somayajulu
-
దేశాభివృద్ధిలో కంపెనీ సెక్రటరీల కీలకపాత్ర
సాక్షి, విశాఖపట్నం: దేశాభివృద్ధిలో కంపెనీ సెక్రటరీల పాత్ర కీలకమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు అన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు విశాఖలో జరిగిన ప్రాక్టీసింగ్ సెక్రటరీస్ 24వ జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో జస్టిస్ సోమయాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘న్యాయవ్యవస్థలు, వృత్తి నిపుణుల నుంచి అంచనాలు.. ప్రాక్టికల్ టిప్స్’ అనే అంశంపై నిర్వహించిన ప్రత్యేక సెషన్లో ఆయన మాట్లాడారు. కంపెనీ సెక్రటరీలు.. న్యాయ వ్యవస్థకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. నియమ నిబంధనల్ని పాటిస్తూ.. దేశ ఆర్థి క వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలబడాలన్నారు. ముగింపు సదస్సులో ఐసీఎస్ఐ ఇండియా చైర్మన్ మనీష్ గుప్తా, ప్రతినిధులు గిరిధరన్, ద్వారకానా«థ్, నరసింహన్ తదితరులు పాల్గొన్నారు. జస్టిస్ సోమయాజుల్ని ఐసీఎస్ఐ ప్రతినిధులు సత్కరించారు. -
కోర్టుల్లో కేసు ఫైళ్లు మాయం అవడమా?
సాక్షి, అమరావతి: న్యాయస్థానాల్లోనే కేసుల ఫైళ్లు మాయం అవుతుండటంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. కోర్టుల్లోనే ఫైళ్లు మాయం అయ్యే పరిస్థితులు ఉన్నప్పుడు, తప్పు చేసే ప్రభుత్వాధికారులను తామెలా ప్రశ్నించగలమని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. నర్సరావుపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, గుంటూరు జిల్లా కోర్టులో ఓ కేసుకు సంబంధించిన ఫైల్ మాయం కావడంపై విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై విచారణ జరపాలని గుంటూరు ప్రిన్సిపల్ జిల్లా జడ్జిని ఆదేశించింది. బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసేలా చూడాలంది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రిన్సిపల్ జిల్లా జడ్జికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు కోర్టుల్లోనూ లేని కేసు ఫైల్ నర్సరావుపేటలోని సీనియర్ సివిల్ జడ్జి కోర్టు 1998 ఏప్రిల్ 6న ఓ కేసులో ఇచ్చిన తీర్పు సర్టిఫైడ్ కాపీని ఇవ్వాలంటూ వినుకొండకు చెందిన షేక్ లతీఫ్ సాహెబ్ దరఖాస్తు చేశారు. అయితే ఆ కేసు ఫైల్ తమ వద్ద లేదంటూ ఆ దరఖాస్తును కోర్టు సిబ్బంది తిరస్కరించారు. గుంటూరు జిల్లా కోర్టులోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో లతీఫ్ సాహెబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కె.వెంకట రామారావు వాదనలు వినిపిస్తూ, నర్సరావుపేట కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఓ కేసులో తాము అడుగుతున్న సర్టిఫైడ్ కాపీ అవసరం చాలా ఉందన్నారు. ఎక్కడా ఆ ఫైల్ లేకపోవడంతో సర్టిఫైడ్ కాపీ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు. ఆ కాపీ లేకపోవడం వల్ల పిటిషనర్‌కు తీరని నష్టం కలుగుతుందని చెప్పారు. వాదనలు విన్న సీజే ధర్మాసనం దీనిపై విచారణ జరపాలని గుంటూరు ప్రిన్సిపల్ జిల్లా జడ్జిని ఆదేశించింది. -
‘పిల్’లు దుర్వినియోగం
సాక్షి, అమరావతి: ప్రజా ప్రయోజన వ్యాజ్యాల (పిల్) పేరుతో కొందరు కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని, ఇలాంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని హైకోర్టు హెచ్చరించింది. రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు కొందరి వెనుక ఉంటూ డబ్బులిచ్చి హైకోర్టులో వీటిని దాఖలు చేయిస్తున్నారని పేర్కొంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో జరుగుతోందని, ఇలాంటి వ్యాజ్యాల పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉందని తేల్చి చెప్పింది. హైకోర్టులో కొందరి తరఫున పిల్లు దాఖలు చేయించేందుకు మధ్యవర్తులు కూడా ఉన్నారని తెలిపింది. తప్పుడు పిల్లు దాఖలు చేసే వారికి భారీగా ఖర్చులు విధించి తద్వారా గట్టి సందేశం పంపాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. తూర్పు గోదావరి జిల్లాలో బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ ఏర్పాటుపై దాఖలైన వ్యాజ్యంలో సింగిల్ జడ్జి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోడంతో అదే అంశంపై తిరిగి ధర్మాసనం ఎదుట పిల్ దాఖలు చేసిన వ్యక్తులకు ఖర్చులను కచ్చితంగా విధిస్తామని హైకోర్టు తేల్చి చెప్పింది. అందుకు ఇది అన్ని రకాలుగా అర్హమైన కేసు అని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదీ నేపథ్యం.. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం మర్రిపూడి పరిధిలో బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ ఏర్పాటును సవాలు చేస్తూ జి.సుధాకర్‌రెడ్డి మరో ఇద్దరు పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గత విచారణ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తరఫు న్యాయవాది సురేందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఇదే అంశంపై సింగిల్ జడ్జి ఎదుట ఓ వ్యక్తి పిటిషన్ వేశారని, అందులో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిపారు. ఆ విషయం తెలిసి కూడా పిటిషనర్లు పిల్ దాఖలు చేయడం కోర్టును తప్పుదోవ పట్టించడమే అవుతుందన్నారు. అత్యధిక శాతం దుర్వినియోగం చేసేవే.. తాజాగా ఈ పిల్ విచారణకు రావడంతో ధర్మాసనం స్పందిస్తూ పిటిషనర్లకు ఎంత మేర ఖర్చులు విధించాలో చెప్పాలని పేర్కొంది. ఈ రోజుల్లో నిజమైన పిల్లు చాలా స్వల్ప సంఖ్యలో దాఖలవుతున్నాయని, అత్యధిక శాతం కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసేవేనని తెలిపింది. ఎవరో వేస్తారు.. ఎవరికో డబ్బు అందుతుంది పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు నిరక్ష్యరాస్యులని నివేదించారు. కోర్టును తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశం వారికి ఎంత మాత్రం లేదన్నారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇవ్వలేదన్న విషయం వారికి తెలియదన్నారు. కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేస్తూ పిల్లు దాఖలు చేసే వారికి భారీ మొత్తంలో ఖర్చులను విధించాల్సిందేనని, అయితే పిటిషనర్లు ఆ కోవలోకి రారని విన్నవించారు. అయితే నిరర్థక వ్యాజ్యాలపై కఠినంగా వ్యవహరించాల్సిందేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. అలాంటి వ్యాజ్యాల కోసం తాము చాలా కాలంగా ఎదురు చూస్తున్నానని, ఇన్ని రోజులకు అలాంటి వ్యాజ్యం ఎదురైందని, రూ.25 లక్షలను ఖర్చుల కింద విధించాలన్న నిర్ణయానికి ఇప్పటికే వచ్చామని, ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులను సైతం సిద్ధం చేశామని తెలిపింది. ఎవరో పిల్ వేస్తారని, ఎవరికో డబ్బులు చెల్లిస్తారని, ఇలాంటి వ్యాజ్యాలను విచారించడం తమ పని కాదని తేల్చి చెప్పింది. ఈ వ్యాజ్యంలో ఖచ్చితంగా ఖర్చులు విధిస్తామని, అయితే అది ఎంతనేది తరువాత నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. -
AP High Court: పోలీసు స్టాండింగ్ ఆర్డర్స్ చెల్లవు.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, అమరావతి: రౌడీ షీట్లు తెరవడం.. కొనసాగించడం... రౌడీలుగా ప్రకటించడం.. వ్యక్తులపై నిఘా తదితర విషయాల్లో హైకోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ (పీఎస్వో) / పోలీసు మాన్యువల్ ప్రకారం రౌడీషీట్, సస్పెక్ట్ షీట్, హిస్టరీ షీట్ లాంటివి తెరవడం చెల్లదని స్పష్టం చేసింది. పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్‌కు చట్టబద్ధత లేదని తేల్చి చెప్పింది. పీఎస్ఓ ప్రకారం ఫోటోల సేకరణ, వాటిని స్టేషన్లలో ప్రదర్శించడం, ఇళ్లను సందర్శించడం, స్టేషన్‌కు పిలిపించడం, స్టేషన్లో గంటల పాటు వేచి ఉండేలా చేయడం తదితరాలన్నీ వ్యక్తుల గోప్యత హక్కుకు విఘాతం కలిగించేవేనని పేర్కొంది. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అనే తెలిపింది. పోలీసు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం ఇలాంటి పనులు చేయడం, వ్యక్తులపై అనుచిత నిఘా పెట్టడానికి వీల్లేదని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు శుక్రవారం 42 పేజీల తీర్పు వెలువరించారు. సుప్రీం తీర్పును ఉల్లంఘించడమే.. ‘చట్టపరమైన నియమ, నిబంధనలను పోలీసు స్టాండింగ్ ఆర్డర్స్ అధిగమించలేవు. పోలీసులకు సీఆర్పీసీ, ఐపీసీ ప్రసాదించిన హక్కులను పోలీసు స్టాండింగ్ ఆర్డర్స్ కల్పించడం లేదు. ఇవి కేవలం మార్గదర్శకాలు, విధి విధానాలు మాత్రమే. వీటికి ఎలాంటి చట్టబద్ధమైన బలం లేదు. అవి కేవలం శాఖాపరమైన సూచనలు మాత్రమే. పోలీసు చట్టం లేదా ఇతర ఏ చట్టం కింద పోలీసు స్టాండింగ్ ఆర్డర్స్‌ను రూపొందించలేదు. చట్టబద్ధత లేని పోలీసు స్టాండింగ్ ఆర్డర్స్‌ను రౌడీషీట్లు తెరవడానికి, కొనసాగించడానికి, తెరిచిన వాటిని సమర్థించుకోవడానికి ఉపయోగించేందుకు ఎంత మాత్రం వీల్లేదు. అలా చేయడం సుప్రీంకోర్టు తీర్పును నేరుగా ఉల్లంఘించడమే అవుతుంది’ అని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ కొనసాగిస్తే ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదులు కాని అధికారులు సైతం కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లే అవుతుందని హెచ్చరించింది. పిటిషనర్లపై తెరిచిన రౌడీషీట్లన్నింటినీ మూసివేయాలని పోలీసులను ఆదేశించింది. ఒకవేళ ప్రభుత్వం నేరాలు జరగకుండా ముందస్తుగానే నివారించేందుకు సమాచార సేకరణ, నిఘా వేయాలనుకుంటే అందుకు అనుగుణంగా వీలైనంత త్వరగా చట్ట ప్రకారం నిబంధనలు రూపొందించడం, చట్ట సవరణ చేపట్టడం చేయాలని పేర్కొంది. ఈ విషయానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. నేరాలను నివారించేందుకు పోలీసులకు సీఆర్పీసీ ప్రకారం చర్యలు తీసుకునేందుకు పలు ప్రత్యామ్నాయాలున్నాయని, వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. పోలీసులు రౌడీషీట్లు తెరవడం, కేసులు కొట్టివేసినా వాటిని కొనసాగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో దాదాపు 57 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గోప్యత ప్రాథమిక హక్కు... ‘గోప్యత ప్రాథమిక హక్కు అని కేఎస్ పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు మైలురాయి లాంటి తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ఈ కోర్టు ముందుకొచ్చిన వ్యాజ్యాల్లో పిటిషనర్లు తమ ప్రాథమిక హక్కులకు పోలీసులు కలిగిస్తున్న విఘాతం గురించి ప్రస్తావించారు. తరచూ తమ ఇళ్లకు రావడం, స్టేషన్లలో ఫోటోలు ప్రదర్శించడం, స్టేషన్‌కు పిలిపించి గంటల తరబడి వేచి ఉండేలా చేయడం, రౌడీలనే ముద్ర వేయడం లాంటివి చేస్తున్నట్లు నివేదించారు. రౌడీషీట్ పెండింగ్‌లో ఉందనే కారణంతో పాస్‌పోర్టు ఇవ్వడం లేదని, చిన్న నేరం చేసిన వారిని కూడా తరచూ నేరాలు చేసే వారిగా ముద్ర వేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. వీటన్నింటిని బట్టి పీఎస్వో అమలు సమయంలో పోలీసులు బుర్ర ఉపయోగించకుండా యాంత్రికంగా వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోంది’ అని జస్టిస్ సోమయాజులు తీర్పులో పేర్కొన్నారు. సీఆర్పీసీలో ఎన్నో వెసులుబాట్లు... ‘నేరం చేసే వ్యక్తుల పట్ల ఎలా వ్యవహరించాలి? శాంతికి విఘాతం కలిగించే వారి పట్ల ఎలా వ్యవహరించాలి? ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టాలనే విషయాలను సీఆర్పీసీ సెక్షన్లు 107, 109 స్పష్టంగా చెబుతున్నాయి. పదే పదే నేరం చేసే వారిపై సంబంధిత చట్టం కింద కేసులు పెట్టొచ్చు. పోలీసులు వారి వేలిముద్రలు, ఫోటోలు, చేతిముద్రలు, కాలిముద్రలు సేకరించవచ్చు. కదలికలపై పరిమితులు విధించొచ్చు. ఇలాంటి సౌలభ్యాలు, వెలుసుబాట్లు సీఆర్పీసీలో ఎన్నో ఉన్నాయి. నిఘా పెట్టడం, సమాచారం సేకరించడం లాంటి వాటిని కొనసాగించాలంటే చట్టాన్ని సవరించడమే సరైన విధానం’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. కోర్టులు ఆదేశించినా తీరు మారట్లేదు.. సుప్రీంకోర్టు మొదలు హైకోర్టు వరకు పలు సందర్భాల్లో విస్పష్టమైన తీర్పులిచ్చినా పోలీసులు ఇప్పటికీ రౌడీషీట్లు తెరుస్తూనే ఉన్నారు. విధి విధానాల పరమైన లోపాలున్నాయని పదేపదే చెబుతున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదు. తగిన కారణాలు, విశ్వసనీయమైన ఆధారాలు లేకుండా పలువురిపై రౌడీలుగా ముద్ర వేస్తున్నారు. లోక్ అదాలత్‌ల్లో రాజీ చేసుకున్న కేసుల్లో కూడా పోలీసులు రౌడీషీట్లు కొనసాగిస్తున్నారు. ఆయా వ్యక్తులపై కోర్టులు ఎఫ్ఐఆర్లను కొట్టివేసినా రౌడీషీట్లు కొనసాగిస్తూనే ఉన్నారు’ అని న్యాయమూర్తి తీర్పులో ఆక్షేపించారు. చట్టం నిర్దేశించిన మార్గాల్లో.. ‘నిఘా, రౌడీషీట్లు తెరవడాన్ని ప్రభుత్వ న్యాయవాది సమర్థిస్తున్నారు. సమాచార సేకరణ లాంటివి నేరం జరగడానికి ముందే నేరస్తులను గుర్తించేందుకు ఉపయోగపడుతుందని ఆయన చెబుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాన్ని ఈ కోర్టు విస్మరించడం లేదు. దశాబ్దాల తరబడి పోలీసులు పీఎస్వో విధానాన్ని అమలు చేస్తూనే ఉన్నారు. అయితే నేరాన్ని జరగకుండా నివారించేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలు చట్టం నిర్దేశించిన పరీక్షను దాటలేకపోయాయి. చట్టం నిర్దేశించిన మార్గాల్లో సాధారణ నిఘా, సమాచార సేకరణను ఏ చట్టం కూడా నిషేధించడం లేదు. నేరం జరగకుండా నివారించేందుకు ఇవి అవసరం. అయితే విచక్షణారహితంగా సమాచార సేకరణ, రాత్రిపూట ఇళ్ల సందర్శన, తరచూ పోలీస్‌స్టేషన్‌కు పిలవడం, స్టేషన్లో ఫోటోలు ప్రదర్శించడం లాంటివే ప్రధాన సమస్యలు. పుట్టుస్వామి కేసు ఆధారంగా పోలీసు స్టాండింగ్ ఆర్డర్స్‌ను రద్దు చేయవద్దని ప్రభుత్వ న్యాయవాది కోరుతున్నారు. ఈ అభ్యర్థన సరైంది కాదని నా అభిప్రాయం. పుట్టుస్వామి కేసులో సుప్రీంకోర్టు సమాచార భద్రత, ఆధార్ కార్డు గురించి మాత్రమే చర్చించలేదు. వ్యక్తి గోప్యత గురించి సవివరంగా చర్చించి, గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించింది. ప్రస్తుతానికి చట్టం కూడా ఇదే’ అని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. -
గ్రూప్–1 ఇంటర్వ్యూలకు హైకోర్టు బ్రేక్
సాక్షి, అమరావతి: గ్రూప్–1 ఇంటర్వ్యూలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ నెల 17న జరగాల్సిన ఇంటర్వ్యూలతో సహా తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలుపుదల చేసింది. ఆట మొదలైన తరువాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనల్ని మార్చిందని హైకోర్టు ఆక్షేపించింది. ఇంటర్య్వూలు జరిగితే సరైన అభ్యర్థులు ఇంటర్వ్యూలు/తదుపరి ఎంపికకు వెళ్లే హక్కును కోల్పోతారంది. ఇంటర్వ్యూలు జరిగితే వారికి తీరని నష్టం కలుగుతుందని అభిప్రాయపడింది. ఒక్క మార్కు తేడా కూడా అభ్యర్థి జీవితం మొత్తాన్ని మార్చేస్తుందని పేర్కొంది. ఈ దృష్ట్యా ఇంటర్వ్యూలు జరిగితే కలిగే నష్టాన్ని ‘తీరని నష్టం’గా చెప్పాల్సి వచ్చిందని తెలిపింది. జవాబు పత్రాలను కోర్టు ముందుంచేలా ఆదేశాలు ఇవ్వాలన్న అభ్యర్థనలతో దాఖలైన వ్యాజ్యాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. గ్రూప్–1 ప్రధాన పరీక్షకు సంబంధించిన సమాధాన పత్రాలను డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం చేసే బాధ్యతలను థర్డ్ పార్టీకి అప్పగించడం సరికాదని, ఈ నెల 17న జరగాల్సిన ఇంటర్వ్యూలకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై మంగళవారం వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు బుధవారం సాయంత్రం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించారు. న్యాయమూర్తి ఉత్తర్వుల్లో ఏమన్నారంటే.. ‘సివిల్ సర్వెంట్లను భర్తీ చేసుకునే గొప్ప బాధ్యతను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు రాజ్యాంగం కట్టబెట్టింది. అందువల్ల పోస్టుల భర్తీ విషయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై రాజ్యాంగ బాధ్యత ఉంది. ఈ బాధ్యతను రొటీన్ కార్యనిర్వాహక బాధ్యతగా భావించడానికి వీల్లేదు. జవాబు పత్రాలను డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం చేసేందుకు థర్డ్ పార్టీని ఏర్పాటు చేయడం, ఆ థర్డ్ పార్టీని ఎంపిక చేసేందుకు వారు అనుసరించిన విధానం, మూల్యాంకనం విషయంలో వారికున్న అనుభవం ఏమిటన్నదే ఈ కేసులో ప్రధానంగా తలెత్తే విషయాలు. చ ట్టం నిర్దేశించిన విధంగా నడుచుకుని తీరాల్సిందే. డిజిటల్ మూల్యాంకనం బాధ్యతలను థర్డ్‌పార్టీకి అప్పగించే విషయంలో ఆ థర్డ్ పార్టీని ఎలా ఎంపిక చేశారన్న దానికి సంబంధించిన వివరాలు ఇప్పటివరకు వెల్లడి కాలేదు. ఓపెన్ టెండర్ ద్వారానా, మ రో చట్టబద్ధ పద్ధతి ద్వారా చేశారో స్పష్టత లేదు. థర్డ్‌పార్టీకి సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసే అర్హతలు, నైపుణ్యం ఉన్నాయా అన్నదే ఇక్కడ తలెత్తే ప్రధాన ప్రశ్న. కమిషన్ దాఖలు చేసిన కౌంటర్లో ఈ విషయంలో మౌనం దాల్చింది. నోటిఫికేషన్‌లోని నిబంధనలను మార్చినా, సవరించినా ఆ విషయాన్ని సంబంధీకులందరికీ తెలియజేయాలని నిబంధనలు చెబుతున్నాయి. ప్రస్తుత కేసులో ఎవరు మూల్యాంకనం చేశారన్న దానిపై స్పష్టత లేదు. డిజిటల్ మూల్యాంకనంలోనూ గతంలో తప్పులు జరిగాయి. ఈ మొత్తం వ్యవహారంలో లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది’ అని న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంటర్వ్యూలు వాయిదా గ్రూప్–1 ఇంటర్వ్యూలను 4 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ ఇంటర్వ్యూలు ఈ నెల 17 నుంచి జూలై 9వ తేదీ వరకు జరగాల్సి ఉంది. అయితే గ్రూప్–1పై దాఖలైన వ్యాజ్యాలపై విచారణ చేసిన హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇంటర్వ్యూలు నిలిచిపోయాయి. సవరించిన ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
బాబును కాపాడేలా ‘సోమయాజులు’ నివేదిక
సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట, భక్తుల మరణంపై జస్టిస్ సోమయాజులు కమిషన్ ఇచ్చిన నివేదిక సీఎం చంద్రబాబును కాపాడే రీతిలో, వాస్తవాలను మరుగుపర్చేలా ఉండడం దారుణమని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఆ దుర్ఘటనకు సంబంధించిన ఆధారాలను పరిశీలించకుండానే టీడీపీ కార్యాలయంలో కూర్చుని నివేదికను రూపొందించారా? అని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబే దీన్ని తయారుచేసి, సోమయాజులు చేత సంతకం పెట్టించి ఉంటారన్నారు. ఇలాంటి ఏకపక్ష నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వాసిరెడ్డి పద్మ బుధవారం హైదరాబాద్‌లో పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘ప్రజలు గుడ్డినమ్మకంతో, ఇంగితం మరిచి పుష్కరాలకు వచ్చారని సోమయాజులు కమిషన్ నివేదికలో పేర్కొనడం దారుణం. మీడియా తప్పుడు ప్రచారం వల్ల, మూఢ విశ్వాసాల వల్ల తొక్కిసలాట జరిగిందని చెప్పడాన్ని చూస్తే ఇది అసలు కమిషనేనా లేక చంద్రబాబును కాపాడటానికి ఇచ్చిన రిపోర్టా అన్న అనుమానం కలుగుతోంది. ఇంత దౌర్భాగ్యమైన నివేదికను ఎప్పుడూ, ఏ కమిషనూ ఇవ్వలేదు. తప్పంతా మీడియా, భక్తులపైనే నెట్టడం సమంజసం కాదు. దుర్ఘటన జరిగిన మరుసటి రోజు అప్పటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికను కమిషన్ పట్టించుకోలేదు. తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయారని తెలిసిన తర్వాతే చంద్రబాబు అక్కడి నుంచి వెళ్లిపోయారని జిల్లా పోలీసు అధికారి కూడా తెలిపారు. ఇన్ని ఆధారాలు కళ్లముందు ఉన్నా, చంద్రబాబును కాపాడే రీతిలో కమిషన్ నివేదిక ఇవ్వడం దారుణం’’ అని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు ప్రచార యావ వల్లే ఇంత ఘోరం జరిగితే, సోమయాజులు కమిషన్.. ప్రతిపక్షాలను తప్పుబట్టడం ఆశ్చర్యంగా ఉంది. అధికారంలో ఉన్నవాళ్లను కాపాడడమే కమిషన్ కర్తవ్యంగా పెట్టుకుంది. కనీస మానవత్వం కూడా లేకుండా కమిషన్ చేత తప్పుడు నివేదిక ఇప్పించిన చంద్రబాబును ప్రజలు క్షమించరు. ఈ నివేదికను వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది’’ అని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. -
.. ఇది క్షమార్హం కాదు!!
ఆగ్రహోదగ్రులైన జనాన్ని చల్లార్చడానికి విచారణ కమిషన్లు మత్తు మందుగా పనికొస్తాయని విఖ్యాత న్యాయ కోవిదుడు స్వర్గీయ జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఈ కమిషన్లకు నేతృత్వం వహించేవారిని ఎంపిక చేయటం మొదలుకొని జరిగే మొత్తం ప్రక్రియంతా సంశయాత్మక క్రీడ అని కూడా ఆయన చెప్పారు. ఏం చేయడానికైనా సిద్ధపడే రిటైర్డ్ న్యాయమూర్తుల దురాశను ఆయన చెరిగిపారేశారు. మూడేళ్లక్రితం గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్ర వరంలో తొక్కిసలాట జరిగి 29 నిండు ప్రాణాలు బలైన ఉదంతంపై నియమించిన జస్టిస్ సీవై సోమయాజులు కమిషన్ సమర్పించిన నివేదిక చూస్తే జస్టిస్ కృష్ణయ్యర్ అభిప్రాయాలు అక్షర సత్యాలని అర్ధమవుతుంది. సాధారణంగా కమిషన్లు ఏర్పాటు చేసేటపుడు ప్రభుత్వాలు చాలా విష యాలు చెబుతాయి. జరిగిన ఉదంతానికి దారితీసిన పరిస్థితులేమిటో, వాటికి బాధ్యులెవరో, భవి ష్యత్తులో ఈ మాదిరి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి తీసుకోదగిన చర్యలేమిటో సూచించటం తదితరాలు అందులో ఉంటాయి. మూడేళ్లపాటు సాగిన విచారణలోఎందరో పాల్గొని అనేక అంశాలను జస్టిస్ సోమయాజులు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. ఆనాటి ప్రమాదంలో గాయాలపాలైనవారితో, మరణించినవారి కుటుంబసభ్యులతో అఫిడవిట్లు దాఖలు చేయించారు. ఏం జరిగుంటే ఈ విషాదాన్ని నివారించటం సాధ్యమయ్యేదో సవివరంగా చెప్పారు. పుష్కరాలకు భారీయెత్తున ఏర్పాట్లు చేస్తున్నామంటూ వందల కోట్లు ఖర్చుపెట్టిన ప్రభుత్వం తగిన సంఖ్యలో అంబులెన్స్‌ల మాట అటుంచి, కనీసం మంచినీళ్లు కూడా అందుబాటులో ఉంచకపోవడాన్ని ఎత్తిచూ పారు. పైగా నిబంధనలు అతిక్రమించి ఘటనాస్థలికి సమీపంలో పలు వీఐపీ వాహనాలు, ఇతర వాహనాలు పార్క్ చేసిన తీరును వెల్లడించారు. ఊరునిండా పద్మవ్యూహాన్ని తలపించేలా బారికేడ్లు పెట్టి ఎటు పోవాలో తెలియని అయోమయ స్థితిని కల్పించిన వైనాన్ని వెల్లడించారు. వీటన్నిటికీ ఆధారాలుగా వీడియోలు, ఫొటోలు, పత్రికల క్లిప్పింగ్‌లు కమిషన్‌కు సమర్పించారు. వాదనలన్నీ విని, వీరందరూ సమర్పించిన నివేదికలను పరిశీలించి చివరాఖరికి జస్టిస్ సోమయాజులు కమిషన్ తేల్చిందేమిటన్నది చూస్తే ఎవరికైనా విస్మయం కలుగుతుంది. ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు క్లీన్ చిట్ ఇవ్వడానికి... పుష్కర ఏర్పాట్లతో, నిర్వహణతో, ఆనాటి ఘటనతో ఏమాత్రం సంబంధంలేని వారిపై బురదజల్లడానికి కమిషన్ చూపించిన ఉత్సాహం దిగ్భ్రమగొలుపుతుంది. పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాటకు కారణాలేమిటో అక్కడ విధులు నిర్వహించిన హోంగార్డు స్థాయి ఉద్యోగి సైతం చెప్పగలడు. రాజమహేంద్రవరం పరిసరాల్లో దాదాపు 30 ఘాట్లు ఏర్పాటు చేశామని, ఎన్ని లక్షలమందైనా సునాయాసంగా స్నానాలు చేయడానికి వీలుంటుందని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. ఒక్క పుష్కరఘాట్ మినహా ఇతర ఘాట్లలో వాస్తవానికి అలాంటి పరిస్థితే ఉంది. ఉన్నవాటిలో పుష్కరఘాట్ చిన్నది. అయినా అక్కడ మాత్రమే ఇంత భారీయెత్తున జనం ఎందుకు గుమిగూడారన్న అంశంపై కమిషన్ దృష్టి సారించి ఉంటే ఎన్నో అంశాలు వెలుగు లోకొచ్చేవి. వేకువజామున 6.26 నిమిషాలకు దివ్యమైన ముహూర్తం ఉన్నదని, ఆ సమయంలో స్నానం చేస్తే ఏడేడు జన్మాల్లో చేసిన పాపాలన్నీ పోతాయని దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రభుత్వం భారీయెత్తున ప్రచారం చేసింది. ఆ ముహూర్తానికే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు తమ తమ కుటుంబాలతో స్నానానికి తయారయ్యారు. చేస్తే చేశారు... వీరంతా వీఐపీల కోసం కేటాయించిన విశాలమైన సరస్వతి ఘాట్‌ను కాదని, వైశాల్యంలో చిన్నదిగా ఉండే ఈ పుష్కరఘాట్‌కు పొలోమంటూ ఎందుకు పోవాల్సివచ్చిందో కమిషన్ అడగలేదు. ప్రభు త్వంవైపు నుంచి ఎవరూ చెప్పలేదు. సందేహాలే విజ్ఞానానికి బాటలు పరుస్తాయంటారు. కమిషన్‌కు ఈ విషయంలో సందేహం రాకపోవడం వల్ల అనేక అంశాలు మరుగునపడ్డాయి. పుష్కర సంరం భాన్ని, ముఖ్యమంత్రి కుటుంబసమేతంగా స్నానం చేస్తున్న దృశ్యాలను సినీ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిత్రీకరించాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. ఆ దృశ్యాల్లో జనసందోహం భారీయెత్తున కనబడాలన్న ఉద్దేశంతో చంద్రబాబు కుటుంబాన్ని పుష్కరఘాట్‌కు తీసుకొచ్చారు. గోదావరి స్టేషన్లో దిగేవారు, ఇతరత్రా మార్గాల ద్వారా వచ్చే భక్తులు వేర్వేరు‡ఘాట్లకు పోతే ఇక్కడ జనం తక్కువవుతారన్న ఆలోచనతో పోలీసులు, ఇతర సిబ్బంది సాయంతో అందరినీ పుష్కర ఘాట్‌కు మళ్లించారు. ఆ విధంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు తెల్లారుజామున 4.30 మొదలుకొని 8 గంటల సమయం వరకూ ఆ ఘాట్ వెలుపల పడిగాపులు పడ్డారు. ఇంతమంది భక్త జనం కెమెరా ఫ్రేంలో అద్భుతంగా కనబడి ఉండొచ్చుగానీ, అది వారందరికీ శాపంగా మారింది. బాబు అక్కడినుంచి నిష్క్రమించగానే, అంతవరకూ అక్కడున్న బందోబస్తు మాయమైంది. ఆ ఘాట్కున్న ఒకే ఒక ప్రవేశద్వారాన్ని తెరవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. అందులో గాయ పడినవారు గుక్కెడు నీళ్లిమ్మని రోదిస్తున్నా సమీపంలో ఎక్కడా మంచినీరు లేని తీరును చాలామంది మీడియాకు ఆ వెంటనే వివరించారు. అలా నీళ్లు అందించి ఉంటే కొందరి ప్రాణాలైనా కాపాడటం సాధ్యమయ్యేదని చెప్పారు. ఆ దరిదాపుల్లో అంబులెన్స్‌ల జాడలేదని, చేతులపై మోసుకెళ్లామని వివరించారు. పైగా సీసీ టీవీ ఫుటేజ్గానీ, నేషనల్ జియోగ్రఫిక్ చానెల్ కోసం తీసిన వీడియోగానీ కమిషన్ ముందుకు రానేలేదు. మూడేళ్ల తర్వాత సమర్పించిన నివేదికలో ఇలాంటి కీలకమైన అంశాలు లేవు సరిగదా పంచాంగకర్తలు మొదలుకొని ప్రతిపక్షాల వరకూ టోకున అందరినీ ‘దోషుల్ని’ చేసిన వైనం, ప్రజలనూ, మీడియాను బాధ్యులను చేసిన తీరు విస్మయపరుస్తుంది. తనకనుకూలంగా అన్ని వ్యవస్థలనూ దిగజార్చటంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు ఆఖరికి విచారణ కమిషన్లపై జనంలో కొద్దో గొప్పో ఉండే విశ్వసనీయతను కూడా దారుణంగా దెబ్బతీశారని నివేదిక చూస్తే అర్ధమవుతుంది. ఇది క్షమార్హం కాదు. -
సోమయాజులు లేని లోటు పూడ్చలేనిది
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడు, దివంగత డీఏ సోమయాజులు మహామేధావి, అ పార విజ్ఞానఖని, గొప్ప మానవత్వం ఉన్న మనిషని, సమయస్ఫూర్తిలో అందరికన్నా మిన్నగా ఉండేవారని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. సమకాలీన ప్రపంచంలో అలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటా రని కొనియాడారు. ఆదివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ సెంటర్లో కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో సంస్మరణ సభ ఘనంగా జరిగింది. సోమయాజులు తల్లి సుబ్బలక్ష్మి, భార్య కళ్యాణి, కుమారుడు డీఏ కృష్ణ, కుమార్తె సువర్ణను పలువురు ప్రముఖులు కలసి ధైర్యం చెప్పారు. సోమయాజులుతో తమకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నా రు. గొప్ప మానవత్వం ఉన్న మహామనిషి సోమ యాజులు అన్న ఇకలేరంటే చాలా బాధనిపిస్తోందని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ అన్నారు. వైఎస్సార్, సోమయాజులు ఆశయాలు, లక్ష్యాలు ఒక్కటేనని.. క్లిష్ట సమయంలో తమ కుటుం బానికి అండగా ఉండేవారని, ఆయన మరణం వైఎస్సార్సీపీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. సోమయాజులు మంచి ఆప్తుడు, ఆత్మీయుడని, ఎప్పటికీ ఆయన కుటుంబానికి అండగా ఉంటామని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు అన్నారు. వైఎస్సార్సీపీకి ఇది కీలక సమయమని, ఈ సమయంలో ఆయన లేకపోవడం పెద్ద లోటని లోక్‌సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. సొమ యాజులంత తెలివైన వ్యక్తిని ఇక చూడలేమని డాక్టర్ గురివిరెడ్డి చెప్పారు. అన్ని విషయాల్లోనూ అత్యంత లోతైన పరిశీలన చేసిన మేధావి, దార్శనికుడిని కోల్పోవటం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ ప్రధా న కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం పరితపించిన మేధావి, తమలాంటి వారికి గురువుగా ఉండేవారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గుర్తు చేసుకున్నారు. అనేక అంశాలపై అభిప్రాయాల్ని తెలియ జేసి, దిశా నిర్దేశం చేసేవారని, ఆ మహనీయుడు మళ్లీ పుట్టాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. సోమయాజులు లేని లోటు తీర్చలేనిదని, ఆయన మరణం వైఎస్ జగన్మోహన్రెడ్డిని, వైఎస్సార్సీపీని అన్ని విధాలుగా బాధించిందని వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ వ్యవహారాల కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రతి సబ్జెక్టులో విషయాలు సోమయాజులుకు తెలిసి నంతగా ఇతరులకు తెలియవని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు అన్నారు. సోమయాజులు వాకింగ్ ఎన్ సైక్లోపీడియా అని, మేధావే కాదు.. మంచి సంగీత ప్రియుడని మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ అన్నారు. ఎనర్జీ రంగంపై సోమ యాజులుకున్న పట్టు తిరుగులేనిదని, ఆయనను జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. వైఎస్సార్ హయాంలో ప్రభుత్వ సలహాదారుడిగా సోమయాజులు ఉండగా ఆయన వద్ద చాలా నేర్చు కున్నానని విశ్రాంత చీఫ్ సెక్రటరీ మోహన్ కందా చెప్పారు. మార్గదర్శిగా, గైడ్‌గా సోమయాజులు తమను ముందుకు నడిపించారని ఏపీ మాజీ మంత్రి ఆనం రామనారా యణ రెడ్డి అన్నారు. ఆత్మీయుడ్ని కోల్పోయామని మాజీ మంత్రి గీతారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతీరెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, సాక్షి ఫైనాన్స్ డైరెక్టర్ వైఈపీ రెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారా యణ, అంబటి రాంబాబు, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాద్‌రెడ్డి, ఎమ్మెల్యే కో న రఘుపతి, పార్టీ నేతలు మోపిదేవి వెంకటరమణ, వాసిరెడ్డి పద్మ, నారమిల్లి పద్మజ, ఎస్.దుర్గాప్రసాద్ రాజు, విజయ చందర్, మాజీ ఎంపీలు కొణతాల రామకృష్ణ, ఉండవల్లి అరుణ్‌కుమార్, ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు, పారిశ్రామికవేత్త రఘు రామరాజు, మాజీ డీజీపీ అరవిందరావు, శాంతా బయోటిక్స్ అధినేత వరప్రసాద్‌రెడ్డి, ఎం.ప్రతాప్, మోహన్ కుమార్, జి.విష్ణు, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కార్మిక నేత జనక్‌ప్రసాద్, పూర్వపు ప్రెస్ సెక్రటరీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తమ ‘సోమ’జ్యోతిర్గమయ
దువ్వూరి సోమయాజుల్ని విజ్ఞానపు వెలుగుగా వర్ణిస్తారు ఆయన సన్నిహితులు. ‘ఐబీఎం మెయిన్‌ఫ్రేమ్స్ రోజుల్లోనే తయారైన లేటెస్ట్ ఐఫోన్’ అంటారు మరికొందరు సన్నిహితులు ఆయన గురించి. రెండూ నిజమే!! ఎందుకంటే శాస్త్రీయ సంగీతంతో పాటు తాజా సినిమా పాటల్లోని సాహిత్యాన్ని కూడా అంతే సాధికారికంగా విశ్లేషిస్తారాయన. మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో పుట్టారాయన. తండ్రి టీచర్ కావటంతో గద్వాలలోనే విద్యాభ్యాసం ఆరంభమయింది. తండ్రికి బదిలీ కావటంతో కొన్నాళ్లు భువనగిరి... తరవాత హైదరాబాద్!!. దీంతో... పాఠశాల స్థాయి నుంచే హైదరాబాద్ ఆయన అడ్డా అయింది. సంబంధం లేని సబ్జెక్ట్ లేదు మలక్‌పేట గవర్నమెంట్ స్కూల్లో సోమయాజులు సోదరుడు టీచర్. తండ్రి హెడ్మాస్టర్. ఆయన చదివిందీ అక్కడే. స్కూల్ టైమ్ నుంచే పుస్తకాలు తెగ చదివేవారు. చిత్రమేంటంటే ఆయనకు చిన్ననాటి నుంచి తన సబ్జెక్ కానిదంటూ ఏదీ లేదు. స్నేహితుడు కొల్లూరి విజయశంకర్ తండ్రి చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ కావటంతో అక్కడికెళ్లి జైలు లైబ్రరీలోని పుస్తకాలు తెచ్చుకుని మరీ చదివేవారు. ఆ రచయితలు, వారి రచనలపై చర్చించేవారు. అదే అలవాటు చివరి దాకా కొనసాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘లా’ చదివినపుడు... వర్సిటీ జర్నలిజం విభాగానికి టెలీ ప్రింటర్ ద్వారా పీటీఐ, యూఎన్ఐ వంటి వార్తాసంస్థల నుంచి వార్తలొస్తుండేవి. తనకు ఆ విభాగంతో సంబంధం లేకపోయినా... ప్రపంచ గమనాన్ని, తాజా సమాచారాన్ని తెలుసుకోవటానికి రోజూ అక్కడికి వెళ్లేవారు. ఆ వార్తలన్నీ చదివేసేవారు. తెలుగు భాషా దిగ్గజం భద్రిరాజు కృష్ణమూర్తి అప్పట్లో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్‌గా ఉండగా... ఆయన క్లాసుల్లో కూడా కూర్చునేవారు సోమయాజులు. ఎప్పుడు చదువుతారబ్బా..? సోమయాజులు చార్టర్డ్ అకౌంటెన్సీ, లా, కంపెనీ సెక్రటరీ మూడు కోర్సుల్నీ పూర్తి చేశారు. వారణాసిలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్‌లో సీటొచ్చి చేరినా... హైదరాబాద్‌లో అందరినీ వదిలి ఉండలేక కోర్సు పూర్తి చేయకుండానే వచ్చేశారు. నిజానికి ఆయన చదువు, మార్కులు చూసిన వారెవరైనా... ఆయన ఎప్పుడూ పుస్తకాలని అంటిపెట్టుకుని ఉంటారని అనుకుంటారు. కానీ... ఆయన ఏ లక్కీకేఫ్‌లోనో, తిలక్‌రోడ్‌లోని హిరోజ్ కేఫ్‌లోనో అర్ధరాత్రి దాకా తన స్నేహితులతో మాట్లాడుతూనే కనిపించేవారు. ఇక ఇంట్లో చూస్తే ఇష్టమైన ఇతరత్రా పుస్తకాలు చదివేవారు. ఇంగ్లీషు సినిమాలంటే ఇష్టం. దాదాపు అన్ని ఇంగ్లీషు క్లాసిక్స్‌నూ థియేటర్లోనే చూశానని చెప్పేవారాయన. బాలీవుడ్ సినిమాల్లో సైతం అప్ టు డేట్‌గా ఉండేవారు. అలాంటి వ్యక్తి క్లిష్టమైన పరీక్షలు సైతం అలవోకగా ఎలా పాసయిపోతున్నారు? అని స్నేహితులు, తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయేవారు. కార్వీ వ్యవస్థాపకులు పార్థసారథి గారు కూడా ఆయనకు మంచి స్నేహితుడు. ‘‘తాను చదవకుండా తనకు వినపడేలా చదవమని చెప్పి... అది మైండ్‌లో రికార్డ్ చేసేసుకునేవారు. చదివింది, విన్నది చాలా ఫాస్ట్‌గా రికార్డ్ చేసుకుని అవసరమైనప్పుడు తిరిగి వెంటనే తీసే సత్తా ఆయన సొంతం’’ అని స్నేహితులు చెబుతుంటారు. సంగీతం... ఆయన ప్రపంచం అబిడ్స్ తాజ్ మహల్ హోటల్లో కాఫీలు, మసాలా దోసెలు ఆయనకెంతో ఇష్టం. సిటీలోని ఇరానీ కేఫ్‌లలో వాళ్లు ఇక క్లోజ్ చేస్తామని చెప్పేదాకా స్నేహితులతో ‘చాయ్ పే చర్చలు’ నడిపించే వారు. అప్పట్లో కలకత్తా రామ్‌ప్యారీ మీనాక్షి పాన్ రోజుకు ఆరేడు దాకా తినేసేవారు. వీటన్నిటికీ తోడు సంగీతమంటే... అందులోనూ ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గాత్రమంటే ప్రాణం. కర్ణాటక సంగీతంలో ఏ రాగం గురించైనా సాధికారికంగా మాట్లాడేవారు. ఇక హిందీ సినిమాలకొస్తే గురుదత్, మధుబాల, వహీదా రెహ్మాన్ అంటే అభిమానం. పాత సినిమాల నుంచి తాజా సినిమాల వరకూ దాదాపు మంచిదేదీ వదిలేవారు కాదు. అన్నిటినీ చూసి... వాటిలోని సంగీతం, డైలాగులు వంటి అంశాల్ని పరిశోధనాత్మకంగా వివరించేవారు. ఉత్తరాది, దక్షిణాది సంగీత బాణీలన్నిటినీ విశ్లేషించేవారు. ‘‘నాకూ సంగీతమంటే ఇష్టం కావటంతో ఇద్దరం రాత్రిళ్లు రెండు, మూడింటి వరకూ మాట్లాడుకునే వాళ్లం. వాళ్లబ్బాయికి మాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండటంతో ఆయన కూడా కలిసేవారు’’ అని సోమయాజులు సహాధ్యాయి విజయశంకర్ వివరించారు. రోజూ ఇంట్లో అమ్మవారిని పూజించే సోమయాజులు... సమయం దొరికినపుడల్లా విజయవాడ కనకదుర్గ, తుల్జాపూర్ భవానీ వంటి పీఠాలను దర్శించేవారు. వివిధ రంగాలపై పట్టు ఎనర్జీ రంగంపై సోమయాజులుకున్న పట్టు తిరుగులేనిది. అంకెలు అలవోకగా చెప్పటమే కాదు. ప్రాక్టికల్‌గా వాటిలోని సాధ్యాసాధ్యాలనూ వివరించేవారు. ఇంధనం, వ్యవసాయం, ఆర్థికం... ఇలా దాదాపు 15–20 రంగాలకు సంబంధించి ప్రతి పరిణామాన్నీ అధ్యయనం చేస్తూ ఎప్పుడూ అప్టు డేట్‌గా ఉండేవారాయన. స్టాక్ మార్కెట్లనూ నిశితంగా అధ్యయనం చేసేవారు. హర్షద్ మెహతా సమయంలో బుడగ పగులుతుందని ఆయన చెప్పినా తాము నమ్మలేదని, తరవాత అదే నిజమైందని స్నేహితులు కొందరు గుర్తు చేసుకున్నారు. ‘‘సామాజికంగా, రాజకీయంగా అంతా ఆయన దగ్గర తమ సందేహాలు నివృత్తి చేసుకునేవారు. ఎప్పటినుంచో పెద్ద పెద్ద రాజకీయ పరిచయాలున్నాయి. ఏ ప్రభుత్వం ఎలా పనిచేసిందో చెప్పేవారు. ఆయనతో ఒకసారి స్నేహం కలిస్తే అది చిరకాలం కొనసాగటానికే అవకాశాలెక్కువ’’ అని 40 ఏళ్లుగా ఆయనకు సన్నిహితులైన మోహన్ కుమార్ వివరించారు. ఏపీఐడీసీతో... పారిశ్రామికుల గురువుగా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఐడీసీ) గతంలో తొలిసారిగా ఇండస్ట్రియల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్సును ఆరంభించింది. ఆ కోర్సు డైరెక్టరు సోమయాజులే. ఇప్పుడు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఫార్మా, సిమెంట్ తదితర రంగాల్లో దిగ్గజాలుగా ఉన్న పలు సంస్థల అధిపతులు అప్పట్లో ఈ కోర్సులో చేరారు. కొన్నాళ్లు కొనసాగాక... 1970ల్లో ఏపీఐడీసీని వదిలి బాంబినో వంటి పలు కంపెనీలను ఏర్పాటు చేయటంలో ప్రమోటర్లకు సహకరించారు. వాటిల్లో డైరెక్టరుగానూ కొనసాగారు. వ్యక్తిగతంగా జవహర్లాల్ నెహ్రూను విపరీతంగా అభిమానించేవారు. ఆయనంతటి దార్శనికుడు, జ్ఞాని లేడనేవారు. ఆయన రాసిన పుస్తకాలన్నీ చదవటమే కాక... శ్యామ్ బెనెగళ్ తీసిన డాక్యుమెంటరీలూ చూసేవారు. రాజకీయాలపై ఆసక్తి పెరిగిన తరవాత... తొలుత పీజేఆర్‌కు సలహాదారుగా చేరారు. దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో అధికారికంగా ప్రభుత్వ సలహాదారుగా నియమితులు కావటంతో పాటు... ఏపీ వ్యవసాయ టెక్నాలజీ మిషన్ వైస్ చైర్మన్‌గానూ కొనసాగారు. తదనంతర పరిణామాల్లో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వెంట ఉండి... వైఎస్ఆర్సిపిలో కొనసాగుతూ వచ్చారు. – మంథా రమణమూర్తి నైతికత మానవీయత కలగలిపితే సోమయాజులు నైతికత మానవీయ కలగలిపితే డీఏ సోమయాజులు అవుతారు. నేను ఆయనలో అద్భుత మానవతావాదిని చూశాను. ఒకసారి ఆయనతో ఎవరైనా కనెక్ట్ అయ్యారంటే వాళ్లు ఆయనను తమ ఇంట్లో పెద్దలా చూసుకుంటారు. అటువంటి ఆత్మీయ నేస్తం ఇకలేరనే విషయం జీర్ణించుకోలేకపోతున్నాను. నేడు దివంగతనేత వైఎస్ఆర్ ప్రజల్లో గుండెల్లో గూడుకట్టుకొని ఉన్నారంటే దాని వెనుక సోమయాజులు కృషీ, మేధస్సూ ఎంతో ఉంది. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన అనేక ప్రజా సంక్షేమ పథకాల సూత్రధారి ఆయన. ఉచిత విద్యుత్ ఆలోచన ఆయనదే. బడుగు వర్గాల ప్రయోజనం కోసం ఎంతో పరితపించేవారు. ఆయనకున్న పరిజ్ఞానం ఆపారం. చరిత్ర, సామాజిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం... ఒకటేమిటి అన్ని శాస్త్రాలపై ఆపారమైన పట్టున్న మేధావి ఆయన. చాలా వేగంగా ఆలోచనలు చేసేవారు. క్లాసికల్ ఫిల్మ్స్ బాగా ఇష్టంగా చూసేవారు. ఎన్నో కీర్తనలకు రాగాలు చెప్పేవారు. మంచి సంగీత ప్రియుడు. తెలుగు, ఇంగ్లీషు సాహిత్యాలు ఔపోసన పట్టారు. బ్రిటిష్, ఇండియన్ రాజ్యాంగ నిబంధనలు ఆయన నాలుక చివరే ఉంటాయి. క్లిష్టమైన అంశాలనూ అరటిపండు వలచినట్లు చెప్పగలరు. సోమయాజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న ఈ సమయంలో సోమయాజులు అవసరం ఎంతో ఉంది. ఆయనే బతికి ఉంటే ప్రజలకు ఇంకెంతో మేలు కలిగేది. ఆయనకు వచ్చిన శ్వాసకోశ వ్యాధిలోని చాలా అరుదుగా ఏ కొద్దిమందికి మాత్రమే వచ్చేది. రెండేళ్లు ఆయన్ని అమితంగా బాధించింది. చనిపోయే చివరి రోజుల్లో శ్వాస తీసుకొనేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చివరికి ఆదివారం తెల్లవారు జామున ఆయన కుటుంబసభ్యులను, వైఎస్ఆర్ సీపీని, మా లాంటి ఆత్మీయులను, తెలుగు ప్రజలను విడిచి వెళ్లిపోయారు. ఎక్కడున్నా మా నేస్తం ఆశీస్సులు వైఎస్ఆర్ సీపీకి ఉంటాయి. ఆయన్ని ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటాం. – భూమన కరుణాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి, వైఎస్ఆర్ సీపీ -
సోమయాజులు ఆరోగ్యం విషమం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి (పీఏసీ) సభ్యుడు డీఏ సోమయాజులు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన మూడేళ్లుగా దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. పది రోజుల నుంచి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారడంతో శుక్రవారం హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్లో చేర్చారు. శనివారం బీపీ పూర్తిగా పడిపోయి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ బి. చంద్రశేఖర్‌రెడ్డి, డాక్టర్ శేషగిరిరావు తెలిపారు. సోమయాజులు పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న విషయం తెలిసిన వెంటనే ‘సాక్షి’చైర్పర్సన్ వైఎస్ భారతీరెడ్డి, ఎంపీ కేవీపీ రామచంద్రరావు, టీసీఎల్పీ నేత జానారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వాసిరెడ్డి పద్మ, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి తదితరులు ఆస్పత్రికి చేరుకుని ఆయనను పరామర్శించారు. -
ఆశల గాలి ఊసుల కలనేత
బడ్జెట్ ఉపన్యాసం ఆశలతో నిండి ఉంది గానీ, గణాంకాలు మాత్రం పూర్తిగా భిన్నమైన చిత్రాన్ని చూపుతున్నాయి. రైతుల ఆదాయాలను వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేయాలని బడ్జెట్ ఆకాంక్షించింది. కానీ కనీస మద్దతు ధరలను పెంచకుండా ఇది ఎలా సాధ్యం?. జీడీపీ 7.1 శాతానికి పడిపోవడం దుర్వార్త. మొత్తంగా చూస్తే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దురదృష్టవశాత్తూ, 2016–17 సవరించిన అంచనాలతో పోలిస్తే 2017–18లో రాబడుల వృద్ధి 5.5 శాతమనే అంచనా అత్యంత నిరుత్సాహకరంగా ఉన్నదని చెప్పాలి. మొత్తంగా చూస్తే ఈ ఏడాది బడ్జెట్లో పెద్దగా చెప్పుకోవలసింది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రస్తావనగానీ, విశాఖపట్నం రైల్వే జోన్ ప్రస్తావనగానీ లేదు. అలాగే ఏపీ రాజధాని నగరానికిగానీ లేదా వైజాగ్–చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు గానీ పెద్దగా కేటాయింపులు జరిపినట్టు అనిపిం చడం లేదు. పెద్ద నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థపై చూపిన తీవ్ర దుష్ప్రభావాన్ని గురించి బడ్జెట్ వివరంగా చర్చించలేదు. మొట్టమొదటిసారిగా విడిగా రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేదు. అది సాధారణ బడ్జెట్లో భాగంగా మారింది. స్వాతంత్య్రానంతర కాలంలో మొదటిసారిగా ఈ బడ్జెట్లో ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల పద్దులు లేవు. ఆ వర్గీకరణకే స్వస్తి పలికారు. పెట్టు బడి, రాబడి పద్దులు రెండే ఈ బడ్జెట్లో ఉన్న ఏకైక వర్గీకరణ. అది రాజ్యాంగ పరంగా విధిగా జరపాల్సినది. గణాంకాలు ఘనం... వాస్తవాలు విభిన్నం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన నాలుగో బడ్జెట్ ఇది. రూ. 21.47 లక్షల కోట్ల వ్యయంతో ఆయన 2017–18 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను సమర్పించారు. 2016–17కు సవరించిన బడ్జెట్ వ్యయం రూ. 20.14 లక్షల కోట్లతో పోలిస్తే ఈ బడ్జెట్లో మొత్తం వ్యయం స్వల్పంగా, 6.6 శాతం పెరి గింది. ఇటీవలి కాలంలో ఇదే కనిష్ట పెరుగుదల. మొత్తం బడ్జెటరీ వ్యయం లోని వృద్ధి రేటు ఇంత స్వల్పంగా ఉంటే ఇక ఎంత ఆర్థిక వృద్ధి రేటుని ఆశించగలం? అదేవిధంగా, పెట్టుబడి పద్దు కింద ప్రతిపాదించిన వ్యయం కూడా 2016–17 సవరించిన అంచనాలలోని రూ. 2,79,847 కోట్ల నుంచి 2017–18లో రూ. 3,09,801 కోట్లకు పెంచాలని ప్రతిపాదించారు. అంటే ఆ పద్దు కింద వ్యయంలో వృద్ధి కేవలం 17 శాతమేనని అంచనా. పెట్టుబడి వ్యయానికి గణనీయంగా కేటాయింపులు చేశామని బడ్జెట్ పేర్కొంది. కానీ వాస్తవ అనుభవం భిన్నంగా ఉంటోంది. ఈ 2016–17 ఆర్థిక సంవత్స రంలోని ఏప్రిల్–డిసెంబర్ మధ్య తొమ్మిది నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడి వ్యయం రూ. 1,09,131 కోట్లు. కాగా అంతకు ముందటి ఏడాది ఇదే కాలంలో పెట్టుబడి వ్యయం రూ. 1,15,322 కోట్లు. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెట్టుబడి వ్యయం పడిపోయి, రుణాత్మక వృద్ధిని నమో దుచేసింది. ఇదే కాలంతో పోలిస్తే పడిపోయింది. పైగా ఈ ఏడాది ఏప్రిల్– డిసెంబర్ మధ్య కేంద్ర ప్రభుత్వ రాబడులు, గత ఏడాది అదే కాలంతో పోలిస్తే 16 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2015–16తో పోలిస్తే 2016–17 సవరించిన అంచనాల ప్రకారం రాబడుల పెరుగుదల 19 శాతంగా ఉంది. కాగా, 2016–17 సవరించిన అంచనాలతో పోలిస్తే 2017–18లో రాబడులు 5.5 శాతం పెరుగుతాయని అంచనా వేయడం మరింత ఆశ్చర్యకరం. 2016–17 సవరించిన అంచనా లతో పోలిస్తే రాబడుల వృద్ధి 2017–18లో ఇంత గణనీయంగా పడి పోవడానికి కారణాలేమిటో బడ్జెట్లో వివరించలేదు. బడ్జెట్ ఉపన్యాసం ఆశలతో నిండి ఉందేగానీ, గణాంకాలు మాత్రం పూర్తిగా భిన్నమైన చిత్రాన్ని చూపుతున్నాయి. బడుగు రైతుకు మొండి చెయ్యే రైతుల ఆదాయాలను వచ్చే ఐదేళ్ల కాలంలో రెట్టింపు చేయాలనే ఆకాంక్షను బడ్జెట్ వ్యక్తం చేసింది. కానీ కనీస మద్దతు ధరలను (ఎమ్‌ఎస్‌పీలను) పెంచ కుండా ఇది ఎలా సాధించగలరో స్పష్టతను ఇవ్వలేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఏడాదికి 3 శాతం చొప్పున ఎమ్‌ఎస్‌పీలను పెంచుతోంది. అది ద్రవ్యోల్బణం రేటు కంటే కూడా తక్కువ. ద్రవ్యోల్బణం కంటే తక్కువ కనీస మద్దతు ధరలతో ఐదేళ్లలో రెట్టింపు కావడం కాదు గదా, రైతుల ఆదాయాలు పెరు గుతాయనైనా ప్రభుత్వం ఎలా ఆశిస్తుంది? 2017–18లో వ్యవసాయరంగ రుణగ్రహీతలకు కేటాయించినది రూ. 10 లక్షల కోట్లు, అంటే 10 శాతం పెరుగుదల. అది అతి సాధారణమైన పెంపుదలే. రైతాంగంలో అత్యధికులైన చిన్న, సన్నకారు రైతులకు మొత్తం బ్యాంకు రుణాల మొత్తంలో 7.5 శాతాన్ని కేటాయించాలనే పరిమితిని ఆర్బీఐ పెంచలేదనేది చాలా ముఖ్యమైన అంశం. వాస్తవానికి ఈ పరిమితిని కనీసం 15 శాతానికి పెంచి ఉండాల్సింది. నేడు చిన్న, సన్నకారు రైతులలో కేవలం 40 శాతానికే బ్యాంకు పరపతి అందుబాటులో ఉంటోందనే వాస్తవం మరింత ఆందోళనకరమైనది. వచ్చే 2–3 ఏళ్లలో 75 శాతం రైతాంగానికి బ్యాంకు పరపతిని విస్తరింపజేయడమనే బాధ్యతను ప్రభుత్వం స్వీకరించాలి. లేకపోతే వారు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి వస్తుంది. మా పార్టీ ఇదే విషయాన్ని గత రెండు ఏళ్లుగా డిమాండు చేస్తున్నా, ఈ దిశగా చర్యలు చేపట్టింది లేదు. ఊరట అంతంత మాత్రం ఇక వ్యవసాయం, వ్యవసాయానుబంధ కార్యకలాపాలకు బడ్టెట్ కేటాయింపు లను తీసుకున్నా ఇదే తీరు. 2016–17లో వీటికి రూ. 52,821 కోట్లు కేటాయిస్తే, 2017–18కి రూ. 58,663 కోట్లు మాత్రమే కేటాయించారు. ముద్ర యోజన ద్వారా అసంఘటిత రంగానికి రూ. 2.4 లక్షల కోట్ల నిధులను కేటాయించే లక్ష్యాన్ని నిర్దేశించడం మంచి చర్య. మరి వాస్తవంలో బ్యాంకుల పనితీరు ఈ విషయంలో ఎలా ఉంటుందో వేచిచూడాలి. మౌలిక సదుపాయాల రంగానికి రూ. 3.96 లక్షల కోట్లను కేటాయించ డాన్ని ఆర్థిక మంత్రి తన ఉపవ్యాసంలో మరో గొప్ప విషయంగా పేర్కొ న్నారు. అయితే ఇది 2016–17 సవరించిన అంచనాలలోని రూ. 3.58 కోట్లతో పోలిస్తే ఇది కేవలం 10 శాతమే ఎక్కువ. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కేటాయింపులను రూ. 15,000 కోట్ల నుంచి రూ. 23,000 కోట్లకు పెంచారు. మహాత్మాగాంధీగ్రామీణ ఉపాధి హామీకిగానూ నిధులను రూ. 38,500 కోట్ల నుంచి రూ. 48,000 కోట్లకు పెంచారు. రాజకీయ పార్టీలు విరాళాలను చెక్కులు లేదా డిజిటల్ చెల్లింపుల ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత ఆదాయపు పన్ను విషయానికి వస్తే రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల స్లాబుకు ప్రస్తుతం ఉన్న 10 శాతం పన్నును 5 శాతానికి తగ్గించారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని లెక్కలోకి తీసుకోకుండా లోక్‌సభకు సమ ర్పించిన ఆర్థిక సర్వే 2016–17లో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును 7.1 శాతంగా పేర్కొంది. జీడీపీ వృద్ధి రేటు 2015–16లోని 7.6 శాతంతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరంలో 7.1 శాతానికి పడిపోవడం ఆశ్చ ర్యకరం. ఇదో దుర్వార్త. అయినాగానీ ఆర్థిక సర్వే 2017–18 ఆర్థిక సంవత్స రానికి జీడీపీ వృద్ధి రేటు 6.75 శాతం నుంచి 7.5 శాతం వరకు ఉండవచ్చని అంచనా వేసింది. గణాంకాల గారడీ? ప్రభుత్వం ప్రచురించిన జీడీపీ గణాంకాలలోని వాస్తవాన్ని పలుపురు నిపు ణులు ప్రశ్నిస్తున్నారు. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ, ఉపాధి కల్పన, పరపతి విస్తరణ, స్థూల స్థిర పెట్టుబడి కల్పనలోని వృద్ధి వంటి సూచికలన్నీ రుణాత్మక వృద్ధిని కనబరుస్తుండటమే వారి ప్రశ్నలకు కారణం. ఆర్థిక వృద్ధిపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఏమీ లేదని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో అన్నారు. కానీ జీడీపీ వృద్ధిలోని క్షీణతను, రాబడుల తగ్గుదలను అంగీకరించడం ద్వారా ఆ ప్రభావం ఉన్నదని ప్రభుత్వం చెప్ప కనే చెప్పినట్టు అయింది. వస్తు తయారీ రంగంలోని క్షీణత మరీ తీవ్రంగా ఉండటం మరింత ఆందోళనకరం. కేంద్ర గణాంకాల సంస్థ (సీఎస్ఏ) ప్రతి నెలా అత్యంత ముఖ్యమైన వస్తు తయారీ రంగపు పారిశ్రామిక ఉత్పత్తి సూచీని ప్రచురిస్తుం టుంది. ఆ సూచిక 2014 మే నెలకు183.5 కాగా, 2016 నవంబర్ మాసంలో 181.2గా ఉంది. అంటే గత రెండున్నరేళ్లుగా వస్తు తయారీ రంగంలో వృద్ధ న్నది లే దన్నమాటే!! అంతా నిరుత్సాహకరం ఇక మరో ప్రధాన సూచికౖయెన స్థూల స్థిర పెట్టుబడి కల్పన (జీసీఎఫ్సీ) పరిస్థితీ అంతే. ఆర్థిక వ్యవస్థలోని పెట్టుబడి మదుపుల ధోరణిని స్థిరమైన ధరల (2011–12) రూపేణా లెక్కించే ముఖ్య కొలమానం జీసీఎఫ్సీ. అది 2015–16లో రూ. 35.41 లక్షల కోట్లు కాగా, 2016–17లో 35.35 లక్షల కోట్లు. అంటే – 0.2 శాతం రుణాత్మక వృద్ధిని నమోదు చేసింది. 2016 జూన్ 20న ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జౌళి, తోళ్లు, లోహాలు, ఆటోమొబైళ్లు, రత్నాలు, ఆభరణాలు, రవాణా, సమాచార సాంకేతికత, చేనేత రంగాలన్నీ కలసి కేవలం 1,35,000 ఉద్యోగాలను మాత్రమే 2015లో కల్పించాయి. ఇది గత ఏడేళ్లలోనే అతి తక్కువ! పెద్ద నోట్ల రద్దుకు ముందే గ్రామీణ వేతనాలలో పెరుగుదల దాదాపు సున్నాగా ఉంది. మొత్తంగా చూస్తే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దురదృష్టవశాత్తూ, 2016–17 సవరించిన అంచనాలతో పోలిస్తే 2017–18లో రాబడుల వృద్ధి 5.5 శాతమనే అంచనా అత్యంత నిరుత్సాహకరంగా ఉన్నదని చెప్పాలి. ( వ్యాసకర్త : డీఏ సోమయాజులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సలహాదారు, వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల సలహాదారు) -
విచారణ కొలిక్కి రాకుండానే ముగిసిన గడువు
-
జేవీ రమణమూర్తి కన్నుమూత
నాలుగేళ్లుగా కేన్సర్‌తో అస్వస్థత సాక్షి, హైదరాబాద్/ విజయనగరం: కన్యాశుల్కం గిరీశం పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసిన ప్రముఖ రంగస్థల, సినీనటుడు జేవీ రమణమూర్తి(83) కన్నుమూశారు. గత నాలుగేళ్లుగా క్యాన్సర్ (సామస్సెల్ కాన్షినోమా)తో బాధపడుతున్న ఆయన బుధవారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సమయంలో ఇంట్లో కుమార్తె శ్రీదేవి మాత్రమే ఉన్నారు. తండ్రి పడుతున్న ఇబ్బందిని గమనించి ఆమె అంబులెన్స్‌లో స్థానిక కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకున్న పది నిమిషాల్లోనే (రాత్రి 7.30 గంటలకు) ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆయన కుమారుడు, అల్లుడు అందుబాటులో లేరు. వారు వచ్చే వరకు భౌతిక కాయాన్ని ఆస్పత్రి మార్చురీలోనే భద్రపర్చనున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. నటుడు సోమయాజులుకు రమణమూర్తి స్వయానా సోదరుడు. ఆయన 1933 మే 20న విజయనగరం జిల్లాలో జన్మించారు. గురజాడ రచించిన కన్యాశుల్కం నాటకం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. అదే ఇష్టంతో ఆయన నటరాజ కళాసమితిని స్థాపించి 42 ఏళ్ల పాటు దాదాపు వెయ్యిసార్లకు పైగా కన్యాశుల్కం నాటకాన్ని ప్రదర్శించారు. కె.బి.తిలక్ సహకారంతో 1957లో సినీరంగ ప్రవేశం చేసి దాదాపు 200 సినిమాల్లో నటించారు. ఎమ్మెల్యే, మంచి మనసుకు మంచి రోజులు, మాంగళ్య బలం, బాటసారి, బావా మరదళ్లు, అమాయకులు, దొంగల దోపిడి, కటకటాల రుద్రయ్య, మరో చరిత్ర, సిరిసిరిమువ్వ, గోరింటాకు, గుప్పెడు మనసు, ఇది కథకాదు, శుభోదయం, ఆకలి రాజ్యం, గడసరి అత్త సొగసరి కోడలు, సప్తపది, శుభలేఖ, మాయాజాలం, శంకర్‌దాదా జిందాబాద్.. అందులో కొన్ని. రమణమూర్తి మృతిపట్ల కళాకారులు, కవులు, అభిమానులు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. -
వెన్నెల కురిపించిన ‘మండే సూర్యుడు’
‘అందమైన పొయెం అంటే/ దానికొక గుండె ఉండాలి/ అది కన్నీ ళ్లు కార్చాలి/ కాలపు బరువుల్ని మోయాలి/ బ్రతకడానికి పద్యం ఒక కోట బురుజు కావాలి/ పద్యం మనిషి విజయానికి ఒక జెండా అయి ఎగరాలి.’ కవిత్వమంటే ఇది గుంటూరు శేషేంద్రశర్మ దృష్టి. భార తీయ సాహిత్యంలోనే శేషేంద్ర స్థానం ప్రత్యేకమైనది. కాలతత్వం గ్రహించి, అక్షరాలలో ‘కాలరేఖ’ను చిత్రించిన ద్రష్ట ఆయన. శేషేం ద్ర నినాద కవి కాదు. విధివిధాన కవి. శిథిల జీవుల కోసం శిరస్సు ఎత్తిన కవితా శివుడు. భారతీయ అలంకార శాస్త్రాల మీద అపారమైన అధికా రంతో, తనదైన ముద్రను సృష్టించుకుని, ఆ ముద్రతోనే కవితా జైత్రయాత్రను సాగించిన కవి ఆయన. ‘ఆధునిక మహాభారతం’, ‘జనవంశమ్’,(కవిత్వం) ‘ఈ నగరం జాబిల్లి’ (గజల్‌ను పరిచయం చేసే అద్భుత వ్యాసం), ‘మబ్బుల్లో దర్బారు’ (నాటిక), ‘కవిసేన మేనిఫెస్టో’, ‘షోడశి’ (రామాయణ రహస్యాలు), ‘కాలరేఖ’ (విమర్శ) వంటి అద్భుత రచనలు ఆయన తెలుగువారికి అందిం చారు. శేషేంద్ర లేఖలు మరో రమణీయ సృష్టి. ‘ఉత్తరం విప్పాను.. వెన్నెల జల జల రాలింది’ అంటూ ఆరంభమయ్యే ఈ లేఖా సాహిత్యం తెలుగు సాహి త్యంలోనే అపురూపం. ‘నేనెప్పుడు గొంతెత్తినా నా కోసం కాదు, ఐదు కోట్ల మంది కోసం, యాభై కోట్ల మంది కోసం గొంతెత్తాను. నేను పడుతున్న బాధలే నా దేశం పడుతోంది. కనుకనే నా జ్వాలిక, నా దేశపు నాలుక’ అన్నారాయన. తనకున్న అశాంతిని సముద్రపరంగా చెప్పిన ప్రజ్ఞ ఆయన సొంతం. ‘సముద్రాన్ని అడు గు, నీకెందుకింత అశాంతి ఆవేశం అని! ఝంఝామారుతాన్ని అడు గు నీకెందు కంత ఆవేశం అని!’ అంటూ వ్యథను ఝరీవేగంతో కవి త్వీకరించారు. అనలం కురింపించినా అమృతం కురిపించినా ఆనం దం, సందేశం, రసోదయం కవిత ల ఉద్దేశంగా ఉండేటట్టు జాగ్రత్త పడిన కవివరేణ్యుడు శేషేంద్రుడు. కలాన్ని గ్రీష్మంలో ముంచి రాయ గలిగిన ఈ కవే, ‘లిల్లీలు పెదవులు విప్పాయి, నీ కథలు చెప్పడానికి, ఆకులు గుసగుసలాడుతున్నాయి నా చెవుల్లో, నీ గుండె వ్యథలు చెప్పడానికి’ అన్నారు. కవిగా, విమర్శకునిగా, లాక్షిణికునిగా ఆయన అధిరోహించిన ఎత్తు లు అసాధారణమైనవి. కవిత్వంలో భావం, భాష పూలవనంలో ఒక దానిని ఒకటి తరుముకుంటున్న సీతాకోక చిలుకల మాదిరిగా ఉండాలంటారాయన. ‘నా కన్నుల మీద వాలిన సీతాకోకచిలుకలే కవితలు, కవిత్వం ఒక మెస్మరిజం, కవి కన్ను ఒక ప్రిజం. కవిత్వం అంటే స్వప్నవిద్య’ అన్నారు శేషేంద్ర. ఒక పరి శీలన ప్రకారం శేషేంద్ర సాహిత్యం ప్రాచ్యపాశ్చాత్య సంస్కృతుల కల్హారమాల. ‘హలమూ కలమూ దున్నని ధరిత్రి ధరిత్రి కాదు, మట్టి మట్టి’ అన్న శేషేంద్ర తెలుగు సాహితీ సేద్యంలో విశేష ఫలం. (మే 29న త్యాగరాయ గానసభ, హైదరాబాద్‌లో శేషేంద్ర 8వ వర్ధంతి కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా) వీఎస్‌ఆర్‌ఎస్ సోమయాజులు, 94411 48158 -
సోమయాజులును పరామర్శించిన జగన్
సాక్షి, హైదరాబాద్ : అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు డి.ఏ.సోమయాజులును పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఉదయం 11.30 గంటలకు జగన్ సోమయాజులు నివాసానికి వెళ్లారు. గంట సేపు ఆయనతో గడిపి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సోమయాజులు బాగా కోలుకున్నారు. -
బడ్జెట్లో ఏపీ రాజధాని నిధుల మాటేది?
హైదరాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశజనకంగా ఉందని వైఎఎస్ఆర్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు సోమయాజులు అన్నారు. ఈ బడ్జెట్లో చెప్పుకోదగ్గ అంశాలేమి లేవని ఆయన అన్నారు. ఏపీ రాజధాని నిర్మాణ నిధుల గురించి కూడా బడ్జెట్లో లేదని సోమయాజులు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైల్వే బడ్జెట్ మాదిరి పాలసీ మేకింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. పోలవరానికి కేటాయించిన బడ్జెట్ నిధులు చూస్తుంటే ఇక పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కానట్టేనని చెప్పారు. టీడీపీ, బీజేపీల మధ్య ఒప్పందం మేరకే పోలవరం పక్కన పెట్టి పట్టిసీమ ప్రాజెక్ట్ కడుతున్నారని ఆయన అన్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాల వివరాలు ఇప్పటికీ వెల్లడించలేదన్నారు. కాగా, 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను శనివారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
అధికార లాంఛనాలతో డీవీ అంత్యక్రియలు
విశాఖపట్నం: విశాఖపట్నం మాజీ మేయర్, ఆంధ్రా క్రికెట్ సంఘం అధ్యక్షుడు డి.వి.సుబ్బారావు అంత్యక్రియలు ఆదివారం అధికార లాంఛనాలతో నిర్వహించారు. నగర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగోపాల్‌నాయక్ డీవీ ఇంటి వద్ద గౌరవ వందనం చేశారు. పోలీస్ బ్యాండ్ ఎస్కార్ట్‌తో పూలర థంపై డీవీ పార్థివ దేహాన్ని తరలించారు. విశాఖలోని కాన్వెంట్ జంక్షన్ వద్ద ఉన్న హిందూ శ్మశాన వాటికలో ఆయన తనయుడు సోమయాజులు చితికి నిప్పంటించారు. అంత్యక్రియల సమయంలో పోలీసులు గౌరవ సూచకంగా వందన సమర్పణ చేసి గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. పలువురు ప్రముఖులు డీవీ అంత్యక్రియలకు హాజరయ్యారు. -
శాస్త్రీయ పరిష్కారం చూపండి
* 14వ ఆర్థిక సంఘానికి వైఎస్సార్సీపీ వినతి * నివేదిక సమర్పించిన సోమయాజులు, మిథున్‌రెడ్డి * విభజన బిల్లులో పేర్కొన్న హామీలను కేంద్రం అమలు చేయాలి * పోలవరం, దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్‌లకు జాతీయ హోదా ఇవ్వాలి * రాయలసీమ, ఉత్తరాంధ్రలకు తక్షణమే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి * నిధులను సమీకరించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తాం సాక్షి ప్రతినిధి, తిరుపతి: అశాస్త్రీయ విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న సమస్యలకు శాస్త్రీయమైన పరిష్కారం చూపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు డీఏ.సోమయాజులు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ లోటును పూడ్చడంతోపాటు విభజన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ఇచ్చిన హామీలను నిలుపుకోవడానికి అవసరమైన నిధులను కేటాయించాలని, కేంద్రానికి ప్రతిపాదనలు చేయాలని 14వ ఆర్థిక సంఘాన్ని వారు కోరారు. వైవీ రెడ్డి అధ్యక్షతన 14వ ఆర్థిక సంఘం శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైంది. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరఫున ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు డీఏ సోమయాజులు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సమావేశంలో పాల్గొని ఆర్థిక సంఘం చైర్మన్ వైవీ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆర్థిక సంఘానికి తాము విన్నవించిన అంశాలను డీఏ సోమయాజులు, మిథున్‌రెడ్డి వివరించారు. ఆ అంశాలిలా ఉన్నాయి... * ఆంధ్రప్రదేశ్ రాజధానిగా 56 ఏళ్లపాటు ఉన్న హైదరాబాద్‌లో అభివృద్ధి కేంద్రీకృతమైంది. రక్షణశాఖ పరిశోధన కేంద్రాలు, అత్యున్నత జాతీయ విద్యాసంస్థలు, వైద్యారోగ్య సంస్థలు, ఐటీ పరిశ్రమ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటయ్యాయి. దీనివల్ల వ్యాట్ రూపంలో ఒక్క హైదరాబాద్ నగరం నుంచే 60 శాతం ఆదాయం వచ్చేది. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌ను కోల్పోవడంతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. రాష్ట్ర బడ్జెట్ లోటును పూడ్చేందుకు రూ.15,600 కోట్లను కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయంగా అందించేలా సిఫార్సు చేయాలని ఆర్థిక సంఘాన్ని కోరాం. * గత పదేళ్లలో సమైక్యాంధ్రప్రదేశ్‌లో ఏడాదికి సగటున 33 నుంచి 35 శాతం ప్రణాళిక వ్యయం, 65 శాతం ప్రణాళికేతర వ్యయం ఉండేవి. మొత్తం అంచనా వ్యయంలో పెట్టుబడి వ్యయం 12 శాతంగా ఉండేది. కానీ.. 2014-15 బడ్జెట్లో ప్రణాళిక వ్యయం 23 శాతంగానూ.. ప్రణాళికేతర వ్యయం 77 శాతంగానూ పేర్కొన్నారు. ఇదే రీతిలో పెట్టుబడి 12 శాతం నుంచి ఆరు శాతానికి తగ్గింది. బడ్జెట్లో లోటుపాట్లను సరిదిద్దాలి. * రాష్ట్రంలో రూ.1.02 లక్షల రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అందుకు రూ.వెయ్యి కోట్లే కేటాయించింది. నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్క నిరుద్యోగికి నెలకు రూ.రెండు వేల చొప్పున ఇచ్చే హామీ అమలుచేస్తే ప్రణాళికేతర వ్యయం మరింత పెరుగుతుంది. కానీ.. ఆ హామీలను అమలుచేయకుండా ప్రణాళికేతర వ్యయం ఎలా పెరిగింది? రాజధానికి నిధులు సమకూర్చాలి.. * రాష్ట్ర కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రమే సమకూర్చేలా చూడాలని ఆర్థిక సంఘాన్ని కోరాం. రాజ్‌భవన్, హైకోర్టు, సెక్రటేరియట్, శాసనసభ, శాసనమండలి వంటి భవనాల నిర్మాణానికి నిధులను కేంద్రమే సమకూర్చాలి. కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైతే అటవీశాఖ భూములను డీ-నోటిఫై చేసి ఇవ్వాలి. * కేంద్రానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో రాష్ట్రం వాటాగా 50 శాతం నిధులివ్వాలి. ఆ నిధుల కేటాయింపునకు ఇచ్చే ప్రాధాన్యత లో జనాభా(1971 లెక్కల ప్రకారం)కు 30 శాతం, భౌగోళిక విస్తీర్ణానికి 15 శాతం, సొం త పన్నుల రాబడికి 20 శాతం, ప్రణాళిక వ్యయానికి 25 శాతం, ఆహారభద్రతకు రాష్ట్రం సమకూర్చే ధాన్యానికి ఐదు శాతం, పరిపాలన సంస్కరణకు ఐదు శాతం ఇవ్వాలి. * రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సంఘానికి చేసిన ప్రతిపాదనలను మేము బలపరుస్తున్నాం. కొత్త రాజధాని నిర్మాణానికి, జాతీయ విద్యా, వైద్యారోగ్య సంస్థల ఏర్పాటుకు, పారిశ్రామిక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నిధులను సమీకరించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తాం. * రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలుచేయాలి. కేంద్రం హామీ ఇచ్చినట్లుగా తక్షణమే రాష్ట్రానికి పదేళ్లపాటూ ప్రత్యేక ప్రతిపత్తిని ప్రకటించేలా సిఫార్సు చేయాలి. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే.. విభజన బిల్లులోని 13వ షెడ్యూలులో పేర్కొన్న మేరకు కేంద్రం రాయితీలు ఇవ్వాలి. వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీలివ్వాలి రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆర్థిక సంఘాన్ని కోరారు. విభజన బిల్లులో కేంద్రం ఇచ్చిన హామీని తక్షణమే అమలుచేసేలా సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం, దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని కోరారు. ఆ రెండు ప్రాజెక్టులను కేంద్రమే చేపట్టి.. పూర్తిచేసి దుర్భిక్ష రాయలసీమకు గోదావరి జలాలను అందించి సుభిక్షం చేయాలని విన్నవించారు. ‘‘మీరు రాయలసీమ వాసే. నా నియోజకవర్గమైన రాజంపేటలోనే మీ సొంతూరు ఉంది. ఇక్కడి ప్రజల ఇబ్బందులు మీకు తెలియనివి కావు. గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులకు నీళ్లు అందాలంటే పోలవరం, దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించి.. యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. కేబీకే(కోరాపూట్-బోలంగీర్-కలహండి) ప్రత్యేక ప్యాకేజీ, బుందేల్‌ఖండ్ ప్యాకేజీల తరహాలో ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి’’ అని కోరారు. ఇందుకు వైవీ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించేలా కేంద్రానికి ప్రతిపాదిస్తామని హామీ ఇచ్చారు. -
బడ్జెట్ నిరాశజనకం: సోమయాజులు
-
ఈ బడ్జెట్‌కు విలువే లేదు: సోమయాజులు
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక పనికిరాని డాక్యుమెంట్ అని, దానికి ఏమాత్రం విలువే లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు డి.ఎ. సోమయాజులు వ్యాఖ్యానించారు. గత ఏడాది వాస్తవిక లెక్కల వివరాలుగానీ, వచ్చే కొద్ది నెలల కాలానికి అంచనా వివరాలుగానీ ఈ బడ్జెట్లో ఇవ్వలేకపోయారని చెప్పారు. కనీసం గత నాలుగు నెలల వాస్తవిక రాబడి వివరాలనైనా వెల్లడించలేదని అన్నారు. అతి ముఖ్యమైన రెవెన్యూ రాబడుల్లో పన్నుల రూపేణా వచ్చేది ఎంత, పన్నేతర వనరుల నుంచి వచ్చేది ఎంత అనే విషయాలేమీ బడ్జెట్లో వెల్లడించలేదన్నారు. ప్రణాళిక వ్యయం, పెట్టుబడి వ్యయం కేటాయింపులు సమృద్ధిగా ఉంటే ఆ బడ్జెట్ బాగున్నట్లేనని, కానీ ప్రస్తుత బడ్జెట్లో ఈ రెండు కేటాయింపులూ తక్కువగా ఉన్నాయన్నారు. రాష్ట్రం విడిపోయాక అమ్మకపు పన్ను, ఎక్సైజ్ సుంకం, వాహనాల పన్ను, స్టాంపులు, రిజిస్ట్రేషన్ డ్యూటీ వంటి వాటి ద్వారా వచ్చే ఆదాయమెంతో తెలియజేయలేదన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థుల 2, 3, 4 సంవత్సరాల ఫీజు రీయింబర్స్మెంట్ కేటాయింపులు కూడా ఈసారి బడ్జెట్లో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి రూ. 29 వేల కోట్లు గ్రాంట్ ఇన్ ఎరుుడ్ వస్తుందనడం అసంబద్ధం కేంద్రం నుంచి రూ. 29 వేల కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ వస్తుందని బడ్జెట్లో చెప్పడం అసంబద్ధంగా ఉందన్నారు. ప్రణాళిక వ్యయం ఎంత పెరిగితే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంత పెరుగుతుందన్నారు. అరుుతే, ఈ బడ్జెట్లో ప్రణాళిక వ్యయూన్ని 24 శాతానికే పరిమితం చేశారని, ఇప్పుడు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఎలా పెరుగుతుందో కూడా చెప్పడం కష్టమని తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో కేంద్రం నుంచి రూ. 14,500 కోట్లు రావడానికి అవకాశముందని, ఒకవేళ ఆ నిధులు రాకుంటే తాము వేస్తున్న ఈ అంచనాలన్నీ తారుమారవుతాయని పేర్కొన్నారని వివరించారు. అలా జరిగితే రూ. 6 వేల కోట్ల రెవెన్యూ లోటు రూ. 25 వేల కోట్లకు, రూ. 12 వేల కోట్ల ద్రవ్య లోటు రూ. 35 వేల కోట్లకు పెరుగుతుందని చెప్పారు. అప్పుడు పరిస్థితి భయానకంగా ఉంటుందన్నారు.లోటు పూడ్చడంపైనా ఆర్డినెన్స్ ఇవ్వాల్సింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులోని అంశాలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని మాత్రమే కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా చెప్పారని, అరుుతే తొలి ఏడాది ఆ లోటును కేంద్రం ఎలా భర్తీ చేస్తుందో అందులో పేర్కొనలేదని సోమయాజులు తెలిపారు. ఈ హామీ అప్పటి ప్రధాని మన్మోహన్ ప్రసంగంలో మాత్రమే ఉందని, చట్టంలో చేర్చలేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు మాదిరిగానే కేంద్రం దీనిపైన కూడా ఆర్డినెన్స్ ఇచ్చి ఉంటే చట్టబద్ధత ఉండేదన్నారు. అందువల్ల ఆర్థిక లోటును కేంద్రం పూడుస్తుందో లేదో తెలియకుండా ఉందన్నారు. రాజధాని ఎక్కడో నిర్ధారణ కాకుండానే 5 లక్షల కోట్ల రూపాయలతో రాజధాని నిర్మిస్తామని చెప్పడం కూడా మోసపూరితమేనన్నారు. రాజధాని ఎక్కడో తేల్చకుండా దానిని ఎలా కట్టాలో అధ్యయనం చేయడానికి మంత్రులు విదేశాలకు వెళ్లడం దండగని చెప్పారు. -
శంకరశాస్త్రి పుణ్యమా అని నేను, అన్నయ్య ఎనిమిదేళ్లు మాట్లాడుకోలేదు..!
జె.వి. సోమయాజులుది నిండైన విగ్రహం... ఖంగుమని వినిపించే స్వరం... తమ్ముడు రమణమూర్తితో కలసి ఆయన ప్రాణం పోసిన నాటక పాత్రలనేకం... కానీ, ఒక్క సినిమా, ఒకే ఒక్క పాత్ర ఆయన జీవితాన్నే మార్చేశాయి. ‘శంకరాభరణం’ శంకరశాస్త్రిగా చెరగని ముద్ర వేసిన సోమయాజులు ‘కన్యాశుల్కం’కీ, తమ్ముడికీ కొన్నేళ్ళు ఎందుకు దూరమయ్యారు? ఎన్నో ఏళ్ళు కలసి నటించినా, తమ్ముణ్ణి ఎందుకు మెచ్చుకోలేదు? ఇవాళ సోమయాజులు జన్మదినం సందర్భంగా నిజజీవిత శంకరశాస్త్రి జ్ఞాపకాల కిటికీని 81 ఏళ్ళ తమ్ముడు తెరిచారు. మాది శ్రీకాకుళం జిల్లా లుకులామ్ అగ్రహారం. మా తాత గారు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్య సోమయాజి. మా నాన్న గారు జె.వి. శివరామమూర్తి ఆ రోజుల్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. మా అమ్మా నాన్నలకు మేము అయిదుగురం అబ్బాయిలం, ఒక అమ్మాయి. జె.వి. సోమయాజులు రెండో సంతానమైతే, నేను నాలుగో సంతానం. అన్నయ్య పూర్తి పేరు - జొన్నలగడ్డ వెంకటసుబ్రహ్మణ్య సోమయాజులు. మేమంతా ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళ్ళం. చిన్నప్పటి నుంచి మేమిద్దరం అన్నదమ్ముల లాగా కాకుండా, మంచి స్నేహితుల లాగా ఉండేవాళ్ళం. ఒకరినొకరం ‘ఒరేయ్’ అంటూ, పేర్లతోనే పిలుచుకొనేవాళ్ళం. రంగస్థలంపై తొలి రోజుల్లో... మా అన్నయ్య సోమయాజులు, నేను, నా తరువాతి వాడైన జె.వి. శ్రీరామ్మూర్తి - మేమంతా రంగస్థల పక్షులం. స్కూలు, కాలేజ్ రోజుల నుంచే అందుకు భూమిక ఏర్పడింది. నాటకం పేరు గుర్తు లేదు కానీ, కాలేజీ రోజుల్లో వితంతువైన బోడెమ్మ వేషం వేశాడు అన్నయ్య. అది ఆయన తొలి నటనానుభవం. తర్వాత పెద్ద బ్యాచ్‌ను వదిలేసి, మా పిల్లకుంకల బ్యాచ్‌లో సభ్యుడయ్యాడు. అప్పటి నుంచి నేను, అన్నయ్య కలసి మా ‘కవిరాజు మెమోరియల్ క్లబ్’ పక్షాన ఆత్రేయ ‘ఎన్జీఓ’, కవిరాజు ‘దొంగాటకం’, ప్రఖ్య శ్రీరామ్మూర్తి ‘కాళరాత్రి’ - ఇలా ఎన్నెన్నో పట్టుదలగా, ఉత్సాహంగా ఆడేవాళ్ళం! డెరైక్టర్‌గా నాటకంలో ముఖ్యమైన పాత్ర అన్నయ్యకిచ్చేవాణ్ణి. మిగిలినవాళ్ళకు తగిన పాత్రలు ఇచ్చేసి, అందరూ వదిలేసిన పాత్ర నేను వేసేవాణ్ణి. అదీ పద్ధతి. నాటకంలో పాత్రపోషణ ఎలా ఉండాలనే దాని మీద మా అన్నయ్యకూ, నాకూ వాదనలు జరిగిన సందర్భాలున్నాయి. వాడి దగ్గర సుగుణం ఏమిటంటే, ఒకసారి డెరైక్టర్ చెప్పాక, దాన్ని అర్థం చేసుకొని చెప్పినట్లు చేసేసేవాడు. ఏళ్ళ తరబడి ‘కన్యాశుల్కం’ జైత్రయాత్ర ఊళ్ళో నాటకాలు వేస్తున్న తొలి రోజుల నాటికే సోమయాజులు ప్రభుత్వాఫీసులో క్లర్క్. పొద్దుటి నుంచీ సాయంత్రం దాకా ఆఫీసులో ఉండేవాడు కాబట్టి, రిహార్సల్స్ కష్టంగా ఉండేది. అందుకే, వాడు అన్నం తింటున్నప్పుడు కూడా పక్కనే ఉండి స్క్రిప్టు చదివి వినిపించేవాణ్ణి. అవన్నీ గుర్తుపెట్టుకొనేవాడు. అన్నదమ్ములం నాటకాలు వేస్తుంటే, మా అమ్మ చూసి, ఎంతో ఆనందించేది. గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ చేపట్టినప్పుడు కీలకమైన రామప్ప పంతులు వేషం మా అన్నయ్యకిచ్చి, నేను గిరీశం వేషం కట్టాను. తొలిసారిగా విజయనగరంలో 1953 ఏప్రిల్ 20న ‘కన్యాశుల్కం’ వేశాం. ఆ రోజు మొదలు 1995 సెప్టెంబర్ 22న ఆఖరు ప్రదర్శన దాకా 42 ఏళ్ళ పాటు ‘నటరాజ కళాసమితి’ బృందంగా ‘కన్యాశుల్కం’ కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చాం. దేశమంతటా మాకు అఖండ కీర్తి వచ్చింది. నటుడిగా వాడిలో ఉన్న పెద్ద బలం - ఆత్మవిశ్వాసం. పాత్ర స్వభావం ఆకళింపు చేసుకున్నాక, దాన్ని మరెవ్వరూ చేయలేరన్నంతగా చేసేసేవాడు. ఇద్దరం కలసి నాటకాలు వేస్తున్నప్పుడు పరిషత్ పోటీల్లో చాలాసార్లు ఉత్తమ నటుడి విషయంలో నాకూ, వాడికీ మధ్య పోటీ టై అయ్యేది. ఫ్లాప్‌తో... సినీ రంగ ప్రవేశం 1957లో నేను సినిమాల్లోకి వెళ్ళాను. ఎల్వీ ప్రసాద్ మేనల్లుడు కె.బి. తిలక్ ‘ఎం.ఎల్.ఎ’ చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరయ్యా. తరువాత 22 ఏళ్ళకు దర్శకుడు యోగి ‘రారా కృష్ణయ్యా!’ ద్వారా వైజాగ్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న అన్నయ్యను తెరపైకి తెచ్చాడు. మొదట వేయనని పట్టుబట్టినా, నా చీటీ చూసి, స్క్రిప్టు చదివి, నా సలహా మేరకు అన్నయ్య ఒప్పుకున్నాడు. తీరా, సినిమా ఫ్లాపైంది. ఆ తరువాత సినిమాల్లోనూ, సమాజంలోనూ మా అన్నయ్యను రాత్రికి రాత్రి మార్చేసిన సినిమా - ‘శంకరాభరణం’. ఆ స్క్రిప్టు ప్రకారం ‘శంకరాభరణం’ శంకరశాస్త్రి పాత్రకు తెలిసిన ముఖాలు పనికిరావు, కొత్తవాళ్ళు కావాలి. అలాగని కథను పండించాలంటే కొత్తవాళ్ళయితే కుదరదు, అనుభవం ఉండాలి. ఏం చేయాలని విశ్వనాథ్ ఆలోచిస్తున్నప్పుడు, ఆయనకు మా అన్నయ్య పేరు చెప్పారు యోగి. ‘రారా కృష్ణయ్య’ ఫ్లాపవడంతో, అన్నయ్య ఇష్టపడలేదు. కానీ, ‘ఈ సినిమా చేస్తే అఖండ కీర్తి వస్తుంద’ంటూ స్క్రిప్టు తెలిసిన నేను అన్నయ్యను అతి కష్టం మీద ఒప్పించి, మద్రాసుకు రప్పించాల్సి వచ్చింది. మొదట వద్దు వద్దన్నా చివరకు అంగీకరించాడు. ‘శంకరాభరణం’ (1980 ఫిబ్రవరి 2న) విడుదలై, ఇంటింటా పాటలు మారుమోగేసరికి రాత్రికి రాత్రి స్టారైపోయాడు. మనిషిని మార్చేసిన ‘శంకరాభరణం’ వాడు ఇంట్లో కూడా అచ్చం శంకరశాస్త్రి తరహాలోనే ఉండేవాడు. మొదటి నుంచీ వాడికి మహా రాజసం. అవతలవాళ్ళు పది మాటలు మాట్లాడితే, ఒక మాట ‘ఊ’, ‘ఆ’ అనేవాడు. ఇంట్లో పిల్లలను కఠినమైన క్రమశిక్షణతో పెంచాడు. అవన్నీ ఆ పాత్రకు సరిపోయాయి. అందుకే, ఓ సారి మా వదిన నాతో, ‘రమణా! శంకరశాస్త్రి అంటూ జనం మీ అన్నయ్య వెంట వెర్రెత్తిపోయి, చచ్చిపోతున్నారు గానీ, ఏవిటి చేశాడోయ్ అక్కడ! రోజూ ఇంట్లో మనం చూసే భాగోతమే కదా!’ అని అంది నవ్వుతూ. ఒక్కమాటలో చెప్పాలంటే, పాత్రను మా వాడు పోషించలేదు. నిజజీవితంలోలా ప్రవర్తించాడు. అయితే, ఒకరకంగా చూస్తే - ఆ సినిమా, పాత్ర సోమయాజులుకు ఎంత పేరు తెచ్చాయో, నటుడిగా అంత చెరుపూ చేశాయని తరువాత తరువాత నాకు అనిపించింది. అంతటి అఖండ కీర్తితో సహజంగానే ఎవరికైనా దర్పం వస్తుంది. చుట్టూ భజనపరులు తయారయ్యారు. తరువాత కొద్దికాలానికి మునుపెప్పుడో ఒప్పుకున్న ‘కన్యాశుల్కం’ నాటక ప్రదర్శన చేయాల్సి వచ్చింది. కానీ, ‘ఇంత పేరొచ్చాక, ఇప్పుడు ‘కన్యాశుల్కం’ రామప్ప పంతులు పాత్ర చేయలేను. జనం నన్ను ఆ పాత్రలో అంగీకరించరు’ అన్నాడు సోమయాజులు. దాంతో, నాకు కోపం వచ్చింది. ‘నాటకం కన్నా, పాత్ర కన్నా నటుడు గొప్పవాడేమీ కాదు. ఏ వేషం నీకు గుర్తింపు తెచ్చి, నిన్ను నటుడిగా తీర్చిదిద్దిందో అది వేయనంటున్నావు. నీ లాంటివాడితో కలసి మళ్ళీ రంగస్థలం ఎక్కను’ అని చెప్పేశాను. అలా శంకరశాస్త్రి పాత్ర పుణ్యమా అని దాదాపు తొమ్మిదేళ్ళు నాకూ, వాడికీ మధ్య రాకపోకలు, మాటలు లేవు. కానీ, చివరకు ‘కన్యాశుల్క’మే మళ్ళీ మమ్మల్ని కలిపింది. ఆ నాటకం నూరేళ్ళ పండుగకు విజయనగరం వాళ్ళు మళ్ళీ మా బృందంతో ప్రదర్శన వేయించాలని పట్టుబట్టి, మమ్మల్ని కలిపారు. గురజాడ వారు తొలిసారిగా ప్రదర్శించిన విజయనగరం కోటలోనే ఆ నాటక ప్రదర్శన దిగ్విజయంగా వేశాం. ఆ నూరేళ్ళ ఉత్సవ సందర్భంగా ఆ ఒక్క ఏడాదిలోనే దేశమంతటా మళ్ళీ కొన్ని పదుల ప్రదర్శనలిచ్చాం! గొడవ కాకముందైతేనేం, తరువాత అయితేనేం... మా అన్నయ్య, నేను - ఇద్దరం కలసి తెరపై నటించాం. కలిసి నటించినా, మాట్లాడుకున్నా ఎందుకనో నాకూ, వాడికీ మధ్య మునుపటి సద్భావం పోయింది. ముభావంగానే ఉండేవాడు. కానీ, (గద్గదికంగా...) అప్పటికీ, ఇప్పటికీ వాడంటే నాకు ప్రేమ, గౌరవమే. అరుదైన నిజాయతీ... అపూర్వ గౌరవం... మా అన్నయ్యలోని మరో గొప్పతనం ఏమిటంటే, క్లర్క్‌గా మొదలైనవాడు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా ఎదిగాడు. ఎవరైనా వచ్చి ఏ సాయం అడిగినా, తన అధికార పరిధిలో చేయగలిగినదంతా చేసేవాడు. వాళ్ళ ఇల్లు నిలబెట్టేవాడు. కానీ, ఏనాడూ ఒక్క రూపాయి లంచం తీసుకోలేదు. ‘శంకరాభరణం’ తరువాత వాడి ఉద్యోగం కూడా ఇబ్బందుల్లో పడింది. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా నటించి, పారితోషికం తీసుకున్నాడని గిట్టనివాళ్ళు పిటిషన్లు పెట్టారు. ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ‘శంకరాభరణం’ సినిమా తెప్పించుకొని, చూసి, ‘మన రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఇంత గౌరవం తెచ్చినవాణ్ణి మనం గౌరవించుకోవాలి’ అన్నారు. ఆ వెంటనే మన తెలుగునాట తొలిసారిగా కల్చరల్ ఎఫైర్స్ అనే శాఖను సృష్టించి, దానికి డెరైక్టర్‌గా సోమయాజులును నియమించారు. అలాగే, ‘కళాకారుడైన ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సినిమాల్లో నటించి, పారితోషికం అందుకోవచ్చు. దానికి అనుమతి అవసరం లేదు’ అని కూడా ప్రత్యేక ఉత్తర్వు జారీ చేశారు. గమ్మత్తేమిటంటే, అసలు ‘శంకరాభరణం’కి అన్నయ్యకు దక్కిన పారితోషికం కేవలం రూ. 6 వేలు. అదీ సినిమా విడుదలై, అఖండ విజయం సాధించాక ఓ ఏడాది గడచిన తరువాత! ‘శంకరాభరణం’ తరువాత ‘త్యాగయ్య’, ‘సప్తపది’, ‘వంశవృక్షం’ - ఇలా అనేక సినిమాల్లో అన్నయ్య నటించినా, శంకరశాస్త్రి లాంటి చిరస్మరణీయ పాత్ర మరొకటి కనపడలేదు. ఆ పాత్ర ఒక స్టార్‌ను సృష్టించింది. కానీ, అదే పాత్రతో వచ్చిపడ్డ ఇమేజ్ ఒక మంచి నటుణ్ణి మింగేసింది. - సంభాషణ: రెంటాల జయదేవ -
అనర్హత తప్పదు
-
అనర్హత తప్పదు
హైదరాబాద్: ఒక పార్టీ గుర్తుపై గెలిచిన వ్యక్తి మరో పార్టీలోకి వెళ్తే తప్పక అనర్హులవుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సలహాదారులు సోమయాజులు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నంద్యాల లోక్‌సభ సభ్యుడిగా గెలిచిన ఎస్పివై రెడ్డి ఈ రోజు ఉదయం ఢిల్లీలో తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనపై అనర్హత వేటు పడుతుందన్న భావనను సోమయాలు వ్యక్తం చేశారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రకమైన అనైతిక చర్యకు పాల్పడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. అయితే ఎస్పివై రెడ్డి పార్టీ మార్పిడికి తిరుగుబాటు నిబంధన వర్తించడని టిడిపి నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆయన ఎన్నికయ్యేనాటికి ఆ పార్టీకి గుర్తింపులేదన్నారు. ఎన్నికల్లో కామన్ గుర్తు ఉన్నప్పటికీ అభ్యర్థులను స్వతంత్రులుగానే గుర్తిస్తారని యనమల చెప్పారు. వైఎస్ఆర్ సీపీపై యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలను సోమయాజులు ఖండించారు. ఇదిలా ఉండగా, ఎన్నికలలో పోలైన ఓటింగ్ శాతాన్ని బట్టి వైఎస్ఆర్ సిపి గుర్తింపు పొందే అవకాశం ఉంటుందని యనమలే అన్నారు. -
తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు విచారణ: సుప్రీం
-
తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు విచారణ: సుప్రీం
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ విచారణకు ఇది సమయం కాదని సుప్రీం కోర్టు చెప్పినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల సభ్యుడు సోమయాజులు చెప్పారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ సిపి నేత రఘు రామకృష్ణంరాజు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై సుప్రీం కోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి, తెలంగాణను ఏర్పాటు చేయాలంటూ కేంద్రం నిర్ణయించటం, మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయటం రాజ్యాంగ విరుద్ధమని ఆయన పిల్స్ దాఖలు చేశారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు రావాలని కోర్టు సూచించిందని సోమయాజులు చెప్పారు. బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు విచారిస్తామని కోర్టు చెప్పినట్లు తెలిపారు. ఏ ప్రాతిపదిక లేకుండా రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నదానిపై సుప్రీంకోర్టు తమ వాదన విన్నట్లు చెప్పారు. కేసు డిస్మిస్ చేయలేదని అత్యున్నత న్యాయస్థానం చెప్పినట్లు తెలిపారు. గతంలో కృష్ణయ్య కేసు కొట్టివేయడం కూడా తప్పని కోర్టు పేర్కొందని సోమయాజులు చెప్పారు. కోర్టు చెప్పిన విధంగా సరైన సమయంలో తాము మళ్లీ వెళ్తామని రఘురామకృష్ణంరాజు చెప్పారు. బిల్లు అసెంబ్లీ, పార్లమెంట్‌కు వచ్చినప్పుడు పిటిషన్ వేస్తామన్నారు. రాష్ట్రపతి ముందుకు బిల్లు వెళ్లినప్పుడు సుప్రీం కోర్టు తలుపు తడతామని చెప్పారు. అంతకు ముందు విభజనను వ్యతిరేకిస్తూ సీనియర్ న్యాయవాది ఫాలీ నారిమన్ సుప్రీం కోర్టులో తన వాదనలు వినిపించారు. విభజనపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని సంప్రదించలేదని, విభజనకు సరైన పద్ధతులను పాటించలేదని, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా విభజన చేస్తున్నారని ఆయన తెలిపారు. అసెంబ్లీకి తీర్మానం పంపకుండా విభజనపై కేబినెట్ నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. విభజన ప్రక్రియను ముందుగా అసెంబ్లీ నుంచే ప్రారంభించాలని, కానీ అలా జరగలేదని తెలిపారు. రాష్ట్రపతి సిఫార్సుతోనే ముసాయిదా బిల్లు తయారుకావాలని, ముసాయిదా తయారీకి అసెంబ్లీ తీర్మానం అవసరమైనా, దీనికి భిన్నంగా విభజన ప్రక్రియ జరుగుతోందని నారిమన్ వాదించారు. గతంలో కూడా తాము పిటిషన్లను కొట్టివేయలేదని, విచారణకు ఇది తగిన సమయం కాదని మాత్రమే చెప్పామని న్యాయమూర్తులు అన్నారు. కానీ, అసలు కేబినెట్ నిర్ణయాన్నే తాము తప్పుబడుతున్నామని, కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే యూపీఏ నిర్ణయం తీసుకుందని రోహింగ్టన్ నారిమన్ వాదించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చి రెండున్నరేళ్లయిందని, తన ఆరో సిఫార్సును అమలుచేయాలని చెప్పినా.. దాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదని నారిమన్ అన్నారు. 371 (డి) ఉన్నప్పుడు విభజన ప్రక్రియ చేపట్టడం అసాధ్యమని, ఎన్నికలను దృష్టిపెట్టుకునే కేంద్రం ఇలా చేస్తోందని మరో సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే కోర్టుకు తెలిపారు. -
ఇష్టారాజ్య ‘విభజన’ కూడదు
సాక్షి, హైదరాబాద్: ‘‘కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగంలోని 3వ అధికరణం ద్వారా పార్లమెంటుకు దఖలు పడిందన్నది వాస్తవమే. కానీ ఆ అధికారాన్ని... అందుకోసం ఏర్పరచిన విధి విధానాలకు అనుగుణంగా ఉపయోగించాలే తప్ప వివక్షాపూరితంగానో, ఇష్టారాజ్యంగానో వాడకూడదు. ప్రభుత్వ చర్యలేవైనా చెల్లుబాటు కావాలంటే అవి ఎట్టి పరిస్థితుల్లోనూ నిరంకుశ పోకడలకు లోనై తీసుకున్నవి అయ్యుండకూడదు. ఇదే మనల్ని పాలించే న్యాయ పాలన వ్యవస్థ తాలూకు మౌలిక పునాది. రాజ్యాంగంలోని 14వ అధికరణం సారాంశం కూడా ఇదే’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు స్పష్టం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కేంద్రం ఈ మౌలిక సూత్రాన్నే ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ 3వ అధికరణం ఆధారంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ సోమవారం ఆయన సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయడం తెలిసిందే. ఇప్పటిదాకా 3వ అధికరణం ప్రకారం ఏర్పాటైన రాష్ట్రాలన్నీ మొదటి ఎస్సార్సీ సిఫార్సుల మేరకు గానీ, లేదా సంబంధిత రాష్ట్ర అసెంబ్లీ కోరిక మేరకు జేవీపీ కమిటీ, దార్ కమిటీ, లేదా వాంచూ కమిటీ వంటివి ఇచ్చిన నివేదికల ఆధారంగా గానీ ఏర్పడ్డవేనని సోమయాజులు గుర్తు చేశారు. ‘‘దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ఇలాంటి ప్రాతిపదిక ఏదీ లేదు. పెపైచ్చు, రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించడమే అత్యుత్తమ పరిష్కారమని పేర్కొన్న జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులకు కేంద్రం నిర్ణయం పూర్తి విరుద్ధంగా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగవిరుద్ధం’’ అని పేర్కొన్నారు. సోమయాజులు మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ఎస్సార్సీ వంటివాటి నివేదికో, లేదా సంబంధిత రాష్ట్ర అసెంబ్లీల తీర్మానమో తప్పనిసరని జస్టిస్ సర్కారియా, జస్టిస్ పూంచీ వంటి ఉన్నత స్థాయి జ్యుడీషియల్ కమిటీలే కుండబద్దలు కొట్టాయని ఆయన వివరించారు. కేంద్రమే ఏర్పాటు చేసిన పలు కమిటీలు, కమిషన్లు ఈ దిశగా చేసిన సిఫార్సులు తదితరాలను తన వాదనకు మద్దతుగా ఉటంకించారు. ‘‘ఇప్పటిదాకా ఏర్పాటైన కొత్త రాష్ట్రాలన్నీ సంబంధిత రాష్ట్రాల అసెంబ్లీల తీర్మానం ద్వారా గానీ, అందుకోసం ఏర్పాటైన కమిషన్ల సిఫార్సుల ద్వారా గానీ ఏర్పాటైనవేనని సర్కారియా కమిషన్ 1988లో తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. విభజన కోరుతూ సంబంధిత రాష్ట్రం నుంచి ప్రతిపాదన వస్తే తప్పించి, ఆ రాష్ట్రంలోని ఏవో కొన్ని ప్రాంతీయ సమూహాలు డిమాండ్ చేశాయనే కారణంతో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను కేంద్రం ఆమోదించజాలదని కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటైన జస్టిస్ పూంచీ కమిషన్ కూడా 2010లో సమర్పించిన నివేదికలో కుండబద్దలు కొట్టింది. బీజేపీ నేత ఎల్కే అద్వానీ కూడా, ‘విభజన కోరుతూ సంబంధిత రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేస్తేనే దాన్ని పరిశీలించాలని మేం (ఎన్డీఏ ప్రభుత్వం) నిర్ణయించా’మని 2000 ఆగస్టు 1న కేంద్ర హోం శాఖ మంత్రి హోదాలో ప్రకటించారు’’ అని సోమయాజులు పేర్కొన్నారు. వీటన్నింటికీ మించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు 2009 డిసెంబర్ 9న ప్రకటించిన అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం కూడా, ‘ఈ మేరకు తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరుగుతుంది’ అని స్పష్టంగా పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజల్లో నానాటికీ పెరుగుతున్న ఆకాంక్షలను గుర్తిస్తున్నామని 2004 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ కూడా, ‘దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి డిమాండ్లు తలెత్తుతున్నందున వీటన్నింటికీ అత్యుత్తమ పరిష్కారం రెండో ఎస్సార్సీ ఏర్పాటే’నని స్పష్టంగా పేర్కొందని గుర్తు చేశారు. -
తెలంగాణ పై నిర్ణయం రాజ్యంగ విరుద్ధం-సోమయాజులు
-
'బాబు వల్లే రూ.22వేల కోట్ల రెవెన్యూ లోటు'
హైదరాబాద్: రాష్ట్రాన్ని తానే అభివృద్ధి చేశానంటూ చంద్రబాబు నాయుడు ప్రగల్భాలు పలుకుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సోమయాజులు విమర్శించారు. ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువని చంద్రబాబు భావిస్తున్నట్టున్నారని అన్నారు. తన హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచిన విషయం మరిచారా అంటూ ప్రశ్నించారు. కరెంట్ ఛార్జీలు పెంచినందుకే ఏ ఎన్నికల్లో కూడా గెలవడం లేదనే అంశాన్ని బాబు గుర్తించుకోవాలన్నారు. చంద్రబాబు వల్లే ప్రభుత్వానికి రూ.22వేల కోట్లు రెవెన్యూ లోటు వచ్చిందని గుర్తు చేశారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు సహనం కోల్పోయి, తీవ్రవత్తిడికి లోనవడంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని సోమయాజులు అంతకుముందు అన్నారు. -
దర్యాప్తు పూర్తి అయినందునే బెయిల్:సోమయాజులు
హైదరాబాద్: దర్యాప్తు పూర్తయిందని సీబీఐ చెప్పినందునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి బెయిల్ వచ్చిందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారా కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ ప్రజాదరణ చూసి టీడీపీ వారికి బాధేస్తున్నట్లుందన్నారు. దర్యాప్తు పూర్తికాలేదని చెప్పినంతకాలం జగన్‌కు బెయిల్ రాలేదన్నారు. సుప్రీం కోర్టు గడువు విధించడంతో సీబీఐ దర్యాప్తు ముగించిందని చెప్పారు. తాము కాంగ్రెస్‌తో కలిసిపోయామని బీజేపీ నేత నిర్మలా సీతారామన్ అంటున్నారు. జగన్‌ను కాంగ్రెస్ వేధిస్తోందని ఆ పార్టీ సీనియర్ నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీలే చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు. సుష్మాస్వరాజ్ చెప్పిన విషయాలు నిర్మలాసీతారామన్‌కు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. ఇక లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని సోమయాజులు విమర్శించారు. -
దర్యాప్తు పూర్తి అయినందునే బెయిల్:సోమయాజులు
-
ధర్మం గెలిచింది.. న్యాయం నిలిచింది: సోమయాజులు