
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయింది. ఉపాధి హామీ నిధుల చెల్లింపుల అంశంపై మంగళవారం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. 2014 నుంచి 2019 వరకు చెల్లింపులకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని గతంలో కేంద్రానికి హైకోర్టు ఆదేశింది. ఈ క్రమంలో కేంద్రం ఇప్పటివరకు అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
వారంరోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈనెల 17లోపు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అఫిడవిట్ దాఖలు చేయకపోతే బాధ్యులకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హైకోర్టు హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment