ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్రం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారు? అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపడతారు? ఆ నిర్మాణాలకు ఎంత వ్యయం అవుతుంది? తదితర అంశాలకు సంబంధించి ప్రతిపాదనలను పంపాల్సిందిగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. నూతన రాజధానికి, రెవిన్యూ లోటు భర్తీకి నిధులు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంప్రదించిన మీదట కేంద్రం పై సమాధానం ఇచ్చింది.
అసలు రాజధాని ఎక్కడ నిర్మిస్తారో తేల్చకుండా నిధులులెలా ఇస్తామని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను పంపిస్తే.. ఆ మేరకు ఎన్ని నిధులు ఇవ్వాలో నిర్ధారించి మంజూరు చేస్తుందని కేంద్రప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. ప్రతిపాదనలను త్వరగా పంపిస్తే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయిం పులను సవరించి నిధులను ఇస్తుందని రాష్ట్ర అధికారులు అభిప్రాయపడుతున్నారు.
రాజధాని ఎక్కడ నిర్మిస్తారు?
Published Wed, Oct 22 2014 1:57 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement