చెన్నై: విమానయానంపై మల్లగుల్లాలు పడిన అనంతరం దేశీయ విమాన సర్వీసులకి కేంద్రం పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. దీంతో రెండు నెలల తర్వాత విమాన సర్వీసులు నేడు(మంగళవారం) తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే తొలి రోజే ఓ విమానంలోని ప్రయాణికుడికి కరోనా ఉన్నట్లు తేలడం కలకలం రేపుతోంది. తొలి దశలో కొన్ని దేశీయ విమానాలకే అనుమతి లభించింది. అందులో భాగంగా మంగళవారం చెన్నై నుంచి ఇండిగో విమానం కోయంబత్తూరు చేరుకుంది. ఇందులోని ప్రయాణికులందరికీ పరీక్షలు చేయగా ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. (విమానాలకు లైన్ క్లియర్)
వెంటనే అధికారులు అతడిని స్థానిక వినాయక ఆసుపత్రిలోని క్వారంటైన్ కేంద్రంలో చేర్పించారు. అనంతరం అక్కడి నుంచి ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ నెల 25వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి విమానాల రాకపోకలకు మార్గం సుగమమైంది. అయితే ప్రయాణికుల విషయంలో నిర్ధిష్టమైన మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో విమాన సర్వీసులు తొలి రోజు పూర్తి స్థాయిలో ప్రారంభం కాని విషయం తెలిసిందే. (ప్రారంభమైన విమాన సర్వీసులు)
Comments
Please login to add a commentAdd a comment