ర్యాలీ చేస్తున్న జేకే పేపర్ మిల్లు కార్మికులు
రాయగడ : జేకే పేపర్ మిల్ తమ డిమాండ్‌లను పరిష్కరించకపోవడంతో కార్మికులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. తొలుత 10రోజల క్రితం కార్మికలు తమ డిమాండ్‌లను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. తమ డిమాండ్‌లను పరిష్కరించని పక్షంలో ఆం దోళనలు చేపడతామని అందులో పేర్కొన్నారు.
చెప్పినట్టుగానే రోడ్లపై ర్యాలీ నిర్వహిస్తూ జిల్లా కార్మిక శాఖ కార్యాలయానికి చేరుకొని కార్యాల యం ఎదుట ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా 20 సంవత్సరాలుగా పని చేస్తున్న కాం ట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాం డ్ చేశారు. పని ఒత్తిడి అధికంగా ఉన్నా వేతనాలు మాత్రం పెంచడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే కార్మిక యూనియన్లు, యాజమాన్యం మధ్య జరుగుతున్న ఒప్పందాలు చట్టపరంగా జరగడం లేదని ఆరోపించారు. కార్మిక యూని యన్లు, యాజమాన్యం, కార్మిక శాఖల మధ్య కొ త్త ఒప్పందాలు చేసి కార్మికులకు అనుకూలంగా చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లా యంత్రాంగం గానీ యాజమాన్యం గానీ స్పందించకపోవడంతో కార్మికులు రోడ్డెక్కవలసి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా కార్మికులతో పోలీసులు చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment