించింది. క్వారంటైన్ సంబంధిత ఖర్చులతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో గందరగోళం నెలకొనడంతో పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులతో ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు ఆదివారం పలు దఫాలు చర్చలు జరిపారు. విమానాశ్రయాల్లో కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలపైనా చర్చించారు. దేశవ్యాప్తంగా ఒకే విధమైన క్వారంటైన్ నిబంధనలను ప్రకటించాలని కోరారు. ఏ రాష్ట్రమైనా విమాన ప్రయాణాలను వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకుంటే.. తమ విమానాల షెడ్యూల్స్‌లో మార్పు ఉంటుందని పలు విమాన యాన సంస్థలు వెల్లడించాయి. కరోనా తీవ్రత అధికంగా ఉన్న నగరాలకు వెళ్లడానికి పైలట్లు, ఇతర సిబ్బంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. డ్యూటీ దిగిన తరువాత 14 రోజుల హోం క్వారంటైన్ సిబ్బంది అందరికీ ఉంటుందా? అనే విషయంపైనా స్పష్టత లేదని ఒక పైలట్ వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రానికి వస్తున్న విమాన ప్రయాణీకులకు కర్ణాటక, తమిళనాడు, కేరళ, బిహార్, పంజాబ్, అస్సాం రాష్ట్రాలు ప్రత్యేక క్వారంటైన్ నిబంధనలను ప్రకటించాయి. పలు ఆంక్షలు, మార్గదర్శకాల మధ్య సోమవారం నుంచి పరిమిత సంఖ్యలో దేశీయంగా విమానాలను నడిపేందుకు ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. ముంబై నుంచి 50 విమానాలు మహారాష్ట్రలో కరోనా ఉధృతి అధికంగా ఉం డడంతో ముంబై ఎయిర్‌పోర్టు నుంచి రోజు కు కేవలం 50 విమానాల రాకపోకలకు అను మతి ఇస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, బగ్దో గ్రా ఎయిర్‌పోర్టుల్లో మే 28 నుంచి విమానాల సేవలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణానికి సిద్ధంగా విమానాలు -
‘మా రాష్ట్రంలో వద్దు.. మరోసారి ఆలోచించండి’
చెన్నై : దేశీయ విమానయాన సర్వీసులు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మే 31 వరకు రాష్ట్రంలో విమానయాన సర్వీసులకు అనుమతించరాదంటూ తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం కేంద్రాన్ని కోరింది. భారత్‌లో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా విమానయానానికి అనుమతించరాదంటూ కోరింది. అయితే సోమవారం నుంచి అన్ని దేశీయ విమానయాన సర్వీసులకు అనుమతిచ్చిన నేపథ్యంలో తమిళ సర్కార్ చేసిన విఙ్ఞప్తిపై కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. (విమానయానం.. కొత్త కొత్తగా...) ఈ నెల ప్రారంభంలో విదేశాల్లో చిక్కుకున్న356 మంది భారతీయులను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాల్లో చైన్నై విమానాశ్రయానికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే వారిలో కొంతమంది ప్రయాణికులకు కరోనా నిర్థారణ అయ్యింది. గత కొన్ని రోజులుగా కోయంబేదుకు హోల్‌సేల్ మార్కెట్ నుంచి అనూహ్యంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా రెండవ అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ర్టంగా తమిళనాడు ఉంది. ఈ నేపథ్యంలో విమానాయానానికి అనుమతిస్తే రాష్ర్టంలో మరిన్ని కరోనా కేసులు పెరగడానికి ఆస్కారం ఉందని కేంద్రానికి విన్నవించుకుంది. ఇప్పటివరకు తమిళనాడులో 13,000 కరోనా కేసులు నమోదుకాగా, 95 మంది ప్రాణాలు కోల్పోయారు. (దేశంలో ఒక్కరోజే 6088 కరోనా కేసులు ) -
25న దేశీయ విమాన సర్వీసులు షురూ
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ విమాన సర్వీసులు ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా కట్టడికి మార్చి 25న దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ అనంతరం సుదీర్ఘ విరామం తర్వాత విమానాల రాకపోకలు ప్రారంభమవనున్నాయి. మే 25 సోమవారం నుంచి విమాన సర్వీసుల పునరుద్ధరణకు సిద్ధంగా ఉండాలని అన్ని విమానాశ్రయాలు, ఎయిర్‌లైన్స్‌కు సమాచారం అందించామని పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరి ట్వీట్ చేశారు. ఇక విమాన ప్రయాణీకులకు సంబంధించి నిర్ధేశిత ప్రమాణాలు, మార్గదర్శకాలను పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడిస్తుందని ట్వీట్లో తెలిపారు. విమానాల్లో తక్కువ సీట్లను అమర్చడంతో పాటు మధ్య సీటును ఖాళీగా ఉంచడం ద్వారా ప్రయాణీకులు భౌతిక దూరం పాటించేలా పలు చర్యలు చేపడతారు. చదవండి : విదేశాల నుంచి భారత్‌కు విమానాల రాక -
2 గంటల ముందే ఎయిర్‌పోర్టుకు!
సాక్షి, హైదరాబాద్: డొమెస్టిక్ విమాన సర్వీసులు సోమవారం తర్వాత పరిమిత సంఖ్యలో ప్రారంభమయ్యే అవ కాశాలు కన్పిస్తున్నాయి. ఈ మేరకు విమానాశ్ర యాలకు వచ్చే ప్రయాణికులు పాటించాల్సిన, అధి కారులు చేపట్టాల్సిన చర్యలపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ విభాగమే విమానాశ్రయాల సెక్యూరిటీ బాధ్యతలు పర్యవేక్షి స్తుండటం తెలిసిందే. ‘వందే భారత్’విమానాల రాకపోకల సందర్భంగా పలు విషయాలు గమనిం చిన విమానాశ్రయాల సెక్యూరిటీ విషయంలో పలు మార్పులు చేసినట్లు సీఐఎస్ఎఫ్ ఐజీ సీవీ ఆనంద్ శుక్రవారం తెలిపారు. తొలుత మే 1 నుంచి దేశీయ విమాన సర్వీసుల్ని ప్రారంభించాలని యోచిం చారు. అయితే సోమవారం తర్వాత ఎప్పుడైనా ఇవి మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ముంబై, అహ్మదాబాద్ విమానాశ్రయాలతోపాటు మరి కొన్ని చోట్ల సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఈ వైరస్ బారిన పడ్డారు. అయితే ఇతర విభాగాల అధికారు లకు ఎలాంటి వ్యాప్తి జరగలేదు. దీంతో తనిఖీలు, సోదాలు చేసే విషయంలో పలు మార్పుచేర్పులు చేశారు. ప్రయాణికులను తాకాల్సిన అవసరం లేకుండా, భౌతిక దూరం పాటిస్తూ తనిఖీలు చేసేలా చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు డొమెస్టిక్ ప్యాసింజర్లు బోర్డింగ్ పాస్ తీసుకుంటే 45 నిమిషాలు, లేకుంటే గంట ముందు విమానా శ్రయంలో రిపోర్ట్ చేయాల్సి ఉండేది. అయితే ఇప్పుడు ఈ సమయాన్ని రెండు గంటలకు పెంచారు. ప్రతి ప్రయాణికుడు తన ఫోన్లో కచ్చితంగా ‘ఆరోగ్య సేతు’యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో ప్రతి ప్రయాణికుడు సెల్ప్ డిక్లరేషన్ ఇవ్వాలి. వీలున్నంత వరకు ప్రయాణికులు తమ వెంట ప్రింట్ చేసిన లేదా ఎలక్ట్రానిక్ బోర్డింగ్ పాసులు కలిగి ఉండటం ఉత్తమం. ప్రతి ఒక్క ప్యాసింజర్ కచ్చితంగా ఫేస్‌మాస్క్ ధరించాలి. భౌతిక దూరం తప్పనిసరి డిపార్చర్ గేటు వద్ద క్యూలో నిర్దేశించిన బాక్సులు/సర్కిల్స్‌లో నిల్చుని ఉండాలి. ఈ దూరాన్ని కనిష్టంగా నాలుగు, గరిష్టంగా 6 అడుగులుగా నిర్దేశించారు. విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా హ్యాండ్ శానిటైజర్ కియోస్క్‌లు అందుబాటులోకి తెచ్చారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా వాటి వద్ద చేతులను శానిటైజ్ చేసుకోవాలి. గేటు వద్దకు వెళ్లిన తర్వాత థర్మల్ ్రస్రీనింగ్ చేస్తారు. ఎవరికైనా సాధారణం కంటే ఎక్కవ ఉష్ణోగ్రతలు ఉంటే వారిని క్యూ నుంచి వేరు చేసి, తదుపరి పరీక్షల కోసం హెల్త్ డెస్క్‌కు పంపిస్తారు. పీపీఈ సూట్స్ లేదా ఫేస్‌మాస్క్, షీల్డ్స్‌లో ఉండే సీఐఎస్ఎఫ్ సిబ్బంది సైతం ప్రయాణికుడి సమీపం నుంచి తనిఖీలు చేయరు. ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కెమెరాల వద్ద ప్రయాణికులు తమ టికెట్, గుర్తింపు కార్డులను ప్రదర్శించాలి. వీటిని వెబ్‌క్యామ్ లేదా ట్యాబ్‌ల్లో తనిఖీ చేసిన తర్వాతే ప్రయాణికుడిని పంపుతారు. ప్రయాణికులు తమ వెంట హ్యాండ్ బ్యాగేజ్ తీసుకువెళ్లేందుకు అనుమతి లేదు. లగేజ్‌లో కూడా 20 కేజీల కంటే తక్కువ బరువు ఉండాలి. తమ వెంట గరిష్టంగా 350 ఎంఎల్ శానిటైజర్ బాటిల్ తీసుకెళ్లేందుకు అవకాశం ఇస్తున్నారు. విమానయాన సంస్థలు సైతం ఎయిర్‌పోర్టులో ప్రస్తుతం ఉన్న కౌంటర్లను యథాత«థంగా వినియోగించేందుకు అనుమతి లేదు. బోర్డింగ్ పాసులు, టికెట్లు ఇచ్చే కౌంటర్లు ఒకటి విడిచి మరొకటి పని చేయాల్సి ఉంటుంది. వీలున్నంత వరకు టికెట్ స్కానర్లు, బోర్డింగ్ పాస్ ప్రింటర్లు, బ్యాగ్ ట్యాగ్ ప్రింటర్లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు సేవలు అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విధానంలో ఎక్కడా విమానయాన సంస్థ సిబ్బందితో పని ఉండదు. సిబ్బందికి పీపీఈ కిట్లు.. కౌంటర్ల వద్ద ఉద్యోగులు, ప్రయాణికుడికి మధ్య గ్లాస్లు ఏర్పాటు చేయనున్నారు. కౌంటర్ నుంచి పిలుపు వచ్చే వరకు ప్రయాణికులు బాక్సులు, సర్కిల్స్‌లోనే నిల్చుని ఉండాలి. సెక్యూరిటీ చెక్ జరిగే ప్రదేశంలోనూ బాక్సులు, సర్కిల్స్ గీస్తున్నారు. వీటిలో నిల్చునే ప్రయాణికులు తమంతట తాముగా తమ ఒంటిపై ఉన్న లోహంతో కూడిన వస్తువుల్ని తీసి ట్రేలో పెట్టాల్సి ఉంటుంది. డీఎఫ్‌ఎండీల ద్వారా ప్రయాణికుడు వచ్చినప్పుడు బీప్ శబ్దం వస్తే వ్యక్తిగతంగా తనిఖీ చేయనున్నారు. బోర్డింగ్ కార్డులపై ఎలాంటి స్టాంపింగ్స్ ఉండవు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెచ్డీ సీసీటీవీల ద్వారా వీటిని మానిటర్ చేయనున్నారు. సీఐఎస్ఎఫ్ సిబ్బందికి పీపీఈ కిట్లు, హ్యాండ్ హెల్డ్ మెటర్ డిటెక్టర్లు తప్పనిసరి చేశారు. ఈ తనిఖీలు పూర్తయిన తర్వాత ప్రయాణికుల్ని బోర్డింగ్ గేట్స్ వద్ద ప్రత్యేకంగా మార్కింగ్ చేసిన సీట్లలో కూర్చోబెడతారు. ఈ ప్రాంతాల్లో ఆహార పదార్థాలు ఆర్డర్ చేయడం, డెలివరీ అన్నీ కాంటాక్ట్ లెస్‌గానే జరుగుతుంది. ప్రయాణికుడు విమానం ఎక్కేందుకు విమానం బయల్దేరడానికి 15 నిమిషాల ముందే అనుమతించేవారు. ఇప్పుడు గంట ముందే అనుమతించనున్నారు. ప్రయాణికుల్ని విమానం వరకు తరలించే బస్సుల్ని రోజూ కనీసం రెండు మూడుసార్లు శానిటైజ్ చేయనున్నారు. విమానం లోపల స్వాగతం పలికే ఎయిర్‌హోస్టెస్ పీపీఈ కిట్లు ధరించేలా చూడాలని భావిస్తున్నారు. విమానం లోపల ఆహారం సరఫరా చేయడానికి ముందు శానిటైజర్ ఇవ్వనున్నారు. విమాన ప్రయాణం పూర్తయ్యే వరకు మాస్క్ ధరించే ఉండాలి. విమాన సర్వీసులు ప్రారంభమయ్యే లోపు మరికొన్ని మార్పులకు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సీఐఎస్ఎఫ్ పాత్ర కీలకం: సీవీ ఆనంద్, ఎయిర్‌పోర్ట్స్ సెక్టార్ ఐజీ సీఐఎస్ఎఫ్ కరోనా విస్తరణ నేపథ్యంలో విమానయానంలో సీఐఎస్ఎఫ్ పాత్ర అత్యంత కీలకంగా మారనుంది. దీంతో సిబ్బంది, అధికారులు ఇకపై ‘మినిమం టచ్.. మినిమం ఎక్స్పోజర్’విధానంలో విధులు నిర్వర్తించనున్నారు. తనిఖీలు సహా ఏ విషయంలో ప్రయాణికుల్ని నేరుగా తాకాల్సిన అవసరం లేకుండా వీలున్నంత వరకు అత్యాధునిక పరిజ్ఞానంతో పని చేయనున్నారు. ప్రయాణికులు సైతం ఈ విషయంలో తమకు సహకరించాల్సిన అవసరముంది. లాక్డౌన్ నేపథ్యంలో గడిచిన 2 నెలలుగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది శారీరక దృఢత్వం, మానసిక సంసిద్ధతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక తర్ఫీదు పొందారు. – సీవీ ఆనంద్, ఎయిర్‌పోర్ట్స్ సెక్టార్ ఐజీ సీఐఎస్ఎఫ్ -
మే 17 తర్వాత విమాన సర్వీసుల పునరుద్ధరణ!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కారణంగా విమాన సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు వేయడంతో విమానాలకు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వైరస్ కట్టడికి కేంద్రం విధించిన లాక్డౌన్ మే 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మే 17 తర్వాత విమాన సర్వీసులను పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తోంది. విమానాలు నడిపేందుకు సివిల్ ఏవియేషన్ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పరిశీలించారు. కరోనా వైరస్ పూర్తిగా అదుపులోకి రానందున నాలుగో వంతు విమానాలు నడిపే అవకాశం కనిపిస్తోంది. రెండు గంటల కంటే తక్కువ ప్రయాణ సమయం ఉన్న విమానాల్లో తినుబండారాల సరఫరా అనుమతి ఇవ్వకూడదని కేంద్ర విమానయాన శాఖ నిర్ణయించినట్లు సమాచారం. అలాగే ప్రయాణికులు, ముఖాలకు మాస్క్‌తో పాటు ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని పలు మార్గదర్శకాలను సైతం రూపొందిస్తోంది. (24 గంటల్లో 4,213 పాజిటివ్ కేసులు) విమాన ప్రయాణానికి సంబంధిన మార్గదర్శకాలపై కేంద్రం అధికారిక ప్రకటనను త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. అయితే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటంతో కేవలం గ్రీన్, ఆరెంజ్ జోన్లకే అనుమతులు ఇస్తారా లేక మొత్తంగా అనుమతి మంజూరు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి స్వస్ధలాలకు చేర్చేందుకు ప్రభుత్వం పరిమితంగా అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించింది. 64 ప్రత్యేక విమానాల్లో భారతీయులను వెనక్కి తీసుకొస్తున్నారు. అదే క్రమంలో దేశీయ సర్వీసులను కూడా పలు జాగ్రత్తలు తీసుకుని నడిపేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. (54 రోజులుగా ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కడే! ) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1391284009.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
విమానాల్లో ఇక దూరం దూరం
సాక్షి,హైదరాబాద్: లాక్డౌన్ అనంతరం హైదరాబాద్ నుంచి ప్రధాన నగరాలకు మాత్రమే డొమెస్టిక్ విమానాలు పరిమితంగా రాకపోకలు సాగించనున్నాయి. వాటిలోనూ అతి తక్కువమంది ప్రయాణికులను అనుమతిస్తారు. ప్రయాణికుల మధ్య భౌతిక దూరం తప్పనిసరి చేసేలా చర్యలు తీసుకుంటారు. గమ్యస్థానం చేరేవరకు ప్రయాణికులు విధిగా మాస్కులను ధరించవలసి ఉంటుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా హైదరాబాద్ నుంచి కొన్ని మహానగరాలకు మాత్రమే పరిమిత సంఖ్యలో డొమెస్టిక్ విమానాలను నడిపేందుకు పలు ఎయిర్‌లైన్స్ సన్నద్ధమవుతున్నాయి. ఈ నెల 17తో మూడో దశ లాక్ డౌన్ ముగియనుంది. దీంతో 18 నుంచి పలు రాజధాని నగరాలకు మాత్రమే విమానాలను నడుపనున్నారు. ఎయిర్‌పోర్టులోని ఈ సీట్లలో కూర్చోవద్దని సూచిస్తూ స్టి్టక్కర్లు అతికించిన దృశ్యం హైదరాబాద్ నుంచి మొదటి దశలో ఢిల్లీ, బెంగళూర్, చెన్నై, ముంబయి వంటి ముఖ్యమైన నగరాలకు విమానాలు అందుబాటులోకి రానున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ విమానాలను సైతం కేవలం 33% ఆక్యుపెన్సీతో నడుపుతారు. ఇక లాక్డౌన్ అనంతర సేవలకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా సిద్ధమైంది. సాధారణ రోజుల్లో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి సుమారు 60 వేల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. 450కి పైగా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసులు రాకపోకలు సాగిస్తాయి. ఈ నెల 18 నుంచి డొమెస్టిక్ సర్వీసులకు మాత్రమే అనుమతి లభించనుంది. కానీ అత్యవసర ప్రయాణికులు మాత్రమే రాకపోకలు సాగిస్తారు. జూన్ నుంచి దశలవారీగా జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను విస్తరించే అవకాశం ఉంది. దశలవారీగా విస్తరణ...: లాక్డౌన్ తరువాత ఈ నెల 18 నుంచి విమానాలను నడిపేందుకు కొన్ని ఎయిర్‌లైన్స్ సిద్ధంగా ఉన్నప్పటికీ ఇంకా బుకింగ్‌లను మాత్రం ప్రారం భించలేదు. మరో వారం, పది రోజుల తరువాత ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా బుకింగ్‌లను తెరిచే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి ఇండిగో, స్పైస్‌జెట్, గో ఎయిర్ తదితర సంస్థలు పెద్ద ఎత్తున సర్వీసులను అందజేస్తున్నాయి. ఎయిర్ ఇండియా మాత్రం జూన్‌లోనే సేవలను ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. లగేజీ చెకిన్ పాయింట్ వద్ద శానిటైజేషన్ చేస్తున్న మహిళ లాక్డౌన్ అనంతరం ప్రయాణం ఇలా లాక్డౌన్ అనంతర సేవల కోసం విమానాశ్రయాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు. ప్రయాణికులు, ఎయిర్‌పోర్టు సిబ్బంది భౌతిక దూరాన్ని పాటించేవిధంగా అన్ని చోట్ల మార్కింగ్ చేశారు. ఈ మేరకు సిటీ సైడ్, చెకిన్ హాల్స్, సెక్యూరిటీ చెక్, బోర్డింగ్ గేట్స్, తదితర ప్రాంతాల్లో క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కుర్చీల మధ్య ఖాళీ స్థలం వదిలారు. ఈ మేరకు స్టిక్కర్లను సైతం అతికించారు. ఎయిర్‌పోర్టులోని 7 అంతస్తుల్లో శానిటైజేషన్, ఫ్యూమిగేషన్ చేశారు. టెర్మినల్‌లో పనిచేసే సిబ్బంది, ప్రయాణికుల కోసం పలు చోట్ల సెన్సర్ ఆధారిత ఆటోమేటిక్ హ్యాండ్ శానిటైజర్ డిస్పెన్సింగ్ మెషీన్లను ఏర్పాటు చేశారు. అన్ని చెకిన్ కౌంటర్ల వద్ద బోర్డింగ్ కార్డు,బ్యాగ్ ట్యాగ్ డిస్పెన్సర్లు సరాసరి ప్రయాణికులకే అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు. ఫుడ్ కోర్టులు, ఔట్ లెట్లు, లాంజ్‌లు, రిటైల్ షాపుల వద్ద కూడా భౌతిక దూరం తప్పనిసరి. మొబైల్ వ్యాలెట్లతో జరిపే కొనుగోళ్లనే ప్రోత్సహిస్తారు. ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరిని థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. -
దేశీయ విమాన సర్వీసులపై కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం వారం రోజుల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా అన్ని దేశీయ విమాన సర్వీసులను మంగళవారం(మార్చి24) అర్ధరాత్రి నుంచి రద్దు చేస్తు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విమానయాన శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే విమానయాన సంస్థలు మంగళవారం రాత్రి 11.59 గంటలకు ముందే తమ సర్వీసులు గమ్యస్థానాలకు చేరేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అయితే కార్గో విమాన సర్వీసులపై ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపింది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా రైళ్లను రద్దు చేయడంతోపాటు, అంతరాష్ట్ర రవాణాను రద్దు చేసింది. అలాగే దేశంలోని దాదాపు 80 జిల్లాలో లాక్డౌన్ ప్రకటించింది. పలు రాష్ట్రాలు కూడా కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ ప్రకటించాయి. ఇప్పటివరకు దేశంలో 415 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. చదవండి : కరోనానుంచి కోలుకున్న హీరోయిన్ లాక్డౌన్ : రోడ్లపైకి జనం.. కలెక్టర్ ఆగ్రహం -
ఒకేరోజు ఇద్దరు స్మగ్లర్ల పట్టివేత
సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి అంతర్జాతీయ సర్వీసుగా వచ్చి దేశంలోకి ప్రవేశించిన తరవాత దేశవాళీ సర్వీసులుగా మారే విమానాలు కేంద్రంగా సాగుతున్న బంగారం అక్రమ రవాణా వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు గురువారం ఇద్దరు స్మగ్లర్లను పట్టుకుని కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ నిఘాకు చిక్కకుండా స్మగ్లర్లు అనుసరిస్తున్న ఈ విధానంపై కొంతకాలంగా కన్నేసిన అధికారులు వరుసగా అడ్డుకట్ట వేయగలుగుతున్నారు. జెడ్డా నుంచి త్రివేండ్రం మీదుగా హైదరాబాద్‌కు వచ్చిన కేరళవాసి అర కిలో బంగారాన్ని ‘రెక్టమ్ కన్సీల్మెంట్’పంథాలో తీసుకువస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. అలాగే, బహ్రెయిన్ నుంచి వచ్చిన ఉత్తరప్రదేశ్‌వాసిని పట్టుకున్న అధికారులు మరో 460 గ్రాముల పసిడిని స్వాధీనం చేసుకున్నారు. ఒకే రోజు ఇద్దరు స్మగ్లర్లు చిక్కడం గమనార్హం. అంతర్జాతీయంగా నడిచే విమానాలపై కస్టమ్స్ తనిఖీలు ముమ్మరం చేయడంతో స్మగ్లర్లు పంథా మార్చుకున్నారు. దుబాయ్, మస్కట్, సౌదీ అరేబియా తదితర దేశాల నుంచి భారత్‌లోకి ప్రవేశించే వరకు అంతర్జాతీయ సర్వీసుగా, ఆపై డొమెస్టిక్‌గా మారిపోయే విమానాలను ఎంచుకుని వాటి ద్వారా రవాణా ప్రారంభించారు. స్మగ్లింగ్ ముఠాసభ్యులు ఆ విమానం ప్రారంభమయ్యే ప్రాంతంతోపాటు దేశవాళీ సర్వీసుగా మారే ప్రాంతంలోనూ ముందే ప్రయాణికుల రూపంలో కాచుకుని ఉంటారు. సాంకేతిక పరిభాషలో వీరిని క్యారియర్లుగా పేర్కొంటారు. వీరు చిక్కినా లింకు ముందుకు సాగడం కష్టం. ఆయా దేశాల్లో ఆదాయపుపన్ను లేకపోవడంతో మనీలాండరింగ్ సమస్య ఉత్పన్నం కాదు. ఇక్కడ నుంచి హవాలా ద్వారా నల్లధనాన్ని పంపి, బంగారం కొని తీసుకువస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కేరళవాసి ప్రయాణించిన విమానం అక్కడి నుంచి కేరళలోని త్రివేండ్రానికి అంతర్జాతీయ సర్వీసుగా నడుస్తుంది. ఆపై డొమెస్టిక్ సర్వీసుగా మారిపోయి హైదరాబాద్‌కు వస్తుంది. ఈ నేపథ్యంలోనే స్మగ్లర్లు దీనిని ఎంచుకున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. అత్యధికశాతం స్మగ్లర్లు బం గారాన్ని బ్యాగుల అడుగుభాగంలో ఉండే తొడుగు లు, లోదుస్తులు, రహస్యజేబులు, బూట్ల సోల్, కార్ట న్ బాక్సులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పౌడర్ డబ్బాలతోపాటు మొబైల్ చార్జర్స్‌లోనూ దాచి తీసుకువచ్చేవారు. బ్యాగుల జిప్పులు, బెల్టుల రూపం లోకి బంగారాన్ని మార్చి పైన తాపడం పూసి తీసుకువచ్చేవారు. తాజాగా రెక్టమ్ కన్సీల్మెంట్ జోరు గా సాగుతోందని కేరళవాసి ఉదంతం బయటపెట్టింది. స్మగ్లర్లు పట్టుబడింది ఇలా... సుదీర్ఘకాలం తమ వద్ద పని చేసే క్యారియర్లకు ముంబై, కేరళల్లో ప్రత్యేక శస్త్రచికిత్సలు చేయించడం ద్వారా వారి మలద్వారాన్ని అవసరమైన మేర వెడల్పు(రెక్టమ్ కన్సీల్మెంట్) చేయిస్తున్నారు. ఇందులో గరిష్టంగా రెండు కిలోల వరకు బంగారాన్ని చిన్న బిస్కెట్ల రూపంలో పెట్టేలా ఏర్పాటు చేస్తున్నారు. బంగారానికి నల్ల కార్బన్ పేపర్ చుట్టడం ద్వారా స్కానర్‌కు చిక్కకుండా మలద్వారంలో పెట్టుకుంటున్న క్యారియర్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని తాజా ఉదంతం స్పష్టం చేసింది. ఈవిధంగా కేరళవాసి రెక్టమ్ కన్‌సీల్‌మెంట్‌లో అర కిలో బంగారం పెట్టుకుని వచ్చి పట్టుబడ్డాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే బహ్రెయిన్ నుంచి వచ్చిన ఉత్తరప్రదేశ్ వాసి 460 గ్రాముల బంగారా న్ని బ్యాగ్ అడుగుభాగంలో దాచి తీసుకువస్తూ పట్టుబడ్డాడు. హైదరాబాద్‌లో ఎవరికి చేరవేయడానికి వచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
అదనపు బ్యాగేజీపై ఇక ఛార్జీల బాదుడే
న్యూఢిల్లీ : దేశీయ విమానాల్లో 15 కేజీల కంటే అదనంగా చెక్-ఇన్ బ్యాగేజీ తీసుకెళ్తున్నారా? అయితే ఇక మీకు ఛార్జీల మోత మోగినట్టేనట. ప్రైవేట్ విమానయాన సంస్థలు ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్‌లు అదనపు బ్యాగేజీల ప్రీ-బుకింగ్ ఛార్జీలను, ఎయిర్‌పోర్ట్‌ల వద్ద చెల్లించే అదనపు చెక్-ఇన్ బ్యాగేజీల ఛార్జీలను పెంచేశాయి. ఎయిర్‌పోర్టుల వద్ద 15 కేజీలకు మించి అదనపు బ్యాగేజీని తీసుకెళ్లాల్సి వస్తుందని తెలిపితే, ఒక్కో కిలోకు ప్రస్తుతం 400 రూపాలను ఛార్జ్ చేస్తున్నాయి విమానయాన సంస్థలు. ఇండిగో అదనపు బ్యాగేజీ ఛార్జీలను మూడో వంతు లేదా 33 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రీ-బుకింగ్ చేసుకునేటప్పుడు దేశీయ ప్రయాణికులు ఉచితంగా అందించే 15 కేజీలను మించి మరో 5, 10, 15, 30 కేజీలను తీసుకెళ్తున్నట్టు నమోదు చేస్తే, ఇక నుంచి రూ.1900, రూ.3800, రూ.5700, రూ.11,400ను చెల్లించాల్సి ఉంటుంది. గత ఆగస్టులోనే ఇండిగో ఈ ఛార్జీలను పెంచింది. తాజాగా మరోసారి కూడా వీటిని పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. ఇక స్పైస్‌జెట్ సైతం 5, 10, 15, 20, 30 కేజీల అదనపు బ్యాగేజీకి విధించే ప్రీబుక్ ఛార్జీలను రూ.1600, రూ.3200, రూ.4800, రూ.6400, రూ.9600కు పెంచుతున్నట్టు తెలిపింది. ఎవరైతే ప్రీబుక్ చేసుకోరో వారు అదనపు చెక్-ఇన్ బ్యాగేజీకి ఒక్కో కిలోకు 400 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. గోఎయిర్ అదనపు బ్యాగేజీ ఛార్జీలు అచ్చం ఇండిగో మాదిరిగానే ఉన్నాయి. ప్రభుత్వం రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా మాత్రమే 25 కేజీల వరకు చెక్-ఇన్ బ్యాగేజీని ఉచితంగా అనుమతి ఇస్తోంది. గతేడాది ఆగస్టు వరకు ఎయిర్‌లైన్స్ అన్నీ 15 కేజీలకు మించి.. తొలి ఐదు కిలోల అదనపు బ్యాగేజీకి కేవలం 500 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేసేవి. డీజీసీఏ ఆదేశాల ప్రకారం ఎయిర్‌లైన్స్ నడుచుకునేవి. కానీ డీజీసీఏ ఆదేశాలను కోర్టులో సవాల్ చేసిన ఎయిర్‌లైన్స్, 15 కేజీలకు మించిన తర్వాత విధించే అదనపు బ్యాగేజీ ఛార్జీలను అవి మాత్రమే నిర్ణయించుకునేలా ఆదేశాలను తెచ్చుకున్నాయి.