
సాక్షి, న్యూఢిల్లీ : విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన మరవకముందే ఛతీస్‌గఢ్‌లో మరో గ్యాస్ లికేజీ ఘటన చోటు చేసుకుంది. రాయ్‌గఢ్‌లోని పేపర్ మిల్లులో గ్యాస్ లీకై ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. (చదవండి : విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం)
లాక్‌డౌన్ కారణంగా దాదాపు నెలన్నరోజులుగా పరిశ్రమలు అన్ని మూతపడ్డాయి. ఇటీవల కేంద్రం సడలింపులు ఇవ్వడవంతో దేశంలో పలు పరిశ్రమలు తెరచుకున్నాయి. ఈ క్రమంలో రాయ్‌గఢ్‌లోని పేపర్ మిల్లు కూడా ప్రారంభమయింది. గురువారం మధ్యాహ్నం మిల్లులోని ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు ఏడుగురు కార్మికులు వెళ్లారు. ట్యాంకులోకి దిగి శుభ్రం చేస్తున్న క్రమంలో గ్యాస్ లీకై అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు, పోలీసులు అక్కడికి చేరుకొని.. కార్మికులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment