centre govt
-
ఉచిత హామీలపై ఈసీ, కేంద్రానికి సుప్రీం నోటీసులు
-
వంటనూనెల రేట్లు పెంచొద్దు
న్యూఢిల్లీ: ఇటీవల దిగుమతి సుంకాలు పెంచినప్పటికీ రిటైల్ ధరలను (ఎంఆర్పీ) పెంచొద్దంటూ వంటనూనెల కంపెనీలకు కేంద్ర ఆహార శాఖ సూచించింది. తక్కువ సుంకాలతో దిగుమతి చేసుకున్న ఆయిల్స్‌ను ఉపయోగించుకోవాలని పేర్కొంది. ఇలా దిగుమతి చేసుకున్న నూనెల నిల్వలు 30 లక్షల టన్నుల మేర ఉంటాయని, అవి 45–50 రోజులకు సరిపోతాయని వివరించింది.సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అసోసియేషన్ (ఎస్ఈఏ), ఇండియన్ వెజిటెబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐవీపీఏ) తదితర సంస్థల ప్రతినిధులతో ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా భేటీ అనంతరం ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో ఈ విషయాలు పేర్కొంది.దేశీయంగా నూనెగింజల ధరలకు మద్దతు కల్పించే దిశగా కేంద్రం గత వారం వివిధ రకాల వంటనూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పెంచింది. సెప్టెంబర్ 14 నుంచి అమల్లోకి వచ్చిన ఆదేశాల ప్రకారం ముడి సోయాబీన్ ఆయిల్, ముడి పామాయిల్ మొదలైన వాటిపై డ్యూటీ సున్నా స్థాయి నుంచి 20 శాతానికి పెరిగింది. ఇతరత్రా అంశాలన్నీ కూడా కలిస్తే ముడి నూనెలపై ఇది 27.5 శాతంగా ఉంటుంది.మరోవైపు, రిఫైన్డ్ పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ మొదలైన వాటిపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 12.5 శాతం నుంచి 32.5 శాతానికి, నికరంగా 37.5 శాతానికి పెరిగింది. భారత్ పామాయిల్‌ను మలేషియా, ఇండొనేషియా నుంచి, సోయాబీన్ ఆయిల్‌ను బ్రెజిల్, అర్జెంటీనా నుంచి, సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ప్రధానంగా రష్యా, ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. -
పాన్-ఆధార్ లింక్ ఆలస్యం.. కేంద్రానికి ఊహించనంత ఆదాయం!
నిర్ణీత గడువు లోపు ఆధార్ - పాన్ లింక్ చేయని వినియోగదారుల నుంచి కేంద్రం పెనాల్టీల రూపంలో సుమారు రూ. 600 కోట్లు వసూలు చేసింది. అయినప్పటికీ ఆధార్ - పాన్ లింక్ చేయని వారు 11.48 కోట్ల మంది ఉండగా.. వారందరూ బయోమెట్రిక్ ఐడెంటిటీని పూర్తి చేయలేదని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఆధార్ - పాన్ లింక్‌పై లోకసభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. క్వశ్చన్ అవర్‌లో కేంద్రం ఉచితంగా ఆధార్ - పాన్ లింక్ చేసుకునేందుకు జూన్ 30,2023కి చివరి తేదీగా నిర్ణయించింది. గడువు తేదీ ముగిసిన తర్వాత ఎవరైతే ఆధార్ - పాన్ లింక్ చేయాలనుకుంటారో వాళ్లు తప్పని సరిగా అదనపు రుసుము కింద రూ.1000 చెల్లించి అప్డేట్ చేసుకోవచ్చు. అయితే గడువు ముగిసిన తర్వాత అంటే జులై 1,2023 నుంచి జనవరి 31,2024 వరకు ఆధార్ - పాన్ లింక్ కోసం వినియోగదారుల నుంచి అదనపు రుసుము కింద రూ. 601.97 కోట్లు వసూలు చేసినట్లు వివరణ ఇచ్చారు. ట్యాక్స్ పేయిర్స్కి డెడ్ లైన్ ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు పన్ను చెల్లింపు దారులకు ఆధార్ - పాన్ లింక్‌పై పలు సూచనలు చేశారు. జులై1,2023 వరకు ఆధార్- పాన్ లింక్ చేయని పక్షంలో వారి పాన్ కార్డ్ బ్లాక్ అవుతుందని, ఒకవేళ ఆదాయపు పన్ను చెల్లింపులు చేసినా ఫండ్ రిఫండ్ చేయమని స్పష్టం చేసింది. అంతేకాదు టీడీఎస్, టీసీఎస్ సైతం అధిక మొత్తంలో ట్యాక్స్ పేయిర్స్ నుంచి వసూలు చేస్తామని స్పష్టం చేసింది. ఒకవేళ పాన్ కార్డ్ మళ్లీ పునరుద్దరించాలంటే లేట్ ఫీ కింద రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని ఆ సందర్భంలో ట్యాక్స్ పేయిర్లకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు వివరించారు. -
జమ్ములో ఎన్నికల నిర్వహణకు సిద్ధం: కేంద్రం
జమ్ములో ఎన్నికల నిర్వహణకు సిద్ధం: కేంద్రం -
ఆయన్ని ఎలా నియమించారు?.. కేంద్రం తీరుపై సుప్రీం అసహనం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంలో సభ్యుల నియామకాల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు.. బుధవారం మరో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం కోసం కొలీజియంలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా.. నవంబర్ 19వ తేదీన రిటైర్డ్ బ్యూరోక్రాట్ అరుణ్ గోయల్‌ను కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించడంపై పలు సందేహాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో.. ఆయన నియామకానికి సంబంధించిన దస్త్రాలను తమకు సమర్పించాలని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. కేంద్రాన్ని ఆదేశించింది. జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. స్వచ్ఛంద పదవీ విరమణ ఇచ్చిన వెంటనే ఆయన్ని ఎన్నికల విభాగానికి కమిషనర్‌పై నియమించడంపై కేంద్రాన్ని సూటిగా నిలదీసింది. గురువారం వరకు సెక్రెటరీ లెవల్ ఆఫీసర్‌గా అరుణ్ గోయెల్ ఉన్నారని, శుక్రవారం ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారని, ఆ వెంటనే ఆయన్ని ఎన్నికల కమిషనర్‌గా నియమించారని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ బెంచ్‌కి వివరించారు. ఒకవేళ ఈసీగా ఆయనకు అవకాశం దక్కకపోయి ఉంటే.. డిసెంబర్లో ఆయన రిటైర్మెంట్ అయ్యే వారని తెలిపింది. ఆపై కేంద్రం తరపున అటార్నీ జనరల్ వాదనలు వినిపిస్తూ.. నియామకం సక్రమంగా జరిగిందని చెప్పే యత్నం చేశారు. ఈ క్రమంలో.. జోక్యం చేసుకున్న బెంచ్.. ఏజీ వాదనను తోసిపుచ్చింది. రాజ్యాంగ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమకు అనుకూలంగా ఉండే వ్యక్తిని.. సీఈసీగా నియమిస్తుందంటూ అసహనం వ్యక్తం చేసింది బెంచ్. ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీ ప్రభావం నుంచి దూరంగా ఉండాలని, ప్రధాన ఎన్నికల అధికారి నియామక కమిటీలో సీజేఐను చేర్చాలని సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పని చేయాలి. ప్రధాని లాంటి వ్యక్తిపై ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకునేంత పారదర్శకత కమిషన్ సభ్యుల్లో ఉండాలి అని పేర్కొంది. ఒకవైపు సీఈసీ, ఈసీల నియామక పిటిషన్లపై కోర్టులో విచారణ జరుగుతుండగా.. ఆయన్ని(అరుణ్ గోయల్) ఎలా నియమించారంటూ కేంద్రాన్ని నిలదీసింది. అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను తమకు సమర్పించాలని కోరిన బెంచ్.. విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
కేంద్రంలో 9 లక్షల ఉద్యోగ ఖాళీలు.. విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలలో మొత్తం 9,79,327 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సిబ్బంది, ప్రధాన మంత్రి కార్యాలయ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం కింద పనిచేసే పే రీసెర్చి వార్షిక నివేదిక ప్రకారం ఈ ఏడాది మార్చి 1 నాటికి కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో 9 లక్షల 79 వేల ఉద్యోగ ఖాళీలు ఏర్పడినట్లు తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్‌తో సహా వివిధ రాష్ట్రాలలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయడం లేదని చెప్పారు. చదవండి: ఏపీలో 5876 మంది చిరు వ్యాపారులకు పెన్షన్ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో ఏర్పడే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత ఆయా మంత్రిత్వ శాఖలదే. అదో నిరంతరం ప్రక్రియ. ఉద్యోగుల రిటైర్మెంట్, ప్రమోషన్, రాజీనామా, మరణం వంటి కారణాలతో ఖాళీలు ఏర్పడతాయని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడే ఉద్యోగ ఖాళీలన్నింటినీ నిర్దిష్ట కాల పరిమితిలోగా భర్తీ చేయాలని ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాలను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. -
Telangana: వరద నష్టం రూ.1400 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రానికి రూ.1,400 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనా నివేదికను కేంద్రానికి పంపించింది. తక్షణ సాయంగా రూ.1,000 కోట్లను విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. శాఖలవారీగా జరిగిన నష్టాలను నివేదికలో పొందుపర్చింది. కాజ్‌వేలు, రోడ్లు కొట్టుకుపోవడం తదితర కారణాలతో రోడ్లు, భవనాల శాఖకు రూ.498 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.449 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.33 కోట్లు. పురపాలక శాఖకు రూ.379 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.7 కోట్ల నష్టం వాటిల్లినట్టు వివరించింది. భారీ వర్షాలు, వరదలతో ఇళ్లు కూలిపోవడంతో పునరావాసం కల్పిండానికి రూ.25 కోట్ల వ్యయమైనట్టు నివేదికలో పేర్కొంది. -
మీ అప్పుల కతేంది?.. కేంద్రాన్ని నిలదీత
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీలంకలో రాజకీయ, ఆర్ధిక సంక్షోభంపై చర్చించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం కాస్త అధికార బీజేపీ, బీజేపేతర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి వేదికగా మారింది. శ్రీలంక ఆర్ధిక పరిస్థితులకు మితిమీరన అప్పులే కారణమన్న కేంద్రం, ఆ క్రమంలో పలు రాష్ట్రాలు చేస్తున్న అప్పులను ప్రస్తావించడం ఉద్రిక్తతకు దారి తీసింది. కేంద్రం తీరును బీజేపీయేతర పక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. శ్రీలంక సంక్షోభంపై చర్చకని పిలిచి రాష్ట్రాల అప్పులను చర్చకు పెడతారా అంటూ ధ్వజమెత్తాయి. ముందుగా కేంద్రం చేస్తున్న అప్పుల లెక్కలు చెప్పాలంటూ గట్టిగా నిలదీశాయి. దాంతో వాతావరణం వేడెక్కింది. శ్రీలంక సంక్షోభంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అధ్యక్షతన మంగళవారం అఖిలపక్ష భేటీ నిర్వహించారు. కాంగ్రెస్, టీఎంసీ, టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, డీఎంకే సహా అన్ని విపక్షాలు పాల్గొన్నాయి. శ్రీలంక ప్రస్తుత పరిస్థితులు, మనపై దాని ప్రభావం, లంకకు భారత సాయం తదితరాలపై జైశంకర్ వివరించారు. లంక ఆర్ధిక, రాజకీయ సంక్షోభానికి కారణాలు, పర్యావసానాలు, దివాలాకు కారణమైన అప్పులపై విదేశాంగ కార్యదర్శి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పెరిగిన అప్పులతో తిప్పలు, ద్రవ్యోల్బణం తదితరాలను ప్రస్తావించారు. ఆ వెంటనే పలు రాష్ట్రాల అప్పులపై కేంద్రం ఆర్ధిక శాఖ కార్యదర్శి ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాలను ప్రస్తావించారు. బీజేపీయేతర పార్టీల పాలనలోని రాష్ట్రాల అప్పులనే ప్రస్తావించడంతో భేటీ ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణ అప్పులను ప్రస్తావించడాన్ని టీఆర్ఎస్ ఉభయ సభాపక్ష నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘భేటీ ఉద్దేశమేమిటి? మీరు మాట్లాడున్నదేమిటి?’’ అంటూ తూర్పారబట్టారు. ‘‘తెలంగాణ జీఎస్డీపీని 25 శాతంగా నిర్ణయిస్తే చేసిన అప్పులు 23 శాతం మాత్రమే. కేంద్రం మాత్రం 40 శాతంగా జీస్‌డీపీ నిర్ణయిస్తే ఏకంగా 60 శాతం అప్పులు చేసింది’’ అంటూ దుయ్యబట్టారు. దేశ అప్పులు 2013–14 దాకా రూ.57 లక్షల కోట్లుంటే మోదీ హయాంలో ఏకంగా మరో రూ.100 లక్షల కోట్లు అప్పులు చేశారు’’ అంటూ గణాంకాలు తీశారు. ముందు కేంద్రం చేసిన అప్పులపై మాట్లాడి ఆ తర్వాతే రాష్ట్రాల అప్పులను ప్రస్తావించాలన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని చెప్పారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే ధోరణితో కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఏపీ అప్పులను ప్రస్తావించడాన్ని వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి కూడా తీవ్రంగా తప్పుపట్టారు. -
‘మరమ్మతు హక్కుల’ నిబంధనలపై కసరత్తు
న్యూఢిల్లీ: వినియోగదారులకు ఉత్పత్తులను స్వయంగా లేదా థర్డ్ పార్టీల ద్వారా మరమ్మతు చేయించుకునే హక్కులను (రైట్ టు రిపేర్) కల్పించడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన నిబంధనలను రూపొందించేందుకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ జులై 13న తొలిసారిగా భేటీ అయింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ విషయాలు తెలిపింది. రిపేర్లు, విడిభాగాల విషయంలో కంపెనీలు ఏ విధంగా గుత్తాధిపత్యం చలాయిస్తున్నాయనేది కమిటీ .. సమావేశంలో చర్చించింది. ప్రధానంగా వ్యవసాయ పరికరాలు, మొబైల్ ఫోన్లు/ట్యాబ్లెట్లు, వినియోగ వస్తువులు, కార్ల వంటి ఆటోమొబైల్స్/ఆటోమొబైల్ పరికరాల రంగాల్లో ఇలాంటి ధోరణులను పరిశీలించింది. సాధారణంగా కంపెనీలు తమ ఉత్పత్తుల మరమ్మతుకు తాము తయారు చేసే పరికరాలే వాడాలని, తమ దగ్గరే రిపేరు చేయించుకోవాలని .. థర్డ్ పార్టీలు లేదా సొంతంగా మరమ్మతు చేసుకుంటే వారంటీలు పనిచేయవంటూ షరతులు పెడుతుంటాయి. అలాగే పలు సంస్థలు ఉద్దేశపూర్వకంగా .. కొంత కాలానికి మాత్రమే పనిచేసేలా ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. ఆ తర్వాత అవి రిపేరుకు కూడా పనికి రాకుండా పోవడం వల్ల కస్టమర్లు మళ్లీ కొత్తవి కొనుక్కోవాల్సి వస్తోంది. ఫలితంగా పాతవి వ్యర్ధాల కింద మారుతున్నాయి. ఇలాంటి నియంత్రణలు, గుత్తాధిపత్య ధోరణులు .. వినియోగదారుల హక్కులకు భంగం కలిగించేవేనని ప్రభుత్వ కమిటీ అభిప్రాయపడింది. సమస్యలు వస్తే ఎలా రిపేరు చేసుకోవాలి, వేటిని ఉపయోగించాలి లాంటి విషయాల గురించి కస్టమర్లకు కంపెనీలు తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇందుకోసం థర్డ్ పార్టీలు, వ్యక్తులకు ఆయా సాధనాలను అందుబాటులో ఉంచాలని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. రైట్ టు రిపేర్ వల్ల వ్యర్ధాలను కూడా తగ్గించవచ్చని పేర్కొన్నారు.ప్రస్తుతం అమెరికా, బ్రిటన్ సహా యూరోపియన్ యూనియన్‌లోని పలు దేశాలు’ రైట్ టు రిపేర్’ని గుర్తించాయి. -
అగ్నిపథ్ నిరసనలపై స్పందించిన కేటీఆర్
హైదరాబాద్: సికింద్రాబాద్ ‘అగ్నిపథ్’ నిరసనలతో బీజేపీపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వన్ ర్యాంక్-వన్ పెన్షన్ నుంచి ఆర్మీని ఇవాళ నో ర్యాంక్ –నో పెన్షన్ స్థాయికి దిగజార్చిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్, కేంద్రంపై మండిపడ్డారు. ‘‘జై జవాన్-జై కిసాన్ అని నినదించిన ఈ దేశంలో.. మెన్నటిదాకా నల్ల రైతుచట్టాలతో రైతులను గోసపుచ్చుకుంది కేంద్రం. ఇప్పుడు అదే విధానంతో జవాన్లను నిర్వేదంలోకి నెడుతోంది. వన్ ర్యాంక్-వన్ పెన్షన్ నుంచి ఆర్మీని ఈ రోజు నో ర్యాంక్ –నో పెన్షన్ స్థాయికి దిగజార్చిందని కేంద్రంపై కేటీఆర్ మండిపడ్డారు. ..దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న యువత ఆగ్రహానికి ఆందోళనలకు కేంద్రానిదే పూర్తి బాధ్యత. భారతదేశం ప్రజాస్వామ్య దేశం అనే విషయాన్ని మరిచి ఏకపక్షంగా, నియంతృత్వం మాదిరి ఎలాంటి చర్చలు లేకుండా కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ప్రజలకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి. రైతులను సంప్రదించకుండా నల్ల చట్టాలు, వ్యాపారులను సంప్రదించకుండా జీఎస్టీ.. అలాగే దేశపౌరుల బాధలను పరిగణలోకి తీసుకోకుండా డీమానిటైజేషన్, లాక్డౌన్, మైనార్టీలతో చర్చించకుండా సిఏఏ లాంటి నిర్ణయాలు తీసుకొని.. దేశాన్ని సంక్షోభంలోకి నెట్టింది కేంద్రంలోని నియంతృత్వ బీజేపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రతిపాదించిన అగ్నిపథ్ పథకం పున సమీక్ష చేయాలి అని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. The violent protests against #AgniveerScheme is an eye-opener & acute indicator of the magnitude of unemployment crisis in the country Pehle Desh ke Kisan Ke Saath खिलवाड़ Aur Ab Desh ke Jawan Ke Saath खिलवाड़ From One Rank - One Pension to proposed No Rank - No Pension! — KTR (@KTRTRS) June 17, 2022 Congress is trying to politicise by spreading false news. The Firing at Secunderabad Railway station on protesting Youth was by Railway Police Force and not Telangana Police. Request Congress not to resort to cheap politics on the sentiments of youngsters#AgnipathScheme pic.twitter.com/25hNQE1TiY — krishanKTRS (@krishanKTRS) June 17, 2022 -
మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించలేం: కేంద్రం
న్యూఢిల్లీ: మారిటల్ రేప్ (వైవాహిక అత్యాచారం)ను నేరంగా పరిగణించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. 'భారత్‌లో మారిటల్ రేప్ నేరంగా పరిగణించలేం. ఎందుకంటే దేశంలో అక్షరాస్యత, మెజారిటీ మహిళలకు ఆర్థిక స్వావలంబన లేకపోవడం, సమాజ దృష్టికోణం, పేదరికం, విభిన్నత వంటి అనేక సమస్యలు ఉన్నాయి' అని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ విషయంలో పాశ్చాత్య దేశాలను భారత్ గుడ్డిగా అనుసరించబోదని తెలిపింది. కేంద్రం తరఫున అడ్వకేట్ మోనికా అరోరా ఈ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. సత్వర ట్రిపుల్ తలాఖ్ విషయంలో మహిళలకు అనుకూల వైఖరిని కేంద్రం తీసుకోవడంతో ఈ విషయంలోనూ అనుకూల వైఖరిని తీసుకుంటుందని భావించారు. మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించడం లింగ సమన్వత్యంలో కీలక ముందడుగుగా భావించారు. కానీ కేంద్రం ఈ విషయంలో భిన్నమైన వైఖరిని తీసుకుంది. మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించే ముందు ఏది మారిటల్ రేప్, ఏది నాన్ మారిటల్ రేప్ అన్నది స్పష్టంగా నిర్వచించాల్సిన అవసరముందని అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. 'ఒక వ్యక్తి తన భార్యతో చేసే శృంగార చర్యలన్నీ మారిటల్ రేప్ కింద పరిగణిస్తే.. ఏకపక్షంగా భార్య చెప్పిన విషయాల ఆధారంగా తీర్పు ఇవ్వాల్సి వస్తుంది' అని పేర్కొంది. సాక్ష్యాల విలువను గుర్తించడం ఈ విషయంలో ప్రధాన సమస్యగా మారుతుందని తెలిపింది. అంతేకాకుండా వివాహ వ్యవస్థను మారిటల్ రేప్ అస్థిరపరిచే అవకాశముందని కేంద్రం అభిప్రాయపడింది. -
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచాలంటే 170 (3) అధికరణకు సవరణలు చేయాల్సిందేనని, మరో దారి లేదని కేంద్రం స్పష్టం చేసింది. అసెంబ్లీ స్థానాల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రతిపాదనలొచ్చాయా అని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మంగళవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 170 (3) అధికరణ ప్రకారం 2026 తర్వాత జనాభా లెక్కల వివరాల తర్వాతే సీట్ల పెంపు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. 170 (3) అధికరణ సవరణతోనే అసెంబ్లీ స్థానాల పెంపు సాధ్యమవుతుందని అటార్నీ జనరల్ కూడా న్యాయ శాఖకు ఇదే సలహా ఇచ్చారని పేర్కొన్నారు. కాగా, అసెంబ్లీ సీట్ల పెంపు విషయంపై కేంద్ర హోంశాఖలో కేబినెట్ నోట్ తయారవుతోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. అసెంబ్లీ సీట్ల పెంపు ఉండబోదని వస్తున్న వార్తలపై వెంటనే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో మాట్లాడి ఈ మేరకు ఓ ప్రకటనలో స్పష్టతనిచ్చారు. పాత జిల్లాల ప్రకారమే పునర్విభజన చేపట్టండి: ఈసీని కోరిన టీటీడీపీ నేతలు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014 ప్రకారం తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనను పాత జిల్లాల ప్రాతిపదికన చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ టీడీపీ నేతలు కోరారు. కొత్త జిల్లాల ప్రకారం పునర్విభజన చేస్తే దళితులు, గిరిజనులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ మేరకు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, కార్యనిర్వాహక అ«ధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ గరికపాటి మోహన్‌రావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం ఢిల్లీలో ఎన్నికల కమిషనర్ ఓంప్రకాశ్ రావత్‌తో భేటీ అయి వినతిపత్రాన్ని సమర్పించారు. తెలంగాణలో అధికార పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని, పార్టీలని టీఆర్ఎస్లో విలీనం చేస్తూ స్పీకర్ బులెటిన్ విడుదల చేయడం అశాస్త్రీయమని వివరించారు. రాష్ట్రంలో జిల్లాల విభజనను రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా చేసిందన్నారు. ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించండి... పార్టీ ఫిరాయించిన 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరినట్టు రమణ మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ, వైఎస్సార్సీపీ, బీఎస్పీ, సీపీఎం పార్టీలను టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టు స్పీకర్ బులెటిన్ విడుదల చేయడం అశాస్త్రీయమని, ఈ విషయంలో పూర్తి అధికారం ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్‌ను కోరినట్టు చెప్పారు. -
వెంకయ్యా... ఇప్పుడేమంటావయ్యా
అమరావతి: కేంద్ర ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసినంత మాత్రాన రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా అంశాన్ని మరిచిపోరని ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి నేతలు కె.రామకృష్ణ, చలసాని శ్రీనివాస్ అన్నారు. ఈ విషయంలో కేంద్రం తీరుతో గాయపడిన హృదయాలు ఇంకా బాధపడుతున్నాయని పేర్కొన్నారు. గురువారమిక్కడ వారు విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఘనత తమదేనంటూ సన్మానాలు, ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీ అంటూ సన్మానాలు చేయించుకున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు కేంద్రం చేసిన ప్రకటనపై ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు చేయాల్సిందంతా చేశామని, ఇంక చేసేదేమీలేదని పార్లమెంట్లో కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి ఇంద్రజిత్‌సింగ్ లోక్‌సభలో చెప్పడం దుర్మార్గమని వారు దుయ్యబట్టారు. హామీ ఇచ్చారు... హోదా ఇవ్వండి న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఏపీ బీసీ సంక్షేమ యువజన సంఘం గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించింది. విభజన వేళ కేంద్రం, ఎన్నికల ముందు ప్రధాని మోదీ ఇచ్చిన హామీకి అనుగుణంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడు కే. వేణుమాధవ్ డిమాండ్‌చేశారు. -
ఏపీకి రూ. 1,176 కోట్ల ఆర్థిక సహాయం!
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక సహాయం అందజేసింది. రెవెన్యూ లోటు కింద రూ. 1,176 కోట్ల నిధులను కేంద్రం ఏపీకి విడుదల చేసిందని కేంద్రమంత్రి సుజనా చౌదరి గురువారం వెల్లడించారు. వెనుకబడిన జిల్లాలకు రూ. 350 కోట్లు, రాజధాని అభివృద్ధికి రూ. 450 కోట్లు విడుదల చేసినట్టు ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ సరైన ఆదాయం లేక ఆర్థిక లోటు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తగిన ఆర్థిక సాయం చేసి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రాన్ని ప్రభుత్వం కోరుతోంది. అయినా, కేంద్ర ప్రభుత్వం అరకొర సహాయం మాత్రమే చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి.