స్క్రాప్ దుకాణంలో అగ్నిప్రమాదం | Fire accident occur at scrap shop in shabad | Sakshi
Sakshi News home page

స్క్రాప్ దుకాణంలో అగ్నిప్రమాదం

Published Tue, Dec 31 2013 10:38 AM | Last Updated on Sat, Sep 15 2018 8:11 PM

Fire accident occur at scrap shop in shabad

రంగారెడ్డి జిల్లా షాబాద్లోని పాత స్క్రాప్ దుకాణంలో మంగళవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దాంతో స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఎగసిపడుతున్న అగ్నికీలలను అదుపులోకి తీసుకువచ్చారు.

 

స్క్రాప్ దుకాణం నుంచి దాదాపు తొమ్మిది సిలండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అగ్ని ప్రమాదంలో సిలండర్లు కూడా పేలి ఉంటే పెద్ద ప్రమాదం సంభవించి ఉండేదని పోలీసులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆ ప్రమాదం చోటు చేసుకుందని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement