సాక్షి, అమరావతి: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం తన అఫిడవిట్‌లో పలు కీలక అంశాలను పొందుపరిచింది. స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదని, అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తామని పేర్కొంది. ఉద్యోగులు స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దనడం సరికాదని తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేబినెట్ నిర్ణయం తీసుకుందని, స్టీల్‌ప్లాంట్‌ను 100శాతం ప్రైవేటీకరణ చేస్తామని అఫిడవిట్‌లో చెప్పింది. ఇప్పటికే బిడ్డింగ్‌లు ఆహ్వానించామని పేర్కొంది. అదే విధంగా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై పిల్ వేసిన జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఎన్నికల్లో పోటీచేశారని, రాజకీయ లబ్ధి కోసమే ఆయన పిటిషన్ వేశారని తెలిపింది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని కేంద్రం ప్రభుత్వం ఏపీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment