paper mill
-
రాజమండ్రి పేపర్ మిల్ లాకౌట్
-
మూడున్నరేళ్లుగా వేజ్ అగ్రిమెంట్ ప్రకటించలేదు: జక్కంపూడి
-
పేపర్ మిల్లు ఎదుట ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దీక్ష
సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్రా పేపర్ మిల్లులో పనిచేస్తున్న కార్మికులతో యాజమాన్యం ముందస్తుగా పదవీ విరమణ చేయిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. కార్మికులకు అందాల్సిన ప్రయోజనాలను అందనీయకుండా యాజమాన్యం, కార్మిక సంఘం నేతలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యంతో చర్చించడానికి సోమవారం ఉదయం 11 గంటల సమయంలో రాజమహేంద్రవరంలోని పేపర్ మిల్లు వద్దకు రాజా వెళ్లారు. అయితే యాజమాన్యం పట్టించుకోకపోవడంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ ఆందోళన నిర్వహించారు. అనంతరం కోటిలింగాలపేట పంప్‌హౌస్ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేత శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అదే సమయంలో కొందరు యువకులు పంప్‌హౌస్ పైకి ఎక్కి గోదావరిలో దూకేస్తామంటూ నినాదాలు చేయడంతో పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పంప్‌హౌస్ నుంచి తిరిగి పేపర్ మిల్లు గేటు వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే రాజా అక్కడే బైఠాయించి అర్ధరాత్రి కూడా నిరసన కొనసాగిస్తున్నారు. పేపరు మిల్లు యాజమాన్యం స్పష్టమైన హామీ ఇచ్చే వరకూ కదలబోమని స్పష్టం చేశారు. యాజమాన్య నిరంకుశ ధోరణికి నిరసనగా కార్మికులు సైతం సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా పని చేస్తున్న కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీయడానికి పేపర్ మిల్లు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయకృష్ణ, గుర్తింపు పొందిన కార్మిక సంఘం నేత పనిచేస్తున్నారని మండిపడ్డారు. మూడున్నరేళ్లుగా వేతన ఒప్పందం కుదరకపోవడంతో కార్మికులు నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లులో పనిచేస్తున్న సీనియర్ కార్మికులను బలవంతంగా వీఆర్ఎస్ పేరిట బయటకు పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. వారి స్థానంలో నైపుణ్యం లేని కొత్త యువకులను నియమించుకుంటున్నారని విమర్శించారు. -
వాటిని అమ్మిందెవరు? గొంతు నులిమిందెవరు?
సాక్షి, అమరావతి: ‘ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు రంగం స్వాధీనం చేసుకోవాలి. వాటిని కేవలం వాణిజ్య పరంగానే నడపాలి. ప్రభుత్వ పాత్రను పూర్తిగా తగ్గించి ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తాం. ప్రైవేటీకరణతోనే అభివృద్ధి సాధ్యం. ఇప్పటికే చాలా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించాం. రాబోయే కాలంలో దీన్ని ఇంకా ఉధృతంగా కొనసాగిస్తాం. ప్రైవేటీకరణే తారకమంత్రం. ప్రైవేటీకరణలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది..’ ఇదీ.. 2004లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన ‘ప్రైవైటైజేషన్– ఏ సక్సెస్ స్టోరీ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అనే పుస్తకంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రాసిన ముందుమాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1999–2004 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రైవేటీకరణపై తన కలలు, ఏంచేశాను, ఏంచేయాలనే అంశాలను ఆయన చాలా విపులంగా అందులో వివరించారు. ఆ ఐదేళ్లలో చంద్రబాబు ఆంధ్రా పేపర్ మిల్లు సహా అనేక షుగర్ ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్ మిల్లులు ప్రైవేటు పరం చేశారు. ఆల్విన్ వాచ్ సహా అనేక సంస్థల్ని మూసివేశారు. మరెన్నో సంస్థలను నిర్వీర్యం చేసేశారు. అమ్మకానికి ముద్దుపేరు సంస్కరణలు ప్రభుత్వ రంగాన్ని నాశనం చేసే కార్యక్రమానికి ఆయన ముద్దుగా సంస్కరణలు (ఏపీ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ రిఫామ్స్) అనే పేరు పెట్టారు. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల్ని అయినకాడికి అమ్మేయడమే ఈ సంస్కరణల లక్ష్యం. అమ్మడం కుదరని వాటిని మూసివేశారు. ప్రైవేటీకరణ ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఒక సెక్రటేరియేట్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఈ సెక్రటేరియేట్ ద్వారా చంద్రబాబు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులు ఉపసంహరించడం, ప్రైవేటుపరం చేయడాన్ని ఒక ఉద్యమంలా నడిపించారు. సంస్కరణల పేరిట 1999 నుంచి 2004 మార్చి నాటికి రెండు దశల్లో మొత్తం 54 ప్రభుత్వ రంగ సంస్థలపై కన్నేసి ప్రైవేటీకరణ/ పెట్టుబడుల ఉపసంహరణ, ఏకంగా మూసివేత వంటి కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగించారు. 2006–07 నాటికి 87 సంస్థల్ని ప్రైవేటీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడంతో అవి బతికిపోయాయి. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం కాకపోతే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా కనిపించేది కాదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ బ్యాంకు సూచనలు, షరతుల ప్రకారం చంద్రబాబు లక్షలాది మంది ఉద్యోగులను వీఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపించారు. అప్పట్లో చంద్రబాబుకు ‘ప్రపంచ బ్యాంకు జీతగాడు’ అనే పేరు రావడం గమనార్హం. ఇంత చేసిన చంద్రబాబు ఇప్పుడు ‘విశాఖ ఉక్కు’ విషయంలో మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదీ అప్పటి చంద్రబాబు నిర్వాకం మొదటి దశలో 19 ప్రభుత్వ రంగ సంస్థల్ని చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. 8 సంస్థల్ని ప్రైవేటీకరించారు. 6 సంస్థలు మూసేశారు. 4 సంస్థల కోరలు పీకి నిర్వీర్యం చేశారు. ఇక రెండో దశలో 68 సంస్థల్ని చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. వాటిలో 12 సంస్థల్ని ప్రైవేటీకరించారు. ఏకంగా 16 సంస్థల్ని మూసివేశారు. 8 సంస్థలకు జవసత్వాలు లేకుండా చేశారు. రెండో దశలో ప్రైవేటీకరించిన సంస్థలు 1. పాలెయిర్ కో–ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, 2. వెస్ట్ గోదావరి కో–ఆపరేటివ్ షుగర్ మిల్లు 3. ఎన్వీఆర్ కో–ఆపరేటివ్ షుగర్ మిల్లు, జంపని, 4. రూరల్ ఎలక్ట్రిసిటీ సప్లై కో–ఆపరేటివ్, అనకాపల్లి, 5. రూరల్ ఎలక్ట్రిసిటీ సప్లై కో–ఆపరేటివ్, చీపురుపల్లి, 6. వోల్టాస్ లిమిటెడ్, 7. గోదావరి ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, 8. వజీర్ సుల్తాన్ టుబాకో (వీఎస్టీ), 9. టాటా మోటార్స్ (గతంలో టెల్కో), 10. అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీ (ఏసీసీ), 11. సిర్పూర్ పేపర్ మిల్స్, 12. ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్ మూసివేసిన సంస్థలు: 1. ఎన్రిచ్ 2. ఫెడ్కాన్ 3. ఏపీ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 4. ఏపీ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 5. శ్రీకృష్ణదేవరాయ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ యూనియన్ 6. శ్రీ విజయవర్థని ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ యూనియన్ 7. ఏపీ స్పిన్‌ఫెడ్ 8. కరీంనగర్ కో–ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ 9. ఏపీ షుగర్‌ఫెడ్ 10. చిత్తూరు డిస్ట్రిక్ట్ కో–ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ 11. శ్రీ రాజరాజేశ్వరి కో–ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ 12. రూరల్ ఎలక్ట్రిసిటీ సప్లై కో–ఆపరేటివ్, ఆత్మకూర్ 13.రూరల్ ఎలక్ట్రిసిటీ సప్లై కో–ఆపరేటివ్ రాయచోటి, 14.రూరల్ ఎలక్ట్రిసిటీ సప్లై కో–ఆపరేటివ్ కదిరి ఈస్ట్, 15.రూరల్ ఎలక్ట్రిసిటీ సప్లై కో–ఆపరేటివ్ కదిరి వెస్ట్, 16.రూరల్ ఎలక్ట్రిసిటీ సప్లై కో–ఆపరేటివ్ జోగిపేట నిర్వీర్యం చేసిన సంస్థలు: 1. ఏపీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2. గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్ 3. ఆప్కో 4. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ 5. నెడ్‌క్యాప్ 6. ఏపీ ఫిల్మ్ థియేటర్ అండ్ టెలివిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 7. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ 8. ఏపీ సెరీఫైడ్. ప్రైవేటీకరించిన సంస్థలు: 1. శ్రీ హనుమాన్ సహకార చక్కెర కర్మాగారం 2. ఏఎస్ఎం సహకార చక్కెర కర్మాగారం 3. ఆదిలాబాద్ సహకార స్పిన్నింగ్ మిల్లు 4. రాజమండ్రి సహకార స్పిన్నింగ్ మిల్లు, 5. నిజాం షుగర్స్ లిమిటెడ్‌తో పాటు దాని పరిధిలో ఉన్న చాగల్లు డిస్టిలరీ, శంకర్‌నగర్ షుగర్ మిల్లు, మాంబోజిపల్లి షుగర్ మిల్లు, మెట్పల్లి షుగర్ మిల్లు, లచ్చయ్యపేట షుగర్ మిల్లు, మధునగర్ షుగర్ మిల్లు, మాంబోజిపల్లి డిస్టిలరీ 6. నంద్యాల కో–ఆపరేటివ్ షుగర్ మిల్లు 7. నాగార్జున కో–ఆపరేటివ్ షుగర్ మిల్లు 8. పర్చూర్ కో–ఆపరేటివ్ షుగర్ మిల్లు మూసేసిన సంస్థలు 1. ఏపీ చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్, 2. ఏపీ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, 3. ఆల్విన్ వాచెస్ లిమిటెడ్, 4. నెల్లూరు కో–ఆపరేటివ్ స్పినింగ్ మిల్లు 5. చీరాల కో–ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్లు 6. చిలకలూరిపేట కో–ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్లు నిర్వీర్యం చేసిన సంస్థలు 1. ఏపీ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, 2. ఏపీ స్టేట్ మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, 3. ఏపీ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, 4. ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. -
విష వాయువు లీకేజీ
రాయ్‌పూర్: లాక్డౌన్ కారణంగా కొంతకాలంగా మూతబడి ఉన్న కాగితం తయారీ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించే క్రమంలో విషవాయువు లీక్ అయి ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. టెట్లా గ్రామానికి సమీపంలోని శక్తి పేపర్ మిల్ లాక్డౌన్ కారణంగా కొంతకాలంగా మూతబడి ఉంది. కర్మాగారాన్ని మళ్లీ ప్రారంభించేందుకు గాను బుధవారం సాయంత్రం కార్మికులు ట్యాంకు శుభ్రం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఏడుగురిలో ముగ్గురి పరిస్థితి విషమంగా మారడంతో రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
మరో గ్యాస్ లీకేజీ ఘటన.. ఏడుగురికి అస్వస్థత
సాక్షి, న్యూఢిల్లీ : విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన మరవకముందే ఛతీస్‌గఢ్‌లో మరో గ్యాస్ లికేజీ ఘటన చోటు చేసుకుంది. రాయ్‌గఢ్‌లోని పేపర్ మిల్లులో గ్యాస్ లీకై ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. (చదవండి : విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం) లాక్డౌన్ కారణంగా దాదాపు నెలన్నరోజులుగా పరిశ్రమలు అన్ని మూతపడ్డాయి. ఇటీవల కేంద్రం సడలింపులు ఇవ్వడవంతో దేశంలో పలు పరిశ్రమలు తెరచుకున్నాయి. ఈ క్రమంలో రాయ్‌గఢ్‌లోని పేపర్ మిల్లు కూడా ప్రారంభమయింది. గురువారం మధ్యాహ్నం మిల్లులోని ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు ఏడుగురు కార్మికులు వెళ్లారు. ట్యాంకులోకి దిగి శుభ్రం చేస్తున్న క్రమంలో గ్యాస్ లీకై అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు, పోలీసులు అక్కడికి చేరుకొని.. కార్మికులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
సిర్పూజ్ కాగజ్‌నగర్ పేపర్‌మిల్లులో ప్రమాదం
-
సిర్పూర్ మిల్లు.. మళ్లీ మొదలు
సాక్షి, హైదరాబాద్/ఆసిఫాబాద్ : సిర్పూర్ పేపర్ మిల్లుకు మంచిరోజులొచ్చాయి. నాలుగేళ్ల కిందట మూతబడిన ఆ మిల్లు మళ్లీ తెరుచుకోనుంది. మిల్లు స్వాధీనానికి ప్రముఖ పేపర్ కంపెనీ జేకే పేపర్ లిమిటెడ్ సమర్పించిన రుణ పరిష్కార ప్రణాళికకు హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) గురువారం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు ఎన్సీఎల్టీ జ్యుడీషియల్ సభ్యుడు బిక్కి రవీంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ‘స్వాధీన ప్రక్రియ కొలిక్కి రావడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న రాయితీ నిర్ణయాలు కీలకపాత్ర పోషించాయి. పెద్ద సంఖ్యలో రాయితీలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో జేకే పేపర్ లిమిటెడ్ ముందుకొచ్చింది’ అని ఉత్తర్వుల్లో రవీంద్రబాబు ప్రస్తావించారు. మిల్లు పునఃప్రారంభంతో ఆ ప్రాంత ప్రజల ఆర్థిక స్థితిగతులు మారుతాయని చెప్పారు. ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వగానే కాగజ్‌నగర్‌లో కార్మికులు ఒకరినొకరు హత్తుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మిల్లు గేటు ఎదుట బాణసంచా పేల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. నిజాం ఉస్మాన్ కాలంలో.. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో 1936లో అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో సిర్పూర్ పేపర్ మిల్స్ లిమిటెడ్ ఏర్పాటైంది. 1942 నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది. మొదట కొత్తపేట్గా ఉన్న ఆ ఊరి పేరు మిల్లు ఏర్పాటుతో కాగజ్‌నగర్‌గా మారింది. వేలాది మందికి ఆ మిల్లు జీవనాధారమైంది. ఆ తరువాత మిల్లు బిర్లా కుటుంబం చేతికి, అటు నుంచి పొద్దార్ చేతుల్లోకి వెళ్లింది. అయితే ముడిసరుకు ధరలు పెరగడం, తగినంత విద్యుత్ సరఫరా లేకపోవడం, నిర్వహణ లోపాలతో 2014లో మిల్లు మూతబడింది. ఆనాటికి మిల్లును ఆర్.కె.పొద్దార్ నిర్వహిస్తున్నారు. ఎన్సీఎల్టీలో పిటిషన్ మూతబడే నాటికి కంపెనీ యాజమాన్యం వద్ద 49.91 శాతం, ప్రజల వద్ద 50.09 శాతం ఈక్విటీ వాటాలున్నాయి. రుణదాతలతో పాటు కార్మికులు, ఉద్యోగుల వేతనాలు తదితరాలకు రూ.673.59 కోట్లను చెల్లించాల్సి ఉంది. 2004, 2008 మధ్య మిల్లు యాజమాన్యం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతో లీడ్ బ్యాంక్ ఐడీబీఐ 2016 అక్టోబర్ 12న మిల్లు ఆస్తులు స్వాధీనం చేసుకుంది. మిల్లు నుంచి తమకు రూ.51.86 లక్షల రావాల్సి ఉందని, ఆ మొత్తాన్ని కంపెనీ చెల్లించే పరిస్థితిలో లేనందున దివాలా ప్రక్రియ ప్రారంభించాలంటూ రమా రోడ్‌లైన్స్, మరికొందరు ఎన్సీఎల్టీలో గతేడాది పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన ట్రిబ్యునల్.. గతేడాది దివాలా పరిష్కార నిపుణుడిని నియమించింది. పేపర్ మిల్లు భూములు, భవనాలు, నివాస గృహాలు, ప్లాంటు, యంత్రాల విలువను రూ.338.52 కోట్లుగా చేర్చారు. ప్రణాళికకు 80.66 శాతం ఓట్లు మిల్లు స్వాధీనానికి గుజరాత్‌కు చెందిన జేకే పేపర్ లిమిటెడ్ ముందుకొచ్చింది. రుణ పరిష్కార ప్రణాళిక సమర్పించింది. ఆ ప్రణాళికకు ఆమోదముద్ర వేసేందుకు రుణదాతలైన బ్యాంకర్లు ఓటింగ్ నిర్వహించగా ఆమోదిస్తూ 80.66 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో జేకే ప్రణాళికను ఆమోదిస్తూ రుణదాతలు నిర్ణయం తీసుకున్నారు. అయితే మిల్లును స్వాధీనం చేసుకునేందుకు తమకు కొన్ని రాయితీలివ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని జేకే పేపర్ లిమిటెడ్ కోరింది. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం రాయితీలిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇక దివాలా పరిష్కార నిపుణుడు తన న్యాయవాది వీకే సాజిత్ ద్వారా మొత్తం వివరాలతో కూడిన నివేదికను ఎన్సీఎల్టీకి సమర్పించారు. రుణ పరిష్కార ప్రణాళికకు రుణదాతల కమిటీ (సీఓసీ) ఆమోదం తెలపడం, ఐబీసీ సెక్షన్ 29ఎ ప్రకారం జేకే పేపర్ లిమిటెడ్‌కు అనర్హత వర్తించకపోవడంతో ప్రణాళికకు ఎన్సీఎల్టీ ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వ రాయితీలివే.. పదేళ్ల పాటు ఎస్జీఎస్టీ, 100 శాతం స్టాంపు డ్యూటీ మినహాయింపు. రూ.50 కోట్ల లోపు 20 శాతం పెట్టుబడి రాయితీ. పదేళ్ల పాటు డీబార్కడ్ యూక, సుబాబుల్ సరఫరాపై రాయితీ. బొగ్గు రిజర్వు చేయడంతో పాటు పదేళ్ల పాటు సరఫరా చేస్తూ టన్నుకు రూ. 1,000 రాయితీ. కొత్త పెట్టుబడులపై 5 ఏళ్లు 2 శాతం వడ్డీ రాయితీ. 2 నెలల్లో అన్ని లైసెన్సులకు అనుమతులు. పదేళ్లు విద్యుత్ చార్జీల మినహాయింపు. కార్మికులు, ఉద్యోగుల జీతభత్యాల బకాయిల చెల్లింపును సర్కారే తీసుకుంది. కేటీఆర్‌కు కృతజ్ఞతలు మిల్లు పునరుద్ధరణకు కృషి చేసిన పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలు మంత్రి జోగు రామన్న, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కృతజ్ఞతలు తెలిపారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. మిల్లు పునరుద్ధరణ కోసం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొన్ని కంపెనీలతో చర్చలు జరిపామని తెలిపారు. వేలాది మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపే సిర్పూర్ పేపర్ మిల్లు మళ్లీ ప్రారంభమవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. -
కలుషితమై'నది'..
సాక్షి, రాజమహేంద్రవరం: ఉభయగోదావరి జిల్లాలకు సాగు, తాగునీటిని అందిస్తున్న గోదావరిని కాలుష్యం కాటేస్తోంది. రాజమహేంద్రవరంలో ఉన్న ఇంటర్నేషనల్ పేపర్ మిల్లు ద్వారా రసాయనిక వ్యర్థ జలాలు నేరుగా గోదావరిలో కలుస్తున్నాయి. అయినా పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు అటువైపు కన్నెత్తి చూడడంలేదు. స్థానిక నగరపాలక సంస్థ, రెవెన్యూ అధికారులు కాలుష్య నియంత్రణ పని తమది కాదంటూ తప్పుకుంటున్నారు. నేరుగా నదిలోకి.. రసాయనిక వ్యర్థాలు, తెల్లటి నురగలు చిమ్ముతూ పేపర్ మిల్లు నుంచి కోటిలింగాల శ్మశానవాటిక వద్దకు కాలువ ద్వారా నేరుగా నదిలో కలుస్తున్నాయి. ప్రస్తుతం గోదావరిలో ఇన్‌ఫ్లో చాలా తక్కువగా ఉంది. వరదల సమయంలో కాలుష్య జలాల ప్రభావం పైకి కనిపించకపోయినా వేసవిలో మాత్రం స్పష్టంగా వాటి ప్రభావం తెలుస్తోంది. కోటిలింగాల శ్మశాన వాటిక నుంచి పుష్కరఘాట్ వరకు గోదావరి జలాలు నల్లగా రంగుతేలాయి. గోదావరి నీటినే ఇటీవల ఉభయగోదావరి జిల్లాల్లోని తాగునీటి ట్యాంకులు, చెరువులకు నింపారు. అందు కోసం జిల్లాలో తూర్పు, మధ్య డెల్టా కాలువలను నాలుగు రోజులపాటు, పశ్చిమ గోదావరికి వెళ్లే పశ్చిమ డెల్టా కాలువను పది రోజులపాటు అదనంగా నీటిని విడుదల చేశారు. ఆ నీటిని స్థానిక నీటి శుద్ధి ప్లాంట్లు ద్వారా బ్లీచింగ్, ఆలం కలిపి నీటిలో పీహెచ్ స్థాయి ఏడు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ నీటిలో ఉండే రసాయనిక గుణాలను తొలగించేలా ఎలాంటి ఏర్పాట్లు లేవు. పైగా నీటిలో రసాయనిక గుణాలను గుర్తించే వ్యవస్థే నగర, పరపాలికలు, పంచాయతీల్లో ఉండే తాగునీటి విభాగం వద్ద లేకపోవడం గమనార్హం. పేపర్ మిల్లు వాడకం 23వేల కిలో లీటర్లు... కోటిలింగాలఘాట్ వద్ద నదిలో ఏర్పాటు చేసిన ఇన్‌టేక్ పాయింట్ నుంచి పేపర్ మిల్లు ప్రతిరోజూ 23 వేల కిలో లీటర్ల నీటిని ఉపయోగించుకుంటోంది. వివిధ దశల్లో దాదాపు 40 రకాల రసాయనాలను ఉపయోగించి పేపర్ తయరీ తర్వాత ఆ నీటిని వెంకటనగరం పంచాయతీ పరిధిలోని లంకల్లో అధికారికంగా, కోటిలింగాల ఘాట్ వద్ద అనధికారికంగా విడుదల చేస్తున్నారు. కోటిలింగాలఘాట్ వద్ద ఉన్న 10 ఎంఎల్డీ ప్లాంటుతోపాటు మరో మూడు ప్లాంట్ల ద్వారా నగరంలోని దాదాపు ఐదు లక్షల మంది జనాభాకు ప్రతి రోజూ 65 మిలియన్ లీటర్లు(ఒక మిలియన్= 10 లక్షల లీటర్లు) నగరపాలక సంస్థ సరఫరా చేస్తోంది. వాటర్ ప్లాంట్లలో సాధారణ ప్రక్రియలో బ్లీచింగ్, క్లోరినేషన్ చేసి సరఫరా చేస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా రసాయనిక వ్యర్థాలను పూర్తి స్థాయిలో తొలగిపోవని రసాయన శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. రసాయన వ్యర్థాలు నీటిలో కలిస్తే వచ్చే వ్యాధులు... రసాయన వ్యర్థ జాలాలు తాగునీటిలో కలవడం వల్ల ప్రాణాంతకమైన వ్యాధులతోపాటు మానవ అవయవాలపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. రసాయనిక వ్యర్థాల వల్ల మానవ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. జీర్ణ, శ్వాసకోస వ్యాధులు, ఊపిరి తిత్తులు, కాలేయం, మూత్రపిండాలపై దుష్ప్రభావం పడుతుంది. క్యాన్సర్, కళ్లకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా జల చరాలు ఆ నీటిలో మనుగడ సాగించలేవు. బైలాజికల్ ఆక్సిన్ డిమాండ్ కలవడం వల్ల నీటిలోని చేపల ప్రత్యుత్పత్తి వ్యవస్థ దెబ్బతిని క్రమంగా చనిపోతాయి. కోటిలంగాల ఘాట్ వద్ద రసాయన వ్యర్థ జాలాలు కలిసే ప్రాంతం చుట్టు పక్కల చేపలు సంచరించడంలేదు. మత్యశాఖ గత ఏడాది నవంబర్‌లో దాదాపు రెండు కోట్ల చేప పిల్లలను వేసినా అవి ఇక్కడ జీవించే అవకాశం లేకపోవడంతో పాపికొండలు, పోలవరం లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్లిపోయాని మత్య్సకారులు వాపోతున్నారు. పేపర్ తయారీలో వాడే రసాయనాలు ఇవీ పేపర్ తయరీకి దాదాపు 40 రకాల రసాయనాలను ఉపయోగిస్తున్నారు. సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, డై మిథైల్ సల్ఫేడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, పేపర్సోడియం హైపోక్లోరైట్, సోడియం పెరాక్సైడ్ సోడియం సిలికేట్, సోడియం సల్ఫేట్, సోడియం థియో సల్ఫేట్, గ్లైకోసైడ్, సల్ఫర్, టిటానియం డాక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, కాల్షియం కార్పొనేట్, మెగ్నీషియం బిసిల్‌ఫైట్, మెగ్నీషియం కార్భోనేట్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, ఆక్సిజన్, ఓజోన్, అబీటిక్ యాసిడ్, సోడియం అబీటిక్, సోడియం సల్ఫేట్, సోడియం బిసిల్‌ఫైట్, సోడియం కార్పొనేట్, సోడియం అల్యూమినేట్, సోడియం బిసిల్ఫేట్, సోడియం క్లోరేట్, సోడియం హైడ్రో సల్ఫేట్, నేచురల్ సల్ఫేట్ ఆఫ్ లైమ్, ఆల్కైల్ కీటోన్ డైమర్, కాల్షియం సల్ఫేట్, సల్ఫేట్ ఆఫ్ అలుమినా, ఇథలిన్ డైమిన్ టెట్రా ఎసిటిక్ ఆమ్లం, ఫామాడిన్, న్యాచురల్ ఫామాడిన్, పాలమర్, బైలాజికల్ ఆక్సిన్ డిమాండ్ తదితర రసాయనాలు పదార్థాలు ఉపయోగిస్తున్నారు. -
ఆకలి పోరాటం
రాయగడ : జేకే పేపర్ మిల్ తమ డిమాండ్లను పరిష్కరించకపోవడంతో కార్మికులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. తొలుత 10రోజల క్రితం కార్మికలు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఆం దోళనలు చేపడతామని అందులో పేర్కొన్నారు. చెప్పినట్టుగానే రోడ్లపై ర్యాలీ నిర్వహిస్తూ జిల్లా కార్మిక శాఖ కార్యాలయానికి చేరుకొని కార్యాల యం ఎదుట ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా 20 సంవత్సరాలుగా పని చేస్తున్న కాం ట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాం డ్ చేశారు. పని ఒత్తిడి అధికంగా ఉన్నా వేతనాలు మాత్రం పెంచడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే కార్మిక యూనియన్లు, యాజమాన్యం మధ్య జరుగుతున్న ఒప్పందాలు చట్టపరంగా జరగడం లేదని ఆరోపించారు. కార్మిక యూని యన్లు, యాజమాన్యం, కార్మిక శాఖల మధ్య కొ త్త ఒప్పందాలు చేసి కార్మికులకు అనుకూలంగా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా యంత్రాంగం గానీ యాజమాన్యం గానీ స్పందించకపోవడంతో కార్మికులు రోడ్డెక్కవలసి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా కార్మికులతో పోలీసులు చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. -
ఆరుగురి ఊపిరి తీసిన విషవాయువు
కోల్‌కతా: విషవాయువు పీల్చడంతో ఆరుగురు మృతి చెందిన విషాదకర ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. హజీనగర్‌లోని పేపర్ మిల్లులో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. హజీనగర్‌లోని పేపర్ మిల్లులో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పంపులను సరిచేసేందుకు ఇద్దరు కార్మికులు మిల్లు లోపల గల బావిలోకి దిగారు. మిల్లు నుంచి వెలువడే వ్యర్థాలతో నిండిన బావిలో విషవాయువు వెలువడటంతో వారు స్పృహ తప్పి పడిపోయారు. లోపలికి దిగినవారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వారికి ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని మరో నలుగురు కార్మికులు కూడా బావిలోకి దిగారు. కానీ వారు కూడా విషవాయువు బారిన పడటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. గమనించిన ఉద్యోగులు ఫైర్ బ్రిగేడ్‌ను అప్రమత్తం చేసి కార్మికులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. విషవాయువును అధికంగా పీల్చడంతో వారు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే.. పేపర్ మిల్లులోని వ్యర్థాలను బయటికి వదిలేందుకు సరైన వసతి లేకపోవడంతో బావిలోకి వెళ్లేలా ఏర్పాటు చేశారు. విషవాయులున్న బావిలోకి దిగిన కార్మికులకు గ్యాస్ మాస్కులు కూడా అందించలేదు. కనీస రక్షణ చర్యలు తీసుకోకుండా, కార్మికుల మృతికి కారణమైన మిల్లు యజమానిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
గోదావరిలో గరళం
సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం నగర ప్రజలు మంచినీరే తాగుతున్నారా? పేపర్ మిల్లు రసాయనిక జలాలు నేరుగా గోదావరిలో కలుస్తుండడంతో నీరు కలుషితమవుతోంది. పేపర్‌మిల్లు వెనుక నుంచి గోదావరిలోకి పెద్ద కాలువ ఉంది. ఇరువైపులా దట్టమైన చెట్లు, పొదల వల్ల ఆ కాలువ వెతికితే తప్ప ఎవరికీ కనిపించదు. ఆ కాలువ నుంచి పేపర్ తయారీ అనంతరం విడుదలవుతున్న రసాయనిక జలాలు నేరుగా కోటిలింగాల ఘాట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఇసుక ర్యాంపు పక్కన నదిలో కలుస్తున్నాయి. నిరంతరంగా 10 హెచ్‌పీ(హార్స్పవర్) మోటారు ద్వారా ఎంత నీరు వస్తుందో ఆ స్థాయిలో 24 గంటల పాటు పేపర్ మిల్లు రసాయనిక వ్యర్థ జలాలు నదిలో కలుస్తున్నాయి. ప్రస్తుతం గోదావరిలో ఇన్‌ఫ్లో లేకపోవడంతో నదీ జలాలు మరింత కలుషితమువుతున్నాయి. 23 వేల కిలో లీటర్ల నీటి వినియోగం కోటిలింగాల ఘాట్ వద్ద నదిలో ఏర్పాటు చేసిన ఇన్‌టేక్ పాయింట్ నుంచి పేపర్ మిల్లు ప్రతి రోజూ 23 వేల కిలో లీటర్ల నీటిని ఉపయోగించుకుంటోంది. పేపర్ తయారీకి వివిధ దశల్లో సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి దాదాపు 40 రకాల రసాయనాలను ఉపయోగించి అనంతరం ఆ నీటిని వెంకటనగరం పంచాయతీ పరిధిలోని లంకల్లో విడుదల చేస్తోంది. దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలోకి పైపుల ద్వారా అధికారికంగా వ్యర్థ జలాలను తరలిస్తోంది. అక్కడ ఇసుకలో రసాయనిక జలాలు కలిపేలా ఏర్పాట్లు చేశారు. అయితే అది ఎంత మేర అమలు జరుగుతుందోనన్నది ప్రశ్నార్థకమే. దానితోపాటు అనధికారికంగా కోటిలింగాల ఘాట్ ఇసుక ర్యాంపు వద్ద రసాయనిక వ్యర్థ జలాలను కలుపుతుండడంతో నది కలుషితం అవడంతోపాటు నగర ప్రజల తాగునీరు ఎంత మేరకు సురక్షితం అనేది ప్రశ్నగా మారింది. కోటిలింగాల ఘాట్ వద్ద ఉన్న 10 ఎంఎల్డీ ప్లాంటుతోపాటు మరో మూడు ప్లాంట్ల ద్వారా నగరంలోని దాదాపు 5 లక్షల మంది జనాభాకు ప్రతి రోజూ 65 మిలియన్ లీటర్లు (ఒక మిలియన్= 10 లక్షల లీటర్లు) నగరపాలక సంస్థ సరఫరా చేస్తోంది. వాటర్ ప్లాంట్లలో సాధారణ ప్రక్రియలో బ్లీచింగ్, క్లోరినేషన్ చేసి సరఫరా చేస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా రసాయనిక వ్యర్థాలను పూర్తి స్థాయిలో తొలగిపోవని రసాయన శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వ్యర్థాలు నీటిలో కలిస్తే వచ్చే వ్యాధులు పేపర్ తయారీ అనంతరం విడుదలయ్యే రసాయన వ్యర్థ జాలాలు తాగునీటిలో కలవడం వల్ల ప్రాణాంతకమైన వ్యాధులతోపాటు మానవ అవయవాలపై తీవ్ర దుష్ప్రభావం పడుతోంది. సాధారణంగా తాగే నీటిలో పీహెచ్ విలువ ఏడు ఉండాలి. రసాయన జలాలు కలవడం వల్ల నీటి రంగు మారడంతోపాటు ఆ నీటిలో పీహెచ్ విలువ రెండు లేదా మూడుకు పడిపోతుంది. దీని వల్ల ఆ నీరు తాగిన వారిలో హార్మోన్ల సమతుల్యం దెబ్బతింటుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. జీర్ణకోశ, శ్వాసకోస వ్యాధులు, ఊపిరి తిత్తులు, కాలేయం, మూత్రపిండాలపై దుష్ప్రభావం పడుతుంది. క్యాన్సర్ వస్తుంది. కళ్లకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా జల చరాలు ఆ నీటిలో మనుగడ సాగించలేవు. బైలాజికల్ ఆక్సిన్ డిమాండ్ కలవడం వల్ల నీటిలోని చేపల ప్రత్యుత్పత్తి వ్యవస్థ దెబ్బతిని క్రమంగా చనిపోతాయి. కోటిలింగాల ఘాట్ వద్ద రసాయన వ్యర్థ జాలాలు కలిసే ప్రాంతం చుట్టు పక్కల చేపలు సంచరించడంలేదు. మత్య్సశాఖ గతేడాది నవంబర్‌లో దాదాపు రెండు కోట్ల చేప పిల్లలను వేసినా అవి ఇక్కడ జీవించే అవకాశం లేకపోవడంతో పాపికొండలు,పోలవరం లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్లిపోతాయనిమత్య్సకారులు చెబుతున్నారు. వేట మానేశాం నదిలో నీరు తేడా వల్ల చేపలు వాటిని తాగవు. దీంతో చేపలు పాపికొండలు, భద్రాచలం వైపునకు వెళ్లిపోతున్నాయి. అధికారులు చాలా చేపలు వదిలారు. కానీ మాకు ఎలాంటి ప్రయోజనం లేదు. వేట మానేసి చాలా రోజులైంది. ఎవరిని అడగాలో తెలియదు.– బొడ్డు పోసయ్య, మల్లాడి ఆదినారాయణ,మత్స్యకారులు, కోలిటింగాల ఘాట్ తనిఖీ చేసి చర్యలు చేపడతాం గోదావరిలో వ్యర్థనీటిని కలుపుతుండం మా దృష్టికి రాలేదు. పరిశీలించి చర్యలు చేపడతాం. మా సిబ్బంది ప్రతి నెలా తనిఖీ చేస్తున్నారు. సోమ, మంగళవారాల్లో అధికారులను రాజమహేంద్రవరం పంపిస్తాం. – ఎ.రామారావునాయుడు,పర్యావరణ ఇంజనీర్, కాకినాడ -
ఆ పరిశ్రమను పునఃప్రారంభించండి: చాడ
సాక్షి, హైదరాబాద్ : సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ మిల్లు పరిశ్రమ మీద వేలాది మంది కార్మికులు ఆధారపడ్డారని, దీన్ని యుద్ధప్రాతిపదికన పునః ప్రారంభించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2014 నుంచి ఉత్పత్తులు పూర్తిగా నిలిపేయడంతో దాదాపు 4వేల మంది పర్మినెంట్, 1600 మంది ఒప్పంద కార్మికులు బజారునపడ్డారని గురువారం సీఎం కేసీఆర్‌కు ఒక లేఖలో పేర్కొన్నారు. పంచాయతీరాజ్‌శాఖలో 30 ఏళ్లుగా నాల్గో తరగతి ఉద్యోగులు, కాంటింజెంట్ ఉద్యోగులు నెలకు రూ. 4వేలతో కుటుంబాన్ని గడపుతున్నారని చాడ ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం రూ. 18000 చేయాలని, దీనికి తగిన చర్యలు చేపట్టాలని మంత్రి జూపల్లికృష్ణారావుకు ఒక లేఖలో తెలిపారు. -
ఖాయిలా పరిశ్రమలను పునఃప్రారంభిస్తాం
పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాయిలా పడిన పరిశ్రమలను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు స్పష్టం చేశారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అందిస్తున్న రాయితీలనే ఖాయిలా పరిశ్రమలకూ వర్తింపజేస్తామని ప్రకటించారు. సిర్పూర్–కాగజ్ నగర్ పేపర్ మిల్లును తిరిగి తెరిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలసి బ్యాంకర్లు, పారిశ్రామికవేత్తలతో కేటీఆర్ సోమవారం సచివాలయంలో సమావేశమ య్యారు. పేపర్ మిల్ మూతపడడంతో రెండున్నర వేల కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే మిల్లు మూతపడిందని ఆరోపించారు. మిల్లు తిరిగి ప్రారంభించేందుకు కావాల్సిన ముడి సరుకు, మానవ వనరులు, నీళ్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పారిశ్రామికవేత్తలు, బ్యాంకర్లకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని పేర్కొన్నారు. -
కర్నూలులో పేపరు మిల్లును పునరుద్ధరించాలి
– ఎమ్మెల్సీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి డిమాండ్ కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలులో రాయలసీమ పేపర్‌మిల్లు ప్రారంభించాలని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే, సీఈసీ మెంబర్ కొత్తకోట ప్రకాశ్‌రెడ్డిలతో కలిసి మంగళవారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ యువకులు నిరుద్యోగ సమస్యతో ఆందోళనకు గురవుతున్నారన్నారు. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపాలంటే కర్నూలులో ఎస్ఆర్పీఎం, హిందూపురంలో నిజాం షుగర్స్, గుంతకల్లులో స్పిన్నింగ్ మిల్లు, కడపలో బ్రాహ్మణి స్టీల్స్ ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఇంటికో ఉద్యోగం లేక నిరుద్యోగ భృతి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తనకు అవకాశం లభిస్తే ప్రభుత్వాన్ని నిలదీసి సాధించుకొస్తానని తెలిపారు. ఎన్నోరకాల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాయలసీమకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. ఆయన 100 అబద్ధాలు చెబితే, ప్రస్తుతం రంగంలో ఉన్న టీడీపీ అభ్యర్థి కె.జె.రెడ్డి పరిశ్రమలు స్థాపిస్తానంటూ 150 అబద్ధాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం ఉద్యమాలు చేస్తే పీడీ యాక్టు, నిరుద్యోగులపై నాసా యాక్టు పెడతామనడం అప్రజాస్వామికమన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఉద్యమాలను అణచివేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా క్రూరత్వం తగ్గించుకోకపోతే ముఖ్యమంత్రి పాలనకు కాలంచెల్లే రోజులొస్తాయని హెచ్చరించారు. సీమ సమస్యలపై పోరాడతారు.. రాయలసీమ జిల్లాల అభివృద్ధి పాలకులకు పట్టడం లేదని వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, కడప జిల్లా ప్రజలకు ఈ ప్రభుత్వ పాలనలో అన్యాయం జరుగుతుందన్నారు. వెన్నపూస గోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా అన్ని ప్రాంతాల సమస్యలను తెలుసుకుంటూ ఎంతో చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. ఆయన గెలిస్తే చట్టసభల్లో సీమవాసుల వాణి వినిపించి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని, తద్వారా రాయలసీమ వాసులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అవగాహన కలిగిన అభ్యర్థి అవసరం.. రాష్ట్ర ఎన్జీవోల సంఘం చైర్మన్‌గా పనిచేసిన వెన్నపూస గోపాల్‌రెడ్డికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సమస్యలపై మంచి అవగాహన ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి అభ్యర్థి ఎంతో అవసరమని వైఎస్ఆర్సీపీ సీఈసీ మెంబర్, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. అభ్యర్థికి మూడు జిల్లాల పరిధి ఉండటం వల్ల అందర్ని కలుసుకోకపోయినా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామగ్రామాల్లో, ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేయడం అభినందనీయమన్నారు. ప్రజాసేవా అనుభవం కలిగిన వ్యక్తిని గెలిపించుకోవడం వల్ల సమస్యలు సునాయాసంగా పరిష్కారమవుతాయని తెలిపారు. నమోదు చేసుకున్న గ్రాడ్యుయేట్లందరు ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు శ్రీకర్, వైద్యనాథ్రెడ్డి, కుమారస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే పేపర్ మిల్లులో అత్యాచారం, హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఓ రాజకీయ పార్టీ ఎమ్మెల్యే కు చెందిన మిల్లులో ఓ దళిత మహిళ అత్యాచారం, హత్యఘటన కలకలం రేపింది. ముజఫర్ నగర్ లో ని పేపర్ మిల్లు లో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బీఎస్పీ ఎమ్మెల్యే కు చెందిన పేపర్ మిల్లులో పనిచేసే దళిత కార్మికురాలు (38) అనుమానాస్పద స్థితిలో మరణించింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ముజఫర్ నగర్ లోని జనసాత్ లో వున్న పేపర్ మిల్లులో పనిచేస్తున్న దళిత మహిళ శుక్రవారం శవమై తేలింది. ఇది బీఎస్పీ ఎమ్మెల్యే కు చెందినదనీ, ఆమెపై అత్యాచారం చేసిన గొంతు నులిమి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. పరారీలో ఉన్న లేబర్ కాంట్రాక్టర్ కోసం గాలిస్తున్నామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు అందిస్తామని పోలీసులు తెలిపారు. -
పేపర్ మిల్లులో అగ్నిప్రమాదం: రూ.4 కోట్ల ఆస్తి నష్టం
నిజామాబాద్ : నిజామాబాద్ మండలం కాలూరులోని పేపర్ మిల్లులో శనివారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో రూ.4 కోట్ల రూపాయల విలువైన రా మెటీరియల్ దగ్ధమైంది. 200 లారీల పేపర్ వేస్ట్ దగ్ధమైంది. నాలుగు అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పుతున్నాయి. అయినా మంటలు అదుపులోకి రాలేదు. మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో అర్థం కావడంలేదని యాజమాన్యం ప్రతినిధులు పేర్కొన్నారు. -
రాహుల్‌గాంధీకి మరో షాక్!
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని రత్నగిరిలో రూ. 3,650 కోట్లతో ఏర్పాటుచేయనున్న పేపర్ మిల్‌పై కేంద్ర క్యాబినెట్ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. మొదట కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నియోజకవర్గమైన అమేథిలో ఈ ప్రాజెక్టును ఏర్పాటుచేయాలని భావించారు. కానీ శివసేన డిమాండ్ చేయడంతో ఈ ప్రాజెక్టును మహారాష్ట్రకు తరలించారు. ఈ ప్రాజెక్టు విషయమై కేంద్ర ఆర్థికశాఖతోపాటు వివిధ మంత్రిత్వశాఖలకు లేఖలు రాశామని, వారి అభిప్రాయాలు సేకరించిన తర్వాత కేంద్ర క్యాబినెట్ ముందు ప్రతిపాదనలు పెడతామని భారీ పరిశ్రమల శాఖమంత్రి, శివసేన ఎంపీ అనంత్ గీతె తెలిపారు. ఈ పేపర్ మిల్లు ఏర్పాటుద్వారా స్థానికంగా 900 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. దీని ఏర్పాటును ముమ్మరం చేయాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవల ప్రభుత్వాన్ని కోరింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నియోజకవర్గం నుంచి తరలించిన మరో ప్రాజెక్టు ఇది కావడం గమనార్హం. గతంలో యూపీఏ ప్రభుత్వం అమేథిలోని జగదీశ్‌పూర్‌లో ప్రతిపాదించిన శక్తిమాన్ మెగాఫుడ్ పార్క్ ఏర్పాటును ఇప్పటికే ఎన్డీయే ప్రభుత్వం రద్దుచేసింది. యూపీఏ హయాంలో పెట్రోలియం శాఖ ఈ ప్రాజెక్టుకు సబ్సిడీపై గ్యాస్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఈ ప్రాజెక్టును రద్దు చేశాని ప్రభుత్వం చెబుతోంది. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తిన రాహుల్‌గాంధీ మోదీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నదని విమర్శించారు. వెనుకబడిన నియోజకవర్గమైన అమేథికి గత యూపీఏ ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు ప్రకటించినా ఏవీ ఆచరణరూపం దాల్చలేదు. -
బిల్లులు చెల్లించాలని రైతుల ధర్నా
సుబాబుల్ బిల్లుల్ని వ్యవసాయ మార్కెట్ కమిటీయే చెల్లించాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలో ఉన్న కాగితపు పరిశ్రమ ఉంది. దీనికి సమీప గ్రామాల రైతులు సుబాబుల్ కర్రను వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా సరఫరా చేస్తుంటారు. ఆ సంస్థ బిల్లులు సక్రమంగా చెల్లించకపోవటంతో బకాయిలు రూ.9.20 కోట్ల వరకు పేరుకుపోయాయి. దీనిపై ఆగ్రహించిన రైతులు సోమవారం సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు రావల్సిన డబ్బులను మార్కెట్ కమిటీ చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆందోళన కొనసాగుతోంది. గతంలో ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా ఈ సమస్య పరిష్కారం కాలేదు. -
దక్కని ధర
సుబాబుల్, జామారుుల్ రైతులు విలవిల కొనుగోళ్లు చేయని పేపర్‌మిల్లు యూజమాన్యాలు తప్పనిసరై బ్రోకర్లకు అమ్ముకుంటున్న రైతులు నేడు మానిటరింగ్ కమిటీ సమావేశం సుబాబుల్, జామారుుల్ కొనుగోలులో పేపర్ మిల్లుల యూజమాన్యాలు ఒప్పందాలు పాటించడం లేదు. దీంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో బ్రోకర్లకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. దీనిపై మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించడం లేదు. ఒంగోలు : జిల్లాలో ఎంతోకొంత లాభసాటిగా ఉన్న సుబాబుల్, జామాయిల్ అమ్మకాలు కూడా బ్రోకర్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. దీంతో రైతులకు అగ్రిమెంట్ ప్రకారం ధర రాక తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతుల వద్ద నుంచి పేపర్ మిల్లులు నేరుగా కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. దీనిపై ప్రకాశం జిల్లా కలెక్టర్ జూన్‌లో మానిటరింగ్ కమిటీని వేశారు. ఇందులో రైతుసంఘం నేతలతో పాటు మార్కెటింగ్ అధికారులు కూడా ఉన్నారు. రైతుల నుంచి పేపర్ మిల్లులు కొనుగోలు చేయడం లేదనే విషయం ఈ కమిటీ పర్యవేక్షణలో కూడా తేలింది. ఈ నేపథ్యంలో బుధవారం ఒంగోలులో మానిటరింగ్ కమిటీతో పాటు పేపర్ మిల్లుల యాజమాన్యాలతో జిల్లా కలెక్టర్ విజయకుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. గత ఫిబ్రవరిలో ఒప్పందం... జిల్లాలోని సంతనూతలపాడు, అద్దంకి, ఒంగోలు, దర్శి, కనిగిరి, కందుకూరు, కొండపి, గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గాల్లో సుమారు రెండు లక్షల ఎకరాల్లో సుబాబుల్, జామాయిల్ తోటలు వేశారు. వీటికి సంబంధించి 2014 ఫిబ్రవరి 18న కృష్ణాజిల్లా నందిగామలో సుబాబుల్‌కు టన్నుకు రూ.4,400 చెల్లించే విధంగా రైతులకు, పేపర్ మిల్లుల యాజమాన్యాలకు మధ్య ఒప్పందం కుదిరింది. మన జిల్లాలో ఆ ఒప్పందం అమలు కాకపోవడంతో రైతుసంఘాలు జూన్‌లో కలెక్టర్‌ను కలిసి విన్నవించాయి. దీంతో ఆయన పేపర్‌మిల్లు యాజమాన్యాలను కూర్చోబెట్టి సుబాబుల్‌తో పాటు జామాయిల్‌కు ఒప్పందం కుదిర్చారు. సుబాబుల్‌కు టన్నుకు రూ.4,400, జామాయిల్‌కు రూ.4,600 చెల్లించేలా కుదిరింది. ఒప్పందం ప్రకారం కొనుగోళ్లు చేయని యూజమాన్యాలు... జిల్లాలో మార్కెట్ కమిటీలు ఎంపిక చేసిన 30 వేబ్రిడ్జిల వద్ద సరకు అమ్మేలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడకు రైతులు సరకును తెస్తే పేపర్‌మిల్లు యాజమాన్యాలు ఎంపిక చేసిన అధీకృత ఏజెంట్లు కొనుగోలు చేస్తారు. అయితే కంపెనీలు అధీకృత ఏజెంట్లను ఏర్పాటు చేయలేదు. జిల్లాలో ఒక వందమంది అనధికార ఏజెంట్లను ఏర్పాటు చేశారు. వీరు రైతులు సరకు తీసుకువస్తే కొనడం లేదు. దీంతో రైతులు అనివార్యంగా బ్రోకర్లకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. గతంలో దీనిపై సంతనూతలపాడు వద్ద రైతుసంఘాలు అనేక సార్లు రాస్తారోకోలు చేశాయి. ఆందోళన చేసిన సమయంలో మొక్కుబడిగా కొనుగోలు చేసినా తర్వాత కొనడం లేదు. దీనిపై మానిటరింగ్ కమిటీ మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది. జిల్లాలో గత మూడు నెలల కాలంలో రైతుల వద్ద నుంచి సుమారు 25 వేల టన్నుల జామాయిల్, సుబాబుల్ అమ్మకాలు జరిగాయి. రైతులకు ఒప్పందం ప్రకారం ధర చెల్లించాల్సి ఉండగా, టన్ను సుబాబుల్‌కు రూ.3,700, జామారుుల్కు రూ.3,500 మాత్రమే చెల్లించారు. దీంతో రైతులు టన్ను సుబాబుల్‌కు రూ.500, జామాయిల్‌కు రూ.1,100 చొప్పున నష్టపోతున్నారు. మరో 30 వేల ఎకరాల్లో కటింగ్... వచ్చే మూడు నెలల్లో సుమారు 30 వేల ఎకరాల్లో సుబాబుల్, జామాయిల్ కటింగ్ చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని పేపర్ మిల్లుల నుంచి సరైన ధర ఇప్పించని పక్షంలో రైతాంగం పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంది. పేపర్ రేట్లు భారీగా పెరుగుతున్నా సుబాబుల్, జామాయిల్ ధర మాత్రం పెరగడం లేదు. దీంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. ఇప్పటికైనా తమకు న్యాయమైన ధర అందేలా చూడాలని అధికారులను వేడుకుంటున్నారు. -
పాపం... ‘పోలీస్’
సేఫ్టీ ఆఫీసర్ నిర్వాకంతో కార్మికుడి మృతి రాజమండ్రి పేపరు మిల్లులో ఘటన 25 లక్షల పరిహారం చెల్లించాలి: జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్ రూ.13 లక్షలు, భార్యకు ఉద్యోగం ఇస్తామని యాజమాన్యం హామీ రాజమండ్రి: పేపర్ మిల్లు సేఫ్టీ ఆఫీసర్ నిర్వాకం వల్ల ఓ కాంట్రాక్ట్ కార్మికుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఎదురపల్లి గ్రామానికి చెందిన మైనపల్లి పోలీస్ (25) ఇంటర్ నేషనల్ పేపర్ మిల్లులో నాలుగు నెలలుగా కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. పేపర్ మిల్లు గోడౌన్‌కు 30 అడుగుల ఎత్తులో తాడుకు వేలాడుతూ సున్నం వేస్తుండగా, సేఫ్టీ ఆఫీసర్ రెడ్డి తాడును పట్టుకొని లాగడంతో మైనపల్లి పోలీస్ జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఏడాది క్రితం పెళ్లయింది. గర్భిణి అయిన భార్య పుట్టింట్లో ఉంటోంది. పోలీస్ మృతితో పేపర్‌మిల్లులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సంఘటనతో ఆగ్రహించిన వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, కార్మిక సంఘం నాయకుడు టి.కె. విశ్వేశ్వరరెడ్డి, సీపీఎం నాయకులు టి.అరుణ్ తదితరులు బైఠాయించి బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని, సంఘటనకు కారణమైన రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికుడి కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించాలని, అతడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక దశలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ హెచ్ఆర్ శ్రీనివాసరావు, నాయకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. జక్కంపూడి విజయలక్ష్మి రూ.25 లక్షలు నష్టపరిహారం డిమాండ్ చేయగా, యాజమాన్యం రూ.13 లక్షలు, మృతుడి భార్యకు పేపర్‌మిల్లు కేంటీన్లో ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో కార్మికులు, ఉద్యోగులు తదితర నాయకులు ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో పేపర్ మిల్లు కార్మిక నాయకులు బయ్యే జోసఫ్ రాజు, బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు. -
రెండో రోజూ ఆందోళన
షాబాద్, న్యూస్‌లైన్: రెండో రోజూ మండల పరిధిలోని సర్దార్‌నగర్‌లో ఉన్న పేపర్ మిల్లు ఎదుట గ్రామస్తులు బైఠాయించారు. కాలుష్యానికి కారణమవుతున్న కంపెనీని బంద్ చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీ కాలుష్యం విషయమై చర్చించేందుకు ఆదివారం గ్రామ సర్పంచ్ నర్సింలు, వార్డు సభ్యులతో కలిసి పరిశ్రమ వద్దకు వెళ్లారు. సర్పంచ్‌తో పాటు గ్రామస్తులను కంపెనీ సిబ్బంది నెట్టివేయడంతో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. సోమవారం కూడా సర్పంచ్‌తో పాటు స్థానికులు కంపెనీ ఎదుట బైఠాయించారు. కంపెనీ మేనేజర్ నాగేశ్వర్రావు గ్రామ సర్పంచ్ నర్సింలుతో పాటు స్థానికులకు బహిరంగ క్షమాపణ చెప్పారు. తమ సెక్యురిటీకి సర్పంచ్ అని తెలియక తెలియక పొరపాటు జరిగిందని చెప్పారు. కంపెనీ నుంచి కాలుష్యం వెలువడకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు సర్పంచ్‌తో పాటు గ్రామస్తులు శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
పేపర్‌మిల్లు ఎదుట గ్రామస్తుల ఆందోళన
షాబాద్, న్యూస్‌లైన్: మండల పరిధిలోని సర్దార్‌నగర్ గ్రామ సర్పంచ్ నర్సింలుపై స్థానికంగా ఉన్న ఓ పేపర్‌మిల్లు యాజమాన్యం దాడి చేసిందని ఆరోపిస్తూ ఆ గ్రామస్తులు ఆదివారం ధర్నా చేశారు. సర్పంచ్ నర్సింలు, గ్రామస్తులు చెప్పిన కథనం ప్రకారం.. సర్దార్నగర్కి సమీపంలో ఉన్న పేపర్ మిల్లు నుంచి దుమ్ము, దూళి అధికంగా వచ్చి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని మిల్లు యజమానితో మాట్లాడేందుకు సర్పంచ్ నర్సింలు, వార్డు సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లాడు. అయితే మిల్లు మేనేజర్ నాగేశ్వర్రావు తన సెక్యూరిటీ గార్డ్స్‌తో సర్పంచ్‌ను బయటకు గెంటివేయించారు. ‘నీవు సర్పంచ్ అయితే మాకేంది..? మా మిల్లు వద్దకు ఎందుకు వచ్చావంటూ’ దుర్భాషలాడటంతో సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు కలిసి కంపెనీ ఎదుట ధర్నాకు దిగారు. మిల్లు నుంచి వచ్చే దుమ్ముతో తాగునీరు కలుషితమవుతోందని, తాము రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లును మూసివేయించాలని గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేదన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మిల్లు మూసివేతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. గ్రామస్తులంతా కలిసి కంపెనీ గేటుకు తాళం వేయడంతో మిల్లులో పనులు నిలిపివేశారు. దీంతో గ్రామస్తులు అక్కడినుంచి వెనుదిరిగారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
సీటీఆర్ఐ (రాజమండ్రి), న్యూస్‌లైన్ : స్థానిక పేపరుమిల్లు సమీపంలోని ఆనంద్‌నగర్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అతడి భార్య నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి విషయం తెలపడంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. సింహాద్రి నగర్‌కు చెందిన వరప్రసాద్ (30)కు గాదిరెడ్డి నగర్‌కు చెందిన వరలక్ష్మితో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలం తర్వాత వరప్రసాద్ అప్పులు చేసి ఆటోలు కొనడం, వాటిని తిరిగి అమ్మేసి ఖాళీగా తిరగడం చేసేవాడు. ఇదిలావుండగా అతడి భార్య వరలక్ష్మి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుం డడంతో తరచూ ఘర్షణ పడేవారు. 2012 ఆగస్టులో వారిద్దరూ ఓ అంగీ కారానికి వచ్చి వేర్వేరుగా జీవిస్తున్నారు. వరలక్ష్మి ఇద్దరు పిల్లలతో కలసి మరో వ్యక్తితో జీవిస్తుండగా, వరప్రసాద్ తన అక్క వద్ద ఉంటున్నాడు. గురువారం వరప్రసాద్, వరలక్ష్మిల పుట్టినరోజు కావడంతో అతడు ఆనందనగర్‌లో నివసిస్తున్న భార్య వద్దకు వచ్చి.. ‘ఇకపై ఇద్దరం కలసి జీవిద్దామ’ని చెప్పాడు. అంగీకరించిన వరలక్ష్మి ఆ రోజు సాయంత్రం గాదాలమ్మ నగర్‌లోని పుట్టింటికి వెళ్లింది. అతడు వరలక్ష్మి ఇంట్లోనే ఉండిపోయాడు. శుక్రవారం ఉదయం కుమారుడు సిద్ధును భర్త వద్దకు పంపించింది. కుమారుడితో ‘నీవు అమ్మను తీసుకురా’ అని చెప్పి వరప్రసాద్ పంపించేశాడు. ఉదయం 9.30 గంటల సమయంలో వచ్చి చూసేసరికి తలుపులు వేసి ఉన్నాయని, లోనికి వెళ్లి చూడగా తన భర్త ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడని ఆమె పోలీసులకు వివరించింది. సీఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాలెన్నో వరప్రసాద్ మృతిపై స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను వరలక్ష్మి ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి సమయంలో ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి కూడా ఇంటికి వచ్చినట్టు సమాచారం. వీరి మధ్య ఏమైనా తగా దా జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఫ్యానుకు ఉరి వేసుకున్న వ్యక్తిని చూసిన వెంటనే చీరను కత్తి పీటతో కోసేశానని చెబుతున్న వరలక్ష్మి మాటలు ఎంతమేర నిజమో నిర్ధారించాల్సి ఉంది. ఆ ఇంటికి దూరంగా ఎందుకు పడవేయాల్సి వచ్చిందనే ప్రశ్న తలెత్తుతు తోంది. వరలక్ష్మి ఉదయం భర్త ఇంటి ముందు ముగ్గు వేసి, తాపీగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి పోలీసులకు తెలిపినట్టు స్థానికులు చెబుతున్నారు. -
నేడు సమరం
కాగజ్‌నగర్, న్యూస్‌లైన్ : సిర్పూర్ పేపర్ మిల్లు(ఎస్పీఎం) గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు అంతా సిద్ధమైంది. బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం కాగజ్‌నగర్ పట్టణంలోని హెచ్ఆర్డీ హాలులో పోలింగ్, కౌంటింగ్ చేపట్టనున్నారు. బరిలో ఏడు యూనియన్లు ఉండగా, ప్రధాన పోటీ ఐదు యూనియన్ల మధ్యే ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు పోటీ పడుతుండటంతో ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎస్పీఎం మజ్దూర్ యూనియన్(సీఐటీయు) తరఫున రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబు పోటీలో ఉన్నారు. బీఎంఎస్ అనుబంధ ఎస్పీఎం వర్క ర్స్ యూనియన్ నుంచి బీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్లోల భట్టాచార్య పోటీలో ఉన్నారు. హెచ్ఎంఎస్ అనుబంధ ఎస్పీఎం తెలంగాణ వర్కర్స్ యూనియన్ నుంచి టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన సోమవారం కాగజ్‌నగర్‌కు వచ్చి బహిరంగ సభ నిర్వహించి కార్మికులను కలుస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. ఈయన తరపున ఎమ్మెల్యేలు కావేటి సమ్మయ్య, వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి ప్రచారం నిర్వహించారు. ఎస్పీఎం నేషనల్ వర్కర్స్ అసోసియేషన్ నుంచి ఐఎన్టీయుసి జాతీయ నేత జి.సంజీవరెడ్డి పోటీ చేస్తుండగా, ఈయన సోమవారం కాగజ్‌నగర్‌కు వచ్చి ఎస్పీఎం గేటు వద్ద కార్మికులను కలిసి అక్కడే నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఈయన తరఫున మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆయన వర్గీయులు ప్రచారం నిర్వహించారు. సిర్పూర్ తెలుగునాడు కార్మిక పరిషత్ నుంచి మాజీ ఎంఎల్సీ ప్రేంసాగర్‌రావు వర్గీయుడు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పోటీలో ఉన్నారు. ఈయన గెలుపు కోసం ఆదివారం ప్రేంసాగర్‌రావు కాగజ్‌నగర్‌లో కార్మికులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈయన తరఫున డీసీసీ నాయకులు విశ్వప్రసాద్, ఆసిఫాబాద్ మాజీ ఎంపీపీ బాలేశ్గౌడ్తోపాటు స్థానిక నాయకులు ప్రచారం నిర్వహించారు. ఎస్పీఎం ఎంప్లాయీస్ యూనియన్ నుంచి ఐఎన్టీయుసీ రాష్ట్ర అధ్యక్షురాలు రాపెల్లి విజయలక్ష్మి పోటీ చేస్తున్నారు. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి ఎస్పీఎం మిల్లులో బుధవారం జరిగే ఎన్నికలకు మిల్లు యాజమాన్యం, కార్మికశాఖ అధికారులు పూర్తి ఏర్పాట్లను చేశారు. మిల్లులోని సైకిల్ స్టాండ్‌లో నాలుగు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఒ క్కో బూత్‌లో 400 నుంచి 440 మంది ఓటర్లు ఓటును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల ఏర్పాట్లను డిప్యూటీ లేబర్ కమిషనర్ దండపాణి, కాగజ్‌నగర్ సహాయ కార్మికశాఖాధికారి మజ రున్నీసాబేగం పరిశీలించారు. మిల్లు యాజమాన్యం తరపున మిల్లు ఉపాధ్యక్షుడు బీసీ శర్మ, సీనియర్ పర్సనల్ మేనేజర్ డీటీ చౌదరి, అసిస్టెంట్ మేనేజర్ ఉదయ్‌కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల సందర్భం గా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ సురేశ్‌బాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.