హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక సహాయం అందజేసింది. రెవెన్యూ లోటు కింద రూ. 1,176 కోట్ల నిధులను కేంద్రం ఏపీకి విడుదల చేసిందని కేంద్రమంత్రి సుజనా చౌదరి గురువారం వెల్లడించారు. వెనుకబడిన జిల్లాలకు రూ. 350 కోట్లు, రాజధాని అభివృద్ధికి రూ. 450 కోట్లు విడుదల చేసినట్టు ఆయన తెలిపారు.
రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ సరైన ఆదాయం లేక ఆర్థిక లోటు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తగిన ఆర్థిక సాయం చేసి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రాన్ని ప్రభుత్వం కోరుతోంది. అయినా, కేంద్ర ప్రభుత్వం అరకొర సహాయం మాత్రమే చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి.
ఏపీకి రూ. 1,176 కోట్ల ఆర్థిక సహాయం!
Published Thu, Aug 18 2016 1:55 PM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM
Advertisement