మే 17 తర్వాత విమాన సర్వీసుల పునరుద్ధరణ! | May Domestic Flight Services After May 17th | Sakshi
Sakshi News home page

మే 17 తర్వాత విమాన సర్వీసుల పునరుద్ధరణ!

Published Mon, May 11 2020 12:03 PM | Last Updated on Mon, May 11 2020 3:56 PM

May Domestic Flight Services After May 17th - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కారణంగా విమాన సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు వేయడంతో విమానాలకు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వైరస్‌ కట్టడికి కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ మే 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మే 17 తర్వాత విమాన సర్వీసులను పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తోంది. విమానాలు నడిపేందుకు సివిల్ ఏవియేషన్ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పరిశీలించారు. కరోనా వైరస్‌ పూర్తిగా అదుపులోకి రానందున నాలుగో వంతు విమానాలు నడిపే అవకాశం కనిపిస్తోంది. రెండు గంటల కంటే తక్కువ ప్రయాణ సమయం ఉన్న విమానాల్లో తినుబండారాల సరఫరా అనుమతి ఇవ్వకూడదని కేంద్ర విమానయాన శాఖ నిర్ణయించినట్లు సమాచారం. అలాగే ప్రయాణికులు, ముఖాలకు మాస్క్‌తో పాటు ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని పలు మార్గదర్శకాలను సైతం రూపొందిస్తోంది. (24 గంటల్లో 4,213 పాజిటివ్‌ కేసులు)

విమాన ప్రయాణానికి సంబంధిన మార్గదర్శకాలపై కేంద్రం అధికారిక ప్రకటనను త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. అయితే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటంతో కేవలం గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లకే అనుమతులు ఇస్తారా లేక మొత్తంగా అనుమతి మంజూరు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి స్వస్ధలాలకు చేర్చేందుకు ప్రభుత్వం పరిమితంగా అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించింది. 64 ప్రత్యేక విమానాల్లో భారతీయులను వెనక్కి తీసుకొస్తున్నారు. అదే క్రమంలో దేశీయ సర్వీసులను కూడా పలు జాగ్రత్తలు తీసుకుని నడిపేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. (54 రోజులుగా ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కడే! )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement