revenue deficit
-
గాలి లెక్కలు.. గ్రాఫిక్స్ కబుర్లు!
రాష్ట్రంలో ఒక్క హామీ కూడా నెరవేర్చని కూటమి ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి డైవర్షన్ రాజకీయం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పండిపోయారు. గోబెల్స్‌కు గురువుగా మారి సరికొత్త పాఠాలు చెబుతున్నారు. ఏడాదైనా పూర్తి కాకుండానే బడ్జెట్లో చెప్పినదానికి మించి అప్పులు చేస్తుండటం కళ్లెదుటే కనిపిస్తుంటే.. అదే సంపద సృష్టి అని సరికొత్త భాష్యం చెబుతున్నారు.రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు పెరిగిపోవడం.. అమ్మకం పన్ను, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాబడి పడిపోవడం.. కేంద్ర గ్రాంట్లు తగ్గడం.. అప్పులు పెరగడం ఆర్థిక రంగ నిపుణులను కలవర పెడుతుంటే, బాబు మాత్రం రాష్ట్రంలో వృద్ధి రేటు రయ్.. రయ్.. అని పరుగెడుతోందంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. రాబడి తగ్గినా వృద్ధి రేటు పెరుగుతుందంటున్న ఈ కిటుకు మాటలేవో దావోస్‌లో ఎందుకు చెప్పలేదు చంద్రబాబూ..!సాక్షి, అమరావతి: రాష్ట్ర సంపదను పెంచేస్తున్నట్లు చంద్రబాబు చెప్పే మాటలన్నీ నీటి మూటలేనని కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర సంపద తిరోగమనంలో సాగుతోందని, 2023 డిసెంబర్‌తో పోల్చి చూస్తే 2024 డిసెంబర్ నాటికి రాష్ట్ర రెవెన్యూ రాబడులు తగ్గిపోయాయని వెల్లడించాయి. ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ వరకు బడ్జెట్ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్ మంగళవారం వెల్లడించింది. గత ఏడాది (2023) డిసెంబర్ వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల మేర కూడా ఈ ఏడాది (2024) డిసెంబర్ వరకు రాలేదని స్పష్టం చేసింది. బడ్జెట్లో పేర్కొన్న దాని కన్నా మార్కెట్ నుంచి తీసుకుంటున్న అప్పులు పెరిగిపోయాయని వెల్లడించింది. మరో పక్క బడ్జెట్ అంచనాలను మించి రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు అదుపు తప్పి భారీగా పెరిగిపోయినట్లు తెలిపింది. ఈ వాస్తవాల మధ్య రాష్ట్ర వృద్ధి గణనీయంగా పెరిగిందంటూ సీఎం చంద్రబాబు ఊహాజనిత ప్రజెంటేషన్లతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని, రాష్ట్ర ప్రజలను దగా చేయడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సంక్షోభం లేకపోయినా తగ్గిన రాబడికోవిడ్ లాంటి సంక్షోభాలు లేనందున సాధారణంగా ఏడాది ఏడాదికి రాబడులు పెరుగుతాయి. కానీ చంద్రబాబు పాలనలో పరిస్థితి అందుకు విరుద్దంగా ఉంది. అమ్మకం పన్నుతో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం గత ఆర్థిక ఏడాది (2023) డిసెంబర్‌తో పోల్చితే ఈ ఏడాది (2024) డిసెంబర్ వరకు వచ్చిన ఆదాయం తగ్గిపోయింది. అమ్మకం పన్ను తగ్గిపోవడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమేనని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రజల దగ్గర డబ్బులేక పోవడమే అమ్మకం పన్ను తగ్గిపోవడానికి ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. మొత్తం రెవెన్యూ రాబడుల్లో రూ.6,047 కోట్లు తగ్గిపోయిందని, అమ్మకం పన్ను ఆదాయం రూ.993 కోట్లు తగ్గిందని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా రూ.637 కోట్లు తగ్గిపోయింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లో సైతం భారీగా తగ్గుదల నమోదైంది. ఏకంగా రూ.12,598 కోట్లు తగ్గిపోయినట్లు కాగ్ వెల్లడించింది. అప్పులు మాత్రం బడ్జెట్లో పేర్కొన్న దాని కన్నా ఎక్కువగా పెరిగిపోయినట్లు కాగ్ స్పష్టం చేసింది. మార్కెట్ ద్వారా ఈ ఆర్థిక ఏడాది (2024–25) మొత్తానికి రూ.68,360 కోట్లు అప్పులు చేస్తామని బడ్జెట్లో పేర్కొనగా, ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా మూడు నెలలు ఉండగానే రూ.73,875 కోట్లు అప్పు చేసిందని కాగ్ ఎత్తి చూపింది.రాబడి తగ్గితే వృద్ధి రేటు ఎలా పెరుగుతుంది?రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు భారీగా పెరిగినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. 2023 డిసెంబర్ నాటికి మించి, ఈ ఏడాది బడ్జెట్లో అంచనాలకు మించి.. ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు పెరిగిపోయింది. బడ్జెట్లో ఈ ఆర్థిక ఏడాది మొత్తానికి రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లుగా పేర్కొనగా, ఆర్థిక ఏడాది ముగియడానికి ఇంకా మూడు నెలలు ఉండగానే రెవెన్యూ లోటు ఏకంగా రూ.64,444 కోట్లకు చేరింది. ద్రవ్యలోటు రూ.68,763 కోట్లుగా బడ్జెట్లో పేర్కొనగా, డిసెంబర్ నాటికే రూ.73,635 కోట్లకు చేరింది. ఈ లెక్కన రాష్ట్ర రెవెన్యూ రాబడులు తగ్గిపోతే ఏ విధంగా వృద్ధి రేటు పెరిగిపోతోందో ఒక్క చంద్రబాబుకే తెలుసని అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. సీఎం చంద్రబాబు గ్రాఫిక్స్ కేవలం అప్పులు తేవడానికేనని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
మిగులు నుంచి లోటుకు.. తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్రం 2018–19 వరకు రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉంది. కానీ ఆ తర్వాత క్రమంగా రెవెన్యూ లోటు నమోదయింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.9,335 కోట్ల రెవెన్యూ లోటు, రూ.46,639 కోట్ల ద్రవ్యలోటు ఏర్పడింది. మిగులు నుంచి లోటుకు వెళ్లినా అంతకుముందు ఏడాదితో పోలిస్తే రెవెన్యూ, ద్రవ్యలోటు పరిమాణం కాస్త తగ్గింది. 2020–21లో రెవెన్యూ లోటు రూ.22,298 కోట్లు కాగా, ద్రవ్యలోటు రూ.49,038 కోట్లుగా ఉంది. 2021–22లో నమోదైన రెవెన్యూ లోటు జీఎస్డీపీలో 0.81 శాతం కాగా, ద్రవ్యలోటు 4.06 శాతంగా నమోదయింది. అదే రెవెన్యూ రాబడులతో పోలిస్తే 27 శాతం ద్రవ్యలోటు ఏర్పడింది..’అని కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను అకౌంట్ల నిర్వహణకు సంబంధించిన పరిశీలన అనంతరం కాగ్ రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం.. వర్షాకాల సమావేశాల చివరిరోజు ఆదివారం శాసనసభ, మండలి ముందు ఉంచింది. ఈ నివేదికలో వివిధ ప్రభుత్వ శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులు, వేజ్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్‌లకు వెళ్లి ప్రభుత్వం తెచ్చుకున్న అడ్వాన్సులు, పద్దుల వారీగా చూపెట్టాల్సిన ఖర్చుల్లో తేడాలు, చూపెట్టిన నగదు నిల్వ, ఖర్చుల్లో తేడాలు, రెవెన్యూ రాబడులు, ప్రభుత్వ అప్పుల గణాంకాలను వెల్లడించింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వివిధ ప్రభుత్వ శాఖల ఆర్థిక పారదర్శకతపై ఆడిట్ నిర్వహించి కాగ్ రూపొందించిన నివేదిక అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వం సభ ముందుంచకపోవడం గమనార్హం. 2021–22 అకౌంట్ల నిర్వహణలో కాగ్ గుర్తించిన ముఖ్యాంశాలు ► 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి అడ్వాన్సులు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో కనీస నగదు నిల్వ ఉంచింది 76 రోజులు. స్పెషల్ డ్రాయింగ్ సౌకర్యం (ఎస్డీఎఫ్) వినియోగించుకుంది 30 రోజులు. వేజ్ అండ్ మీన్స్కు వెళ్లింది 159 రోజులు. ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లింది 100 రోజులు. ► అడ్వాన్సులు తీసుకున్న 289 రోజుల్లో (ఎస్డీఎఫ్ 30, వేజ్ అండ్ మీన్స్ 159, ఓడీ 100 రోజులు కలిపి) ఎస్డీఎఫ్ కింద రూ.9,636 కోట్లు, వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సుల రూపంలో రూ.34,969 కోట్లు వినియోగించుకుంది. ఓడీ కింద రూ.22,669 కోట్లు తెచ్చుకుంది. ► 2021–22 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అప్పుల రూపంలో తెచ్చిన రూ.42,936 కోట్లు, ప్రజాపద్దు కింద వినియోగించాల్సిన రూ.3,773 కోట్లను ద్రవ్యలోటు కింద చూపెట్టారు. ► ఆర్థిక జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం) కింద 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఇందులో రెవెన్యూ మిగులుతో ఖజానా నిర్వహించాలనేది మొదటి లక్ష్యం కాగా, రూ.9,335 కోట్లు రెవెన్యూ లోటు ఏర్పడింది. జీఎస్డీపీలో 3 శాతానికి మించకుండా ద్రవ్యలోటు ఉండాలనేది రెండోలక్ష్యం కాగా, అది 4.06 శాతంగా నమోదైంది. నికర అప్పులు జీఎస్డీపీలో 25 శాతం మించవద్దనే మూడో లక్ష్యం కూడా నెరవేరలేదు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి జీఎస్డీపీలో 27.40 శాతం అప్పులు మిగిలాయి. ► రెవెన్యూ రాబడుల కింద వచ్చిన రూ.1,27,468 కోట్లలో దాదాపు 50 శాతం అనివార్య వ్యయం కిందనే ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇందులో రూ.30,375 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు, రూ.19,161 కోట్లు వడ్డీ చెల్లింపులు, రూ.14,025 కోట్లు పింఛన్ల కింద ఖర్చు పెట్టారు. ► ఏప్రిల్ 1, 2021 నాటికి రాష్ట్ర ప్రభుత్వ నికర అప్పులు రూ.2,78,017.64 కోట్లు. ఆ ఏడాదిలో తీసుకున్న అప్పులు రూ.43,593.94 కోట్లు. 2022 మార్చి 31 నాటికి నికర అప్పులు రూ.3,21,611.58 కోట్లు. ► పలు కార్పొరేషన్లు, సంస్థలకు రుణాలు తీసుకునేందుకు గాను రూ.40,449 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం గార్యంటీ ఇచ్చింది. దీంతో 2022 మార్చి 31 నాటికి ప్రభుత్వ నికర గ్యారంటీల మొత్తం రూ.1,35,283 కోట్లకు చేరింది. ► మొత్తం అప్పుల్లో రూ.28,883 కోట్లు మూలధన వ్యయం కింద, రూ.8,469 కోట్లు రుణాలు, అడ్వాన్సుల చెల్లింపులకు వెచ్చించారు. జీఎస్డీపీకి సమాంతరంగా మూలధన వ్యయం లేదు. జీఎస్డీపీలో 2.51 శాతం మాత్రమే మూలధన పద్దు కింద వెచ్చించారు. ► వివిధ మేజర్ పద్దులను ఆడిట్ చేయగా, ఉండాల్సిన నగదు నిల్వ కంటే తక్కువ ఉంది. ► 2021–22 ఆర్థిక సంవత్సరంలో వివిధ ప్రభుత్వ పథకాల అమలుకు గాను కేంద్రం నేరుగా ఇచ్చిన రూ.18,392 కోట్లు ప్రభుత్వ అకౌంట్లలో కనిపించలేదు. తెలంగాణ లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ, తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లకు పలు పథకాల అమలు కోసం ఈ నిధులను కేంద్రం ఇచ్చింది. ► హౌసింగ్, పరిశ్రమల శాఖలకు బడ్జెట్లో కేటాయించిన మొత్తం కంటే చాలా తక్కువ ఖర్చు పెట్టారు. బడ్జెట్ అంచనాల రూపకల్పనలో ఆయా శాఖలకు స్పష్టత లేని కారణంగానే ఇది జరిగింది. ► ఇక ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కంట్రిబ్యూటరీ పింఛన్ పథకం కోసం ప్రతి నెలా వసూలు చేసే మొత్తంలో రూ.2,074.22 కోట్లు మాత్రమే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్)కు జమ చేసింది. మరో రూ.313.72 కోట్లు జమ చేయాల్సి ఉంది. -
తెస్తున్నా ఏడుపేనా?
రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి కీలకమైన రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించి రూ.వేల కోట్ల నిధులను విడుదల చేయటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధి, పట్టుదలే కారణమన్నది నిర్వివాదాంశం. ఆలస్యంగానైనా కేంద్రం నుంచి విడుదలవుతున్న నిధులే ఇందుకు నిదర్శనం! కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగి కూడా చంద్రబాబు సాధించలేని విభజన అంశాలను సీఎం జగన్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా చిక్కు ముడులను తొలగిస్తూ రాబడుతోంది. అవకాశం లభించిన ప్రతి సందర్భంలోనూ ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరిస్తూ సజీవంగా ఉంచుతోంది. సీఎం జగన్ కృషితో రాష్ట్రానికి నిధులు వస్తుంటే ఇప్పుడెందుకు ఇస్తున్నారనే తరహాలో రామోజీ కుళ్లు బుద్ధి చాటుకుంటున్నారు!! – సాక్షి, అమరావతి నాడు ఇచ్చిందే పది వేలు..!! రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014–15లో ఏర్పడిన రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా పూర్తి స్థాయిలో రాబట్టడంలో నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు దారుణంగా విఫలమయ్యారు. కాగ్ అకౌంట్స్ ప్రకారం రెవెన్యూ లోటు రూ.16,000 కోట్లు కాగా ఇక అది ముగిసిన అంశమని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొన్నా చంద్రబాబు నోరెత్తలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టాక పట్టు వదలకుండా ప్రధానితోపాటు నీతి ఆయోగ్‌తో దీనిపై పలు దఫాలు సంప్రదింపులు జరిపారు. ఈ మేరకు గణాంకాలతో కూడిన పత్రాలను అందచేయడంతో విభజన అంశాల సత్వర పరిష్కారానికి కేంద్రం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ క్రమంలో రెవెన్యూ లోటు భర్తీని పునఃపరిశీలించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.10,461 కోట్లను మంజూరు చేసింది. మరి ఈ విషయం రామోజీకి తెలుసా? తెలిసీ నటిస్తున్నారా? బకాయిలపై బాబు గజగజ.. ఓటుకు కోట్లు కేసు భయంతో అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి పరారై కరకట్టకు చేరుకున్న చంద్రబాబు తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, పలు సంస్ధల విభజన గురించి మాట్లాడితే ఒట్టు!! 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు తెలంగాణకు సరఫరా చేసిన విద్యుత్ బకాయిల ఊసెత్తేందుకే గజగజలాడారు! సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టాక పలుదఫాలు ఒత్తిడి తెచ్చి బకాయిలు చెల్లించేలా కేంద్ర ప్రభుత్వంతో ఆదేశాలు జారీ చేయించారు. ఆంధ్రప్రదేశ్‌కు విద్యుత్ సరఫరా బకాయిల కింద రూ.7,230.14 కోట్లను చెల్లించాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించినందున ఇవాళ కాకపోతే రేపైనా చెల్లించక తప్పదు!! జీవనాడికి నిధుల కళ.. పోలవరంపై 2013–14 పాత ధరలను పక్కన పెట్టి తాజా ధరల మేరకు నిధులిచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పట్టుదలగా సీఎం జగన్ చేసిన ప్రయత్నాలతో పోలవరం తొలి దశ పూర్తికి రూ.12,911.15 కోట్లు మంజూరుకు అంగీకారం తెలిపింది. బిల్లుల చెల్లింపులో విభాగాల వారీగా విధించిన పరిమితులను తొలగించేందుకు కూడా సమ్మతించింది. నిధులు మంజూరును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదించారు. పోలవరాన్ని వేగంగా పూర్తి చేసేందుకు అడ్ హాక్‌గా నిధులు మంజూరు చేయాలని ప్రధాని మోదీని సీఎం జగన్ పలు సందర్భాల్లో కోరారు. ఈ నెల మొదటి వారంలోనే ఢిల్లీ పర్యటన సందర్భంగా పోలవరం నిర్మాణ వ్యయం రూ.55,656.87 కోట్లకు ఆమోదం తెలపాలని ప్రధాని మోదీని సీఎం జగన్ కోరారు. మరో 36 గ్రామాల్లో నిర్వాసితులకు సహాయ పునరావాసం ప్యాకేజీ అందిస్తే తొలిదశ పూర్తవుతుందని నివేదించారు. ఈ క్రమంలో పోలవరం తొలిదశ నిర్మాణానికి మొత్తంగా రూ.17,144 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.1,310.15 కోట్ల సొంత నిధులను వెంటనే రీయింబర్స్ చేయాలని అభ్యర్థించారు. పోర్టులు.. కడప స్టీల్ ప్లాంట్ దుగరాజపట్నం పోర్టు సాధనలో గత సర్కారు వైఫల్యాలు రామోజీ కంటికి కనపడలేదు. ఇప్పుడు దానికి బదులు రామాయపట్నం పోర్టు నిర్మాణానికి సీఎం జగన్ ప్రభుత్వం ఒకపక్క కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే మరో పక్క సొంతంగా నిర్మాణానికి చర్యలు చేపట్టింది. రామాయపట్నం తొలి దశ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. తొలి బెర్త్ నిర్మాణం జరుగుతుండటం రామోజీకి కనిపించలేదా? కడప స్టీల్ ప్లాంట్ గురించి విభజన చట్టంలోనే ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే కడప స్టీల్ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టింది. ముడి ఖనిజం కోసం మూడు గనులను ఏపీ ఎండీసీకి కేటాయించాలని ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ ప్రధానిని కోరారు. ఇది కేంద్రంపై ఒత్తిడి తేవడం కాదా? ఇక ఢిల్లీలో ఏపీ భవన్‌తో పాటు విభజన చట్టంలో పేర్కొన్న సంస్థల విభజన, ఆస్తుల పంపిణీపై కేంద్రంతో పాటు తెలంగాణపై కూడా సీఎం జగన్ ప్రభుత్వం ఒత్తిడి తెస్తూనే ఉంది. విశాఖ రైల్వే జోన్.. విశాఖ రైల్వే జోన్‌ను ఇప్పటికే ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. ఈ ప్రకటన వెలువడింది వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలోనే. గిరిజన విశ్వవిద్యాలయంపై ప్రకటన కూడా మన ఎంపీల ఒత్తిడితోనే సాధ్యమైంది. నాడు ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయాన్నే కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ప్రకటించాలని చంద్రబాబు కోరడంతో కేంద్రం అందుకు నిరాకరించింది. సత్వరమే పెండింగ్ హామీలు పరిష్కరించండి ఈ నెల తొలి వారంలో ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో రాష్ట్ర విభజన పెండింగ్ హామీల గురించి సీఎం జగన్ మరోసారి ప్రస్తావించారు. ప్రత్యేక హోదా సహాం పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలను వేగంగా నెరవేర్చాలని కోరారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకా శాలకు ప్రత్యేక హోదా ఎంతో దోహదపడుతుందని, రాష్ట్రం స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతుందని, దీనిపై సత్వరమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
రెవెన్యూ లోటు భర్తీని సాధించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన చట్టంలోని ముఖ్యమైన హామీ అయిన 2014–15 ఆర్థిక ఏడాది రెవెన్యూ లోటు భర్తీని గత చంద్రబాబు ప్రభుత్వం సాధించలేక పోయింది. అప్పటి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ రెవెన్యూ లోటును పూర్తి స్థాయిలో సాధించలేక చేతులెత్తేసింది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి నుంచీ రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ వస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి, నీతి ఆయోగ్ అధికారులను కలిసినప్పుడల్లా రెవెన్యూ లోటు భర్తీ గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. దాని ఫలితమే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రెవెన్యూ లోటు భర్తీ కింద ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయంగా రూ.10,461 కోట్లు మంజూరు చేసింది. దీన్ని ఈనాడు పచ్చ మీడియా జీర్ణించుకోలేక చంద్రబాబు ఎన్నిసార్లు గింజుకున్నా విదల్చని కేంద్రం ఇప్పుడు రెవెన్యూ లోటు భర్తీ కింద డబ్బులు మంజూరు చేయడం తప్పనేలా రోత రాతలు రాసింది. రాష్ట్రానికి ఆర్థికంగా ప్రయోజనం జరగడం కూడా పచ్చ మీడియా జీర్ణించుకోలేకపోవడం శోచనీయం. రాష్ట్ర విభజన జరిగిన 2014–15 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ.16,078 కోట్లుగా కాగ్ తేల్చింది. ఆ మేరకు భర్తీ చేయాల్సిందిగా గత చంద్రబాబు కోరిననప్పటికీ కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా రూ.4,000 కోట్లు మాత్రమే ఇచ్చింది. అయితే ముఖ్యమంత్రి జగన్ సర్కారు చట్ట ప్రకారం రావాల్సిన రెవెన్యూ లోటు భర్తీ గ్రాంటు కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉంది. అందుకు సహేతుక కారణాలను నీతి ఆయోగ్‌తోపాటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులకు వివరించడంతో పాటు స్వయంగా ప్రధాన మంత్రి దృష్టికి కూడా ముఖ్యమంత్రి పలుసార్లు తీసుకెళ్లారు. దాని ఫలితంగానే ప్రస్తుతం నిధులు విడుదలయ్యాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలపై ఆరోపణలు చేస్తున్న పచ్చ మీడియా, టీడీపీ నేతలకు ఇది చెంపపెట్టే. సీఎం ఢిల్లీ పర్యటనలన్నీ రాష్ట్ర ప్రయోజనాలకోసమేనని రెవెన్యూ లోటు భర్తీ సాధనతో స్పష్టమైంది. సీఎం జగన్ విజయమిది.. విభజన నాటి నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పరిష్కరించుకుంటోంది. సంక్షేమాభివృద్ధిలో దూసుకుపోతున్న ఏపీ సర్కారుకు ప్రస్తుత రెవెన్యూ లోటు భర్తీ నిధుల విడుదల భారీ ఊరట కలిగించనుంది. తాజాగా విడుదల చేసిన రూ.10,460.87 కోట్ల నిధులను 2014–15 ఆర్థిక ఏడాది రెవెన్యూ లోటు కింద చూపిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మహేంద్ర చండేలియా ఆదేశాలిచ్చారు. సీఎం గత నెల ఢిల్లీ పర్యటనలో భాగంగా జరిగిన చర్చలు కొలిక్కి వచ్చి నిధుల విడుదలకు ఈ నెల 19వ తేదీన ఆదేశాలు వెలవడగా తాజాగా నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభించాలని ఆర్థిక శాఖను కేంద్రం ఆదేశించింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి కేంద్రం నుంచి ఏకమొత్తంలో విడుదలైన భారీ నిధులు ఇవే కావడం గమనార్హం. చంద్రబాబుతో కానిది సీఎం జగన్ వల్ల సాధ్యమైందని, ఇది ముఖ్యమంత్రి విజయమని అధికార వర్గాలు వ్యాఖ్యానించాయి. -
కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై గంపెడు ఆశలతో ఎదురుచూపు
సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన గాయాలతోపాటు కోవిడ్ మహమ్మారి విసిరిన సంక్షోభంతో రాష్ట్రం ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్లో అయినా ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం కరుణ చూపుతుందని రాష్ట్ర ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకుంది. కోవిడ్‌తో రాష్ట్రం భారీగా ఆదాయం కోల్పోయింది. మరోవైపు ఉమ్మడి ఏపీ విభజన జరిగిన నాటి నుంచి రాష్ట్రం రెవెన్యూ లోటులోనే ఉంటోంది. ఈ నేపథ్యంలోనైనా బుధవారం కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపులో తగు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న జాతీయ సంస్థలకు జాతీయ గ్రాంట్ల రూపంలో ఈసారైనా బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయిస్తుందని ఆశిస్తోంది. రాష్ట్ర విభజన జరిగిన 2014–15 ఆర్థిక ఏడాదిలో ఏర్పడ్డ రెవెన్యూ లోటు భర్తీకి ఈసారి బడ్జెట్లోనైనా పూర్తి స్థాయిలో కేంద్రం నిధులు కేటాయించాలని కోరుతోంది. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు అవుతున్నా విభజన జరిగిన ఆర్థిక ఏడాదిలో ఏర్పడిన రెవెన్యూ లోటును ఇంకా పూర్తి స్థాయిలో భర్తీచేయకపోవడం సరికాదని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రధాని మోదీని కలిసిన సందర్భంగా రెవెన్యూ లోటు భర్తీకి నిధుల మంజూరు చేయాలని కోరారని చెబుతున్నాయి. ఈ క్రమంలో ఈసారి బడ్జెట్లోనైనా ఫలితం ఉంటుందని ఆశిస్తున్నట్లు వెల్లడించాయి. ప్రత్యేక అభివృద్ధి సాయంపై ఆశలు.. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి సాయం కింద బడ్జెట్లో రూ.24,350 కోట్లు నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. అలాగే విశాఖకు మెట్రో రైలు మంజూరు చేయడంతోపాటు తగినన్ని నిధులు ఇవ్వాలని విన్నవించింది. ఇందుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను కూడా సమర్పించింది. ఈ నేపథ్యంలో ఈ బడ్టెట్‌లో మెట్రో రైలు ప్రకటనతో పాటు కేంద్రం నిధులు కేటాయిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. అదేవిధంగా రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేసినందున జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మిగిలిన 12 జిల్లాలకు వైద్య కళాశాలలకు నిధులు కేటాయించాలని కోరుతోంది. అలాగే రాజధాని వికేంద్రీకరణతో ఆ కార్యకలాపాలకు కూడా నిధులను ఆశిస్తోంది. ఇక పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్ నిధులను ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తోంది. అదేవిధంగా ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరుతోంది. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద పదేళ్ల పాటు జీఎస్టీ రీయింబర్స్మెంట్, ఆదాయపన్ను మినహాయింపు, 100 శాతం ఇన్సూరెన్స్ ప్రీమియం రీయింబర్స్మెంట్లను కేంద్ర బడ్జెట్లో ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. -
ద్రవ్యలోటు 12.3 శాతానికి అప్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు మే నెలనాటికి ఆర్థిక సంవత్సరం మొత్తం లక్ష్యంలో 12.3 శాతానికి చేరింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ద్రవ్యలోటు లక్ష్యం రూ.16,61,196 కోట్లు. స్థూల దేశీయోత్పత్తి అంచనాలతో పోల్చితే ఇది 6.4 శాతం. అయితే మే ముగిసే నాటికి ద్రవ్యలోటు విలువ రూ.2,03,921 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలానికి ద్రవ్యలోటు లక్ష్యంలో 8.2 శాతం వద్దే ఉంది. ఏప్రిల్, మే నెలల్లో ప్రభుత్వ వ్యయాల పెరుగుదలతో ద్రవ్యలోటు లక్ష్యంలో 12.3 శాతానికి పెరిగినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) గణాంకాలు వెల్లడించాయి. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► మే నాటికి ప్రభుత్వ ఆదాయాలు రూ.3.81 లక్షల కోట్లు. బడ్జెట్ మొత్తం అంచనాల్లో వసూళ్లు 16.7 శాతానికి చేరాయి. ►ఇక వ్యయాలు ఇదే కాలంలో రూ.5.85 లక్షల కోట్లు. బడ్జెట్ మొత్తం అంచనాల్లో ఇది 14.8 శాతానికి చేరాయి. ► వెరసి ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు. అంటే ద్రవ్యలోటు 2.3 లక్షల కోట్లన్నమాట. ► పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని కేంద్రం ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటుపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. పెట్రో డీజిల్ ధరల తగ్గింపు వల్ల కేంద్రం ఏడాదికి రూ. లక్ష కోట్లు కోల్పోతుందని అంచనా. ► ఆహార, ఎరువులు సబ్సిడీలు, ఆర్బీఐ నుంచి భారీ డివిడెండ్ రాకపోవడం వంటి అంశాలు ద్రవ్యలోటును లక్ష్యానికి పెంచే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. -
లోటు ఉన్నా రుణాల చెల్లింపు
సాక్షి, అమరావతి: రెవెన్యూ లోటు భారీగా ఉన్నప్పటికీ రుణ భారాన్ని తగ్గించుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. మరోపక్క, తెచ్చిన అప్పులతో ఆస్తుల కల్పనకూ ప్రాధాన్యతనిస్తోంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. సాధారణంగా ప్రభుత్వాలు మిగులు రెవెన్యూ ఉన్నప్పుడు రుణాలు చెల్లిస్తాయని, కానీ రాష్ట్ర ప్రభుత్వం భారీ రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ అప్పులు తీరుస్తోందని తెలిపింది. 2020–21లో రూ.35,540 కోట్ల రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రూ.13,735 కోట్ల ప్రభుత్వ రుణాలు చెల్లించినట్లు ఆ నివేదికలో పేర్కొంది. వడ్డీలతో కలిపి మొత్తం రూ.20,018 కోట్లు రుణ చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వం వినియోగించిందని తెలిపింది. ఆస్తుల కల్పనకు ప్రాధాన్యత ఒక పక్క కోవిడ్‌తో ఆదాయం తగ్గిపోతున్నప్పటికీ ఆస్తుల కల్పనకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని కాగ్ వెల్లడించింది. 2020–21లో రూ.57,436 కోట్ల రుణాలు తీసుకోగా, ఇందులో రూ.20,690 కోట్లు ఆస్తుల కల్పనలో భాగంగా మూలధన వ్యయానికి వినియోగించినట్లు పేర్కొంది. ఇందులో రూ.1,715 కోట్లు రుణ చెల్లింపులకు పోగా నికరంగా రూ.18,975 కోట్లు ఆస్తుల కల్పనకు వినియోగించింది. ఇందులో రూ.3,969 కోట్లు జలవనరుల ప్రాజెక్టులకు, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి రూ.591 కోట్లు, రహదారుల నిర్మాణానికి రూ.738 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా పథకాలకు రూ.509 కోట్లు వినియోగించినట్లు పేర్కొంది. ఇతర ఆస్తుల కల్పనకు రూ.13,133 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపింది. గడిచిన ఐదేళ్లతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం సాధారణ, సామాజిక సేవల రంగంలో మూలధన వ్యయం భారీగా పెంచినట్లు కాగ్ స్పష్టం చేసింది. గత ప్రభుత్వం హయాంలో సాధారణ సేవల రంగంలో మూలధన వ్యయం రూ.300 కోట్ల లోపు ఉంటే ఇప్పుడది రూ.6,498 కోట్లకు పెరిగింది. సామాజిక సేవల రంగంలో మూలధన వ్యయం గత ప్రభుత్వ హయాంలో రూ.2,890 కోట్ల లోపు ఉంటే అది ఇప్పుడు రూ.5,206 కోట్లు వ్యయం చేసింది. -
రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడమే మీ లక్ష్యమా..?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రెవెన్యూ లోటు, అప్పులపై ప్రతిపక్ష నేతలు, వారి అనుబంధ మీడియా వాస్తవాలను వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ మండిపడ్డారు. రెవెన్యూ లోటు, అప్పులనేవి ఏ ప్రభుత్వంలోనైనా ఉంటాయని చెప్పారు. టీడీపీ, దాని అనుబంధ మీడియాకు చంద్రబాబు హయాంలో రెవెన్యూ లోటు, అప్పులు కనిపించలేదని, ఇప్పటి ప్రభుత్వంలోనే ఏదో జరిగిపోయినట్లు అవాస్తవాలతో ప్రజల్లో అపోహలు, భయాలు సృష్టించేందుకు కథనాలు రాయడం శోచనీయమని అన్నారు. తప్పుడు ప్రచారంతో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీయడమే వారి కుట్రగా ఉందన్నారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఇవ్వడంలో జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిందంటూ తప్పుడు కథనాలు రాస్తున్నారు. అప్పులు ఆగిపోయి ప్రభుత్వ కార్యక్రమాలు నిలిచిపోవాలనేది వారి ఆశ. రెవెన్యూ లోటు ఈ ఆర్థిక ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో 918.14 శాతానికి చేరిందని రాశారు. చంద్రబాబు హయాంలో 2017–18లో రెవెన్యూ లోటు ఏకంగా 5,484 శాతం పెరిగింది. అప్పులు కూడా చంద్రబాబు హయాంలో పరిమితికి మించి రూ 16,418 కోట్లు చేశారు. ఆ మొత్తాన్ని కేంద్రం ఇప్పుడు కోత విధిస్తామని చెప్పింది. ఈ విషయాలన్నీ ఆ పత్రికకు ఎందుకు కనిపించడంలేదు?’ అని ఆయన నిలదీశారు. అప్పులు చంద్రబాబు ప్రభుత్వంలో 17.33 శాతం పెరగ్గా ఇప్పటి ప్రభుత్వంలో 14.88 శాతమే పెరిగాయని వివరించారు. కేంద్రం అనుమతించిన పరిమితిలోనే ఈ ప్రభుత్వం అప్పులు చేస్తోందన్నారు. ‘కోవిడ్ లేనప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు మించి భారీగా అప్పులు చేశారు. భారీగా బకాయిలు కూడా పెట్టారు. ఇప్పుడు కోవిడ్ సంక్షోభం వల్ల రాబడి పడిపోయి, ప్రపంచమంతా అప్పులు చేస్తున్నారు. కోవిడ్ కారణంగా రాష్ట్ర ఆదాయం కూడా పడిపోయింది. అయినా వైఎస్ జగన్ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిమితికి, నిబంధనలకు లోబడే అప్పులు చేస్తూ ఆ నిధులను సామాజిక, ఆర్థిక ప్రగతికి వెచ్చిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం భారీగా మిగిల్చిన బకాయిలను కూడా చెల్లిస్తోంది. కేంద్రం నుంచి వచ్చే రాబడి, రాష్ట్ర రాబడి తగ్గినా సీఎం జగన్ నగదు బదిలీ ద్వారా రూ. 1.27 లక్షల కోట్లను పేద ప్రజల చేతిలో పెట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టారు. కోవిడ్ సంక్షోభంలో బడ్జెట్ అంచనాలను వేయడం కష్టం. ఏ సంక్షోభం లేని సమయంలో చంద్రబాబు హయాంలో బడ్జెట్ అంచనాలకు మించి రెవెన్యూ లోటుతో పాటు ద్రవ్య లోటు చేరాయి. పరిమితులకు మించి భారీగా అప్పులు చేశారు’ అని ఆయన వివరించారు. గత సార్వత్రిక ఎన్నికలకు ఒకరోజు ముందు చంద్రబాబు ప్రభుత్వం రూ. 5 వేల కోట్లు అప్పు చేసింది. గతంలోఎప్పుడూ ఒక్కరోజు ఇంత అప్పు చేసిన సందర్భాలు లేవు. పసుపు కుంకుమ పేరుతో ప్రజల్ని మభ్య పెట్టడానికి ఈ అప్పు చేశారు. ఆ మూడు రంగాలకు సీఎం అధిక ప్రాధాన్యత ‘ప్రతిపక్షాలు అసత్య ప్రచారం వల్ల ఏపీఎస్డీసీపై గత జూలైలో కేంద్రం లేఖ రాసింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానానికి కేంద్రం సంతృప్తి చెందింది. రాజ్యాంగబద్ధంగా బడ్జెట్ ప్రోసెస్ అయ్యాకే ఏపీఎస్డీసీకి నిధులు వెళ్తాయి. ఎన్హెచ్ఏఐ కూడా ఇదే తరహాలో అప్పులు సమీకరిస్తుంది. ఏపీఎస్డీసీ రాజ్యాంగబద్ధంగానే ఏర్పాటైనట్లు సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ఆ సంస్థ నుంచి రుణాలు తీసుకోవడం, చెల్లించడం జరుగుతోంది. కేంద్రం నుంచి ఆ తర్వాత ఎటువంటి లేఖ రాలేదు. బ్యాంకులను హెచ్చరించలేదు. పైగా, ఏపీఎస్డీసీకి ఏఏ రేటింగ్ కూడా వచ్చింది. అయినా, ఇప్పుడు విపక్ష మీడియా వక్రీకరణలు, అవాస్తవాలతో వార్త రాయడం వెనుక ఉద్దేశమేమిటో అందరికీ తెలుసు’ అని చెప్పారు. ఆస్తుల తనఖా కొత్తదేమీ కాదని తెలిపారు. ప్రభుత్వ గ్యారెంటీతో గతంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఆస్తులు తనఖా పెట్టిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆస్తులనే వేలం వేసి వనరులు సమీకరిస్తోందని చెప్పారు. ఇక్కడ తనఖా మాత్రమే పెడుతున్నామన్నారు. టీడీపీ ప్రభుత్వం రుణాల కోసం సీఆర్డీఏ భూములను హడ్కోకు తనఖా పెట్టిందన్నారు. విద్యుత్ మిగులున్నా చంద్రబాబు ప్రభుత్వం అధిక ధరకు దీర్ఘకాలిక విద్యుత్ ఒప్పందాలు చేసుకుందని, విద్యుత్ రంగానికి భారీగా అప్పులు, బకాయిలు పెట్టిందని ఆయన వివరించారు. మహిళా సాధికారికతకు, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యతతో ఖర్చు చేస్తున్నారని, తద్వారా సామాజిక ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తున్నారని ఆయన తెలిపారు. -
Revenue Deficit: రూ.9,871 కోట్ల నిధులను విడుదల చేసిన కేంద్రం
సాక్షి, అమరావతి: కేంద్ర ఆర్థిక శాఖ రెవిన్యూ లోటు కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.1.438.08 కోట్లు నిధులను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ సహా 17 రాష్ట్రాలకు గురువారం రూ.9,871 కోట్లను విడుదల చేసింది. ఇందులో ఏపీకి సంబంధించి రూ.1,438.08 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. చదవండి: (భర్త, కుమారుడి ఎదుటే మహిళపై అత్యాచారం..) -
ప్రతి సమస్యకు నోట్ల ముద్రణ కరెక్ట్ కాదు
ముంబై: ఆర్థిక వ్యవస్థలో ప్రజలు అందరినీ భాగస్వాములను చేయడం, ఈ సేవలను ప్రజలందరికీ అందుబాటులో ఉంచడం (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) విధాన ప్రాధాన్యతగా కొనసాగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ప్రత్యేకించి మహమ్మారి కరోనా సవాళ్లు తొలగిపోయిన తర్వాత కూడా ఈ పాలసీకి ప్రాధాన్యత ఇవ్వడం కొనసాగుతుందని దాస్ పేర్కొన్నారు. దేశ సుస్థిర అభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు ఇది ఎంతో కీలకమని కూడా ఒక ఇంటర్వూ్యలో గవర్నర్ స్పష్టం చేశారు. డిజిటల్ మీడియంసహా ఫైనాన్షియల్ వ్యవస్థ పటిష్టంగా పనిచేయడం, లొసుగులు లేకుండా చర్యలు తీసుకోవడం, సైబర్ సెక్యూరిటీ, డేటా గోప్యత, తగిన విధానాలు అవగాహన ద్వారా ఫైనాన్షియల్ వ్యవస్థపై విశ్వాసాన్ని పెంపొందించడం వంటి అంశాలు ఎంతో కీలకమని అన్నారు. ఫైనాన్షియల్ రంగంలో కీలక స్థానాల్లో ఉన్న వారి అందరికీ ఆయా విభాగాల్లో పురోగతి సాధించే బాధ్యత ఉంటుందని పేర్కొన్నారు. త్వరలో ఇండెక్స్ గడచిన దశాబ్ద కాలంగా ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌పై ఆర్బీఐ ప్రధానంగా దృష్టి పెట్టిందని గవర్నర్ వివరించారు. బ్యాంకింగ్ సేవలను, ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు దగ్గర చేసి, ఎకానమీలో వారి భాగస్వామ్యాన్ని పెంచడానికి కృషి జరుగుతోందని అన్నారు. కేంద్రం ప్రారంభించిన ప్రధాని జన్ ధన్ యోజన పథకాన్ని గవర్నర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశంలో ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ఏ స్థాయిలో విస్తరిస్తోందన్న విషయాన్ని తెలుసుకోడా నికి నిర్మాణాత్మకంగా, కాలాలవారీగా ఫైనాన్షి యల్ ఇన్‌క్లూజన్ ఇండెక్స్ (ఎఫ్ఐఐ)ను తీసుకురావాలన్న నిర్ణయం ఇప్పటికే తీసుకున్నట్లు తెలిపారు. త్వరలో ఆర్బీఐ ఈ సూచీని వెలువరిస్తుందన్నారు. మూడు అంశాలపై ఈ ఇండెక్స్ ప్రధానంగా దృష్టి పెడుతుం దని తెలిపారు. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ విస్తరణ, వినియోగం, ఇందుకు సంబంధించి నాణ్యతా ప్రమాణాలు ఇందులో ఉంటాయని శక్తికాంద్ దాస్ వివరించారు. ప్రభుత్వ సేవలకు భరోసా మహమ్మారి కష్టాల సమయంలో ప్రజలకు సకాలంలో సేవలు అందించడానికి ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ఎంతో దోహపడిందన్నారు. ప్రత్యేకించి ప్రత్యక్ష ప్రయోజన బదలాయింపు పథకాల ద్వారా నగదు చెల్లింపులను సకాలంలో జరగడానికి ఫైనాన్షియల్ ఇన్క్లూజన్లో పురోగతే కారణమన్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 54 మంత్రిత్వశాఖల పరిధిలో అమలవుతున్న దాదాపు 319 ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు రూ.5.53 లక్షల కోట్ల చెల్లింపులు డిజిటల్‌గా జరిగాయన్నారు. ప్రభుత్వ రుణ నిర్వహణలో కీలకమైన ఆర్బీఐ, ద్రవ్య విధానాలు వేగవంతమైన బదలాయింపులకు దోహదపడిందని, తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థ కొనసాగడానికి చర్యలు తీసుకుందని వివరించారు. ఇంటర్వ్యూలో మరిన్ని ముఖ్యాంశాలు.. ప్రభుత్వ ఆదాయ-వ్యయాల మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు భర్తీకి ఆర్బీఐ నగదు ముద్రణ సరికాదు. ఇది ప్రతికూల ఫలితాలకు దారితీస్తుంది. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ఈ తరహా పద్దతిని పూర్తిగా తొలగిండచం జరిగింది. ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్, 2003 కూడా దీనిని తిరస్కరించింది. రెండు నెలలుగా 6 శాతంపైగా కొనసాగుతున్న వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) అదుపులోనికి (ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో నిర్ణయానికి ప్రాతిపదికన అయిన సీపీఐ పెరుగుదల కేంద్రం నిర్దేశాల ప్రకారం 2–6 శాతం శ్రేణిలో ఉండాలి) వస్తుంది. సరఫరాల వైపు సవాళ్లు అప్పటికి పూర్తిగా తొలగిపోతాయని విశ్వసిస్తున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను 10.5 శాతం నుంచి తగ్గించాల్సిన అవసరం ప్రస్తుతం లేదు. కోవిడ్ ప్రేరిత సవాళ్ల ప్రభావాన్ని తగ్గించడానికి ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటోంది. వ్యవస్థ లో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) తగిన స్థాయిలో ఉండేట్లు చర్యలు తీసుకోవడం, బ్యాంకుల వద్ద కొనసాగించాల్సిన నగదు నిల్వల నిష్పత్తి మినహాయింపులు, ప్రాధాన్యతా రంగాలకు సకాలంలో తగిన ద్రవ్య లభ్యత ఉండేట్లు చూడ్డం వంటివి ఇందులో ఉన్నాయి. చెల్లింపులు అన్న పదం ఎకానమీలో కీలకం. ఈ వ్యవస్థ మరింత పటిష్ట పడ్డానికి పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్‌ను ఏర్పాటుచేస్తున్నాం. ఇది మూడవ అంచె నుంచి ఆరవ అంచె వరకూ అన్ని కేంద్రాల్లో, అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో చెల్లింపుల వ్యవస్థను పటిష్టం చేస్తుంది. ఆర్బీఐ, బ్యాంకులు, కార్డ్ నెట్‌వర్క్‌లు సంయుక్తంగా ఈ నిధిని నిర్వహిస్తాయి. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ అన్ని స్థాయిల్లో ఎంతో అవసరం. ఈ భరోసా ను కల్పించడంవల్ల డిజిటల్సహా ఆర్థిక సేవలు మరింత విస్తృతమవుతాయి. ఆర్థిక అక్షరాస్యత పెంపొందించడం అవసరం. ఈ లక్ష్యంతో పనిచేస్తున్న కేంద్రాలు (సీఎఫ్ఎల్) 2024 నాటికి మారుమూల స్థాయిలో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందిస్తాయి. 15 రాష్ట్రాల్లో విద్యా బోర్డులు కూడా ఈ అంశాన్ని విద్యా వ్యవస్థలో భాగస్వామ్యం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. వ్యక్తులు అందరికీ బ్యాంకింగ్ అకౌంట్లు అవసరం. రుణాలు, పెట్టుబడులు, బీమా, పెన్షన్ వంటి అన్ని ఫైనాన్షియల్ ప్రొడక్టులూ బ్యాంకింగ్ అకౌంట్ల ద్వారా జరిగేలా పురోగతి జరగాలి. -
ఏపీకి రెవెన్యూ లోటు గ్రాంట్లు రూ.30,497 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్న ఐదేళ్లలో కేంద్ర పన్నుల్లో వాటా, రెవెన్యూ లోటు గ్రాంట్లు, ఇతర గ్రాంట్లు కలిపి రూ.2.34 లక్షల కోట్ల మేర నిధులు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఇందులో ఐదేళ్లకు పన్నుల వాటాగా రూ.1.70 లక్షల కోట్లు, రెవెన్యూ లోటు గ్రాంటు రూ.30,497 కోట్లు ఉంది. 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన పన్నుల వాటాతో పోల్చితే ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన పన్నుల వాటా తగ్గగా.. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆదాయాన్ని కోల్పోనుంది. 2021–26 మధ్య ఐదేళ్ల కాలానికి కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన పన్నుల వాటా, గ్రాంట్లను నిర్దేశిస్తూ 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసు నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం అనంతరం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. రాజ్యసభ మాజీ సభ్యుడు ఎన్.కె.సింగ్ నేతృత్వంలో 2017 నవంబర్‌లో ఏర్పాటైన ఈ కమిషన్ తొలుత 2020–21 ఆర్థిక సంవత్సరానికి పన్నుల వాటా సిఫారసులతో మధ్యంతర నివేదిక ఇవ్వగా.. ఐదేళ్ల కాలానికి అంటే 2021–2026 వరకు పన్నుల వాటా సిఫారసులతో కూడిన పూర్తి స్థాయి నివేదికను 2020 నవంబర్ 9న రాష్ట్రపతికి సమర్పించింది. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 14వ ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల్లో 42 శాతం వాటాను రాష్ట్రాలకు పంచాలని సిఫారసు చేయగా.. 15వ ఆర్థిక సంఘం 2020–21 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర నివేదిక ఇస్తూ 41 శాతం వాటాను సిఫారసు చేసింది. తాజాగా రానున్న ఐదేళ్లకు కూడా 41 శాతం వాటాను సిఫారసు చేసింది. దీని ప్రకారం కేంద్రం రూ.42.2 లక్షల కోట్లను రాష్ట్రాలకు పంచనుంది. ఇక మొత్తం 17 రాష్ట్రాలకు రూ.2,94,514 కోట్లను రెవెన్యూ లోటు గ్రాంటుగా సిఫారసు చేసింది. పది లక్షల జనాభా పైబడిన నగరాలకు గ్రాంట్లు పది లక్షల జనాభా పైబడిన నగరాల్లో పట్టణీకరణ సమస్యలు ఎదుర్కోవడానికి, మౌలిక వసతుల కల్పనకు 15వ ఆర్థిక సంఘం ప్రత్యేక గ్రాంట్లు సిఫారసు చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,116 కోట్లు సిఫారసు చేసింది. ఇందులో విజయవాడకు రూ.514 కోట్లు, విశాఖపట్నానికి రూ.602 కోట్లు సిఫారసు చేసింది. ఘన పదార్థాల వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ, వాయు నాణ్యత తదితర అంశాలకు వీటిని వినియోగించాల్సి ఉంటుంది. మరింత తగ్గిన వాటా.. రూ.11 వేల కోట్ల నష్టం ► 14వ ఆర్థిక సంఘం 2015–20 మధ్య కాలానికి ఏపీ పన్నుల వాటాను 4.305 శాతంగా నిర్ధారించగా.. 2020–21 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ద్వారా దానిని 4.11 శాతానికి కుదించింది. ► తాజాగా 2021–2026 వరకు ఐదేళ్ల పాటు ఏపీకి పన్నుల వాటాను 4.047 శాతానికి కుదించింది. ఈ కారణంగా పన్నుల వాటా ఆదాయం కొంత తగ్గనుంది. జనాభాకు 15 శాతం, ప్రాంత (రాష్ట్ర) విస్తీర్ణం 15 శాతం, అటవీ ప్రాంతం, పర్యావరణానికి 10 శాతం, ఆదాయ వ్యత్యాసం 45 శాతం, పన్ను, ఆదాయ సముపార్జన ప్రయత్నాలు 2.5 శాతం, జనాభా నియంత్రణ పనితీరు (డెమొగ్రాఫిక్ పర్ఫార్మెన్స్)కు 12.5 శాతం ప్రాధాన్యం ఇచ్చి 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు వాటా పంచింది. ► 2011 జనాభాను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలన్న టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌పై దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత ఎదురైనా.. కేంద్రంగానీ, 15వ ఆర్థిక సంఘం గానీ పట్టించుకోలేదు. దీని వల్ల దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గి.. ఉత్తరాది రాష్ట్రాల వాటా పెరిగింది. ► 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల వాటా స్వల్పంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ తదితర దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గింది. దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం తమిళనాడు వాటా మాత్రమే స్వల్పంగా పెరిగింది. ఈ లెక్కన 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన పన్నుల వాటాతో పోల్చితే సుమారు రూ. 11 వేల కోట్ల మేర ఏపీ నష్టపోనుంది. ఏపీకి బదిలీ అయ్యే మొత్తం ఇలా.. ► ఆంధ్రప్రదేశ్‌కు రానున్న ఐదేళ్లలో కేంద్రం నుంచి మొత్తంగా రూ.2,34,013 కోట్లు బదిలీ కావాలని ఆర్థిక సంఘం నిర్ధేశించింది. ఇందులో రూ.1,70,976 పన్నుల వాటాగా అంచనా వేసింది. రూ.63,037 కోట్ల మేర గ్రాంట్ల రూపంలో ఇవ్వాలని నిర్దేశించింది. ► ఈ గ్రాంట్లలో సింహభాగం రెవెన్యూ లోటు గ్రాంటు ద్వారా రానుంది. ఇవి కాకుండా స్థానిక సంస్థలు, డిజాస్టర్ మేనేజ్మెంట్, వ్యవసాయ రంగానికి గ్రాంట్లతో పాటు రాష్ట్ర ప్రతిపాదనల మేరకు స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్లు కూడా సిఫారసు చేసింది. ► 15వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు గ్రాంటు సిఫారసు చేసింది. రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా నుంచి పంపిణీ అయ్యాక 2021–22లో రూ.17,257 కోట్లు, 2022–23లో రూ.10,549 కోట్లు, 2023–24లో రూ.2,691 కోట్లు రెవెన్యూ లోటు ఏర్పడుతుందని అంచనా వేసి, ఆమేరకు రెవెన్యూ లోటు గ్రాంట్లు సిఫారసు చేసింది. ► అయితే 2024–25లో రూ.8,458 కోట్ల మేర, 2025–26లో రూ.23,368 కోట్లు రెవెన్యూ మిగులు ఏర్పడుతుందని అంచనా వేస్తూ ఆయా ఆర్థిక సంవత్సరాలకు రెవెన్యూ లోటు గ్రాంట్లు సిఫారసు చేయలేదు. మరింత తగ్గిన వాటా.. రూ.11 వేల కోట్ల నష్టం ► 14వ ఆర్థిక సంఘం 2015–20 మధ్య కాలానికి ఏపీ పన్నుల వాటాను 4.305 శాతంగా నిర్ధారించగా.. 2020–21 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ద్వారా దానిని 4.11 శాతానికి కుదించింది. ► తాజాగా 2021–2026 వరకు ఐదేళ్ల పాటు ఏపీకి పన్నుల వాటాను 4.047 శాతానికి కుదించింది. ఈ కారణంగా పన్నుల వాటా ఆదాయం కొంత తగ్గనుంది. జనాభాకు 15 శాతం, ప్రాంత (రాష్ట్ర) విస్తీర్ణం 15 శాతం, అటవీ ప్రాంతం, పర్యావరణానికి 10 శాతం, ఆదాయ వ్యత్యాసం 45 శాతం, పన్ను, ఆదాయ సముపార్జన ప్రయత్నాలు 2.5 శాతం, జనాభా నియంత్రణ పనితీరు (డెమొగ్రాఫిక్ పర్ఫార్మెన్స్)కు 12.5 శాతం ప్రాధాన్యం ఇచ్చి 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు వాటా పంచింది. ► 2011 జనాభాను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలన్న టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌పై దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత ఎదురైనా.. కేంద్రంగానీ, 15వ ఆర్థిక సంఘం గానీ పట్టించుకోలేదు. దీని వల్ల దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గి.. ఉత్తరాది రాష్ట్రాల వాటా పెరిగింది. ► 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల వాటా స్వల్పంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ తదితర దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గింది. దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం తమిళనాడు వాటా మాత్రమే స్వల్పంగా పెరిగింది. ఈ లెక్కన 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన పన్నుల వాటాతో పోల్చితే సుమారు రూ. 11 వేల కోట్ల మేర ఏపీ నష్టపోనుంది. విశాఖ అభివృద్ధికి రూ.1,400 కోట్లు విశాఖను ఆర్థిక హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో 15వ ఆర్థిక సంఘం ఏకీభవించింది. విశాఖలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, అత్యంత అవసరమైన భవనాల నిర్మాణానికి రూ.1,400 కోట్లను మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. ఈ నిధులతో విశాఖలో రహదారులు, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు ప్రబలుతున్నాయని, రక్షిత తాగునీటి సరఫరా ద్వారా దీనికిఅడ్డుకట్ట వేయడానికి నిధుల మంజూరు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను 15వ ఆర్థిక సంఘం బలపరిచింది. రూ.300 కోట్లను మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. పల్నాడు, కనిగిరి ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రక్షిత తాగునీటి సరఫరా ద్వారా ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ కోరికను 15వ ఆర్థిక సంఘం ఆమోదిస్తూ ఇందుకు రూ.400 కోట్లను మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. యురేనియంను శుద్ధి చేయడం వల్ల పులివెందుల నియోజకవర్గంలో భూగర్భ జలాలు కలుషితమయ్యాయని, ఆ గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో.. ఇందుకోసం రూ.200 కోట్లు మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు ప్రత్యేకంగా రూ.2,300 కోట్ల మంజూరుకు 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ద్రవ్య క్రమశిక్షణ మెరుగు పడాలి ► 2015–16లో ద్రవ్యలోటు–జీఎస్డీపీ రేషియో 3.7 శాతం ఉండగా.. 2016–17లో 4.5 శాతం, 2017–18లో 4.1 శాతం ఉందని, డెట్–జీఎస్డీపీ రేషియో 2015–16లో 28.1 శాతం, 2018–19లో 29.8 శాతం ఉందని ప్రస్తావించింది. అందువల్ల వీటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం లోటును, అప్పులను తగ్గించి మనగలిగే స్థాయికి తీసుకురావాలని 15వ ఆర్థిక సంఘం సూచించింది. ► రాష్ట్రం కేంద్ర బదిలీలపై ఎక్కువగా ఆధార పడుతోందని, 2016–17లో ఏపీ మొత్తం రెవెన్యూ రిసీట్స్(టీఆర్ఆర్)లో 50 శాతం కంటే ఇది ఎక్కువగా ఉందని ప్రస్తావించింది. సొంత ఆదాయ వనరులను పెంచుకోవాలని సూచించింది. ► రాష్ట్ర స్థూల విలువ జోడింపు(జీఎస్వీఏ)లో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా ఎక్కువగా ఉందని(2015–16లో 31 శాతం, 2018–19లో 35 శాతం), అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ స్వరూపానికి ఇది భిన్నమని, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వంటి వాటిపై దృష్టి పెట్టాలని సూచించింది. 2016–17 ప్రకారం జాతీయ నిర్మాణంలో కీలకమైన రంగాలపై ఏపీ తలసరి వ్యయం తక్కువగా ఉందని, దీనిని పెంచాలని సూచించింది. ► అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్ నష్టాలు 2017–18లో నిర్దేశిత లక్ష్యం 9 శాతం ఉండగా.. వాస్తవానికి అవి 14.26 శాతంగా ఉన్నాయని, 2018–19లో 25.7 శాతానికి పెరిగాయని ప్రస్తావించింది. లీకేజ్ లేకుండా మరిన్ని సంస్కరణలు తేవాలని సూచించింది. ► ఆర్బీఐ అధ్యయనం ప్రకారం ఏపీ, తెలంగాణలో 2014లో రుణ మాఫీ.. రాష్ట్రాల ఆర్థిక క్రమ శిక్షణపై ప్రభావం చూపిందని ఆర్థిక సంఘం ప్రస్తావించింది. కేంద్ర పన్నుల వాటా నుంచి తగ్గిన నిధులు సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజనతో పాటు కోవిడ్–19 నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిన నేపథ్యంలో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కూడా ఈ ఆర్థిక ఏడాది కోత పడటం రాష్ట్రానికి కొంత మేర ఆర్థికంగా నష్టం కలగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020–21).. కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రూ.32,297 కోట్లు (4.111 శాతం) కేటాయింపులు చేశారు. అయితే సవరించిన బడ్జెట్ ప్రకారం రాష్ట్రానికి వచ్చే నిధులు కేవలం రూ.22,610 కోట్లేనని తేల్చారు. ఈ లెక్కన రూ.9,687 కోట్ల మేర కోత పడింది. వచ్చే ఆర్థిక ఏడాది (2021–22) బడ్జెట్లో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను 4.047 శాతానికి తగ్గించేయడం విచిత్రంగా ఉంది. వచ్చే ఆర్థిక ఏడాది కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రూ.26,935 కోట్లు వస్తాయని స్పష్టం చేశారు. ► ప్రత్యేక హోదాతో పాటు వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించాలని ప్రభుత్వం కోరుతూ వస్తున్నా, పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్ర విభజన చట్టం మేరకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని ఏడు జిల్లాలకు బడ్జెట్లో నిధులు కేటాయించాల్సి ఉండగా, వాటి గురించి ప్రస్తావించలేదు. ► రాష్ట్ర విభజన సంవత్సరంలో ఏర్పడిన రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్రం ప్రకటించినప్పటికీ కాగ్ పేర్కొన్న మేరకు రెవెన్యూ లోటు భర్తీకి కేటాయింపులు చేయలేదు. ► 2019–20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రూ.29,420 కోట్లు వచ్చాయి. వచ్చే సంవత్సరం అంతకంటే పెరుగుతాయని సాధారణంగా అందరూ భావిస్తారు. అయితే 2021–22కి ప్రవేశ పెట్టిన బడ్జెట్లో రూ.26,935 కోట్లేనని స్పష్టం చేశారు. దీంతో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తగ్గిపోతున్నట్లు స్పష్టం అవుతోందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కరువు ప్రాంతాలకు రూ.100 కోట్లు వాతావరణ మార్పులను పరిగణనలోకి తీసుకుని ఏపీ వంటి రాష్ట్రాలు కేంద్రంతో కలిసి దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలని సూచించింది. ఈ దిశగా కరువు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు నిధులు సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ.100 కోట్లు కేటాయించింది. పెరుగుతున్న వడ్డీల భారం ఏపీపై వడ్డీ భారం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2011–12 నుంచి 2013–14 వరకు రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ)లో 1.4 %గా మాత్రమే ఉన్న వడ్డీ భారం.. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి 2014–15లో 1.5%గా, 2015–16లో 1.6%, 2016–17, 2017–18లో 1.7%, 2018–19లో 1.8%, 2019–20 (ఆర్ఈ)లో 1.7 %, 2020–21లో(బీఈ)లో 1.8%గా ఉంది. -
రెవెన్యూ లోటును కేంద్రమే పూడ్చాలి
సాక్షి, విశాఖపట్నం: లాక్ డౌన్ వల్ల రాష్ట్రంలో ఏర్పడుతున్న రెవెన్యూ లోటును కేంద్ర ప్రభుత్వమే పూడ్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి దేశ ప్రధాని మోదీకి విన్నవించారు. కోవిడ్–19 నివారణ చర్యల్లో భాగంగా దేశంలోని వివిధ రాజకీయ పార్టీల సలహాలు, సూచనలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం స్వీకరించారు. వైఎస్సార్సీ పీపీ తరఫున విజయసాయిరెడ్డి విశాఖ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనగా.. పార్టీ ఎంపీలు ఎంవీవీ సత్య నారాయణ, బి.సత్యవతి కూడా హాజరయ్యారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున వివిధ అంశాలను విజయసాయిరెడ్డి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ► కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినందుకు.. రాష్ట్రానికి సహాయం అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజల తరఫున ప్రధానికి కృతజ్ఞతలు. ► కరోనా హాట్స్పాట్లు, రెడ్‌జోన్లతో పాటు కోవిడ్ కేసులు కేంద్రీకృతమైన ప్రాంతాల్లో లాక్డౌన్ కొనసాగించాలి. ► సినిమా హాళ్లు, విహార ప్రదేశాలు, జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ లాక్ డౌన్ ఉండాలి. ► ప్రజల అవసరాల దృష్ట్యా మిగతా ప్రాంతాల్లో సమగ్ర పరిశీలన తర్వాత దశల వారీగా లాక్డౌన్ ఆంక్షలను ఉపసంహరించాలి. ► విదేశాల్లో చిక్కుకున్న వారికి ఆ దేశాల్లోనే వైద్య పరీక్షలు జరిపించి కరోనా సోకలేదనే నివేదిక వచ్చిన వారిని స్వదేశానికి రప్పించాలి. ► కరోనా నివారణ మందుల్ని కనిపెట్టే వరకు రోగ నిరోధక శక్తి పెంచే యోగా, ధ్యానం వంటి సంప్రదాయ విధానాలను ఆచరించేలా ప్రజలకు అవగాహన కల్పించాలి. ► డ్వాక్రా మహిళలకు మాస్క్‌లు, గ్లౌజ్‌లు, సబ్బులు, శానిటైజర్లను ఇళ్ల వద్ద ఎలా తయారు చేయాలో టీవీల ద్వారా శిక్షణ ఇప్పించాలి. ► ఎంపీ ల్యాడ్స్‌ను సీఎం సహా య నిధికి జమ చేయాలి. రాష్ట్రానికి 2 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్లు, 2 లక్షల ఎన్–95 మాస్క్‌లు, 2వేల వెంటిలేటర్ల ను సరఫరా చేయాలి. మరో నాలుగు వైరాలజీ ల్యాబ్‌లను మంజూరు చేయాలి. ► రాష్ట్రంలో రేషన్ కార్డుదారు లకు అదనంగా చేపట్టిన సంక్షేమ చర్యలతో రూ.900 కోట్లు, రూ.వెయ్యి చొప్పున ఇవ్వడం వల్ల సుమారు రూ.1,400 కోట్లు ఖర్చయ్యాయి. మొత్తం మీద రూ.2,300 కోట్లను కేంద్రం సాయంగా అందించాలి. ► లాక్‌డౌన్‌తో రోజుకు సుమారు రూ.165 కోట్ల చొప్పున నెలకు దాదాపు రూ.4,500 కోట్ల వరకూ రాష్ట్రానికి రెవెన్యూ నష్టం కలుగుతోంది. ఈ లోటును మానవీయ కోణంలో కేంద్రమే భర్తీ చేయాలి. -
కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.1,050.91 కోట్లు
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నెలకు రెవెన్యూ లోటు భర్తీ కింద, అలాగే రాష్ట్ర విపత్తుల సహాయ నిధి అడ్వాన్స్ కింద కేంద్ర ప్రభుత్వం రూ.1,050.91 కోట్లను రాష్ట్రానికి విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ► 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీ కింద ఏప్రిల్ నెలకు కేంద్ర ప్రభుత్వం రూ.491.41 కోట్ల విడుదల చేసింది. ► 2020–21 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.5,987 కోట్లను సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలకు రూ.491.41 కోట్లు విడుదల చేసింది. ► రాష్ట్ర విపత్తుల సహాయ నిధి కింద 15వ ఆర్థిక సంఘం.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,491 కోట్లను రాష్ట్రానికి సిఫార్సు చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.1,119 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల సహాయ నిధికి అడ్వాన్స్‌గా రూ.559.50 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. ► దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు భర్తీ కింద కేంద్రం ఏప్రిల్ నెలకు రూ.6,157.74 కోట్లు, అన్ని రాష్ట్రాలకు విపత్తుల సహాయ నిధి కింద అడ్వాన్స్‌గా తొలి విడతగా రూ.11,092 కోట్లను విడుదల చేసింది. -
రెవెన్యూ లోటు భర్తీకి రూ.5,897 కోట్లు ఇవ్వండి
సాక్షి, అమరావతి : 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.5,987 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిందిగా 15వ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 14వ ఆర్థిక సంఘం కాలంతో పాటు 15వ ఆర్థిక సంఘం కాలంలో కూడా రాష్ట్రం రెవెన్యూ లోటును ఎదుర్కొంటోంది కనుక.. 15వ ఆర్థిక సంఘం కాల వ్యవధిలో కూడా రెవెన్యూ లోటు భర్తీకి సిఫార్సు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వినతిపై 15వ ఆర్థిక సంఘం ఈ మేరకు స్పందించింది. కాగా, 2020–21 ఆర్థిక ఏడాదికి మాత్రమే సిఫార్సులు చేయగా మిగిలిన నాలుగు ఆర్థిక సంవత్సరాలకు పూర్తిస్థాయి నివేదికను తరువాత ఇస్తామని వెల్లడించింది. అలాగే.. రంగాల వారీగా, రాష్ట్ర నిర్ధిష్ట అవసరాలు, వ్యవసాయ రంగంలో సంస్కరణలు, విద్య.. వైద్య రంగాలకు సంబంధించిన అన్ని గ్రాంట్లపైన పూర్తిస్థాయి నివేదికలో చర్చించి తగు సిఫార్సులు చేస్తామని నివేదికలో స్పష్టంచేసింది. అంతేకాక, తాజా నివేదికలో రాష్ట్ర విభజన అంశాలను, రాజధాని, వెనుకబడిన జిల్లాలతో పాటు రాష్ట్ర ప్రత్యేక అవసరాల గురించి ఆర్థిక సంఘం ఎక్కడా చర్చించలేదు. పూర్తిస్థాయి నివేదికలో చర్చిస్తుందేమో చూడాలి. 2020–21 ఏడాదికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో రాష్ట్రానికి చెందిన ప్రధాన అంశాలు.. - 2020–21 ఆర్థిక సంవత్సరంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో వాటా తేల్చకముందు ఏపీ రెవెన్యూ లోటు రూ.41,054 కోట్లు. పన్నుల వాటాగా రూ.35,156 కోట్లను బదిలీ చేసిన తరువాత రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.5,897 కోట్లుగా ఉంది. దీన్ని భర్తీచేయాలి. - ఇదే కాలంలో గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్ల రూపంలో రూ.2,625 కోట్లను, పట్టణ స్థానిక సంస్థలకు రూ.1,264 కోట్లను ఇవ్వాలి. - పౌష్టికాహార గ్రాంటు కింద రూ.263 కోట్ల మంజూరు. - స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద మొత్తం రూ.1,491 కోట్లను సిఫార్సు చేయగా ఇందులో కేంద్రం వాటా రూ.1,119 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.372 కోట్లు. 2020–21లో రాష్ట్ర రెవెన్యూ రాబడి, వ్యయంపై 15వ ఆర్థిక సంఘం అంచనాలు.. -
గ్రాంట్ల రూపంలో రూ.2,19,695 కోట్లు కావాలి
సాక్షి, అమరావతి: విభజన అనంతరం రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, భారీ రెవెన్యూ లోటు ఉందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఉదారంగా నిధుల మంజూరుకు సిఫారసు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు రాష్ట్రంలో వివిధ రంగాల అభివృద్ధి కోసం 15వ ఆర్థిక సంఘం కాల వ్యవధిలో రూ.2,19,695 కోట్లను గ్రాంట్ల రూపంలో అందేలా చూడాలని కోరింది. గతంలో 15వ ఆర్థిక సంఘం రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు నిధుల అవసరానికి సంబంధించి కొంత సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. తాజాగా మరిన్ని వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం నివేదికను సమర్పించింది. గత ప్రభుత్వం భారీగా పెండింగ్ బిల్లులను వదిలిపెట్టడాన్ని, అదే సమయంలో బడ్జెట్‌కు బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో వేల కోట్ల రూపాయల అప్పులు చేయడాన్ని నివేదికలో ప్రస్తావించింది. రాజధాని నిర్మాణం, విద్య, వైద్య రంగాల్లో చేపట్టాల్సిన మౌలిక వసతుల ప్రాజెక్టులు, రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాల ప్రత్యేక అభివృద్ధికి అవసరమైన నిధులను గ్రాంట్ల రూపంలో కేంద్రం నుంచి వచ్చేలా సిఫారసు చేయాలని నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం కోరింది. -
మిగులు కాదు.. లోటే !
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మిగులు ఆదాయం గల రాష్ట్రం కాదని, వాస్తవానికి ఆదాయలోటు ఉందని కాగ్ కుండబద్దలు కొట్టింది.వాస్తవానికి రూ.284.74 కోట్ల రెవెన్యూలోటు ఉండగా, రూ.3743.47 కోట్ల రెవెన్యూ మిగులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తప్పుగా చూపిందని అభ్యంతరం వ్యక్తం చేసింది. పద్దులను తప్పుగా వర్గీకరించడం, తప్పనిసరిగా జమ చేయాల్సిన చట్టబద్ధ నిధులకు కోతలు పెట్టడం, రాయితీలు, సహాయక గ్రాంట్లను రుణాలుగా చూపడం వంటి కారణాలతో రెవెన్యూ మిగులును రూ.3743.47 కోట్ల మేర ఎక్కువగా, ద్రవ్యలోటును రూ.954.60 కోట్ల మేర తక్కువగా చూపెట్టిందని మొట్టికాయలు వేసింది. వాస్తవానికి తెలంగాణ రూ.284.74 కోట్ల ఆదాయలోటు, రూ.27,654.60 కోట్ల ద్రవ్యలోటును కలిగి ఉందని స్పష్టం చేసింది. 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన పరిమితి 3.50 శాతానికి మించి 3.55 శాతం ద్రవ్యలోటు ఉందని తేల్చింది. 2018తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కాగ్ రూపొందించిన ప్రత్యేక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టింది. ఈ నివేదికలో ముఖ్యాంశాలు.. రూ.1,42,918 కోట్ల అప్పులు రాష్ట్ర ప్రభుత్వం 2018 మార్చి 31 నాటికి రూ.1,42,918 కోట్ల అప్పులు చెల్లించాల్సి ఉంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 18 శాతం అప్పులు పెరిగిపోయాయి. వడ్డీ చెల్లింపులు క్రమంగా పెరిగి ఆదాయ రాబడులను మింగేస్తున్నాయి. రెవెన్యూరాబడితో పోలిస్తే వడ్డీ చెల్లింపులు 12.19 శాతానికి పెరిగిపోయాయి. 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన 8.31 శాతం పరిమితి కన్నా రాష్ట్రం అధికశాతం వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది. వచ్చే ఏడేళ్లలో రూ.65,740 కోట్ల అప్పులను తీర్చాల్సి ఉంటుంది. బడ్జెట్ అంచనాలు తలకిందులు.. వార్షిక బడ్జెట్ అంచనాలతో పోలిస్తే రెవెన్యూ రాబడులు రూ.24,259 కోట్లు తగ్గాయి. 2017–18లో రూ.88,824 కోట్ల రాబడి రాగా, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది రూ.6,006 కోట్లు అధికం. రూ.85,365 కోట్ల రెవెన్యూ వ్యయం జరగగా, బడ్జెట్ అంచనాలతో పోలిస్తే రూ.23,147 కోట్లు తక్కువే. ఈ నేపథ్యంలో బడ్జెట్ అంచనాలు, వాస్తవాలకు మధ్య అంతరాన్ని తగ్గించాల్సి ఉంది. 2015–16 మధ్యకాలంలో రెవెన్యూరాబడి, రెవెన్యూ వ్యయం పెరిగాయి. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి(జీఎస్డీపీ)తో పోలిస్తే రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం రెండూ తగ్గాయి. 2016–17తో పోలిస్తే 2017–18లో రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం వృద్ధిరేటు తగ్గింది. పన్నుల వసూళ్లలో సమర్థత మూడేళ్లగా రాష్ట్రం పన్నుల వసూళ్లకు అయ్యే ఖర్చులను తగ్గించుకోవడం పన్నుల వసూళ్లలో సమర్థతకు నిదర్శనమని కాగ్ ప్రశంసించింది. రూ.84,006 కోట అభివృద్ధి వ్యయం, రూ.23,902 కోట్ల పెట్టుబడి వ్యయంతో సాధారణ హోదా గల ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ముందంజలో ఉందని తెలిపింది. విద్యారంగంలో మాత్రం వెనుకబడిందని అభిప్రాయపడింది. ఇలా అయితే సీపీఎస్ దివాలా కాంట్రిబ్యూటరీ పింఛను పథకం(సీపీఎస్) కింద 2017–18లో ఉద్యోగులు తమ వాటాగా రూ.481.61 కోట్లు చెల్లించగా, ప్రభుత్వం రూ.431.74 కోట్లను జమ చేసింది. ప్రభుత్వం రూ.49.87 కోట్లు తక్కువగా జమ చేసింది. 2016–17లో రూ.71.91 కోట్లు, 2014–15లో రూ.20.01 కోట్లను ఇలానే తక్కువగా చెల్లించింది. ప్రభుత్వవాటా తక్కువగా జమ చేయడం, పింఛను నిధిలోని నిల్వలపై వడ్డీలు చెల్లించకపోవడం వంటి చర్యలను సరిదిద్దకపోతే జాతీయ పింఛను వ్యవస్థ మూలనిధి దివాలాతీసే ప్రమాదముందని, దీనితో ఉద్యోగులు నష్టపోతారని కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. జాప్యంతో తడిసి మోపెడైన ప్రాజెక్టుల వ్యయం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో 3 నుంచి 11 ఏళ్ల వరక జరిగిన జాప్యం కారణంగా 19 సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.41,201 కోట్ల నుంచి రూ.1,32,928 కోట్లకు పెరిగింది. ఈ ప్రాజెక్టులపై ఇప్పటికే రూ.70,758 కోట్లు ఖర్చు చేసినా ఇంకా పూర్తి కాలేదని, ఈ ప్రాజెక్టుల వల్ల కలిగిన ఆర్థిక ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడంలేదని, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని కాగ్ పేర్కొంది. 2014–18 మధ్యకాలంలో ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.79,236 కోట్లు ఖర్చు చేసింది. 2016–17 మినహాయిస్తే 50 శాతానికిపైగా పెట్టుబడిని సాగునీటి ప్రాజెక్టులపైనే పెట్టింది. సంక్షోభంలో డిస్కంలు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లపై రాష్ట్ర ప్రభుత్వచర్యలు ప్రతికూల ప్రభావం చూపాయి. 2017–18లో ప్రభుత్వరంగ సంస్థలకు వచ్చిన నష్టాల్లో 94 శాతం విద్యుత్ రంగానికి చెందినవే. రూ.6,202 కోట్ల నష్టాల్లో డిస్కంలు కూరుకుపోయాయి. డిస్కంలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలం టే ప్రభుత్వ బకాయిలను విడుదల చేయడంతోపాటు విధానపర నిర్ణయాల అమలుతో కలిగే నష్టపరిహారాన్ని చెల్లించాలని సిఫారసు చేసింది. పూర్తికాని పంపకాలు రాష్ట్ర విభజన జరిగి 4 ఏళ్లు పూర్తి అవుతున్నా రూ.1,51,349.67 కోట్ల ఆస్తులు, రూ.28,099.68 కోట్ల రుణాల పంపకాలు ఇంకా పూర్తి కాలేదు. షెడ్యూల్ 9లోని 91 సంస్థల విభజన జరగాల్సి ఉండగా, నిపుణుల కమిటీ 86 సంస్థల విభజనకు సిఫారసు చేసింది. తెలంగాణ ప్రభుత్వం రెండు సంస్థల విభజనకు మాత్రమే సమ్మతించింది. ఖర్చుల లెక్కలేవి... అత్యవసర ఖర్చుల బిల్లులను నిర్దేశిత గడువులోగా సమర్పించడం లేదని కాగ్ అభ్యంతరం తెలిపింది. ఇలా చేయడం ఆర్థిక క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని, ఇలాంటి అవాంఛనీయ ధోరణలతో ప్రజాధనం దుర్వినియోగమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. 2,164 అత్యవసర బిల్లుల ద్వారా రూ.280.45 కోట్లను డ్రా చేశారని, వీటికి సంబంధించిన బిల్లులను సమర్పించలేదని తెలిపింది. రూ.81.64 కోట్లు విలువ చేసే అత్యవసర బిల్లులు రాష్ట్ర విభజనకు ముందు నాటివని పేర్కొంది. -
అప్పుల సొమ్ము ఆర్భాటాల పాలు
సాక్షి, అమరావతి: ఎవరైనా అప్పులు ఎందుకు చేస్తారు.. వ్యాపారం చేసి ఆదాయం గడించడానికో, తప్పని అవసరాలకో చేస్తారు. అప్పులు చేసి సోకులు చేస్తే ఏమవుతుంది? తీర్చలేక తలకు భారమవుతుంది. ఆ తర్వాత దివాలాకు దారి తీస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే చేస్తోంది. ఆదాయం పెంచడానికి గత నాలుగేళ్ల నుంచి తీసుకుంటున్న అప్పులను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆర్భాటాలకు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేస్తున్నారు. గతంలో చంద్రబాబు పాలనలో కూడా రాష్ట్రం అప్పులు ఊబిలో కూరుకుపోయింది. నిత్యం చేబదుళ్లు, ఓవర్‌డ్రాఫ్టుల్లోనే కొనసాగించింది. అప్పుడు కూడా ఇంతే. చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు కాకుండా ప్రచార ఆర్భాటాలకు ఖర్చు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల భారాన్నీ ప్రజలపై మోపుతున్న వైనాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ప్రాథమిక ఖాతాల్లో బయటపెట్టింది. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆస్తుల కల్పనకు రూ. 21,959 కోట్లు వ్యయం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. కేవలం రూ. 14,089 కోట్లే ఖర్చు చేసినట్లు కాగ్ ఆ నివేదికలో స్పష్టం చేసింది. ఇది 2016–17 ఆర్థిక సంవత్సరం కంటే కూడా తక్కువని పేర్కొంది. ఆ ఏడాది రూ. 15,484 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసింది. క్షీణిస్తున్న క్రమశిక్షణ: ప్రస్తుతం చేసిన అప్పుల్లో కొంత వాటా గతంలో చేసిన అప్పులు, ఆ అప్పులపై వడ్డీలు చెల్లించడంతో పాటు ఆస్తుల కల్పనకు వ్యయం చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. నేతల ఆర్భాటాలకు, రెవెన్యూ రంగాలపైన రాష్ట్ర ప్రభుత్వ వ్యయం చేస్తోంది. దీంతో నానాటికి ఆర్థిక క్రమశిక్షణ క్షీణిస్తోంది. బడ్జెట్ ప్రతిపాదనలకు వాస్తవ వ్యయాలకు కూడా పొంతన లేకుండా పోతోంది. బడ్జెట్ ప్రతిపాదనలను గౌరవించకుండా ఇష్టానుసారంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రెవెన్యూ, ద్రవ్యలోటు అదపులేకుండా పోతోందని, ఏటికేడు లోటు పెరిగిపోవడమే తప్ప తగ్గడం లేదని కాగ్ లెక్కల్లో తేలింది. రెవెన్యూ లోటు రూ. 22,844 కోట్లకు చేరిందని, ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరానికి కన్నా ఎక్కువగా ఉందని కాగ్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2016–17 ఆర్థిక సంత్సరంలో రెవెన్యూ లోటు రూ. 20,250 కోట్లుగా ఉంది. అలాగే బడ్జెట్ ప్రతిపాదనల్లో ద్రవ్యలోటు రూ. 23,054 కోట్లుగా పేర్కొన్నారు. వాస్తవంగా రూ. 39,663 కోట్లు ద్రవ్యలోటు ఏర్పడింది. ఇది కూడా 2016–17 ఆర్థిక సంవత్సరం (రూ. 34,269 కోట్లు) కన్నా ఎక్కువగా ఉందని అకౌంట్స్ స్పష్టం చేశాయి. రాష్ట్ర భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం ఆర్థిక క్రమశిక్షణ తప్పడం రాష్ట్ర భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఈ పరిస్థితులకు పాలకుల తప్పిదమే కారణమని ఉన్నతాధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రభుత్వం చేయాల్సిన పనులను వదిలేసి ప్రైవేట్ సంస్థలు చేయాల్సిన పనులను చేయడంతో రెవెన్యూ రంగాలకు వ్యయం ఎక్కువగా అవుతోందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కేబుల్ టీవీ సెట్‌టాప్ బాక్సులు, టవర్లు ఏర్పాటు వంటి వాటికి ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు నిధులు ఇస్తుండటమే ఉదాహరణ అని సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పారు. -
అప్పు కోసం ‘తప్పు’.. అసలుకే ముప్పు?
సాక్షి, అమరావతి: లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి చట్ట ప్రకారం ఆర్థిక సాయం చేస్తామని చెబితే అదేం వద్దంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మా దగ్గర అవసరాని కంటే ఎక్కువ డబ్బులున్నాయి, మీ సాయం మాకేం అక్కర్లేదని ముఖం మీదే చెబుతోంది. ఎందుకు ఇలా చేస్తోందని ఆరా తీస్తే... బయటి నుంచి ఎక్కువ అప్పులు తెచ్చుకోవడానికట! ఈ పరిణామం పట్ల అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత 2014–15 ఆర్థిక సంవత్సరంలో ఏర్పడిన రెవెన్యూ లోటును కేంద్రం నుంచి పొందడానికి ప్రభుత్వం ఇప్పటికే తిప్పలు పడుతున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్లయినా రెవెన్యూ లోటు కింద రావాల్సిన నిధులను పూర్తిస్థాయిలో రాబట్టలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రెవెన్యూ మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం అంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లేనని అధికారులు చెబుతున్నారు. సర్కారు అనాలోచిత నిర్ణయంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం తప్పదని పేర్కొంటున్నారు. కేంద్రానికి దొరికిన సాకు 2015–16 నుంచి 2019–20 ఆర్థిక సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ లోటులో ఉంటుందని 14వ ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. రెవెన్యూ లోటు భర్తీ కింద 2015 నుంచి 2020 వరకు రాష్ట్రానికి రూ.22,113 కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. 2019–20 వరకు రాష్ట్రంలో రెవెన్యూ లోటు ఉంటుందని సాక్షాత్తూ 14వ ఆర్థిక సంఘమే స్పష్టం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.5,235 కోట్ల మేర రెవెన్యూ మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం గమనార్హం. దీనివల్ల కేంద్రానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నామో అర్థం కావడం లేదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఏపీలో మిగులు బడ్జెట్ ఉందనే సాకుతో కేంద్రం 2018–19లో రెవెన్యూ లోటు కింద నిధులు ఇవ్వకుంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 14 ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు రాష్ట్రానికి రెవెన్యూ లోటు గ్రాంట్ కింద కేంద్రం నుంచి 2018–19లో రూ.3,644 కోట్లు, 2019–20లో రూ,2499 కోట్లు రావాల్సి ఉంది. 2014–15లో 10 నెలలకు ఏర్పడిన రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.4,000 కోట్లు ఇచ్చామని, ఇక రూ.138 కోట్లే వస్తాయని కేంద్రం చెబుతున్న సంగతి తెలిసిందే. అప్పుల కోసం నిధులు పణం! రాష్ట్ర ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం(ఎఫ్ఆర్బీఎం) నిబంధనలను సడలించాలని, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3 శాతానికి బదులు 3.5 శాతం మేర అప్పులు తెచ్చుకునేందుకు అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటి నుంచో కేంద్రాన్ని కోరుతోంది. అయితే, రెవెన్యూ మిగులున్న రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం ఆ వెసులబాటు కల్పించింది. రెవెన్యూ మిగులున్న రాష్ట్రాలు తమ స్థూల ఉత్పత్తిలో 3.5 శాతం మేర అప్పులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ రెవెన్యూ మిగులులో ఉన్నందున ఇటీవలే ఆ రాష్ట్రానికి 3.5 శాతం మేర అప్పులు తెచ్చుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం రెవెన్యూ మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అప్పులు ఎక్కువ తెచ్చుకోవడానికి కేంద్రం నుంచి వచ్చే రెవెన్యూ లోటు నిధులను పణంగా పెట్టడం సమంజసం కాదని అంటున్నారు. కేంద్రం మొండిచెయ్యి చూపితే? 14వ ఆర్థిక సంఘం కాలపరిమితి 2019–20తో ముగుస్తుంది. ఆ తరువాత 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తాయి. 14వ ఆర్థిక సంవత్సరం కాలపరిమితి ముగిసిన తరువాత కూడా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటును ఎదుర్కోనుంది. ఇలాంటి పరిస్థితుల్లో 15వ ఆర్థిక సంఘం ముందు సమర్థంగా వాదనలు వినిపించి, రెవెన్యూ లోటు కింద నిధులు పొందడానికి కృషి చేయాల్సింది పోయి ఇప్పుడే మిగులు బడ్జెట్‌ను ఎలా ప్రవేశపెడతారని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రంలో రెవెన్యూ మిగులు బడ్జెట్ ఉంటే రెవెన్యూ లోటు భర్తీ కింద నిధులు ఇవ్వకుండా కేంద్రం మొండిచెయ్యి చూపే అవకాశం ఉందని ఒక అధికారి చెప్పారు. ఏపీలో ఏటా లోటు బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం 2015–16 నుంచి బడ్జెట్ ప్రవేశపెడుతోంది. ప్రతి బడ్జెట్లోనూ రెవెన్యూ లోటును తక్కువగా చూపించినప్పటికీ సవరించిన అంచనాల్లో ఈ లోటు భారీగా పెరిగిపోతోంది. 2015–16 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రెవెన్యూ లోటు రూ.6,709 కోట్ల మేర ఏర్పడుతుందని పేర్కొనగా, వాస్తవానికి రూ.7,301 కోట్ల లోటు ఏర్పడింది. 2016–17 బడ్జెట్లో రూ.5,047 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని పేర్కొనగా, వాస్తవ అకౌంట్ల మేరకు రూ.17,231 కోట్ల లోటు తలెత్తింది. 2017–18 బడ్జెట్లో రూ.415 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని ప్రస్తావించగా, సవరించిన అంచనాల్లో రూ.4,018 కోట్ల లోటు ఏర్పడింది. రాష్ట్రంలో రెవెన్యూ లోటు భారీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం మిగులు బడ్జెట్‌ను చూపడం గమనార్హం. రెవెన్యూ మిగులు అసహజంగా ఉంది ఎన్నికలకు ముందు సాధారణంగా సంక్షేమ పథకాలతో రెవెన్యూ వ్యయానికి ఎక్కువగా కేటాయిస్తారు. ఇలాంటప్పుడు రెవెన్యూ లోటు మరింత పెరుగుతుంది. కానీ రెవెన్యూ మిగులు చూపెట్టడం అసహజంగా ఉంది. వరుసగా గత మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను రెవెన్యూ లోటుతో పెట్టగా.. ఇప్పుడు హఠాత్తుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత ఆశాజనకంగా అయిపోయిందా! ఇంత ఆశాజనకంగా ఉంటే రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మించి ఆర్థిక వెసులుబాటు పొందడం కష్టతరం అవుతుంది. ఆర్థిక వ్యవస్థలో మౌలికమైన సామర్థ్యం వలన ఈ బడ్జెట్ ఇంత ఆశాజనంగా రూపొందితే మనకిక ఎవరి సహాయం అవసరం ఉండకపోవచ్చు. లేక ఈ అంకెలన్నీ గారడీ అయితే అన్ని విధాలా మనల్ని మనమే మోసం చేసుకున్నట్లవుతుంది. – ఐవైఆర్ కృష్ణారావు,ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి -
ఈ లెక్కలెలా నమ్మాలి బాబూ!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం భారీ అంచనాలతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో విశ్వసనీయత కనిపించడం లేదని.. ఇంత తప్పుల తడకలతో కూడిన బడ్జెట్‌ను ఎన్నడూ చూడలేదని అధికార వర్గాలు నోరెళ్లబెడుతున్నాయి. బడ్జెట్ గణాంకాలు కూడా వారి వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. కేంద్రం నుంచి నిధులు రావాలని అందరం కోరుకుంటామని.. కానీ కేంద్రం నుంచి రాని నిధులు కూడా వస్తాయంటూ బడ్జెట్ అంచనాల్లో ప్రతిపాదించడం ప్రజల్ని మోసం చేయడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ లోటు భర్తీ కింద కేవలం రూ.138 కోట్లు మాత్రమే వస్తాయని కేంద్రం ఇప్పటికే పలుసార్లు స్పష్టం చేసిందని అధికారులు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా బడ్జెట్ పెట్టడానికి ముందు కూడా ముఖ్యమంత్రి ఈ విషయం చెప్పారని.. అయినా కూడా రెవెన్యూ లోటు భర్తీ కింద కేంద్రం నుంచి రూ.12,099 కోట్లు వస్తాయని రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. కేంద్రం ముందుగానే బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. మన రాష్ట్రానికి ఏఏ నిధులు వస్తాయో అందులో స్పష్టం చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో రెవెన్యూ లోటు భర్తీ కింద కేటాయింపులు చేయకుండా.. రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు చేసుకోవడం మనల్ని మనం మోసం చేసుకోవడమేనని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. అలాగే రాజధాని నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో పైసా కూడా కేటాయించలేదు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి రూ.వెయ్యి కోట్లు వస్తాయని ప్రతిపాదించడాన్ని అధికారులు తప్పుపడుతున్నారు. అలాగే వెనుకబడిన ఏడు జిల్లాలకు కేంద్ర బడ్జెట్లో పైసా కూడా కేటాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో మాత్రం కేంద్రం నుంచి రూ.350 కోట్లు వస్తాయని ప్రతిపాదించడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాష్ట్ర సొంత పన్నుల ద్వారా రాని నిధులను కూడా వస్తాయంటూ భారీగా ప్రతిపాదించడాన్ని కూడా తప్పుపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో పైసా కూడా కేటాయించలేదు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రూ.9000 కోట్లు వస్తాయని పేర్కొనడాన్ని అధికారులు తప్పుపడుతున్నారు. ఇలాంటి అంకెల వల్ల రాష్ట్రాభివృద్ధికి ఎటువంటి ప్రయోజనం ఉండదని.. కేవలం ప్రచారం చేసుకోవడానికే పనికివస్తుందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
ఖజానాకు పూడ్చలేని ‘లోటు’!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదంతో భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. ఉద్యోగులకు బకాయి పడ్డ పీఆర్సీ డబ్బులు వారికి చెల్లించేసి ఉంటే కేంద్రం నుంచి రెవెన్యూ లోటు ద్వారా పొందే వీలున్నా ఆ అవకాశాన్ని వదులుకుంది. ఫలితంగా రాష్ట్ర ఖజానాపై మరో రూ. 5 వేల కోట్లకుపైగా భారం పడింది. ఉద్యోగులకు బకాయిలు చెల్లించి ఉంటే... రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు కావస్తున్నా రెవెన్యూ లోటు భర్తీ విషయంలో చిక్కులు వీడటం లేదు. పాత పథకాల ద్వారా ఏర్పడిన రెవెన్యూ లోటును మాత్రమే భర్తీ చేస్తామని, కొత్త పథకాల వల్ల తలెత్తిన లోటును భర్తీ చేయలేమని కేంద్ర ఆర్థికశాఖతో పాటు నీతి ఆయోగ్ కూడా స్పష్టం చేయటం తెలిసిందే. ఉద్యోగుల పీఆర్సీ పాత పథకం కిందకే వస్తుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.5,325 కోట్ల పీఆర్సీ బకాయిలను అందచేసి ఉంటే కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటుగా పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు భర్తీ చేసేదని అధికార యంత్రాంగం చెబుతోంది. వ్యయం చేయకుండా లోటు అంటే ఎలా? ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలను రెవెన్యూ లోటుగా పరిగణించాలని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్ర ఆర్థికశాఖ తిరస్కరించింది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో పది నెలల వ్యవధి రెవెన్యూ లోటునే మాత్రమే భర్తీ చేయనున్నట్లు చెప్పామని, పీఆర్సీ బకాయిలు చెల్లించనందున రెవెన్యూ లోటుగా ఎలా భర్తీ చేస్తామని కేంద్రం ప్రశ్నించినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. వ్యయం చేస్తేనే దాన్ని రెవెన్యూ లోటుగా పరిగణిస్తారని, అలా కాకుండా బకాయిల కింద చూపిస్తూ రెవెన్యూ లోటుగా పరిగణించటం కుదరదని అధికార యంత్రాంగం తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలు చెల్లించేసి ఉంటే రాష్ట్రానికి రూ.5,325 కోట్ల మేరకు రెవెన్యూ లోటు భర్తీ రూపంలో ప్రయోజనం చేకూరేదని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇక ఇచ్చేది రూ. 138.39 కోట్లే రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రపతి పాలన సమయంలో రెవెన్యూ లోటును గవర్నర్ రూ.16,078.76 కోట్లుగా లెక్క కట్టారు. అయితే పది నెలల కాలంలో ఏర్పడిన రెవెన్యూ లోటునే పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో రెవెన్యూ లోటు రూ.15,691 కోట్లుగా పేర్కొన్నారు. అనంతరం అకౌంటెంట్ జనరల్ కార్యాలయం రెవెన్యూ లోటు రూ.13,775.76 కోట్లు అని తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రెవెన్యూ లోటు కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ. 3,979.50 కోట్లు ఇచ్చింది. రుణమాఫీ, పింఛన్లు, డిస్కమ్స్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన వ్యయాన్ని రెవెన్యూ లోటుగా పరిగణించబోమని తెలిపింది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో పది నెలల సమయానికి రూ.4,117.89 కోట్ల మేర మాత్రమే రెవెన్యూ లోటు ఏర్పడిందని కేంద్ర ఆర్థికశాఖ తేల్చింది. ఇందులో ఇప్పటికే రూ.3979.50 కోట్లు విడుదల చేసినందున ఇక లోటు భర్తీ కింద కేవలం రూ. 138.39 కోట్లు మాత్రమే వస్తాయని, వీటిని త్వరలోనే విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లేఖ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేశారు. -
ఇక ఇవ్వాల్సింది రూ.138 కోట్లే
-
ఇక ఇవ్వాల్సింది రూ.138 కోట్లే
- రెవెన్యూ లోటు భర్తీపై అరుణ్ జైట్లీ స్పష్టీకరణ - ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు భర్తీ కింద ఇకపై వచ్చేది రూ.138.39 కోట్లేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రెవెన్యూ లోటు మొత్తాన్ని రూ.16,078 కోట్ల నుంచి రూ.4,117.89 కోట్లకు కుదించేసింది. అందులో ఇప్పటివరకు రూ.3,979.50 కోట్లు ఇచ్చేసినట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఇవ్వాల్సిన మొత్తాన్ని కొద్దికాలంలో విడుదల చేస్తామని తెలిపారు. ‘ప్యాకేజీకి’ అంగీకరించి రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వదులుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు విభజన చట్టంలోని హామీల సాధన లోనూ విఫలం కావడంతో రాష్ట్రం భారీగా నష్టపోతోంది. పదవ షెడ్యూల్లో గల సంస్థల ఆస్తులు ‘ఎక్కడివి అక్కడే..’ అని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే తొమ్మిదవ షెడ్యూల్లో గల సంస్థల ఆస్తులంటే ప్రధాన కేంద్ర కార్యాలయాల ఆస్తులే తప్ప, మిగతా యూనిట్లు, ఉప కార్యాలయాల ఆస్తుల పంపిణీ ఉండదని కూడా ఇటీవల తేల్చిచెప్పింది. అయినా చంద్రబాబు పట్టించుకోక పోవడంతో రాష్ట్రానికి మరో భారీ నష్టం జరిగింది. -
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఏపీ
-
ఏపీకి రూ. 1,176 కోట్ల ఆర్థిక సహాయం!
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక సహాయం అందజేసింది. రెవెన్యూ లోటు కింద రూ. 1,176 కోట్ల నిధులను కేంద్రం ఏపీకి విడుదల చేసిందని కేంద్రమంత్రి సుజనా చౌదరి గురువారం వెల్లడించారు. వెనుకబడిన జిల్లాలకు రూ. 350 కోట్లు, రాజధాని అభివృద్ధికి రూ. 450 కోట్లు విడుదల చేసినట్టు ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ సరైన ఆదాయం లేక ఆర్థిక లోటు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తగిన ఆర్థిక సాయం చేసి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రాన్ని ప్రభుత్వం కోరుతోంది. అయినా, కేంద్ర ప్రభుత్వం అరకొర సహాయం మాత్రమే చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. -
రాష్ట్రం ఓ అప్పుల అప్పారావ్
ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం ఉల్లంఘన గాడి తప్పి 3.74 శాతం చేరిన ద్రవ్యలోటు పేరుకు రూ. 1.17 లక్షల కోట్లు వ్యయం ఇందులో బుక్ సర్దుబాటు ఆరు వేల కోట్లు జీవోలు ఇచ్చారే తప్ప నిధులు విడుదల చేయలేదు సంక్షేమం, విద్య, పశుసంవర్థక, మత్య్సశాఖ ఖర్చులో వెనుకబాటు సాక్షి, హైదరాబాద్: హంగులు, ఆర్భాటాలతో యథేచ్ఛగా దుబారా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి మరీ అప్పులు చేస్తోంది. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) చట్టం నిబంధనల మేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ద్రవ్యలోటు మూడు శాతానికి మించకూడదు. అయితే మార్చితో ముగిసిన 2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు మించి అప్పులు చేసింది. దీంతో ద్రవ్యలోటు 3.74 శాతానికి చేరింది. నిబంధనలకు మించి చేసిన అప్పులకు కేంద్రం నుంచి ఆమోదం పొందాల్సి ఉంది. అంతే కాకుండా గత ఆర్థిక సంవత్సరంలో నిబంధనలకు మించి అప్పు చేసినందున ఆ మేరకు ప్రస్తుత 2016-17 ఆర్థిక సంవత్సరం అప్పుల్లో కేంద్రం కోత విధించనుంది. మరోవైపు గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అమలు ఘనంగా ఉందని ప్రభుత్వం చెబుతుండగా వాస్తవ పరిస్థితులు పూర్తి విరుద్ధంగా ఉన్నా యి. ప్రణాళికేతర వ్యయాన్ని ప్రణాళికా కేటాయింపులకు మార్చడం, చేయని వ్యయం చేసినట్లు బుక్ సర్దుబాట్లు చేయడం వంటి మాయాజాలానికి ప్రభుత్వం పాల్పడింది. బడ్జెట్ కేటాయింపులకు మించి వ్యయం చేశామని చెబుతున్నప్పటికీ... మార్చి నెలలో బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ ఇచ్చారే తప్ప నిధులు విడుదల చేయలేదు. అలా చూపిన వ్యయం రూ.6వేల కోట్లు కేవలం పుస్తకాల్లో సర్దుబాటు లెక్కలకే పరిమితమైంది. పుస్తకాల సర్దుబాటే! 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.1,13,048 కోట్ల వ్యయం చేయనున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. అయితే రూ.1,17,439 కోట్ల వ్యయం చేసినట్లు ఆర్థిక శాఖ పేర్కొంటోంది. ఇందులోను బడ్జెట్లో పేర్కొన్న దానికన్నా ప్రణాళికా వ్యయం ఎక్కువగా చేశామని, ఇది రికార్డు అని సర్కారు పేర్కొంటోంది. అయితే బడ్జెట్ కన్నా ఎక్కువ వ్యయం చేశామనడం కేవలం పుస్తకాల సర్దుబాటుకే పరిమితమైంది. మార్చి చివర్లో కేంద్రం రాజధాని నిర్మాణానికి ఇచ్చిన నిధులకు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఇచ్చిన నిధులకు ప్రభుత్వం జీవోలు జారీ చేసిందే తప్ప నిధులు మాత్రం ఇవ్వలేదు. అలాగే ఉద్యానవన రైతుల రుణ మాఫీ పేరుతో కూడా జీవో జారీ చేశారే తప్ప నిధులు విడుదల చేయలేదు. ఈ విధంగా రూ.ఆరు వేల కోట్లు వ్యయం చేసినట్లు పుస్తకాల్లో చూపించారే తప్ప వాస్తవంగా నిధులివ్వలేదు. ఇవన్నీ కలిపే రూ.1,17,439 కోట్లు వ్యయం చేసినట్లు ఆర్థిక శాఖ లెక్కచెపుతోంది. విద్య, సంక్షేమ రంగాల వ్యయంలో వెనుకబాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి పెద్దపీట వేశామని చెబుతుండగా వాస్తవంగా గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కేటాయించిన నిధులను పూర్తిగా వ్యయం చేయలేదని తేలింది. ఈ రంగాలకు గత బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో ఏకంగా 20 శాతం నిధులను వ్యయం చేయకుండా మురగపెట్టినట్లు స్పష్టమైంది. విద్య, పశుసంవర్థక, మత్య్స రంగాలకు కేటాయించిన నిధుల్లో 20 శాతం నిధులను వినియోగించలేదు. ప్రణాళికేతర వ్యయంలో మాయలెక్కలు మరోవైపు ప్రణాళికేతర వ్యయం బడ్జెట్లో రూ.78,636 కోట్లుగా పేర్కొనగా కేవలం రూ.70,986 కోట్లకే పరిమితం చేసినట్లు ఆర్థిక శాఖ మాయ లెక్కలు చెబుతోంది. ప్రణాళికేతర వ్యయం కింద చేయాల్సిన ఖర్చులను ప్రణాళిక కిందకు తీసుకువచ్చి... ప్రణాళికా వ్యయం ఎక్కువగా చేశామని, ప్రణాళికేతర వ్యయం తగ్గించామని గొప్పులు చెప్పుకుంటోంది. ముగి సిన ఆర్థిక సంవత్సరంలో ప్రాథమిక లెక్కల మేరకు రెవెన్యూ లోటు రూ.7,143 కోట్లుగా తేల్చారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కేంద్రం, రాష్ట్రం ద్వారా మొత్తం రూ.90.124 కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేయగా వాస్తవంగా రూ.88,522 కోట్లు ఆదాయం వచ్చింది. రాష్ట్ర సొంత పన్నుల ద్వారా రూ.44,423 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా రూ.40,311 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే రాష్ట్ర పన్నేతర ఆదాయం రూ.5341 కోట్లు వస్తుందని అంచనా వేయగా రూ.4350 కోట్ల ఆదాయం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రణాళికా సాయం కింద రూ.10 వేల కోట్లు వస్తాయని అంచనా వేయగా అంచనాలకు మించి రూ.14,600 కోట్ల రూపాయలు వచ్చాయి. -
ఆదాయం వస్తున్నా బీద అరుపులేల
► ఇందిరమ్మ’ లబ్ధిదారులగోడు పట్టదా ► ప్రభుత్వంపై పీసీసీ ఉపాధ్యక్షుడు ► నాదెండ్ల మనోహర్ ధ్వజం తెనాలి : రాష్ట్ర విభజనతో ఏర్పడిన రూ.16 వేల కోట్ల రెవెన్యూ లోటును అధిగమించి, ఆదాయం పెరుగుతున్నా రాష్ట్రప్రభుత్వం, ప్రజల అవసరాలపై నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని పీసీసీ ఉపాధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ విమర్శించారు. దాయం పెరిగినా సంక్షేమానికి ప్రభుత్వం అరకొర కేటాయింపులు ఏమిటని ప్రశ్నించారు. తెనాలిలోని స్వగృహంలో గురువారం విలేకర్లతో మనోహర్ మాట్లాడారు. సేల్స్‌టాక్సు రూపేణా రూ.31,120 కోట్లు, వివిధ పన్నుల రూపంలో రూ.44, 423 కోట్లు ఆదాయం వచ్చిందని చెప్పారు. తెలంగాణకు రూ.40 వేల కోట్ల పన్ను ఆదాయం వస్తే, ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా మరో 4,423 కోట్లు వచ్చిందన్నారు. 14వ ఆర్థిక సంఘ నిధులు మరో 21,200 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.5,300 కోట్లు సమకూరాయని, రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్లు భర్తీ అయి రూ.1573 కోట్లు అదనంగా వచ్చినట్టు వివరించారు. ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులకు బిల్లుల బకాయిలు ఎందుకు చెల్లించటం లేదని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద పదేళ్లలో 64 లక్షల గృహాలను నిర్మించినట్టు గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే అవకతవకలంటూ విచారణకు ఆదేశించి బిల్లులు నిలుపుదల చేసిందన్నారు. మరోవైపు కొత్తగా రూ.16,300 కోట్లతో ఆరు లక్షల గృహాలను నిర్మిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్లో ఇప్పటివరకు కేటాయించింది కేవలం రూ.1132 కోట్లు మాత్రమేనని గుర్తుచేశారు. భారీ ప్రాజెక్టును అరకొర నిధులతో ఎలా పూర్తిచేస్తారన్నారు. వైఎస్ హయాంలో పార్టీల కతీతంగా అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాల లబ్ధిని అందిస్తే, ఇప్పుడు ఇల్లు ఇవ్వాలంటే జన్మభూమి కార్యకర్తల సిఫార్సు చేయాలనే నిబంధనలు బాధ కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. -
ఏపీ రెవెన్యూ లోటులో ప్రతి పైసా ఇస్తున్నాం
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రెవెన్యూ లోటులో ప్రతి పైసా చెల్లిస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ ఆయన మాట్లాడారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి ఒక్క అంశాన్నీ తప్పనిసరిగా తాము నెరవేరుస్తామని, అందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిగా న్యాయం చేస్తామని, చట్టంలో ఉన్న అంశాలన్నింటినీ నెరవేరుస్తామని అన్నారు. రెవెన్యూ లోటుకు సంబంధించి గత ఏడాది ప్రతి ఒక్క రూపాయి ఇచ్చామని, ఈవాళ కూడా సరిపడ డబ్బులు ఇచ్చామని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వివిధ సంస్థలకు ఇప్పటికే శంకుస్థాపనలు జరిగాయని గుర్తు చేశారు. ఐఐటీలు, ఐఐఎంలు.. ఇలా అన్నింటి విషయాలను ఆయన ప్రస్తావించారు. వీటికి సరిపడ నిధులను కూడా కేటాయించామని చెప్పారు. గత ఏడాది రెండు రకాల పన్ను రాయితీలు ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణకు సంబంధించి కూడా కొన్ని రాయితీలు ఇచ్చామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు గత ఏడాది మరికొన్ని నిధులు ఇచ్చామని తెలిపారు. బడ్జెట్‌మీద చర్చ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుపై మరింత స్పష్టత ఇచ్చామని జైట్లీ అన్నారు. నాబార్డు కింద నిధులను ఈ ప్రాజెక్టుకు కేటాయిస్తామన్నారు. -
రెవెన్యూలోటు భర్తీకి మరో 1800 కోట్లు
పుష్కరాలకు రూ. 100 కోట్లు ఏపీ సమగ్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. {పత్యేక హోదా పరిశీలనలో ఉంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పొందుపరిచిన హామీలన్నీ నెరవేర్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి మంగళవారం చివరి రోజు కావడంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై అరుణ్ జైట్లీతో కేంద్ర మంత్రి సుజనాచౌదరి, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేశ్ సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో అరుణ్‌జైట్లీ ఏపీకి ఇచ్చిన నిధుల గురించి వివరించారు. ఇవీ ముఖ్యాంశాలు.. రెవెన్యూలోటు: ఏపీ రెవెన్యూ లోటు భర్తీచేసేందుకు ఇదివరకే ఇచ్చిన రూ.500 కోట్లుకు అదనంగా మరో రూ.1,800 కోట్లు విడుదల చేస్తున్నట్టు జైట్లీ ప్రకటించారు. 2014-15 అకౌంట్లు పూర్తయిన తరువాత సమీక్షించి తదుపరి కార్యాచరణ చేపడతామని తెలిపారు. రాజధానికి సాయం: కొత్త రాజధానిలో రోడ్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల వసతుల ఏర్పాటుకు రూ.వెయ్యి కోట్లు విడుదల చేశారు. అలాగే రాజ్‌భవన్ తదితర భవనాల నిర్మాణానికి రూ. 500 కోట్లు విడుదల చేశారు. సీమ, ఉత్తరాంధ్రలకు: వెనకబడిన జిల్లాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు రూ. 350 కోట్లు విడుదల చేశామని, రాష్ట్రంలో అసమానతకు గురైన ప్రాంతాలను అభివృద్ధిచేసేందుకు సాయాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పారిశ్రామికాభివృద్ధి: ఏపీలో నెలకొల్పే పరిశ్రమలకు ఐదేళ్ల పాటు 15 శాతం అదనపు డిప్రిసియేషన్, 15 శాతం క్యాపిటల్ అలవెన్స్ ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు: ప్రాజెక్టు నిర్మాణం వేగవంతానికి నిధుల విడుదలు చేయడంతోపాటు.. 2014-15లో ప్రాజెక్టుకు అయిన వ్యయాన్ని రీయింబర్స్ చేశామని తెలిపారు. గోదావరి పుష్కరాలు: గోదావరి పుష్కరాల ప్రాముఖ్యాన్ని బట్టి వాటికి అవసరమైన పనులు పూర్తయ్యేందుకు వీలుగా రూ.100 కోట్లు విడుదల చేశారు. ఆర్థిక సంఘం గ్రాంట్లు: 13వ ఆర్థిక సంఘం సిఫారసుల ఆధారంగా ఏపీకి ఇవ్వాల్సిన రూ. 3,677.28 కోట్లు విడుదల చేసినట్టు జైట్లీ తెలిపారు. వీటిలో పునరుత్పాదక ఇంధన శక్తికి రూ. 137.66 కోట్లు, అదనపు పర్ఫార్మెన్స్ గ్రాంటు కింద రూ. 59 కోట్లు కూడా ఉన్నాయి. ఇతర నిధులు: చిన్న మొత్తాల పొదుపు ద్వారా రూ.549 కోట్లు, అలాగే సెంట్రల్ సేల్స్ టాక్స్(సీఎస్టీ) పరిహారం కింద రూ. 610 కోట్లు విడుదల చేశారు. ఐసీడీఎస్‌కు అదనంగా రూ.30 కోట్లు విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటికి రూ. 42.6 కోట్లు కేటాయించారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్: ఏపీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వర్తింపజేయడం కేంద్ర పరిశీలనలో ఉందని జైట్లీ తెలిపారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల్లో స్పెషల్ కేటగిరీ, జనరల్ కేటగిరీ రాష్ట్రాల మధ్య వ్యత్యాసం చూపరాదని ఉండడంతో ఏపీకి ఇచ్చిన హామీని, 14 వ ఆర్థిక సంఘం చేసిన సిపారసులను రెండింటి ని బేరీజు వేస్తూ పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న హామీలను, ప్రధాన మంత్రి చేసిన హామీలను నెరవేర్చడంలో మేం పూర్తిగా కట్టుబడి ఉన్నందున త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని జైట్లీ వివరించారు. తెలంగాణ పరిస్థితి ఏంటని ప్రశ్నించగా.. తెలంగాణకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. అసంతృప్తికి కారణమేమీ లేదు: సుజనా, కంభంపాటి కేంద్రం విడుదల చేసిన నిధులపై సంతృప్తిగా ఉన్నారా? అన్న ప్రశ్నకు బదులుగా సుజనాచౌదరి, కంభంపాటి రామ్మోహన్రావు సమాధానమిస్తూ.. తాము దాదాపు రూ. 10 వేల కోట్లు విడుదల చేయించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మొత్తంగా రూ. 8,108 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. అసంతృప్తి ఉండడానికి కారణాల్లేవని బదులిచ్చారు. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31లోపు విడుదలైన నిధుల వివరాలు (రూ. కోట్లలో) 13వ ఆర్థిక సంఘం గ్రాంట్లు 2,377 రెవెన్యూలోటు 2,300 రాజధానికి సాయం 1,500 వెనకబడిన జిల్లాలకు ప్యాకేజీ 350 పోలవరం ప్రాజెక్టు 250 గోదావరి పుష్కరాలు 100 చిన్న మొత్తాల పొదుపు నిధి 549 సీఎస్టీ పరిహారం 610 అదనపు కేంద్ర సాయం 72.60 మొత్తం 8,108.60 -
రెవెన్యూ లోటు కింద ఏపీకి 500 కోట్లు ఇచ్చాం
- ఎంపీలు మేకపాటి, వైవీ, గల్లా ప్రశ్నలకు కేంద్రం సమాధానం సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి రెవెన్యూ లోటు పూడ్చేందుకు తక్షణ సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ప్రత్యేక అభివృద్ధి సాయం కింద 2014-15 నుంచి 2018-19కి రూ.24,350 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు. ‘ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నం దున కేంద్రం నుంచి సాయం అందించాలని ఏపీ ప్రభుత్వం కోరిందా? కోరితే ఎంతమేరకు కేంద్రం సాయం చేసింది? ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రకారం రెవెన్యూ లోటు భర్తీకి ఏం చర్యలు తీసుకుంటున్నారు?’-అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నలకు మంత్రి జయంతి సిన్హా పైవిధంగా లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. కేంద్ర హోం మంత్రి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల కమిటీ ఏపీకి సంబంధించిన 2014-15 రెవెన్యూ లోటు అంశాన్ని పరిశీలిస్తోందని, ప్రాథమికంగా రూ.500 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఇవి కాకుండా మరో రూ.350 కోట్లు ఏపీలోని 7 వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేటాయించినట్టు పేర్కొన్నారు. -
రానున్న ఐదేళ్లలో ఏపీకి రూ. 22,113 కోట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక లోటును భర్తీ చేసుకోడానికి రానున్న ఐదేళ్లలో మొత్తం రూ. 22,113 కోట్లను కేటాయించనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. మొత్తం 11 రాష్ట్రాలు రెవెన్యూ లోటులో ఉన్నాయని ఆయన చెప్పారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించామని, దాని నివేదికను పార్లమెంటులోప్రవేశపెట్టామని వివరించారు. రెవెన్యూ లోటు ఉన్న గ్రామాలకు అదనపు నిధులు కేటాయిస్తామని కూడా చెప్పారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఏప్రిల్ 1 నుంచి అమలవుతాయని వివరించారు. మొత్తం రూ. 1.91 లక్షల కోట్ల రెవెన్యూ లోటు ఉందని అన్నారు. -
కాసులు కురవవేం!
భూక్రమబద్ధీకరణకు స్పందన నామమాత్రమే.. మూడురోజుల్లో ముగియనున్న గడువు సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఆదాయ లోటును భర్తీ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన భూక్రమబద్ధీకరణకు స్పందన అంతంతమాత్రంగానే ఉంది. ప్రభుత్వ స్థలంలో నివాసాలు ఏర్పర్చుకున్న వారికి.. ఆక్రమిత స్థలాన్ని క్రమబద్ధీకరించడంతో పాటు ప్రభుత్వ ఖజానాను పరిపుష్టి చేసుకోవచ్చని భావించిన సర్కారు భూక్రమబద్ధీకరణకు తెరలేపింది. ఈమేరకు 2014 డిసెంబర్ 30న ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం.. ఈ నెల రెండోవారం నుంచి దరఖాస్తు ఫార్మాట్‌ను తయారుచేసి వాటి స్వీకరణకు ఉపక్రమించింది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రానికి 67,294 దరఖాస్తులు రాగా, ప్రభుత్వ ఖజానాకు రూ.2.74కోట్లు మాత్రమే జమ అయ్యాయి. ఉచితానికే ఊపు.. భూక్రమబద్ధీకరణలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రకాల స్లాబులు పెట్టింది. 125 గజాలలోపు స్థలం ఆక్రమించిన వారికి ఉచితంగా క్రమబద్ధీకరించనున్నట్లు ప్రకటించింది. 125 నుంచి 250గజాలలోపు ఆక్రమించిన వారు రిజిస్ట్రేషన్ ధరలో 50 శాతం చెల్లించాలి. అదేవిధంగా 250-500గజాలలోపు వారు 75శాతం, 500 గజాలకు మించి ఆక్రమించిన వారు రిజిస్ట్రేషన్ ధరను చెల్లించాలని సూచించింది. ఇందులో భాగంగా దరఖాస్తు నమూనాను తయారు చేసి.. పూర్తిచేసిన దరఖాస్తులను ఈ నెల రెండో వారం నుంచి స్వీకరిస్తోంది. ఈ నెల 13వతేదీ నాటికి 67,294 దరఖాస్తులు రెవెన్యూ అధికారులకు అందాయి. ఇందులో 67,003 దరఖాస్తులు ఉచిత క్రమబద్ధీకరణకు సంబంధించినవే. 125 గజాలకు మించి ఆక్రమించిన వాటిలో కేవలం 291 దరఖాస్తులు మాత్రమే కావడం గమనార్హం. డివిజన్లవారీగా పరిశీలిస్తే చేవెళ్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో క్రమబద్ధీకరణ కోసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. వికారాబాద్ డివిజన్లో 125గజాలలోపు ఉన్న 5 దరఖాస్తులు అందాయి. అధికంగా మల్కాజిగిరి డివిజన్ నుంచి 43,303 దరఖాస్తులు, సరూర్‌నగర్ డివిజన్ నుంచి 6,846, రాజేంద్రనగర్ డివిజన్ నుంచి 17,140 దరఖాస్తులు వచ్చాయి. 18తో ముగియనున్న గడువు.. ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి దరఖాస్తు గడువు ఈ నెల 18తో ముగియనుంది. అయితే ఇప్పటివరకు 125గజాలకు మించిన కేటగిరీలో వచ్చిన దరఖాస్తులు 291 మాత్రమే ఉండడం యంత్రాగాన్ని ఆందోళనలో పడేసింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఎక్కువ ఆక్రమణలు జిల్లాలోనే ఉండడంతో ప్రభుత్వ ఖజానాకు ఎక్కువ ఆదాయం జిల్లానుంచే వస్తుందని సర్కారు అంచనావేసింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగానికి ప్రధాన బాధ్యతలు అప్పగించినప్పటికీ.. అంచనాలు తలకిందులు కావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు మాట్లాడుతూ దరఖాస్తు గడువును పెంచాలని కోరారు. కనిపించని హడావుడి.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూక్రమబద్ధీకరణపై జిల్లా యంత్రాంగం మాత్రం సాదాసీదాగా వ్యవహరిస్తోంది. ఎలాంటి ప్రచారార్భాటం లేకుండా ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల స్వీకరణకే పరిమితమైంది. క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించడంలో విఫలం కావడమో.. లేక ఆక్రమితులు క్రమబద్ధీకరణపై మక్కువ చూపడంలేకనో... దరఖాస్తుల సంఖ్య మాత్రం భారీగా తగ్గింది. జిల్లాలో రెండులక్షల ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఉచిత కోటాలో 67,003 దరఖాస్తులు రాగా, చెల్లింపుల కోటాలో కేవలం 291 దరఖాస్తులు మాత్రమే అందాయి. వీటికి సంబంధించి డిమాండు డ్రాఫ్ట్(డీడీ)ల రూపంలో సర్కారు ఖజానాకు రూ.2,74,69,414 జమయ్యాయి. 2008లో అప్పటి ప్రభుత్వం అప్పటి రిజిస్ట్రేషన్ విలువతో చేపట్టిన క్రమబద్ధీకరణతో జిల్లా నుంచి రాష్ట్ర ఖజానాకు రూ.15 కోట్లు సమకూరాయి. ఈ క్రమంలో తాజాగా రిజిస్ట్రేషన్ల విలువ రెటింపును మించినప్పటికీ.. కాసులు కురవకపోవడం కొసమెరుపు. డివిజన్ల వారీగా వచ్చిన దరఖాస్తులు.. డివిజన్ 125 125 గజాలకు ఆదాయం గజాలలోపు పైబడినవి (రూ.లలో) రాజేంద్రనగర్ 17,107 33 79,16,793 చేవెళ్ల 0 0 0 వికారాబాద్ 5 0 0 సరూర్‌నగర్ 6,775 71 47,40,222 మల్కాజిగిరి 43,116 187 1,48,12.399 -
లోటు బడ్జెట్ అంటే ఏమిటి?
ప్రభుత్వం అభివృద్ధి వ్యయానికి ఎక్కువగా ఖర్చుపెడితే అది దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. ప్రభుత్వం ఆ కోణంలోనే కృషి చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఇలా కాకుండా అభివృద్ధేతర వ్యయంపై ప్రభుత్వం అధికంగా ఖర్చుపెడితే దీర్ఘకాలంలో ఫలితాలనిచ్చే మూలధన ఆస్తులను తయారు చేసుకునే శక్తి ఆ ప్రభుత్వానికి లేదని ప్రస్ఫుటమవుతుంది. అందుకే ప్రభుత్వం ఈ రెండు రకాల వ్యయానికి సబంధించి సమతౌల్యం పాటించాలి. ప్రభుత్వ వ్యయం - బడ్జెట్ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేసే ఖర్చును ప్రభుత్వ వ్యయం అంటారు. అభివృద్ధి దృష్ట్యా ప్రభుత్వ వ్యయం రెండు రకాలుగా ఉంటుంది. అవి: 1. అభివృద్ధి వ్యయం: సామాజిక, ఆర్థిక అభివృద్ధికి చేసే వ్యయం. 2. అభివృద్ధేతర వ్యయం: పరిపాలన, దేశ రక్షణ, పోలీసు సేవల కోసం పెట్టే ఖర్చు. మూలధన ఆస్తులను రూపొందించడం అనే అంశం దృష్ట్యా ప్రభుత్వం రెండు రకాలుగా వ్యయాలు చేస్తుంది. అవి: 1.రాబడి వ్యయం (రెవెన్యూ వ్యయం): ప్రభుత్వం చేసే రోజువారి ఖర్చు. అంటే సాధారణ పరిపాలన, దేశ రక్షణ, పాఠశాలలు, ఆసుపత్రుల నిర్వహణ, రోడ్లు - భవనాలపై చేసే ఖర్చు, వివిధ రకాల పింఛన్లు మొదలైనవి. 2.మూలధన వ్యయం (క్యాపిటల్ వ్యయం): నీటి పారుదల ప్రాజెక్ట్‌లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, పరిశ్రమలు, జాతీయ రహదారుల నిర్మాణంపై చేసే ఖర్చును మూలధన వ్యయంగా పేర్కొంటారు. యుద్ధ సమయాల్లో దేశ రక్షణ కోసం చేసే వ్యయాన్ని మూలధన వ్యయంగా, సాధారణ సమయాల్లో సైన్యాన్ని పోషించడానికి చేసే ఖర్చును రెవెన్యూ వ్యయంగా పిలుస్తారు. బడ్జెట్ బౌగెట్ అనే ఆంగ్ల పదమే వాడుకలో ‘బడ్జెట్’ గా మారింది. భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. రాజ్యాంగ ప్రకరణ 112లో ‘వార్షిక ఆర్థిక నివేదిక’గా పేర్కొన్నారు. దీన్నే మనం బడ్జెట్‌గా పిలుస్తున్నాం. స్థూలంగా బడ్జెట్ అంటే ఒక నిర్ధారిత కాలానికి రాబోయే ఆదాయం, చేయబోయే వ్యయం గురించి వివరించే కోశ నివేదిక. ప్రభుత్వం ఈ నివేదికను రూపొందించిన తర్వాత శాసనశాఖ ఆమోదం పొందినప్పుడే దానికి చట్టబద్ధత వస్తుంది. దేశ వార్షిక ఆర్థిక నివేదికను కేంద్ర బడ్జెట్ అని, రాష్ట్ర వార్షిక ఆర్థిక నివేదికను రాష్ట్ర బడ్జెట్ అని అంటారు. కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్లో, రాష్ట్ర బడ్జెట్‌ను రాష్ట్ర విధానసభలో ఆమోదిస్తారు. మనదేశంలో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీతో ప్రారంభమై మార్చి 31తో ముగుస్తుంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఫిబ్రవరి నెల చివరి రోజున పార్లమెంట్లో ప్రవేశ పెడతారు. రాష్ట్రాల్లోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘బడ్జెట్ విభాగం’ కేంద్ర బడ్జెట్‌ను రూపొందిస్తుంది. కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ట్రాల బడ్జెట్‌ను కూడా ఈ విభాగమే రూపొందిస్తుంది. భారతదేశంలో రెండు రకాల బడ్జెట్లను రూపొందిస్తారు. అవి: 1. సాధారణ బడ్జెట్ 2. రైల్వే బడ్జెట్ 1921 నుంచి రైల్వే బడ్జెట్‌ను, సాధారణ బడ్జెట్ నుంచి వేరు చేసి విడివిడిగా పార్లమెంట్లో నివేదిస్తున్నారు. ముందుగా రైల్వే శాఖ మంత్రి రైల్వే బడ్జెట్‌ను, ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. బడ్జెట్ ముఖ్యాంశాలు: ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆదాయ వ్యయాలను అంచనా వేస్తూ బడ్జెట్ నిర్మాణం చేస్తుంది. బడ్జెట్ ప్రభుత్వ విధానాలను ప్రతిబింబిస్తుంది. బడ్జెట్లో ఆదాయాన్ని రెవెన్యూ ఆదాయం, మూలధన ఆదాయం అని వేర్వేరుగా వర్గీకరించి పొందుపరుస్తారు. రెవెన్యూ ఆదాయాన్ని తిరిగి పన్ను ద్వారా వచ్చే ఆదాయం, పన్నేతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయమని లెక్కగడతారు. పన్నేతర మార్గాలు అంటే ప్రభుత్వానికి వడ్డీల ద్వారా, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా వచ్చే ఆదాయం. డివిడెండ్లు, డిపాజిట్లు, తపాలా పొదుపు ఖాతాలోని ఆదాయం, భీమా సొమ్ము, కిసాన్ వికాస పత్రాలు, ఇందిరా వికాస పత్రాల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం మొదలైనవి దీని కిందకు వస్తాయి. మూలధన ఆదాయంలో ప్రజల నుంచి ప్రభుత్వం సేకరించిన రుణాలు, రిజర్వ బ్యాంక్ విదేశాల నుంచి, ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకున్న అప్పులు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వెనక్కి తీసుకున్న పెట్టుబడులు, చిన్నమొత్తాల పొదుపు సెక్యూరిటీలు, ప్రావిడెంట్ ఫండ్ సొమ్ము ఉంటాయి. రెవెన్యూ, మూలధన ఆదాయాలను కలిపి మొత్తం ఆదాయాన్ని నిర్ధారిస్తారు. వ్యయాన్ని ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం అని విభజించి లెక్కిస్తారు. ప్రణాళిక వ్యయంలో రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం (క్యాపిటల్ వ్యయం) అని, అదేవిధంగా ప్రణాళికేతర వ్యయంలోనూ రెవెన్యూ, మూలధన వ్యయమని వర్గీకరించి పద్దుల వారిగా నిర్ణయిస్తారు. ప్రణాళిక వ్యయం అంటే ప్రణాళిక సంఘం ప్రతిపాదించిన వ్యయం. ప్రణాళికేతర వ్యయం అంటే ఉద్యోగులకు చెల్లించే జీతాలు, వివిధ రకాల సబ్సిడీలు, గ్రాంట్లు, పెన్షన్లు, ఆర్థిక, సామాజిక భద్రత సేవలు, ప్రభుత్వం రాష్ట్రాలకు - విదేశాలకు ఇచ్చే రుణాలు, ప్రభత్వ రంగ సంస్థలకు, రక్షణ రంగానికి పెట్టే ఖర్చు మొదలైనవి ఉంటాయి. ప్రణాళికేతర వ్యయంలో రెవెన్యూ మూలధన వ్యయాలతోపాటు ప్రభుత్వం తీసుకున్న రుణాలకు చెల్లించే వడ్డీ వ్యయాన్ని కూడా లెక్కిస్తారు. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాన్ని కలిపి మొత్తం వ్యయాన్ని లెక్కగడతారు. 1. సంతులిత బడ్జెట్: ఆదాయ, వ్యయాలు సమానంగా ఉన్న బడ్జెట్. 2. అసంతులిత బడ్జెట్: ఆదాయ, వ్యయాలు అసమానంగా ఉండే బడ్జెట్. 3. మిగులు బడ్జెట్: ఆదాయం కంటే వ్యయం తక్కువగా ఉండే బడ్జెట్. 4. లోటు బడ్జెట్: ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉండే బడ్జెట్. ముఖ్యంగా నాలుగు రకాల లోటు బడ్జెట్లు ఉంటాయి. అవి: రెవెన్యూ లోటు (రాబడిలోటు): ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల్లోని రెవెన్యూ వ్యయాల మొత్తం నుంచి మొత్తం రెవె న్యూ ఆదాయాన్ని తీసివేస్తే వచ్చే లోటునే రెవెన్యూ లోటు అంటారు. రెవెన్యూ ఆదాయం కంటే రెవెన్యూ వ్యయం ఎంత ఎక్కువగా ఉందో ఇది తెలియజేస్తుంది. బడ్జెట్ లోటు: ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల్లోని రెవెన్యూ, మూలధన వ్యయా ల పద్దుల మొత్తం నుంచి మొత్తం ఆదాయాన్ని (రెవెన్యూ+మూలధన ఆదాయం) తీసివేస్తే వచ్చేలోటును బడ్జెట్ లోటు అం టారు. ఇది రెవెన్యూ,మూలధన ఆదాయం కంటే రెవెన్యూ, మూలధన వ్యయం ఎంత ఎక్కువగా ఉందో సూచిస్తుంది. ప్రభుత్వం రిజర్వ బ్యాంక్‌కు జారీ చేసే ట్రేజరీ బిల్లుల ద్వారా ఈ లోటు నుంచి గట్టెక్కుతుంది. ద్రవ్యలోటు: బడ్జెట్ లోటుకు మూలధన ఆదాయంలో పేర్కొన్న ప్రభుత్వం తీసుకు న్న రుణాలను కలిపితే వచ్చే లోటును ద్ర వ్యలోటు అంటారు. దీన్నే విత్తలోటు/ కోశలోటు అని కూడా అంటారు. అంటే మొ త్తం ఆదాయం నుంచి ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా తీసుకున్న రుణాలను తీసివేయగా నిల్వ ఉన్న ఆదాయాన్ని ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల్లోని రెవెన్యూ, మూ లధన వ్యయాల మొత్తం నుంచి తీసివేస్తే వచ్చేలోటు. ప్రభుత్వానికి ఎంత రుణం అవసరమో ఈ లోటు తెలియజేస్తుంది. {పాథమిక లోటు: ద్రవ్యలోటు నుంచి ప్రణాళికేతర వ్యయంలోని ప్రభుత్వం తీసుకున్న రుణాలకు ప్రభుత్వం చెల్లించే వడ్డీని తీసివేస్తే వచ్చేలోటును ప్రాథమిక లోటు అంటారు. లోటు బడ్జెట్ వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. అయినప్పటికీ ప్రస్తుతం భారతదేశంలో లోటు బడ్జెట్ అనేది అతి సాధారణమైంది. ఈ లోటును భర్తీ చేసేందుకు ప్రభుత్వం నూతన పన్నులను విధించడం, పన్నురేట్లను పెంచడం చేస్తుంది. మాదిరిప్రశ్నలు 1. రైల్వే బడ్జెట్‌ను పార్లమెంట్లో ఎవరు ప్రవేశ పెడతారు? 1) రైల్వేశాఖ మంత్రి 2) రైల్వే బోర్డ చైర్మన్ 3) లోక్‌సభ స్పీకర్ 4) ప్రధానమంత్రి 2. రాబడి కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటే అది ఏ రకమైన బడ్జెట్? 1) సంతులిత 2) సమతుల్య 3) మిగులు 4) లోటు 3. ఆర్థికశాఖ మంత్రి సాధారణంగా ఏ రోజున పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు? 1) మార్చి 1 2) ఫిబ్రవరి 28 3) మార్చి మొదటి రోజు 4) ఫిబ్రవరి చివరి రోజు 4. బడ్జెట్ అంటే? 1) {పభుత్వ రాబడి, ఖర్చును వివరించే నివేదిక 2) {పభుత్వ ఆదాయం, మూలధనాన్ని అంచనా వేసే పత్రం 3) ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను అంచనా వేసి వివరించే పత్రం 4) ఒక నిర్దిష్ట సంవత్సరానికిగాను ప్రభు త్వ నిధులను అంచనా వేసే నివేదిక 5. బాండ్ల విక్రయం ద్వారా ప్రభుత్వం పొందిన ఆదాయాన్ని బడ్జెట్లో ఏ పద్దు కింద జమచేస్తారు? 1) రెవెన్యూ ఆదాయం 2) రాబడి చెల్లింపులు 3) ప్రణాళిక ఆదాయం 4) మూలధన ఆదాయం 6. ‘సర్చార్జ’ అంటే? 1) వ్యయాలను పూడ్చుకోవడానికి కావాల్సిన అదనపు ఆదాయాన్ని పొందడానికి విధించే తాత్కాలిక పన్ను 2) వ్యయాలను పూడ్చుకోవడంలో భాగంగా ప్రభుత్వం విధించే అదనపు పన్ను 3) అదనపు ఆదాయం సంపాదనలో భాగంగా ప్రభుత్వం పన్నురేటును పెంచి వసూలు చేయడం 4) అదనపు సేవలకు విధించే అదనపు పన్ను 7. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వ్యయంలో అధికశాతం ఆక్రమిస్తున్న అంశం? 1) సబ్సిడీలు 2) ఉద్యోగుల జీతభత్యాలు 3) రక్షణ రంగం 4) తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీలు 8. లోటు ద్రవ్య విధానం అంటే? 1) ద్రవ్యలోటు ఏర్పడకుండా జాగ్రత్త పడటం 2) మూలధన వ్యయాన్ని తగ్గించుకోవడం 3) ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలను తగ్గించి ఆదాయాన్ని పెంచుకోవడం 4) ఆదాయం కంటే అధికంగా ఖర్చు చేయడం 9. పబ్లిక్ బారోయింగ్ అంటే? 1) ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రభుత్వం అప్పు తీసుకోవడం 2) ప్రజల నుంచి ప్రభుత్వం రుణాలు తీసుకోవడం 3) ప్రభుత్వం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం 4) విదేశాల నుంచి కాకుండా ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకోవడం 10. ప్రభుత్వం చేసే రోజువారి ఖర్చును ఏ వ్యయం అంటారు? 1) రెవెన్యూ వ్యయం 2) మూలధన వ్యయం 3) అభివృద్ధి వ్యయం 4) అభివృద్ధేతర వ్యయం సమాధానాలు: 1) 1; 2) 4; 3) 4; 4) 3; 5) 4; 6) 1; 7) 4; 8) 4; 9) 2; 10) 1. గతంలో అడిగిన ప్రశ్నలు 1. యుద్ధ సమయాల్లో దేశ రక్షణ కోసం చేసే వ్యయాన్ని ఏమంటారు? (ఎస్ఐ - 2012) 1) రెవెన్యూ వ్యయం 2) మూలధన వ్యయం 3) అభివృద్ధి వ్యయం 4) అనుత్పాదిత వ్యయం 2. ‘బడ్జెట్’ అనే పదాన్ని ఏ భాష నుంచి తీసుకున్నారు? (జైల్ వార్డర్ - 2011) 1) స్పానిష్ 2) ఫ్రెంచ్ 3) లాటిన్ 4) ఇంగ్లిష్ 3. రాజ్యాంగంలో బడ్జెట్‌ను ఏవిధంగా ప్రస్తావించారు? (డిప్యూటీ జైలర్‌స - 2011) 1) ఆదాయ వ్యయాల నివేదిక 2) ఆదాయ వ్యయాల వార్షిక నివేదిక 3) వార్షిక ఆర్థిక నివేదిక 4) ఆదాయ వ్యయాల అంచనాల వార్షిక నివేదిక 4. {దవ్యలోటును కిందివిధంగా కూడా పిలుస్తారు? (పోలీస్ కానిస్టేబుల్ - 2009) 1) రెవెన్యూలోటు 2) ప్రాథమిక లోటు 3) విత్తలోటు 4) బడ్జెట్ లోటు సమాధానాలు: 1) 2; 2) 4; 3) 3; 4) 3. -
రాజధాని ఎక్కడ నిర్మిస్తారు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్రం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారు? అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపడతారు? ఆ నిర్మాణాలకు ఎంత వ్యయం అవుతుంది? తదితర అంశాలకు సంబంధించి ప్రతిపాదనలను పంపాల్సిందిగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. నూతన రాజధానికి, రెవిన్యూ లోటు భర్తీకి నిధులు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంప్రదించిన మీదట కేంద్రం పై సమాధానం ఇచ్చింది. అసలు రాజధాని ఎక్కడ నిర్మిస్తారో తేల్చకుండా నిధులులెలా ఇస్తామని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను పంపిస్తే.. ఆ మేరకు ఎన్ని నిధులు ఇవ్వాలో నిర్ధారించి మంజూరు చేస్తుందని కేంద్రప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. ప్రతిపాదనలను త్వరగా పంపిస్తే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయిం పులను సవరించి నిధులను ఇస్తుందని రాష్ట్ర అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
'బాబు వల్లే రూ.22వేల కోట్ల రెవెన్యూ లోటు'
హైదరాబాద్: రాష్ట్రాన్ని తానే అభివృద్ధి చేశానంటూ చంద్రబాబు నాయుడు ప్రగల్భాలు పలుకుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సోమయాజులు విమర్శించారు. ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువని చంద్రబాబు భావిస్తున్నట్టున్నారని అన్నారు. తన హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచిన విషయం మరిచారా అంటూ ప్రశ్నించారు. కరెంట్ ఛార్జీలు పెంచినందుకే ఏ ఎన్నికల్లో కూడా గెలవడం లేదనే అంశాన్ని బాబు గుర్తించుకోవాలన్నారు. చంద్రబాబు వల్లే ప్రభుత్వానికి రూ.22వేల కోట్లు రెవెన్యూ లోటు వచ్చిందని గుర్తు చేశారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు సహనం కోల్పోయి, తీవ్రవత్తిడికి లోనవడంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని సోమయాజులు అంతకుముందు అన్నారు.