సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రానికి రూ.1,400 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనా నివేదికను కేంద్రానికి పంపించింది. తక్షణ సాయంగా రూ.1,000 కోట్లను విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. శాఖలవారీగా జరిగిన నష్టాలను నివేదికలో పొందుపర్చింది.
కాజ్‌వేలు, రోడ్లు కొట్టుకుపోవడం తదితర కారణాలతో రోడ్లు, భవనాల శాఖకు రూ.498 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.449 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.33 కోట్లు. పురపాలక శాఖకు రూ.379 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.7 కోట్ల నష్టం వాటిల్లినట్టు వివరించింది. భారీ వర్షాలు, వరదలతో ఇళ్లు కూలిపోవడంతో పునరావాసం కల్పిండానికి రూ.25 కోట్ల వ్యయమైనట్టు నివేదికలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment