ammonia gas
-
ప్రమాదానికి కారణం అమోనియం కాదా...?
అనకాపల్లి: బ్రాండిక్స్‌లో సీడ్స్ కంపెనీలో ప్రమాదకర వాయువు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై నిపుణుల కమిటీ దర్యాప్తు మొదలుపెట్టింది. 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే విషవాయువుల వ్యాప్తి జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. ఈ వాయువుల్లో అమోనియం లేదని, ఉండి ఉంటే కళ్లకు మరింత ప్రమాదముంటుందని నిపుణుల బృందం భావిస్తోంది. సీడ్స్ కంపెనీలోని ఏసీ యూనిట్లన్నింటినీ కమిటీ పరిశీలించింది. ఏసీ యూనిట్‌కు సంబం«ధించిన గ్యాస్, ఇతర డస్ట్‌లను పరిశీలించినట్టుగా సమాచారం. ఉద్యోగులను అస్వస్థతకు గురి చేసిన వాయువు ఎక్కడ నుంచి విడుదలైందన్న విషయం మాత్రం తేలాల్సి ఉంది. పొరుగున ఉన్న ఫార్మా కంపెనీల నుంచి విషవాయువు వస్తే ఆ కర్మాగారంలోని ఉద్యోగులు, మధ్యలో ఉన్న వివిధ వర్గాల వారికి ప్రమాదముండేది కాబట్టి దానిపై కూడా స్పష్టత రావడం లేదు. మరోవైపు బ్రాండిక్స్‌లో ఉన్న పలు యూనిట్లలో ప్రమాదకర రసాయనాలతో ఎటువంటి పనులు చేయరని ఇక్కడి యాజమాన్యం చెబుతోంది. ఒకట్రెండు రోజుల్లోనే నిపుణుల బృందం స్పష్టమైన అంచనాకు రానుంది. (చదవండి: ఇన్స్పెక్టర్ రాసలీలలు.. లవ్ యూ అంటూ ఆమెకు దగ్గరై.. ఆ తర్వాత..) -
యూపీలో గ్యాస్ లీకేజీ.. ఇద్దరు మృతి
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ సమీపంలోని ఫూల్పూర్ ఇండియన్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో) ప్లాంటులో బుధవారం గ్యాస్ లీకేజ్ జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మరణించగా.. మరో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది.'అమ్మోనియా గ్యాస్ లీకేజీ వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుంది ఇఫ్కో కర్మాగారంలో గ్యాస్ లీకేజీని నిలిపివేశామని.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని' ప్రయాగరాజ్ జిల్లా మెజిస్ట్రేట్ భానుచంద్ర గోస్వామి చెప్పారు.కాగా ఈ ఘటనలో ఇఫ్కో అధికారులు వీపీ సింగ్, అభయ్ నందన్ లు మరణించారు. గ్యాస్ లీకేజీ కారణంగా ఇద్దరు అధికారులు మరణించడం పట్ల సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ఇఫ్కో ప్లాంటులో గ్యాస్ లీకేజీ ఉదంతంపై దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. -
ఎవరూ ఆందోళన చెందొద్దు : వీరపాండియన్
సాక్షి, కర్నూలు : ఎస్పీవై రెడ్డి ఆగ్రో కెమికల్ ఇండస్ట్రీ గ్యాస్ లీక్ ఘటనపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్ స్పందించారు. కంపెనీ లోపల మాత్రమే గ్యాస్ లీకైందని, బయట గ్యాస్ లీక్ ప్రమాదం లేదని స్పష్టం చేశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో కంపెనీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి(50) మృతి చెందినట్లు కలెక్టర్ వెల్లడించారు. గాయాలపాలైన మరో ముగ్గురి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ వీరపాండియన్ సంఘటనా స్థలానికి చేరుకుసి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అత్యవసర శాఖల అధికారులను యుద్దప్రాతిపదికన రంగంలోకి దింపి సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందొద్దని, అన్ని రకాల జాగ్రత్తతు తీసుకున్నామని చెప్పారు. అగ్నిమాపక, రెవెన్యూ, పోలీసు, పరిశ్రమలు, వైద్యశాఖ అధికారుల ద్వారా యుద్దప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టామని కలెక్టర్ పేర్కొన్నారు. (చదవండి : ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీలో విషవాయువు లీక్) కాగా, నంద్యాలలోని మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆగ్రో కెమికల్ ఇండస్ట్రీలో శనివారం ఉదయం ప్రమాదవశాత్తూ అమ్మోనియా గ్యాస్ లీకైన విషయం తెలిసిందే. ఈఘటనలో కంపెనీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. 2 టన్నుల సామర్థ్యమున్న అమ్మోనియం ట్యాంకర్ లీకవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి గ్యాస్‌ను అదుపు చేస్తోంది. ఆగ్రోప్లాంట్ చుట్టూ గ్యాస్ వ్యాపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీలో విషవాయువు లీక్
సాక్షి, కర్నూలు: నంద్యాలలోని మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆగ్రో కెమికల్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో శనివారం ఉదయం ప్రమాదవశాత్తూ అమ్మోనియా గ్యాస్ లీకైన సంఘటనలో జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు, వైద్య, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. అస్వస్థతకు గురైన వారిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే ఫ్యాక్టరీలో ఉన్నవారిని బయటకు తరలిస్తున్నారు. అమ్మోనియా గ్యాస్‌ను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తోంది.మరోవైపు ఆగ్రో ఫ్లాంట్ చుట్టూ గ్యాస్ వ్యాపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. -
కోల్డ్ స్టోరేజీలో అమ్మోనియా గ్యాస్ లీక్..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఓ కోల్డ్ స్టోరేజీలో అమ్మోనియా గ్యాస్ లీక్ కావడం కలకలం రేపింది. ఫతేపూర్ జిల్లాలోని జహనాబాద్ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అమ్మోనియా గ్యాస్ లీక్ అయిన కోల్డ్ స్టోరేజీ నుంచి 42 మంది కార్మికులను తరలించినట్లు సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. కోల్డ్ స్టోరేజీ పరిధిలో 2 కిలోమీటర్ల వరకు రాకపోకలను నిలిపివేశారు. ఘటన జరిగిన సమీపంలో ఎలాంటి గ్రామాలు లేవని అధికారులు తెలిపారు. అమ్మోనియా గ్యాస్‌ను పీల్చడం ద్వారా ముక్కు, శ్వాసనాళాల్లో తీవ్రమైన మంట వస్తుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదని సర్కిల్ ఆఫీసర్ రవింద్ర వర్మ వెల్లడించారు. మెడికల్ బృందాలను ఆ ప్రాంతానికి పంపినట్లు వెల్లడించారు. గ్యాస్ తీవ్రత తగ్గేవరకు మాస్క్‌లు ధరించాలని ప్రజలకు సూచించారు.