దేశాభివృద్ధిలో కంపెనీ సెక్రటరీల కీలకపాత్ర | Vital role of company secretaries in national development | Sakshi
Sakshi News home page

దేశాభివృద్ధిలో కంపెనీ సెక్రటరీల కీలకపాత్ర

Jun 18 2023 4:29 AM | Updated on Jun 18 2023 8:16 PM

Vital role of company secretaries in national development - Sakshi

సాక్షి, విశాఖపట్నం: దేశా­భివృద్ధిలో కంపెనీ సెక్రటరీల పా­త్ర కీలకమని హైకోర్టు న్యా­య­మూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు అన్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు విశాఖలో జరిగిన ప్రాక్టీసింగ్‌ సెక్రటరీస్‌ 24వ జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో జస్టిస్‌ సోమయాజులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ‘న్యాయవ్యవస్థలు, వృత్తి నిపుణుల నుంచి అంచనాలు.. ప్రాక్టికల్‌ టిప్స్‌’ అనే అంశంపై నిర్వహించిన ప్రత్యేక సెషన్‌లో ఆయన మాట్లాడారు. కంపెనీ సెక్రటరీలు.. న్యాయ వ్యవస్థకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.

నియమ నిబంధనల్ని పాటిస్తూ.. దేశ ఆర్థి క వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలబడాలన్నారు. ముగింపు సదస్సులో ఐసీఎస్‌ఐ ఇండియా చైర్మన్‌ మనీష్‌ గుప్తా, ప్రతినిధులు గిరిధరన్, ద్వారకానా«థ్, నరసింహన్‌ తదితరులు పాల్గొన్నారు. జస్టిస్‌ సోమయాజుల్ని ఐసీఎస్‌ఐ ప్రతినిధులు సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement