shabad
-
తెలంగాణను ఉద్దరించలేనోడు.. ఢిల్లీని ఉద్దరిస్తాడా?: కేటీఆర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘‘రేవంత్‌రెడ్డి( Revanth Reddy) ఢిల్లీని ఉద్దరిస్తానంటున్నారు.. తెలంగాణను ఉద్దరించలేనోడు ఢిల్లీని ఉద్దరిస్తాడా?’’ అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో బీఆర్ఎస్ రైతు దీక్ష(BRS Rythu Diksha)లో ఆయన మాట్లాడుతూ.. వంద రోజుల్లోనే హామీలన్నీ నెరవేర్చామని ఢిల్లీలో సీఎం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.‘‘ప్రతీ ఎకరాకు రూ.15 వేలు రైతు భరోసా ఇవ్వాలి. తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేయలేదు. రేవంత్‌రెడ్డి ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు చెబుతున్నారు. రైతులను సీఎం రేవంత్ మోసం చేశారు. కొండారెడ్డి పల్లె, కొడంగల్‌లో ఒక్క ఊర్లో అయినా పూర్తి స్థాయి రైతు రుణమాఫీ అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా’’ అని సవాల్ విసిరారు.‘‘ఒక్క ఊర్లో అయినా 100 శాతం రుణమాఫీ అయ్యిందని.. రైతులు చెబితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామా చేయిస్తా. మళ్ళీ ఓట్లకు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు.. గళ్ళ పట్టుకొని రైతు రుణమాఫీ, రైతు భరోసా డబ్బులు ఎక్కడని అడగండి’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: అఫ్జల్‌గంజ్ టూ ట్యాంక్‌బండ్ అలర్ట్.. బీదర్ ముఠా ఎక్కడ? -
వేగంగా యూ టర్న్.. లారీని ఢీకొట్టి ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఎంత మొత్తుకున్నా వాహనదారుల్లో అసలు ఏమాత్రం మార్పు రావడం లేదు. జరిమానాలు విధించినా.. కట్టేందుకైనా సిద్ధపడుతున్నారే తప్ప హెల్మెట్ ధరించడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ మానుకోవడం, సిగ్నల్ జంప్ చేయకుండా ఉండటంలేదు. కనీస ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ వ్యక్తి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో షాబాద్‌లోని నాగర్‌గూడ కూడలి వద్ద వేగంగా బైక్ నడిపి యూ టర్న్ తీసుకున్నాడు. దీంతో రోడ్డుపై అంతే వేగంగా వస్తున్న లారీని ఢికోట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్లో షేర్ చేశారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కూడళ్ల వద్ద ఎటువంటి నిబంధనలు పాటిస్తూ.. జాగ్రత్తలు తీసుకోవాలో చూచించారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చూచించిన నిబంధనలు ఇవే.. ► ఎదురుగా ఎలాంటి వాహనాలు రానప్పుడు మాత్రమే యూటర్న్ లేదా రైట్ టర్న్ తీసుకోవాలి. ► ఎదురుగా ఎలాంటి వాహనాలు లేకపోయిన కూడలి వద్ద ఆగి ఇరువైపుల చూసి టర్న్ తీసుకోవాలి. ► ముఖ్యంగా గ్రామాలలో, కూడళ్ల వద్ద వేగంగా వాహనాలు నడపకండి. ► పిలియన్ రైడర్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. ➡️ఎదురుగా ఎలాంటి వాహనాలు రానప్పుడు మాత్రమే యూటర్న్ లేదా రైట్ టర్న్ తీసుకోవాలి. ➡️ఎదురుగా ఎలాంటి వాహనాలు లేకపోయిన కూడలి వద్ద ఆగి ఇరువైపుల చూసి టర్న్ తీసుకోండి. ➡️గ్రామాలలో,కూడళ్ల వద్ద వేగంగా నడపకండి. ➡️పిలియన్ రైడర్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. Location: Nagarguda, Shabad pic.twitter.com/nPNrjDkWFQ — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) May 21, 2021 చదవండి: జెర్సీకి విషెస్ చెప్తూనే సెటైర్ వేసిన పోలీసులు! -
దేవినేని ఉమకు షాకిచ్చిన జక్కంపూడి గ్రామస్తులు..
సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి దేవినేని ఉమకు జక్కంపూడి - షాబాద్ గ్రామస్తులు షాకిచ్చారు. ఎప్పటిలానే మాజీ మంత్రి ఉమ తనదైన శైలిలో నలుగురిని వెంటేసుకొని గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా ఉన్న ఇళ్ల వద్ద ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో గ్రామస్తులు అక్కడకు చేరుకొని మాజీ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల ఎదురుతిరిగి ప్రశ్నించడంతో దేవినేని ఉమ, అతని అనుచరులు అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు. (ఏబీ వెంకటేశ్వరరావు కేసులో కీలక పరిణామం) ఈ సందర్భంగా గ్రామస్తులు.. మా పేదల దగ్గర నుండి భూములు తీసుకున్న మీరు మాకు ఇళ్లు ఇవ్వకుండా ఎక్కడో విజయవాడలో ఉండే వాళ్ళకు ఎందుకు ఇచ్చారు..?. మాకు న్యాయం చేస్తామని చెప్పి మాటిచ్చి భూములు తీసుకుని మమ్మల్ని మోసం చేశారంటూ స్థానికులు ఎదురుతిరగి ప్రశ్నించడంతో మాజీ మంత్రి అక్కడ నుండి తోకముడిచి పారిపోయారు. -
శంకరయ్య బాగోతాలు బట్టబయలు
-
శంకరయ్య బాగోతాలు బట్టబయలు
సాక్షి, హైదరాబాద్: షాబాద్ సీఐ శంకరయ్య ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాల్లో కీలక సమాచారం వెల్లడవుతోంది. ఇప్పటికే సోదాల్లో భారీ స్థాయిలో కూడబెట్టిన ఆస్తులను అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో నిందితుడు రాకేష్‌రెడ్డితోనూ శంకరయ్యకు సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో దుండిగల్ సీఐగా పనిచేస్తున్న సమయంలో శంకరయ్యకు రాకేశ్‌రెడ్డితో పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి వారి మధ్య లావాదేవీలు కొనసాగుతున్నట్టు తెలిసింది. ఇక జయరాం, శిఖ చౌదరీల కాల్ డేటాను సీఐ శంకరయ్య ద్వారా రాకేష్‌రెడ్డి రాబట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. శంకరయ్య ఇలా దొరికిపోయారు షాబాద్ సీఐగా పని చేస్టున్న శంకరయ్య జయరాంరెడ్డి అనే వ్యక్తి వద్ద రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు. ఏసీబీ అధికారులు అతని నివాసాల్లో సోదాలు చేపట్టడంతో విస్మయకర విషయాలు తెలుస్తున్నాయి. ఇక శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. శంకరయ్య అతని బందువుల ఇళ్లలో కొనసాగిన ఏసీబీ సోదాల్లో ఈ ఆస్తులను గుర్తించారు. ఒక కోటి 5 లక్షల విలువ చేసే రెండు ఇళ్లు రెండు కోట్ల 28 లక్షల విలువచేసే 11 ఇంటి ప్లాట్స్. 77 లక్షల విలువచేసే 41 ఎకరాల 3 గుంటల వ్యవసాయ భూమి నిజామాద్, చేవెళ్ల, మిర్యాల గూడలో ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 7 లక్షల విలువ చేసే మారుతి స్విప్ట్ కారు. 21 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు 17 లక్షల 88 వేల నగదు 6 లక్షల విలువ చేసే ఇతర వస్తువులు 81 వేల వెండి వస్తువులను ఏసీబీ అధికారులు గుర్తించారు. -
సీఐ శంకరయ్య ఇంట్లో విస్తుపోయే ఆస్తులు
సాక్షి, హైదరాబాద్: షాబాద్ సీఐ బి. శంకరయ్య ఇంట్లో సోదాలు చేసిన ఏసీపీ అధికారాలు విస్తుపోయే విషయాలను బయటపెట్టారు. శంకరయ్య బినామీల పేరుతో భారీగా ఆస్తుల కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. భూ తగాదా కేసులో రూ.లక్షా 20వేలు లంచం తీసుకుంటూ సీఐ శంకరయ్య పట్టుబడిన విషయం తెలిసిందే. రెవెన్యూ విలువ లెక్కల ప్రకారం రూ.4.58 కోట్ల ఆస్తులుగా గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇక బహిరంగ మార్కెట్లో రూ.10కోట్లకు పైనే ఆస్తుల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో రూ.కోటి ఐదు లక్షలు విలువ చేసే రెండు నివాసాలు ఉన్నట్లు తెలిపారు. రూ.2 కోట్ల 25 లక్షల విలువ చేసే 11 ప్లాట్ల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దాంతో పాటు నిజామాబాద్, చేవెళ్ల, మిర్యాలగూడలో 41 ఎకరాల వ్యవసాయ భూమి, కారు ఉన్నాయని తెలిపారు. రూ. 22 లక్షలు విలువ చేసే బంగారం, నగలు, రూ.17 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారలు పేర్కొన్నారు. అనంతరం శంకరయ్యకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టినట్లు అధికారులు చెప్పారు. శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్‌లకు రిమాండ్ విధిస్తూ, చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. -
శంకరయ్య ఇంట్లో సోదాలు.. భారీగా ఆస్తులు
సాక్షి, హైదరాబాద్: భూతగాదా కేసులో లక్షా 20వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన షాబాద్ సీఐ శంకరయ్య ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. గురువారం మధ్యాహ్నం నుంచి జరిపిన సోదాల్లో భారీగా ఆస్తులను గుర్తించినట్లు శుక్రవారం రోజున ఏసీబీ అధికారులు వెల్లడించారు. రూ. 4కోట్ల విలువైన ఆస్తులను గుర్తించడంతో పాటు, విలువైన ఆస్తులకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా.. ఇప్పటికే సీఐ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్‌లకు ఏసీబీ కరోనా పరీక్షలు నిర్వహించింది. అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం సీఐ, ఏఎస్ఐలను ఏసీబీ న్యాయమూర్తి ఎదుట ఏసీబీ అధికారులు ప్రవేశపెట్టారు. ఏసీబీ న్యాయమూర్తి షాబాద్ సీఐ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్‌లకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో వీరిద్దరిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. చదవండి: ఏసీబీ వలలో సీఐ, ఏఎస్ఐ -
లంచం కేసు.. సీఐ శంకరయ్య అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: షాబాద్ సీఐ శంకరయ్యను శుక్రవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. భూ కేసు వివాదంలో లక్షా 20 వేలు లంచం తీసుకుంటూ ఇన్స్పెక్టర్ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన విషయం తెలిసిందే. నిన్నటి నుంచి శంకరయ్య ఇంటిలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన ఇంటిలో భారీగా నగదు, నగలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంకరయ్యను ఈ రోజు సాయంత్రం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు.శంకరయ్యతో పాటు ఏఎస్ఐ రాజేందర్‌ను ఏసీబీ అరెస్ట్ చేసింది. (ఏసీబీ వలలో సీఐ, ఏఎస్ఐ) -
బీజేపీకి పూర్వవైభవం తీసుకొస్తాం
షాబాద్(చేవెళ్ల): షాబాద్ మండలంలో బీజేపీకి పూర్వవైభవం తీసుకొస్తామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘనందన్‌రావు అన్నారు. ఆదివారం షాబాద్‌లో వివిధ పార్టీల నాయకులు, వివిధ గ్రామాలకు చెందిన యువకులు బీజేపీ చేరారు. వారికి రఘనందన్‌రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్రంలో రోజురోజు బలపడుతూ టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని అన్నారు. పార్టీకి కార్యకర్తలే అధిష్టానమని కార్యకర్తల బలమే బీజేపీ బలమన్నారు. నగరానికి ఇంత సమీపంలో ఉన్న మండలంలో కనీస వైద్య సదుపాయాలు, ఉన్నత విద్యనభ్యసించేందుకు కళాశాలలు లేకపోవడం బాధాకరమని అన్నారు. ఈ ప్రాంతానికి చెందిన నాయకులు గత మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించినా, ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాష్, మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, నాయకులు జంగారెడ్డి, రవీందర్‌రెడ్డి, రాము, కిరణ్, రాజేందర్‌రెడ్డి, మాణయ్య, నవీన్, విష్ణు, రవీందర్‌గౌడ్, ప్రవీణ్‌కుమార్, నరేందర్‌రెడ్డి, రంగయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
పాయా.. ఖాయా!
ప్రపంచంలోనే హైదరాబాద్ ఎన్నో రుచికరమైన వంటకాలకు ప్రసిద్ధి. ఇక్కడ తయారయ్యే రకరకాల వంటకాలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. గతంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పాలకులు తమ వంటశాలల్లోని మొగలాయి, దక్కన్, ఇరానీ, అరేబియన్, పర్షియన్, యూరోపియన్ రుచులకు ఫిదా అయ్యేవారు. చలికాలం వంటకాల్లో ప్రత్యేకమైనవి నహారీ, మరగ్, శేర్వాలు. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా వీటిలో ఎన్నో ఔషధ గుణాలు సైతం ఉన్నాయి.శీతాకాలం వచ్చిందంటే చాలు పాతబస్తీలోని పలు హోటళ్లలో పాయా, జబాన్, జబడా (తలకాయ కూర)నోరూరిస్తుంటాయి. పాయా, నహారీ, మరగ్, శేర్వాల తయారీ విధానం, వాటి ప్రత్యేకతలపై కథనం. సాక్షి, సిటీబ్యూరో :పాయా శేర్వా, జబాన్, జబడా శరీరానికి వేచ్చదనాన్నిఇస్తాయి. ప్రత్యేకంగా పాయా, మరగ్‌లను అనేక సుగంధ ద్రవ్యాలు, మసాలాలతో తయారు చేస్తారు. దీంతో పాటు ప్రధానంగా మేక పొట్టేలు కాళ్లు , నాలుక, తలకాయ నహారీ, మరగ్ శేర్వాలో వినియోగిస్తారు. ప్రస్తుతం నగరంలోని దాదాపు అన్ని ప్రధాన హోటళ్లలో ఏడాది పొడవునా ఉదయం, సాయంత్రం వేళల్లో నహారీ శేర్వా అందుబాటులో ఉంటోంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం కేవలం చలికాలంలోనే శేర్వా తయారు చేస్తున్నారు. నాడు పేదల వంటకం నగరం ఏర్పాటు తొలినాళ్లలో నహారీ శేర్వా ఎక్కువ శాతంపేదల వంటకం. ఉదయం వేళల్లో కార్మికులు, కిందిస్థాయి ఉద్యోగులు దీనిని తినేవారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో వంటలపై అనుభవం ఉన్న వ్యక్తులు ఉదయం, సాయంత్రం వేళల్లో నహారీ శేర్వా తయారు చేసి విక్రయించే వారు. ప్రజలు పాత్రలు తీసుకొని వచ్చి నహారీ శేర్వా తీసుకెళ్లి ఇళ్లలో తినేవారు. నహారీ శేర్వా ఒకచోట, కుల్చా (నహారీతో తినే రొట్టె) మరోచోట లభించేవి. నిజాం కాలంలో పాతబస్తీలోని మదీనా చౌరస్తాలో ఉన్న హోటళ్లతో పాటు ఖిల్వత్, షేయరాన్ తదితర ప్రాంతాల్లో నçహారీ శేర్వా హోటళ్లు వెలిశాయి. నహారీ శేర్వా తయారీ ఇలా.. మొదట మేక లేదా పొట్టేలు కాళ్లు, తలకాయ, నాలుకను కొన్ని నీళ్లలో నహారీ, మరగ్ మసాలా (పొటిలికా మసాలా, నహారీ మసాలా)తో వేడి చేసి ఉడకబెడతారు. అవి మెత్తబడే వరకు ఉడికిస్తారు. అలాగే జైఫల్, జోత్రి, గరం మసాలాతో పాటు పలు సుగంధ ద్రవ్యాలు, మసాలాలు వేసి పాయా, జబడా, జబాన్ శేర్వా (సూప్) తయారు చేస్తారు. దీని తయారీకి సుమారు 6 గంటల సమయం పడుతుంది. నహారీ, మరగ్ తయారీలో లవంగాలు, సాజీరా, మిరియాలు, దాల్చిన చెక్క, ఇలాచీ, సుగంధ ఆకులతో పాటు పాలు నెయ్యి ఉపయోగిస్తారు. వీటితో పాటు మరిన్ని సుగంధ ద్రవ్యాలను కలిపి పాయా, మరగ్ శేర్వా తయారు చేస్తారు. ధరలు ఇలా.. పాయా, మరగ్, శేర్వాతో పాటు కుల్చా, తందూరీ, నాన్ రొట్టెలు జత కలిస్తే పాయా, మరగ్ ప్రియులకు భలే మజా ఉంటుంది. పాయా శేర్వా నహారీ రూ 40., మరగ్ సూప్ రూ. 45. పాయా బొక్కలు రూ.80, చికెన్ ముక్కలతో నహారీ రూ. 80, జబాన్ రూ.80, జబడా రూ.100, నాన్ రొట్టె రూ 12, తందూరీ రొట్టె రూ.12. ప్రతీ శనివారం చికెన్ నహారీ ప్రత్యేకం.. నిజాంల కాలం నుంచి మదీనా సర్కిల్లో నహారీ, పాయా, శేర్వా అందుబాటులో ఉన్నాయి. గతంలో కేవలం నహారీ, పాయా మాత్రమే విక్రయించేవారు. ప్రస్తుతం జబాన్, జబడాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మా హోటల్లో ఐదేళ్లుగా మరగ్‌ను అందిస్తున్నాం. ప్రతి శనివారం చికెన్‌తో తయారు చేసిన నహారీ కూడా తయారు చేస్తున్నాం. నేటి తరానికి అంతగా ఘాటు లేని మరగ్‌ను కూడా మా హోటల్లో అందుబాటులో ఉంచాం – ఉమర్ ఆదిల్,షాదాబ్ హోటల్ యజమాని -
16న షాబాద్‌లో డాక్టర్ ఖాదర్ ప్రసంగం
అటవీ కృషి నిపుణులు, ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార–ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి ఈ నెల 16(ఆదివారం)న రంగారెడ్డి జిల్లా షాబాద్‌లోని ధ్యానహిత హైస్కూల్ ఆవరణలో జరిగే సదస్సులో ప్రసంగిస్తారు. ఉ. 9.30 గం. నుంచి మ. 1 గం. వరకు సదస్సు జరుగుతుందని ధ్యానహిత సొసైటీ డైరెక్టర్ డా. ఎన్. శైలజ తెలిపారు. అటవీ చైతన్య ద్రావణంతో మెట్ట భూముల్లో కొర్రలు, అరికలు వంటి సిరిధాన్యాలను వర్షాధారంగా రసాయనాలు వాడకుండా సహజ పద్ధతిలో సాగు చేసుకునే పద్ధతులు.. సిరిధాన్యాలను రోజువారీ ప్రధానాహారంగా తింటూ షుగర్, ఊబకాయం, రక్తహీనత, కేన్సర్ తదితర ఏ జబ్బులనైనా పూర్తిగా తగ్గించుకునే పద్ధతులను డా. ఖాదర్ వివరిస్తారు. అనంతరం ప్రశ్నలకు బదులిస్తారు. 16వ తేదీ సా. 6 గం.లకు డా. ఖాదర్ ధ్యానహిత స్కూల్ ఆవరణలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు. రైతులు, మహిళలు, పురుషులు, యువతీయువకులు ఎవరైనా పాల్గొనవచ్చు. ప్రవేశం ఉచితం. డా. ఖాదర్ తయారు చేసిన అటవీ చైతన్య ద్రావణాన్ని 300 మంది రైతులకు ఈ సందర్భంగా ఉచితంగా పంపిణీ చేస్తారని డా. శైలజ వివరించారు. మిక్సీతో సిరిధాన్యాల బియ్యం తయారీపై శిక్షణ కొర్రలు తదితర సిరిధాన్యాలను నూర్చిన తర్వాత మిక్సీతో సులువుగా పొట్టు తీసే పద్ధతిపై 16వ తేదీ సా. 3–5 గం.ల మధ్య రంగారెడ్డి జిల్లా షాబాద్‌లోని ధ్యానహిత హైస్కూల్ ఆవరణలో డా. ఖాదర్, బాలన్ కృష్ణ రైతులు, మహిళా రైతులు, గృహిణులకు ఆచరణాత్మక శిక్షణ ఇస్తారు. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 86398 96343, 94406 65151. -
షాబాద్‌లో ‘తెలంగాణ దేవుడు’ సందడి
షాబాద్(చేవెళ్ల) : షాబాద్ మండలంలో తెలంగాణ దేవుడు సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మ్యాక్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మాతగా, హరీష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ షాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామంలో జరుగుతోంది. 1969 నుంచి 2018 వరకు తెలంగాణ చరిత్రే సినిమా కథ. ఇందులో ప్రొఫెసర్ జయశంకర్‌సార్ పాత్రలో సినీ హీరో సుమన్, చిన్నతనంలో ఉద్యమ నాయకుడు కేసీఆర్ పాత్రలో నిర్మాత కుమారుడు జీషాన్ ఉస్మాన్ నటిస్తున్నారు. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం, ప్రొఫెసర్ జయశంకర్ సార్, కేసీఆర్ పాత్రలు ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించేలా చిత్ర నిర్మాణం జరుగుతోందని నిర్మాత చెప్పారు. పోతుగల్ గ్రామంలో, ప్రభుత్వం పాఠశాలలో, గిరిజన తండాలో పలు సన్నివేశాలను చిత్రీకరిస్తామన్నారు. తెలంగాణ దేవుడు సినిమా షూటింగ్ స్పాట్‌ను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, టీఆర్ఎస్ జిల్లా యూత్ అధ్యక్షుడు పట్నం అవినాష్‌రెడ్డిలు సందర్శించారు. సినిమా విశేషాలను హీరో సుమన్, చిత్రయూనిట్‌ను అడిగి తెలుసుకున్నారు. -
రెతుబంధు చెక్కును తిరిగి ఇచ్చిన తనికెళ్ల భరణి
షాబాద్(చేవెళ్ల) : సిటీ నటుడు తనికెళ్ల భరణి తనకు వచ్చిన రైతుబంధు చెక్కను తిరిగి అధికారులకు అందజేశారు. షాబాద్ మండలంలోని చిన్నసోలిపేట్ గ్రామంలో ఆయనకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. దానికి సంబంధించి రైతుబంధు పథకం ద్వారా రూ.10 వేల చెక్కు వచ్చింది. ఆ చెక్కును బుధవారం తహసీల్ధార్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ పద్మావతి అందజేశారు. ఆ చెక్కను తనికెళ్ల భరణి తిరిగి అధికారులకు అందజేశారు. ఆ మొత్తాన్ని రాష్ట్ర రైతునిధికి జమచేయాలని సూచించారు. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆర్ధిక వెసులుబాటు కలిగిన వారందరు ఉదారంగా సాగుపెట్టుబడి చెక్కులను తిరిగి రాష్ట్ర రైతుసంఘం నిధికి ఇవ్వాలని కోరారు. -
షాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత
షాబాద్ : రంగారెడ్డి జిల్లా షాబాద్‌ను కొత్తగా ఏర్పాటయ్యే శంషాబాద్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున ఆందోళన కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచి ముంబై-బెంగళూరు లింక్ జాతీయరహదారిపై అఖిలపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో జరుగుతోంది. ఆందోళన కారణంగా రెండు వైపులా 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఎంత నచ్చజెప్పినా ఆందోళన కారులు వెనక్కి తగ్గలేదు. దీంతో సాయంత్రం 4 గంటల సమయంలో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఆందోళనలో బీసీ సంఘం రాష్ట్ర నేత కృష్ణ యాదవ్, అఖిలపక్షాల నేతలు రవీందర్‌రెడ్డి, శివకుమార్, గంగయ్య, నర్సింహగౌడ్, నారాయణ, మేకల నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
షాబాద్‌లో బాలుడికి డెంగీ
షాబాద్: డెంగీ సోకి ఓ బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మండలంలోని కేశవగూడ గ్రామానికి చెందిన ఒగ్గు రాజయ్య కుమారుడు తరుణ్‌కుమార్(15) నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం బాలుడిని తండ్రి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్సలు నిర్వహించిన వైద్యులు తరుణ్‌కుమార్‌కు డెంగీతో బాధపడుతున్నట్లు నిర్దారించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు గురువారం అక్కడి నుంచి నగరంలోని మలక్‌పేట్‌లో ఉన్న ఓ ప్రైవేటుకు ఆస్పత్రికి తరలించారు. -
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
షాబాద్ (రంగారెడ్డి) : దుస్తులు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో ఒక యువకుడు మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తాళ్లపల్లిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చాకలి నర్సింహులు(25) మంగళవారం ఇంటి వద్ద తీగపై దుస్తులు ఆరేస్తుండగా షాక్‌కు గురై మృతి చెందాడు. అతనికి భార్య, ఆరు నెలల కుమారుడు ఉన్నారు. కాగా నర్సింహులు మృతదేహంతో గ్రామస్తులు స్థానిక విద్యుత్ ఉపకేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. అతని మృతికి అధికారులే కారణమని ఆరోపించారు. గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సమస్య ఉందని తాము ఎన్నిసార్లు చెప్పినా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
ముళ్ల పొదల్లో పసిపాప..
షాబాద్ (రంగారెడ్డి) : రెండు రోజుల క్రితం పుట్టిన ఓ చిన్నారిని ముళ్లపొదల్లో వదలి వెళ్లిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ ఫైల్వాన్ షాహి దర్గా దగ్గర గురువారం జరిగింది. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన పసిబిడ్డను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దర్గా దగ్గర ఉన్న పొదల్లో వదలి వెళ్లారు. తల్లి కోసం గుక్కపెట్టి ఏడుస్తున్న రెండు రోజుల చిన్నారిని అటుగా వెళుతున్న అజీజ్ అనే వ్యక్తి గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఐటీడీసీ అధికారులతో సంఘటన స్థలానికి చేరుకుని పాపను రక్షించారు. చికిత్స కోసం నీలోఫర్ అసుపత్రికి తరలించారు. పాప ఆరోగ్యంగా ఉంది. చికిత్స అనంతరం అధికారులు శిశువిహార్‌కి తరలించనున్నారు. -
పట్నం మల్లారెడ్డికి కన్నీటి వీడ్కోలు
షాబాద్: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తండ్రి మల్లారెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం గోల్లూరుగూడలో శుక్రవారం జరిగాయి. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. మల్లారెడ్డి మనవడు, టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అవినాష్‌రెడ్డి ఆయనకు దహన సం స్కారాలు నిర్వహించారు. అంత్యక్రియల్లో ఉపముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, శ్రీనివాస్‌యాదవ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రులు సబితారెడ్డి, ప్రసాద్‌కుమార్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, సంజీవరావు, టీఆర్ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యుడు హరీశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేఎస్ రత్నం, ప్రతాప్‌రెడ్డి హాజరయ్యారు. -
చెరువుల పునరుద్ధరణతో గ్రామాలు సస్యశ్యామలం
మంత్రి మహేందర్‌రెడ్డి షాబాద్: మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల పునరుద్ధరణతో గ్రామీణ ప్రాంతాలు సస్యశ్యామలమవుతాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని హైతాబాద్‌లో, లక్ష్మరావుగూడ సంగయ్య కుంటలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డిలతో కలిసి ఆయన మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులతో భూగర్భజలాలు అడుగంటి వ్యవసాయం కుంటుపడుతున్న ప్రస్తుత తరుణంలో చెరువులను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత ప్రభుత్వాలు పట్టించుకోని చెరువులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. చెరువులను అభివృద్ధి చేస్తే వ్యవసాయ భూములు సారవంతమవుతాయని, భూగర్భజలాలు పెరిగి సాగు, తాగునీటి సమస్య తీరుతుందని చెప్పారు. వేసవిలో తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పట్నం అవినాష్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు జడల లక్ష్మి, ఎంపీపీ పట్నంశెట్టి జ్యోతి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
అతను ఉగ్రవాదే...
-
షార్ట్‌సర్క్యూట్‌తో కారు దగ్ధం
షాబాద్: రోడ్డుపై వెళ్తున్న ఓ కారు షార్ట్‌సర్క్యూట్‌తో కాలిపోయింది. ఈ సంఘటన మండల పరిధిలోని సీతారాంపూర్ సమీపంలో ఆదివారం రాత్రి 9 గంటల సమయ ంలో చోటుచేసుకుంది. వివరాలు.. చేవెళ్ల మండలం న్యాలట గ్రామానికి చెందిన నాగేశ్, అనిత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనిత సోదరులకు రాఖీలు కట్టేందుకు ఆదివారం కుటుంబ సమేతంగా మారుతీ 800 కారులో షాద్‌నగర్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో షాబాద్ మండలం సీతారంపూర్ సమీపంలో కారు ఇంజిన్‌లోంచి పొగలు వచ్చాయి. గమనించిన దంపతులు వెంటనే తమ పిల్లలతో కలిసి కిందికి దిగారు. క్షణాల్లోనే మంటలు వ్యాపించి కారు కాలిపోయింది. చేవెళ్ల నుంచి ఫైరింజన్ వచ్చి మంటలు ఆర్పింది. ఎస్ఐ చంద్రకాంత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వాగు దాటుతున్న ఇసుక!
చేవెళ్ల/మొయినాబాద్ రూరల్: చేవెళ్ల డివిజన్ పరిధిలోని షాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్ మండలాల నుంచి ఈసీ, మూసీ వాగులు ప్రవహిస్తున్నాయి. హైదరాబాద్ నగర శివారులో ఉన్న హిమాయత్‌సాగర్, గండిపేటల్లోకి నీరు చేరుతుంది. వర్షాలు కురిసి వాగులు ప్రవహించినప్పుడు ఇసుక కూడా భారీగా వచ్చి చేరుతుంటుంది. ఇసుక అధికంగా ఉన్నచోట భూగర్భజలాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వర్షాకాలంలో మూసీ, ఈసీ వాగులు నాలుగైదు సార్లు నిండుగా ప్రవహిస్తే వేసవిలో ఆయా ప్రాంతాల్లో ఉన్న బోర్లు, బావుల్లో నీరు పుష్కలంగా ఉంటుంది. సాగుతాగు నీటికి ఇబ్బంది ఉండదు. కాగా.. కొందరు అక్రమార్కులు ఈసీ, మూసీ వాగుల నుంచి తమ ఇష్టారాజ్యంగా ఇసుక తరలిస్తున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్లు, లారీల ద్వారా ఇసుకను వాగు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక తరలింపుతో వాగుల్లో గుంతలు ఏర్పడి వర్షం కురిసినప్పుడు భూగర్భంలోకి నీరు ఇంకకుండా దిగువకు ప్రవహిస్తుంటుంది. అక్రమార్కుల ఇసుక వ్యాపారంతో జలసిరి పాతాళంలోకి పోతోంది. సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు.. ఈసీ, మూసీ వాగులు ప్రవహిస్తున్న షాబాద్ మండలంలోని నాగరగూడ, రుద్రారం, తాళ్లపల్లి, మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, అమ్డాపూర్, చిన్నమంగళారం, వెంకటాపూర్, అప్పోజీగూడ, మోత్కుపల్లి, శంకర్పల్లి మండలంలోని రావులపల్లి, పొద్దటూరు, ఫత్తేపూర్, మోకిల, టంగటూరు, గోపులారం, ఎల్వర్తి, జన్వాడ, తదితర గ్రామాల సమీపంలోంచి అక్రమార్కులు ఇసుక తరలిస్తున్నారు. నిత్యం ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.1800-2200 వరకు దండుకుంటున్నారు. వాగుల్లో ప్రవాహం లేనప్పుడు అక్రమార్కులు ఇసుకను తరలించి డంప్ చేసుకుంటున్నారు. అక్రమార్కుల భరతం పట్టాల్సిన రెవెన్యూ, పోలీసు అధికారులు చేష్టలుడిగి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆయా అధికారులు కళ్లు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాల్టా చట్టానికి తూట్లు.. ఇసుకను అక్రమంగా తరలిస్తే అక్రమార్కులపై కఠినచర్యలు తీసుకోవాలని వాల్టా చట్టం చెబుతోంది. ప్రభుత్వ అవసరాలకు మాత్రం సంబంధిత అధికారుల అనుమతి తీసుకొని ఇసుక తరలించుకోవచ్చు. దీంతోపాటు గతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అధికారులు పర్మిట్లు జారీచేశారు. ఇదే అదనుగా అక్రమార్కులు అవసరానికి మించి ఇసుకను తరలించి డంప్ చేసుకున్నారు. -
కాలక్షేపానికి వస్తున్నారా?
షాబాద్: పేదలకు వైద్యం చేయకుండా టైంపాస్ చేస్తున్నారా.. ఏమడిగినా సమాధానం చెప్పడం లేదు.. ఇంతకూ మీరు డాక్టర్లేనా .. మీ పనితీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానంటూ చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పీహెచ్సీ వైద్యురాలు కరీమున్నిసా బేగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన షాబాద్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆస్పత్రి ఆవరణ అంతా అపరిశుభ్రంగా ఉండడం, దుర్వాసన వెదజల్లుతుండడంతో ఎమ్మెల్యే మండిపడ్డారు. మీ ఇల్లయితే ఇలాగే ఉంచుకుంటారా.. ఆస్పత్రిని శుభ్రం చేయించడం తె లియదా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆస్పత్రిలో స్టాఫ్ సక్రమంగా లేరని.. తాను ఒక్కదాన్నే ఏం చేయాలని వైద్యురాలు కరీమున్నిసా బేగం సమాధానమిచ్చారు. దీంతో ఆయన మీపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. వైద్యులు సమయపాలన పాటించడం లేదని రోగులు ఆయనకు మొరపెట్టుకున్నారు. వారానికి నాలుగు రోజులు మాత్రమే వస్తారని, 11 గంటలకు వచ్చి ఒంటిగంటకే వెళ్లిపోతారని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే ఆస్పత్రిలో సిబ్బందిని నియమించేలా చూస్తానని తెలిపారు. గ్రామాల్లో సబ్‌సెంటర్లు సక్రమంగా నడుస్తున్నాయా అని సూపర్వైజర్ను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి మెయింటెనెన్స్ డబ్బులను ఏం చేశారని ప్రశ్నించారు. ఎవరైనా ప్రమాదంలో చనిపోతే పోస్టుమార్టం కోసం చేవెళ్ల ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఉందని, షాబాద్‌లోనే పోస్టుమార్టం చేసేలా చూడాలని గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు. ఏడేళ్ల క్రితం లక్షలాది రూపాయాలతో నిర్మించిన ఆస్పత్రి భవనం ప్రారంభానికి నోచుకోలేదని చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే భవనం అసంపూర్తిగా పడి ఉందన్నారు. రాత్రిపూట రోడ్డు ప్రమాదాలు జరిగితే ఆస్పత్రికి వస్తే ఒక్కరు కూడా ఉండడంలేదని, 24గంటలు ఆస్పత్రిలో వైద్యసిబ్బంది ఉండేలా చూడాలని ఎమ్మెల్యేను కోరారు. ఆయన వెంట బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్, వైస్ ఎంపీపీ శివకుమార్, నాయకులు జంగయ్య, సత్యనారాయణ తది తరులున్నారు. -
కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పండి
చేవెళ్ల లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి షాబాద్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని చేవెళ్ల పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని నాగరగూడ, షాబాద్, కక్కులూర్, హైతాబాద్, మద్దూర్ తదితర గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్న హోంమంత్రి స్థానంలో ఉండి కూడా సబితారెడ్డి పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు తన కుమారుడు కార్తీక్‌రెడ్డిని ఎంపీగా గెలిపించడంటూ ప్రజల వద్దకు ఆమె వస్తున్నారని ఎద్దేవ చేశారు. బీజేపీకి ఓటేస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నించిన చంద్రబాబుకు వేసినట్లేనని చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 111జీఓను ఎత్తివేస్తామని, ఫిరంగి నాలాను పునరుద్ధరించి ఇబ్రహీంపట్నం వరకు తాగు, సాగు నీరు అందజేస్తామని చెప్పారు. జూరాల నుంచి జిల్లాకు నీటిని తీసుకువస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కడ్మూర్ ఆనందం, మద్దూర్ మల్లేశ్, శ్రీనివాస్‌గౌడ్, రాజేందర్‌గౌడ్, ఈదుల నర్సింలుగౌడ్, మహేందర్‌గౌడ్, వెంకటయ్య, జీవన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్రీరాంరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, దర్శన్, గోపాల్‌రెడ్డి, రాఘవరెడ్డి, కుమ్మరి దర్శన్, మల్లిఖార్జున్ తదితరులున్నారు. నాగరగూడలో పోటాపోటీ ప్రచారం మండల పరిధిలోని నాగరగూడలో శనివారం ఉదయం టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, చేవెళ్ల ఇండిపెండెంట్ అభ్యర్థి దేశమళ్ల ఆంజనేయులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. ముందుగా అక్కడికి చేరుకున్న విశ్వేశ్వర్‌రెడ్డి ప్రచారం సాగిస్తుండగానే ఆంజనేయులు కూడా వచ్చి ప్రచారం చేశారు. -
ప్రభుత్వ అసమర్థత వల్లే విద్యుత్ ‘కట్’కటలు
షాబాద్, న్యూస్‌లైన్: దివంగత మహానేత వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ రాచమల్ల సిద్ధేశ్వర్ అన్నారు. మండలంలోని సోలీపేట్ గ్రామంలో శుక్రవారం గడప గడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో పార్టీ జెండాను ఎగురవేశారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెంటు కోతలతో రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పి కనీసం మూడు గంటలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలను పూర్తిగా విస్మరించిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఏండీ ఖాజాపాషా, వెంకటేశ్‌గౌడ్, మద్దూర్ మాజీ సర్పంచ్ రెడ్యానాయక్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు. గ్రామకమిటీ ఎన్నిక సోలీపేట వైఎస్సార్ సీపీ మండల కార్యద ర్శిగా జోన్నగారి దేవేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా గొల్లపల్లి దేవేందర్‌రెడ్డి, కార్యదర్శులుగా రాములు, రాంరెడ్డి, సంయుక్త కార్యదర్శిగా కోటేశ్వర్‌రెడ్డి, జంగయ్య, కోషాధికారిగా హరికిషన్‌రెడ్డి, సభ్యులుగా కృష్ణ, ఆంజనేయులు, రంగయ్య, మహేందర్, నవీన్, యాదయ్య ఎన్నికయ్యారు.