నిర్ణీత గడువు లోపు ఆధార్ - పాన్ లింక్ చేయని వినియోగదారుల నుంచి కేంద్రం పెనాల్టీల రూపంలో సుమారు రూ. 600 కోట్లు వసూలు చేసింది. అయినప్పటికీ ఆధార్ - పాన్ లింక్ చేయని వారు 11.48 కోట్ల మంది ఉండగా.. వారందరూ బయోమెట్రిక్ ఐడెంటిటీని పూర్తి చేయలేదని కేంద్రం తెలిపింది.
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఆధార్ - పాన్ లింక్‌పై లోకసభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. క్వశ్చన్ అవర్‌లో కేంద్రం ఉచితంగా ఆధార్ - పాన్ లింక్ చేసుకునేందుకు జూన్ 30,2023కి చివరి తేదీగా నిర్ణయించింది.
గడువు తేదీ ముగిసిన తర్వాత ఎవరైతే ఆధార్ - పాన్ లింక్ చేయాలనుకుంటారో వాళ్లు తప్పని సరిగా అదనపు రుసుము కింద రూ.1000 చెల్లించి అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే గడువు ముగిసిన తర్వాత అంటే జులై 1,2023 నుంచి జనవరి 31,2024 వరకు ఆధార్ - పాన్ లింక్ కోసం వినియోగదారుల నుంచి అదనపు రుసుము కింద రూ. 601.97 కోట్లు వసూలు చేసినట్లు వివరణ ఇచ్చారు.
ట్యాక్స్ పేయిర్స్‌కి డెడ్ లైన్
ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు పన్ను చెల్లింపు దారులకు ఆధార్ - పాన్ లింక్‌పై పలు సూచనలు చేశారు. జులై1,2023 వరకు ఆధార్- పాన్ లింక్ చేయని పక్షంలో వారి పాన్ కార్డ్ బ్లాక్ అవుతుందని, ఒకవేళ ఆదాయపు పన్ను చెల్లింపులు చేసినా ఫండ్ రిఫండ్ చేయమని స్పష్టం చేసింది. అంతేకాదు టీడీఎస్, టీసీఎస్ సైతం అధిక మొత్తంలో ట్యాక్స్ పేయిర్స్ నుంచి వసూలు చేస్తామని స్పష్టం చేసింది. ఒకవేళ పాన్ కార్డ్ మళ్లీ పునరుద్దరించాలంటే లేట్ ఫీ కింద రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని ఆ సందర్భంలో ట్యాక్స్ పేయిర్లకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment