Scrap Business
-
ద్రవిడియన్ వర్సిటీలో స్క్రాప్ దందా!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ప్రతిష్ట మసకబారుతోంది. అక్షర జ్ఞానం అందించాల్సిన యూనివర్సిటీల్లో అవినీతి దందా రాజ్యమేలుతోంది. రాజ్యాంగ వ్యవస్థ నిర్ణయాన్ని తుంగలో తొక్కి వైస్ చాన్సలర్లతో బలవంతపు రాజీనామాలు చేయించడం గొప్పగా భావించిన ‘కూటమి’ పెద్దలు... వర్సిటీల్లో చదువులను గాలికొదిలేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని ద్రవిడియన్ యూనివర్సిటీలో దిగజారిన పరిస్థితులే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం ద్రవిడియన్ యూనివర్సిటీ ‘పైసా వసూల్’కు కేంద్రంగా మారింది. పైసలు ముట్టచెబితే ఏకంగా పీహెచ్‌డీలను పప్పుబెల్లం మాదిరిగా అమ్మేస్తున్న దుస్థితి కనిపిస్తోంది. అంతటితో ఆగకుండా యూనివర్సిటీ ఆస్తులను కూడా ‘స్క్రాప్’ పేరుతో కారుచౌకగా అమ్మేసి అందిన కాడికి దోచేస్తుంటే ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తుండటం గమనార్హం. – సాక్షి, అమరావతిచదువుకునే పుస్తకాలు చెత్తలో పడేసి..!ద్రవిడియన్ యూనివర్సిటీలో అక్రమాల కారణంగా దాదాపు విశ్వసనీయత కోల్పోయింది. ఈ క్రమంలో దూరవిద్య విభాగం సైతం మూతపడింది. అయితే దూర విద్య కోసం ముద్రించిన స్టడీ మెటీరీయల్ వర్సిటీలో ఉండిపోయింది. ఆ పుస్తకాలను కూడా చెత్తలో కలిపేసిన వర్సిటీ పాలకులు... వాటిని తమిళనాడుకు తీసుకువెళ్లి కారుచౌకగా అమ్మేసి సొమ్ము చేసుకున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మార్కెట్లో టన్ను పేపర్లు(చెత్త) ధర రూ.26వేలు పలుకుతోంది. అలాంటిది విద్యార్థులకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్స్‌ను టన్ను రూ.15వేల లోపే తమ అనుయాయులకు కట్టబెట్టినట్టు తెలుస్తోంది. ఐదు లారీల స్టడీ మెటీరియల్ స్క్రాప్ కింద బయటకు వెళితే... యూనివర్సిటీ లెక్కల్లో మాత్రం మూడు లారీల సరుకునే చూపించినట్టు సమాచారం.బినామీల పేరుతో పెద్దల మాయాజాలం!ద్రవిడియన్ వర్సిటీ కీర్తిప్రతిష్టలను, ఆస్తులను కాపాడాల్సిన పెద్దలే దొరికింది దొరికినట్టు దోచేస్తున్నారు. తాజాగా సుమారు పది రోజుల కిందట ఈ యూనివర్సిటీలో పెద్దలు ‘స్క్రాప్’ పేరుతో అవినీతి దందాకు తెరదీశారు. నిబంధనల ప్రకారం విస్తృతంగా ప్రచారం కల్పించిన తర్వాతే వర్సిటీలో పనికిరాని వస్తువులను విక్రయించేందుకు ‘స్క్రాప్’ టెండర్లు పిలవాలి. కానీ, అధికారులు మాత్రం బయటకు తెలియకుండా నామమాత్రంగా ప్రకటన ఇచ్చారు. ఆ తర్వాత యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ విభాగంలో పని చేస్తున్న ఒక ఉద్యోగి, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్న డ్రైవర్లతో ‘స్క్రాప్’ కొనుగోలుకు టెండర్లు వేయించారు. వారిలో కూడా తక్కువ రేటు కోట్ చేసిన వ్యక్తికే టెండర్ కట్టబెట్టారు. వినియోగంలో ఉన్న వస్తువులను, స్వల్పంగా మరమ్మతులు చేస్తే ఉపయోగించుకునే అవకాశం ఉన్న ఎలక్ట్రానిక్ సామగ్రిని అప్పనంగా అమ్మేశారు. దాదాపు రూ.30లక్షల నుంచి రూ.50లక్షలు విలువైన వస్తువులను కేవలం రూ.5లక్షలకు విక్రయించినట్టు సమాచారం. వీటిల్లో మూడు జనరేటర్లు, 300 కంప్యూటర్లు, 25 ఏసీలు, రెండు లారీల్లో డెస్క్‌లు, కుర్చీలు ఉన్నాయి. కంప్యూటర్లు, ఏసీల్లో చాలావరకు పనిచేసేవి ఉన్నట్టు యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఎక్కువ కోట్ చేసిన వ్యక్తికి టెండర్ దక్కకపోవడంతో అసలు ఈ అవినీతి దందా బయటకు పొక్కింది. నాలుగు బ్రాంచ్‌లు పెట్టి ‘పీహెచ్డీ’ వ్యాపారం!ద్రవిడియన్ యూనివర్సిటీలో అక్రమ పీహెచ్‌డీల పరంపర కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే పైసలిస్తే పీహెచ్‌డీల దందా పడగవిప్పింది. ఏడు నెలల్లో సుమారు వందకు పైగా పీహెచ్‌డీలు ప్రదానం చేశారని ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ సైతం ఆందోళన వ్యక్తంచేసింది. వాస్తవానికి యూజీసీ నిబంధనల ప్రకారం డిస్టెన్స్ పీహెచ్‌డీలు చెల్లవు. ఇక్కడ దూరవిద్య కేంద్రం మూతపడింది. అయినా పాత తేదీలతో రోజుకు రెండు, మూడు పీహెచ్‌డీలు అవార్డు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ యూనివర్సిటీ బాస్... దక్షిణ భారతదేశంలో నాలుగు బ్రాంచ్‌లు పెట్టి మరీ పీహెచ్‌డీల వ్యాపారం చేస్తున్నట్టు అధ్యాపకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తిరుమల, చెన్నై, మైసూరు, కోయంబత్తూరు కేంద్రాలుగా ఈ పీహెచ్‌డీల వ్యాపారం, మార్కెటింగ్ చేస్తున్నట్టు సమాచారం. ఒక్కో పీహెచ్డీ ప్రొసీడింగ్స్‌పై సంతకం పెట్టాలంటే సగటున రూ.లక్ష వసూలు చేస్తున్నారని తెలిసింది. పైగా న్యాక్ బృందం పర్యటనలోనూ వీటినే రెగ్యులర్ పీహెచ్‌డీలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని యూనివర్సిటీ పరిస్థితి ఇలా ఉంటే.. మిగిలిన వర్సిటీల పని తీరుపైన ప్రభావం పడుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
చూస్తే చెయ్యెత్తి మొక్కుతారు! (ఫొటోలు)
-
చెత్త సంపాదన రూ.2,364 కోట్లు: ప్రశంసించిన మోదీ
కేంద్ర ప్రభుత్వం 'స్వచ్ఛత' ప్రచారాల ద్వారా స్క్రాప్‌ల (చెత్త) తొలగింపుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే కేవలం మూడేళ్ళలో ప్రభుత్వం ఏకంగా 2,364 కోట్ల రూపాయలను ఆర్జించింది. ఈ విషయాన్ని కేంద్ర సహాయ మంత్రి 'జితేంద్ర సింగ్' సోషల్ మీడియాలో వెల్లడించారు.స్క్రాప్‌ల ద్వారా భారీ మొత్తాన్ని ప్రభుత్వానికి చేకూర్చడానికి సహకరించిన 'డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్' (DPIIT)ను భారత ప్రధాని 'మోదీ' ప్రశంసించారు. జితేంద్ర సింగ్ పోస్ట్‌ను షేర్ చేస్తూ.. ప్రశంసనీయం! సమర్థవంతమైన నిర్వహణ, చురుకైన చర్యపై దృష్టి సారించడం ద్వారా గొప్ప ఫలితాలను సాధించారు. పరిశుభ్రత, ఆర్థిక వివేకం రెండింటినీ ప్రోత్సహిస్తూ.. సమిష్టి ప్రయత్నాలు స్థిరమైన ఫలితాలకు ఎలా దారితీస్తాయో ఇది చూపిస్తుందని మోదీ పేర్కొన్నారు.ఇదీ చదవండి: రతన్ టాటా చేసిన పని నాకింకా గుర్తుంది.. ఆ రోజు: ప్రధాని మోదీస్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ఫిజికల్ ఫైళ్లను తొలగించడం వల్ల 15,847 అడుగుల స్థలం ఖాళీ అయింది. దీని ద్వారా సుమారు రూ. 16,39,452 ఆదాయం లభించింద వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫిజికల్ ఫైల్స్ ప్రతి ఏటా భారీగా పెరగడం వల్ల కార్యాలయాల్లో స్థలం కూడా నిండుతుంది. వీటన్నింటిని తొలగించడం వల్ల ఖాళీ స్థలం ఏర్పడమే కాకుండా.. ప్రభుత్వ ఖజానాకు డబ్బు చేరుతుంది.Commendable! By focussing on efficient management and proactive action, this effort has attained great results. It shows how collective efforts can lead to sustainable results, promoting both cleanliness and economic prudence. https://t.co/E2ullCiSGX— Narendra Modi (@narendramodi) November 10, 2024 -
తుక్కు విక్రయంతో రూ.4.5 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్‌లు (పీఎస్‌బీలు), ఆర్థిక సంస్థలు తుక్కు విక్రయం ద్వారా రూ.4.5 కోట్లు సమకూర్చుకున్నాయి. అక్టోబర్ 2–31 తేదీల మధ్య కేంద్ర ఆర్థిక శాఖ స్వచ్ఛత కార్యక్రమాన్ని (ప్రత్యేక ప్రచారం 4.0) చేపట్టింది.కస్టమర్ అనుకూల చర్యలు, వసతిని మెరుగ్గా వినియోగించుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా మార్చుకోవడం, తుక్కును వదిలించుకోవడం ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, బీమా సంస్థలతోపాటు, నాబార్డ్, సిడ్బీ, ఎగ్జి మ్ బ్యాంక్, ఎన్‌హెచ్‌బీ, ఐఐఎఫ్‌సీఎల్ ఇందులో పాల్గొన్నాయి.వ్యర్థాలను వదిలించుకోవడం ద్వారా 11.79 లక్షల చదరపు అడుగుల వసతి అదనంగా వినియోగంలోకి వచ్చిందని, రూ.4.50 కోట్లు సమకూరాయని కేంద్ర ఆర్థిక సేవల విభాగం ప్రకటించింది. ప్రజల ఫిర్యాదులు, అప్పీళ్లు పరిష్కరించినట్టు, ప్రధానమంత్రి కార్యాలయం, ఎంపీల సూచనలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపింది. -
ఎమ్మెల్యే బొజ్జల నుంచి ప్రాణహాని ఉంది: స్క్రాప్ వ్యాపారి
-
జమ్మూ కశ్మీర్లో పేలుడు.. నలుగురి మృతి
జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో సోమవారం పేలుడు సంభవించింది. సోపోర్ పట్టణంలోని షేర్ కాలనీలో స్క్రాప్ డీలర్ దుకాణంలో జరిగిన ఈ పేలుడు ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను నజీర్ అహ్మద్ నద్రో(40), మహమ్మద్ ఆజర్(25), ఆజిమ్ అష్రఫ్ మిర్(20), ఆదిల్ రషీద్ భట్(23) గా స్థానిక అధికారులు గుర్తించారు.పేలుడుకు గల కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం, పోలీసులు సంఘటానికి స్థలానికి చేరుకొని సహాయక చర్యులు చేపట్టారు. ధాటికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే షాప్ డీలర్, మరికొంతమంది ట్రక్కు నుంచి కొన్ని పదార్థాలను దించుతున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇద్దరు సంఘటనా స్థలంలోనే చనిపోగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు వెల్లడించారు. -
‘తుక్కు’కు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి: సియామ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23న పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వివిధ రంగాలు తమ విజ్ఞప్తుల చిట్టాను ప్రభుత్వం ముందు ఉంచుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింతగా పెరిగేందుకు రాబోయే బడ్జెట్లో తగు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆటోమొబైల్ పరిశ్రమ సమాఖ్య సియామ్ కోరింది. అలాగే, వాహనాలను తుక్కు కింద మార్చే స్క్రాపింగ్ ప్రక్రియకు సంబంధించి అదనంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.ఈ సందర్భంగా సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ మాట్లాడుతూ..‘ఎలక్ట్రిక్ వాహనాల కోసం కేంద్రం ఫేమ్ 3 వంటి పథకాన్ని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నాం. ఇప్పటికే అమలవుతున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) వంటి స్కీములు ఇకపైనా కొనసాగుతాయని ఆశిస్తున్నాం. వాహనాల స్క్రాపేజీ పాలసీ అమల్లో ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం లేనందున, స్క్రాపింగ్ విషయంలో మరిన్ని ప్రోత్సాహకాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు ప్రకటించవచ్చని ఆశిస్తున్నాం. గ్రామీణ ఎకానమీకి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటే ఆటోమోటివ్, ఎఫ్ఎంసీజీ వంటి రంగాలకు మేలు జరుగుతుంది’ అని తెలిపారు.విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ 2 గడువు ముగిసినందున దాని స్థానంలో ఫేమ్ 3ని అమలు చేస్తే పరిశ్రమకు తోడ్పాటు లభిస్తుందనే ఆశలు నెలకొన్నాయి. ద్విచక్ర, త్రిచక్ర ఎలక్ట్రిక్ వాహనాల కోసం కేంద్రం రూ.10,000 కోట్లతో ఈ పథకాన్ని ప్రకటించవచ్చనే అంచనాలు ఉన్నాయి.ఇదీ చదవండి: వేడి టీ పడి ఒళ్లంతా గాయాలు.. రూ.12.5 కోట్ల దావాతరుగుదల ప్రయోజనాలు కల్పించాలి: ఫాడావ్యక్తిగత ట్యాక్స్‌పేయర్లకు వాహనాల తరుగుదలను (డిప్రిసియేషన్) క్లెయిమ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలని ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఫాడా కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. పన్ను చెల్లింపుదార్ల సంఖ్య పెరగడంతో పాటు వాహనాలకు డిమాండ్ పెరిగేందుకు కూడా ఇది తోడ్పడుతుందని ఫాడా ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. మరోవైపు, ఎల్ఎల్పీ (లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్), ప్రొప్రైటరీ, భాగస్వామ్య సంస్థలకు సైతం కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గించాలని కోరారు. -
మహిళా ఎన్ఆర్ఐ ‘చెత్త’ బిజినెస్.. రూ.1000 కోట్లు టార్గెట్
ఉన్నత చదువులు చదువుకుంది. కానీ ఆశించిన ఉద్యోగమేదీ రాలేదు. రిస్క్ చేయాల్సిందే అని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయమే ఆమెను రూ. 800 కోట్ల కంపెనీకి అధిపతిగా మార్చింది. గట్టి కృషి, పట్టుదలతో వ్యాపార వేత్తగా రాణిస్తోంది. ఎంతోమంది మహిళా పారిశ్రామిక వేత్తలకు, పర్యావరణవేత్తలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త, పూనమ్ గుప్తా స్ఫూర్తిదాయక గాథను తెలుసుకుందాం రండి..! ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త పూనమ్ గుప్తా ఢిల్లీలో 1976, ఆగష్టు 17న ఢిల్లీలో పుట్టింది. లేడీ ఇర్విన్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం. ఆ తర్వాత, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్, ఢిల్లీ FORE స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, హాలెండ్లోని మాస్ట్రిక్ట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ మార్కెటింగ్‌లో ఎంబీఏ పట్టాలు పుచ్చుకుంది. 2002లో వివాహం కావడంతో భర్త పునీత్ గుప్తాతో కలిసి స్కాట్లాండ్కు వెళ్లారు. స్కాట్లాండ్లో ఆమెకు ఉద్యోగం దొరక లేదు. అర్హతలున్నప్పటికీ, పదేపదే తిరస్కరణలను ఎదుర్కొంది. సాధారణంగా ఎన్ఆర్ఐలకు ఎదురయ్యే అనుభవమే ఇది. ఇదే సమయంలో అనారోగ్యంతో తల్లి ఆకాల మరణం ఆమెను మరింతషాక్‌కు గురిచేసింది. అయినా ఎక్కడా నిరాశ చెందకుండా విభిన్నంగా ఆలోచించింది. వ్యాపారంవైపు అడుగులు వేసింది. అలా 2003లో స్కాట్లాండ్లోని కిల్మాకోమ్‌లోని కేవలం రూ. లక్ష పెట్టుబడితో పర్యావరణ స్పృహతో, రీసైకిలింగ్ బిజినెస్ పీజీ పేపర్ కంపెనీ లిమిటెడ్‌ను స్థాపించింది. స్క్రాప్ పేపర్‌ను రీసైక్లింగ్ చేయాలనే ఆలోచనతో స్కాటిష్ ప్రభుత్వ అనుమతి తీసుకొని మరీ దీన్ని స్థాపించింది. మొదటి రెండేళ్లు పూనమ్ ఒంటరిగానే పనిచేసింది. రెండేళ్ల తర్వాత, ఒక స్నేహితుడు ఆమెతో పార్ట్ టైమ్ ప్రాతిపదికన చేరాడు. వ్యాపారం విస్తరించడంతో భర్త రూ. 1.5 కోట్ల ప్యాకేజీతో కంపెనీలో చేరడం విశేషం. యూకేలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పేపర్ కంపెనీలలో ఒకటిగా ఉంది. ఈ కంపెనీ ప్రస్తుతం ఏడాదికి 800 కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా యూరప్, అమెరికాలోని కంపెనీల నుంచి చిత్తు కాగితాలను కొనుగోలు చేసి, దాన్నుంచి మంచి నాణ్యమైన కాగితాన్ని కూడా తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతిచేస్తుంది. ఇలా పీజీ పేపర్ ప్రపంచంలోని 53 దేశాల నుండి వస్తువులను దిగుమతి, ఎగుమతులను చేస్తుంది. పీజీ కంపెనీ ఉత్పత్తులను తొలుత ఎగుమతి చేసింది ఇండియాకే. ఇక్కడితో ఆగిపోలేదు. హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్. మెడికల్‌తో సహా ఐటీ రంగంలోకి కూడా ప్రవేశించింది. దాదాపు 350 మంది ఉద్యోగులతో స్కాట్లాండ్ ప్రధాన కార్యాలయం వేదికగా తన సేవల్ని అందిస్తోంది. 7 దేశాలలో ఉన్న అనేక కార్యాలయాలతో 9 కంపెనీలున్నాయి. రానున్న కాలంలో పీజీ పేపర్ ఆదాయం రూ. 1000 కోట్లను అధిగమించాలనేది పూనమ్ గుప్తా టార్గెట్. పీజీ పేపర్ సీఈవో, యూకేలో ఉమెన్స్ ఎంటర్ప్రైజ్ స్కాట్లాండ్ అంబాసిడర్, అత్యంత గుర్తింపు పొందిన పారిశ్రామిక వేత్తలలో ఒకరు, యూకే-ఇండియా సంబంధాలలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది నాయకులలో ఒకరిగా పేరొందారు పూనమ్. స్థానిక, జాతీయ , అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలకు వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తారు. భారత్‌లోని యువతుల విద్యకోసం, మహిళలను సాధికారతకు తప్పకుండా మద్దతు నిస్తున్న గొప్ప దాత కూడా. ఈమెకు ఇద్దరు కుమార్తెలు సాన్వి, అన్య, “వ్యాపారం చేయాలనే ఆలోచన మాత్రమే సరిపోదు; రంగంలోకి దిగాలి. పరిశోధన చేయాలి, ఎక్కడో ఒక చోట మొదలు ప్రారంభించండి లక్ష్యాలకు కట్టుబడి ఉండండి. అలాగే మీ లాభాలను కంపెనీకి తిరిగి ఇవ్వడం మర్చిపోవద్దు’’ - పూనం గుప్తా -
హైదరాబాద్: బోలక్‌పూర్‌లో పేలుడు..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధి బోలక్‌పూర్‌లో స్క్రాప్ గోడౌన్లో పేలుడు సంభవించింది. నార్త్ ఇండియాకు చెందిన కార్మికుడికి తీవ్ర గాయాలు కాగా, గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో పెద్ద శబ్దం వినిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. కెమికల్ బాక్స్‌లను కట్ చేస్తుండగా పేలుడు జరిగింది. హైదరాబాద్: ట్రాన్స్జెండర్ల వేషం వేసుకుని బెగ్గింగ్.. -
కేంద్ర బడ్జెట్ 2023: ఆ వాహనాలకు చెక్.. ఇకనైనా మేల్కోవాల్సిందే!
దేశప్రజలు కోటి ఆశలతో ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రసంగంలో ఆమె స్క్రాపేజ్ వెహికల్ పాలసీపై నొక్కి చెప్పారు. పాత వాహనాల రద్దుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయిస్తుందని తెలిపారు. కేంద్రం క్లీన్-ఎనర్జీ వాహనాలు అమ్మకాలను పెంచే ప్రయత్నంలో భాగంగా 15 సంవత్సరాల కంటే పాత వాహనాలను దశలవారీగా తొలగించాలని లక్ష్యం పెట్టుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యంలోని తొమ్మిది లక్షల వాహనాలను రద్దు చేసే ప్రణాళికలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో వాహనాల తుక్కు కోసం ఈ బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయించారు. గతంలో భారత ప్రభుత్వం ‘వెహికల్ స్క్రాప్ పాలసీ’ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విధానంలో దేశంలోని 15 ఏళ్ల నాటి వాహనాలను చెత్తకుప్పలకు పంపనుంది. ఈ పాలసీ ఏప్రిల్ 1 2023 నుంచి అమలులోకి రానుంది. వీటితో పాటు ప్రస్తుతం ఏ వాహనాలను స్క్రాప్ పాలసీ కిందకి వస్తుందనేని ప్రభుత్వం తన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఇక స్క్రాప్ కోసం పంపిన వాహనాలు రీసైకిల్ చేస్తారు. దీని నుండి మెటల్, రబ్బరు, గాజు మొదలైన అనేక వస్తువులు లభిస్తాయి. వీటిని వాహనాల తయారీలో మళ్లీ వాడుకలోకి వస్తుంది. -
రోడ్లపై ఆ వాహనాలకు నో ఎంట్రీ..కేంద్రం మరో కీలక నిర్ణయం!
ప్రభుత్వ వాహనాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రభుత్వ పాత వెహికల్స్‌ను స్క్రాప్‌గా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన విషయం తెలిందే. ఈ నేపథ్యంలో ఆ వాహనాల్ని రద్దు చేస్తూ..స్క్రాప్‌గా మార్చేలా ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 2023,ఏప్రిల్ 1 నుంచి దేశంలో 15 ఏళ్లు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాహనాలను రద్దు చేయనున్నట్లు ఆ నివేదిక తెలిపింది. రాష్ట్ర కార్పొరేషన్లు, రవాణా శాఖల బస్సులు, ఇతర వాహనాలకు ఈ కొత్త నియమం తప్పనిసరి. రాబోయే ౩౦ రోజుల్లో దీనికి సంబంధించిన సూచనలు, అభ్యంతరాలను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కోరింది. అధికారిక వెబ్సైట్ comments-morth@gov.in కు పంపించాలని కోరింది. స్క్రాప్‌గా మార్చేస్తాం 15 ఏళ్లు పైబడిన భారత ప్రభుత్వ వాహనాలన్నింటినీ స్క్రాప్ (చెత్త) గా మారుస్తామని, దీనికి సంబంధించిన విధి, విధానాల్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపినట్లు అగ్రికల్చర్ కార్యక్రమం 'ఆగ్రో విజన్' ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఓల్డ్ గవర్నమెంట్ వెహికల్స్‌ను రద్దు చేస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అధికారిక ఫైల్లో సంతకం చేశామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అన్ని రాష్ట్రాలకు పంపాను. ఆయా ప్రభుత్వాలు రాష్ట్ర స్థాయిలో వెహికల్ స్క్రాపేజ్ పాలసీని అమలు చేయాలని కోరారు. వెహికిల్ స్క్రాపేజ్ పాలసీ 2021లో వెహికిల్ స్క్రాపేజ్ పాలసీని కేంద్రం ప్రవేశ పెట్టింది. ఈ పాలసీ ద్వారా పరిశ్రమకు మూడు విధాలుగా ప్రయోజనం చేకూరుతుందని చెబుతోంది. అందులో పాత వాహనాల నుండి వెలువడే ఉద్గారాలను (కాలుష్యం) తగ్గించడానికి సహాయపడుతుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ లాభసాటిగా మారుతుంది. ఎందుకంటే పాత వాహనాలను కొత్త వాహనాలతో భర్తీ చేసేలా డిమాండ్‌ను పెంచుతుంది. ఉక్కు పరిశ్రమ కోసం చౌకైన ముడి పదార్థాలు స్క్రాప్ మెటీరియల్ నుండి లభిస్తాయి. ఈ చర్యల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి సాధించేందుకు దోహద పడతాయని కేంద్రం అంచనా వేస్తోంది. -
Hyderabad: చెత్త వ్యాపారి వద్ద రూ.1.24 కోట్లు.. అంత డబ్బు ఎక్కడిది?
సాక్షి, హైదరాబాద్: జల్పల్లికి చెందిన ఓ స్క్రాప్ వ్యాపారి వద్ద సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రూ.1.24 కోట్లు స్వాధీనం చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న తన సమీప బంధువు ఆదేశాల మేరకు ఈ మొత్తాన్ని ఒకరి నుంచి తీసుకున్న ఇతగాడు మరో నలుగురికి అందించేందుకు ప్రయత్నించాడని ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు గురువారం వెల్లడించారు. మీరట్ నుంచి నగరానికి వలసవచ్చిన షోయబ్ మాలిక్ మాసబ్‌ట్యాంక్‌లో ఉంటున్నాడు. గతేడాది ఫిబ్రవరి నుంచి జల్పల్లిలో బిస్మిల్లా ట్రేడర్స్ పేరుతో స్క్రాప్ వ్యాపారం చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో ఉంటున్న ఇతడి సమీప బంధువు కమిల్ మాలిక్ గుజరాతీ గల్లీ ప్రాంతానికి చెందిన వ్యాపారి భరత్ నుంచి రూ.1.24 కోట్లు తీసుకోమని చెప్పాడు. దీంతో గురువారం తన వద్ద పని చేసే ఉద్యోగి అక్లాక్‌ను పంపి డబ్బు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని కమిల్ ఆదేశాల మేరకు నగరానికే చెందిన సంభవ్, ఆదిల్, మినాజ్, షఫీలకు అందించాలని భావించాడు. సీజ్ చేసిన డబ్బు దీనిపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ ఆర్.రఘునాథ్ నేతృత్వంలో ఎస్సై ఎస్.సాయికిరణ్ నేతృత్వంలోని బృందం దాడి చేసి అదుపులోకి తీసుకుంది. షోయబ్ సహా అతడి నుంచి స్వాధీనం చేసుకున్న రూ.1.24 కోట్ల నగదును హుమాయున్‌నగర్ పోలీసులకు అప్పగించారు. ఈ మొత్తం వ్యవహారం హవాలా దందాగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనిపై ఆదాయపుపన్ను శాఖకు సమాచారం ఇస్తున్నారు. -
సీసీ కెమెరాలో రికార్డ్ అయిన టింబర్డిపోలో బ్లాస్ట్ దృశ్యాలు
-
బోయిగూడ అగ్ని ప్రమాదం: గోదాంలో ఉండేది 8 మందే.. ఆ నలుగురు ఎవరంటే!
సాక్షి, బన్సీలాల్‌పేట్: విధి ఒక విష వలయం. విషాద గాథలకు అది నిలయం. ఆ నలుగురు అమాయకులు బలి కావడం కాల వైచిత్రి. తామొకటి తలిస్తే దైవమొకటి తలిచిందన్నట్లు మృత్యువాత పడ్డారు. బుధవారం తెల్లవారుజామున న్యూ బోయగూడలోని స్క్రాబ్ గోదాంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో పదకొండు మంది బిహార్ వలస కార్మికులు సజీవ దహనమైన విషయం విదితమే. వీరిలో నలుగురు అనుకోని పరిస్థితుల్లో ప్రాణాలు వదల డంతో కుటుంబీకులను తీవ్ర విషాదానికి గురి చేసింది. మృతుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. స్నేహితులను కలిసేందుకు వచ్చి.. స్క్రాబ్ గోదాంలో అనేక మంది పని చేస్తున్నా.. 8 మంది మాత్రమే గోదాం పైఅంతస్తులో రాత్రిపూట నిద్రిస్తుంటారు. ఈ క్రమంలో నగరంలోని అంబర్‌పేటలో పని చేస్తూ అక్కడే నివాసం ఉండే గొల్లుతో పాటు మరో ముగ్గురు తమ మిత్రులను కలిసేందుకు మంగళవారం రాత్రి న్యూ బోయగూడలోని శ్రావణ్ ట్రేడర్స్ స్క్రాబ్ గోదాంనకు వచ్చారు. అందరూ కలిసి భోజనం చేశారు. రాత్రి పొద్దుపోవడంతో వారితో పాటు ఈ నలుగురూ అక్కడే నిద్రించారు. ఆ నిద్రే వారి పాలిట శాపంగా మారింది. శాశ్వత నిద్రకు చేరువచేసింది. ప్రేమ్ మాత్రం.. ప్రమాద సమయంలో కిటికీలోంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం ప్రభావంతో 3.50 గంటలకు సిలిండర్ పేలగా.. దాదాపు ఆరున్నర నిమిషాల తర్వాత అతడు భవనం సన్‌సైడ్ మీదికి దూకాడు. సిలిండర్ పేలుడు ధాటికి భవనం సమీపంలో ఉన్న ఓ శునకం గాయపడినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. వైద్యుల పర్యవేక్షణలో ప్రేమ్.. అగ్ని ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ప్రేమ్‌కు గాంధీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. అతని శరీరంపై అయిన పది శాతం కాలిన గాయాల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. బుధవారం రాత్రి నుంచే అతను సాధారణ పరిస్థితుల్లోనే ఉన్నాడని చెబుతున్నారు. వేడి పొగ పీల్చి ఉండటంతో దాని ప్రభావం అతని ఊపిరితిత్తుల లోపలి భాగంలో ఇన్ఫెక్షన్ రూపంలో ఉండొచ్చని వైద్యులు పేర్కొన్నారు. ఇది తెలియాలంటే కనీసం మరో మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఆపై పరీక్షలు చేయాలని వివరించారు. ఆప్యాయంగా.. ప్రేమగా.. వేర్వేరు చోట పని చేస్తున్నా వీరంతా ఆప్యాయంగా, ప్రేమగా మెలిగే వారు. సెలవులు, పండగలతో పాటు వీలున్నప్పుడల్లా కలుసుకునేవారు. మృత్యువు వీరి బంధాన్ని విడదీసింది. మిత్రులందరిని ఒకేసారి తీసుకెళ్లింది. ఈ దుర్ఘటన కార్మికులకు తీరని వేదనను మిగిల్చింది. ఏప్రిల్‌లో వివాహం.. అంతలోనే విషాదం.. వచ్చే నెల ఏప్రిల్‌లో గొల్లు విహహం జరగాల్సి ఉంది. దీంతో అతను సొంతూరు వెళ్లేందుకు రైల్వే టికెట్ కూడా బుక్ చేసుకున్నాడని, ఇంతలోనే మృత్యువు కబళించిందని స్నేహితులు విలపిస్తున్నారు. మంగళవారం రాత్రి ఆలస్యం కావడంతో అక్కడే ఉండి ఉదయం రావాలని మృతుని బంధువు చెప్పడంతో నిద్రించి ప్రాణాలమీదికి తెచ్చుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. కన్నీటి సుడుల మధ్య.. గాంధీ ఆస్పత్రి: న్యూ బోయగూడలో స్క్రాప్ దుకాణంలో బుధవారం సంభవించిన అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన 11 మంది బిహార్ వలస కార్మికుల మృతదేహాలను బంధువుల కన్నీటి సుడుల మధ్య గురువారం పాట్నాకు తరలించారు. అక్కడ నుంచి ప్రత్యేక వాహనాల్లో స్వస్థలాలకు పంపించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ దగ్గరుండి పర్యవేక్షించారు. మృతదేహాలకు గాంధీ ఆస్పత్రి మార్చురీలో బుధవారమే పోస్టుమార్టం పరీక్షలు పూర్తి చేశారు. ఎంబామింగ్ చేసి ఫ్రీజర్‌లో భద్రపరిచారు. వీటిని రెండు విడతలుగా అంబులెన్స్‌లో శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకువెళ్లారు. కార్గో విమానాల్లో పాట్నాకు తరలించారు. ఉదయం 8 గంటలకు మొదటి విమానంలో ఆరు, మధ్యాహ్నం 2 గంటలకు రెండో విమానంలో అయిదు మృతదేహాలను తరలించారు. మృతుల బంధువులు కొందరు వీటితో వెళ్లారు. పాట్నా విమానాశ్రయం నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో మృతదేహాలకు స్వస్థలాలకు పంపారు. ప్రమాదానికి కారణాలు కనిపెట్టడంతో పాటు ఇతర ఆధారాల సేకరణ కోసం గురువారం ఘటనాస్థలిలో పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేపట్టారు. కొన్ని నమూనాలు సేకరించామని వాటి విశ్లేషణ తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని ఓ అధికారి పేర్కొన్నారు. -
బోయిగూడ అగ్ని ప్రమాదం: గురువారం ఉదయం మృతదేహాల తరలింపు
Latest Updates ► బోయిగూడ అగ్ని ప్రమాదంలో మరణించిన మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తైంది. ► బోయిగూడ అగ్ని ప్రమాదంలో మరణించిన మృతదేహాలను గురువారం స్వస్థలాలకు తరలించనున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి కావడానికి ఈ రోజు సాయంత్రం అవుతుందని పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయం గుండా 3 పాట్నాకు చెందిన విమానాలలో మృతదేహాలను తరలించనున్నట్లు వెల్లడించారు. ►బోయిగూడ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాల గుర్తింపు జరుగుతోందని హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ తెలిపారు. గాంధీ మార్చురీలో ఇప్పటికే ఆరుగురి మృతదేహాలను గుర్తించినట్లు, మరో అయిదుగురి మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు. పోస్టుమార్టం ప్రక్రియలో మొత్తం నాలుగుటీమ్లు పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని హైదరాబాద్ కలెక్టర్, సీపీ సీవీ ఆనంద్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎయిర్ అంబులెన్స్ ద్వారా మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించనున్నట్లు తెలిపారు. అగ్ని ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని, అనధికరికంగా నిర్వహిస్తున్న స్క్రాప్ గోడౌన్లపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ►బోయిగూడ అగ్ని ప్రమాద స్థలానికి హోంమంత్రి మహమూద్ అలీ చేరుకున్నారు. బోయిగూడ ఘటనపై అధికారులతో విశ్లేషిస్తామని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు జీహెచ్ఎంసీ, పోలీస్, అగ్నిమాపకశాఖ విజిలెన్స్ అధికారులతో సమావేశం కానున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో స్క్రాప్ గోడౌన్లు ఎన్ని ఉన్నాయో.. ఎలాంటి చర్యలు చేపట్టాలో చర్చిస్తామని పేర్కొన్నారు. జనావాసాల మధ్య గోడౌన్లు చాలా ఉన్నాయని, ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: బోయిగూడ అగ్ని ప్రమాదం.. సీఎం దిగ్భ్రాంతి.. రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా బోయిగూడలో 20కి పైగా స్క్రాప్ గోడౌన్లు కాగా బోయిగూడ ఘటనతో అధికారులు అలెర్ట్ అయ్యారు. అనుమతులు లేని టింబర్లపై అధికారులు దాడులు చేస్తున్నారు. కార్మికుల రక్షణ, సౌకర్యాలపై ఆరా తీస్తున్నారు. ఇక బోయిగూడలో 20కి పైగా స్క్రాప్ గోడౌన్లు ఉన్నట్లు అధికారుల గుర్తించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సమగ్ర విచారణ జరపాలి: రేవంత్ రెడ్డి సికింద్రాబాద్‌లోని బోయిగూడ అగ్ని ప్రమాదంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతిచెందడం అత్యంత బాధాకరమని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చదవండి: Hyderabad: భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం ఎలాంటి సేఫ్టీ పరికరాలు లేవు: సీవీ ఆనంద్ సికింద్రాబాద్ బోయిగూడలోని టింబర్, స్క్రాప్ గోడౌన్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. స్క్రాప్ గోడౌన్లో షార్ట్ సర్క్యూట్లో మంటలు వ్యాపించాయని. ఆ తర్వాత సిలిండర్ పేలుడు జరగడంతో దట్టమైన పొగ కమ్ముకుందని సీపీ ఆనంద్ తెలిపారు. ప్రమాద సమయంలో కార్మికులంతా నిద్రలో ఉన్నందున ప్రమాద తీవ్రత భారీగా పెరిగిందని పేర్కొన్నారు. గోడౌన్ విషయంలో నిబంధనలు పాటించలేదని, అందులో ప్రమాద నివారణ చర్యలు ఏమీలేవని చెప్పారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్ పేలినట్లు 100కు ఫోన్‌కాల్ వచ్చిందని చెప్పారు. సిలిండర్ పేలడంతోనే మంటలు ఎక్కువగా వ్యాపించాయన్నారు. ఇద్దరు యువకులు పైనుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారని చెప్పారు. గాయాలైన వ్యక్తితో మాట్లాడితే పూర్తి సమాచారం వస్తుందని తెలిపారు. మృతులు బీహార్‌లోని చప్రా జిల్లాకు చెందినవారని వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. గోదాం యజమానికి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ప్రమాదం జరిగిన గోడౌన్‌కు ఎంట్రీ, ఎగ్జిట్ ఒక్కటే ఉందన్నారు. అలాగే గోడౌన్లో ఎలాంటి సేఫ్టీ పరికరాలు కూడా లేవని సీవీ ఆనంద్ వివరించారు. మృతులంతా బిహార్‌లోని చప్రా జిల్లాకు చెందినవారని, ఇక్కడ పనిచేసే కార్మికులకు నెలకు రూ. 12 వేలను జీతంగా ఇస్తారని తెలిపారు. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాం: మంత్రి తలసాని బోయిగూడలో అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని మంత్రి శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటన బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించామని తెలిపారు. పూర్తి వివరాలు తెలుస్తాయని అన్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా అదుకుంటామన్నారు. సాక్షి, హైదరాబాద్: బుధవారం తెల్లవారుజామన సికింద్రాబాద్ బోయిగూడలోని స్క్రాప్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది సజీవ దహనమయ్యారు. మరొకరు ప్రాణాలతో బయట పడ్డారు. సుమారు మూడు గంటలకు పైగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశాయి. ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ సంతాపం తెలిపారు. మృతుల కుంటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, ప్రధాని నరేంద్రమోదీ రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీశారు. మృతులంతా బీహార్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. మృతులను సికిందర్(40), బిట్టు(23), సత్యేందర్(35), గోలు(28), దామోదర్(27), రాజేశ్(25), దినేశ్(35), రాజు(25), చింటు(27), దీపక్(26), పంకజ్(26)గా గుర్తించారు. -
స్క్రాప్ వల్ల భారీగా మంటలు ఎగిసిపడ్డాయి: రిజినల్ ఫైర్ అధికారి
-
ఇది చాలా విషాదకరమైన సంఘటన: సీవీ ఆనంద్
-
హైదరాబాద్: స్క్రాప్ గోడౌన్లో అగ్ని ప్రమాదం.. ఫైర్ అధికారులేమన్నారంటే
సాక్షి, సికింద్రాబాద్: బోయిగూడలోని తుక్కు (స్క్రాప్) గోడౌన్లో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. మంటల దాటికి గోడౌన్ పైకప్పు కూలింది. ఘటనలో 11 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. మూడు గంటలు శ్రమించి పూర్తి స్థాయిలో మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులంతా బిహార్‌కు చెందినవారుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. సర్కిల్లో గోడౌన్ యజమాని సంపత్ కాగా శ్రవణ్ ట్రేడర్స్‌లో అగ్ని ప్రమాదం జరిగినట్లు రిజినల్ ఫైర్ అధికారి పాపయ్య తెలిపారు. మొదట గోడౌన్ గ్రౌండ్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం మొదలైందని తెలిపారు. ఉదయం 3.10 నిమిషాలకు ప్రమాదం జరిగిందన్నారు. స్క్రాప్ వల్ల భారీగా మంటలు ఎగిసిపడ్డాయని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా లోపల ఉన్న సిలిండర్ బ్లాస్ట్ అవ్వడంతో ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు. ఇప్పటి వరకుపదకొండు మృతదేహాలను వెలికి తీసినట్లు పేర్కొన్నారు. మంటల్లో చిక్కుకుని బయటకు రాలేకపోయారని, పొగ మంట వల్ల పదకొండు మంది చనిపోయారని అన్నారు. సంబంధిత వార్త: Hyderabad: భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం అయితే మృతదేహాల వెలికితీత సమయంలో చాలా బాధకరమైన సన్నివేశం కనిపించిందన్నారు. ఒకరి మీద ఒకరు పడిపోయి, పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయన్నారు. అలాగే 11 మంది మృతదేహాల్లో వాచ్మెన్ ఉన్నాడా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ఓ వ్యక్తి మంటలను గుర్తించి కిటీకి నుంచి బయటకు దూకడంతో ప్రాణాలు రక్షించుకోగలిగాడని తెలిపారు. గోడౌన్పైన నివాసం కోసం రెండు గదులు ఉన్నాయని అందులోనే కార్మికులు వంట చేసుకోవడం, పడుకోవడం చేస్తారని తెలిపారు. పైకి వెళ్లడానికి గోడౌన్నుంచే మెట్ల మార్గం ఉందని తెలిపారు. అందుకే తప్పించుకోలేకపోయారని వెల్లడించారు. గోడౌన్ అగ్ని ప్రమాద ఘటనలో చనిపోయిన వారంతా బీహార్ ఛప్రా జిల్లా వాసులు. కుటుంబాలు అన్ని బిహార్‌లో ఉండగా.. ఇక్కడ బ్యాచిలర్‌గా జీవిస్తుంటారు. గోడౌన్లో మొత్తం 16 మంది కార్మికులు ఉండగా.. షిఫ్టుల వారీగా 8 మంది కార్మికులు ఉంటారు. అయితే మంగళవారం రాత్రి ముగ్గురు బంధువులు వచ్చారు. ఇక గోడౌన్ యజమాని సంపత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గోడౌన్‌కు అనుమతులు ఉన్నాయా లేవా అన్నా అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. -
డాన్.. డబుల్ జీరో నెంబర్.. దీని వెనుక పెద్ద కథే ఉంది..
Scrap Don: ఆరోజు మార్నింగ్ వాక్‌కి వెళ్ళినవారికి రైల్వే స్క్రాప్ యార్డ్ సమీపంలో ఓ శవం కనిపించింది. వార్త అందగానే విశాఖపట్టణం 3–టౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. హతుడి వయసు 35 ఏళ్ళుంటుంది. తెల్ల షర్ట్, బ్లూ ప్యాంటులో వున్నాడు. శరీరం పైన 5 లోతైన కత్తిపోట్లు ఉన్నాయి. రక్తం మడుగుకట్టింది. హతుడి పేరు గోవిందరావు అనీ, సీతమ్మధారకు చెందిన ఓ రైల్వే స్క్రాప్ కాంట్రాక్టరనీ తెలిసింది. పోలీసులు హత్యాప్రదేశాన్ని కార్డనాఫ్ చేసి తమ తతంగం ఆరంభించారు. శవాన్ని పరీక్షించిన డాక్టర్ ‘రిగర్ మార్టిస్’ని బట్టి, హత్య జరిగి సుమారు పది గంటలయినా కావచ్చునని చెప్పాడు. గాయాల లోతును బట్టి హత్యకు ఉపయోగించిన కత్తి పొడవు ఆరేడు అంగుళాలు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు నిపుణులు. స్నిఫర్ డాగ్ రప్పించబడింది. అది నేలను వాసన చూస్తూ అక్కడికి సుమారు రెండువందల మీటర్ల దూరంలోని రైల్వే స్క్రాప్ యార్డ్ కాంపౌండు వెనుక భాగంలో వున్న చిన్నబండల వద్దకు వెళ్ళి ఆగింది. అక్కడ రెండు ఖాళీ బీరు బాటిల్స్, తినుబండారాలను తినేసి పడేసిన కాగితపు పొట్లాలు, సిగరెట్ పీకలు, బూట్ల ఆనవాళ్ళున్నాయి. చెప్పుల ఆనవాళ్ళు కూడా కనిపించాయి. ఓ పాత తువాలు పీలిక పడివుంది. పరిసరాలను గాలించిన పోలీసులకు కొన్ని అడుగుల దూరంలో ఉన్న తుప్పల్లో పొడవాటి కత్తి ఒకటి దొరికింది. దానిపైన రక్తం ఎండిపోయి వుంది. హత్యాయుధం అదేనని గ్రహించిన పోలీసులకు– మర్డర్ చేశాక హంతకులు ఆ బండల దగ్గర కూర్చుని డ్రింక్ చేసివుంటారని అర్థమయింది. దుండగులు కూర్చున్న స్థలాన్ని, కత్తిని, సీసాలను, గుడ్డపీలికను వాసన చూసిన శునకం ఓ క్షణంపాటు దిక్కులు చూసి ఓ దిశగా పరుగుతీసింది. కొంతదూరం వెళ్ళాక ఓ పాక వద్ద ఆగింది. అక్కడ చింకిచాప పైన పడుకుని ఉన్నాడు ఓ బిచ్చగాడు. ఓ మూలన ఓ గుడ్డసంచి, అందులో కొన్ని పాతబట్టలు వున్నాయి. పక్కనే చిరిగిన ఓ పాత తుండు కనిపించింది. తమకు దొరికిన గుడ్డపీలిక దానినుంచే చింపబడ్డట్టు గుర్తించారు పోలీసులు. శునకం దాని దగ్గరకు వెళ్ళి భీకరంగా మొరగడంతో తుళ్ళిపడి లేచాడు వాడు. కుక్కను, పోలీసులను చూసి భయంతో ఒణికిపోయాడు. రైల్వే స్క్రాప్ యార్డ్ దగ్గర జరిగిన హత్య గురించి గద్దించి అడిగితే, తనకేమీ తెలియదని మొత్తుకున్నాడు. రెండు తగిలించి, వాడి తువాలు పీలిక అక్కడికి ఎందుకు వచ్చిందని గద్దించడంతో జరిగిందేమిటో ఏడుస్తూ చెప్పాడు. గతరాత్రి వాడు బిచ్చమెత్తుకుని అడ్డదారిలో తన పాకకు తిరిగివస్తూంటే, రైల్వే స్క్రాప్ యార్డ్ కాంపౌండ్ వెనుక ఇద్దరు వ్యక్తులు కూర్చుని హిందీలో మాట్లాడుకుంటూ డ్రింక్ చేస్తున్నారు. వారి దగ్గరకు వెళ్ళి తనకూ కాస్త డ్రింక్ పోయమని అడిగాడు వాడు. కసిరారు వాళ్ళు. వాడు కదలకుండా బతిమాలుతుంటే.. ‘అరె, చల్ బే!’ అంటూ తిట్టారు. అయినా ఆశ చావక ఇంకా అక్కడే నిలుచునివున్నాడు వాడు. దాంతో వాళ్ళలో ఒకడు కోపంతో లేచి వాడి భుజమ్మీది తుండుగుడ్డను పట్టుకుని లాగి ముందుకు తోసేశాడు. అది పాతది కావడంతో చిరిగి కొంతముక్క కింద పడిపోయింది. వాడు భయంతో గబగబా అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు. పాకకు వచ్చి అన్నం తిని పడుకున్నాడు. హత్య సంగతి ఎరుగడు. వాళ్ళ ఆకారాలు, వేషభాషలు చూస్తే వేరే రాష్ట్రం నుంచి వచ్చిన గూండాల్లా ఉన్నారనీ చెప్పాడు బిచ్చగాడు. విచారణ ముగిసేంతవరకూ వాణ్ణి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గోవిందరావు శవానికి ‘పోస్ట్‌మార్టమ్’ చేసిన సర్జన్, హత్యా సమయాన్ని రాత్రి 9 గంటలకు కొంచెం అటు ఇటులో తేల్చాడు. పోలీసులు టీమ్స్‌గా ఏర్పడి గాలింపు మొదలుపెట్టారు. రాత్రి కానీ, ఉదయం కానీ ఎవరైనా పాసింగ్ ట్రక్స్‌లో ఎస్కేప్ అయినవారున్నారేమోనని ఆరా తీస్తే చిన్నవాల్తేరు లోని ఓ లాడ్జ్‌లో దొరికారు ఇద్దరు రౌడీలు. హత్యకు ముందురోజున వాళ్ళు బిహార్ నుంచి వచ్చి ఆ లాడ్జ్‌లో దిగినట్లు తెలిసింది. లాకప్‌లో పడేసి డ్రెస్సింగ్ డౌన్ ఇచ్చేసరికి గోవిందరావును చంపింది తామేనని ఒప్పుకున్నారు. ఆ హత్య వెనుకున్న మోటివ్ కోసం ప్రశ్నించిన పోలీసులను వాళ్ళు బైటపెట్టిన విషయాలు షాక్‌కి గురిచేశాయి. రైల్వేల్లో ఏడాదికి జనరేట్ అయ్యే 20 లక్షల టన్నుల స్క్రాప్‌లోని ఇనుము, స్టీల్, అల్యూమినియం, ఇత్తడి, రాగి విలువ ఇంచుమించు 5 వేల కోట్లుంటుంది. దాన్ని పబ్లిక్ వేలం ద్వారా అమ్మేస్తుంటారు. స్క్రాప్ కాంట్రాక్టర్స్ ఆ వేలంపాటలో ఉత్సాహంగా పాల్గొంటుంటారు. అది మిక్కిలి లాభసాటి బిజినెస్ కావడమే అందుకు కారణం. అయితే, ఆ వేలంపాటను ఓ వ్యక్తి నియంత్రించడం విశేషం! అతని పేరు భానోజీ. స్క్రాప్ మాఫియా డాన్. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, అసన్సోల్లతో ఆరంభమైన అతని ఆపరేషన్స్ అనతికాలంలోనే తూర్పు, దక్షిణ–తూర్పు కోస్తాలకు పాకిపోయాయి. ‘ఎక్స్టార్షన్’, ‘మర్డర్ త్రెట్’ భానోజీ ఆయుధాలు. ఏ జోన్లో ఎవరు, ఎప్పుడు వేలంపాటలో పాల్గొనాలో అతను నిర్ణయిస్తాడు. అందుకు ఆ కాంట్రాక్టర్ అతను కోరిన సొమ్మును చెల్లించాలి. అంతేకాదు స్క్రాప్‌ని రైల్వే యార్డ్ నుండి తరలించేటప్పుడు ఒక టన్నుకు వేయి రూపాయల చొప్పున ‘గూండా టాక్స్’ కూడా వసూలు చేస్తుంటారు భానోజీ మనుషులు. ఇవ్వడానికి నిరాకరిస్తే ఆ కాంట్రాక్టర్‌కి భూమి మీద నూకలు చెల్లినట్టే! ఆ సంగతులన్నీ తెలిసినా, తెలియనట్టే వుంటుంది రైల్వే శాఖ. మునుపు స్క్రాప్ కాంట్రాక్టర్స్ కొందరు ‘సిండికేట్’గా ఏర్పడి వేలాన్ని నియంత్రించేవారు. భానోజీ రంగప్రవేశం చేశాక సీన్ పూర్తిగా మారిపోయింది. అతను చెప్పిందే శాసనం. తనకు ఎదురు తిరిగినవారిని నిర్దాక్షిణ్యంగా చంపేయసాగాడతను. అందువల్ల ఆయా రాష్ట్రాల్లోని స్క్రాప్ కాంట్రాక్టర్స్ అంతా కలసి ఓ అసోసియేషన్‌గా ఏర్పడి భానోజీతో ఒప్పందానికి వచ్చారు. నెలనెలా కొంత సొమ్ము అసోసియేషన్ తరపున మామూళ్ళు సమర్పించుకుంటే వేలంపాటలో పాల్గొనేందుకు అతను వంతులవారీగా కాంట్రాక్టర్లను ఎంపిక చేసేట్టు.. ఆ కాంట్రాక్టర్ అతను కోరిన సొమ్మును చెల్లించేటట్టు ఒడంబడిక జరిగింది. దాన్ని ఉల్లంఘించిన వారు హత్య చేయబడతారు. చిత్రమేమిటంటే అతనెవరో, ఎలా వుంటాడో, ఎక్కడ వుంటాడో ఎవరికీ తెలియదు. అతని అసలు పేరు కూడా తెలియదు. కాంట్రాక్టర్స్‌కి అతని నుండి ఫోన్ వస్తుంది. వారి సెల్‌ఫోన్ స్క్రీన్ మీద అతని మొబైల్ నంబర్ కానీ, పేరు కానీ కనపడవు. కేవలం ‘రెండు సున్నాలు (00)’ ప్రత్యక్షమవుతాయి. అందువల్ల అతన్ని ‘డబుల్ జీరో’గా వ్యవహరిస్తుంటారంతా. మాఫియా లీడర్‌కి లొంగిపోయినందుకు అసోసియేషన్‌ని తప్పుపడుతూ, భానోజీ డిక్టాట్స్ని వ్యతిరేకించడానికి పూనుకున్నారు కొందరు యువ కాంట్రాక్టర్స్. పర్యవసానంగా వారు హత్యకు గురవసాగారు. వారిలో విశాఖపట్టణానికి చెందిన గోవిందరావు ఒకడు. ఆ ప్యాటర్న్‌లోనే ఇతర రాష్ట్రాలతో పాటు హౌరా, సీల్దాల్లోనూ జరగడంతో బెంగాల్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సి.ఐ.డి. నుండి ఓ స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ని ఏర్పాటు చేసింది. అది డాన్ గురించిన సమాచారాన్ని సేకరించడంలో కొంతవరకు విజయం సాధించింది. భానోజీ బిహార్‌కి చెందినవాడు. నేపాల్‌ని స్థావరంగా చేసుకుని రైల్వే స్క్రాప్ మాఫియాని నడుపుతున్నాడు. అతనికి కొందరు రాజకీయనేతల అండదండలే కాక, పోలీసువర్గాల్లోనూ అతని మద్దతుదారులున్నట్టు అనుమానం. అతని పాత ఫొటోగ్రాఫ్‌ని ఎలాగో సంపాదించగలిగారు. ఓసారి బొకారో స్టీల్ సిటీకి చెందిన ఓ యువ కాంట్రాక్టర్ అసోసియేషన్ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ భానోజీని ధిక్కరించే ప్రయత్నం చేశాడు. వేలంపాటలో పాల్గొనబోతున్నట్టు, చేతనైతే తనను ఆపమనీ స్క్రాప్ డాన్‌కి సవాల్ విసిరాడు. భానోజీకి విషయం తెలియడంతో, ఆ కాంట్రాక్టర్‌కి ఫోన్‌చేసి వేలంపాట సమయంలోనే అతన్ని స్వయంగా పబ్లిక్‌లో చంపుతానని బెదిరించాడు. ఆ సంగతి తెలిసిన పోలీసులు స్క్రాప్ డాన్ కోసం వల పన్నారు. ఆ యువకాంట్రాక్టర్ ధైర్యంగా ఆ వేలంపాటలో పాల్గొన్నాడు. రైల్వే పోలీసులు, లోకల్ పోలీసులకుతోడు ప్లెయిన్ క్లోత్స్ పోలీస్‌మెన్ కూడా అచ్చటి జనంలో కలసిపోయి ఉన్నారు డాన్ కోసం పరికిస్తూ. వేలంపాట ముమ్మరంగా సాగుతూన్న సమయంలో ఆ యువకాంట్రాక్టర్ పోలీసుల సాక్షిగా పబ్లిక్‌గా పిస్టల్‌తో కాల్చి చంపబడ్డాడు! ఆ తరువాత విచారణలో తెలిసిందేమిటంటే భానోజీ పోలీస్ యూనిఫామ్‌లో వచ్చి ఆ మర్డర్ చేసి మాయమయ్యాడని! ఆ సంఘటనతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. సంబంధిత రాష్ట్రాలకు చెందిన ఉన్నత పోలీసు అధికారులు కోల్‌కతాలో అత్యవసర సమావేశమయ్యారు. ∙∙ నేపాల్ రాజధాని ఖట్మండూలోని పార్టీ యానిమల్స్ ఫేవరేట్ ఏరియా– లజీంపేట్.. రాత్రి 9 గంటలు అవుతోంది. ఓ అందమైన యువతి ఆ వీధిలో పరుగెడుతోంది. పోలీసులు ఆమెను తరుముతున్నారు. సందుగొందులు తిరుగుతూ తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ మెయిన్ రోడ్డును చేరుకున్న ఆ యువతి వేగంగా వస్తూన్న ఓ కారుకు అడ్డుపడింది. సడన్ బ్రేక్‌తో ఆగింది కారు. కంగారులో కిందపడిపోయిందామె. డ్రైవ్ చేస్తూన్న నడివయస్కుడు దిగి వచ్చాడు. అప్పటికే కంగారుగా పైకి లేచి, మోచేతికి తగిలిన గాయాన్ని చూసుకుంటోంది. నేపాలీస్ భాషలో కోపంగా అరిచాడతను.‘పోలీసులు తరుముకొస్తున్నారు’ అంటూ మళ్ళీ పరుగెత్తబోయిందామె. సందుమలుపులో ప్రత్యక్షమైన పోలీసుల్ని చూసి, ‘త్వరగా కారెక్కు’ అన్నాడు. మారు యోచన చేయకుండా ఎక్కేసిందామె. కొంతసేపటికి ఓ విల్లా వద్ద ఆగింది కారు. ఆమె దిగి వెళ్ళిపోతానన్నా వినకుండా లోపలికి తీసుకువెళ్ళాడతను. ‘ఇప్పుడు చెప్పు, పోలీసులు నిన్ను ఎందుకు తరుముతున్నారు? ఏం నేరం చేశావ్?’ అనడిగాడు. ఆమె సంశయిస్తూంటే, ‘నిజం చెప్పకపోతే పోలీసులకు ఫోన్ చేసి నిన్ను అప్పగిస్తాను’ అని బెదిరించాడు. ఆ యువతి చెబుతూంటే ఆశ్చర్యంతో వింటూండిపోయాడతను. ఆమె పేరు పారెల్. ఓ పిక్ పాకెట్. రెండురోజుల కిందట అరబ్ షేక్ ఒకడు ఖట్మండూ వచ్చాడు. బత్తీస్ పుటలి రోడ్‌లోని ద్వారికా హోటల్లో బసచేశాడు. అతని వద్ద కోటిరూపాయల విలువచేసే వజ్రం ఒకటి ఉందనీ, దాన్ని అమ్మడానికే నేపాల్ వచ్చాడనీ తెలిసింది. ఆ యువతి బాయ్ ఫ్రెండ్ బైజూ కూడా పిక్ పాకెటే. అతని ప్రోద్బలంతో ఆ వజ్రాన్ని దొంగిలించడానికి సిద్ధపడ్డారిద్దరూ. ఏదో మిషతో ఆ రోజు రాత్రి ద్వారికా హోటల్‌కి వెళ్ళి అరబ్ షేక్‌ని కలవడానికి ప్రయత్నించారు. అతనికేం అనుమానం వచ్చిందో పోలీసుల్ని పిలిపించాడు. ఆ జంట పారిపోజూసింది. బైజూ దొరికిపోయాడు. ఆమె ఎలాగో తప్పించుకుంది. అంతా విని ‘వజ్రం గురించి నువ్వు చెబుతున్నది నిజమేనా?’ అనడిగాడు. నిజమే అందామె. ‘ఈరాత్రికి నువ్వు బైటకు వెళ్ళడం మంచిదికాదు. తెల్లవారాక ఆలోచిద్దాం’ అన్నాడు. తరువాత ఎవరికో ఫోన్ చేసి, కొద్ది నిముషాలు మాట్లాడాడు. మర్నాడు అతను 35 ఏళ్ళ వ్యక్తిని కలిశాడు. ‘భాయ్! రాత్రి నువ్వు చెప్పినట్టే ఆ పిల్ల బ్యాక్ గ్రౌండ్ చెక్ చేశాను. ఆమె చెప్పిందంతా నిజమేనని తేలింది. నయానో భయానో ఆమెను ఒప్పించి ఆ షేక్ మీద ప్రయోగిద్దాం. వీలు చూసుకుని వజ్రాన్ని కైవసం చేసుకుందాం’ అన్నాడు. ∙∙ కాఠ్మాండూలోని ‘ద ద్వారికా హోటల్’ అంతర్జాతీయ అతిథుల తొలి ఛాయిస్ అది. ఆ రాత్రి హోటల్ డా¯Œ ్స ఫ్లోర్లో పారెల్ అందాన్ని తిలకించిన అరబ్ షేక్ ఫ్లాట్ అయిపోయాడు. ఆమె వద్దకు వెళ్ళి ‘ఈ రాత్రి నాతో ఉంటే నీపైన దీనార్ల వర్షం కురిపిస్తాను’ అన్నాడు. అరగంట తరువాత ఇద్దరూ కలసి షేక్ ఉంటున్న స్వీట్‌కి వెళ్ళారు. ఇద్దరికీ షేకే స్వయంగా డ్రింక్స్ కలిపాడు. అతను దుస్తులు మార్చుకుంటూంటే చాటుగా అతని డ్రింక్‌లో ఏదో పొడిని కలిపిందామె. అతను వచ్చాక ‘ఛీర్స్’ చెప్పుకుని డ్రింక్ చేయనారంభించారిద్దరూ. ఐదు నిముషాల తరువాత ఏదో మత్తు ఆవహించడంతో సోఫాలో వెనక్కి వాలిపోయాడు షేక్. పారెల్ అతన్ని కుదిపిచూసి, సెల్లో ఎవరికో ఫోన్ చేసింది. రెండు నిముషాల్లో ‘భాయ్’, అతని అనుచరుడూ ప్రవేశించారు. షేక్ ముక్కు దగ్గర వేలుపెట్టి చూసి, ‘వెల్ డన్!’ అంటూ పారెల్ని ప్రశంసించి, వజ్రంకోసం ఎడ్జాయినింగ్ రూమ్‌లోని ఐరన్ సేఫ్ తెరవడానికి ఉపక్రమించారు. దానికి డిజిటల్ లాక్ ఉండడంతో ఎలక్ట్రానిక్ కట్టర్‌తో తెరవచూశారు. అదే సమయంలో షేక్ నిశ్శబ్దంగా లేచి నిలుచున్నాడు. తలగడ కిందనుంచి రివాల్వర్ తీసుకుని సేఫ్ ఉన్న గదిలోకి వెళ్ళాడు. ‘భాయ్’ తలకు గురిపెట్టి ‘హ్యాండ్సప్ భానోజీ!’అన్నాడు. అదిరిపడ్డారు వాళ్ళు. రెండవ వ్యక్తి చేయి జేబులోకి వెళ్ళబోతే, ‘డోంట్ మూవ్, మ్యాన్!’ అంటూ షేక్ వెనుకే వచ్చిన పారెల్ పిస్టల్ని గురిపెట్టింది. ∙∙ ఈ సీక్రెట్ మిషన్‌లో ప్రభుత్వం చెన్నైకి చెందిన ప్రైవేట్ డిటెక్టివ్ ప్రాణ్ సహాయాన్ని కోరింది. అతను తన అసిస్టెంట్ మిస్ గీతతో కలసి నేపాల్ వెళ్ళి మూడు నెలలపాటు అక్కడే మకాం వేసి భానోజీ కోసం గాలించాడు. అతని జాడ తెలియగానే, అతన్ని ట్రాప్ చేసేందుకు తగిన స్కెచ్ వేశాడు. తాను అరబ్ షేక్గానూ, గీత పారెల్గాను మారి వజ్రం పేరిట వలపన్ని భానోజీని హోటల్‌కి రప్పించడం, బంధించడం చేశారు. ఇటు భారత పోలీసులు, అటు నేపాల్ పోలీసుల ప్రమేయం లేకపోవడంతో ఆపరేషన్ అత్యంత గోప్యంగా, విజయవంతంగా జరిగిపోయింది. (యధార్థ సంఘటనల ఆధారంగా మలచిన ఈ కథ వాస్తవంలో ‘మాఫియా డాన్’ అసలు పేరు మాధవ్ సింగ్. కాంట్రాక్టర్లకు అతను ‘డబుల్ జీరో’ గానే తెలుసు. బిహార్, నేపాల్ సరిహద్దులోని సీతామర్హి జిల్లాలోని బరారీ సొంతూరు. తొలుత మాఫియా డాన్ బీరేందర్ కింద పనిచేసి ఆ తరువాత తన స్వంత ‘సామ్రాజ్యాన్ని’ ఏర్పరచుకున్నాడు. ఈనాటి వరకు డబుల్ జీరోని పోలీసులు అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. చదవండి: బస్ నెంబర్ 375.. వణుకుపుట్టించే మిస్టరీ.. నిజమా? అబద్ధమా? -
స్క్రాప్‌బుక్‌లో ఎన్నెన్నో భావాలు
‘మిస్ యూ!’ మిస్సైన ఫీల్ ఏదిరా.. ఎక్కడా?! ‘లవ్ యూ!’ దేవుడా రొటీన్. చంపేయ్ పోనీ. ‘కంగ్రాట్స్!’ ఏ బడి సార్ మీది? మొక్కుబడా? బీడే బేబీ! నాకేనా, ఫోన్‌లోనా?! జీవం ఉండట్లేదు ఎక్కడా మన ఎక్స్‌ప్రెషన్స్‌లో. ఇంకా ఎలా చెప్పాలి? ‘ఇంకా’నా! అసలేం చెప్పారని? హార్ట్‌ని టచ్ చేశారా? లేదు! అది ముఖ్యం కదా.. ఓ పని చేయండి. మీట్ మిస్ యామినీ పేర్నపాటి. మీ ఫీలింగ్స్‌ని ఆమె చక్కటి స్క్రాప్‌బుక్‌లో పెట్టి ఇస్తారు. ఆ బుక్‌ని ప్రెజెంట్ చెయ్యండి చాలు. ఎన్నెన్నో భావాలు..ఏవేవో రాగాలు..! ఆత్మీయులకు మరిచిపోలేని కానుక ఇవ్వాలంటే మనం యామిని చేతుల్లో రూపుదిద్దుకునే అరుదైన కళను ఎంచుకోవాల్సిందే. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న అనుబంధాన్ని అందమైన కథగా కళ్లకు కట్టే ఆ కానుక మన కళ్ల ముందు ఎప్పటికీ నిలిచి ఉండే ఓ సజీవ దీపిక. సూక్ష్మ చిత్రాల రూపకల్పనతో అందమైన కానుకలు తయారు చేస్తూ తన కళతో అబ్బురపరుస్తుంది యామిని పేర్నపాటి. హైదరాబాద్‌కు చెందిన యామిని ఫ్యాషన్ డిజైనింగ్‌ని వృత్తిగా మార్చుకోవాలని ఆశపడింది. కానీ, తల్లిదండ్రుల ఇష్టం మేరకు బిటెక్ చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యింది. ఇప్పుడు ప్రత్యేకంగా జీవన సన్నివేశ చిత్రాలను జీవం ఒలికించేలా రూపొందిస్తూ కస్టమైజ్డ్ గిఫ్ట్ మేకింగ్‌లో అడుగుపెట్టి ఉపాధి పొందుతోంది. ఆ వివరాలను ఇలా కథలా కళ్లకు కట్టింది... ఆన్లైన్ నైపుణ్యాలు.. ‘‘ఐదేళ్ల క్రితం కాలేజీ రోజుల్లో నేషనల్ ఎంటర్ప్రెన్యూర్ నెట్‌వర్క్‌లో భాగం అయ్యాను. అప్పుడే సొంతంగా ఉపాధి పొందడం పట్ల ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకునేదాన్ని. డ్రెస్ డిజైనింగ్‌లోనే కాదు క్విల్లింగ్ జ్యువెలరీ తయారీలోనూ ప్రశంసలు పొందాను. ఫైన్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ చేయాలనుకున్నాను. కానీ, ‘కళ ఒక అభిరుచి. అది తిండి పెట్టదు’ అన్నారు పెద్దలు. అందుకే, ఇంజనీరింగ్ వైపు వెళ్లాను. కానీ, నా అభిరుచిని వదులుకోలేదు. ఆన్లైన్ సాయంతోనే పెయింటింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘క్రియేటివ్ స్టూడియోస్’ పేరుతో పేజీని నిర్వహించాను. అయితే, తమ్ముడు చదువుకు ఫీజు చెల్లించడం కోసం నాన్న కష్టపడుతుండటం చూసి బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో చేరిపోయాను. కానీ, కళ లేని జీవితం అసంపూర్ణమనే భావన రోజూ బాధపెడుతుండేది. ప్రేయసికి బహుమతి నా సహోద్యోగి ఒకరు తన ప్రేయసికి బహుమతి ఇవ్వడానికి మంచి గిఫ్ట్ సూచించమని అడిగాడు. కాలేజీ రోజుల్లో నా ఫ్రెండ్స్‌కి డిజైన్ చేసి ఇచ్చిన స్క్రాప్ బుక్స్ గుర్తుకువచ్చాయి. నేనే స్వయంగా ఒకటి రూపొందించి ఇస్తే.. అని ఆలోచన వచ్చింది. ‘మీ బంధం ప్రత్యేకత చెప్పమ’ని అడిగాను. అతను చెప్పిన ప్రేమకథను ఆధారం చేసుకుంటూ ఒక అందమైన గిఫ్ట్‌ను తయారుచేసి ఇచ్చాను. ఆ కళాకృతికి అబ్బురపడి నాకు కొంతమొత్తాన్ని ఇచ్చాడు. ఆ గిఫ్ట్ అతని స్నేహితురాలికి బాగా నచ్చిందని సంతోషంగా చెప్పాడు. ఆ రోజు నేను పొందిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. నాకు ఎక్కడ సంతృప్తి ఉందో.. అదే పని చేస్తే చాలా సంతోషంగా ఉంటానని అర్ధమైంది. అన్నాళ్లూ వదిలేసిన నా కళకు కొత్తగా జీవం పోయాలనుకున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో we_craft16 పేరుతో కొత్త పేజీని రూపొందించాను. ఏడాదిన్నరగా ఈ పేజీని విజయవంతంగా నిర్వహిస్తున్నాను. మొదట రెండు మూడు ఆర్డర్లే! ఇప్పుడు నాకు నెలలో 30 నుంచి 40వరకు ఆర్డర్లు అందుతున్నాయి. కానీ, మొదటి రెండు నెలలు మూడు, నాలుగు ఆర్డర్లు మాత్రమే వచ్చేవి. చాలా నిరాశగా అనిపించేది. ఉద్యోగం చేస్తూనే స్క్రాప్ బుక్ డిజైన్స్ చేసేదాన్ని. ఓ వైపు ఆఫీసు పని భారం, మరొవైపు స్క్రాప్ బుక్ డిజైన్లు. కొన్ని రాత్రులు అస్సలు నిద్రపోయేదాన్నే కాదు. ముందు ఆర్డర్లు విరివిగా రావడం కోసం కస్టమర్లతో ఎలా వ్యవహరించాలో నేర్చుకున్నాను. గిఫ్ట్ బాక్స్ తెరిచి చూసినప్పుడు మనం చెప్పాలనుకున్న విషయం అందులోని సూక్ష్మచిత్రాలతో ఇట్టే అర్ధమైపోవాలి. అందుకోసం చాలా శోధించాను. చాలా కృషి చేశాను. దీంతో కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రత్యేకమైన శైలి కస్టమర్లు చెప్పే విషయాలను శ్రద్ధగా వింటాను. వారి మధ్య ఉన్న అందమైన సన్నివేశాన్ని తెలుసుకుంటాను. దానికి తగ్గట్టు క్రాఫ్టింగ్ చేస్తాను. ‘ఈ కళ ఎక్కడ నేర్చుకున్నారు?’ అని అడుగుతుంటారు. ఇది నాకు నేనుగా సృష్టించుకున్న కళ. అలాగని, నా వరకే పరిమితం అవ్వాలనుకోను. మరికొందరిని ఇందులో భాగస్వాములను చేయాలనుకుంటున్నాను. ఎప్పుడూ నా ఆలోచనల శైలిని అప్‌గ్రేడ్ చేస్తుంటాను కాబట్టి, ఎవరూ దీనిని కాపీ చేయలేరు అని గట్టిగా చెప్పగలను. ఐటి కంపెనీ నాకు చెల్లించే దానికంటే ఎక్కువ సంపాదించగలను అనే నమ్మకం పెరిగింది. నా అభిరుచితోపాటు నా వృత్తిని ఎలా సమతుల్యం చేసుకోవాలో నేర్చుకున్నాను’’ అని యామిని ఆనందంగా వివరించింది. ఉద్యోగం చేసుకుంటూనే నచ్చిన అభిరుచిలో ఉపాధి పొందుతున్న యామిని ఇప్పుడు కళాత్మకంగా రాణిస్తోంది. – నిర్మలారెడ్డి -
భలే మంచి 'చెత్త 'బేరము
ప్రస్తుతం అంతా ఆన్లైన్ షాపింగ్ హవా నడుస్తోంది. అంతవరకూ బాగానే ఉంది కానీ, దీనివల్ల ఇళ్లల్లో పెద్దపెద్ద కార్ట్టన్లు, పేపర్ బ్యాగ్‌ల రూపంలో కొత్తరకం చెత్త తయారవుతోంది. దీనికి తోడు ఇంట్లో రోజువారి వ్యర్థాలు అదనంగా ఉండనే ఉంటాయి. అయితే ‘కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల... కాదేదీ కవితకనర్హం’ అన్నట్లు ఇంట్లోని చెత్తను కూడా సొమ్ము చేసుకునే మార్గాలు ఉన్నాయి! అంతేకాదు.. ఇంట్లోని పొడిచెత్తను కూడా ఆన్లైన్ ద్వారా వదిలించుకోవచ్చని అంటున్నాయి కొన్ని స్టార్టప్ కంపెనీలు. రీసైక్లింగ్ చేయదగిన చెత్తనంతటినీ కస్టమర్ల ఇంటికి వచ్చి మంచి ధరకు కొనుగోలు చేస్తామని చెబుతున్న కొన్ని ఆన్లైన్ గార్బేజ్ సంస్థల వివరాలు మీకోసం. ద కబాడీవాలా కబాడీవాలా ఒక స్థానిక చెత్తను సేకరించే ఆన్లైన్ డీలర్. దీనిని అనురాగ్ అస్తీ, కవీంద్ర రఘువంశీ అనే ఇద్దరు కలిసి ప్రారంభించారు. వీరు తమ యాప్ ద్వారా స్థానికంగా ఉన్న ఇళ్లనుంచి చెత్తను సేకరించి రీసైక్లింగ్ యూనిట్లకు పంపుతారు. ముఖ్యంగా కబాడీవాలా.. న్యూస్ పేపర్లు, ప్లాస్టిక్ వస్తువులు, లోహ వస్తువులు, పుస్తకాలు, ఇనుము వంటి వాటిని ఇంటి యజమానులకు కొంత మొత్తంలో డబ్బులచెల్లించి సేకరిస్తుంది. అయితే వీరు తీసుకున్న చెత్తను ఎక్కడకి తీసుకెళ్తున్నారు? దానిని ఏంచేస్తున్నారో ప్రతీది కస్టమర్లకు తెలుసుకునే విధంగా లైవ్ ట్రాక్ సిస్టం సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. కబాడీవాలా సేకరిస్తున్న చెత్త కార్యక్రమం వల్ల.. 10వేల చెట్లను రక్షించబడడమేగాక, 2.5 లక్షల లీటర్ల ఆయిల్, 13.8 మిలియన్ల లీటర్ల నీరు ఆదా అవుతుందని సంస్థ తెలిపింది. ప్రస్తుతం కబాడీవాలా భోపాల్, ఇండోర్, ఔరంగాబాద్, రాయ్‌పూర్‌లలో సేవలందిస్తోంది. వెబ్సైట్: www.thekabadiwala.com జంక్ కార్ట్ జంక్ కార్ట్‌ను ఢిల్లీకిచెందిన నీరజ్ గుప్తా, శైలేంద్ర సింగ్, ప్రశాంత్ కుమార్, శుభం షా అనే ముగ్గురు కలిసి 2015లో ప్రారంభించారు. వీరు కూడా అన్ని రీసైక్లింగ్ వస్తువులను సేకరిస్తారు. ప్లాస్టిక్, అల్యూమినియం, ఐరన్, పేపర్, పుస్తకాలు, గ్లాస్ వంటి వాటిని సేకరిస్తారు. చెత్త ఇచ్చిన వారికి పేటిఎం వాలెట్ ద్వారా డబ్బులు చెల్లిస్తారు. అయితే ఎవరైనా కస్టమర్లు తమ చెత్త అమ్మగా వచ్చిన డబ్బులను స్వచ్ఛంద సంస్థలు, జంక్ ఆర్ట్‌లకు దానం చేయాలనుకుంటే...జంక్ కార్ట్‌లోని ఒక ఆప్షన్ ద్వారా దానం చేసే సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది. మనం ఆన్లైన్లో ఒక వస్తువును కొనడానికి ఎలా ఆర్డరు ఇస్తామో అలానే జంక్ కార్ట్ వెబ్సైట్లోకి వెళ్లి ఆర్డరు ఇస్తే వారే వచ్చి చెత్తను తీసుకెళ్తారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చాలా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని నిర్వహకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఢిల్లీ, ముంబై, బెంగళూరులో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. వారి వెబ్సైట్లో ఏ చెత్తను ఎంతరేటుకు తీసుకుంటారో వివరాలు పొందుపర్చారు, వీటి ద్వారావారు చెత్తను కొంటారు. వెబ్సైట్: www.junkart.in కర్మ రీసైక్లింగ్ మనకు ఏదైనా చెడుగాని, కష్టాలుగాని ఎదురైనప్పుడు మన కర్మ ఇంతేలే అనుకుంటాం. ఈ కర్మనే ఆధారం చేసుకుని చెత్తను పారేసి మీరు మెరుగుపడండి అంటూ ఓ స్టార్టప్ చెబుతోంది. అదే కర్మ రీసైక్లింగ్. మనింట్లో పేరుకు పోయిన చెత్తను పారవేసి మన కర్మను మరింత మెరుగు పరుచుకోవచ్చనే థీమ్‌తో అమీర్ జైరీవాల, అక్షత్ అనే ఇద్దరు ఈ పేరు మీదుగా చెత్తను సేకరిస్తున్నారు. అయితే వీరు మామూలు చెత్తను కాదు... ఎలక్ట్రానిక్ చెత్తను మాత్రమే సేకరిస్తారు. అదీ కూడా పాత మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, వాటికి సంబంధించిన పరికరాలు సేకరిస్తారు. వాటిలో ఏవైనా చిన్నపాటి లోపాలు ఉంటే వాటిని సరిచేసి మళ్లీ వాటిని చాలా తక్కువ రేట్లకు అమ్ముతుంటారు. అయితే వీరు మన దగ్గర ఉన్న ఫోన్లు కానీ ల్యాప్ట్యాప్గాని కొనాలంటే అది ఏ బ్రాండ్‌కు చెందినది, ఇంకా ఆయా వస్తువు గురించి కొన్ని రకాల చిన్నపాటి ప్రశ్నలకు జవాబులు ఇస్తేనే వారు మనం అమ్మదల్చుకున్న ఫోనుకు ఎంత మేర ధర చెల్లిస్తారో చెబుతారు. కస్టమర్‌కు కర్మ వారు ఇచ్చిన ధర ఓకే అయితే వారు దానిని తీసుకుని సర్సీస్ సెంటరుకు పంపిస్తారు. ఇలా దాదాపు 3 వేల స్మార్ట్‌ఫోన్ మోడళ్లను వీరు రీసైక్లింగ్‌కు తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 25 నగరాల్లో కర్మసేవలు అందుబాటులో ఉన్నాయి. వెబ్సైట్: www.karmarecycling.in ఎక్స్ట్రా కార్బన్ ఈ–వేస్ట్‌ను సేకరించే సంస్థే ఎక్స్ట్రా కార్బన్. గురుగ్రాంకు చెందిన ఒక స్టార్టప్ సంస్థ. ఈ సంస్థను 2013లో ప్రారంభమైంది. సంవత్సరానికి 6 వేల టన్నుల ఈ–వేస్ట్‌ను ఎక్స్ట్రా కార్బన్ సేకరిస్తుంది. ఉత్తర భారతదేశంలోని 9 నగరాల్లో 41 వేలమంది ఎక్స్ట్రా కార్బన్ కస్టమర్లు ఉన్నారు. ఎక్స్ట్రా కార్బన్ సంస్థను ప్రారంభించిన మొదటేడాదిలోనే రూ.70లక్షలను సంపాదించడం విశేషం. వెబ్సైట్: http://extracarbon.com స్క్రాప్ ట్యాప్ ఇది హైదరాబాద్‌కు చెందిన సంస్థ. ‘‘జీరో వేస్ట్ హీరో’’ అనే నినాదంతో స్క్రాప్ ట్యాప్ ప్రారంభమైంది. దీనిలో ముఖ్యంగా ఐదుదశల్లో చెత్తను సేకరించి రీసైక్లింగ్ చేస్తారు. చెత్త అమ్మేవారు, కొనే వారికి మధ్య ఒక మంచి వారధిగా స్క్రాప్ట్యాప్ వ్యవహరిస్తుంది. చెత్తను సేకరించి దానిని డిజిటల్ వేయింగ్ మిషన్ ద్వారా కొలిచి, ధరను నిర్ణయిస్తారు. ఆ తరువాత ఆ ధర కస్టమర్‌కు నచ్చితే దానిని రీసైక్లింగ్ యూనిట్‌కు పంపిస్తారు. వీరు వెబ్సైట్ ద్వారానే గాక వాట్సప్ నంబరు ద్వారా కూడా సేవలు అందిస్తున్నారు. స్క్రాప్ట్యాప్ ఇళ్లనుంచే గాక చిన్న చిన్న పరిశ్రమల నుంచి కూడా చెత్తను సేకరిస్తుంది.– పోకల విజయ దిలీప్, సాక్షి, స్టూడెంట్ ఎడిషన్ వెబ్సైట్: http://scraptap.in -
‘మిస్డ్ కాల్’తో ఇంట్లో స్వచ్ఛత
‘ఒక టన్ను పేపర్ రీస్లైకింగ్ చేయడం వల్ల 17 చెట్లను రక్షించినట్టవుతుంది.ఒక ప్లాస్టిక్ బాటిల్ రీసైక్లింగ్ నెలకు60 వాట్ల విద్యుత్‌ను ఆదా చేస్తుంది.ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌ను విసిరిస్తే అది కనుమరుగు కావడానికి 500 ఏళ్లు పడుతుంది.ఇలా ఇంట్లో ఉండే చెత్తకు సంబంధించిన ప్రయోజనాలను ప్రజలకు సామాజిక మాధ్యమాల్లో వివరిస్తూనే ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే మీ ఇంట్లోని చెత్తను తీసుకెళ్లి రీసైక్లింగ్ చేస్తామంటున్నారు నగరానికి చెందిన బిందు, లత, రీతూలు. స్వచ్ఛభారత్ తరహాలోనే ఈ ముగ్గురు కార్పొరేట్ ఉద్యోగులు ‘స్క్రాప్‌క్యూ’స్టార్టప్‌కు అంకురార్పణ చేశారు. సాక్షి, సిటీబ్యూరో: ఇంట్లో ఓ మూలన పడేసే పేపర్, ప్లాస్టిక్, అట్టపెట్టెలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను కొనుగోలు చేసి ఇంటి స్వచ్ఛతతో పాటు ఆర్థికంగానూ బాసటగా ఉంటున్నారు వీరు. ఈ చెత్త రీసైక్లింగ్ కోసం ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న పరిశ్రమలకు ఇవ్వడం ద్వారా వచ్చిన ఆదాయంలో ఎక్కువ శాతం సామాజిక సేవకు ఉపయోగిస్తున్నారు. హ్యాపీ స్మైల్ ఫౌండేషన్‌కు విరాళాలిస్తూ వారి సేవలో పరోక్షంగా భాగస్వామ్యులవుతున్నారు. చెత్తతో మేలంటూ ప్రచారం.. ఇంట్లో చెత్త ఉండడం వల్ల కలిగే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. వర్షాకాలంలో అయితే ఈ తిప్పలు చెప్పనక్కర్లేదు. ఇంట్లో శుభ్రతకు ఈ చెత్త ఎప్పుడూ అడ్డే. నగరంలో ఎక్కువ మంది అద్దెదారులే. దీంతో ఆ చెత్తను ఉన్న ఇంట్లోనే ఓ మూలాన పెడుతుంటారు. చెత్త కొనేవాడు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తుంటారు. ఇంకొందరు వీలు చూసుకుని స్క్రాప్ దుకాణం ఎక్కడో వెదుక్కొని మరీ ఈ చెత్తను తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. అయితే ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న నగరంలో చెత్తను ఎక్కడిపడితే అక్కడ పడేయడం వల్ల కలిగే అనర్థాలను, రీసైక్లింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను బిందు, లత, రీతూ ప్రజలకు వివరిస్తున్నారు. ‘తొలుత సామాజిక మాధ్యమాలను ప్రచారం కోసం ఎంచుకున్నాం. ఆ తర్వాత కాలనీలు, వీధుల్లో ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చివరకు ఇంటి ఇంటికీ వెళ్లి చెత్త విశిష్టతను తెలియజేస్తూ వాటిని పడేయవద్దని చెబుతున్నా’మంటున్నారు వీరు. మిస్డ్ కాల్‌తో మీ ఇంటికి.. ‘మీ ఇంట్లో పేపర్, ప్లాస్టిక్, అట్టపెట్టెలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఉంటే 040–30707070 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి. మా సిబ్బంది మీరు ఏ సమయం ఇస్తే ఆ సమయంలో వచ్చి డబ్బులు చెల్లించి చెత్త కొంటారు’ అని చెబుతున్నారు ఈ యువతులు. గూగుల్ ప్లే స్టోర్‌లో ‘స్క్రాప్‌క్యూ’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని అందులో వివరాలు నమోదు చేయాలని వివరిస్తున్నారు. -
స్క్రాప్‌లో 5వేల ఆధార్ కార్డులు
జైపూర్ : దేశంలో ఆధార్ సమాచార భద్రతపై పలువర్గాల నుంచి విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో రాజస్తాన్ జైపూర్‌లోని జల్పుర ప్రాంతంలో ఇస్లాం అనే తుక్కు వ్యాపారి (స్క్రాప్ డీలర్) దుకాణంలో 5 వేల ఆధార్ కార్డులు బయటపడటం స్థానికంగా కలకలం రేపింది. ఇస్లాం షాప్‌కు వచ్చిన కొందరు అతడు కొనుగోలు చేసిన పాత పేపర్లలో ఆధార్ కార్డులు ఉండటం గమనించి ఆ ప్రాంత కౌన్సిలర్ ఇక్రాముద్దీన్కు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న ఇక్రాముద్దీన్ ఓ ప్లాస్టిక్ సంచిలో ఉన్న 5వేల ఆధార్ కార్డులను గుర్తించాడు. వీటిని తనకు ఓ గర్తుతెలియని వ్యక్తి అమ్మినట్టు ఇస్లాం తెలిపాడు. ఈ ఘటనకు సంబంధించి జలపుర పోలీసులతో పాటు, పోస్టల్ శాఖకు సమాచారం అందజేశామని ఇక్రాముద్దీన్ తెలిపాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు, పోస్టల్ సిబ్బంది ఆ ఆధార్ కార్డులన్నీ జల్పుర పరిసర ప్రాంతాల్లోని వ్యక్తులకు చెందినవిగా గుర్తించారు. ఆధార్ కార్డుల్లో ఫోన్ నంబర్ల ఆధారంగా ఆయా వ్యక్తులకు ఫోన్ చేయగా తాము ఆధార్ కార్డుకు చాలా కాలం క్రితమే దరఖాస్తు చేసినప్పటికి.. ఇప్పటివరకు ఆధార్ పొందలేదని తెలిపారు. లభించిన ఆధార్ కార్డులలో కొన్ని మాత్రమే పాక్షికంగా దెబ్బతినగా.. చాలా వరకు చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. డీఓఐటీ సెక్రటరీ అఖిల్ ఆరోరా ఈ ఘటనపై స్పందిస్తూ.. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టడానికి ప్రత్యేక బృందాన్ని పంపామని తెలిపారు. -
బీరు బాటిల్లో చెత్తా చెదారం
కుషాయిగూడ: బీరు బాటిల్లో చెత్తా..చెదారంతో పాటుగా సన్నని పురుగులు దర్శనమిచ్చిన సంఘటన మంగళవారం ఈసీఐఎల్ చౌరస్తాలోని తేజ వైన్స్ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెలితే..మల్కాజిగిరికి చెందిన యశ్వంత్ ఈసీఐఎల్ చౌరస్తాలోని తేజ వైన్స్‌లో బీరు బాటిల్ కొనుగోలు చేశాడు. అందులో చెత్తా, చెదారంతో పాటు సన్నని పురుగులు కనిపించడంతో అతను వైన్స్ నిర్వాహకులను నిలదీశాడు. వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో బాధితుడు ఘట్కేసర్ ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈసీఐఎల్‌కు చేరుకున్న ఎక్సైజ్ అధికారులు బీరు బాటిల్‌ను పరిశీలించారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మల్లయ్య మాట్లాడుతూ ఫిర్యాదు దారుని ఆరోపణలు వాస్తవమేనని, షాంపిల్స్ సేకరించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
నో వర్క్ పర్మిట్స్: ట్రంప్ షాకింగ్ నిర్ణయం
సాక్షి, వాషింగ్టన్: హెచ్1 బీ వీసాదారులకు ట్రంప్ సర్కార్ మరోసారి షాక్ ఇవ్వనుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వర్క్ పర్మిట్ వీసాదారులను నిరోధించేందుకు చర్యలు చేపట్టనున్నారు. హెచ్1-బీ వీసా హోల్డర్స్ జీవిత భాగస్వాములు అమెరికాలో చట్టబద్ధంగా పనిచేయకుండా నిరోధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఒక టాప్ ఫెడరల్ ఏజెన్సీ అధికారి చెప్పారు. ఈ షాకింగ్ నిర్ణయంతో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా నాటి నిబంధనలకు స్వస్తి పలకాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. ఈ వేసవి తరువాత ఈ నిబంధనను రద్దు చేయాలని యోచిస్తోందని అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్సీఐఎస్) డైరెక్టర్ ఫ్రాన్సిస్ సిస్నా సెనేటర్ చుక్ గ్రాస్లేకు అందించిన ఒక లేఖలో తెలిపారు. దీంతో ఇప్పటికే వీసా జారీలో కఠిన నిబంధనలతో భారత ఐటీ పరిశ్రమను ప్రమాదంలోకి నెట్టేసిన టంప్ తాజా చర్య అమల్లోకి వస్తే వేలాది మంది భారతీయులపై విధ్వంసకర ప్రభావాన్ని చూపనుందని నిపుణుల అంచనా. హెచ్-4 వీసాపై పనిచేస్తున్న 7వేల మంది భారతీయ ఐటీ నిపుణులను దెబ్బతీయనుంది. ప్రపంచం వ్యాప్తంగా 8 లక్షల మంది డ్రీమర్స్ వర్క్ పర్మిట్స్ రద్దు కానుందని అంచనా.