spy Reddy
-
ఎస్పీవై రెడ్డి పైపుల ఫ్యాక్టరీలో దారుణం
సాక్షి, బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా కేంద్రంలోని బొమ్మలసత్రం సమీపంలో ఉన్న ఎస్పీవై రెడ్డి పైపుల ఫ్యాక్టరీలో కార్మికుడు జమాల్‌బాషాను ఫ్యాక్టరీ యాజమాన్యం ఐదు రోజుల పాటు బంధించి చిత్రహింసలకు గురిచేసిన సంఘటన మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. బాధితుడు జమాల్‌బాషా తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన అతను కొన్నేళ్లుగా ఎస్పీవై రెడ్డి పైపుల ఫ్యాక్టరీలో కార్మికునిగా పనిచేస్తున్నాడు. కార్మికులకు యాజమాన్యం అక్కడే భోజనాలు పెడతారు. జమాల్‌బాషా తనకు పరిచయం ఉన్న బియ్యం వ్యాపారితో ఫ్యాక్టరీకి బియ్యం సరఫరా చేయిస్తున్నాడు. బియ్యం వ్యాపారి నుంచి జమాల్‌బాషా కమీషన్ తీసుకుంటున్నట్లు అనుమానించి ఫ్యాక్టరీ మేనేజర్ శేషిరెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ మహేశ్వరరెడ్డిలు గత శుక్రవారం దాడి చేశారు. ఫ్యాక్టరీలోని ఓ గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. విషయం తెలుసుకున్న భార్య పర్వీన్ ఫ్యాక్టరీ ఎండీ సుజల వద్దకు వెళ్లి తన భర్తను విడిచి పెట్టాలని కోరింది. రూ.15 లక్షలు చెల్లిస్తేనే విడిపిస్తామని చెప్పడంతో పర్వీన్ బంధువుల సహాయంతో హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు జమాల్‌ను విడిపించి కారకులపై కేసు నమోదు చేయాలని నంద్యాల జిల్లా పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో త్రీటౌన్ పోలీసులు ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి జమాల్‌బాషాను విడిపించారు. బాధితుని ఫిర్యాదు మేరకు యాజమాన్యంపై కేసు నమోదు చేస్తున్నట్లు డీఎస్పీ మహేశ్వరరెడ్డి మంగళవారం రాత్రి తెలిపారు. చదవండి: (అస్వస్థతతో వైఎస్సార్సీపీ నేత మృతి.. స్పందించిన సీఎం జగన్) -
ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో మరో ప్రమాదం..
సాక్షి, కర్నూలు జిల్లా: నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో మళ్లీ ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని బాయిలర్ హీటర్ పేలి ఒక కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ముగ్గురు కార్మికుల్లో ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దక్షిణ మూర్తి అనే కార్మికుడు మృతి చెందాడు. మిగతా ఇద్దరు కార్మికులు కోలుకొని ఆస్పత్రి నుంచి డిశార్జి అయ్యారు. ఇటీవలే ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో మెయిన్ టెనెన్స్ వర్క్స్ జరుగుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో జనరల్ మేనేజర్ మృతిచెందిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సంచలనం రేపిన ఘటనపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఓ కమీటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఆ ఘటన మరువకముందే మళ్లీ ప్రమాదం జరిగింది. దీంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు ఆందోళన చెందుతున్నారు. -
నంద్యాల గ్యాస్ లీక్: ఎన్నెన్నో లోపాలు
నంద్యాల శివారులోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిబంధనలను గాలికి వదిలేసింది. కార్మికుల భద్రతను ఏ మాత్రమూ పట్టించుకోలేదు. ఫ్యాక్టరీలోని చాలా సామగ్రి తుప్పు పట్టి ఉంది. దాన్ని మార్చాలన్న ధ్యాస యాజమాన్యానికి లేకుండా పోయింది. చిన్నచిన్న షాపుల్లోనే ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేస్తుంటారు. అలాంటి ఇంత పెద్ద ఫ్యాక్టరీలో ఆక్సిజన్ సిలిండర్లు లేవంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. నంద్యాల: ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీలోని డ్రై ఐస్ తయారీ యూనిట్లో శనివారం అమ్మోనియా గ్యాస్ లీకై మేనేజర్ శ్రీనివాసరావు మృతిచెందిన విషయం విదితమే. ఈ ఘటన నేపథ్యంలో ఫ్యాక్టరీలోని లోపాలు బయటకు వస్తున్నాయి. ఇందులో అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించామని డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జిల్లా అధికారి గురుప్రసాద్, నంద్యాల అగి్నమాపక అధికారి యోగేశ్వరరెడ్డి తెలిపారు. ►ఫ్యాక్టరీలో పని చేసే ఉద్యోగులు, సిబ్బందికి భద్రత పరికరాలు (గ్లౌజులు, బూట్లు, అద్దాలు, మాసు్కలు) లేవు. ►అమ్మోనియా నిల్వ చేసుకోవాలంటే వైజాగ్‌లోని పీఈఎస్ఓ (పెట్రోలియం ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్) నుంచి అనుమతి తీసుకోవాలి. ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం ఎలాంటి అనుమతులూ తీసుకోలేదు. ►అమ్మోనియా ట్యాంకర్‌ను ఫ్యాక్టరీ బయట భాగంలో పెట్టాలి. కానీ ఇక్కడ లోపల ఉంచారు. ►అమ్మోనియా వాడే చోట యంత్రాలు ఎక్కువగా తుప్పుపడతాయి. వీటిని ఐదేళ్లకు ఒక సారి నిపుణులతో పరిశీలింపజేసి.. యంత్రాలు మారుస్తూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలను యాజమాన్యం తీసుకోలేదు. ►అమ్మోనియా గ్యాస్‌ను స్థానికంగా దొరికే సిలిండర్ల రూపంలో తెచ్చుకొని.. ట్యాంకర్లో నింపుతున్నారు. ఇలా చేయడం నేరం. ట్యాంకర్ వద్ద వాటర్ కటన్స్ పెట్టాల్సి ఉండగా.. వాటిని ఏర్పాటు చేయలేదు. ►ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అందరినీ జాగ్రత్త పరిచేందుకు ఏర్పాటు చేయాల్సిన సైరన్లు సైతం లేవు. ►సెల్ఫ్ కంటైన్డ్ బ్రీతింగ్ ఆపరేటర్లు (స్వీయ శ్వాస ఉపకరణాలు) లేవు. గాలిదిశ చూపే పరికరాలు అమర్చలేదు. ►మేనేజర్ శ్రీనివాసరావు అమ్మోనియ గ్యాస్ లీక్ అవుతుండటంతో ఆపడానికి పోయి అక్కడ అత్యవసర ద్వారం లేకపోవడంతో బయటకు రాలేక మృతి చెందినట్లు తెలుస్తోంది. ►ఫ్యాక్టరీలో అనుభవజ్ఞులైన ఉద్యోగులు కూడా లేరు. ►ఇంత పెద్ద ఫ్యాక్టరీకి అగ్నిమాపక శాఖ నుంచి ఇప్పటికీ ఎన్ఓసీ తీసుకోలేదు. ►ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసే ఏర్పాటు లేదు. ►గతంలో అగి్నమాపకశాఖ, ఫ్యాక్టరీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఇచ్చిన నోటీసులను సైతం యాజమాన్యం ఖాతరు చేయలేదు. ఉద్యోగి కుటుంబాన్ని ఆదుకోవడానికి మీనమేషాలు ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందిన మేనేజర్ శ్రీనివాసరావు కుటుంబాన్ని ఆదుకోవడానికి ఫ్యాక్టరీ యాజమాన్యం మీనమేషాలు లెక్కించింది. శ్రీనివాసరావు పోస్టుమార్టం ముగిసిన తర్వాత కూడా ఆర్థిక సహాయం విషయంలో యాజమాన్యం స్పందించకపోవడంతో బాధితులు ఆందోళన చేశారు. రూ.2 కోట్ల నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. చివరకు రూ.50 లక్షల పరిహారం అందజేసేందుకు యాజమాన్యం అంగీకరించింది. ఫ్యాక్టరీ మూసివేతకు రంగం సిద్ధం ఎలాంటి భద్రత ప్రమాణాలు పాటించకుండా, అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్న ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీని మూసివేస్తామని కర్నూలు జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి తెలిపారు. భద్రత ప్రమాణాలు పాటించడమే కాకుండా కారి్మకులకు అన్ని సౌకర్యాలు కలి్పంచి, అన్ని అనుమతులు తీసుకున్నాకే ఫ్యాక్టరీని తెరవడానికి అనుమతి ఇస్తామన్నారు. ఈ మేరకు సోమవారం ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఉత్తర్వులు పంపుతామని తెలిపారు. నేడు విచారణ కమిటీ రాక ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో జరిగిన గ్యాస్ లీకేజీ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ నియమించిన విచారణ కమిటీ సోమవారం ఫ్యాక్టరీలో విచారణ చేయనున్నట్లు నంద్యాల ఆర్డీఓ రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఫ్యాక్టరీలో పనులన్నీ నిలిపి వేశామన్నారు. తప్పిన భారీ ప్రమాదం ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో అమ్మోనియా వాల్వ్ పగిలి గ్యాస్ లీకైన ఘటనపై అధికారులు వెంటనే స్పందించడంతో భారీ ప్రమాదం తప్పింది. వంద కిలోల అమ్మోనియా లీక్ అయ్యింది. ఈ సమయంలో ఫ్యాక్టరీలో అనుభవజు్ఞలైన ఉద్యోగులు లేకపోవడంతో అమ్మోనియా సరఫరా అయ్యే పైపుల వాల్వ్‌లు ఎక్కడ ఉన్నాయో తెలియక అగ్నిమాపక సిబ్బంది మొదట ఇబ్బంది పడ్డారు. వెంటనే నంద్యాలకు చెందిన చిత్తూరు జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివకుమార్‌రెడ్డి రంగంలోకి దిగి అమ్మోనియా గ్యాస్ వాల్వ్‌ను ఆఫ్ చేయించారు. ఆయన చొరవతో రెండు గంటల్లోనే లీకేజీని అదుపు చేశారు. -
ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో ‘అమ్మోనియా’ లీక్
నంద్యాల/కర్నూలు (సెంట్రల్): కర్నూలు జిల్లా నంద్యాల పట్టణ శివారులోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం అమ్మోనియా గ్యాస్ లీకై ఒకరు మృతిచెందారు. మరో నలుగురు ఘటనా స్థలం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఫ్యాక్టరీ జనసేన పార్టీ నేత, మాజీ ఎంపీ దివంగత ఎస్పీవై రెడ్డి కుటుంబానికి చెందినది. ► శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో డ్రై ఐస్ తయారు చేసే యూనిట్లోకి నిర్వహణ పనుల నిమిత్తం మేనేజర్ శ్రీనివాసరావు(50), మరో నలుగురు సిబ్బంది వెళ్లారు. ► అమ్మోనియా గ్యాస్ సరఫరా అయ్యే పైపునకు వెల్డింగ్ చేస్తుండగా అది పగిలిపోయి గ్యాస్ ఒక్కసారిగా లీకైంది. జనరల్ మేనేజర్ అక్కడికక్కడే కుప్పకూలి మరణించగా, మిగిలిన నలుగురు తిప్పారెడ్డి, హరినారాయణ, రవి, తిరుమల బయటకు పరుగుదీసి ప్రాణాలు దక్కించుకున్నారు. మృతుడిది విజయవాడ కాగా, దాదాపు 15 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు. విషయం తెలియడంతో అదే ప్రాంగణంలోని ఇతర విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు భయంతో బయటకు పరుగులుదీశారు. ► కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ డాక్టర్ కె.ఫక్కీరప్ప, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, ఆర్డీవో రామకృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ► మూడు ఫైరింజన్లు, రెండు అంబులెన్స్‌లను రప్పించారు. ఫైరింజన్లతో గ్యాస్ లీకయిన ప్రదేశంలో నీటిని చల్లించి.. గ్యాస్ మరింతగా వ్యాపించకుండా కట్టడి చేశారు. ► అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల్లోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పరిసర ప్రాంతాల్లోని కార్మికులు, ప్రజలను అక్కడి నుంచి పంపించివేశారు. ► గ్యాస్ లీకేజీ ఘటనపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఇందుకోసం జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సోమశేఖరరెడ్డి నేతృత్వంలో నంద్యాల ఆర్డీవో రామకృష్ణారెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నారాయణమ్మ, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ శేషగిరిరావు, జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ మునిప్రసాద్, నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డితో కమిటీని నియమించారు. ప్రజలకు ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని కలెక్టర్ చెప్పారు. కేసు నమోదు ► గ్యాస్ లీకైన ఘటనకు సంబంధించి యాజమాన్యంపై ఫ్యాక్టరీల చట్టంలోని సెక్షన్ 92, 284, 285, 304ఏ కింద కేసులు నమోదు చేసినట్టు నంద్యాల రూరల్ సీఐ దివాకర్‌రెడ్డి చెప్పారు. నిర్వహణ లోపాలే కారణం.. ► ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌లో అమ్మోనియో గ్యాస్ లీకేజీకి యాజమాన్య నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. చాలాకాలంగా ఉన్న నిర్వహణ లోపాలే ప్రస్తుత స్థితికి కారణమని అధికార వర్గాలంటున్నాయి. ► అమ్మోనియా గ్యాస్ వెళ్లే పైపులు పదేళ్ల కిందటివి. వీటిని మధ్యలో మార్చాల్సి ఉన్నా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో అవి దెబ్బతిన్నాయి. ► ఇలాంటి ప్రదేశాల్లో కూలింగ్ సిస్టం ఉపయోగించాలి. ఇక్కడ ఆ ఊసే లేదు. ► అమ్మోనియా గ్యాస్ డిటెక్టర్లుంటే.. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే అవి మోగుతాయి. సిబ్బంది అప్రమత్తం అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. కనీసం అగ్నిమాపక పరికరాలను కూడా ఏర్పాటు చేసుకోలేదు. ఫ్యాక్టరీ నుంచి రసాయనాలు లీక్ అవుతున్నాయని, పట్టణం వరకూ దుర్వాసన వస్తోందంటూ ప్రజలు గతంలో పలుమార్లు యాజమాన్యం దృష్టికి తెచ్చారు. అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ► ఈ నేపథ్యంలోనే ఈ నెల 11వ తేదీన జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీలు నిర్వహించారు. మండలి జేసీఈఈ(జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్) వెంకటేశ్వరరావు, ఈఈ మునిప్రసాద్, ఆర్వో గణేష్‌ల బృందం పలు విభాగాలను పరిశీలించింది. ► నెలరోజుల్లోగా నిర్వహణ లోపాలు సరిచేసుకోవాలంటూ యాజమాన్యానికి నోటీసులు కూడా ఇచ్చింది. లేకుంటే ఫ్యాక్టరీని సీజ్ చేసేందుకు కూడా వెనుకాడేదిలేదంటూ జేసీఈఈ హెచ్చరించారు. ► ఆ హెచ్చరికలను ఫ్యాక్టరీ యాజమాన్యం పెడచెవిన పెట్టింది. ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతంలో శుక్రవారం నుంచే గ్యాస్ కొద్ది కొద్దిగా లీకైనట్టు తమ దృష్టికి వచ్చిందని జేసీఈఈ తెలిపారు. ► నిర్వహణ సిబ్బందికి అవసరమైన రక్షణ పరికరాలు కూడా యాజమాన్యం సమకూర్చకపోవడం వల్ల ప్రాణనష్టం సంభవించినట్టు ఆయన అభిప్రాయపడ్డారు. -
ఎవరూ ఆందోళన చెందొద్దు : వీరపాండియన్
సాక్షి, కర్నూలు : ఎస్పీవై రెడ్డి ఆగ్రో కెమికల్ ఇండస్ట్రీ గ్యాస్ లీక్ ఘటనపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్ స్పందించారు. కంపెనీ లోపల మాత్రమే గ్యాస్ లీకైందని, బయట గ్యాస్ లీక్ ప్రమాదం లేదని స్పష్టం చేశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో కంపెనీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి(50) మృతి చెందినట్లు కలెక్టర్ వెల్లడించారు. గాయాలపాలైన మరో ముగ్గురి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ వీరపాండియన్ సంఘటనా స్థలానికి చేరుకుసి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అత్యవసర శాఖల అధికారులను యుద్దప్రాతిపదికన రంగంలోకి దింపి సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందొద్దని, అన్ని రకాల జాగ్రత్తతు తీసుకున్నామని చెప్పారు. అగ్నిమాపక, రెవెన్యూ, పోలీసు, పరిశ్రమలు, వైద్యశాఖ అధికారుల ద్వారా యుద్దప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టామని కలెక్టర్ పేర్కొన్నారు. (చదవండి : ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీలో విషవాయువు లీక్) కాగా, నంద్యాలలోని మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆగ్రో కెమికల్ ఇండస్ట్రీలో శనివారం ఉదయం ప్రమాదవశాత్తూ అమ్మోనియా గ్యాస్ లీకైన విషయం తెలిసిందే. ఈఘటనలో కంపెనీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. 2 టన్నుల సామర్థ్యమున్న అమ్మోనియం ట్యాంకర్ లీకవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి గ్యాస్‌ను అదుపు చేస్తోంది. ఆగ్రోప్లాంట్ చుట్టూ గ్యాస్ వ్యాపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీలో విషవాయువు లీక్
సాక్షి, కర్నూలు: నంద్యాలలోని మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆగ్రో కెమికల్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో శనివారం ఉదయం ప్రమాదవశాత్తూ అమ్మోనియా గ్యాస్ లీకైన సంఘటనలో జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు, వైద్య, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. అస్వస్థతకు గురైన వారిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే ఫ్యాక్టరీలో ఉన్నవారిని బయటకు తరలిస్తున్నారు. అమ్మోనియా గ్యాస్‌ను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తోంది.మరోవైపు ఆగ్రో ఫ్లాంట్ చుట్టూ గ్యాస్ వ్యాపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. -
ఎస్పీవైరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించిన పవన్ కళ్యాణ్
-
ముగిసిన ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలు
-
ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలు పూర్తి
సాక్షి, కర్నూలు : నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలు గురువారం అధికారిక లాంఛనాల మధ్య ముగిశాయి. బొమ్మలసత్రంలో ఉన్న ఎస్పీవై రెడ్డి ఇంటి ఆవరణలోనే కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్పీవై రెడ్డి తల్లి ఈరమ్మ సమాధి పక్కనే ఆయన అంత్యక్రియలు కూడా చేశారు. అంత్యక్రియల కార్యక్రమానికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, కోట్ల సుజాతమ్మ, బ్రహ్మానందరెడ్డి, శిల్ప రవిచంద్ర, కిషోర్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు. పైపుల రెడ్డిని కడసారి చూసేందుకు.. మూడు సార్లు ఎంపీగా విజయం సాధించి నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి పేరు కలిగివున్న ఎస్పీవై రెడ్డి మరణించారని తెలియగానే నంద్యాల ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. పేదల ఆకలిని తీర్చిన అన్నదాత పైపులరెడ్డి ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీ వైరెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో మరణించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి ఆయన భౌతికకాయాన్ని బుధవారం ఉదయం 6 గంటలకు నంద్యాలకు తీసుకొచ్చి ఆయన ఇంటి వద్ద ఉంచారు. ఎస్పీవై రెడ్డిని చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు, పలు పార్టీల నాయకులు మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉదయం నుంచి పట్టణంలోని బొమ్మలసత్రంలోని ఎస్పీవైరెడ్డి స్వగృహం ప్రజలతో నిండిపోయింది. పైపుల రెడ్డి ఇక లేరని పలువురు కన్నీరు మున్నీరయ్యారు. ఎస్పీవై రెడ్డి భౌతికాయం వద్ద నివాళులర్పించిన నాయకులు, అధికారులు ఆయన కుమార్తె సుజలరెడ్డి, అల్లుడు శ్రీధర్‌రెడ్డిలను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఎస్పీవై రెడ్డి పెద్ద కుమార్తె సుజలరెడ్డి తండ్రి మృతదేహం వద్ద విలపించిన తీరు అందరినీ కలచివేసింది. -
ఎస్పీవై రెడ్డి మృతిపై వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, అమరావతి : నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి(69) మృతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. చదవండి : నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూత కాగా, నంద్యాల ఎంపీ, నంది గ్రూప్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ఎస్పీవై రెడ్డి (69) అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో మంగళవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎస్పీవై రెడ్డి.. ఏప్రిల్ 3న కేర్ ఆసుపత్రిలో చేరారు. ఎస్పీవైరెడ్డి మరణవార్త విని కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఎస్పీవై రెడ్డి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం అంకా లమ్మ గూడూరులో 1950లో జన్మించారు. 2004, 2009 ఎన్నికల్లో నంద్యాల లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన ఎస్పీవై రెడ్డి 2014లో వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసి హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరారు. -
ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూత
-
నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూత
నంద్యాల: నంద్యాల ఎంపీ, నంది గ్రూప్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ఎస్పీవై రెడ్డి (69) అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లోని కేర్ ఆసు పత్రిలో మంగళవారం మృతి చెందారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరా బాద్‌లో చికిత్స తీసుకుంటున్న విషయం విదితమే. ఎస్పీవైరెడ్డి మరణవార్త విని కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఎస్పీవై రెడ్డి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం అంకా లమ్మ గూడూరులో 1950లో జన్మించారు. 2004, 2009 ఎన్నికల్లో నంద్యాల లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన ఎస్పీవై రెడ్డి 2014లో వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసి హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ నాయకత్వం తనకే టికెట్ ఇస్తుందని చివరి నిమిషం వరకూ ఆశ పెట్టుకున్న ఆయనకు చంద్రబాబు మొండిచెయ్యి చూపారు. చంద్రబాబు చేసిన మోసానికి ఎస్పీవైరెడ్డి కుంగిపోయారు. చివరికి ఎస్పీవైరెడ్డి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఎస్పీ వైరెడ్డితో పాటు తన ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లను నంద్యాల, పాణ్యం, శ్రీశైలం ఎమ్మెల్యే అభ్యర్థులుగా జనసేన పార్టీ తరుఫున పోటీ చేయించారు. ప్రచారం మధ్యలోనే అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరిన ఎస్పీవై రెడ్డి కోలుకోలేక మృతి చెందాడు. ఎస్పీవైరెడ్డి నంద్యాల, కర్నూలులో రూపాయికే రొట్టె, పప్పు కేంద్రాలు నడిపి ప్రజాభిమానం పొందారు. గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం, పార్లమెంట్ పరిధిలో ఏ కార్యక్రమాలు జరిగినా వారి కి ఉచిత భోజన వసతి కల్పించడం, బోర్లు, బావులు వేయించడం ద్వారా ప్రజలకు చేరువయ్యా రు. పైపుల రెడ్డిగా ప్రాచుర్యం ఎస్పీవై రెడ్డి పూర్తి పేరు సన్నపురెడ్డి పెద్ద యెరుకల రెడ్డి. ఆయన స్థాపించిన నంద్యాల పైపుల పరిశ్రమ వల్ల పైపుల రెడ్డిగా ప్రాచుర్యం పొందారు. బీటెక్ చదివిన ఆయన మొదట ముంబాయిలోని బాబా అటామిక్ రీసెర్చ్ కేంద్రంలో ఉద్యోగం చేశారు. అనంతరం 1977లో నంద్యాలలో పైపుల ఫ్యాక్టరీ స్థాపించారు. ఆయన మంచి బాస్కెట్‌బాల్ ఆట గాడు. జొన్నరొట్టె, సంగటి, పోలూరు వంకాయతో చేసిన కూర అంటే ఆయనకు ఇష్టం. 1991లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓటమి చవి చూశారు. 2001లో మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. ఏపీ సీఎం సంతాపం: ఎస్పీవై రెడ్డి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. పారిశ్రామిక వేత్తగా, స్వచ్ఛంద సేవకునిగా ఆయన సేవలను కొనియాడారు. -
ఎస్పీవై నామినేషన్ : టీడీపీ, జనసేన హైడ్రామా..!
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అక్కడెవరూ పట్టించుకోకపోవడంతో జనసేన తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. సిట్టింగ్ స్థానం నంద్యాల టికెట్‌ను కేటాయించకపోవడంతో ఆయన టీడీపీని వీడారు. జనసేనలో చేరి తన కుటుంబానికి నాలుగు టికెట్లు తెచ్చుకున్నారు. నంద్యాల ఎంపీ అభ్యర్థిగా ఎస్పీవై రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్ద కుమార్తె సుజలా రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా అరవిందరాణి పోటీచేస్తున్నారు. అయితే, ఆయా స్థానాల్లో ఎస్పీవై కుటుంబం పోటీలో ఉంటే టీడీపీ అభ్యర్థులకు ఇబ్బందులు తప్పవని ఇంటలిజెన్స్ సర్వేలో వెల్లడికావడంతో పచ్చనేతలు రంగంలోకి దిగారు. ఎస్పీవై రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకోవాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారు. పోటీనుంచి తప్పుకుంటే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఎరవేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీవై కుటుంబ సభ్యుల నామినేషన్ల ఉపసంహరణ విషయంలో హైడ్రామా నెలకొంది. టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఎస్పీవైతో మాట్లాడటానికి టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ను ఆయన నివాసానికి పంపినట్టు సమాచారం. టీడీపీ నుంచి నంద్యాల ఎంపీ అభ్యర్థిగా మాండ్ర శివానందరెడ్డి బరిలో ఉన్నారు. (చదవండి : గోడ దూకితే.. గోడు మిగిలింది!) -
టీడీపీలో చల్లారని అసమ్మతి
సాక్షి, అమరావతి: అభ్యర్థుల ఎంపికతో టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి ఇంకా రగులుతూనే ఉంది. పలు నియోజకవర్గాల్లో అసంతృప్త నేతలు ఆందోళనలకు దిగుతుండగా కొన్నిచోట్ల పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. బుధవారం ముఖ్యమంత్రి నివాసం వద్ద గుంటూరు జిల్లా మాచర్ల టీడీపీ నేతలు ఘర్షణకు దిగారు. మాచర్ల సీటును అంజిరెడ్డికివ్వడంతో నియోజకవర్గ ఇన్చార్జి చలమారెడ్డి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. చివరకు తనకు ఆత్మహత్యే శరణ్యమని బుధవారం ముఖ్యమంత్రి వద్ద వాపోయినట్లు తెలిసింది. అయినా చంద్రబాబు ఇక మార్పు లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మాచర్లలో అంజిరెడ్డి ఎలా గెలుస్తాడో చూస్తానని చలమారెడ్డి అక్కడే ముఖ్య నాయకుల ముందు సవాల్ చేసి వెళ్లిపోయారు. ఇలావుండగా మాచర్ల టీడీపీ అభ్యర్థి ఎంపికలో తన ప్రమేయం లేదని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. మరోవైపు.. నంద్యాల ఎంపీ సీటు ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి బుధవారం జనసేనలో చేరారు. తన కుమార్తెతో పాటు ఆయన పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆ పార్టీలో చేరారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల సీటును పతివాడ నారాయణస్వామికి ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బంగార్రాజు అనుచరులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఈ సమావేశంలో బంగార్రాజు ప్రకటించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సీటును తనకివ్వకుండా ఉమామహేశ్వరనాయుడికివ్వడంపై అమిలినేని సురేంద్రబాబు అనుచరులు ఆందోళనకు దిగారు. తనకు సీటు రాకుండా పయ్యావుల కేశవ్ అడ్డుకున్నారని, తాను ఉరవకొండలో రెబల్‌గా పోటీ చేసి పయ్యావుల కేశవ్‌ను ఓడిస్తానని ఆయన టీడీపీ నేతలకు స్పష్టం చేశారు. ఇదే జిల్లా ధర్మవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అనుచరులు నాగశేషు, మద్దిలేటి, జయశ్రీ సహా 1,500 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుంటూరు జిల్లాలో టీడీపీ సీనియర్ నేత, డీసీసీబీ డైరెక్టర్ వరప్రసాద్ (బుజ్జి) టీడీపీకి రాజీనామా చేశారు. తాళ్లూరు సొసైటీ అధ్యక్షుడు బుజ్జి, మునుగోడు సొసైటీ మాజీ అధ్యక్షుడు చిట్టిబాబు కూడా టీడీపీకి రాజీనామా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచార సభకు అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీతల సుజాత గైర్హాజరయ్యారు. వైఎస్సార్ జిల్లాలో తిరగబడ్డ టీడీపీ కార్యకర్తలు కడప రూరల్: వైఎస్సార్ జిల్లా టీడీపీలో అసంతృప్తి సెగలు తగ్గడం లేదు. బుధవారం సాయంత్రం టీడీపీ కడప పార్లమెంటు అభ్యర్థి ఆదినారాయణరెడ్డి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తిరగబడ్డారు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వచ్చారని పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిని నిలదీశారు. పార్టీని నమ్ముకున్న వారికి ఇక్కడ ఏమాత్రం గుర్తింపు, గౌరవ మర్యాదలు లేవని విరుచుకుపడ్డారు. బద్వేల్లో టీడీపీ నాయకురాలు విజయజ్యోతి సీటు రాలేదనే అసంతృప్తితో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. -
టీడీపీకి భారీ షాకిచ్చిన ఎస్పీవై రెడ్డి
సాక్షి, కర్నూలు : ఎన్నికల వేళ టీడీపీకి మరో షాక్ తగిలింది. నంద్యాల ఎంపీ ఎస్పీ వై రెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పి ఇండింపెండెంట్‌గా పోటీ చేయనునున్నారు. చంద్రబాబు నాయుడు తన కుటుంబానికి టికెట్ ఇస్తానని మాట ఇచ్చి, ఆశలు పెంచి మోసం చేశారని ఆసహనం వ్యక్తం చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎంపీ, ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేస్తామని ప్రకటించారు. వచ్చే గురువారం నామినేషన్ దాఖలు చేయబోతున్నామని తెలిపారు. -
గోడ దూకితే.. గోడు మిగిలింది!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి.. తర్వాత అధికార పార్టీ ప్రలోభాలకు ఆశపడి టీడీపీలోకి వెళ్లిన నేతలకు ప్రస్తుతం ఆ పార్టీ అధినేత చంద్రబాబు తన మార్క్ రాజకీయంతో చుక్కలు చూపిస్తున్నారు. చంద్రబాబును కలిసేందుకు రోజుల తరబడి ప్రయత్నిస్తున్నప్పటికీ అవకాశం ఇవ్వడం లేదు. దీంతో సదరు నేతలు అసహనానికి గురవుతున్నారు. తన టికెట్ విషయంలో మొదట్లో ధైర్యంగా ఉన్న కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి చివరకు దక్కదన్న సంకేతాలతో నాలుగు రోజులుగా అమరావతిలోనే మకాం వేశారు. అయినప్పటికీ చంద్రబాబు దర్శనం లభించలేదు. మరోవైపు కొడుకు టికెట్ కోసం ఎంపీ టీజీ వెంకటేష్ కూడా రెండు రోజులుగా అక్కడే ఉంటున్నారు. ఈ సీటు వ్యవహారం నేడు తేల్చే అవకాశముంది. ఇక నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆరోగ్యరీత్యా ఎక్కువ సమయం వేచి ఉండలేని స్థితిలోనూ తనకు ఎంపీ టికెట్ లేదా కూతురుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరేందుకు గంటల తరబడి నిరీక్షించారు. చివరకు సర్వే ద్వారా టికెట్లు ఇస్తామని రెడీమేడ్ సమాధానం ఇవ్వడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పరిస్థితి మరీ దారుణంగా మారింది. మొదట్లో ఎంపీగానే పోటీ చేస్తానని భీష్మించుకున్న ఆమె.. చివరకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఫరవాలేదన్నారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం జిల్లా సమీక్షల సందర్భంగానూ పిలుపు రాకపోవడంతో ఆమె మదనపడిపోతున్నారు. పైగా ఆదోని సీటును మీనాక్షి నాయుడికే ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ అసలు ఊసులోనే లేకుండా పోయారు. నంద్యాల సీటు విషయంలోనూ అదే మడతపేచీ కొనసాగుతోంది. మొత్తంగా పార్టీ మారిన నేతలంతా ప్రస్తుతం తమకు జరుగుతున్న ‘మర్యాద’ను తలచుకుని లోలోపల కుంగిపోతున్నారు. అయ్యో..ఎస్పీవై! నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పరిస్థితి మరీ దారుణంగా మారింది. తనకు ఎంపీ సీటు ఇస్తారన్న ఆశ ఉందని పైకి అంటున్నప్పటికీ..ఖర్చు విషయాన్ని ముందుకు పెట్టి సీటు నిరాకరిస్తున్నారని లోలోపల వాపోతున్నారు. నంద్యాల ఎంపీ టికెట్ కావాలంటే ఖర్చుల కోసం రూ.60 కోట్లు చూపించాలని టీడీపీ పెద్దలు స్పష్టం చేశారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తాము అంత మొత్తాన్ని చూపించలేమనే ఉద్దేశంతోనే కావాలని ఇలా అడుగుతున్నారని ఎస్పీవై వాపోతున్నారు. సీటు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకోవడంతో ఈ విధంగా చేశారని అంటున్నారు. పార్టీ మారే సమయంలో వచ్చే ఎన్నికల్లోనూ మీ కుటుంబానికే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన మదనపడిపోతున్నారు. చివరకు ఇంత వయస్సులో.. ఆరోగ్యం సహకరించనప్పటికీ గంటల తరబడి వేచిచూస్తే సర్వే ద్వారా తేల్చుతామని ప్రకటించడంతో ఆయనకు ఏమి చేయాలో పాలుపోలేదని తెలుస్తోంది. ఇక కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీని కనీసం పిలవడం కానీ, సీటు విషయం మాట్లాడటం కానీ చేయలేదని సమాచారం. అలాగే కోడుమూరు ఇన్చార్జ్గా వ్యవహరించిన విష్ణువర్దన్‌రెడ్డిని కనీసం పలకరించే ప్రయత్నం కూడా పార్టీ నేతలెవ్వరూ చేయడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీ మారిన నేతలంతా చంద్రబాబు మార్క్ రాజకీయాన్ని చూసి తమను తామే తిట్టుకుంటున్నారు. కర్నూలు సీటుపై పీటముడి కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మొన్నటివరకు సీటు తనదేనని బల్లగుద్ది మరీ వాదించేవారు. పార్టీ సభ్యత్వం మొదలుకుని.. పార్టీ కమిటీల వరకూ అన్నీ తమకే అప్పగించారని పేర్కొనేవారు. తమను కాదని సీటు వేరేవారికి ఎలా ఇస్తారని గాంభీర్యంగానూ ప్రకటించేవారు. అయితే.. నాలుగు రోజులుగా టీజీ భరత్‌కు సీటిచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. దీంతో ఎస్వీ నాలుగు రోజులుగా అమరావతిలోనే మకాం వేశారు. అయినప్పటికీ చంద్రబాబు దర్శనం లభించలేదు. దీంతో రోజూ గంటల తరబడి వేచిచూసి.. వెనక్కి వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో మోహన్‌రెడ్డి తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డిని మంత్రి పదవి నుంచి చంద్రబాబు అకారణంగా తప్పించిన విషయాన్ని ఇప్పుడు ఆయన అనుచరులు గుర్తుచేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా చంద్రబాబు రాజకీయ కపట నాటకాన్ని తలచుకుంటూ నేతలు కుంగిపోతున్నారు. -
అఖిలప్రియపై టీడీపీ నేతల తీవ్ర ఆగ్రహం
సాక్షి, కర్నూలు : టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే అధిక సంఖ్యలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో నంద్యాల పార్లమెంట్ పంచాయితీ చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. మంత్రి భూమా అఖిల ప్రియ తీరుపై సొంత పార్టీ నేతలే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం నంద్యాలలో ర్యాలీ నిర్వహించిన అఖిల ప్రియ తమకు టికెట్ రాకుండా కొంతమంది అడ్డుకున్నప్పటికీ.. చంద్రబాబు పిలిచి మరీ టికెట్ ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయం గురించి తమను కాదని ర్యాలీలు నిర్వహిస్తూ తమపై అవాకులు, చెవాకులు పేలడం ఏంటని ఎన్ఎమ్డీ ఫారూఖ్, ఏవీ సుబ్బారెడ్డి, ఎస్పీవై రెడ్డి మండిపడుతున్నారు. టీడీపీ అధిష్టానం టికెట్ ప్రకటించకపోయినా తమకే టికెట్ వచ్చిందంటూ చెప్పుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం గురించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు నంద్యాల టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. చదవండి : మాట ఇచ్చి.. సీటు తేల్చరే! కాగా కర్నూలు జిల్లా సీట్ల విషయంలో సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. తమ ముగ్గురికీ సీటు ఇవ్వాల్సిందేనంటూ కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డితో పాటు మంత్రి అఖిలప్రియ, నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కోరుతుండగా.. పార్టీ అధిష్టానం నుంచి సరైన స్పందన లభించడం లేదని సమాచారం. మరోవైపు కర్నూలు సీటుపై తేల్చేందుకు బుధవారం అమరావతికి రావాలంటూ ఎంపీ టీజీ వెంకటేష్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు కబురు పంపినట్టు తెలుస్తోంది. కర్నూలుతో పాటు కోడుమూరు, నందికొట్కూరు సీట్ల విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కర్నూలు టీడీపీలో అంతర్గత పోరు మొదలైంది. -
ఎంపీ సీటు మాత్రమే అడుగుతున్నాం!
అమరావతి: వైఎస్సార్సీపీ నుంచి గెలిచి టీడీపీలోకి జంప్ అయిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంది. బాబూ మాకు ఒక ఎంపీ సీటు ఇవ్వండని అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్యం సహకరించకపోయినా ఎంపీ సీటు కోసం రాజధాని అమరావతి చుట్టూ ప్రదిక్షణలు చేయాల్సి వస్తోంది. ఇదే విషయమై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితోనే తేల్చుకునేందుకు ఎస్పీవై రెడ్డి మంగళవారం కలిశారు. అనంతరం ఎస్పీవై రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తాము ఎమ్మెల్యే సీటు అడగటం లేదని, కేవలం ఎంపీ సీటు మాత్రమే అడుగుతున్నామని చెప్పారు. ఐవీఆర్ఎస్ ద్వారా తన పేరు, మాండ్ర శివానందరెడ్డి పరిశీలిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. నంద్యాల ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఇప్పటి వరకు ఎవరి పేరు ఖరారు చేయలేదని బాబు చెప్పారని, అలాగే నంద్యాల ఎంపీ సీటు మా కుమార్తెకు అడిగినట్లు ఎస్పీవై తెలిపారు. రేపు మరోసారి సీఎం చంద్రబాబును కలిసి ఎంపీ సీటు అడుగుతామని చెప్పారు. -
టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి.. ఏరాసు, ఎస్పీవై నిరసన
సాక్షి, కర్నూలు: జిల్లా టీడీపీలో తీవ్ర అసమ్మతి వ్యక్తమవుతోంది. టీడీపీ అధిష్టానం వైఖరిపై సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ సీనియర్ నేతలు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, గంగుల ప్రతాప్‌రెడ్డితో పాటు గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది, ఆ తర్వాత టీడీపీకు మద్దతు తెలిపిన ఎస్పీవై రెడ్డి కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. కాగా గౌరు చరితారెడ్డి దంపతులు టీడీపీలో చేరిన కార్యక్రమానికి ఏరాసు ప్రతాప్‌రెడ్డి గైర్హాజరైన సంగతి తెలిసిందే. పాణ్యం సీటును గౌరు చరితకు కేటాయించడంతో ఏరాసు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు నంద్యాల సీటు విషయంలో సీనియర్ నేత ఎస్పీవై రెడ్డి అలకబూనారు. గంగుల ప్రతాప్‌రెడ్డిని పక్కనపెట్టడంతో ఆయన కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. -
‘మా అల్లుడికే టీడీపీ టికెట్’
సాక్షి, కర్నూలు : నంద్యాల టీడీపీలో వర్గ విభేదాలు రాజుకుంటున్నాయి. ఎంపీ ఎస్పీవై రెడ్డి నంద్యాల అసెంబ్లీ స్థానంపై కన్నేశారు. ఈ విషయంపై ఆయన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమకే నంద్యాల అసెంబ్లీ టికెట్ ఇస్తారని, తన అల్లుడు శ్రీధర్ రెడ్డికే టికెట్ అంటూ ధీమా వ్యక్తం చేశారు. మీడియా ముఖంగా తమ కుటుంబానికే టీడీపీ ఎమ్మెల్యే సీటు ఇస్తారని స్పష్టం చేశారు. నంద్యాలలో ఎవ్వరూ చెయ్యని మంచి పనులు చేస్తున్నాము కాబట్టి తమకే టికెట్ ఇస్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల అసెంబ్లీపై సర్వే చేయిస్తారని, ఆ సర్వేలో తమ పేరు ఖచ్చితంగా వస్తుందన్నారు. -
విస్మయపరుస్తున్న ఎంపీ ఎస్పీవై వ్యవహారం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: మార్కెట్లో షాపుల నిర్వాహకులెవరూ పైసా చెల్లించాల్సిన అవసరం లేదని, అంతా తామే చెల్లిస్తామని గంభీరపు ప్రకటనలిచ్చి.. నంద్యాల ఉప ఎన్నికల ముందు నాటకాలు ఆడిన అధికారపార్టీ నేతల అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏడాది దాటినప్పటికీ వేలం సొమ్ము మాత్రం మునిసిపాలిటీ ఖజానాకు చేరలేదు. పైగా మార్కెట్ వేలం మొత్తం సొమ్ము చెల్లించాలంటూ నోటీసులు జారీచేస్తే.. చెల్లని చెక్కులు ఇచ్చిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి వ్యవహారం ఆశ్చర్యం గొలుపుతోంది. వేలంపాట రూ.76.12 లక్షలతో పాటు అగ్రిమెంట్, వడ్డీ రూ.15 లక్షలు, సర్వీస్ చార్జీ రూ.13.70 లక్షలతో కలిపి.. మొత్తం రూ.కోటి నాలుగులక్షల 82వేలు చెల్లించాల్సి ఉండగా.. టెండరు వేసే సమయంలో డిపాజిట్ కింద రూ.16 లక్షలు చెల్లించారు. డిపాజిట్ తీసివేస్తే రూ.88.82 లక్షలు చెల్లించాలి. అయితే, రూ.60 లక్షల విలువ చేసే చెక్కులు కాస్తా బౌన్స్ అయినప్పటికీ కేసులు పెట్టకుండా అధికారులపై అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లు తెచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఉప ఎన్నికల ముందు వ్యాపారస్తులపై ప్రేమ కురిపించిన అధికారపార్టీ నేతలు తర్వాత మొహం చాటేశారు. ఇదే తరుణంలో మార్కెట్ వ్యాపారస్తుల నుంచి అద్దెల వసూలుకు మునిసిపల్ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఏమి జరిగిందంటే.. నంద్యాలలోని గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్, నూనెపల్లె, మూలసాగరం మార్కెట్లో ఉన్న షాపులను అద్దెకు ఇవ్వడంతో పాటు వాహనాల రాకపోకలు, పార్కింగ్ ఫీజు వసూలు మొదలైన వాటి కోసం 2017–18 ఆర్థిక సంవత్సరానికి నంద్యాల మునిసిపాలిటీ టెండర్లను ఆహ్వానించింది. అయితే, ఈ మొత్తాన్ని తామే చెల్లిస్తామంటూ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజలారెడ్డి పేరు మీద టెండర్లు దాఖలు చేశారు. వ్యాపారస్తుల నుంచి వసూలు చేయవద్దని, ఈ మొత్తాన్ని తామే చెల్లిస్తామంటూ టెండర్ దక్కించుకున్నారు. టెండర్లో పాల్గొనేందుకు చెల్లించిన రూ.16 లక్షల ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) మినహా ఇంత వరకు పైసా కూడా మునిసిపాలిటీకి చెల్లించలేదు. వాస్తవానికి టెండర్ గడువు కూడా ఈ ఏడాది మార్చితో ముగిసింది. అయినప్పటికీ పైసా ఇవ్వలేదు. ఇంతటితో కథ ఆగిపోలేదు. టెండర్ సొమ్ము చెల్లించాలంటూ మునిసిపల్ అధికారులు గత ఏడాదిలోనే నోటీసులు జారీచేశారు. ఆ నోటీసుల నేపథ్యంలో రూ.60 లక్షల విలువ చేసే ఐదు చెక్కులను మునిసిపాలిటీకి ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె అందజేశారు. అయితే.. సదరు చెక్కులు ఇచ్చిన బ్యాంకు ఖాతాలో సొమ్ములే లేవని, దీంతో చెక్కులు చెల్లవని బ్యాంకు అధికారులు తేల్చిచెప్పారు.ఏకంగా రూ.60 లక్షల మొత్తానికి చెల్లని చెక్కులు ఇచ్చిన వారిపై కనీసం కేసు పెట్టేందుకు కూడా అప్పట్లో మునిసిపాలిటీ అధికారులు ప్రయత్నించలేదు. అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలోనే అధికారులు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసేందుకు సాహసించలేదని తెలుస్తోంది. వ్యాపారస్తుల మెడపై కత్తి! టెండర్లో పాల్గొని సొమ్ము చెల్లించకపోవడంతో అధికారులు కాస్తా వ్యాపారస్తుల నుంచి వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గతంలోనే తమను చెల్లించమంటే చెల్లించేవారమని, ఈ విధంగా చేతులెత్తేయడం ఏమిటని కొందరు మండిపడుతున్నారు. పైగా అధికారులు ఎప్పుడు తమపై పడతారోనంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తమ్మీద అధికారపార్టీ నేతల వ్యవహారం ‘ఏరుదాటే వరకు ఏటి మల్లన్న.. దాటిన తర్వాత బోడి మల్లన్న’ అన్న చందంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
తాడో పేడో!
► రసకందాయంలో నంద్యాల రాజకీయం ► అధికార పార్టీలో ఆరని చిచ్చు ► కార్యకర్తల భేటీలతో నేతలు బిజీ ► నేడు శిల్పా వర్గం సమావేశం ► ఆదివారం మాజీ మంత్రి ఫరూక్.. ► రెండు రోజుల్లో కార్యకర్తలతో భూమా బ్రహ్మానందరెడ్డి చర్చలు ► ఇదే బాటలో ఎస్పీవై రెడ్డి వర్గం సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల వేడి అధికార పార్టీలో రోజురోజుకు రాజుకుంటోంది. ఉప ఎన్నికల సీటు తమకంటే తమకు ఇవ్వాలని ఎవరికి వారే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే ఎవరికి వారుగా అధిష్టానానికి సిగ్నల్స్ పంపగా.. తాజాగా కార్యకర్తల సమావేశాలు షురూ చేశారు. తనకు సీటు ఇవ్వాలని ఇప్పటికే అధిష్టానాన్ని సంప్రదించిన మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి శుక్రవారం కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇదే బాటలో మరో మాజీ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్ కూడా ఆదివారం కార్యకర్తలతో భేటీ కానున్నట్లు తెలిసింది. ఇక భూమా కుటుంబానికి చెందిన భూమా బ్రహ్మానందరెడ్డి కూడా రెండు రోజుల్లో కార్యకర్తలతో చర్చించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మిగిలిన ఎస్.పి.వై. రెడ్డి వర్గం కూడా కార్యకర్తల భేటీకి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారుగా తమ సత్తా చాటాలని నడుపుతున్న రాజకీయ చదరంగంలో ఎవరి ఎత్తు పారుతుందో చూడాల్సి ఉంది. పోటీ చేయాల్సిందే.. ప్రధానంగా నంద్యాల అసెంబ్లీ సీటును ఆశిస్తున్న మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి ఇందుకోసం తన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇప్పటికే నేరుగా ముఖ్యమంత్రిని కలసి తనకు సీటు ఇవ్వాలని ఆయన కోరారు. అయితే అధిష్టానం నుంచి సానుకూల స్పందన లేని నేపథ్యంలో స్వతంత్రంగా బరిలోకి దిగాలని ఆయన యోచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భూమా కుటుంబానికి సీటు ఇస్తే సహకరించేది లేదని పరోక్షంగా ఇప్పటికే తేల్చిచెప్పారు. తాజాగా కార్యకర్తల భేటీలోనూ ఇదే అంశం ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. పోటీ చేయాల్సిందేననే డిమాండ్ కార్యకర్తల నుంచి వచ్చేలా చూసేందుకే నేడు సమావేశమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లుగా ఉన్న రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి ఉప ఎన్నికల్లో భూమా కుటుంబానికి సహకరిస్తే తాము మీ వెంట నడవబోమని కూడా ఈ సమావేశంలో కార్యకర్తలు తేల్చి చెప్పనున్నట్లు సమాచారం. నియోజకవర్గాన్ని వదిలిపెడితే నియోజకవర్గంలో రాజకీయ సమాధేనని ఈ సందర్భంగా తమ నేతకు ఆయన అనుచరులు స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వేరే పార్టీ నుంచి పోటీ చేయాలా, స్వతంత్రంగా బరిలోకి దిగాలా? అనే అంశాన్ని నేటి కార్యకర్తల సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అదే బాటలో... ఉప ఎన్నికల్లో సీటు కోసం శిల్పామోహన్‌రెడ్డి కదుపుతున్న పావులకు దీటుగా ఫరూక్ వర్గం కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రెండు దఫాలుగా కనీసం తమ నేత పేరును పరిశీలించకపోవడాన్ని ఆయన అనుచరులు తప్పుపడుతున్నారు. ప్రధానంగా ముస్లిం ఓటర్లున్న నంద్యాల అసెంబ్లీ సీటును తమ నేతకు ఇవ్వాల్సిందేనని ఆయన అనుచరులు కోరుతున్నారు. లేనిపక్షంలో అధికార పార్టీకి దూరమవ్వాలని కూడా ఆయన అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన కార్యకర్తల భేటీ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా భూమా కుటుంబం నుంచి సీటు ఆశిస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి ఇప్పటికే నంద్యాలలో పర్యటిస్తున్నారు. అధిష్టానం నుంచి తనకే సీటు కన్ఫర్మ్ అయిందని ప్రచారం చేసుకుంటున్నారు. భూమా అనుచరులు మొత్తం తన వెంటే ఉన్నారనే సంకేతాన్ని అధిష్టానానికి పంపేందుకు వీలుగా త్వరలో ఆయన కూడా కార్యకర్తలతో భేటీ కానున్నారని సమాచారం. ఇక అదే బాటలో భూమా కుటుంబానికి టిక్కెట్ ఇవ్వకపోతే తామూ రంగంలో ఉన్నామంటూ ఎస్.పి.వై.రెడ్డి వర్గం కూడా సమావేశానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద నంద్యాల ఉప ఎన్నికల రాజకీయ వేడి అధికార పార్టీలో రోజురోజుకు సెగ పుట్టిస్తోంది. -
ఇస్తే సరి.. లేదంటే
నంద్యాలలో నాలుగు ముక్కలాట! ► భూమా, శిల్పా, ఫరూఖ్, ఎస్పీవై రెడ్డిలు ఎవరికి వారే.. ► సీటు కోసం ముమ్మర ప్రయత్నాలు ► ఇవ్వకపోతే ఇతరులకు సహకరించబోమని స్పష్టం ► పట్టుదలతో శిల్పా ► భూమా బ్రహ్మానందరెడ్డి వైపే అధిష్టానం సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాలలో రాజకీయం వేడెక్కుతోంది. నంద్యాల అసెంబ్లీ సీటు కోసం అధికార పార్టీలో ఎవరికి వారే ప్రయత్నాలు ప్రారంభించారు. తమకు కావాలంటే తమకే సీటు ఇవ్వాలంటూ ఆ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. సీటు ఇవ్వకపోతే స్వతంత్రంగా పోటీ చేస్తామని కొందరు.. ఎదుటి వారికి సహకరించేది లేదని మరికొందరు తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు భూమా కుటుంబం.. మరోవైపు శిల్పా వర్గంతో పాటు ఫరూఖ్, ఎస్పీవై రెడ్డి కుటుంబాలు కూడా రంగంలోకి దిగడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఎవరికి వారుగా సీటు కోసం చేస్తున్న ప్రయత్నాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తనకు సీటు ఇవ్వకపోతే స్వతంత్రంగానైనా పోటీ చేస్తానని శిల్పా మోహన్ రెడ్డి తెగేసి చెబుతుండగా.. ఒకవైపు ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న నంద్యాల నియోజకవర్గంలో ఇప్పటికే ఫరూఖ్‌కు అన్యాయం చేశారనే అభిప్రాయం ఆ వర్గంలో ప్రధానంగా వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఈ సీటు కూడా ఫరూఖ్‌కు ఇవ్వకపోతే ఆ వర్గం పూర్తిగా తమకు దూరం అవుతుందన్న భయం అధికార పార్టీని వెన్నాడుతోంది. మరోవైపు బీజేపీతో ఉన్న పొత్తు కాస్తా తమకు మరింత చెరుపు తెస్తుందని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు తామూ బరిలో ఉన్నామని ఎస్పీవై రెడ్డి కుటుంబం కూడా సై అంటోంది. అయితే, తమ కుటుంబ వ్యక్తి చనిపోవడంతో జరుగుతున్న ఉప ఎన్నికలు కాబట్టి.. ఈ సీటు తమ కుటుంబానిదేనని భూమా కుటుంబం వాదిస్తోంది. మొతం మీద నంద్యాల సీటు కోసం అధికార పార్టీలో నాలుగు ముక్కలాట ప్రారంభమయ్యింది. అయితే, తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాత్రం భూమా బ్రహ్మానందరెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్టు ప్రస్తుత పరిస్థితులను బట్టి తెలుస్తోంది. పోటీ తప్పదు...! నంద్యాల అసెంబ్లీ సీటు కోసం మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి తీవ్ర యత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే నేరుగా సీఎంను కలిసి తనకే సీటు ఇవ్వాలని విన్నవించారు. భూమా కుటుంబానికి మంత్రి పదవి ఇచ్చిన నేపథ్యంలో నంద్యాల సీటు తమకు అప్పగించాలని ఆయన కోరినట్టు తెలుస్తోంది. ఒకవేళ సీటు ఇవ్వకపోతే తాను తప్పకుండా పోటీ చేస్తానని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. సమయం లేదు మిత్రమా శరణమా.. రణమా అంటూ శిల్పా మోహన్ రెడ్డి పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. ఏ పార్టీ సీటు ఇవ్వకపోతే చివరకు స్వతంత్రంగానైనా పోటీ చేస్తానని ఆయన తన సన్నిహితుల వద్ద ఇప్పటికే వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. తన తమ్ముడు శిల్పా చక్రపాణి రెడ్డికి శాసన మండలి చైర్మన్ పదవి ఇచ్చినంత మాత్రాన తనకు ఒరిగేదేమిటని.. తనకు మాత్రం నంద్యాల సీటు కావాల్సిందేనని పట్టుదలగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో నంద్యాల సీటు కొత్త విభేదాలకు ఆజ్యం పోస్తోంది. యాక్షన్ రెడీ...! భూమా కుటుంబం నుంచి బ్రహ్మానందరెడ్డి బరిలో ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నంద్యాలలో కార్యకర్తలతో ఆయన భేటీ అవుతున్నారు. అంతేకాకుండా నంద్యాలలో జరుగుతున్న వివిధ పనులను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. తద్వారా భూమా వారసుడిని తానేనని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. మరోవైపు అధికారపార్టీ కూడా ఈయనవైపే కాసింత మొగ్గుచూపినట్టు సమాచారం. సీటు దాదాపుగా ఈయనకేననే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయాన్ని శిల్పా వర్గీయులు మాత్రం కొట్టిపడేస్తున్నారు. ఆయనకు సీటు ఇస్తే చేతులారా తమ నేతను అధికార పార్టీ దూరం చేసుకున్నట్టేనని వ్యాఖ్యానిస్తున్నారు. -
ఎస్పీవై రెడ్డికి స్వైన్ ఫ్లూ!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి స్వైన్ ఫ్లూ సోకినట్లు, చికిత్స కోసం హైదరాబాద్‌లోని గత నెలలో కేర్ ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారని కూడా తెలిసింది. ప్రస్తుతం తాను పూర్తిగా కోలుకున్నానని ఆయన సన్నిహితులకు చెప్పినట్టు సమాచారం. అయితే వైద్యశాఖ అధికారులు ఈ విషయం ధ్రువీకరించడం లేదు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఎస్పీవై రెడ్డి దగ్గు, జలుబు చికిత్స కోసం గత నెల 10వ తేదీన కేర్‌లో చేరారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు స్వైన్ ఫ్లూ సోకిందని జనవరి 17వ తేదీన నిర్ధారించారు. -
'ఎస్పీవై రెడ్డి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయండి'
-
ఎస్పీవై రెడ్డిపై అనర్హత వేటు వేయండి
న్యూఢిల్లీ : నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డిపై అనర్హత వేటు వేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు ఫిర్యాదు చేసింది. వైఎస్ఆర్సీపీ తరపున గెలుపొంది టీడీపీలో చేరిన ఎస్పీవై రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి, పార్టీ ఎంపీలు...స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం మేకపాటి మాట్లాడుతూ టీడీపీలో చేరినట్లు ఎస్పీవై రెడ్డి తనకు తానుగానే ప్రకటించుకున్నారని గుర్తు చేశారు. అనర్హత వేటు వేస్తే టీడీపీ తరపున పోటీ చేస్తానని ఆయనే చెప్పారని, నిబంధనల ప్రకారం ఎస్పీవై రెడ్డిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు. ఈ అంశంలో త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలను స్పీకర్‌కు సమర్పించామన్న ఎంపీ మేకపాటి...నిబంధనల ప్రకారం వ్యవహరిస్తానని స్పీకర్ చెప్పినట్లు వెల్లడించారు. కాగా వైఎస్సార్సీపీ నంద్యాల ఎంపీ అభ్యర్థిగా ఎస్పీవెరైడ్డి విజయం సాధించి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమై చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. -
టీడీపీలో నాలుగు స్తంభాలాట!
నంద్యాల : కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో రోజు రోజుకు నాయకుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతం నలుగురు ప్రధాన నేతలు పార్టీలో ఉండటంతో ఎవరి నాయకత్వంలోకి వెళ్లాలో కార్యకర్తలకు అర్థం కావటం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల వరకు మాజీమంత్రి ఫరూక్ నాయకత్వంలో పార్టీ కొనసాగేది. ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అప్పటి నుంచి కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఇదిలా ఉండగా నంద్యాల పార్లమెంట్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఎస్పీవై రెడ్డి ఇటీవల టీడీపీలో చేరారు. ఫరూక్, శిల్పా మోహన్ రెడ్డిల మధ్యే ఐక్యత అంతంత మాత్రంగా ఉంటే ఎస్పీవై రెడ్డి చేరడంతో పార్టీలో మరింత గందరగోళం ఏర్పడిందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మాజీమంత్రి టీజీ వెంకటేష్ అనుచరుడిగా మరో స్థానిక నాయకుడు, శ్రీశైలం ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్ పెసల శ్రీనివాసుల శెట్టి పార్టీలో కొనసాగుతున్నారు. ఇప్పటికే తమను ఓడించిన ఎస్పీవై రెడ్డిని టీడీపీలోకి తీసుకు రావడమే కాకుండా, ఎన్నికల సమయంలో తమకు సహకరించని పెసలకు మద్దతు ఇవ్వడంపై ఫరూక్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మొత్తం మీద నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీలో నాలుగు స్తంభాల ఆట కొనసాగుతున్నదని ఏ స్తంభంతో ఎలాంటి సమస్య తలెత్తుతుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడిందని పార్టీ వర్గాలు వాపోతున్నాయి. -
ఎస్పీవై రెడ్డి దూరం!
నంద్యాల, న్యూస్‌లైన్: స్థానికంగా జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశానికి నంద్యాల ఎంపీ ఎస్పీవెరైడ్డే దూరంగా ఉన్నారా.. లేక పార్టీ నాయకులే ఆయనను ఆహ్వానించలేదా.. అనే చర్చ జరుగుతుంది. నంద్యాల అసెంబ్లీకి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవి చూసిన మాజీ ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డి అందుకు గల కారణాలను విశ్లేషిస్తూ మంగళవారం నంద్యాల పట్టణంలోని మార్కెట్‌యార్డులో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి నంద్యాల పట్టణంతో పాటు గోస్పాడు, నంద్యాల మండలాలకు చెందిన కార్యకర్తలందరినీ ఆహ్వానించారు. అయితే, వైఎస్సార్సీపీ నంద్యాల ఎంపీ అభ్యర్థిగా ఎస్పీవెరైడ్డి విజయం సాధించి ఆ తర్వాత ఆ పార్టీకి దూరమై చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల ఆయన చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగిన బ్యాంకర్ల సమావేశంతో పాటు మహానాడుకు కూడా హాజరయ్యారు. అయితే, అత్యంత కీలకమైన నంద్యాల పట్టణంలో జరిగిన సమావేశానికి ఎస్పీవెరైడ్డి గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. ఈ సమావేశం నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డి, మాజీ మంత్రి ఫరూక్‌లు ఎస్పీవెరైడ్డిని ఆహ్వానించలేదని పార్టీ వర్గాలు గుసగుస లాడుకుంటున్నాయి. అయితే, ఆయనే సమావేశానికి గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు ఎస్పీవెరైడ్డి వర్గీయులు పేర్కొంటున్నారు. గైర్హాజరుకు ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ ఆయన రాకను మాత్రం శిల్పా, ఫరూక్‌లు జీర్ణించుకోలేక పోతున్నట్లు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో ప్రస్తుత టీడీపీ సమావేశం జరిగిన మార్కెట్‌యార్డు ఆవరణలోనే శిల్పా ప్రధాన అనుచరుడు సిద్ధం శివరాం మార్కెట్ యార్డు చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు శాసన సభ్యులను, అధికారులను శివరాం ఆహ్వానించలేదు. అప్పట్లో పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నా ఎస్పీవెరైడ్డిని కూడా పిలువలేదు. ఇందుకు శిల్పా డెరైక్షనే ప్రధాన కారణమని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు జరిగిన సమావేశానికైనా ఎస్పీవెరైడ్డిని ఆహ్వానిస్తారని భావించారు. అయితే, గత ఎన్నికల్లో తమకు నష్టం కలిగించిన వ్యక్తిని సమావేశానికి పిలువడం సబబు కాదని పార్టీ కార్యకర్తలు శిల్పాతో అన్నట్లు తెలుస్తోంది. దీంతో సమావేశంలో ఎస్పీవెరైడ్డి గురించి శిల్పా సానుకూలంగా కానీ, వ్యతిరేకంగా కానీ మాట్లాడకుండా వ్యూహాత్మకంగానే వ్యవహరించారని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. అతని గురించి సానుకూలంగా మాట్లాడకుంటే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో ఇబ్బందులు, మాట్లాడితే కార్యకర్తల నుంచి ఆగ్రహం చవి చూడక తప్పదని భావించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద నంద్యాల అసెంబ్లీ వరకు ప్రస్తుతం టీడీపీలో శిల్పా, ఎస్పీవెరైడ్డిల ఆధిపత్యంపై హాట్ టాపిక్ కొనసాగుతున్నదని, చంద్రబాబు ఎవరికి మద్దతు ఇస్తాడో చూడాల్సి ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
ఎస్పీవెరైడ్డి.. ఇన్నాళ్లు అధికార పార్టీలో లేరా?
నంద్యాల, న్యూస్‌లైన్: నంద్యాల పార్లమెంట్ సభ్యుడిగా పదేళ్లు అధికార పార్టీలో కొనసాగి ఏమీ అభివృద్ధి చేశారో ప్రజలకు వివరిస్తావా అంటూ రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి ఎంపీ ఎస్పీవెరైడ్డిని ప్రశ్నించారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఆయన నివాసంలో రైతు సంఘం నాయకుడు రామచంద్రారెడ్డి, విద్యార్థి సంఘం నాయకుడు రాజునాయుడుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ నుంచి నంద్యాల ఎంపీగా గెలుపొంది ప్రమాణస్వీకారం చేయకముందే నంద్యాల అభివృద్ధి కోసం తాను పార్టీ మారినట్లు చెప్పడం ఆయన దగాకోరు రాజకీయానికి నిదర్శనమన్నారు. వ్యాపారాల కోసమే పదవిని తాకట్టు పెట్టాడని దశరథరామిరెడ్డి నిప్పులు చెరిగారు. గెలుపొందిన పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి వ్యాపారం చేసుకోవాలని ఎస్పీవెరైడ్డికి సూచించారు. గతంలో అధికార పార్టీలో కొనసాగి రైతులకు ఏం చేశారో వివరించాలని క్రింది ప్రశ్నలను సంధించారు. పదేళ్లుగా ఎంపీగా అధికార పార్టీలో కొనసాగుతూ 2009 నుంచి 2014 వరకు నేషనల్ వాటర్ రిసోర్స్ స్టాండింగ్ కమిటీలో మెంబర్‌గా ఉండి నంద్యాల పార్లమెంట్‌కు చేసిన అభివృద్ధి ఏమిటి? స్టాండింగ్ కమిటీ మెంబర్‌గా శ్రీశైలం రిజర్వాయర్‌ను ఎన్ని సార్లు సందర్శించారు.. ఒకవేళ సందర్శించి ఉంటే రిజర్వాయర్ అభివృద్ధికి మీరు చేసిన ప్రతిపాదనలు? 2009లో రిజర్వాయర్‌పై వరదనీరు ఉప్పొంగితే దాని రక్షణకు మీరు ఎలాంటి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారో తెలియజేయాలి? నంద్యాల పార్లమెంట్లో గుండెకాయ లాంటి కేసీ కెనాల్ ప్రాజెక్టు స్థిరీకరణ కోసం ఏం పోరాటం చేశారు. ఏదైనా ప్రాజెక్టుకు ప్రతిపాదనలు పంపారా? కేసీ కెనాల్ స్థిరీకరణకు గుండ్రేవుల రిజర్వాయర్ కో సం తుంగభద్ర హక్కుల కమిటీ పోరాటం చేసి ప్రాజెక్టును సాధిస్తే మీరు ఇచ్చిన సహకారం ఏమిటి? జిల్లా ఎంపీగా కర్నూలును రాజధానిగా ప్రకటించాలని కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తో ఏమైనా హామీ పొందారా? అని బొజ్జా ప్రశ్నించారు. వీటికి సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు -
వైఎస్సార్సీపీలోనే కొనసాగుతా: బుట్టా రేణుక
న్యూఢిల్లీ: తాను వైఎస్సార్సీపీలోనే కొనసాగుతున్నానని, ఇందులో ఎలాంటి అయోమయానికి తావులేదని వైఎస్సార్సీపీ తరఫున కర్నూలు ఎంపీగా ఎన్నికైన బుట్టా రేణుక స్పష్టం చేశారు. నియోజవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ఆంధ్రప్రదేశ్‌కి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిశానని వివరణ ఇచ్చారు. ఢిల్లీలో మంగళవారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కొత్తపల్లి గీతతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘‘నాపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు. నేను పూర్తిగా అయోమయంలో ఉన్నాను. ఏమవుతుందో తెలుసుకునేలోపే అంతా జరిగింది. ఇదంతా అనుకోకుండా జరిగిన ఓ సంఘటన’’ అని రేణుక తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలకు ఇక్కడితో ముగింపు పలుకుతున్నట్టు చెప్పారు. టీడీపీ సభ్యత్వం తీసుకున్న మీ భర్త అందులోనే కొనసాగుతారా అని ప్రశ్నించగా.. ‘‘నాతో చర్చించకుండానే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో నేను పార్లమెంట్‌కి వెళ్లాను. ఆయన టీడీపీలో చేరినట్టు నాకూ మీడియా ద్వారానే తెలిసింది. అందుకే దాని గురించి ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను’’ అని తెలిపారు. రాజకీయానుభవం లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరిగాయని, భవిష్యత్తులో ఇలాం టివి పునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్పారు. ఎస్పీవై రెడ్డి ఇకనైనా తప్పు తెలుసుకోవాలి: మేకపాటి తన ప్రాంత అభివృద్ధి కోసం టీడీపీలో చేరానని చెబుతున్న నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఇప్పటికైనా చేసిన తప్పును తెలుసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి సూచించారు. ఎస్పీవై రెడ్డిని టీడీపీ నాయకులు భ్రమపెట్టారో, భయపెట్టారో తెలియడం లేదన్నారు. ‘‘గత రెండు రోజులుగా చోటు చేసుకున్న సంఘటనలు ఎంతో దురదృష్టకరం. టీడీపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేంత మద్దతు ప్రజలు ఇచ్చారు. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వాన్ని నడుపుతూ, చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి. అది వదిలేసి ఇతర పార్టీల నాయకులను ప్రలోభ పెట్టడం అనైతికం. టీడీపీ నాయకులు ఇప్పటికైనా అలాంటి కార్యక్రమాలకు ముగింపు పలికితే మంచిది’’ అని చెప్పారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను నెరవేరుస్తారని ప్రజలంతా ఆశతో ఉన్నారని, చెప్పిన మాటను నిలబెట్టుకోకపోతే ప్రజలు ఆలోచిస్తారన్నారు. వ్యవసాయ రుణాల మాఫీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ..బాబు చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా చేస్తుంటారని, రుణమాఫీ అమలు ఏవిధంగా చేస్తారో వేచి చూద్దామన్నారు. ఎస్పీవై రెడ్డి తిరిగి పార్టీలోకి వస్తే తీసుకుంటారా అని ప్రశ్నించగా.. ఆ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు నిర్ణయిస్తారని మేకపాటి సమాధానమిచ్చారు. -
'ఇకనైనా ఎస్పీవై రెడ్డి చేసిన తప్పు తెలుసుకోవాలి'
న్యూఢిల్లీ : కేవలం తన ప్రాంత అభివృద్ధి కోసమే టీడీపీలో చేరానని చెబుతున్ననంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి వైఖరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తప్పుబట్టారు. ఆయన చేసిన తప్పులను ఇకనైనా తెలుసుకోవాలని మేకపాటి హితవు పలికారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన చంద్రబాబు నాయుడు ...ఇతర పార్టీల నేతలను భయపెట్టో, ప్రలోభాలకు గురి చేయటమో మంచి పద్ధతి కాదన్నారు. ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడటం మానుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మేకపాటి సూచించారు. బాబు ఇచ్చిన హామీలపై ప్రజలు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక వ్యవహారంలో జరిగినవ్నీ చాలా దురదృష్టకరమైనవన్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. -
'ఇకనైనా టీడీపీ అనైతిక చర్యలు మానుకోవాలి'
-
పార్టీ ఫిరాయింపు వ్యభిచారం కన్నా హీనం: రఘువీరా
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎంపీలిద్దరూ పార్టీ ఫిరాయించడం ముమ్మాటికి అనైతికమని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో కొందరు నేతలు ఆక్సిజన్ లేకుండా ఉంటారేమో కానీ అధికారం లేకుండా ఉండలేకపోతున్నారని రఘువీరా ఎద్దేవా చేశారు. ఫిరాయింపుల నిరోదక చట్టం ప్రకారం ఎన్నికల సంఘం వీరిపై చర్యలు తీసుకోవాలని రఘువీరా డిమాండ్ చేశారు. నేతల ఫిరాయింపు వ్యవహరం వ్యభిచారం కన్నా హీనంగా ఉందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, కర్పూలు ఎంపీ బుట్టా రేణుక తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. -
అభివృద్ధి కోసమే టీడీపీలోకి: ఎస్పీవై రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: కేవలం తన ప్రాంత అభివృద్ధి కోసమే టీడీపీలో చేరానని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ఇబ్బందులు లేవని వైఎస్సార్సీపీ ఎంపీ ఎస్పీవై రెడ్డి చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తనకు సన్నిహితుడని, ఆయనతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తన ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. పార్టీ మారాలన్న ఆలోచనే తనకు లేదని, టీజీ వెంకటేశ్ సలహా మేరకు టీడీపీలో చేరినట్టు వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీలోని ఏపీభవన్ సీఎం కాటేజీలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు... ఎస్పీవై రెడ్డి మెడలో పసుపు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎస్పీవై రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘నేను పార్టీని వీడడం వివాదాస్పదం అయినప్పటికీ.. ప్రజలు ముఖ్యమనుకున్నా. నేను హార్డ్‌కోర్ పొలిటిషియన్ కాదు. రాజకీయాలు నాకు వృత్తి కాదు ప్రవృత్తి మాత్రమే’’ అన్నారు. -
సంతలో బేరం!
* ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్న చంద్రబాబు * వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల కొనుగోలుకు తెరలేపిన తెలుగుదేశం * హామీలను నెరవేర్చలేమని తెలిసే బాబు కొత్త కుట్రలు * వైఎస్సార్సీపీ గట్టి ప్రతిపక్షంగా ఉంటే నిలదీస్తుందనే భయం * బలహీనపరచడమే లక్ష్యంగా ఎంపీలతో బేరసారాలు * ప్రమాణ స్వీకారమైనా చేయకముందే ఫిరాయించిన నంద్యాల ఎంపీ ఎస్పీవై.. టీడీపీకి అనుబంధంగా * కొనసాగుతానన్న కర్నూలు ఎంపీ బుట్టా రేణుక * మరికొందరూ చేరుతున్నారంటూ మైండ్‌గేమ్‌కు తెరతీసిన తెలుగుదేశం పార్టీ సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని నడిబజారులో ఖూనీ చేశారు. ప్రజలిచ్చిన తీర్పునే వంచించారు. అధికారంలోకి వచ్చీ రాగానే చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ రాజకీయ దుర్నీతికి, తన మార్కు అక్రమాలకు తెర తీసింది. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ సంతలో పశువుల్లా ప్రజాప్రతినిధుల కొనుగోలుకు బరితెగించింది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో తమదే అధికారమంటూ నేతలను నయానా భయానా ప్రలోభ పెడుతూ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెస్తూ పార్టీలో చేర్చుకునే రాజకీయాలకు తెరతీసింది. ఈ క్రమంలో... ‘వస్తే ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తాం, రాకుంటే ఆర్థిక మూలాలను దెబ్బ తీస్తాం’ అంటూ బెదిరింపులకు దిగుతోంది! అనర్హత వేటు పడదంటూ చట్టాలకు సైతం వక్రభాష్యం చెబుతూ పార్టీలో చేరాలని ఒత్తిడి తెస్తోంది. ముఖ్యంగా ఎడాపెడా ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చలేమని గ్రహించిన బాబు, ఇంకా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందే వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించే కుట్రలను మొదలుపెట్టారు. ‘‘సీఎంగా బాధ్యతలు చేపట్టగానే మొదటగా రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తూ ఫైలుపై తొలి సంతకం చేస్తా. డ్వాక్రా రుణాలు రద్దు చేస్తా. పెన్షన్లు, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం ఇస్తా’నంటూ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి సిద్ధంగా లేక, వాటినుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికే ఒక పథకం ప్రకారం ఇలా ఫిరాయింపులను ప్రోత్సహించే అజెండాను తెర మీదకు తెచ్చినట్టు తెలుస్తోంది. హామీల సంగతేమిటని రేపటి రోజున గట్టిగా నిలదీయడానికి సిద్ధమవుతున్న వైఎస్సార్సీపీని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేస్తూ కొనుగోళ్లకు దిగుతున్నారు. ఇందుకోసం బాబు స్వయంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేసి మరీ టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారు. మరోవైపు బాబు అజెండాను అమలు చేసేందుకు టీడీపీ నేతలు నిస్సిగ్గుగా నడిబజారులోకి వచ్చారు. సీమాంధ్రలో ప్రజల తీర్పు వెలువడి పది రోజులు కూడా గడవకముందే, ఎన్నికైన సభ్యులు కనీసం ప్రమాణ స్వీకారమైనా చేయకముందే వారిని లోబరుచుకునే చర్యలకు దిగారు. సీమాంధ్రలో గట్టి ప్రతిపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ ఉండటం సహించలేని బాబు అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమాలకు ఒడిగట్టారు. ఏ పదవులు గానీ, ఎన్నికలు గానీ లేని సమయంలో కొందరు నేతలు ప్రజల పక్షాననిలిచి టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరితే దాన్ని ‘ఆకర్ష్ పథకం’ అంటూ విమర్శించిన టీడీపీ నేతలు ఇప్పుడు అధికారం తమ చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక పార్టీ నుంచి ఎన్నికల్లో గెలిచి మరో పార్టీలో చేరితే అనర్హత వేటు ఖాయమని ప్రజాప్రాతినిధ్య చట్టం చాలా స్పష్టంగా చెబుతున్నా, దానికి కూడా టీడీపీ నేతలు వక్రభాష్యం చెబుతున్నారంటే ఏ స్థాయిలో ప్రలోభాలకు దిగుతున్నారో తెలుస్తోంది. కేంద్రంలో తమదే ప్రభుత్వమని చెప్పుకుంటూ, అనర్హత వేటు లేకుండా చూసుకుంటామనే తప్పుడు వాగ్దానాలతో నేతలను మభ్యపెట్టి మరీ టీడీపీలో చేరాల్సిందిగాఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఇది కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేలకు మాత్రమే పరిమితం కావడం లేదు! జడ్పీటీసీ, ఎంపీటీసీలకు సైతం స్వయంగా చంద్రబాబు ఫోన్లు చేస్తూ టీడీపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు!! గట్టి ప్రతిపక్షమంటే బాబుకు భయం సీమాంధ్ర శాసనసభలో అత్యంత బలమైన ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ ఆవిర్భవించడాన్ని టీడీపీ నేతలు ఎంతమాత్రమూ జీర్ణించుకోలేకపోతున్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రేపటి రోజున ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ గట్టిగా పట్టుబట్టే అవకాశాలున్నాయని గ్రహించిన టీడీపీ నేతలు ఏదో రకంగా ఆ పార్టీని బలహీన పరచాలన్న చర్యలకు దిగినట్టు స్పష్టమవుతోంది. అందులో భాగంగా... ఢిల్లీలో నరేంద్ర మోడీ నేతృత్వంలో కొలువుదీరనున్న ప్రభుత్వంలో తమ హవాయే సాగనుందంటూ నేతలపై మైండ్ గేమ్ మొదలుపెట్టారు. అనర్హత వేటు పడినా పర్లేదని, ఉప ఎన్నికల్లోనూ ఓడినా మరో పదవి ఇస్తామంటూ టీడీపీ తరఫున రాయబారం నెరుపుతున్న బేరగాళ్లు వైఎస్సార్సీపీ నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు బాబు తరఫున ఆయన కోటరీ సభ్యులు వైఎస్సార్సీపీకి చెందిన కొందరు నేతల ఇళ్లకు వెళ్లి మరీ తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ‘మీకైన ఎన్నికల ఖర్చునంతటినీ చెల్లించడమే గాక ఉప ఎన్నికల ఖర్చు కూడా భరిస్తాం. అదనంగా మంచి ‘ప్యాకేజీలు’ కూడా ఇస్తాం’ అంటూ ఒక ఎమ్మెల్యేపై రెండు రోజులుగా తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచారు. ‘మీరు వ్యాపార రంగంలో ఉన్నారుగా! వైఎస్సార్సీపీలో కొనసాగితే మీకేం ప్రయోజనం? మావైపు రండి. అవసరమైన పనులు చేసి పెడతాం’ అంటూ మరో ఎమ్మెల్యేను ప్రలోభపెడుతున్నారు. హామీల అమలు అక్కర్లేదా? బలమైన ప్రతిపక్షముంటే ఎన్నికల హామీలను అమలు చేసేలా పాలక పక్షంపై ఒత్తిడి తెస్తుంది. అవసరమైతే అందుకోసం ప్రభుత్వం మెడలు వంచుతుంది. వైఎస్సార్సీపీ నుంచి అలాంటి ఒత్తిళ్ల ప్రమాదం లేకుండా చేసుకోవడానికే టీడీపీ నేతలు ఫిరాయింపు కుట్రలకు తెరతీశారని సర్వత్రా వినిపిస్తోంది. వైఎస్సార్సీపీ తరఫున నంద్యాల ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి ఆదివారం బాబును కలిశారు. తర్వాత నేరుగా పచ్చ కండువా ధరించి, ఆ పార్టీలో చేరినట్టు ప్రకటించారు. పలు వ్యాపారాలు నిర్వహిస్తూ తాజాగా వైఎస్సార్సీపీ తరఫున కర్నూలు ఎంపీగా ఎన్నికైన బుట్టా రేణుక కూడా ఆదివారం బాబును కలిసి, ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. అయితే వారిద్దరూ కూడా ఏం చెప్పాలో తెలియక, ‘మా నియోజకవర్గ అభివృద్ధిని కోరుకుంటున్నాం. అందుకే టీడీపీలో చేరుతున్నాం’ అన్నారు. కానీ అది సాకు మాత్రమేనని వైఎస్సార్సీపీ నేతలంటున్నారు. ‘బాబు నిజంగా అభివృద్ధి చేస్తారని భావించి ఉంటే వారు ఎన్నికలకు ముందే టీడీపీలో చేరి ఉండేవారు. ఇప్పుడు సీమాంధ్ర ప్రజలు బాబు తన హామీలను నెరవేరుస్తారని ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ప్రతిపక్షంలో ఉంటేనే వాటి అమలు కోసం ఒత్తిడి చేయడానికి వీలవుతుంది’ అని గుర్తు చేస్తున్నారు. పైగాబాబును కలిశాక బుట్టా రేణుక పొంతన లేకుండా మాట్లాడిన తీరు కూడా టీడీపీ కుట్రలను బాహాటంగా బయట పెట్టిందని వారన్నారు. ముందుగా బాబును కలిసి ఎస్పీవై రెడ్డి ఏకంగా తాను టీడీపీలో చేరినట్టు ప్రకటించగా, ఆ తర్వాత కలిసిన రేణుక మాత్రం తడబడ్డారు. టీడీపీలో చేరలేదని, ఆ పార్టీకి అనుబంధ సభ్యురాలిగా ఉంటానని, వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని రకరకాలుగా మాట్లాడారు. తెర వెనుక... కేంద్రంలో మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న కడప జిల్లాకు చెందిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు వైఎస్సార్సీపీకి చెందిన కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ వారిని పలు రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తున్నారని, టీడీపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. ముగ్గురు ఎంపీలు, మరికొందరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నట్టు ప్రచారం మొదలుపెట్టారు. ఆర్థిక ప్రలోభాలను ఎరగా చూపడంతో పాటు ‘రాష్ట్రంలో మా ప్రభుత్వం, కేంద్రంలో మేం భాగస్వామ్యంగా ఉన్న ప్రభుత్వం అధికారంలో ఉంటాయి గనుక మీ వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. సంపూర్ణ సహకారం అందిస్తాం. నియోజకవర్గ ప్రజల సంగతి అలా ఉంచి, మీ సొంత ప్రయోజనాలు చూసుకోండి’ అంటూ మైండ్‌గేమ్ మొదలుపెట్టారు. ఈ కోవలోనే వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికైన ఎస్పీవై, బుట్టా కనీసం లోక్‌సభలో ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే టీడీపీలో చేరినట్టు తెలుస్తోంది. ప్రజలకు సమాధానం చెప్పాలి: మైసూరా అధికారంలోకి వచ్చిన పార్టీ తాను ప్రజలికిచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయకుండా, ఇతర పార్టీల్లో గెలిచిన వారిని ప్రలోభపెట్టజూడటం మంచిది కాదని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు ఎంవీ మైసూరారెడ్డి తప్పుబట్టారు. దీనికి తెలుగుదేశం పార్టీ ప్రజలకు జవాబు చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో కలిసి ఆదివారం హైదరాబాద్‌లో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. పార్టీ మారిన ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని కోరే హక్కు తమ పార్టీకి ఉందనడం నిస్సందేహమన్నారు. టీడీపీ ఇలాంటి చర్యలకు పాల్పడం సరైంది కాదని చెప్పారు. పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్నది కేవలం ఒకవర్గం మీడియా అత్యుత్సాహంతో చేస్తున్న ప్రచారమేనని ఒక ప్రశ్నకు బదులుగాచెప్పారు. ఒకరిద్దరు అలాంటివారు తప్పుగా అలా చేసి ఉండొచ్చుగానీ ఎవరూ పార్టీ వీడరని తెలిపారు. వేటు ఖాయం ‘‘ఎవరైనా ప్రజాప్రతినిధిగా ఎన్నికైన అభ్యర్థి తానున్న పార్టీని వదిలి మరో పార్టీలోకి వెళ్తున్నానని చెప్పినా, ఆ పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటు వేసినా, పార్టీకి రాజీనామా చేసినా సదరు అభ్యర్థి తానున్న ఆ పార్టీని వదిలేయడమే అవుతుంది. రాజ్యాంగంలోని ఫిరాయింపు నిషేధ చట్టం ప్రకారం ఆ అభ్యర్థికి అనర్హత వర్తిస్తుంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఇదే చెబుతోంది. అయితే ఇక్కడ గుర్తింపు ఉన్న పార్టీయా, లేని పార్టీయా అన్న వివాదాన్ని లేపుతున్నారు. గుర్తించాల్సిన ముఖ్యమైన విషయమేమంటే... రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో రాజకీయ పార్టీనా, లెజిస్లేచర్ పార్టీనా అన్నారే తప్ప ‘రికగ్నైజ్డ్, నాన్ రికగ్నైజ్డ్’ అన్న విషయాన్ని ప్రస్తావించలేదు. రాజకీయ పార్టీగా నమోదైతే చాలు. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే చాలు. పోటీ చేయడానికి అర్హత ఉన్నప్పుడు, ఆ పార్టీ నుంచి వెళ్లిపోతున్నపుడు అనర్హత ఎందుకు వర్తించదు? ఎన్నికైన పార్టీని వదిలేయడం, మరో పార్టీలోకి చేరడం వల్ల అభ్యర్థికి కచ్చితంగా అనర్హత వర్తిస్తుంది. రికగ్నైజ్డ్ పార్టీ కాదనుకుంటే ఆ పార్టీ తరఫున ఎందుకు పోటీ చేసినట్టు? ఒక పార్టీ పక్షాన ఎన్నికై మరో పార్టీలో చేరడమనేది అనైతిక, రాజ్యాంగ వ్యతిరేకమైన, దుర్మార్గపు చర్య. ఈ తరహా పోకడలను నివారించడానికే చట్టం చేశారు’’ - మాడభూషి శ్రీధర్, న్యాయ కోవిదుడు -
ఓటర్లను ఎంత అవమానించారు!
ఓటర్లకు ఎంత అవమానం! ప్రజా తీర్పును ఎంత చులకన చేశారు! ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసిందే. ప్రతి రాజకీయ పార్టీ తను అమలు చేసే పథకాలను, తను అనుసరించే విధానాలను ప్రజలకు తెలియజేసి ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులను నిలబెడుతుంది. ఏ రాజకీయ పార్టీ విధానాలు, పథకాలు, పద్దతులు నచ్చుతాయో ఆ పార్టీకి చెందిన అభ్యర్థులను ఓటర్లు ఎన్నుకుంటారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని, అన్ని విధాల తమకు అండగా ఉంటారని ఓటర్లు ఆ పార్టీని, ఆ పార్టీ నేతను తమ ప్రతినిధిగా ఎన్నుకుంటారు. అలా ఎన్నికైన ప్రజా ప్రతినిధి పట్టుమని పదిరోజులైనా కాకుండానే పార్టీ ఫిరాయిస్తే ఏమనాలి? ఎన్నికైన పదవికి ప్రమాణస్వీకారం కూడా చేయకుండా మరో పార్టీలో చేరిపోతే ఆ వ్యక్తిని ఏ విధంగా అంచనా వేయాలి? ఇది తమను ఎన్నుకున్న ప్రజలను అవమానించడం కాదా? ఆ విధమైన పార్టీ మార్పిడులను ప్రోత్సహించినవారిని, సమర్ధించిన వారిని ఏమనాలి? వారికి ప్రజాస్వామ్యంపై నమ్మకం, గౌరవం ఉందా? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా? ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చినట్లు కాదా? ప్రజాస్వామ్య పటిష్టత కోసం మన రాజ్యాంగాన్ని రూపొందించిన కర్తలను అవమానించడం కాదా? లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ నెల 16న వెలువడ్డాయి. సార్వత్రిక ఎన్నికల బరిలోకి తొలిసారి దిగినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిడిపికి గట్టి పోటి ఇచ్చి 9 లోక్‌సభ స్థానాలను, 70 శాసనసభ స్థానాలను గెలుచుకుంది. పోలైన ఓట్లలో దాదాపు 45 శాతం ఓట్లు ఈ పార్టీకి పోలయ్యాయి. గెలిచిన పార్టీకి, ఈ పార్టీకి మధ్య ఓట్ల వ్యత్యాసం1.9 శాతం మాత్రమే. ఎంత నమ్మకం లేకపోతే ఇంత శాతం ఓట్లు ప్రజలు ఈ పార్టీకి వేశారో అర్ధం చేసుకోవచ్చు. ఈ పార్టీ తరపున గెలిచిన ఎంపిలలో ఏడుగురు, శాసనసభ్యులలో 45 మంది కొత్తగా ఎన్నికైనవారు కావడం ప్రజలు ఈ పార్టీని చూసి ఓటు వేశారనడానికి నిదర్శనంగా చెప్పవచ్చు. అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎస్పివై రెడ్డి నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కేంద్రంలో గానీ, రాష్ట్రంలో గానీ ఇంకా ప్రభుత్వాలు ఏర్పడలేదు. ఫలితాలు వెలువడి పది రోజులు పూర్తి కాలేదు. అప్పుడే ఎస్పివై రెడ్డి తనను గెలిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి టిడిపిలో చేరిపోయారు. ఎస్పివై రెడ్డి అంటే చిన్నచితకా మనిషి కాదు. జీవితానుభవం, రాజకీయానుభవం, వ్యాపారునుభవం ఉంది. జిల్లాలో, రాష్ట్రంలో అందరికీ తెలిసిన వ్యక్తి. కాస్త పేరున్న వ్యక్తి. ఆయనే చెప్పుకున్నట్లు హార్డ్ కోర్ పొలిటిషియన్ కాదు. అదీ గాక ''వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవు. వైఎస్ జగన్ అంటే అభిమానం'' అని ఆయన చెప్పారు. అటువంటి పరిస్థితులో ఆయన పార్టీ ఎందుకు మారవలసి వచ్చింది. ఎస్పివై రెడ్డి లాంటి వ్యక్తి పార్టీ మారాలనుకున్నప్పుడు ప్రజాస్వామ్య విలువలు గురించి ఆలోచించలేదా? తనను ఎన్నుకున్న ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనుకున్నారు? ఈ సమాజానికి ఏం సందేశం ఇవ్వదలచుకున్నారు? ఆయనపై అనర్హత వేటు పడుతుండా? లేదా? అనేది ఇక్కడ అప్రస్తుతం. అసలు ఎస్పివై రెడ్డి లాంటి వ్యక్తికి ఇది మంచి పద్దతేనా? ఎస్పివై రెడ్డి కూడా రాజకీయంగా దిగజారిపోయాడనుకోవాలా? ప్రజాసేవ చేయడానికి రాజకీయ పదవులు అవసరంలేదని అనేక మంది చెబుతారు. అలాగే చేస్తుంటారు. అటువంటిది తన ప్రాంతం, తన నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను పార్టీ మారినట్లు ఎస్పివై రెడ్డి చెబుతున్నారు. ఆ మాటలను నిజం అని నమ్మాలా? నిజమని నమ్మినా ఇలా పార్టీ మారడాన్ని ఎవరైనా సమర్ధిస్తారా? ఇక ఇటువంటి ఫిరాయింపులను ప్రోత్సహించేవారిని, సమర్ధించేవారిని ఎలా అర్ధం చేసుకోవాలి? ముఖ్యంగా పూర్తి మెజార్టీతో అధికారంలోకి రాబోతున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని ఎలా అర్ధం చేసుకోవాలి? ప్రస్తుత పరిస్థితులలో టిడిపికి లోక్‌సభ సభ్యుల అవసరం కూడా లేదు. అయినా ఇటువంటి ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఆయనకు ఇటువంటివి కొత్తేమీకాదనుకోవాలా?. చంద్రబాబు నాయుడు నైజమే, స్వభావం, ఆలోచనా విధానం, రాజకీయం విధానం, వ్వహార శైలి ఇదేనని, గతంలో అనుసరించిన విధంగానే అనుసరిస్తున్నారని అనుకోవాలా? -
అనర్హత తప్పదు
-
అనర్హత తప్పదు
హైదరాబాద్: ఒక పార్టీ గుర్తుపై గెలిచిన వ్యక్తి మరో పార్టీలోకి వెళ్తే తప్పక అనర్హులవుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సలహాదారులు సోమయాజులు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నంద్యాల లోక్‌సభ సభ్యుడిగా గెలిచిన ఎస్పివై రెడ్డి ఈ రోజు ఉదయం ఢిల్లీలో తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనపై అనర్హత వేటు పడుతుందన్న భావనను సోమయాలు వ్యక్తం చేశారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రకమైన అనైతిక చర్యకు పాల్పడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. అయితే ఎస్పివై రెడ్డి పార్టీ మార్పిడికి తిరుగుబాటు నిబంధన వర్తించడని టిడిపి నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆయన ఎన్నికయ్యేనాటికి ఆ పార్టీకి గుర్తింపులేదన్నారు. ఎన్నికల్లో కామన్ గుర్తు ఉన్నప్పటికీ అభ్యర్థులను స్వతంత్రులుగానే గుర్తిస్తారని యనమల చెప్పారు. వైఎస్ఆర్ సీపీపై యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలను సోమయాజులు ఖండించారు. ఇదిలా ఉండగా, ఎన్నికలలో పోలైన ఓటింగ్ శాతాన్ని బట్టి వైఎస్ఆర్ సిపి గుర్తింపు పొందే అవకాశం ఉంటుందని యనమలే అన్నారు. -
వెన్నుపోటు బాబులు
-
'ఇదేనా చంద్రబాబు నైతికత..?'
-
టీడీపీలో చేరిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి
-
టీడీపీలో చేరిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి
న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరిన తర్వాత న్యూఢిల్లీలో మీడియాతో ఎస్పీవైరెడ్డి మాట్లాడుతూ... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్ తో ఎలాంటి విభేదాలు లేవు అని అన్నారు. అంతేకాక తనకు వైఎస్ జగన్ అంటే అభిమానమని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఎస్పీవైరెడ్డి తెలిపారు. నాప్రాంతం, నియోజకవర్గ అభివృద్ది కోసమే టీడీపీలో చేరానని ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. నాకు ఓటు వేసిన ఓటర్లు ఇబ్బంది పడినా.. మెజార్టీ ప్రజలు అభినందిస్తారని ఆయన అన్నారు. టీడీపీ నేత టీజీ వెంకటేశ్ ద్వారా చంద్రబాబును కలిశానని ఆయన అన్నారు. నేను హార్డ్ కోర్ పొలిటిషియన్ కాదు. రాజకీయాలు ప్రవృత్తి మాత్రమే అని ఎస్పీవైరెడ్డి అన్నారు. సాయంత్రంలోగా బుట్టా రేణుక కూడా టీడీపీలో చేరవచ్చని ఆయన చెప్పారు. -
నంద్యాలలో ఎస్పీవై రెడ్డి హ్యాట్రిక్
హైదరాబాద్: నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి ఘనవిజయం సాధించారు. ఎస్పీవై రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూఖ్‌ను ఓడించారు. నంద్యాల నుంచి ఎస్పీవై రెడ్డి ఎంపీగా గెలవడమిది వరుసగా మూడోసారి. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన ఎస్పీవై రెడ్డి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజా ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు. -
హ్యాట్రిక్ దారిలో ఎస్పీవై రెడ్డి
నంద్యాల, న్యూస్‌లైన్: నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్పీవెరైడ్డి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గతంలో రెండు సార్లు పోటీ చేసి గెలుపొందిన ఆయన ఈ సారి కూడా భారీ మెజార్టీ సాధించి హ్యాట్రిక్ వీరుల జాబితాలో చేరుతారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్పీవెరైడ్డికి కనీసం 30 వేలకు పైగానే మెజార్టీ లభించవచ్చని అంచనా వేస్తున్నాయి. టీడీపీలో మాత్రం గెలుపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టేనని ఆయన అనుచరులు పేర్కొంటున్నా గెలిచే అవకాశాలు లేవని కనిపించడం లేదని తెలుగు తమ్ముళ్లు చర్చించుకోవడం గమనార్హం. ఫరూక్ రెండోసారి నంద్యాల పార్లమెంట్‌కు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సారి ఆయన పార్లమెంట్‌కు పోటీ చేయకూడదనుకున్నా పార్టీ బలవంతం మేరకు బరిలో నిలిచారు. అయితే ఏడు నియోజకవర్గాల్లోని టీడీపీ అభ్యర్థులు ఆయనను నట్టేట ముంచారనే గుసగుసలు ఆ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. నంద్యాల, డోన్, బనగానపల్లె, శ్రీశైలం, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, పాణ్యం నియోజకవర్గాలకు చెందిన టీడీపీ అభ్యర్థులు ఫరూక్ పేరును ప్రతిపాదించారు. ముస్లిం మైనార్టీలు అధికంగా ఉండటంతో తాము లబ్ధి పొందవచ్చని అంచనాతో ఫరూక్‌ను ప్రతిపాదించారు. అయితే ఆ తర్వాత ఆయన నుంచి డబ్బులు రాబట్టుకోవడం మినహాయిస్తే ఆయనకు ఏ మాత్రం సహకరించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చివరికి అసెంబ్లీకి సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆ తర్వాత పార్లమెంట్‌కు మీ ఇష్టం వచ్చిన వారికి ఓటు వేసుకోవాలని ఓటర్లను టీడీపీ అభ్యర్థులే కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఫరూక్ దృష్టికి కూడా వెళ్లింది. అయితే ఈనెల 16వ తేదీ లెక్కింపు వరకు ఏ మాత్రం నోరు పారేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని ఫరూక్ అనుచరులు భావిస్తున్నారు. నంద్యాలతో సహా అనేక నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థులకు వచ్చే ఓట్లతో పోల్చితే ఫరూక్ తక్కువగా పోలయ్యే అవకాశం ఉందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి మరోసారి కూడా నంద్యాల పార్లమెంట్ దక్కే అవకాశం లేదని పార్టీవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ గురించి చర్చించుకునే నాథుడే కరువయ్యారు. ఏ నియోజకవర్గంలో కూడా మూడో స్థానం నుంచి రెండో స్థానంలో ఓట్లు పోలయ్యే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటును వినియోగించుకోని వారు 3.79లక్షలు: పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గంలో 3,79,964 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోలేదు. పురుషులు 5,97,330మంది, మహిళలు 5,98,366మంది ఓటును వినియోగించుకున్నారు. పురుషుల కంటే మహిళలు 1036మంది అధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
నంద్యాలలో నెగ్గేదెవరు!
నంద్యాల లోక్‌సభ నియోజకవర్గానికి జాతీయు స్థారుులో గుర్తింపు ఉంది. నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహరావు లాంటి ఉద్దండులను పార్లమెంటుకు పంపిన చరిత్ర ఈ స్థానానిది. ప్రస్తుతం ఇక్కడ సార్వత్రిక ఎన్నికల పోరు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వరుసగా రెండు సార్లు కాంగ్రెస్ తరఫున ఎంపీగా ఎన్నికైన ఎస్పీవై రెడ్డి ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. రైతు నేతగా గుర్తింపు, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభంజనం ఆయునకు కలిసొచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయు విశ్లేషకులు భావిస్తున్నారు. మారంరెడ్డి జనార్దన్‌రెడ్డి - నంద్యాల: నంద్యాల లోక్‌సభ స్థానంలో సిటింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి(వైఎస్సార్ సీపీ)తో టీడీపీ తరఫున వూజీ వుంత్రి ఎన్ఎండీ ఫరూక్ తలపడుతున్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా బీవై రామయ్య బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గంతో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహిత సంబంధాలుండేవి. ఆయున చరిష్మా వల్లే 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. గత రెండు పర్యాయూలూ ఎస్పీవై రెడ్డి ప్రజల అభివూనాన్ని చూరగొన్నారు. సేవా కార్యక్రవూలు, పోరాటాలే అండ... సావూజిక సేవా కార్యక్రవూలు, పోరాటాల ద్వారా ఎస్పీవై రెడ్డి వుంచి పేరు సంపాదించారు. రైతు నాయుకుడిగా గుర్తింపు ఉంది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో సాగు, తాగునీటి సవుస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఎస్సార్బీసీ, తెలుగుగంగ, కేసీ కెనాల్ తదితర ప్రాజెక్టుల కింద సాగునీటి సమస్య తలెత్తినప్పుడు రైతుల తరఫున వుుందుండి పోరాడారు. కాలువల్లో నీటి పారకానికి అడ్డంకులు ఏర్పడినప్పుడు సొంత పొక్లరుున్లతో పూడిక తీరుుంచారు. నియోజకవర్గ వ్యాప్తంగా 500 మినరల్ వాటర్ప్లాంట్లను ఏర్పాటు చేరుుంచారు. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో గుర్తింపు సంపాదించుకున్నారు. వీటికితోడు వైఎస్‌పై ప్రజల్లో ఉన్న అభివూనం, జగన్మోహన్రెడ్డి ప్రభంజనం ఆయునకు కలిసొస్తాయుని రాజకీయు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫరూక్‌కు కష్టాలు టీడీపీ గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ పరాజయం పాలైంది. ఫరూక్ 2009లోనూ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయూరు. వాస్తవానికి ఆయునకు ఈసారి ఎంపీగా పోటీ చేయుడం ఇష్టం లేదని తెలుస్తోంది. టీడీపీకి సరైన అభ్యర్థి దొరక్కపోవడంతో చంద్రబాబు బలవంతంగా బరిలోకి దించారు. ముస్లిం ఓట్లు సానుకూలం అవుతాయని టీడీపీ అంచనా వేస్తున్నా... వాస్తవ పరిస్థితి వూత్రం భిన్నంగా ఉంది. సొంత అసెంబ్లీ(నంద్యాల) సెగ్మెంట్లోనే ఆయునకు ఆ వర్గం ఓట్లు పడే సూచనలు కన్పించడం లేదు. గత రెండు ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. 2004లో అసెంబ్లీకి పోటీ చేయగా దాదాపు 50 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. 2009లో ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా నంద్యాల సెగ్మెంట్ పరిధిలో ప్రత్యర్థి కంటే 35వేల ఓట్లు తక్కువగా వచ్చాయి. ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో టీడీపీపై వుుస్లిం మైనార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్... నంద్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏవూత్రవుూ బాగోలేదు. నియోజకవర్గ చరిత్రలో అత్యధిక సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే.. రాష్ట్ర విభజన దెబ్బతో పూర్తిగా కుదేలైంది. ఆ పార్టీలో బలమైన నాయకుడిగా ఉన్న ఎస్పీవై రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరారు. స్థానికంగా మరో అభ్యర్థి దొరకకపోవడంతో పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలానికి చెందిన డీసీసీ అధ్యక్షుడు బీవై రామయ్యను ఆ పార్టీ బరిలోకి దించింది. ఏ అసెంబ్లీ సెగ్మెంట్లోనూ కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానంలో నిలిచే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నారుు. నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం తొలి ఎంపీ: శేషగిరిరావు (ఇండిపెండెంట్) ప్రస్తుత ఎంపీ: ఎస్పీవై రెడ్డి ప్రస్తుత రిజర్వేషన్: జనరల్ ప్రధాన అభ్యర్థులు వీరే ఎస్పీవెరైడ్డి, (వైఎస్సార్ సీపీ) ఎన్ఎండీ ఫరూక్, (టీడీపీ) బీవై రామయ్య (కాంగ్రెస్) అసెంబ్లీ సెగ్మెంట్లు.. బలాబలాలు ఆళ్లగడ్డ ప్రస్తుతం ఇక్కడ విచిత్ర పరిస్థితి నెలకొంది. రెండేళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి భూవూ శోభా నాగిరెడ్డి దాదాపు 36 వేల ఓట్ల మెజార్టీతో విజయుం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆమె పోటీకి దిగారు. అరుుతే, దురదృష్టవశాత్తూ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో వురణించారు. ఆమె చనిపోయే నాటికే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియు పూర్తరుు..అభ్యర్థులకు గుర్తులు కూడా కేటారుుంచడంతో ఇక్కడ ఎన్నిక కొనసాగుతుందని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. శోభా నాగిరెడ్డి కూడా పోటీలో ఉన్నట్లు పరిగణిస్తావుని పేర్కొంది. దీంతో శోభా నాగిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి...ఆమెకు ఘన నివాళి అర్పించాలని పార్టీ నాయుకులు, కార్యకర్తలు, అభివూనులు కృతనిశ్చయుంతో ఉన్నారు. ఇక టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే గంగుల ప్రతాపరెడ్డి సోదరుడు ప్రభాకర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన గతంలో ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి ఓటమి పాలయ్యూరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇరిగెల రాంపుల్లారెడ్డితో అంతర్గత విభేదాలు ఉన్నాయి. శ్రీశైలం టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి స్థానికేతరుడు కావడంతో ప్రజలు అంతగా మొగ్గు చూపడం లేదు. దీనికితోడు ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గమిది. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి మంచి పేరు ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలు, జగన్మోహన్రెడ్డి ప్రభంజనం ఆయనకు సానుకూలాంశాలు. డోన్ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బుగ్గన రాజేంద్రనాథరెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన సావూజిక సేవా కార్యక్రవూల్లో వుుందుంటారు. రూ.50 లక్షల సొంత డబ్బుతో డోన్ బాలికల పాఠశాలలో భవనాలను నిర్మించారు. ప్యాపిలిలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు.ప్రజల్లో ఆయనకు మంచి పేరుంది. టీడీపీ తరఫున కేఈ ప్రతాప్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆయన సోదరులు కేఈ ప్రభాకర్, కృష్ణమూర్తిలకు చెప్పుకోదగ్గ స్థాయిలో వర్గముంది. అయితే, ప్రతాప్‌కు ప్రజల్లో అంత పలుకుబడి లేకపోవడం ప్రతికూలాంశం. నందికొట్కూరు ఇటీవలే కాంగ్రెస్‌ను వీడిన తాజా మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఆయనకు తెలుగు తవుు్మళ్లు సహకరించడం లేదు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోవడంతో ప్రజలు కూడా అసంతృప్తితో ఉన్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఐజయ్య పోటీ చేస్తున్నారు. ఈయున ప్రజల్లోకి చురుగ్గా వెళుతున్నారు. పాణ్యం టీడీపీలోని అంతర్గత పోరు వైఎస్సార్ సీపీకి లాభించే అవకాశవుుంది. నియోజకవర్గ ఇన్చార్జ్ కేజే రెడ్డిని కాదని చివరి నిమిషంలో పార్టీలోకి చేరిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డిని టీడీపీ ఎన్నికల బరిలోకి దింపింది. దీంతో కేజే రెడ్డి వర్గం అంటీవుుట్టనట్లు ఉంటోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈమెకు మహిళల్లో మంచి పలుకుబడి ఉంది. భర్త గౌరు వెంకటరెడ్డి వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి చరితారెడ్డికి లాభిస్తుందని రాజకీయు విశ్లేషకులు భావిస్తున్నారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయున 2009లో భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ సారి కూడా అదే స్థారుులో గెలిపించుకుంటావుని పార్టీ శ్రేణులు ధీవూ వ్యక్తం చేస్తున్నారుు. టీడీపీ అభ్యర్థిగా బీసీ జనార్దన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయున రాజకీయూలకు కొత్త. ఏ మండలంలోనూ చెప్పుకోదగ్గ స్థారుులో పట్టు లేదు. నంద్యాల వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా భూవూ నాగిరెడ్డి, టీడీపీ తరఫున వూజీ వుంత్రి శిల్పా మోహన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ వుుస్లిం ఓట్లు కీలకం. బీజేపీతో టీడీపీ పొత్తు నేపథ్యంలో ఆ పార్టీ పట్ల వుుస్లింలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. శిల్పా మోహన్‌రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా, వుంత్రిగా పనిచేసినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయులేదన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. టికెట్ కోసం ఇటీవలే పార్టీ వూరడం కూడా మైనస్. వీటికితోడు టీడీపీ ఎంపీ అభ్యర్థి ఫరూక్‌తో అంతర్గత విభేదాలు తీవ్రస్థారుులో ఉన్నారుు. నంద్యాల లోక్‌సభ స్థానం ఓటర్ల సంఖ్య 15,75,677 ఇతరులు: 249 అసెంబ్లీ సెగ్మెంట్లు 1. నంద్యాల 2. ఆళ్లగడ్డ 3. బనగానపల్లె 4. శ్రీశైలం 5. నందికొట్కూరు 6. డోన్ 7. పాణ్యం నియోజకవర్గ ప్రత్యేకతలు - మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ఇక్కడి నుంచి ఎంపీలుగా ఎన్నికయ్యారు. - నంద్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రానికి జాతీయస్థాయిలో గుర్తింపు ఉంది. - {పపంచ స్థాయిలో ఖ్యాతిగాంచిన సోనా మసూరి బియ్యాన్ని ఉత్పత్తి చేస్తున్న ప్రాంతం. జనం మాట పిల్లలు బాగుపడతారు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన ‘అవ్ము ఒడి’ పథకం చాలా బాగుంది. దీనివల్ల పేదలు సైతం పిల్లలను చదివించుకునేందుకు అవకాశం కలుగుతుంది. పిల్లల చదువు కోసం తల్లి బ్యాంకు ఖాతాలో డబ్బు వేసే ఆలోచన అద్భుతం. - పాణ్యం ధనలక్ష్మి, ఎన్జీఓ కాలనీ, నంద్యాల మహిళలకు రుణ విముక్తి పొదుపు మహిళలు రుణాలు తీసుకొని, వాటిని తిరిగి చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. జగన్ అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలు వూఫీ చేస్తారు. అప్పుడు అప్పుల బాధ తప్పుతుంది. - వెంకట రత్నమ్మ, నంద్యాల సొంతింటి కల నెరవేరుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే తలకు మించిన భారమే. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇళ్లు కట్టిస్తానని జగన్ మోహన్‌రెడ్డి చెబుతుండటం సంతోషదాయకం. -శ్రీనివాసులు గౌడ్, నంద్యాల తిప్పలు తప్పుతారుు వైఎస్సార్ సీపీ ప్రభుత్వమొస్తే వ్యవసాయూనికి పగటిపూట ఉచిత కరెంటిస్తానని జగన్మోహన్రెడ్డి చెబుతున్నారు. దీంతో వూలో కొత్త ఆశలు మొలకెత్తుతున్నారుు. ప్రస్తుతం రాత్రిపూట ఇస్తుండటంతో ఇబ్బంది పడుతున్నాం. - పెద్ద వెంకటరెడ్డి, వెంకటాపురం, బనగానపల్లె చంద్రబాబు రైతుద్రోహి చంద్రబాబు వుుఖ్యవుంత్రిగా ఉన్నప్పుడు రైతులను హీనంగా చూశారు. వైఎస్ వచ్చాకే వూకు అండ దొరికింది. ఆ తర్వాత వుళ్లీ కష్టాలే. జగన్ అధికారంలోకి వస్తే వుళ్లీ వుంచిరోజులు వస్తాయుని భావిస్తున్నాం. - కుందూరు శివారెడ్డి, ఆత్మకూరు ప్రకాశం జిల్లా వెలిగొండ, ఎర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం, పాలేరు రిజర్వాయర్ సహా జలయజ్ఞం కింద ప్రారంభించిన అన్ని సాగునీటి ప్రాజెక్టులనూ పూర్తిచేస్తాం. గుండ్లకమ్మతో మా జీవితాలు బాగుపడ్డాయి ఇంతకుముందు నీరు సరిగ్గా లేక మా చేలు ఎండిపోయేవి. పంటలు పండేవి కావు. వైఎస్ పుణ్యమా అని ఈ ప్రాంతంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మించారు. ఇప్పుడు మా పొలాలు పంటలతో కళకళలాడుతున్నాయి. ఎడమ కాలువ కింద నీళ్లు మా చేలకు పెట్టుకుంటూ పండించుకుంటున్నాం. నాలుగు రూకలు సంపాదించుకున్నాం.మా బిడ్డల చదువులు పూర్తి కావచ్చాయి. ఆ మహా నుభావుడిని దేవుడు తీసుకెళ్లాడని ఎవరన్నారు. ఆయన నాలాంటి రైతుల గుండెల్లోనే ఉన్నాడు. - యేమిరెడ్డి విజయభాస్కరరెడ్డి, మద్దిపాడు జగన్‌తోనే ‘బైరేని గుండాల’ పూర్తి బైరేని గుండాల ప్రాజెక్టు పూర్తయితే గిద్దలూరు పట్టణంతో పాటు 14 గ్రామాల ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తొలగుతాయి. తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్య తీర్చేందుకు వైఎస్ 2006లో బైరేని గుండాల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఇందుకు రూ.12కోట్లు విడుదల చేశారు. ఆయన మరణానంతరం ప్రాజెక్టు పనులు నిలిచాయి. అనంతరం వచ్చిన పాలకులు ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. దీంతో తాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. జగన్ ముఖ్యమంత్రి అయితేనే ఇక్కడ సమస్యలు తీరయాని నమ్ముతున్నాం. - పి.రామసుబ్బయ్య, గిద్దలూరు జీవనాడి ప్రాణదాతకు రుణపడి ఉన్నాం... మేం పేదోళ్లం. నేను, నా భార్య శివలక్ష్మి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాళ్లం. వూకు ఇద్దరు కువూర్తెలు. 2009లో స్వగ్రామమైన వెలుగోడు మండలం రేగడగూడూరుకుపనుల నిమిత్తం వెళ్లా. ఇంటిపెకైక్కి పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడ్డా. నడుము వద్ద తీవ్ర గాయాలయ్యూరుు. కాళ్లు చచ్చు పడ్డాయి. చికిత్స నిమిత్తం కర్నూలు సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరి స్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లాలని డాక్టర్లు సూచించారు. అసలు బతికి బట్టకడ తానా అని ఆందోళనకు గురయ్యా. డాక్టర్లు ఆపరేషన్ చేయూలన్నారు. డబ్బెలా తేవాలో అర్థం కాలేదు. అయితే, ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పడంతో ధైర్యం వచ్చింది. నిమ్స్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేశారు. రూ.-0 వేల వరకు లబ్ధి చేకూరింది. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కోలుకున్నా. రెండు కాళ్లు చచ్చు పడినా...ప్రాణాలు దక్కారుు. నా భార్య, పిల్లలను చూసుకోగలుగుతున్నా. ఇదంతా వైఎస్ రాజశేఖరరెడ్డి చలవే. ఆయునకు రుణపడి ఉన్నాం. - బాలరాజు, రైతునగర్ (నంద్యాల) -
సెంటిమెంట్‌కు ఎస్పీవై రెడ్డి దూరం
నంద్యాల, న్యూస్‌లైన్ : ఎన్నికల్లో పోటీ చేసేవారంతా మంచి ముహూర్తాన్ని చూసుకుని నామినేషన్లు వేస్తుండగా నంద్యాల ఎంపీ ఎస్పీవెరైడ్డి ఇందుకు మినహాయింపు. ఆయన ఏనాడు ముహుర్తం చూసి నామినేషన్ దాఖలు చేయడని ఆయన అనుచరులు, బంధువులు చెబుతున్నారు. 1991లో లోక్‌సభ, 1999లో నంద్యాల, గిద్దలూరు అసెంబ్లీ స్థానాలు, 2000లో మున్సిపల్ చైర్మన్ పదవి, 2004, 2009 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఏ ఎన్నికల్లో కూడా నామినేషన్‌కు ముహూర్తం చూసుకోలేదు. 1999, 2000 ఎన్నికల్లో అయితే అమావాస్య రోజు దాఖలు చేసినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. నాలుగైదు ఏళ్ల క్రితం కోట్ల రూపాయలతో పెట్టిన ఆగ్రో ఫ్యాక్టరీని సైతం అమవాస్య రోజూ ఆరంభించారని చెప్పారు. ఇందుకు సంబంధించి ఆయన అల్లుడు, నందిపైప్స్ ఎండీ సజ్జల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తాము ఏ విషయంలోనూ ముహూర్తాల గురించి ఆలోచించమన్నారు. ఆ రోజుకు ఏ పని పూర్తి అయి ఉంటుందో దానిని ఆరంభిస్తామని తెలిపారు. ప్రతి అభ్యర్థి కూడా మంచి ముహూర్తం చూసుకునే నామినేషన్లు దాఖలు చేస్తారని, అలా అని వారిలో ఒక్కరే గెలుస్తారు తప్పితే అందరు కాదు కదా అని తెలిపారు. తాము ముహూర్తాలకు వ్యతిరేకం కాదని, అలా అని అనుకూలం కూడా కాదన్నారు. ఈ సారి మాత్రం ముహూర్తాన్ని పరిశీలించే ఈ నెల 16వ తేదీన వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. -
సమైక్యచాంపియన్ జగనే: ఎస్పీవై రెడ్డి
నంద్యాల, న్యూస్‌లైన్: రాష్ట్రంలో సమైక్య చాంపియన్ తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి మాత్రమేనని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కానే కాదని వైఎస్సార్ సీపీ నంద్యాల పార్లమెంట్ సమన్వయకర్త, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ ఆరంభమైనప్పటి నుంచి సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు. శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శాసన సభలో మూజువాణి ఓటుతో విభజన బిల్లును వెనక్కి పంపించేలా చేసిన ఘనత వైఎస్సార్ సీపీకే దక్కుతుందన్నారు. సమైక్యాంధ్ర కోసం... జైలులో ఉన్నా బయట ఉన్నా జగన్ మాత్రమే ఆమరణ నిరాహార దీక్షలు చేశారని గుర్తుంచుకోవాలన్నారు. సీఎం కార్యాలయానికి నియోజకవర్గ సమస్యలను వివరించేందుకు తాను వెళ్లినమాట వాస్తవమేనని, అయితే అక్కడ ముఖ్యమంత్రి లేకపోవడంతో ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డిని మాత్రమే కలిసినట్లు తెలిపారు. కొందరు నాయకులు మీడియాకు డబ్బులు ఇచ్చి తనపై దుష్ర్పచారం చేయిస్తున్నారని ఆరోపించారు. జగన్ తనను అన్నా అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారని, అలాంటి వ్యక్తితో తనకు విభేదాలు ఉన్నట్లు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. -
సమైక్యాంధ్ర ఛాంపియన్ జగనే:ఎస్పివై రెడ్డి
కర్నూలు: సమైక్యాంధ్ర ఛాంపియన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అని ఆ పార్టీ నేత, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అన్నారు. జగన్ చెప్పినట్లుగా సీఎం, మంత్రులు రాజీనామా చేసి ఉంటే, రాజకీయ సంక్షోభంతో తెలంగాణ బిల్లు రాష్ట్రానికి వచ్చేది కాదని ఆయన చెప్పారు. తమ ప్రాంత రైతులకు సాగునీటి కేటాయింపుల్లో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని కోరడం కోసం తాను సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని కలిస్తే, దానిపై కొన్ని వార్తా చానెళ్లు తప్పుడు కథనాలు ప్రసారం చేశాయని ఆయన నిన్న ఖండించిన విషయం తెలిసిందే. ఆ రకంగా ప్రసారం చేయడం బాధకలిగించిందని కూడా ఆయన చెప్పారు. -
వైఎస్సార్సీపీలోనే ఉంటా: ఎస్పీవెరైడ్డి
సాగునీటి సమస్యపైనే సీఎంను కలిశా సాక్షి, హైదరాబాద్: తమ ప్రాంత రైతులకు సాగునీటి కేటాయింపుల్లో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని కోరడం కోసమే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశానని, అంతే తప్ప అందులో మరే ఉద్దేశం లేదని వైఎస్సార్సీపీ నేత, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి చెప్పారు. కర్ణాటక రైతులు దౌర్జన్యంగా తుంగభద్ర డ్యామ్ నుంచి కేసీకెనాల్కి, రాజోలిబండ, ఆర్డీఎస్లకు నీళ్లు బంద్ చేయడంతో ఆ సమస్యను వివరించడం కోసం సీఎంను కలిశానన్నారు. దీనిపై అనవసరంగా కొన్ని వార్తా చానెళ్లు తప్పుడు కథనాలు ప్రసారం చేయడం బాధాకరమని ఆయన అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీని వదిలి... తనంటత తానే వైఎస్సార్సీపీలో చేరానని, అదే పార్టీలో ఉంటానని వివరించారు. ‘జగన్ నాకు చాలా సన్నిహితుడు. రాజశేఖరరెడ్డితో వ్యక్తిగత సంబంధముంది.. నేను మున్సిపల్ చైర్మన్‌గా ఉంటే అది చాలా చిన్న పదవి అని, ఎంపీగా వెళ్లాలని చెప్పి, లోక్‌సభకు పంపించిన మహానుభావుడు. ఆ కుటుంబం మీద మాకు ఎప్పటికీ కృతజ్ఞత భావం ఉంటుంది’ అని అన్నారు. నిజాయితీగా బతికే తన లాంటి రాజకీయ నాయకుడి పై వార్త ప్రసారం చేసే ముందు ఒక్క సారి ఫోన్ చేసి వివరణ అడిగుంటే సమాధానం చెప్పేవాడినన్నారు. ప్రజలకు సంబంధించిన పనుల మీద వెళితే దానిని కూడా వక్రీకరించడం మంచిదికాదన్నారు. -
అవన్నీ అవాస్తవ కథనాలు: ఎస్పీవై రెడ్డి
హైదరాబాద్ : తనపై కొన్ని టీవీ చానెళ్లు అవాస్తవ కథనాలు ప్రచారం చేస్తున్నాయని నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అన్నారు. అది సరైన పద్ధతి కాదని ఆయన శుక్రవారమిక్కడ అన్నారు. వైఎస్ఆర్ సీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తాను వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసే ముందుకు వెళుతున్నానని....మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని ఎస్పీవై రెడ్డి తెలిపారు. తనును మరోసారి వివాదాల్లోకి లాగవద్దని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన మాట వాస్తవమేనని.. తన వ్యక్తిగత పనిపై సీఎం కార్యదర్శిని కలిసేందుకు వెళ్లినట్లు ఎస్పీవై రెడ్డి తెలిపారు. తన నిజాయితీని శంకించాల్సిన పనిలేదని ..మున్సిపల్ ఛైర్మన్‌గా ఉన్న తనను ఎంపీగా పోటీ చేయాలని వైఎస్ రాజశేఖరరెడ్డే ప్రోత్సహించారన్నారు. -
రైతుల కోసం దేనికైనా సిద్ధం
నందికొట్కూరుటౌన్/రూరల్, న్యూస్‌లైన్: కేసీ ఆయకట్టు రైతుల సంక్షేమం కోసం దేనికైనా సిద్ధమని నంద్యాల ఎమ్పీ ఎస్పీవై రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ఎమ్పీతో పాటు రైతులు మల్యాల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. కేసీకి సకాలంలో నీరు విడుదల కాని పక్షంలో హంద్రీనీవా కాల్వ నుంచి మళ్లించే విషయమై చర్చించారు. రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో హంద్రీనీవాకు నీటి పంపింగ్‌ను అధికారులు నిలిపివేశారు. ఈ సందర్భంగా కొందరు రైతులు కాల్వకు గండి కొట్టి పైపుల ద్వారా నీరు ఇవ్వాలని పట్టుబడటంతో ఎమ్పీ వారిని వారించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుంకేసుల నుంచి శనివారం 15 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని, ఇప్పటికే కర్నూలు దాటి ఉంటాయన్నారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు 10 రోజులకు ఒక్కసారి నీటిని విడుదల చేస్తే రైతుల పంటలు దాదాపు చేతికి అందుతాయన్నారు. ఆతర్వాత మార్చిలో 1 టీఎంసీ నీరు అవసరం ఉంటుందని, ప్రభుత్వంతో పోరాడి విడుదల చేయిస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. ఒక వేళ నీరు రాకపోతే హంద్రీకాల్వ గురించి ఆలోచన చేద్దామన్నారు. కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలో ఆరుతడి పంటలు సాగు చేయాలని, నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులు సకాలంలో పూర్తయింటే రైతులు సాగునీటి కష్టాలు తప్పేవన్నారు. తమ పొలాలకు నీరివ్వకుండా అనంతపురానికి తరలిస్తే సహించేది లేదని రైతులు నినాదాలు చేశారు. ఎమ్పీ వెంట పాటు కేడీసీపీ మాజీ చైర్మన్ కాతా అంకిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రచార కన్వీనర్ ఐజయ్య, నాయకులు మాండ్ర శివానందరెడ్డి, బండి జయరాజు, పిడతల దేవరాజు, కట్టమంచి జనార్దనరెడ్డి ఉన్నారు. పోలీసుల బందోబస్తు: హంద్రీనీవా కాల్వకు గండి కొట్టి కేసీకీ నీటిని మళ్లిస్తామని ముందు నుంచి రైతులు చెబుతుడటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్పీతో పాటు భారీగా రైతులు మల్యాల ఎత్తిపోతల పథకానికి చేరుకున్నట్లు సమాచారం అందుకున్న ట్రైనింగ్ డీఎస్పీ నర్మద, ఎస్ఐ గంగానాథ్బాబు, 15 పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అధికారులతో మాట్లాడి సమస్యను సామరష్యంగా పరిష్కరించుకోవాలని రైతులకు సూచించారు. -
సమైక్య శంఖారావంలో ఎస్పివై రెడ్డి ప్రసంగం
-
కదిలిన సమైక్య దండు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభకు సమైక్యవాదులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. జిల్లా వ్యాప్తంగా పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా రైతులు, మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, వ్యాపారులు, విద్యార్థులు శుక్రవారం ఉదయం నుంచే హైదరాబాద్‌కు పయనమయ్యారు. స్వచ్ఛందంగా తరలివెళ్లిన వీరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా ప్రాంతాల పార్టీ నాయకులు తగిన ఏర్పాట్లు చేపట్టారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు నిర్వహిస్తున్న సభకు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయక ప్రజలు మద్దతిస్తుండటం విశేషం. వర్షం మరింత అధికమైనా సభను విజయవంతం చేసి తీరుతామని సమైక్యవాదులు భీష్మించారు. జిల్లా వ్యాప్తంగా 11 ఆర్టీసీ డిపోల నుంచి 280 బస్సులు, 1602 క్రూజర్లు, జీపులు, సుమోలతో పాటు 101 ప్రైవేట్ బస్సుల్లో ప్రజలు శంఖారావానికి బయలుదేరారు. శుక్రవారం రాత్రి కర్నూలు, కోడుమూరు నియోజక వర్గాలకు సంబంధించిన 10వేల మంది సమైక్యవాదులకు పార్టీ ఆధ్వర్యంలో భోజనాలు సిద్ధం చేశారు. ఇలా ప్రతి నియోజకవర్గ పార్టీ ఇన్చార్జీలు రాత్రి భోజనాలు, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనాలకు అవసరమైన ఏర్పాట్లను చేపట్టారు. ఇదిలాఉండగా గుంతకల్లు నుంచి ఆదోని, మంత్రాలయం మీదుగా హైదరాబాద్ చేరుకునేందుకు సమైక్యవాదులు 18 బోగీలు కలిగిన రైలును రిజర్వు చేసుకున్నారు. డోన్, నంద్యాల, కర్నూలు మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లల్లోనూ ప్రజలు భారీగా హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సొంతంగా ఏర్పాటు చేసుకున్న వాహనాల్లోనే బయలుదేరారు. సభకు బయలుదేరే సమైక్యవాదులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, కాటసాని రామిరెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత, సాయిప్రసాద్‌రెడ్డి, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, గుమ్మనూరు జయరాం, మణిగాంధీ తదితర నాయకులతో పాటు జిల్లా కమిటీ సభ్యులు, పార్టీ అనుబంధ సంస్థల జిల్లా కన్వీనర్లు, మండల కన్వీనర్లు ముమ్మర ఏర్పాట్లు చేశారు. -
రాజీనామాల ఆమోదం కోసం ఢిల్లీ కోర్టులో జగన్ పిటిషన్
-
రాజీనామాల ఆమోదం కోసం ఢిల్లీ కోర్టులో జగన్ పిటిషన్
హైదరాబాద్: లోక్‌సభ స్పీకర్ తమ రాజీనామాలు తిరస్కరించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి, ఆ పార్టీకే చెందిన మరో ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారితోపాటు నంద్యాల ఎంపి ఎస్పివై రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఎస్పివై రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వీరు ముగ్గురూ రాష్ట్ర విభజనకు నిరసన తెలుపుతూ లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన 13 మంది ఎంపీలు తమ లోక్‌సభ సభ్యత్వాలకు సమర్పించిన రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ గత శుక్రవారం తిరస్కరించారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ సీపీలకు చెందిన లోక్‌సభ సభ్యుల రాజీనామాలు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వచ్ఛందంగా చేసినవి కావని స్పీకర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో ఏర్పడిన తీవ్రమైన భావోద్వేగాల నడుమ తీసుకున్న రాజీనామా నిర్ణయాలను ఆమోదించటం సాధ్య కాదన్న అభిప్రాయంతో స్పీకర్ ఉన్నట్లు లోక్‌సభ సచివాలయ వర్గాలు వెల్లడించాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 101(3), లోక్‌సభ నియమావళిలోని 204 నిబంధనను అనుసరించి స్పీకర్ ఆయా ఎంపీల రాజీనామాలను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. కాంగ్రెస్‌కు చెందిన ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, ఎ.సాయిప్రతాప్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనుమూరి బాపిరాజు, జి.వి.హర్షకుమార్, రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, ఎస్.పి.వై.రెడ్డి, టీడీపీ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజీనామాలను తిరస్కరించారు. ఈ 13 మందిలో జగన్, మేకపాటి, ఎస్పివై రెడ్డి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాము రాజీనామ చేసినట్లు వారు చెప్పారు. తమ రాజీనామాలు ఆమోదించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని వైఎస్ఆర్ సిపి నేతలు ముందే చెప్పారు. ఆ విధంగా వారు ఈరోజు ఢిల్లీ హైకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలు చేశారు. -
రాజీనామా ఆమోదించమని స్పీకర్‌ను కోరా: ఎస్పీవై రెడ్డి
ఢిల్లీ: తన రాజీనామాను ఆమోదించమని లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ను కోరినట్లు నంద్యాల ఎంపి ఎస్పివై రెడ్డి చెప్పారు. తాము రాజీనామా చేయకపోతే తమ ప్రజలు ఊరుకోవడంలేదని చెప్పినట్లు తెలిపారు. సమైక్యరాష్ట్రం కోసం రాజీనామా చేసినట్లు చెప్పారు. తాను నిన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని, ఇక ఆ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సమక్ష్యంలో ఎస్పివై రెడ్డి ఆ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఎస్పీవై రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. -
సమైక్యతకు కృషిచేస్తున్నది జగనే: ఎస్పీవై రెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, నంద్యాల లోక్‌సభ సభ్యుడు ఎస్పీవై రెడ్డి శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన తన మద్దతుదారులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని ఆయన నివాసంలో కలిసి పార్టీలో చేరారు. వారికి జగన్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ జైల్లో ఉన్నా సమైక్యాంధ్ర కోసం నిజాయితీగా నిరాహారదీక్ష చేశారని ప్రశంసించారు. సమైక్యాంధ్ర కోసం నిజాయితీగా పోరాడుతున్న రాజకీయ నాయకుడు ఒక్క జగన్మోహన్రెడ్డి మాత్రమేనని చెప్పారు. అందుకే సమైక్యాంధ్రకోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆయన ప్రకటించారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని, అందుకే ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎంపీ పదవికి శనివారం రాజీనామా చేయనున్నట్టు తెలిపారు. అందుకోసం లోక్‌సభ స్పీకర్ అపాయింట్మెంట్ ఖరారైందన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఫ్యాక్స్ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంతో పాటు పేదరికాన్ని నిర్మూలించవచ్చని చెప్పారు. ఎస్పీవై రెడ్డి నిర్ణయాన్ని పార్టీ తరఫున అభినందిస్తూ ఆహ్వానిస్తున్నట్లు శాసనసభాపక్ష ఉపనేత భూమా శోభానాగిరెడ్డి తెలిపారు. రైతులకు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా స్పందించి ఆదుకోవడంలో ఎస్పీవై రెడ్డి ముందుంటారని చెప్పారు. ఆయనకు పార్టీ అన్ని రకాలుగా అండదండలు అందిస్తుందని ఆమె వివరించారు. -
'సీఎం తన పదవి నుంచి వెంటనే తప్పుకోవాలి'
హైదరాబాద్: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తన మాటకు అధిష్టానం విలువ ఇవ్వడం లేదని అంటున్నప్పుడు.. పదవిలో కొనసాగడం ఎందుకని వైఎస్సార్ సీపీ నేత శోభా నాగిరెడ్డి నిలదీశారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర విభజనను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. ఆయన వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిన అనంతరం ఎస్పీవై రెడ్డి ఆ పార్టీ నేతలతో కలిసి మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా శోభా నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎస్పీవై రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడం శుభపరిణామం అని తెలిపారు. కిరణ్ వ్యాఖ్యలపై ఓ విలేకరి ప్రశ్నించగా ఆయనపై శోభా మండిపడ్డారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు ఎస్పీవై రెడ్డి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డిని కలిసి రాష్ట్ర పరిస్థితులపై చర్చించిన అనంతరం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయనకు జగన్ పార్టీ కండువా కప్పి వైఎస్సార్ సీపీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఎస్పీవై రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటు సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ సీపీ రాజీలేని పోరాటం చేస్తోంది. సమ న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్పీవై రెడ్డి.. జగన్ పార్టీలోకి రావడం సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీయనుందని భావిస్తున్నారు. -
వైఎస్సార్ సీపీలో చేరిన ఎంపీ ఎస్పీవై రెడ్డి
హైదరాబాద్: కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ జగన్ సమక్ష్యంలో ఆయన పార్టీలో చేరారు. ఆయనను జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరినట్టు ఎస్పీవై రెడ్డి తెలిపారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్ ను కలిసి తన రాజీనామా ఆమోదింపజేసుకుంటానని చెప్పారు. అంతకుముందు జగన్‌తో ఎస్పీవై రెడ్డి సమావేశమయ్యారు. ఇరువురు నేతలు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఎస్పీవై రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటు సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ సీపీ రాజీలేని పోరాటం చేస్తోంది. సమ న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్పీవై రెడ్డి.. జగన్ పార్టీలోకి రావడం సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీయనుందని భావిస్తున్నారు. -
వైఎస్ జగన్ తో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి భేటి!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కర్పూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి శుక్రవారం సాయంత్రం కలువనున్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై గత కొంతకాలంగా ఎస్పీవై రెడ్డి ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు వైఎస్ జగన్ తో భేటి కానున్నారు. అయితే వైఎస్ జగన్ తో ఎస్పీవైరెడ్డి భేటి రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశానంతరం ఎస్పీవై రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.