
సోమయాజులు
హైదరాబాద్: ఒక పార్టీ గుర్తుపై గెలిచిన వ్యక్తి మరో పార్టీలోకి వెళ్తే తప్పక అనర్హులవుతారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సలహాదారులు సోమయాజులు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నంద్యాల లోక్సభ సభ్యుడిగా గెలిచిన ఎస్పివై రెడ్డి ఈ రోజు ఉదయం ఢిల్లీలో తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనపై అనర్హత వేటు పడుతుందన్న భావనను సోమయాలు వ్యక్తం చేశారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రకమైన అనైతిక చర్యకు పాల్పడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు.
అయితే ఎస్పివై రెడ్డి పార్టీ మార్పిడికి తిరుగుబాటు నిబంధన వర్తించడని టిడిపి నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆయన ఎన్నికయ్యేనాటికి ఆ పార్టీకి గుర్తింపులేదన్నారు. ఎన్నికల్లో కామన్ గుర్తు ఉన్నప్పటికీ అభ్యర్థులను స్వతంత్రులుగానే గుర్తిస్తారని యనమల చెప్పారు. వైఎస్‌ఆర్ సీపీపై యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలను సోమయాజులు ఖండించారు.
ఇదిలా ఉండగా, ఎన్నికలలో పోలైన ఓటింగ్ శాతాన్ని బట్టి వైఎస్ఆర్ సిపి గుర్తింపు పొందే అవకాశం ఉంటుందని యనమలే అన్నారు.