
సాక్షి, కర్నూలు: నంద్యాలలోని మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆగ్రో కెమికల్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో శనివారం ఉదయం ప్రమాదవశాత్తూ అమ్మోనియా గ్యాస్ లీకైన సంఘటనలో జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు, వైద్య, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు.
అస్వస్థతకు గురైన వారిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే ఫ్యాక్టరీలో ఉన్నవారిని బయటకు తరలిస్తున్నారు. అమ్మోనియా గ్యాస్‌ను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తోంది.మరోవైపు ఆగ్రో ఫ్లాంట్ చుట్టూ గ్యాస్ వ్యాపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment