
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ సమీపంలోని ఫూల్పూర్ ఇండియన్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో) ప్లాంటులో బుధవారం గ్యాస్ లీకేజ్ జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మరణించగా.. మరో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది.'అమ్మోనియా గ్యాస్ లీకేజీ వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుంది ఇఫ్కో కర్మాగారంలో గ్యాస్ లీకేజీని నిలిపివేశామని.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని' ప్రయాగరాజ్ జిల్లా మెజిస్ట్రేట్ భానుచంద్ర గోస్వామి చెప్పారు.కాగా ఈ ఘటనలో ఇఫ్కో అధికారులు వీపీ సింగ్, అభయ్ నందన్ లు మరణించారు. గ్యాస్ లీకేజీ కారణంగా ఇద్దరు అధికారులు మరణించడం పట్ల సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ఇఫ్కో ప్లాంటులో గ్యాస్ లీకేజీ ఉదంతంపై దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు.