
'బాబు వల్లే రూ.22వేల కోట్ల రెవెన్యూ లోటు'
హైదరాబాద్: రాష్ట్రాన్ని తానే అభివృద్ధి చేశానంటూ చంద్రబాబు నాయుడు ప్రగల్భాలు పలుకుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సోమయాజులు విమర్శించారు. ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువని చంద్రబాబు భావిస్తున్నట్టున్నారని అన్నారు.
తన హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచిన విషయం మరిచారా అంటూ ప్రశ్నించారు. కరెంట్ ఛార్జీలు పెంచినందుకే ఏ ఎన్నికల్లో కూడా గెలవడం లేదనే అంశాన్ని బాబు గుర్తించుకోవాలన్నారు. చంద్రబాబు వల్లే ప్రభుత్వానికి రూ.22వేల కోట్లు రెవెన్యూ లోటు వచ్చిందని గుర్తు చేశారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు సహనం కోల్పోయి, తీవ్రవత్తిడికి లోనవడంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని సోమయాజులు అంతకుముందు అన్నారు.