నిలిచిపోయిన 830 విమానాలు!
నిలిచిపోయిన 830 విమానాలు!
Published Fri, Nov 25 2016 3:19 PM | Last Updated on Sat, Sep 15 2018 8:11 PM
జర్మనీ ఫ్లాగ్షిప్ ఎయిర్లైన్ లుఫ్తాన్స దాదాపు 830 దేశీయ, యూరోపియన్ విమానాలను శుక్రవారం నిలిపివేసింది. దీంతో 1,00,000 మంది ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపింది. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ పైలెట్లు చేస్తున్న సమ్మె కారణంగా విమానాలను నిలిపివేస్తున్నట్టు ఎయిర్లైన్ ప్రకటించింది. పైలెట్లు సమ్మె నేటికి మూడో రోజుకు చేరుకుంది. వారు సమ్మెకు దిగినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 2600 విమానాలను ఆ ఎయిర్లైన్ రద్దుచేసింది. పైలెట్లు చేస్తున్న ఈ సమ్మె శనివారం వరకు పొడిగించనున్నట్టు పైలెట్ల యూనియన్ గురువారం ప్రకటించింది.
2014 ఏప్రిల్ నుంచి లుఫ్తాన్సలో ఈ సమ్మె జరగడం 14వ సారి. ప్రతేడాది 3.66 శాతం వేతనాలను పెంచాలని అప్పటినుంచి పైలెట్ల యూనియన్ డిమాండ్ చేస్తోంది. అయితే మేనేజ్మెంట్ కేవలం 2.5 శాతం మాత్రమే ఆఫర్ చేస్తోంది. ఆస్ట్రేలియన్ ఎయిర్లైన్సు, స్విస్ రెండు కూడా లుఫ్తాన్సలో భాగం. జర్మనీకి వారి సేవలు విస్తరిస్తున్న క్రమంలో పైలెట్లు ఈ సమ్మెకు దిగారు. అయితే గ్రూప్కు చెందిన ఇతర విమానయాన సంస్థలు జర్మన్ వింగ్స్, ఎయిర్ డోలోమిటి, బ్రూసిల్స్ ఎయిర్లైన్సు ఈ సమ్మెకు ప్రభావితం కాలేదు. లుఫ్తాన్సలో జరుగుతున్న ఈ సమ్మెతో రోజుకు ఆ గ్రూప్ 10 మిలియన్ యూరోలు(రూ.72కోట్లు) కోల్పోనుందని టాప్ సెల్లింగ్ డైలీ బిల్డ్ రిపోర్టుచేసింది.
Advertisement
Advertisement