రెండో రోజూ మండల పరిధిలోని సర్దార్‌నగర్‌లో ఉన్న పేపర్ మిల్లు ఎదుట గ్రామస్తులు బైఠాయించారు. కాలుష్యానికి కారణమవుతున్న కంపెనీని బంద్ చేయాలని డిమాండ్ చేశారు.
షాబాద్, న్యూస్‌లైన్: రెండో రోజూ మండల పరిధిలోని సర్దార్‌నగర్‌లో ఉన్న పేపర్ మిల్లు ఎదుట గ్రామస్తులు బైఠాయించారు. కాలుష్యానికి కారణమవుతున్న కంపెనీని బంద్ చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీ కాలుష్యం విషయమై చర్చించేందుకు ఆదివారం గ్రామ సర్పంచ్ నర్సింలు, వార్డు సభ్యులతో కలిసి పరిశ్రమ వద్దకు వెళ్లారు. సర్పంచ్‌తో పాటు గ్రామస్తులను కంపెనీ సిబ్బంది నెట్టివేయడంతో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే.
సోమవారం కూడా సర్పంచ్‌తో పాటు స్థానికులు కంపెనీ ఎదుట బైఠాయించారు. కంపెనీ మేనేజర్ నాగేశ్వర్‌రావు గ్రామ సర్పంచ్ నర్సింలుతో పాటు స్థానికులకు బహిరంగ క్షమాపణ చెప్పారు. తమ సెక్యురిటీకి సర్పంచ్ అని తెలియక తెలియక పొరపాటు జరిగిందని చెప్పారు. కంపెనీ నుంచి కాలుష్యం వెలువడకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు సర్పంచ్‌తో పాటు గ్రామస్తులు శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.