Gas Leakage
-
పరవాడ ప్రమాదం.. ప్రభుత్వమే ఆదుకోవాలి
గుంటూరు, సాక్షి: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా కంపెనీలో విషవాయువుల లీకేజీ ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారాయన.ఫార్మా సిటీలోని ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువు లీకై కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన తోటి కార్మికులు బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో కఠిన చర్యలుంటాయని ఆదేశాలిచ్చినా.. కంపెనీలు నిర్లక్ష్య ధోరణిని వీడడం లేదు. ఈ ఘటనపై హోం మంత్రి అనిత, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్,ఎస్పీ ఎం.దీపికతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. Also Read in English: YS Jagan Demands AP Government's Support for Victims of Paravada Pharma Company Incident -
వంట గ్యాస్ లీకై మంటలు
హైదరాబాద్: గ్యాస్ లీకేజీ అయి మంటలు అంటుకొని ఒకరు మృతి చెందగా..ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం ఉదయం ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫిలింనగర్ మహాత్మాగాంధీ నగర్ వడ్డెర బస్తీలోని వాంబే కాలనీలో కారు డ్రైవర్‌గా విధులు నిర్వహించే మిర్యాల రమేష్ (38), భార్య శ్రీలత (32), కుమారుడు హర్షవర్ధన్ (13), కూతురు సీతామహాలక్ష్మి(8)తో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరంతా ఎప్పటిలాగే ఆదివారం రాత్రి భోజనాలయ్యాక నిద్రపోయారు. సోమవారం ఉదయం రమేష్ లేచి లైట్ వేయగా స్పార్క్‌కు ఒక్కసారిగా ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. అంతకుముందే గ్యాస్ లీకేజీ అయి ఇళ్ళంతా వ్యాపించగా ఇదంతా గమనించని రమేష్ ఎప్పటిలాగే లేచి లైట్ వేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నిద్రిస్తు న్న భార్య, పిల్లలను అప్రమత్తం చేసిన రమేశ్ వారిని బయటకు పంపించే ప్రయత్నంలో తాను తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటికే మంటలు ఎక్కువవడంతో భార్య శ్రీలత కూడా తీవ్రంగా గాయపడింది. ఈ విషయాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే 108కు ఫోన్ చేయగా..సిబ్బంది గాయపడిన వారందర్నీ ఉస్మానియా ఆస్పత్రి కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రమేష్ మృతిచెందాడు. ఆయన భార్య శ్రీలత 90 శాతం గాయాలతో చికిత్స పొందుతుండగా..పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పిల్లలు 15 శాతం గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్.. పలువురు మృతి
ఛండీఘర్: పంజాబ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. గియాస్పురా ప్రాంతంలో ఉన్న ఓ కెమికల్ కంపెనీలో గ్యాస్ లీకేజీ కారణంగా ఎనిమిది మంది మరణించగా.. మరికొందరు అస్వస్థతకు గురుయ్యారు. దీంతో, రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ ఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించింది. వివరాల ప్రకారం.. లూథియానాలోని గియాస్పురా ప్రాంతంలో సువా రోడ్‌లోని గోయల్ మిల్క్ ప్లాంట్ కూలింగ్ సిస్టమ్ పరిశ్రమ నుంచి ఆదివారం ఉదయం గ్యాస్ లీక్ అయ్యింది. ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఎనిమిది మంది మృతిచెందారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గుర్యయారు. ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందం చేరుకున్నారు. అస్వస్థతకు గురైన వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. గ్యాస్ కారణంగా ఆ ప్రాంతంలో ఉన్న వారిని అక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలించినట్టు లూథియానా అసిస్టెంట్ డీసీపీ సమీర్ వర్మ తెలిపారు. VIDEO | At least eight people killed in gas leak at a factory in Punjab's Ludhiana. NDRF team carrying out rescue operation. More details are awaited. pic.twitter.com/OHw8vD7LBu — Press Trust of India (@PTI_News) April 30, 2023 ఇక, ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. మృతుల వివరాలు ఇవే.. సౌరవ్ (35), వర్ష (35), ఆర్యన్ (10), చూలు (16), అభయ్ (13), కల్పేష్ (40), తెలియని మహిళ (40), తెలియని మహిళ (25), తెలియని పురుషుడు (25), నీతూ దేవి మరియు నవనీత్ కుమార్. ఇది కూడా చదవండి: సూడాన్ టూ భారత్.. ఆనందంలో బాధితులు.. -
విష వాయువుల లీకేజీ ఘటనపై ప్రభుత్వం సీరియస్
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బ్రాండిక్స్ అపెరల్ పార్క్ సిటీలోని సీడ్స్ కంపెనీలో మరోసారి విష వాయువులు లీకైన దుర్ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రమాదానికి గల కారణాలు తెలిసేంతవరకు సంఘటన జరిగిన యూనిట్‌లోని విభాగాన్ని తాత్కాలికంగా మూసివేయాల్సిందిగా సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. సీడ్స్ కంపెనీలో జరిగిన ప్రమాదాలకు కంపెనీ యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. ఆ విభాగాన్ని తాత్కాలికంగా మూసివేయడం వల్ల కార్మికులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూస్తామని హామీ ఇచ్చారు. బుధవారం ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై డీఎంహెచ్ఓ డాక్టర్ హేమంత్, ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రావణ్‌కుమార్‌ను ఆరా తీశారు. బాధితులకు పూర్తిగా నయమయ్యే వరకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన కారణాలను తెలుసుకున్నారు. బాధితులు మాట్లాడుతూ.. మంగళవారం సాయంత్రం తాము క్యాంటీన్‌కి వెళ్తున్నప్పుడు కాలిన వాసన వెలువడిందని, అప్పటికే తమకు కళ్లు తిరిగి, వికారంగా ఉండటం, వాంతులు రాగా.. కొంతమంది స్పృహ కోల్పోయారని వివరించారు. అనంతరం అక్కడ నుంచి అచ్యుతాపురం బ్రాండిక్స్ ఆవరణలో ఉన్న సీడ్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ అయిన ఎం–1 యూనిట్‌ను కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి, యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజుతో కలిసి మంత్రి అమర్నాథ్ పరిశీలించారు. సీడ్స్‌లో ఇటువంటి ఘటన రెండోసారి జరగడం బాధాకరమన్నారు. భద్రతా ప్రమాణాలపై ఉన్నతస్థాయి కమిటీ రాష్ట్రంలోని ప్రమాదకర పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై ఉన్నతస్థాయి కమిటీ నియమించి సేఫ్టీ ఆడిట్ జరిపిస్తామని మంత్రి అమర్నాథ్ చెప్పారు. గతంలో అస్వస్థతకు గురైనవారు ఆరోగ్యపరంగా భవిష్యత్‌లో ఏవిధమైన ఇబ్బందులు పడతారనే విషయాన్ని తెలుసుకునేందుకు ఐసీఎంఆర్‌కు లేఖ రాశామని చెప్పారు. గతంలో ఆ కంపెనీలో గ్యాస్ లీకయినప్పుడు అందుకు గల కారణాలు తెలుసుకునేందుకు జిల్లాస్థాయి అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులు, ఏయూ ప్రొఫెసర్లతో కమిటీని వేశామన్నారు. ఆ కమిటీ సీడ్స్ నుంచి కొన్ని శాంపిల్స్ సేకరించి పరీక్షించగా అందులో ‘కాంప్లెక్స్ గ్యాస్’ ఉన్నట్లు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చిందన్నారు. చెదల నివారణకు వాడే క్రిమిసంహారక మందు ఏసీ యంత్రాల్లోకి వెళ్లి ప్రమాదకరమైన విషవాయువులు బయటకు వెలువడ్డాయని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందన్నారు. ఆ నివేదిక ఆధారంగా కంపెనీ యాజమాన్యానికి సెక్షన్–41 కింద జూన్ 30న షోకాజ్ నోటీసులు జారీ చేశామని, రెండు నెలల్లో ఈ నోటీసుకు సమాధానం ఇవ్వకుంటే ప్రాసిక్యూట్ చేస్తామని కూడా హెచ్చరించామని వివరించారు. దీనిపై ఆ సంస్థ యాజమాన్యం స్పందించాల్సి ఉందన్నారు. 37 మంది డిశ్చార్జి విష వాయువుల లీకేజీ ఘటనలో అస్వస్థతకు గురై అనకాపల్లిలోని ఎన్టీఆర్ జిల్లా వైద్యాలయం, ఉషా ప్రైమ్ ఆస్పత్రి, సత్యదేవ్ ఆస్పత్రి, విశాఖలోని మెడికేర్, వైభవ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 123 మంది బాధితుల్లో 37 మందిని బుధవారం డిశ్చార్జి చేశారు. మిగిలిన 86 మందికి చికిత్స అందిస్తున్నామని, వారు క్రమంగా కోలుకుంటున్నారని డీఎంహెచ్‌వో హేమంత్‌కుమార్ చెప్పారు. -
గ్యాస్ లీకేజీ ఘటనపై ఏపీ సర్కార్ సీరియస్
సాక్షి, అనకాపల్లి జిల్లా: అచ్యుతాపురం సెజ్ సీడ్స్ కంపెనీలో విషవాయువు లీకేజీపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. తక్షణమే సీడ్స్ కంపెనీని మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఫ్యాక్టరీ తెరవకూడదని ఆదేశించింది. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహరెడ్డి ఆదేశించారు. అచ్యుతాపురం సెజ్‌లో గ్యాస్ లీకైన ఘటనపై ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. గతంలో జరిగిన విష వాయువు లీకేజీపై విచారణ జరుగుతుండగా మరోసారి ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. జరిగిన ప్రమాదానికి సీడ్స్ కంపెనీయే బాధ్యత వహించాలన్నారు. విషవాయువు లీకేజీ సంఘటనలో గాయపడిన బాధితులను ఎన్టీఆర్ ప్రభుత్వ హాస్పిటల్లో మంత్రి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చదవండి: అచ్యుతాపురం సెజ్‌లో మళ్లీ గ్యాస్ లీక్ సీడ్స్ యూనిట్లో 121 మంది అస్వస్థతకు గురైనట్లు మంత్రి అమర్నాథ్ తెలిపారు. అస్వస్థతకు గురైన వారిని అయిదు ఆసుపత్రుల్లో జాయిన్ చేశామని, బాధితుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. బాధితుల చికిత్సకు ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. కాంప్లెక్స్ రసాయనాలు ఉన్నట్లు ప్రాథమిక నివేదికలో తేలిందన్నారు. జరిగిన ప్రమాదంపై నమూనాలను ఐసీఎమ్ఆర్కు పంపుతున్నట్లు చెప్పారు. జరిగిన తప్పు పునరావృతం కాకుండా సీడ్స్ కంపెనీ చూసుకోవాలని హెచ్చరించారు. ప్రస్తుత ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ విచారణకు ఆదేశించామని తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర స్థాయిలో ఉన్న పరిశ్రమలు అన్నింటిపైన సేఫ్టీ అడిట్ జరుగుతుందని వెల్లడించారు. రెండు నెలల క్రితం ఇదే కంపెనీలో ప్రమాదం జరిగిందని గుర్తుచేసిన మంత్రి దీనిపై కమిటీ వేశామని, ఇంకా విచారణ జరుగుతుందన్నారు. గత ప్రమాదంలో క్లోరిఫైపాలిష్ అనే రసాయనాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని, దీనిపై సీడ్స్ కంపెనీకి నోటీసులు కూడా జారీ చేశామన్నారు. -
అచ్యుతాపురం సెజ్‌లో మళ్లీ గ్యాస్ లీక్
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి విష వాయువులు లీకై బ్రాండిక్స్ సీడ్స్–2 కంపెనీలో పనిచేసే 100 మందికి పైగా మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రెండో షిఫ్ట్‌లో సుమారు 2 వేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. సాయంత్రం 6.30 గంటలకు టీ బ్రేక్ సమయంలో ఒక్కసారిగా గ్యాస్ లీకవడంతో ఉద్యోగినులకు శ్వాస తీసుకోవడం కష్టమైంది. వాంతులు, వికారంతో అనేకమంది స్పృహ తప్పి పడిపోయారు. అక్కడి వైద్య సిబ్బంది కొందరికి ప్రాథమిక చికిత్స అందించారు. 45 మందిని అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. జిల్లా కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి, ఎస్పీ గౌతమి సాలి హుటాహుటిన ఘటన స్థలానికి వెళ్లారు. మిగతా ప్లాంట్లలో సిబ్బందిని పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించండి: మంత్రి అమర్నాథ్ అచ్యుతాపురం ఘటనపై పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నా«థ్ కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టితో మాట్లాడారు. గ్యాస్ లీక్‌కు కారణాలను తెలుసుకున్నారు. తక్షణమే బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఇదీ చదవండి: విశాఖ తీరంలో అరుదైన జీవి.. రాలిన ఆకులా చదునైన శరీరం, ఇదే ప్రత్యేకత -
గిరిజన మహిళ ధైర్యం, తప్పిన పెనుప్రమాదం.. లేదంటే బూడిదే!
సాక్షి,గుమ్మలక్ష్మీపురం(పార్వతిపురం మణ్యం): వంట గ్యాస్ లీకవడంతో మంటలు చెలరేగగా.. ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించకూడదని భావించిన ఓ గిరిజన మహిళ ధైర్యంతో..చాకచక్యంగా వ్యవహరించి గ్యాస్ సిలిండర్‌ను ఆరుబయటకు తీసుకొచ్చి పడేయడంతో పెనుప్రమాదం తప్పింది. వివరాలిలా ఉన్నాయి. గుమ్మలక్ష్మీపురం మండలంలోని పెదఖర్జ పంచాయతీ బొద్దిడి గ్రామానికి చెందిన మండంగి సుజాత సోమవారం ఉదయం ఇంట్లో గ్యాస్‌పొయ్యిపై వంట చేస్తుండగా గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. వంట గది పురిపాక కావడంతో మంటలు ఎగసిపడడం గమనించిన ఆమె గ్యాస్ సిలిండర్ పేలితే పెనుప్రమాదం జరుగుతుందని ఊహించి ఎవరికీ ఎటువంటి నష్టం జరగకూడదని భావించి, సిలిండర్‌ను పొయ్యి నుంచి వేరు చేసి, ఆరుబయటకు తీసుకొచ్చి మురుగునీటి కాలువలో పడేసింది. ఈ విషయాన్ని గమనించిన చుట్టు పక్కల వారు వంటగదిలోని మంటలతో పాటు గ్యాస్ సిలిండర్లోని మంటను ఆర్పివేశారు. ఈ సంఘటణలో ప్రాణాలకు తెగించి సాహసం చేసిన మహిళ ఎడమ చేతికి కొంతమేర కాలిన గాయాలయ్యాయి. ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ధైర్యంగా వ్యవహరించిన ఆమెను గ్రామస్తులంతా అభినందిస్తున్నారు. చదవండి: AP: ఏ సీఎం ఇలాంటి ఆలోచన చేయలేదు -
అచ్యుతాపురం గ్యాస్ లీకేజ్ ఘటనపై విచారణ కమిటీ
సాక్షి, విశాఖపట్నం: అచ్యుతాపురం సెజ్‌లో గ్యాస్ లీకేజ్ ఘటనపై విచారణ కమిటీని ప్రభుత్వం నియమించింది. విచారణ కమిటీని నియమిస్తూ పీసీబీ కార్యదర్శి విజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నలుగురు అధికారులతో కూడిన విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. విచారణ కమిటీ సభ్యులుగా అనకాపల్లి జాయింట్ కలెక్టర్, పీసీబీ జేఈఈ, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్‌ను ప్రభుత్వం నియమించింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పారిశ్రామికవాడ (ఎస్ఈజెడ్) లోని బ్రాండిక్స్ అపరెల్ పార్కు సిటీలో శుక్రవారం ఉదయం విషవాయువు లీకైన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా కళ్ల మంటలు, శ్వాస తీసుకోలేకపోవడం, వాంతులతో అక్కడ పనిచేసే మహిళా ఉద్యోగులు విలవిల్లాడారు. అందరూ బయటకు పరుగులు తీశారు. సుమారు 178 మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. -
అనకాపల్లి గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం వైఎస్ జగన్ ఆరా
-
అనకాపల్లి గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం జగన్ ఆరా
సాక్షి, అమరావతి: విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురంలో అమ్మోనియా గ్యాస్ లీక్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. ఘటనపై అధికారుల నుంచి వివరాలు కోరారు. ఘటనకు దారితీసిన కారణాలను సీఎంఓ అధికారులు వివరించారు. సంబంధిత జిల్లా కలెక్టర్ వెంటనే వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారని అధికారులు వెల్లడించారు. గ్యాస్ లీక్‌ను కూడా నియంత్రించారని అధికారులు తెలిపారు. చదవండి: అచ్యుతాపురంలోని సెజ్‌లో గ్యాస్ లీక్! పలువురికి అస్వస్థత బ్రాండిక్స్‌లో ఒక యూనిట్లో పనిచేస్తున్న మహిళలను అందరిని ఖాళీ చేయించామని, అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారని అధికారులు తెలిపారు. అంతా కోలుకుంటున్నారని, క్షేమంగా ఉన్నారని వివరించారు. అమ్మోనియా ఎక్కడ నుంచి లీకైందన్న అంశంపై అధికారులు దర్యాప్తు చేపట్టారన్నారు. అస్వస్థతకు గురైన వారికి మంచి వైద్యాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేసి, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా స్థానిక మంత్రి గుడివాడ అమర్నాథ్ను సీఎం ఆదేశించారు. వెంటనే ఆయన విజయవాడ నుంచి అనకాపల్లి బయల్దేరి వెళ్లారు. -
అనకాపల్లి అచ్యుతాపురంలో గ్యాస్ లీక్
-
వాచర్.. డేంజర్: సమస్య ఒక్కరిది కాదు.. నగరంలో వేలమందిది
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నాగోల్‌కు చెందిన మహేశ్వర్ వంట గ్యాస్ బుక్ చేయడంతో సిలిండర్ డోర్ డెలివరీ అయింది. కొత్త సిలిండర్ రీఫిల్‌కు రెగ్యులేటర్ అమర్చిన కొన్ని గంటల తర్వాత గ్యాస్ లీకేజీ అవుతున్నట్లు వాసన వచ్చింది. పైప్‌ను పరిశీలిస్తే అంతా సవ్యంగానే కనిపించింది. రెగ్యులేటర్ కింద నుంచి గ్యాస్ లీకవుతున్నట్లు గమనించి తక్షణమే దానిని తొలగించి తిరిగి సీల్ మూత బింగించారు. గ్యాస్ ఏజెన్సీకి ఫోన్‌చేస్తే మరుసటి రోజు సంబంధిత నిపుణుడు వచ్చి తనిఖీ చేసి సిలిండర్ నాజిల్లోని వాచర్ మార్చాడు. రూ.300 చార్జీలు వసూలు చేశాడు. సిలిండర్ నాజిల్లో వాచర్ సమస్య ఎందుకు వస్తుందని అడిగితే వాచర్ నాసిరకంతో పాటు రెగ్యులేటర్తోనూ సమస్యగా పేర్కొన్నాడు. ఇది ఒక మహేశ్వర్‌కు ఎదురైనా సమస్య కాదు.. నగరంలో వేలాది మంది వినియోగదారులు గ్యాస్ లీకేజీ సమస్యను ఎదుర్కొంటున్నావారే. ►కొత్త సిలిండర్ బిగించే సమయంలో రెగ్యులేటర్, సిలిండర్ నాబ్‌ల నుంచి గ్యాస్ లీకవుతో ఉంటుంది. తాజాగా సిలిండర్ నాజిల్లోని వాచర్ నుంచి కూడా లీకేజీలు బయటపడుతున్నాయి. నిపుణులు వచ్చి పరిశీలిస్తే గాని గుర్తించలేని పరిస్థితి. అప్పటి వరకు సిలిండర్ సీల్‌ను మూసి ఉంచాల్సి ఉంటుంది. ఇటీవల ఇలాంటి ఘటనలు సంభవిస్తున్నాయి. నాజిల్లో నాసిరకం వాచర్లు అమర్చడం లీకేజీలకు కారణమవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ►కొన్ని పర్యాయాలు రెగ్యులేటర్ ఒత్తిడితోనూ వాచర్ కదిలి గ్యాస్ లీకేజీ అవుతోందని వారంటున్నారు. సిలిండర్ రీఫిల్ సమయంలోనే ఆయిల్ కంపెనీలు వాటిని పరిశీలిస్తే సమస్య ఉత్పన్నం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆయిల్ కంపెనీలు మాత్రం కేవలం తాత్కాలిక ఉపశనం కలిగించేలా వాచర్లను మార్చుతుందే తప్ప శాశ్వత పరిష్కారం కోసం చొరవ చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: (రోడ్డు ప్రమాదాల నివారణకు వీ2ఎక్స్ టెక్నాలజీ! ఎన్నెన్నో ప్రయోజనాలు) లీకేజీకి కారణాలు.. ►ఎక్కువ శాతం సిలిండర్, స్టౌలను కలుపుతూ రబ్బర్ ట్యూబ్ ద్వారా లీకేజీలు ఉంటాయి. ఇది అటు సిలిండర్‌కు, ఇటు స్టౌకు అతికే ప్రాంతాల్లో ఏదో ఒక చోట నుంచి లీక్ అయ్యే ప్రమాదం ఉంది. సాధారణంగా స్టౌకు అనుసంధానిచే చోటే వేడి వల్ల ఈ ట్యూబ్ సాగే గుణం కోల్పోతుంది. ►ఫలితంగా పెళుసుదనం సంతరించుకుని పగుళ్లు ఏర్పడతాయి. కేవలం గుండుసూది మొన పరిమాణంలో రంధ్రం ఏర్పడి దీనిలోంచి గంటకు ముప్పావు నుంచి కేజీన్నర వరకు గ్యాస్ లీక్ అవుతుంది. మెల్లమెల్లగా ఇల్లంతా వ్యాపిస్తుంది. ►ఎల్పీజీకి వ్యాకోచ శక్తి ఎక్కువ. లీకేజీతో వ్యాపించి ఉన్న గ్యాస్‌కు ప్రేరణ లభించగానే ఒక్కసారిగా మంట అంటుకుటుంది. ఇలా అంటుకున్న సందర్భంలో విస్తరించి ఉన్న గ్యాస్ 12 వేల రెట్లు వ్యాకోచిస్తుంది. అంటే కేజీ గ్యాస్ లీకై ఉంటే... మంట అంటుకున్న వెంటనే అది 12 వేల కేజీల వరకు వ్యాకోచిస్తుంది. ఫలితంగానే గ్యాస్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. -
సంచలనంగా మారిన రామకృష్ణ సెల్ఫీ వీడియో
-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో విషాదం
-
నెల్లూరులో విషాదం: గ్యాస్ లీక్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
సాక్షి, నెల్లూరు:నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మల్లం గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అయ్యి మంటలు భారీగా వ్యాపించడంతో దంపతులు అబ్బాస్, నౌషాద్కు తీవ్రగాయాలపాలై అక్కడిక్కడే మృతి చెందగా, కుమార్తె అయేషాను చికిత్సకోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయేషా కూడా మృతి చెందింది. వివరాల ప్రకారం.. అబ్బాస్ కుటుంబం మల్లంలో టిఫిన్ అంగడి నిర్వహిస్తుంటారు. తెల్లవారుజామున యధావిధిగా గ్యాస్ వెలిగించడంతో అప్పటికే గ్యాస్ లీక్ అయిన క్రమంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో బాధితులు అహకారాలు చేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపు చేసినప్పటికీ అప్పటికే ఇంట్లో ఉంటున్న ముగ్గురు తీవ్రగాయాలపాలై మృతి చెందారు. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చదవండి: విహారయాత్రలో విషాదం: అంతవరకు ఆనందంగా గడిపిన క్షణాలు.. ఒక్క అల రాకతో.. -
HPCL: స్వల్పంగా గ్యాస్ లీకేజీ..
విశాఖ: విశాఖపట్నంలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) కంపెనీలో బుధవారం స్వల్పంగా గ్యాస్ లీకైంది అయితే, దీన్నిగుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమై గ్యాస్ లీకేజీని అదుపు చేశారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘాటైన గ్యాస్ లీక్
-
తైషాన్ ప్లాంట్‌తో ప్రమాదమేమీ లేదు: చైనా
బీజింగ్/హాంకాంగ్: తైషాన్ న్యూక్లియర్ ప్లవర్ ప్లాంట్ చుట్టుపక్కన అసాధారణ అణు ధార్మికత స్థాయి ఆనవాళ్లలేవీ లేవని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ మంగళవారం ప్రకటించారు. ఈ ప్లాంట్ నుంచి ప్రమాదకర వాయువులు లీక్ అవుతున్నాయనే వార్తలను కొట్టిపారేశారు. ప్రజల భద్రతకు హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తైషాన్ ప్లాంట్‌ను ప్రమాదకరమైన వాయువు వెలువడుతున్నట్లు సహ భాగస్వామి అయిన ఫ్రాన్స్ కంపెనీ ఫ్రామటోమ్ బయటపెట్టిన సంగతి తెలిసిందే. సమస్య పరిష్కారం కోసం అమెరికా సాయాన్ని కోరింది. గ్యాస్ లీకేజీని అడ్డుకోకపోతే ఇదొక పెద్ద విపత్తుగా మారే ప్రమాదం ఉందని అమెరికా నిపుణులు హెచ్చరించారు. -
కాలిబూడిదైన అంబులెన్స్.. తృటిలో తప్పిన ప్రమాదం
చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రి వద్ద శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్న అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్లు మారుస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది మిగతా సిలిండర్లను అక్కడినుంచి తరలించారు. అయితే అప్పటికే అంబులెన్స్‌కు మంటలు అంటుకోవడంతో పూర్తిగా కాలిపోయింది. ఈ సమయంలో అంబులెన్స్‌లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా ప్రమాదం జరిగే కొన్ని నిమిషాల ముందే అంబులెన్స్‌లో కోవిడ్ రోగులను ఆసుపత్రికి తీసుకొచ్చారు. కోవిడ్ రోగులను కరోనా వార్డుకు పంపిన వెంటనే సిబ్బంది వచ్చి ఆక్సిజన్ సిలిండర్ మారుస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సిలిండర్ మారుస్తున్న సమయంలో గ్యాస్ లీకవడంతో పాటు అంబులెన్స్‌లో షార్ట్ సర్య్కూట్ చోటుచేసుకోవడంతో ఇది జరిగి ఉండొచ్చని సిబ్బంది వాపోయారు. అయితే ఆసుపత్రి రీజనల్ మెడికల్ ఆఫీసర్ మాత్రం ఈ ఘటనపై ఏం స్పందించలేదు. మరోవైపు తమిళనాడులో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గకపోవడంతో ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: covid: డబ్బులు ఇస్తేనే నీ భర్త మృతదేహం.. -
ఎల్జీ పొలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనకు ఇవాళ్టితో ఏడాది పూర్తి
-
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనకు ఏడాది పూర్తి
-
టైకి ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల ఆర్థిక సాయం:కన్నబాబు
-
మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు
సాక్షి, కాకినాడ: టైకి ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు వ్యవసాయ శాఖా మంత్రి మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ప్రభుత్వం తరఫున 10 లక్షలు, కంపెనీ తరఫున 40 లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా ప్రమాదంలో గాయపడిన వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం లక్ష, కంపెనీ రూ. 3 లక్షలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇక మృతి చెందిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇండ్ల స్థలం(ప్రభుత్వం తరఫున) ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బాధిత కుటుంబాల పక్షాన పరిశ్రమ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలమైనట్లు వెల్లడించారు. కాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం ఆటోనగర్ వద్ద బల్క్‌డ్రగ్స్ తయారుచేసే టైకీ పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించిన విషయం విదితమే. పేలుడుకు దెబ్బతిన్న గ్యాస్‌లైన్ రియాక్టర్ ఈ ప్రమాదంలో సూపర్వైజర్లు కాకర్ల సుబ్రహ్మణ్యం(31), తోటకూర వెంకటరమణ(37) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలియగానే మంత్రి కురసాల కన్నబాబు, కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, ఇతర శాఖల అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, అప్పటివరకు మూసివేయాలని మంత్రి ఆదేశించారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ఇదే పరిశ్రమలో గతంలో గ్యాస్ లీకేజీ కలవరం రేపింది. అప్పట్లో అధికారులు విచారణ జరిపి లీకేజీ జరగలేదని ప్రకటించారు. కాగా, ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. చదవండి: సర్పవరం టైకీ పరిశ్రమలో ప్రమాదం: ఇద్దరు మృతి -
సర్పవరం టైకీ పరిశ్రమలో ప్రమాదం: ఇద్దరు మృతి
సాక్షి, కాకినాడ రూరల్/ఏలూరు టౌన్: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం ఆటోనగర్ వద్ద బల్క్‌డ్రగ్స్ తయారుచేసే టైకీ పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పరిశ్రమలో బల్క్‌డ్రగ్స్ తయారీకి పైపులద్వారా గ్యాస్‌లైన్ రియాక్టర్‌కు నైట్రిక్ యాసిడ్, ఎసిటిక్ ఎన్‌హైడ్రేడ్ రసాయనాలను పంపుతున్నారు. మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో ఒక్కసారిగా రియాక్టర్ ఉష్ణోగ్రత పెరిగిపోయింది. దీన్ని నియంత్రించేందుకు ఇద్దరు సూపర్వైజర్లు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా భారీశబ్దంతో అది పేలిపోయింది. దీంతో సూపర్వైజర్లు కాకర్ల సుబ్రహ్మణ్యం(31), తోటకూర వెంకటరమణ(37) అక్కడికక్కడే మృతిచెందారు. వారి దేహాలు ఛిద్రమైపోయాయి. అక్కడికి సమీపంలో విధుల్లో ఉన్న ఆపరేటర్లు కుడుపూడి శ్రీనివాసరావు, నమ్మి సింహాద్రిరావు, కలగ సత్యసాయిబాబు, రేగిల్లి రాజ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో సత్యసాయిబాబు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు పెద్ద శబ్దం, భారీగా పొగలు రావడంతో ఏం జరిగిందో తెలియక సర్పవరం గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమాచారం తెలియగానే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, ఇతర శాఖల అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, అప్పటివరకు మూసివేయాలని మంత్రి ఆదేశించారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ఇదే పరిశ్రమలో గతంలో గ్యాస్ లీకేజీ కలవరం రేపింది. అప్పట్లో అధికారులు విచారణ జరిపి లీకేజీ జరగలేదని ప్రకటించారు. కాగా, ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. ప్రమాద ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి కన్నబాబు, జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డితో డిప్యూటీ సీఎం ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అత్యాధునిక వైద్యం అందించేలా వైద్యాధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించిన మంత్రి గౌతమ్‌రెడ్డి సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని సర్పవరం టైకీ పరిశ్రమలో గురువారం మధ్యాహ్నం రియాక్టర్ పేలిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మరో నలుగురు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. తక్షణం ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి, నివేదిక అందజేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. యాజమాన్య తప్పిదాల వల్ల కార్మికులకు, స్థానికులకు నష్టం జరిగితే సహించబోమని, యాజమాన్య లోపం వల్ల ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే విధంగా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించారు. వచ్చేది వేసవి కాలం కావడంతో పెరిగే ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని ఫార్మా, కెమికల్స్ వంటి ప్రమాదాలు జరిగే పరిశ్రమలను గుర్తించి, ముందస్తుగా రక్షణ ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి అన్ని జిల్లాల పరిశ్రమల శాఖ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులను మంత్రి గౌతమ్‌రెడ్డి ఆదేశించారు. చదవండి: మానవత్వాన్ని చాటుకున్న మంత్రి పెద్దిరెడ్డి -
యూపీలో గ్యాస్ లీకేజీ.. ఇద్దరు మృతి
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ సమీపంలోని ఫూల్పూర్ ఇండియన్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో) ప్లాంటులో బుధవారం గ్యాస్ లీకేజ్ జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మరణించగా.. మరో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది.'అమ్మోనియా గ్యాస్ లీకేజీ వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుంది ఇఫ్కో కర్మాగారంలో గ్యాస్ లీకేజీని నిలిపివేశామని.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని' ప్రయాగరాజ్ జిల్లా మెజిస్ట్రేట్ భానుచంద్ర గోస్వామి చెప్పారు.కాగా ఈ ఘటనలో ఇఫ్కో అధికారులు వీపీ సింగ్, అభయ్ నందన్ లు మరణించారు. గ్యాస్ లీకేజీ కారణంగా ఇద్దరు అధికారులు మరణించడం పట్ల సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ఇఫ్కో ప్లాంటులో గ్యాస్ లీకేజీ ఉదంతంపై దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు.