PAN
-
నాన్‌స్టిక్ పాన్‌తో పెరుగుతున్న టెఫ్లాన్ ఫ్లూ కేసులు!
నాన్‌స్టిక్ వంట సామానులు వాడొద్దని ఎన్నేళ్లుగానో నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని విన్నాం. కానీ ఇటీవల ఈ నాన్‌స్టిక్ కుక్వేర్ల వాడకం వల్ల యూఎస్‌లో సరికొత్త వ్యాధి వెలుగులోకి వచ్చింది. వాటిని అధికంగా వేడిచేయడం వల్లే ఈ వ్యాధి వస్తున్నట్లు పరిశోధనలో తేలింది. అసలేంటి వ్యాధి? అందుకు నాన్‌స్టిక్ పాన్ ఎలా కారణం..?.నాన్‌స్టిక్ పాన్లు అధికంగా వేడి చేయడం వల్లే పాలిమర్ ఫ్యూమ్ ఫీవర్ వంటి ఫ్లూ మాదిరి వ్యాధులు వస్తున్నాయని సుమారు మూడు వేలకు పైగా నివేదికలు చెబుతున్నాయి. అందుకు నాన్‌స్టిక్ కుక్వేర్ల్లో ఉపయోగించే రసాయన పూత కారణమని గత 20 ఏళ్లుగా లాభప్రేక్ష లేని సంస్థ యూఎస్ పాయిజన్ సెంటర్స్ చెబుతున్నాయి. ఈ వంట సామానుల్లో వాడే కెమికల్స్ కారణంగా పాలిమర్ ఫ్యూమ ఫీవర్‌కి సంబంధించిన కేనులు 267కి పైగా నమోదయ్యాయి. టెఫ్లాన్లోని ప్రధాన పదార్థం. పాలిటెట్రాఫ్లోరోఎథిలిన్(పీటీఎఫ్ఈ). అందువల్లే దీన్ని వందల ఏళ్లుగా నిపుణులు ప్రమాదకరమైన కెమికల్స్‌తో కూడిన పాన్లని చెబుతున్నారు. అన్ని నాన్‌స్టిక్ వంటసామాను సెట్లు పీఎఫ్ఏఎస్(పర్ పాలీఫ్లోరోఅల్కైల్ పదార్ధాలు) కెమికల్ ఉంటుందని అన్నారు. మనం ఈ నాన్‌స్టిక్ పాత్రను దాదాపు 500 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువగా వేడి చేసినప్పుడూ..దానిపై ఉండే ఈ రసాయన పూత విరిగిపోయిన లేదా డ్యామేజ్ అయినప్పుడూ ఈ "టెఫ్లాన్ ఫ్లూ"కి దోహదపడే పొగలను విడుదలవడం జరుగుతుంది. అందువల్ల దీనిలో వండే పదార్థాలు మనకు అనారోగ్యాలను కలుగుజేస్తాయని తెలిపారు. అందువల్ల టెఫ్లాన్ పూతతో కూడిన పాన్లు అధిక్ష ఉష్ణోగ్రత వద్ద వేడి చేయొద్దని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు జర్మనీలో జరిపిన అధ్యయనంలో పరిశోధకులు ఖాళీ నాన్‌స్టిక్ ప్యాన్లను అరగంట పాటు వేడి చేయడం ద్వారా పీఎఫ్ఏఎస్ ఉద్గారాలు విడుదలవ్వుతున్నట్లు గుర్తించారు. దాదాపు 698 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రతకు చేరుకున్నప్పుడూ పాన్ అత్యధిక ఉద్గారాలను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. సాధారణ ఉష్ణోగ్రత వద్ద మానవ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల నిపుణులు నాన్ స్టిక్ కుక్వేర్ని ఎప్పుడూ ముందుగా వేడి చేయకూడదని నొక్కిచెబుతున్నారు. తక్కువ మంట మీద వండితే ఎలాంటి సమస్య ఉండదు గానీ, వేడి చేసిన నాన్‌స్టిక్ పాన్‌లో కర్రిని అలా ఉంచేయడం వల్ల కూడా పాలిమర్ ఫ్యూమ్ ఫీవర్ వస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతేగాదు టెఫ్లాన్‌తో పూసిన పాన్‌పై ఒక్క స్క్రాచ్ తొమ్మిది వేల కణాలను ఉత్పత్తి చేస్తుందని, ఇది మానవ శరీరంలో మూత్రపిండాలు, వృషణాలకు సంబంధించిన కేన్సర్ ప్రమాదాలకు కారణమవుతుందని హెచ్చరించారు. అలాగే వంట చేసేటప్పుడూ తప్పనిసరిగా ఎగ్జాస్ట్ ఫ్యాన్లు లేదా ఓపెన్ విండోలను కూడా ఉపయోగించాలని సూచించారు పరిశోధకులు. (చదవండి: వాల్నట్స్ తింటున్నారా..?ఐతే అలాంటివాళ్లు మాత్రం..!) -
పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్.. మరో 3 రోజుల్లో ముగియనున్న గడువు
ట్యాక్స్ పేయర్స్‌ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అలెర్ట్ చేసింది. మే 31,2024 గడువులోపు పాన్ కార్డ్‌కు ఆధార్ కార్డ్‌ను జత చేయాలని సూచించింది. తద్వారా హైయ్యర్ ట్యాక్స్ డిడక్ట్ నుంచి ఉపశమనం పొందవచ్చని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.పన్ను చెల్లింపుదారులు మీ పాన్‌ను మే 31, 2024లోపు ఆధార్‌తో లింక్ చేయండి. మే 31లోపు మీ పాన్‌ను మీ ఆధార్‌తో లింక్ చేయడం వల్ల ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 206ఏఏ, 206సీసీ ప్రకారం మీరు అధిక పన్ను మినహాయింపు/పన్ను వసూలు నుంచి మినహాయింపు పొందవచ్చు. పాన్‌కు ఆధార్ లింక్ చేయకపోతే నిర్ణీత తేదీలోపు పాన్‌కు ఆధార్ జత చేయకపోతే పన్ను చెల్లింపుదారులు గణనీయమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి, వారు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్లు 206ఏఏ, 206సీసీ ప్రకారం అధిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. Kind Attention Taxpayers, Please link your PAN with Aadhaar before May 31st, 2024, if you haven’t already, in order to avoid tax deduction at a higher rate.Please refer to CBDT Circular No.6/2024 dtd 23rd April, 2024. pic.twitter.com/L4UfP436aI— Income Tax India (@IncomeTaxIndia) May 28, 2024 -
స్మోక్ పాన్: 12 ఏళ్ల బాలిక దుస్థితి తెలిస్తే జన్మలో దాని జోలికెళ్లరు
ఈ మధ్యంకాలంలో పెళ్లిళ్లు, పార్టీలలో ఎక్కడ చూసినా స్మోక్ పాన్, స్మోక్ చాకెట్ల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా 'స్మోక్ పాన్' తిన్న తర్వాత నోట్లోంచి పొగలు రావడంపై జనాలకు బాగా క్రేజ్ పెరిగింది. వాస్తవానికి ఈ స్మోక్ పాన్ ఒక రకమైన హానికరమైన రసాయన నైట్రోజన్ సహాయంతో తయారు చేస్తారు. అందుకే నైట్రోజన్ పాన్‌అని కూడా అంటారు. తాజాగా ఇలాంటి స్మోకీ పాన్ తిని ప్రాణాలకు మీదకి తెచ్చుకున్న ఉదంతం కలకలం రూపింది.టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశంలోని బెంగళూరు నగరానికి చెందిన 12 ఏళ్ల బాలిక లిక్విడ్ నైట్రోజన్‌తో కూడిన 'స్మోకీ పాన్'ని తిని తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరింది. పెర్ఫోరేటెడ్ పెరిటోనిటిస్ (కడుపులో రంధ్రం) వ్యాధి బారిన బాలిక పడినట్లు పరీక్షల్లో తేలింది. దీంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఆరు రోజుల తర్వాత చికిత్స తరువాత ఇంటికి చేరింది.స్మోక్ పాన్ ప్రమాదమా?నైట్రోజన్ అనే వాయువును లిక్విడ్ రూపం 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయబడుతుంది. ఈ ద్రవ నత్రజని వేగంగా ఆవిరై, పొగలు వస్తాయి. ఇది చూడ్డానికి ఆకర్షణీయంగా కనిపించినా ఆరోగ్యానికి హానికరమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆవిరిని పీల్చడం వల్ల శ్వాస తీసు కోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు. ప్యాక్ చేసిన ఆహారం నాణ్యత, షెల్ఫ్ జీవితాన్ని పెంచడానికి ద్రవ నైట్రోజన్‌ను వాడతారు. -
అలర్ట్: ఆధార్-పాన్ లింక్ అవ్వకపోతే రెండింతలు టీడీఎస్
ఆధార్-పాన్ లింక్ ఇంకా చేయనివారికి ఐటీ శాఖ కీలక సమాచారం అందించింది. మే నెలాఖరుకల్లా ఆధార్‌తో పాన్ అనుసంధానం పూర్తయితేనే టీడీఎస్ షార్ట్ డిడక్షన్ కోసం పన్ను చెల్లింపుదారులపై ఏ చర్యలూ ఉండబోవని ఆదాయ పన్ను శాఖ తెలియజేసింది.ఐటీ శాఖ నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ ఆధార్‌తో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) లింక్ అవ్వకపోతే సాధారణంగా వర్తించే రేటుకు రెండింతల టీడీఎస్ కోతలుంటాయి. లావాదేవీ సమయంలో పాన్ ఇన్ఆపరేటివ్లో ఉన్న ట్యాక్స్‌పేయర్లకు టీడీఎస్/టీసీఎస్ షార్ట్ డిడక్షన్/కలెక్షన్ ఎగవేతకు పాల్పడ్డారన్న నోటీసులు వస్తున్నట్టు సీబీడీటీ తెలిపింది.ఈ మేరకు పన్ను చెల్లింపుదారుల నుంచి ఫిర్యాదులు అందాయని పేర్కొంది. ఇలా నోటీసులు అందుకున్న వారికి సీబీడీటీ స్పష్టత ఇచ్చింది. 31 మార్చి 2024 నాటికి ముందు చేసిన లావేదావేలకు సాధారణ రేటుకే టీడీఎస్/టీసీఎస్ వసూలుంటుందని స్పష్టం చేసింది.కాగా 2022 జూన్ 30 వరకు ఆధార్‌తో పాన్ అనుసంధానం ఉచితంగానే జరిగింది. జూలై 1 నుంచి 2023 జూన్ 30 వరకు రూ.1,000 ఆలస్య రుసుముతో అనుమతించారు. ఆ తర్వాత లింక్ అవ్వని పాన్ కార్డులు జూలై 1 నుంచి ఇన్‌ఆపరేటివ్‌లోకి వెళ్లాయి. ఇవి ఆపరేటివ్ కావాలంటే రూ.1,000 ఫైన్ కట్టాల్సిందే. కానీ 30 రోజుల సమయం పడుతుంది. ఆధార్, పాన్ లింక్ కాకపోతే ఐటీ రిఫండ్ ఉండదు. లింక్ చేసుకున్న తర్వాత రిఫండ్ వచ్చినప్పటికీ ఆలస్యమైన రోజులకు ఐటీ శాఖ వడ్డీ చెల్లించదు. -
పాన్-ఆధార్ లింక్ ఆలస్యం.. కేంద్రానికి ఊహించనంత ఆదాయం!
నిర్ణీత గడువు లోపు ఆధార్ - పాన్ లింక్ చేయని వినియోగదారుల నుంచి కేంద్రం పెనాల్టీల రూపంలో సుమారు రూ. 600 కోట్లు వసూలు చేసింది. అయినప్పటికీ ఆధార్ - పాన్ లింక్ చేయని వారు 11.48 కోట్ల మంది ఉండగా.. వారందరూ బయోమెట్రిక్ ఐడెంటిటీని పూర్తి చేయలేదని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఆధార్ - పాన్ లింక్‌పై లోకసభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. క్వశ్చన్ అవర్‌లో కేంద్రం ఉచితంగా ఆధార్ - పాన్ లింక్ చేసుకునేందుకు జూన్ 30,2023కి చివరి తేదీగా నిర్ణయించింది. గడువు తేదీ ముగిసిన తర్వాత ఎవరైతే ఆధార్ - పాన్ లింక్ చేయాలనుకుంటారో వాళ్లు తప్పని సరిగా అదనపు రుసుము కింద రూ.1000 చెల్లించి అప్డేట్ చేసుకోవచ్చు. అయితే గడువు ముగిసిన తర్వాత అంటే జులై 1,2023 నుంచి జనవరి 31,2024 వరకు ఆధార్ - పాన్ లింక్ కోసం వినియోగదారుల నుంచి అదనపు రుసుము కింద రూ. 601.97 కోట్లు వసూలు చేసినట్లు వివరణ ఇచ్చారు. ట్యాక్స్ పేయిర్స్కి డెడ్ లైన్ ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు పన్ను చెల్లింపు దారులకు ఆధార్ - పాన్ లింక్‌పై పలు సూచనలు చేశారు. జులై1,2023 వరకు ఆధార్- పాన్ లింక్ చేయని పక్షంలో వారి పాన్ కార్డ్ బ్లాక్ అవుతుందని, ఒకవేళ ఆదాయపు పన్ను చెల్లింపులు చేసినా ఫండ్ రిఫండ్ చేయమని స్పష్టం చేసింది. అంతేకాదు టీడీఎస్, టీసీఎస్ సైతం అధిక మొత్తంలో ట్యాక్స్ పేయిర్స్ నుంచి వసూలు చేస్తామని స్పష్టం చేసింది. ఒకవేళ పాన్ కార్డ్ మళ్లీ పునరుద్దరించాలంటే లేట్ ఫీ కింద రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని ఆ సందర్భంలో ట్యాక్స్ పేయిర్లకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు వివరించారు. -
పంచకుండా పడేశారు
కుల్కచర్ల (వికారాబాద్): పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకు అందివ్వాల్సిన ఆధార్, ఏటీఎం, పాన్, పోస్టు కార్డుల్ని ఓ పోస్ట్‌మ్యాన్ వారికివ్వకుండా ఏళ్ల తరబడి ఇంట్లోనే ఉంచేసుకున్నాడు. చివరికి వాటిని మూటకట్టి గ్రామానికి చెందిన ఓ చెత్త ట్రాక్టర్లో పడేశాడు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆ పోస్్టమ్యాన్ నర్సింలు నిర్వాకం గ్రామపంచాయతీ సిబ్బంది ద్వారా బయటకు వచ్చింది. వికారాబాద్ జిల్లాలో శనివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వెలుగు చూసిందిలా...: జిల్లాలోని చౌడాపూర్ మండల కేంద్రంలోని చౌడాపూర్ గ్రామానికి చెందిన చెత్త ట్రాక్టర్ శనివారం చెత్తను సేకరి స్తున్న క్రమంలో గ్రామానికి చెందిన పోస్ట్ మ్యాన్ నర్సింలు ఇంటివద్ద ఆగింది. ఆ సమయంలో నర్సింలు కుటుంబసభ్యులు ఓ పెద్ద సంచిని తీసుకొచ్చి ట్రాక్టర్లో పడేశా రు. కొద్ది దూరం వెళ్లాక ఈ సంచిని గమనించిన పంచాయతీ సిబ్బంది మూట విప్పి చూడగా..అందులో 2 వేలకు పైగా ఆధార్ కార్డులు, వందకు పైగా పాన్, ఏటీఎం, క్రెడి ట్ కార్డులు, మరికొన్ని ఉత్తరాలు కన్పించా యి. వీటిలో 2011 ఏడాదికి చెందినవి కూడా ఉన్నాయి. దీంతో పంచాయతీ కార్యాలయం వద్ద సంచిని దించారు. ఈ విషయాన్ని కొంతమంది వీడియోతీసి సామాజిక మాధ్యమా ల్లో వైరల్ చేయగా వీడియోను చూసిన చౌడా పూర్, మక్తవెంకటాపూర్, మందిపల్ గ్రామ స్తులు అక్కడకు చేరుకుని వారికి రావాల్సిన కార్డుల్ని తీసుకున్నారు. మిగిలిన ఆధార్, ఏటీఎం, క్రెడిట్ కార్డులను చౌడాపూర్ తహసీల్దార్ ప్రభు వద్ద భద్రపరిచారు. పోస్ట్‌మ్యాన్ నిర్లక్ష్యంపై ఆందోళన...: నర్సింలు విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నాడంటూ కొంతమంది తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇటీవలే ఆందోళన కూడా చేశారు. తాజా ఘటనతో అతడిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మహబూబ్‌నగర్ జిల్లా పోస్టల్ అధికారులకు సిఫార్సు చేస్తామని తహసీల్దార్ తెలిపారు. చెక్కు దొరకలేదు. డిసెంబర్లో ఓ బీమా కంపెనీ నుంచి రూ.33 వేల చెక్కు రావాల్సి ఉంది. ఈ విషయమై కొద్ది రోజులుగా పోస్ట్‌మ్యాన్‌ను అడుగుతూనే ఉన్నాను. ఆయన మాత్రం ఎలాంటి చెక్కు రాలేదని చెబుతున్నాడు. ఈ విషయమై సబ్ పోస్టాఫీస్‌కు వెళ్లి ఆరా తీయగా డిసెంబర్ 9వ తేదీనే గ్రామానికి పంపించామని చెప్పారు. వీడియో చూసి పంచాయతీకి వెళ్లి సంచిలో వెదికినా నాకు రావాల్సిన చెక్కు మాత్రం దొరకలేదు. –కావలి రాములు, చౌడాపూర్ -
కేంద్రం కీలక నిర్ణయం, పాన్ - ఆధార్ లింక్ చేశారా?
పాన్ - ఆధార్ కార్డ్ లింక్ చేశారా? లేదంటే ఇప్పుడే చేయండి. ఎందుకంటే? దేశంలో ఆధార్ - పాన్ లింక్ చేయలేని కారణంగా దేశంలో మొత్తం 11.5 కోట్ల పాన్‌కార్డ్‌లు డీయాక్టివేట్ అయినట్లు తేలింది. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్ర శేఖర్ గౌర్ సమాచార హక్కు చట్టం ద్వారా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్‌ల అనుసంధానానికి సంబంధించిన వివరాల్ని కోరారు. ఆయన అభ్యర్ధనపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) స్పందించింది. డెడ్‌లైన్ తర్వాత ఫైన్ జూలై 1, 2017 తర్వాత తీసుకున్న పాన్‌కార్డ్‌లను - ఆధార్‌కు ఆటోమేటిక్‌గా లింక్ అయ్యాయి. అయినప్పటికీ, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139AA సబ్-సెక్షన్ (2) ప్రకారం, ఆ తేదీకి ముందు పాన్ కార్డ్‌లను పొందిన వారు ఆధాన్-పాన్‌ను మాన్యువల్‌గా లింక్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎలాంటి చెల్లింపులు లేకుండా ఈ ఏడాది జూన్ 30 వరకు జత చేసుకునే అవకాశం కల్పించింది. జులై 1 నుంచి ఆధార్- పాన్‌ను జతచేయాలంటే రూ.1000 చెల్లించి యాక్టివేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. వెయ్యి ఎందుకు చెల్లించాలి రూ. 1,000 జరిమానా చెల్లించడంపై గౌర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త పాన్ కార్డ్ ధర రూ. 91 (జీఎస్టీ మినహాయింపు ఉంది.). ‘అప్పుడు పాన్ కార్డును తిరిగి యాక్టివేట్ చేసేందుకు ప్రభుత్వం 10 రెట్ల జరిమానా ఎలా విధిస్తుంది ? అలాగే, పాన్ కార్డులు డీయాక్టివేట్ చేయబడిన వ్యక్తులు ఆదాయపు పన్నును ఎలా ఫైల్ చేస్తారు? ప్రభుత్వం పునరాలోచించి, పాన్‌తో లింక్ చేయడానికి కనీసం ఒక సంవత్సరం కాలపరిమితిని పొడిగించాలి అని గౌర్ అన్నారు. దేశంలో 70.24 కోట్ల మంది పాన్‌కార్డ్ హోల్డర్లు మనదేశంలో 70.24 కోట్ల మంది పాన్ కార్డ్ హోల్డర్లలో 57.25 కోట్ల మంది తమ పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానించారు. 11.5 కోట్ల పాన్ కార్డులు ఆధార్‌తో అనుసంధానం చేయలేదు. కాబట్టే అవి డీయాక్టివేట్ అని ఆర్టీఐ సమాధానంలో పేర్కొంది. పాన్-ఆధార్ లింక్ అయ్యిందా? లేదా ఇలా తెలుసుకోండి స్టెప్ 1: https://www.incometax.gov.in/iec/foportal/ ద్వారా ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌ని సందర్శించండి స్టెప్ 2: పేజీకి ఎడమ వైపున ఉన్న 'క్విక్ లింక్‌లు' క్లిక్ చేయండి. అనంతరం 'లింక్ ఆధార్ స్టేటస్'పై క్లిక్ చేయండి. స్టెప్ 3: మీ 10 అంకెల పాన్ నంబర్, 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి. స్టెప్ 4: తర్వాత 'వ్యూ లింక్ ఆధార్ స్టేటస్'పై క్లిక్ చేయండి. స్టెప్ 5: ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఇప్పటికే లింక్ చేయబడి ఉంటే చూపబడుతుంది. ఆధార్ లింక్ చేయకపోతే.. మీ సేవా సెంటర్లలో వాటిని లింక్ చేయాల్సి ఉంటుంది. -
తమలపాకులతో జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టండిలా!
చిన్ని చిట్కాలతో కూరగాయాలను, పళ్లను పాడవకుండా రక్షించుకోవచ్చు. అలాగే ఇంట్లో అందుబాటులో దొరికే వాటితోనే చర్మాన్ని, హెయిర్‌ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. సులభమైన పద్ధతుల్లో ఆరోగ్యకరమైన చిట్కాలను ఫాలో అవుతూ మన, ఇంటిని, ఆరోగ్యాన్ని ఈజీగా రక్షించుకోవచ్చు. అందుకావల్సింది ఓపిక. దీంతో పాటు ఎలాంటి హానికరం కాని మంచి రెమిడీలు కాస్త అనుభవం గడించిన పెద్దలు లేదా ఆరోగ్య నిపుణుల సాయం ఉంటే చాలు. ఆకుకూరలు తాజగా ఉండాలంటే.. ఆకుకూరలు వాడిపోయినట్టుగా కనిపించినప్పుడు... వాటిని చల్లటినీటిలో వేయాలి. దీనిలో టేబుల్ స్పూను నిమ్మరసం వేసి కలిపి ఐదునిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తరువాత నీటినుంచి తీసేయాలి. ఇలా చేస్తే ఆకుకూరలు తిరిగి తాజాగా కనిపిస్తాయి. యాపిల్ ముక్కలు కట్ చేసిన వెంటనే ఆ ముక్కలపైన కాసింత నిమ్మరసం పిండితే రంగు మారకుండా ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి. జుట్టు రాలే సమస్య తగ్గాలంటే.. ఇరవై తమలపాకులని తీసుకుని శుభ్రంగా కడిగి పేస్టుచేయాలి. ఈ పేస్టులో టీస్పూను నెయ్యి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడు నుంచి వెంట్రుకల చివర్ల వరకు పట్టించాలి. గంట తరువాత నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి ఈ మాస్క్ వేసుకోవడం వల్ల తమలపాకులోని పోషకాలు అంది జుట్టు మరింత బలంగా దట్టంగా పెరుగుతుంది. జుట్టురాలే సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. అలాగే తమలపాకు పేస్ట్‌లో కొద్దిగా కొబ్బరి నూనె, ఆముదం కలిపి జుట్టు కుదుళ్లకు మసాజ్ చేసితే జుట్టు ఒత్తుగా బలంగా పెరుగుతుంది. ఇలా వారానికి ఒకసారి లేదా నెలకు రెండు మూడు సార్లు చొప్పున చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. (చదవండి: సబ్జాతో ఇలా చేస్తే ముఖం కాంతులీనుతుంది!) -
‘ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్’.. వంటలక్క చైనా తమ్ముడివా?
పిల్లలు చాలా పనుల్లో పెద్దలను అనుకరిస్తారు. చైనాలో ఒక పిల్లవాడు నిపుణుడైన చెఫ్‌ను అనుకరిస్తూ జనం హృదయాలను దోచుకుంటున్నాడు. సోషల్ మీడియా ప్లాట్ఫారం X లో కొద్ది నెలల క్రితం పోస్ట్ అయిన వీడియో ఇంకా అందరినీ అలరిస్తూనే, కొత్త రికార్డులు సృష్టిస్తోంది. నేజియాంగ్లో నివసిస్తున్న అతని తల్లి, తమ పిల్లవాడు నెలల వయస్సులో వంట చేయడంపై ఆసక్తిని కలిగి ఉన్నాడని గ్రహించింది. పిల్లాడు టెలివిజన్‌లో వంటల కార్యక్రమాలలో చెఫ్‌లను చూస్తూ, వారిని అనుకరించడాన్ని ఆమె గమనించింది. వీడియోలో ఆ పిల్లాడు గరిటెతో పాన్‌ను బ్యాలెన్స్ చేస్తూ, అద్భుతమైన ప్రతిభను చూపించాడు. ఈ వీడియోను ఒలివియా వాంగ్ అనే యూజర్ షేర్ చేశారు. ‘ఈ పిల్లాడు వంట పాన్‌ను అంత వేగంగా ఎలా తిప్పుతున్నాడు? పిల్లాడి వంట ప్రతిభ అద్భుతంగా ఉంది’ అంటూ ఫొటో కామెంట్ రాశారు. ఈ వీడియోను చూసిన ఒక యూజర్ ‘మూడేళ్ళ పిల్లాడికి నా కంటే బాగా వంట చేయడం వచ్చని తెలిసి, తట్టుకోలేకపోతున్నాను’ అని రాశారు. కాగా ఏడాది క్రితం ఇటువంటి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో ఒక పిల్లాడు అద్భుతంగా వంట చేస్తున్నాడు. @sonikabhasin పేరుతో ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. వీడియో ప్రారంభంలో ఆ పిల్లాడు స్టూల్‌పై నిలబడటాన్ని గమనించవచ్చు. అప్పుడు ఆ పిల్లాడిని ఏం చేస్తున్నావని అతని తల్లి అడిగినప్పుడు ‘ఫ్రైడ్ రైస్’ అని ముద్దుముద్దుగా సమాధానం ఇచ్చాడు. ఈ వంటకంలో ఉల్లిపాయ, వెల్లుల్లి, బీన్స్, క్యాప్సికమ్ జోడించానని కూడా చెప్పాడు. ఇది కూడా చదవండి: ఖలిస్తాన్ అంటే ఏమిటి? పంజాబ్‌ను ఎందుకు వేరు చేయాలంటున్నారు? How come this little boy can handle this cooking pan so swiftly and his cooking skill is so amazing~#cooking #China pic.twitter.com/i48YcazOwZ — Olivia Wong (@OliviaWong123) February 14, 2023 -
పనిచేయని పాన్ కార్డులపై ఐటీ శాఖ క్లారిఫికేషన్
ఆధార్ కార్డ్‌తో లింక్ చేయని కారణంగా పనిచేయకుండా పోయిన (ఇనాపరేటివ్) పాన్ కార్డులు, ఇతర కారణాలతో ఇన్‌యాక్టివ్‌గా మారిన పాన్ కార్డులు రెండూ ఒకటి కావు. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైలింగ్ సందర్భంగా ఇనాపరేటివ్, ఇనాక్టివ్ పాన్ కార్డుల మధ్య తేడా తెలియక తికమక పడుతున్న ప్రజలకు ఆదాయపు పన్ను శాఖ క్లారిఫికేషన్ ఇచ్చింది. ‘పనిచేయని (ఇనాపరేటివ్) పాన్ కార్డు, ఇన్‌యాక్టివ్ పాన్ కార్డు రెండూ వేరు వేరు. పాన్ కార్డు పనిచేయక పోయినా ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయవచ్చు’ అని ఐటీ శాఖ ట్విటర్లో పోస్టు ద్వారా తెలియజేసింది. అయితే పనిచేయని పాన్లకు పెండింగ్‌లో ఉన్న రీఫండ్లు, వాటి మీద వడ్డీలు చెల్లింపులు సాధ్యం కావని స్పష్టం చేసింది. ఇదీ చదవండి ➤ Inoperative PAN: పాన్ కార్డ్ పనిచేయడం లేదా..? అయితే ఈ లావాదేవీలు చేయలేరు! అలాగే ఇనాపరేటివ్ పాన్ ఉన్నవారికి టీడీస్ (ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్), టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్) లను అధిక రేటుతో విధించనున్నట్లు పేర్కొంది. కాగా ఆధార్ కార్డుతో పాన్ కార్డ్ లింక్ చేయడానికి గడువు జూన్ 30తో ముగిసింది. ఎన్ఆర్ఐ పాన్లపై స్పష్టత ఎన్ఆర్ఐలు, విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయులు తమ పాన్ ఇన్ఆపరేటివ్గా (పనిచేయకపోతే) మారిపోతే, నివాస ధ్రువీకరణ పత్రాలతో అసెసింగ్ అధికారులను సంప్రదించాలని ఆదాయపన్ను శాఖ సూచించింది. తమ పాన్లు పనిచేయకుండా పోవడం పట్ల కొందరు ఎన్ఆర్ఐలు, విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయుల (ఓసీఐలు) నుంచి ఆందోళన వ్యక్తమైనట్టు తెలిపింది. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఐటీఆర్ దాఖలు చేసిన వారి స్టేటస్ వివరాలను తామే జురిస్డిక్షనల్ అసెసింగ్ ఆఫీసర్లకు పంపించినట్టు స్పష్టం చేసింది. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో రిటర్నులు దాఖలు చేయని లేదా తమ నివాస హోదాను అప్డేట్ చేయని వారి పాన్లు పనిచేయకుండా పోయినట్టు ఆదాయపన్ను శాఖ తెలిపింది. Dear Taxpayers, Concerns have been raised by certain NRIs/ OCIs regarding their PANs becoming inoperative, although they are exempted from linking their PAN with Aadhaar. Further, PAN holders, whose PANs have been rendered inoperative due to non-linking of PAN with Aadhaar,… — Income Tax India (@IncomeTaxIndia) July 18, 2023 -
పాన్ కార్డ్ పనిచేయడం లేదా..? అయితే ఈ లావాదేవీలు చేయలేరు!
దేశంలో ప్రతి ఆర్థిక లావాదేవీకీ పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య) కార్డ్ తప్పనిసరి. బ్యాంకుల్లో ఖాతాలు తెరవవాలన్నా.. లోన్లు పొందాలన్నా.. చెల్లింపులు చేయాలన్నా.. ఆదాయపు పన్ను చెల్లించాలన్నా ఈ పాన్ కార్డ్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139AA ప్రకారం, 2023 జూన్ 30లోపు ఆధార్ నంబర్‌ను పాన్‌తో లింక్ చేయడం తప్పనిసరి. ఆ గడువు కూడా ఇప్పుడు పూర్తయింది. ఆధార్ లింక్ చేయని పాన్ కార్డలు 2023 జూలై 1 నుంచి పనిచేయకుండా (ఇన్ఆపరేటివ్) పోయాయి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో పేర్కొన్నదాని ప్రకారం.. పనిచేయని పాన్ కార్డు ఉన్న వారు కింది ఆర్థిక లావాదేవీలను నిర్వహించలేరు. ఆ లావాదేవీలు ఇవే.. బ్యాంకులు లేదా కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో ఖాతా తెరవడం (టైమ్ డిపాజిట్లు, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలు మినహా). డిపాజిటరీ, పార్టిసిపెంట్, సెక్యూరిటీస్ కస్టోడియన్ లేదా సెబీ నియంత్రణలోని సంస్థల్లో డీమ్యాట్ అకౌంట్ తెరవడం. హోటల్ లేదా రెస్టారెంట్‌కి ఒకేసారి రూ. 50,000 కంటే ఎక్కువ నగదు చెల్లింపులు చేయడం. విదేశీ ప్రయాణానికి లేదా విదేశీ కరెన్సీని కొనుగోలు చేయడానికి రూ. 50,000 కంటే ఎక్కువ నగదు చెల్లింపులు. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడం మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేయడానికి రూ. 50,000 కంటే ఎక్కువ చెల్లింపులు చేయడం. డిబెంచర్లు లేదా బాండ్లను కొనుగోలు చేయడానికి రూ. 50,000లకు మించి చెల్లింపులు ఆర్బీఐ బాండ్లను పొందడం కోసం రూ. 50,000 మించి చెల్లింపులు బ్యాంకింగ్ కంపెనీ లేదా కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో ఒకే రోజులో రూ.50,000 లకు మించి నగదు జమ బ్యాంక్ డ్రాఫ్ట్‌లు, పే ఆర్డర్లు, బ్యాంకర్ చెక్కులను కొనుగోలు చేసేందుకు ఒకే రోజులో రూ. 50,000 లకు మించి నగదు చెల్లింపులు టైమ్ డిపాజిట్‌కు సంబంధించి ఒక సారికి 50,000 లేదా సంవత్సరంలో మొత్తంగా రూ. 5 లక్షలకు మించి డిపాజిట్ చేయడం ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు, బ్యాంక్ డ్రాఫ్ట్, పే ఆర్డర్ లేదా బ్యాంకర్ చెక్ ద్వారా రూ. 50,000లకు మించిన పేమెంట్లు బీమా సంస్థకు జీవిత బీమా ప్రీమియంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000లకు మించి చెల్లించడం. రూ. లక్షకు మించిన సెక్యూరిటీల (షేర్లు మినహా) అమ్మకం లేదా కొనుగోలు కోసం ఒప్పందంలోకి ప్రవేశించడం. రూ. లక్షకు మించిన అన్‌లిస్టెడ్ కంపెనీ షేర్ల విక్రయం లేదా కొనుగోలులో పాల్గొనడం. ఇదీ చదవండి: ఆధార్-పాన్ లింక్ ముగిసింది.. ఇక మిగతా డెడ్లైన్ల సంగతేంటి? -
ఆధార్-పాన్ లింక్ ముగిసింది.. ఇక మిగతా డెడ్లైన్ల సంగతేంటి?
జూన్ నెల ముగిసి జూలై నెల ప్రారంభమైంది. ఎప్పటి నుంచో పొడించుకుంటూ వస్తున్న ఆధార్-పాన్ లింకింగ్ గడువు జూన్ 30వ తేదీతో ముగిసిపోయింది. ఇక పొడిగింపు ఉండదని ఆదాయపు పన్న శాఖ తేల్చి చెప్పేసింది. అయితే జూలై నెలలో పూర్తి చేయాల్సిన ఫినాన్సియల్ డెడ్లైన్లు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం.. ఐటీఆర్ దాఖలు ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) సమర్పించడానికి జూలై 31 ఆఖరు తేదీ. గడువు సమీపిస్తున్న కొద్దీ ఆందోళన చెందడం సహజం. అయితే ఫారమ్ 16, 26AS, వార్షిక సమాచార స్టేట్మెంట్, బ్యాంక్ స్టేట్మెంట్లు, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, వడ్డీ, మూలధన లాభాల స్టేట్మెంట్ వంటి అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం, తరచుగా చేసే సాధారణ తప్పుల గురించి తెలుసుకోవడం ద్వారా ఐటీఆర్ దాఖలును సులువుగా పూర్తి చేయవచ్చు. చివరి నిమిషంలో హడావుడి తప్పులకు దారితీస్తుంది.ఆదాయపు పన్ను రిటర్న్‌ను సంబంధిత డాక్యుమెంట్లు జోడించకుండా ఫైల్ చేయడం వలన తక్కువ రిపోర్టింగ్‌కు దారి తీయవచ్చు. దీనికి ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు సైతం వచ్చే అవకాశం లేకపోలేదు. ఇటువంటి పరిస్థితులు ఎదురుకాకూడదంటే ఆఖరు వరకు వేచి ఉండకుండా కాస్త ముందుగానే ఐటీఆర్ ఫైల్ ఉత్తమం. ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అధిక పెన్షన్‌ను ఎంచుకోవడానికి గడువును జూలై 11 వరకు పొడిగించింది. అధిక పెన్షన్ కాంట్రిబ్యూషన్లను ఆన్లైన్ ద్వారా ఎంచుకునే సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఉద్యోగి UAN, పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ వంటి నిర్దిష్ట వివరాలను అందించాలి. దరఖాస్తు ధ్రువీకరణ కోసం ఉద్యోగి ఆధార్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) వస్తుంది. ధ్రువీకరణ ప్రక్రియ తర్వాత బ్యాంక్ ఖాతాల వివరాలు, చందా సమాచారంతో కూడిన మునుపటి క్రియాశీల పీఎఫ్ లేదా పెన్షన్ ఖాతాల గురించిన సమాచారాన్ని అందించాల్సిన అప్లికేషన్ తదుపరి పేజీకి వెళ్తారు. ఇక్కడ సమాచారంతో పాటు సపోర్టింగ్ డాక్యుమెంట్లు కూడా సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం పూర్తయ్యాక ఒక రసీదు సంఖ్య వస్తుంది. దాన్ని భవిష్యత్ ఉపయోగం కోసం దాచుకోవాలి. అధిక పెన్షన్ దరఖాస్తు స్థితిని ట్రాక్ చేయడానికి ఈపీఎఫ్‌వో లింక్‌ను కూడా అందుబాటులో ఉంచింది. ఇదీ చదవండి: కోటికి పైగా ఐటీఆర్‌లు దాఖలు.. గతేడాది కంటే చాలా వేగంగా.. -
ఆధార్-ప్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన
ఆధార్ కార్డ్-పాన్ లింకింగ్‌కు గడువు నిన్నటి(జూన్ 30)తో ముగిసిన నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆధార్-పాన్ లింకింగ్ కోసం పెనాల్టీ చెల్లించిన తరువాత చలాన్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తన అధికారిక ట్విటర్ హ్యాండిల్లో సమాచారాన్ని పోస్ట్ చేసింది. అంతేకాదు మరోసారి గడువు పెంపు ఉంటుందనే ఊహాగానాలకు ఆదాయపు పన్ను శాఖ చెక్ పెట్టింది. ప్యాన్-ఆధార్‌లో లింకింగ్‌లో పాన్ హోల్డర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆధార్-పాన్ లింకింగ్ కోసం రుసుము చెల్లించిన తర్వాత చలాన్ డౌన్లోడ్ చేయడంలో పాన్ హోల్డర్లు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రసీదు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని, అయితే ఇ-పే ట్యాక్స్ ట్యాబ్‌లో చలాన్ చెల్లింపు వివరాలను చెక్ చేసుకోవచ్చని సూచించింది. అయితే ఇ-పే ట్యాక్స్‌లో ఇబ్బందులున్నాయని కొంతమంది యూజర్లు ట్విటర్లో ఫిర్యాదు చేశారు. (ధోనీ ఎంత పని చేశాడు: సత్య నాదెళ్ల ‘క్రష్’ కూడా అదేనట!) పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడడం 2017 జులై 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడానికి గడువును కేంద్రం చాలాసార్లు పొడిగించింది.జూన్ 30వ తేదీ లోపు పాన్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేయకపోతే, లింక్ కాని పాన్ కార్డులు చెల్లుబాటు కావడం ఆదాయపన్ను శాఖ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. Kind Attention PAN holders! Instances have come to notice where PAN holders have faced difficulty in downloading the challan after payment of fee for Aadhaar-PAN linking. In this regard, it is to be informed that status of challan payment may be checked in ‘e-pay tax’ tab of… — Income Tax India (@IncomeTaxIndia) June 30, 2023 -
ఈ రోజే లాస్ట్.. ఆధార్ - పాన్ లింక్ చేయలేదా!
PAN-Aadhaar Linking: పాన్ - ఆధార్ లింక్ గురించి గత కొన్ని రోజులుగా వింటూనే ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ లింకింగ్ గడువు ఈ రోజు కొన్ని గంటలలో ముగియనుంది. రేపటి నుంచి (జులై 01) ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్ ఖాతాలు పనిచేయవని ఇప్పటికే ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. గతంలో దీని కోసం అనేక మార్లు గడువు పెంచడం కూడా జరిగింది. మరో సారి పొడిగిస్తుందో.. లేదో ప్రస్తుతానికి తెలియదు. నిజానికి పాన్ - ఆధార్ లింక్ గడువు ఎప్పుడో ముగిసింది. అయితే 2023 మార్చి 31 వరకు రూ. 1000 ఫైన్‌తో అదనపు గడువు కల్పించారు. ఆ కూడా జూన్ 30 వరకు పొడిగించారు. ఆ గడువు కాస్త ఈ రోజుతో ముగియనుంది. ఇంకో సారి పెంచే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నా.. దీనిపైనా ఎటువంటి స్పష్టత లేదు. ఆధార్ - పాన్ లింక్ చేయకపోతే ఏమవుతుంది.. ఆధార్ - పాన్ గడువు లోపలు చేయకుండా ఉంటే వారి బ్యాంకింగ్ సర్వీసులు, డెబిట్, క్రెడిట్ కార్డుల వాడకం మాత్రమే కాకుండా.. ఆన్లైన్ చెల్లింపులు, యూపీఐ చెల్లింపులు, మొబైల్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు వీలుండదు, పెండింగ్ రిటర్నుల ప్రాసెస్ కూడా నిలిచిపోతుంది. (ఇదీ చదవండి: మీ పాన్ నెంబర్‌తో ఆధార్ లింక్ అయిందా? ఈ సింపుల్ టెక్నిక్స్‌తో తెలుసుకోండి) ఆధార్ - పాన్ లింక్ అనేది కొన్ని కేటగిరీకు సంబంధించిన వ్యక్తులకు తప్పనిసరి కాదని సీబీడీటీ (CBDT) తెలిపింది. ఇందులో 80 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం భారత నివాసి కాని వారు & భారత పౌరులు కాని వ్యక్తులు ఉన్నారు. ఇలాంటి వ్యక్తులకు ఆధార్ - పాన్ లింక్ అవసరం లేదు. -
గడువు ముగుస్తోంది.. పాన్-ఆధార్ లింక్ చేశారా?
శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)ను ఆధార్‌తో లింక్ చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ విధించిన గడువు ముగుస్తోంది. మినహాయింపు కేటగిరీకి చెందినవారు తప్ప మిగిలిన వారందరూ వెంటనే తమ పాన్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ ట్విటర్లో రిమైండర్‌ను షేర్ చేసింది. చివరి తేదీ సమీపిస్తున్న క్రమంలో ట్యాక్స్ పేయర్లు, పాన్ కార్డ్ హోల్డర్లు తమ పాన్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేసుకోవాలంటూ ఐటీ శాఖ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లను జారీ చేస్తోంది. పాన్- ఆధార్ లింకింగ్ ప్రక్రియ కోసం అనుసరించాల్సిన సూచనలతోపాటు గడువులోపు పాన్-ఆధార్ లింక్ చేయకపోతే జరిగే పరిణామాల గురించి కూడా హెచ్చరించింది. చివరి తేదీ ఎప్పుడు? పాన్-ఆధార్‌ను లింక్ చేయడానికి చివరి తేదీ జూన్ 30. ఈలోపు పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించకపోతే, 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆ పాన్ కార్డ్ పని చేయకుండా పోతుంది. పాన్-ఆధార్ లింక్ చేయడమెలా? ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ కోసం సెర్చ్ చేసి అందుబాటులో ఉన్న పాన్-ఆధార్ లింక్‌పై క్లిక్ చేయాలి అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వాలి లేకుంటే కొత్తది క్రియేట్ చేసుకోవాలి యూజర్ ఐడీ, పాస్వర్డ్, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేయాలి (యూజర్ ఐడీగా పాన్ నంబర్ నమోదు చేయాలి) వెంటనే ఆధార్-పాన్ లింక్‌ను తెలియజేసే పాపప్ కనిపిస్తుంది. (ఒకవేళ కనిపించకపోతే వెబ్సైట్ ఎడమ వైపు విభాగాన్ని సందర్శించండి) అవసరమైన అన్ని వివరాలను నమోదు చేయాలి వివరాలను నిర్ధారించి, క్యాప్చాను ఎంటర్ చేయాలి ఇది పూర్తయిన తర్వాత పాన్ ఆధార్ కార్డ్‌కి విజయవంతంగా లింక్ చేసినట్లు నోటిఫికేషన్ వస్తుంది. లింక్ చేయకపోతే ఏమౌతుంది? ఆదాయపు పన్ను శాఖ షేర్ చేసిన వీడియో ప్రకారం.. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే ఆ పాన్ కార్డ్ పనికిరాకుండా పోతుంది. అలాగే ఈ కింది పరిణామాలను పాన్ హోల్డర్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చెల్లింపులు నిలిచిపోతాయి. పాన్ పని చేయని కాలానికి నిలిచిపోయిన నగదుపై ఎటువంటి వడ్డీ రాదు అధిక టీడీఎస్, టీసీఎస్‌లు భరించాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐలు, కొన్ని నిర్దిష్ట రాష్ట్రాల వాసులు, భారతీయ పౌరులు కానివారు, 80 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారికి పాన్-ఆధార్ లింక్ నుంచి, జరిమానాల నుంచి మినహాయింపు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 2023 మార్చి 28న ఆర్థిక శాఖ ఇచ్చిన ప్రకటనలో పాన్-ఆధార్ లింకింగ్‌కు చివరి తేదీని జూన్ 30 వరకు పొడిగించినట్లు తెలిపింది. 2023 మార్చి 28 నాటికి 51 కోట్లకుపైగా పాన్లు ఆధార్‌తో లింక్ అయినట్లు పేర్కొంది. पैन धारक कृपया ध्यान दें! आयकर अधिनियम, 1961 के अनुसार, पैन धारक, जो छूट की श्रेणी में नहीं आते हैं, उन्हें 30.06.2023 तक अपने पैन को आधार से जोड़ना अनिवार्य है। कृपया अपना पैन और आधार आज ही लिंक करें! Kind attention PAN holders! As per Income-tax Act, 1961, it is mandatory… pic.twitter.com/VyliEJ75Gy — Income Tax India (@IncomeTaxIndia) June 21, 2023 ఇదీ చదవండి: Bank Holidays July 2023: నెలలో దాదాపు సగం రోజులు సెలవులే! -
ఓకైకే పాన్ దోశ వాలా!
‘ఎన్ని రకాల పాన్లు ఉన్నాయి?’ అని అడిగితే హైదరాబాద్ నుంచి అలహాబాద్ వరకు ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పవచ్చు. అలాగే దోశలలో కూడా మైసూర్ దోశ నుంచి రవ్వ దోశ వరకు ఎన్నో రకాల దోశలు ఉన్నాయి. దోశ ప్లస్ పాన్ కాంబినేషన్ అనేది ఊహకు అందదు. అయితే ముంబైవాలా ఒకరు దోశకు పాన్ జత చేస్తూ తయారుచేసిన ‘పాన్ దోశ’ను చూసి నెటిజనులు ‘ఔరారా’ అంటున్నారు.వేడి వేడి దోశలో పాన్‌తో పాటు అంజీర్, డ్రై ఫ్రూట్స్... మొదలైనవి చేర్చాడు. రెండు రోజుల వ్యవధిలోనే ఈ వీడియో 1.5 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. -
G7 Summit: సమ్మిళిత ఆహార వ్యవస్థ
హిరోషిమా: ప్రపంచవ్యాప్తంగా అత్యంత దుర్బల స్థితిలో ఉన్న నిరుపేదల సంక్షేమం నిమిత్తం సమ్మిళిత ఆహార వ్యవస్థ ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఎరువుల వనరులను చెరపడుతున్న విస్తరణవాద ధోరణికి చెక్ పెట్టాలన్నారు. ‘సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేలా ప్రజాస్వామ్యీకరణ చేయాలి. ఇలాంటి చర్యలు అభివృద్ధికి, ప్రజాస్వామ్యానికి మధ్య వారధిగా ఉంటాయి’ అని అన్నారు. పాన్‌లోని హిరోషిమాలో జీ–7 సదస్సులో మోదీ మాట్లాడారు. సహజ వనరులను సమగ్రంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, వినియోగదారుల ప్రయోజనాలే పరమావధిగా అభివృద్ధి నమూనాను మార్చాలని చెప్పారు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్‌లతో కూడిన జీ–7 కూటమి సదస్సు ఈసారి జపాన్‌లో జరుగుతోంది. భారత్‌తో పాటు మరో ఏడు దేశాల అధినేతలను సదస్సుకు జపాన్ ఆహ్వానించింది. ఈ మేరకు సదస్సులో పాల్గొన్న ప్రధాని తన ప్రసంగంలో ఆహార భద్రతపైనే అత్యధికంగా దృష్టిసారించారు. ప్రపంచ ఆహార భద్రత సుస్థిరంగా ఉండాలంటే ఆహార వృథాను అరికట్టడం అత్యంత కీలకమని చెప్పారు. సదస్సులో జరుగుతున్న చర్చలు జీ–20, జీ–7 కూటముల మధ్య కీలకమైన అనుసంధానంగా మారతాయని ఆశాభావం వెలిబుచ్చారు. సమ్మిళిత ఆహార విధానం రూపకల్పనలో చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఎరువుల పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరముంది. ఈ క్రమంలో ఎదురయ్యే రాజకీయపరమైన అడ్డంకులను తొలగించాలి’’ అని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రధాని పదేపదే సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ ప్రకృతి సేద్యాన్ని ఇతోధికంగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. రైతులందరికీ డిజిటల్ టెక్నాలజీ అందించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. మోదీకి బైడెన్ ఆత్మీయ ఆలింగనం జీ–7 సదస్సులో ఆసక్తికరమైన దృశ్యాలు కన్పించాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీ కూర్చున్న కుర్చీ దగ్గరికి వడివడిగా వచ్చారు. ఆయన్ను చూసి మోదీ కుర్చీలోంచి లేచి స్వాగతించారు. నేతలిరువురూ పలకరించుకొని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను కూడా మోదీ ఆప్యాయంగా కౌగిలించుకొని మాట్లాడారు. మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌తో ద్వైపాక్షిక అంశాలపై మోదీ చర్చించారు. అణు విలయపు నేలపై శాంతిమూర్తి రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా అణుబాంబుతో భస్మీపటలమై లక్షలాది మంది మృత్యువాత పడ్డ హిరోషిమా పట్టణంలో శాంతి, అహింసలకు సంఘీభావంగా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మోదీ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదాకు తాను బహుమతిగా ఇచ్చిన బోధి వృక్షాన్ని అక్కడే నాటారని తెలిసి సంబరపడ్డారు. హిరోషిమా పేరు చెబితే ఇప్పటికీ ప్రపంచం వణికిపోతుందని గుర్తు చేశారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి కృషి: మోదీ ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తర్వాత మోదీ తొలిసారిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. జీ–7 సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు కరచాలనం చేసుకొని ఫొటోలకు పోజులిచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం మానవత్వం, మానవ విలువలకు సంబంధించినదని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభానికి సాధ్యమైనంత వరకు పరిష్కార మార్గం కనుగొంటానని జెలెన్స్కీకి హామీ ఇచ్చారు. ‘‘ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ దేశాలన్నింటిపై పలు రకాలుగా ప్రభావం చూపింది. ఉక్రెయిన్‌లో పరిస్థితిని రాజకీయ, ఆర్థిక అంశంగా చూడడం లేదు. మానవత్వం, మానవ విలువలకు సంబంధించిన అంశంగా చూస్తున్నాం. యుద్ధంతో పడే బాధలు మాకంటే మీకే బాగా తెలుసు. ఈ సంక్షోభ పరిష్కారానికి భారత్‌తో పాటు వ్యక్తిగతంగా నేను కూడా కృషి చేస్తానని హామీ ఇస్తున్నా’’ అని చెప్పారు. తాను రూపొందించిన సమగ్ర శాంతి ఫార్ములాలో భారత్ కూడా భాగస్వామి కావాలని జెలెన్స్కీ కోరారు. -
పాన్ వరల్డ్ మేనియాకి సీక్వెల్ ప్రాణం పోస్తుందా..?
-
కేంద్రం కొత్త నిబంధనలు.. మీకు ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకం ఉందా?
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. దీంతో కేంద్రం తెచ్చిన నిర్ణయాలు అమలు కానున్నాయి. ఇప్పటికే ఆధార్ - పాన్ లింక్ గడువును కేంద్రం పెంచింది. అయితే తాజాగా ఆధార్ - పాన్ విషయంలో మరో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్, సుకన్య సమృద్ది యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్ వంటి చిన్న పొదుపు పథకాల్లో (small saving schemes) పాన్‌కార్డ్, ఆధార్ కార్డులను తప్పని సరిచేస్తూ కేంద్ర ఆర్ధిక శాఖ మార్చి 31,2023న నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో స్మాల్ సేవింగ్స్ స్కీంలో పెట్టుబడులు పెట్టేందుకు కేవైసీ తప్పని సరి చేసింది. దీంతో పాటు నిర్దిష్ట థ్రెషోల్డ్ కంటే ఎక్కువ పెట్టుబడిపై పాన్ కార్డును అందించాలని సూచించింది. చిన్న పొదుపు పథకాల్లో కొత్త నిబంధనలు కేంద్ర ఆర్ధిక శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. చిన్న పొదుపు పథకాల్లోని చందాదారులు సెప్టెంబర్ 30,2023లోగా ఆధార్ నెంబర్ ను జతచేయాలని తెలిపింది. కొత్తగా పథకాల్లో చేరిన చందాదారులు 6 నెలల్లోగా ఆధార్‌ను లింక్ చేయాలని సూచించింది. ఒక వేళ స్మాల్ సేవింగ్స్ స్కీంలో కొత్తగా చేరిన వారి 6 నెలల్లోగా ఆధార్‌ను అందించాలని లేదంటే అక్టోబర్ 1, 2013 నుంచి సదరు అకౌంట్లు పనిచేయడం ఆగిపోతాయని వెల్లడించింది. పాన్ కార్డ్సైతం చిన్న మొత్తాల పొదుపు ఖాతాలు తెరిచే సమయంలో పాన్‌కార్డ్‌ని సమర్పించాలి. ఆ సమయంలో సాధ్యం కాకపోతే రెండు నెలల్లో పాన్ కార్డ్‌ను సంబంధిత కార్యాలయాల్లో సమర్పించాలి. ఇక ఆ అకౌంట్లలో రూ.50 వేల కంటే ఎక్కువ ఉన్నప్పుడు, ఒక ఖాతాలో అన్ని క్రెడిట్స్ రూ.లక్ష దాటినప్పుడు, ఒక నెలలో ఖాతా ట్రాన్సాక్షన్ల లావాదేవీలు రూ.10 వేలు దాటితే.. పాన్‌ను సమర్పించాలి. లేదంటే పాన్ అప్డేట్ చేసే వరకు సదరు ఖాతాలు స్తంభించిపోనున్నాయి. చదవండి👉 కేంద్రం కీలక నిర్ణయం.. పాన్ - ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్! -
కేంద్రం కీలక నిర్ణయం.. పాన్ - ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్!
పాన్ - ఆధార్ లింక్ చేశారా? లేదంటే వెంటనే చేయండి’ అంటూ కేంద్రం మార్చి 31,2023 వరకు గడువు విధించింది. తాజాగా ఆ గడువును జూన్ 30,2023 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపు దారులకు మరికొంత సమయం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ అధికారికంగా ట్వీట్ చేసింది. In order to provide some more time to the taxpayers, the date for linking PAN & Aadhaar has been extended to 30th June, 2023, whereby persons can intimate their Aadhaar to the prescribed authority for PAN-Aadhaar linking without facing repercussions. (1/2) pic.twitter.com/EE9VEamJKh — Income Tax India (@IncomeTaxIndia) March 28, 2023 ఈ సందర్భంగా పాన్ - ఆధార్ లింక్ గడువు పొడిగింపుపై కేంద్రం ఆర్ధిక శాఖ స్పందించింది. జూన్ 30, 2023 లోపు పాన్ -ఆధార్ అనుసంధానం చేయాలని, లేదంటే పాన్ కార్డ్ పని చేయదని స్పష్టం చేసింది. ♦ అంతేకాదు పాన్ కార్డ్ నిరుపయోగమైతే చెల్లింపులు నిలిచిపోతాయి. ♦ పాన్ కార్డ్ పని చేయని కాలానికి వడ్డీలు పొందలేరు. ♦ చట్టం ప్రకారం.. టీడీఎస్, టీసీఎస్‌లు ఎక్కువ రేటుతో తొలగించడం /సేకరించడం జరుగుతుంది. కాగా, ఆదాయపు పన్ను శాఖ ఇటీవల ట్వీట్ చేసింది. పాన్ కార్డ్ - ఆధార్ కార్డ్‌ను లింక్ చేయడానికి చివరి తేదీ మార్చి 31, 2023 అని ట్వీట్ చేసింది. ‘ఐటీ చట్టం, 1961 ప్రకారం, పాన్ హోల్డర్లందరూ తమ పాన్‌ను ఆధార్ కార్డ్‌కు లింక్ చేయడం తప్పనిసరి. లేదంటే 1.4.2023 నుండి పాన్ కార్డ్‌లు పనిచేయవని స్పష్టం చేసింది. తాజాగా అనుసంధానానికి గడువు పొడిగింపుతో వినియోగదారులు ఊరట లభించినట్లైంది. చదవండి👉 కేంద్రం కీలక నిర్ణయం!..రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్! -
లింక్ క్లిక్ చేసి లక్షలు నష్టపోయిన 40 మంది.. బాధితుల్లో ప్రముఖ నటి!
సైబర్ మోసాలు నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. కొంచెం ఏమరుపాటుగా ఉన్నా ఖాతాలోని సొమ్మంతా ఊడ్చేస్తారు. సామాన్యులే కాదు సెలెబ్రిటీలు, ప్రముఖులు కూడా ఈ సైబర్ మోసాలకు గురవుతున్నారు. ఇలాగే ముంబైలోని ఒక ప్రైవేట్ బ్యాంక్‌కు చెందిన కస్టమర్లు ఏకంగా 40 మంది తమ కేవైసీ, పాన్ వివరాలను అప్డేట్ చేయాలంటూ వచ్చిన లింక్‌పై క్లిక్ చేసి మోసానికి గురయ్యారు. మూడు రోజుల్లో లక్షల రూపాయలు నష్టపోయారు. బ్యాంక్ కస్టమర్లు తమ గుర్తింపును ధ్రువీకరించుకోవడానికి కేవైసీ చేయించుకోవడం తప్పనిసరి. అయితే ఇందుకోసం బ్యాంకులు ఇలా మెసేజ్‌ల ద్వారా లింక్‌లు పంపవు. సంబంధిత బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్లు లేదా యాప్‌ల ద్వారా ఆన్లైన్లో ఈ-కేవైసీ చేసుకోవచ్చు. అలాగే నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌లకు వెళ్లి ఈ-కేవైసీ చేయించుకోవచ్చు. ఇదీ చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! రూ.295 కట్ అవుతోందా? ఎందుకో తెలుసుకోండి.. ప్రస్తుతం అన్ని బ్యాంకుల్లోనూ పాన్ వివరాలను అప్డేట్ చేసుకోవడం అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో వివరాలను వెంటనే అప్డేట్ చేసుకోవాలని, లేకపోతే బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుందని సైబర్ నేరగాళ్లు ఫిషింగ్ లింక్‌లతో ఎస్సెమ్మెస్‌లు పంపుతున్నారు. కస్టమర్లు కంగారు పడి వెంటనే లింక్ క్లిక్ చేస్తున్నారు. దీంతో నకిలీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులలో కస్టమర్ ఐడీ, పాస్వర్డ్ తదితర రహస్య వివరాలను నమోదు చేసి లక్షల్లో డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి మోసాలకు గురై డబ్బు పోగుట్టుకున్నట్లు ఫిర్యాదు చేసిన 40 మంది బాధితుల్లో ప్రముఖ నటి శ్వేతా మీనన్ కూడా ఉన్నారు. ఇటీవల తనకు ఓ వచ్చిందని, అది బ్యాంక్ నుంచే వచ్చిందని నమ్మి లింక్‌ను క్లిక్ చేశానని ఆమె తెలిపారు. ఇలా క్లిక్ చేసి తన కస్టమర్ ఐడీ, పాస్వర్డ్, ఓటీపీ నమోదు చేశానని పోలీసులకు ఆమె వివరించారు. ఇంతలో బ్యాంక్ అధికారినంటూ ఒక మహిళ ఫోన్ చేసి తన మొబైల్ నంబర్‌కు వచ్చిన మరో ఓటీపీని నమోదు చేయాలని చెప్పడంతో అలాగే చేశానని, ఆ తర్వాత తన ఖాతా నుంచి రూ.57,636 కట్ అయిందని ఆమె పేర్కొన్నారు. -
Aadhaar-Pan Linking: తరుముకొస్తున్న గడువు.. కానీ వీరికి ఆ టెన్షన్ లేదు!
పాన్‌కు ఆధార్ అనుసంధానం చేసుకోవాల్సిన గడువు తరుముకొస్తోంది. పాన్ ఆధార్ లింక్ కేంద్రం తప్పనిసరి చేసింది. ఇందుకు మార్చి 31 వరకు గడువు విధించింది. ఏప్రిల్ 1 తర్వాత ఆధార్ లింక్ చేయని పాన్లు చెల్లుబాటు కావని ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి గడువును కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు పొడిగించింది. ప్రస్తుతం రూ.1000 రుసుం చెల్లించి లింక్ చేసుకునేందుకు మార్చి 31 వరకు గడువు ఉంది. అప్పటికీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోకుంటే ఏప్రిల్ 1 నుంచి ఆ పాన్ చెల్లదు . ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానాల్లో పాన్ - ఆధార్ లింక్ చేసుకోవచ్చు. చదవండి: Google Bard: గూగుల్ బార్డ్ అంటే సెర్చ్ మాత్రమే కాదు.. అంతకు మించి.. ఆన్లైన్లో పాన్-ఆధార్ లింక్ చేసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ https://incometaxindiaefiling.gov.inను సందర్శించవచ్చు. అలాగే ఎస్సెమ్మెస్ ద్వారా పాన్ ఆధార్ లింక్ చేసుకునేందుకు 567678 లేదా 56161 నంబర్‌కి UIDPAN < SPACE > < 12 అంకెల ఆధార్ నంబర్ > < SPACE > < 10 అంకెల పాన్ నంబర్ > టైప్ చేసి ఎస్మెమ్మెస్ చేయొచ్చు. ఇన్ ఆఫ్‌లైన్ ద్వారా పాన్ ఆధార్ లింక్ చేసుకోవాలనుకున్న వారు సమీపంలోని పాన్ సర్వీస్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించవచ్చు. వీరికి మినహాయింపు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139ఎఎ ప్రకారం.. పాన్ ఆధార్‌తో లింక్ చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి అది పనిచేయదు. అయితే దీని నుంచి కొందరికి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. 2017 మేలో కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. పాన్-ఆధార్ లింకింగ్ నిబంధన నుంచి ఈ నాలుగు వర్గాలకు మినహాయింపు ఉంది. అస్సాం, మేఘాలయ, జమ్మ కశ్మీర్ రాష్ట్రాల వాసులు. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం నాన్-రెసిడెంట్లు. 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు. భారతదేశ పౌరులు కాని వారు. చదవండి: బంగారు నగలపై కేంద్రం కొత్త రూల్.. ఇకపై ఇది తప్పనిసరి! -
బాహుబలి, RRR కాదు.. తెలుగులో ఫస్ట్ పాన్ వరల్డ్ సినిమా ఇదే..
-
పాన్-ఆధార్ లింక్ చేశారా? లేదంటే భారీ షాక్ తప్పదు! డెడ్‌లైన్ ఎపుడో తెలుసా?
సాక్షి, ముంబై: వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు తమ ఆధార్ కార్డ్‌ని పాన్ కార్డ్‌తో లింక్ చేయడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ మీరు లింక్ చేయకపోతే వెంటనే పాన్‌తో ఆధార్ లింక్ చేయాలి. లేని పక్షంలో ఆదాయపు పన్ను రిటర్న్ ప్రాసెస్ కావు.అంతేకాదు ప్యాన్ చెల్లుబాటుకాదు. ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం, మినహాయింపు వర్గం కిందకు రాని పాన్ కార్డు హోల్డర్లందరూ వచ్చే ఏడాది మార్చి కి ( 31.3.2023) లోపు తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. తరువాత నుంచి అంట 1.4.2023 నుండి లింక్ చేయని ప్యాన్ కార్డుపనిచేయదు. కనుక ఆలస్యం చేయకుండా సాధ్యమైనంత తొందరగా లింక్ చేసుకోవడం బెటర్. (మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు: ఆలస్యం చేస్తే..!) పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం గడువును కేంద్రం పలుమార్లు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ డెడ్‌లైన్‌ను 2023 మార్చి 31గా ప్రకటించింది. అంతేకాదు వచ్చే ఏడాది మార్చి 31లోగా ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయదని కేంద్రం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ అధికారిక ట్విటర్ ఖాతాలో హెచ్చరికను జారీ చేసింది. పాన్‌ను ఆధార్ తో అనుసంధానానికి విధించిన సాధారణ గడువు ముగిసిందని, అయితే గడువు పొడిగించిన నేపథ్యంలో ఆలస్య రుసుం కింద రూ.1000 చెల్లించి పాన్ తో ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుందని ఐటీ శాఖ వెల్లడించింది. As per Income-tax Act, 1961, it is mandatory for all PAN holders, who do not fall under the exempt category, to link their PAN with Aadhaar before 31.3.2023. From 1.4.2023, the unlinked PAN shall become inoperative. The last date is approaching soon. Don’t delay, link it today! pic.twitter.com/OcvtJfewH2 — Income Tax India (@IncomeTaxIndia) December 10, 2022 (లగ్జరీ ఎస్యూవీ బీఎండబ్ల్యూ ఎక్స్ఎం వచ్చేసింది..ధర తెలిస్తే!) ఇదీ చదవండి: రాత్రికి రాత్రే కోటీశ్వరులు..ఏకంగా 165 మందికి జాక్‌పాట్! ఎలా ? -
మీరు పీఎఫ్ ఖాతాదారులా? యూఏఎన్ నెంబరు ఎలా పొందాలో తెలుసా?
ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులు ఆన్లైన్లో యూఏఎన్ (యూనివర్సల్ నంబర్)ను క్రియేట్ చేసుకోవచ్చు. యూనివర్సల్ అకౌంట్ నంబర్ అనేది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన ప్రావిడెంట్ ఫండ్ ఖాతా సభ్యులకు కేటాయించే 12-అంకెల కోడ్. ఉద్యోగులు ఈపీఎఫ్ పోర్టల్‌లో యూఏఎన్ నెంబర్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. యూఏఎన్ నెంబర్ అనేది తొలిసారి ఉద్యోగంలో చేరిన వెంటనే ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతుంది. ఒక సంస్థ నుండి మరొక సంస్థకు ఉద్యోగం మారినపుడు, ఆ ఉద్యోగి ఐడీ నంబరు మారినట్టుగా యూఏఎన్ మారదు. అందుకే అది యూనివర్సల్ అయింది. ఎన్ని ఉద్యోగాలు మారినా కూడా యూఏఎన్ నెంబర్ మాత్రం ఒక్కటే ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త సంస్థలో చేరిన సమయంలో ఉద్యోగి తప్పనిసరిగా యజమానికి తమ యూఏఎన్ నంబరును అందించాలి. అపుడు ఈఫీఎఫ్‌వో కొత్త ధ్రువీకరణ ఐడీని కేటాయిస్తుంది. ఇది ఒరిజినల్ యూఏఎన్‌తో లింక్ అవుతుంది. అలాగే ఈపీఎఫ్‌వో సేవలను పొందడానికి యూఎన్ఏ నెంబర్‌తో కేవైసీ లింక్ చేయాల్సి ఉంటుంది. యూఏఎన్‌తో మాత్రమే ఈపీఎఫ్‌వో సభ్యుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతా మేనేజ్మెంట్ సులువవుతుంది. ముఖ్యంగా బ్యాలెన్స్ చెక్, లోన్ దరఖాస్తులను సమర్పించడం లాంటివి. దీనికి ఎలాంటి భౌతిక పత్రాలు అవసరం లేకుండా ఆన్లైన్లో ఉప సంహరణ అభ్యర్థనను ఈజీగా చేసుకోవచ్చు. అయిత మొదటిసారి EPFO సైన్ అప్ చేస్తున్నప్పుడు ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ప్యాన్, ఆధార్‌తోపాటు, ఉద్యోగి స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) కార్డ్‌ను నమోదు చేయాలి. ఆన్లైన్లో యూఏఎన్ ఎలా పొందవచ్చు. • ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో మెంబర్ ఇ-సేవాకు లాగిన్ అవ్వాలి • ముఖ్యమైన లింక్ విభాగంలో అందుబాటులో ఉన్న “UANని యాక్టివేట్ చేయండి” ఆప్షన్‌పై క్లిక్ చేయండి • ఆధార్ ఆప్షన్ ఎంచుకుని, తదుపరి సూచలన మేరకు అవసరమైన వివరాలు నమోదు చేయండి • గెట్ ఆథరైజేషన్ పిన్ బటన్ పై క్లిక్ చేయండి.. ఇక్కడ మనం నమోదు చేసిన వివరాలను క్రాస్ చెక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది • కొనసాగించడానికి అంగీకరించు చెక్‌బాక్స్‌పై క్లిక్ చేయండి • మీ అభ్యర్థనను ధృవీకరించడానికి మీ మొబైల్ల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయండి • UANని యాక్టివేట్ చేయండిపై క్లిక్ చేయండి. • ఈ ప్రాసెస్ అంతా పూర్తి అయిన తరువాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు యూఏఎన్ నంబర్, పాస్వర్డ్ మెసేజ్ వస్తుంది. -
ఏడాదికి రూ. 20 లక్షలకు మించి డిపాజిట్ చేస్తే..
సాక్షి, ముంబై: అక్రమ నగదు లావాదేవీలకు అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఏడాదికి 20 లక్షలకుమంచి నగదు డిపాజిట్ చేస్తే పాన్, ఆధార్ తప్పనిసరిగా నమోదు చేయాలి. 2022, మే 10 నాటి నోటిఫికేషన్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటా) రూపొందించిన కొత్త నియమాలు, నిబంధనల సవరించింది. ఒక ఏడాది వ్యవధిలో నిర్దిష్ట మొత్తానికి (రూ.20 లక్షలు) మించి డిపాజిట్ చేస్తే పాన్, ఆధార్ వివరాలను సమర్పించాలని నిర్దేశించడం ఇదే తొలిసారి. ఆర్థికం స్కాంలు, లెక్కల్లో చూపని నగదు లావాదేవీలను అరికట్టడానికి, ప్రభుత్వం వార్షిక నగదు పరిమితి నిబంధనలను సవరించింది. ఇప్పటికి వరకు రోజుకు రూ.50వేలకు మించి బ్యాంకులో డిపాజిట్ చేసే వారి పాన్ కార్డు వివరాలను అందించే నిబంధన ఉంది. ఇకపై ఏడాదికి 20 లక్షలకు మించి బ్యాంకులో డిపాజిట్ చేస్తే పాన్ నెంబరు, ఆధార్ వివరాలు తప్పనిసరిగా అందించాలి. ఒకవేళ పాన్ నంబర్ లేకుంటే. ఆ లావాదేవీ చేయడానికి వారం ముందు పాన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న రశీదును బ్యాంకులో సమర్పించాల్సి ఉంటుంది. సన్నిహిత కుటుంబ సభ్యులనుంచి తప్ప రూ. 2 లక్షల కంటే ఎక్కువ విలువైన నగదును స్వీకరించడం కూడా నిషేధం. నిబంధనలకు విరుద్థంగా పరిమితికి మించి నగదు చెల్లించినా, స్వీకరించినా లావాదేవీ మొత్తంలో 100 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక మోసం, అక్రమ నగదు లావాదేవీలు , ఇతర డబ్బు నేరాల ప్రమాదాన్ని తగ్గించేలా ఆదాయపు పన్ను శాఖ, ఇతర కేంద్రం కసరత్తులో భాగంగా నిబంధనలను సవరిస్తోన్న సంగతి తెలిసిందే. -
విషం పెట్టి చంపాలని ప్లాన్ చేశారు, ఆ ఒక్క ఫోన్‌కాల్‌తో..
తన కామెడీతో జనాలను పొట్టచెక్కలయ్యేలా నవ్వించాడు కమెడియన్ బాబూ మోహన్. సినిమాలతో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయ రంగంలోనూ అడుగుపెట్టాడు. అయినప్పటికీ ఆయనకు సినిమాల మీద ప్రేమ తగ్గలేదు. ప్రస్తుతం పలు సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న బాబూ మోహన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఢిల్లీలో 'వన్స్‌మోర్' సినిమా షూటింగ్ చేస్తున్నాం. సెట్స్‌లో తనికెళ్ల భరణి పాన్ తింటున్నాడు. నన్ను రుచి చేయమన్నాడు. సరేనని ఒకటి నోట్లో పెట్టుకున్నా, కానీ ఛీఛీ అని దాన్ని ఊసేశా. విచిత్రంగా తర్వాతి రోజు నుంచి నేనే ఒక పాన్ ఇవ్వమని అడిగేవాడిని. అలా ఒకానొక దశలో రోజుకు 30 నుంచి 40 దాకా పాన్లు తినేవాడిని. సంగారెడ్డి వచ్చానంటే అక్కడ ఓ డబ్బాలో కచ్చితంగా పాన్ తినేవాడిని. నేను అక్కడ పాన్ కట్టించుకుంటానని తెలిసిన కొందరు ఓసారి అందులో విషాన్ని కలిపారు. నేను ఆ డబ్బా దగ్గరకు వెళ్లి పాన్ తీసుకుని కారులో వెళ్లాను. ఇక తిందామనుకునే సమయానికి ఫోన్ వచ్చింది. దయచేసి పాన్ తినకండి, అందులో విషం ఉందని చెప్పారు. వెంటనే పాన్ పక్కన పడేశాను. అంతలోనే మరో ఫోన్ కాల్ వచ్చింది. ఈసారి పాన్ కట్టే వ్యక్తి భార్య మాట్లాడుతూ.. తప్పయిపోయింది సార్, విషం కలిపిన పాన్ ఇవ్వమని మమ్మల్ని ఒత్తిడి చేశారంటూ ఏడ్చింది. రాజకీయాలు ఇంత ప్రమాదమా? అని అప్పుడు తెలిసొచ్చింది' అని చెప్పుకొచ్చాడు బాబూ మోహన్. చదవండి: రాకెట్రీలో ఆ సీన్ మళ్లీ మళ్లీ చూశానన్న నెటిజన్, హీరో దెబ్బకు ట్వీట్ డిలీట్! ప్రేయసితో హృతిక్ రోషన్ రోడ్ ట్రిప్, వీడియో చూశారా? -
భారీ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా? కొత్త రూల్స్ ఈ రోజు నుంచే
సాక్షి, న్యూడిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఇటీవల జారీ చేసిన కొత్త నిబంధనలు నేటి (మే 26) నుంచి అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం 20 లక్షలు రూపాయలు అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీలకు పాన్ లేదా ఆధార్ తప్పనిసరిగా ఉండాలి. మే 10 నాటి నోటిఫికేషన్లో ప్రకటించిన కొత్త నిబంధన ప్రకారం ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల కన్నా ఎక్కువ విత్‌డ్రా చేసినా, డిపాజిట్ చేసినా తన పాన్ నెంబర్ పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ నంబర్‌ను వెల్లడించాలి. ఇంతకుముందు, ఒకే రోజులో రూ 50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేసేటప్పుడు మాత్రమే పాన్ నంబర్ అవసరం. కానీ నగదు డిపాజిట్ లేదా ఉపసంహరణకు వార్షిక పరిమితి లేదు. కొత్త నిబంధనలు ఖాతాదారులు ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులతోపాటు, కోఆపరేటీవ్ బ్యాంకుల్లో రూ.20 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ చేసినా కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. బ్యాంకులేదా పోస్ట్ ఆఫీసులో కరెంట్ ఖాతా క్యాష్ క్రెడిట్ అకౌంట్ ఓపెన్ చేసినా పాన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ వివరాలు ఇవ్వడం తప్పనిసరి. అంతేకాదు ఒకేసారి రూ.20 లక్షల ట్రాన్సాక్షన్ చేసినా, వేర్వేరు సందర్భాల్లో మొత్తం కలిపి రూ.20 లక్షల లావాదేవీలు జరిపినా పాన్ నెంబరును నమోదు చేయాలి. అయితే ఈ లావాదేవీలు జరిపే సందర్భంలో పాన్ నెంబర్, ఆధార్ నంబర్లను తీసుకునే వ్యక్తులు అవి సరైన వివరాలేనా కాదా అని నిర్థారించుకోవాలని సీబీడీటీ వెల్లడించింది. ఏయే వ్యక్తులు పాన్ కార్డ్ కోసం అప్లై చేయాలో, ఎవరు పాన్ కార్డ్ వివరాలను వెల్లడించాలో సెక్షన్ 139ఏ తెలుపుతుంది. అందుకే సీబీడీటీ రూ.20 లక్షల కన్నా ఎక్కువ లావాదేవీలకు పాన్ కార్డ్ లేదా ఆధార్ నెంబర్ తప్పనిసరి. ఒకవేళ భారీ ఆర్థిక లావాదేవీలు జరిపే వారి దగ్గర పాన్ కార్డ్ లేకపోతే లావాదేవీ చేసే తేదీకి కనీసం 7 రోజుల ముందు పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సీబీడీటీ తన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. లేదంటే సంబంధిత లావాదేవీలకు ఆస్కారం ఉండదు. -
‘‘పాన్’’ కంపల్సరీ.. కాదంటే కుదరదు..
రాను రాను పర్మనెంట్ అకౌంట్ నంబర్ లేకపోయినా, వాడకపోయినా, పేర్కొనకపోయినా ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉంది. గతంలో ఎన్నోసార్లు మనం ప్రస్తావించాం. ఏయే సందర్భాల్లో పాన్ని తెలియజేయాలో .. ఇప్పుడు అదే దిశలో ఆదాయపు పన్ను శాఖ మరో పెద్ద ముందడుగు వేసింది. మే 10వ తేదీన ఒక నోటిఫికేషన్ వచ్చింది. అందులో పేర్కొన్న నిబంధనలు త్వరలోనే అమల్లోకి వస్తాయి. ఆ మార్పులు, చేర్పుల సారాంశం ఏమిటంటే .. కొన్ని నిర్దేశిత వ్యవహారాలకు నిర్దిష్ట పరిమితులను పొందుపర్చారు. ఆ లావాదేవీలు చేసే ముందు విధిగా పాన్ లేదా ఆధార్ గురించి ప్రస్తావించాలి. ఈ లావాదేవీలు ఏ సంస్థతో జరుపుతారో ఆ సంస్థ పాన్ / ఆధార్‌తో పాటు ఆ వ్యక్తి యొక్క ‘‘వివరాలు’’ (ఉదాహరణకు వయస్సు, లింగభేదం, చదువు, జాతీయత, మతం మొదలైనవి) అడిగే అవకాశం ఉంది. డెమోగ్రాఫిక్ సమాచారంలో అన్ని వివరాలు అడగవచ్చు. బయోమెట్రిక్ సమాచారం కూడా అడుగుతారు. అంటే సమగ్ర సమాచారాన్ని సేకరిస్తారు. నిర్దేశిత ఆర్థిక వ్యవహారాలు ఏమిటంటే.. - ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు లేదా ఇతర డిపాజిట్లకు సంబంధించి ఒకటి లేదా ఎన్ని బ్యాంకు ఖాతాల్లోనైనా లేదా పోస్టాఫీసులో రూ. 20,00,000 లేదా అంతకన్నా ఎక్కువ డిపాజిట్ చేస్తే, డిపాజిట్‌దారు పాన్/ఆధార్ సంఖ్య వేయాలి. పుచ్చుకున్న బ్యాంకు/పోస్టాఫీసు ముందుగా పేర్కొన్నట్లు ఆదాయపు పన్ను శాఖలోని ఉన్నతాధికారులకు సమగ్ర సమాచారాన్ని అందించాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక బ్రాంచ్ కాదు.. ఒక బ్యాంకు కాదు అన్ని బ్యాంకుల్లోనూ ఎక్కడ డిపాజిట్ చేసినా ఈ రూలు వర్తిస్తుంది. - ఇదే మాదిరిగా బ్యాంకు నుంచి, పోస్టాఫీస్ నుంచి మనం చేసే విత్‌డ్రాయల్స్, అకౌంట్ నుంచి .. ఒకసారి కాదు అనేక దఫాలుగా ఒక ఆర్థిక సంవత్సరంలో తీసినది, డెబిట్ అయినది, నగదు విత్‌డ్రాయల్ కాకుండా చెక్, బదిలీ ద్వారా విత్‌డ్రా చేసినది ఇలాంటి వాటన్నింటికీ కలిపి మొత్తం పరిమితి రూ. 20,00,000గాఉంటుంది. ఇటువంటి సందర్భంలోనూ అవే రూల్సు వర్తిస్తాయి. - బ్యాంకులో కరెంటు అకౌంటు తెరిచినా, క్యాష్ క్రెడిట్ అకౌంటు తెరిచినా, అలాగే పోస్టాఫీసులో కరెంటు ఖాతా తెరిచినా ఎటువంటి పరిమితులు లేవు. ఇవన్నీ ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమల్లోకి వస్తాయి. తగిన జాగ్రత్త వహించి అడుగేయండి. ఎన్ని నిబంధనలు ఎంత కఠినంగా అమలుపర్చినా మీ డిపాజిట్లకు సరైన ‘‘సోర్స్’’ ఉంటే .. సరిలేరు మీకెవ్వరు. - కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) -
LIC IPO: పాన్ నంబరు అప్డేట్ చేయండి.. ఎల్ఐసీ సూచన
న్యూఢిల్లీ: ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూలో పాల్గొనేందుకు తమ తమ పాన్ నంబర్లను అప్డేట్ చేయాల్సిందిగా పాలసీదారులకు ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) సూచించింది. ఇష్యూకి సబ్స్క్రయిబ్ చేయాలంటే కంపెనీ రికార్డుల్లో పాలసీదారుల తాజా పాన్ వివరాలు ఉండాలని, అలాగే చెల్లుబాటయ్యే డీమ్యాట్ ఖాతా అవసరమని పేర్కొంది. దీనిపై పాలసీహోల్డర్లలో అవగాహన పెంచేందుకు ప్రచార కార్యకర్మాలు నిర్వహిస్తున్నామని ఎల్ఐసీ తెలిపింది. ఒకవేళ ఎవరికైనా డీమ్యాట్ ఖాతా లేకపోతే తమ సొంత ఖర్చుతో ఒక అకౌంటును తీసుకోవాలని పేర్కొంది. సదరు డీమ్యాట్ ఖాతా తెరవడం, నిర్వహణ.. పాన్ జారీ మొదలైన వాటికి అయ్యే ఖర్చు లను పాలసీదారే భరించాల్సి ఉంటుందని, కంపెనీకి సంబంధం లేదని ఎల్ఐసీ స్పష్టం చేసింది. ఐపీవోకి రెడీ ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదనకు ఈ ఏడాది జూలైలో ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలోనే దీన్ని పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపాదన ప్రకారం ఇష్యూ పరిమాణంలో 10 శాతం దాకా షేర్లను పాలసీదారులకు కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ కీలకంగా ఉండనుంది. చదవండి: ఎల్ఐసీ ఐపీవోకు మర్చంట్ బ్యాంకర్లు రెడీ -
ఆర్థిక నేరాల కట్టడికి ‘ఆధార్’ టెక్నాలజీ
న్యూఢిల్లీ: ఆర్థిక నేరాలను గుర్తించేందుకు ఆధార్ ఆధారిత టెక్నాలజీలను ఉపయోగించుకోవచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఎండీ దిలీప్ అస్బే తెలిపారు. రాబోయే మూడు–నాలుగేళ్లలో ఇలాంటి టెక్నాలజీ అందుబాటులోకి రాగలదని ఆధార్ 2.0 వర్క్‌షాప్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ముందే గుర్తించే వీలు విశిష్ట గుర్తింపు ధృవీకరణ పత్రంగా ఆధార్ ఎంతో విలువైనదని, కానీ దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం లేదని దిలీప్ అభిప్రాయపడ్డారు. ‘మన దేశంలో పన్నులు ఎగ్గొట్టడమనేది పెద్ద సమస్యగా ఉంటోంది. ప్రస్తుతం పాన్‌ను, ఆధార్‌ను అనుసంధానించడం వల్ల, ఒక వ్యక్తికి పలు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నా.. అన్నీ కూడా ఆధార్‌కు లింక్ అయి ఉంటాయి. అనుమానాస్పద కేసుల్లో ఈ డేటాను మరింత లోతుగా పరిశీలించడం ద్వారా పన్ను ఎగవేత సందర్భాలను కూడా గుర్తించవచ్చు‘ అని దిలీప్ చెప్పారు. ఎవరైనా కస్టమర్ ఆర్థిక మోసానికి పాల్పడితే .. పలు సంస్థలపై దాని ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. ‘ఇలాంటి మోసాలను ఎవ్వరూ ఆపలేకపోవచ్చు. అయితే, ఆధార్‌లాంటి విశిష్టమైన పత్రంతో మోసాలకు సంబంధించిన ఒక రిపాజిటరీని తయారు చేయొచ్చు. ఒక వ్యక్తి మోసం చేస్తే వారికి సిమ్ కార్డ్ మొదలుకుని బ్యాంక్ ఖాతా, వాలెట్ లాంటివి ఏవీ మళ్లీ లభించకుండా చేయొచ్చు. ఈ విధంగా మోసగాళ్లను ఆదిలోనే గుర్తించి, వారికి అడ్డుకట్ట వేయొచ్చు’ అని అన్నారు. చదవండి:‘ఆధార్‌పై ఆంక్షలు పెడితే.. అసలుకే ఎసరు’ -
మీ పాన్ కార్డ్ పోయిందా..! ఇలా డౌన్లోడ్ చేసుకోండి
పాన్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం మన దగ్గర ఉండాల్సిన కీలకమైన డాక్యుమెంట్లలో ఇది కూడా ఒకటి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం దగ్గరి నుంచి బ్యాంక్ ఖాతా ఓపెనింగ్, క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవడం వరకు చాలా సందర్భాల్లో పాన్ కార్డు అవసరం పడుతూ వస్తుంది. అందుకే పాన్ కార్డును జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒకవేళ మీ పాన్ కార్డు కనిపించకుండాపోతే మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు మళ్లీ పాన్ కార్డు కోసం అప్లిచేసుకోవచ్చు. డూప్లికేట్ పాన్ కార్డు మీ ఇంటికి వస్తుంది. దీనికి రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్లోనే డూప్లికేట్ ఈ-పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ-పాన్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి.. ఆదాయపు పన్ను శాఖ వెబ్ సైట్ ఓపెన్ చేయండి డౌన్లోడ్ ఈ-పాన్ కార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీ పాన్ నెంబరు, ఆధార్ నెంబరును నమోదు చేయాల్సి ఉంటుంది. మీ పుట్టిన తేదీని నమోదు చేసి, నియమ నిబంధనలను ఆమోదించండి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుపై ఓటీపీని అందుకుంటారు. ఓటీపీ ధృవీకరించిన తర్వాత పేమెంట్ చేయడానికి ఒక ఆప్షన్ మీ ముందు కనిపిస్తుంది. మీరు రూ.8.26 చెల్లించాల్సి ఉంటుంది. మీరు పేటిఎమ్, యుపీఐ, క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు. మీరు పేమెంట్ చేసిన తర్వాత ఈ పాన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు పేమెంట్ చేసిన తర్వాత పీడిఎఫ్ లో ఈ-పాన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు పాస్ వర్డ్ అవసరం అవుతుంది. దీనికి పాస్ వర్డ్ మీ పుట్టిన తేదీ. ఒకవేళ మీరు ఎప్పుడైనా పాన్ కార్డును కోల్పోతే, మీరు ఒకేసారి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఇది కాకుండా, మీ పాన్ తో ఏదైనా బినామీ లావాదేవీ జరిగిందా లేదా అని ఫారం 26ఎఎస్ నుంచి మీరు తెలుసుకోవచ్చు.(చదవండి: రుణ గ్రహీతలకు ఎస్బీఐ పండుగ బొనాంజా ఆఫర్లు) -
స్టాక్ మార్కెట్,నెలాఖరులోగా పాన్–ఆధార్ లింక్ చేసుకోవాలి
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు సెప్టెంబర్ 30 నాటికి తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించుకోవాలని సెబీ కోరింది. తద్వారా లావాదేవీలు సాఫీగా నిర్వహించుకునేందుకు వీలుంటుందని పేర్కొంది. పాన్–ఆధార్‌తో లింక్ చేసుకోవాలని కేంద్ర సర్కారు ఎప్పటి నుంచో కోరుతోంది. కాకపోతే కరోనా వల్ల ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో గడువును పొడిగిస్తూ వచ్చింది. ఈ నెల 30 వరకు పాన్–ఆధార్ అనుసంధానానికి గడువు ఉంది. గడువులోపు లింక్ చేసుకోకపోతే పాన్ పనిచేయదు. పాన్ పనిచేయనప్పుడు కేవైసీ అసంపూర్ణంగా మారుతుంది. పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలకు కేవైసీ తప్పనిసరి అని తెలిసిందే. దీంతో పాన్ బ్లాక్ చేయడం వల్ల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోలేని, కొత్తగా పెట్టుబడులు చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. ‘‘సెక్యూరిటీస్ మార్కెట్లో అన్ని లావాదేవీలకు పాన్ ఏకైక గుర్తింపు సంఖ్య. సీబీడీటీ నోటిఫికేషన్ నిబంధనలను సెబీ నమోదిత సంస్థలు అమలు చేయాలి. సెప్టెంబర్ 30 తర్వాత కొత్త ఖాతాల ప్రారంభానికి ఆపరేటివ్ పాన్నే అనుమతించాలి’’ అని సెబీ తన ప్రకటనలో పేర్కొంది. చదవండి: స్పెషల్ ఎకనామిక్ జోన్, 2.15 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు -
మీ పాన్ కార్డ్ పోయిందా..! వెంటనే ఇలా చేయండి..!
e-PAN Card Download Online: పర్మినెంట్ అకౌంట్ నెంబర్(PAN) పాన్ కార్డు దేశవ్యాప్తంగా ముఖ్యమైన గుర్తింపు కార్డులలో ఒకటి. బ్యాంకుల్లో ఎక్కువ లావాదేవీలను జరిపే వారికి పాన్‌కార్డ్ అనేది తప్పనిసరి. దురదృష్టవశాత్తు మీ పాన్‌కార్డు పోతే బాధపడకండి. పాన్‌కార్డును ఆన్లైన్లో తిరిగి పొందవచ్చును. మీ పాన్ కార్డును పోగొట్టుకున్నట్లయితే, పాన్ కార్డులను జారీ చేసే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) అధికారిక వెబ్సైట్ నుంచి పాన్‌కార్డును మరల పొందవచ్చును. ఏదైనా అత్యవసర పని కోసం మీకు మీ పాన్ కార్డ్ అవసరమైతే, మీరు కేవలం ఎలక్ట్రానిక్ పాన్ కార్డ్ లేదా ఈ-పాన్ డౌన్లోడ్ చేసుకోనే సౌకర్యాన్ని ఎన్ఎస్డీఎల్ కల్పిస్తోంది. మీరు ఆన్లైన్లో ఈ-పాన్‌ను ఇలా పొందండి స్టెప్1: ఆన్లైన్లో ఈ-పాన్ కార్డును డౌన్లోడ్ చేయడానికి, మీరు యుటిఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ https://www.utiitsl.com/ అధికారిక వెబ్‌సైట్‌కు సందర్శించండి. స్టెప్ 2: అందులో 'పాన్ కార్డ్ సర్వీసెస్ ' ఆప్షన్‌ను ఎంచుకోండి. స్టెప్ 3: క్లిక్ చేశాక మీరు మరో వెబ్‌పేజీకి మళ్ళించబడతారు. అందులో 'డౌన్లోడ్ ఇ-పాన్' పై క్లిక్ చేయండి. స్టెప్ 4: తరువాత వచ్చే వెబ్‌పేజీలో మీ పాన్ కార్డ్ వివరాలను నమోదు చేయాలి. స్టెప్ 5: మీ పుట్టిన తేదీ వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయాలి. మీరు మీ GSTIN నంబర్‌ను కూడా నమోదు చేయవచ్చు. స్టెప్ 6: క్యాప్చా వివరాలను సబ్మిట్ చేసి మీ వివరాలను ధృవీకరించండి. స్టెప్ 7: ఇప్పుడు, మీరు మీ ఇమెయిల్ ఐడి మరియు రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌పై లింక్‌ను అందుకుంటారు స్టెప్ 8: ఇప్పుడు మీరు మీ ఈ మెయిల్ ఐడి, రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌పై లింక్ వస్తుంది. మీ ఈ మెయిల్ ఐడి, రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌ను ధృవీకరించడానికి ఓటీపీ వస్తోంది. ఓటీపీని ఎంటర్చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత మీ ఈ-పాన్ కార్డు డౌన్లోడ్ అవుతుంది. గమనిక: మీరు మీ ఈ- పాన్‌కార్డును పొందాలంటే కచ్చితంగా మీ ఫోన్ పాన్‌కార్డుతో రిజిస్టరై ఉండాలి. అధికారిక వెబ్సైట్ నుంచి మీరు నెలకు మూడుసార్లు మాత్రమే ఈ-పాన్‌ను పొందుతారు. -
పాన్–ఆధార్ గడువు మరో 3 నెలలు
న్యూఢిల్లీ: పర్మనెంట్ అకౌంట్ నంబరు (పాన్)తో ఆధార్‌ను అనుసంధానించేందుకు నిర్దేశించిన డెడ్‌లైన్‌ను కేంద్రం మూడు నెలల పాటు పొడిగించింది. జూన్ 30 దాకా దీన్ని పెంచుతున్నట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి పరిణామాల నేపథ్యంలో ఆఖరు తేదీని పొడిగించాలంటూ పన్నుచెల్లింపుదారుల నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వాస్తవానికి దీనికి ముందుగా నిర్దేశించిన గడువు మార్చి 31. మరోవైపు, పన్ను వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన ‘వివాద్ సే విశ్వాస్ స్కీమ్’ గడువు మార్చి 31తో ముగిసింది. వాస్తవానికి డిక్లరేషన్ దాఖలు చేయడానికి ఫిబ్రవరి 28, చెల్లింపులు జరిపేందుకు మార్చి 31 ఆఖరు తేదీలు. అయితే, ఆదాయ పన్ను శాఖ ఈ డెడ్లైన్లను గతంలో పొడిగించింది. దీని ప్రకారం డిక్లరేషన్ల దాఖలుకు మార్చి 31తో గడువు ముగిసింది. ఏప్రిల్ 30లోగా చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. ఈ స్కీము కింద ఫిబ్రవరి 22 దాకా సుమారు రూ. 98,328 కోట్ల విలువ చేసే పన్ను వివాదాలకు సంబంధించి 1.28 లక్షల డిక్లరేషన్లు దాఖలయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ గత నెలలో లోక్‌సభకు తెలిపారు. దీని ద్వారా సుమారు రూ. 53,346 కోట్లు ఖజానాకు వచ్చాయి. గతేడాది ఆగస్టు నాటి గణాంకాల ప్రకారం 50.95 కోట్ల పాన్ కార్డులు ఉండగా 32.71 కోట్ల పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానించారు. -
బ్యాంకులకు ఐటీఆర్ దాఖలు వివరాలు
న్యూఢిల్లీ : ఆదాయపన్ను శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) ఆధారంగా సంస్థల రిటర్నుల దాఖలు వివరాలను షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు తెలుసుకునే ఏర్పాటును (ఐటీఆర్ ఫైలింగ్ కాంప్లియన్స్) ఆదాయపన్ను శాఖ ప్రారంభించింది. భారీ మొత్తాల్లో నగదును ఖాతాల నుంచి తీసుకుంటున్న వారు ఇప్పటి వరకు రిటర్నులు దాఖలు చేయలేదని డేటా ఆధారంగా తెలుస్తోందని ఆదాయపన్ను శాఖ తెలిపింది. ఇటువంటి వ్యక్తులు రిటర్నులు దాఖలు చేసేలా చూసేందుకు, నల్లధనాన్ని నియంత్రించేందుకు కేంద్రం చట్టంలో పలు సవరణలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. నగదు ఉపసంహరణలు రూ.20 లక్షలు, అంతకుమించి చేస్తే టీడీఎస్ అమలు ఇందులో భాగమే. (స్కూల్‌నెట్ ఇండియా విక్రయానికి ఓకే..) ఐటీ రిఫండ్స్... రూ.98,625 కోట్లు ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ గడచిన ఐదు నెలల్లో (2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్1వ తేదీ వరకూ) 26.2 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు రూ.98,625 కోట్ల రిఫండ్స్ ఇచ్చింది. బుధవారం వెలువరించిన సవరిత గణాంకాల ప్రకారం– 24,50,041 లక్షల మంది వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు జరిపిన రిఫండ్స్ విలువ రూ.29,997 కోట్లు. కార్పొరేట్ల విషయంలో 1,68,421 లక్షల మందికిపైగా పన్ను చెల్లింపుదారులకు జరిపిన రిఫండ్స్ విలువ రూ.68,628 కోట్లు. కోవిడ్–19 మహమ్మారి సవాళ్లు విసురుతున్న ప్రస్తుత సమయంలో ఎటువంటి జాప్యం లేకుండా పన్ను చెల్లింపుదారులకు సంబంధిత సేవలు సకాలంలో అందాలని ఆదాయపు పన్ను శాఖను కేంద్రం నిర్దేశించింది. పన్ను రిఫండ్స్ ఎప్పటికప్పుడు జరగాలని స్పష్టం చేసింది. (ఫార్చూన్ ‘40’లో అంబానీ వారసులు) -
ఆధార్‌తో తక్షణం పాన్ నంబరు
న్యూఢిల్లీ: ఆధార్ వివరాలు సమర్పిస్తే చాలు తక్షణమే ఆన్లైన్లో పాన్ నంబరు కేటాయించే విధానాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రారంభించారు. ‘ఆధార్ నంబరుతో పాటు దానికి అనుసంధానమైన మొబైల్ నంబరు ఉండి, పాన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఈ సదుపాయం వర్తిస్తుంది. పూర్తిగా పేపర్ రహితంగా, ఎలక్ట్రానిక్ పాన్ (ఈ–పాన్) నంబరును ఉచితంగా కేటాయించడం జరుగుతుంది’ అని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ ఈ–ఫైలింగ్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తుదారు ఇన్స్టంట్ పాన్ పొందవచ్చు. వెబ్సైట్లో తన ఆధార్ నంబరు పొందుపర్చాక, దానికి అనుసంధానమైన దరఖాస్తుదారు మొబైల్ నంబరుకు వన్‌టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఓటీపీని సమర్పించాక 15 అంకెల అక్నాలెడ్జ్మెంట్ నంబరు వస్తుంది. కేటాయింపు పూర్తయ్యాక ఈ–పాన్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆధార్‌తో రిజిస్టరైన మెయిల్–ఐడీ ఉంటే దానికి కూడా ఈ–మెయిల్ వస్తుంది. తక్షణం పాన్ కేటాయించే ప్రక్రియకు సంబంధించిన బీటా వెర్షన్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఆదాయపు పన్ను శాఖ తమ ఈ–ఫైలింగ్ వెబ్సైట్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. మే 25 దాకా దీని ద్వారా 6,77,680 పాన్ నంబర్లు కేటాయించింది. కేవలం 10 నిమిషాల్లోనే ఈ–పాన్ కేటాయించగలిగినట్లు సీబీడీటీ వర్గాలు తెలిపాయి. -
ఆధార్‌తో పాన్ లింక్ ఇలా..
సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్-పాన్ లింకింగ్‌పై తాజా డెడ్‌లైన్ మార్చి 31లోగా అనుసంధానం చేసుకోవడంలో విఫలమైతే రూ 10,000 జరిమానా, పాన్ కార్డు పనిచేయదని ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేసింది. కీలక పత్రాలైన ఆధార్ కార్డు, పాన్ కార్డు అనుసంధానంపై కేంద్రం ఇప్పటికే పలుమార్లు గడువు తేదీలను పొడిగించింది. ఇప్పటికీ చాలా మంది ఆధార్‌తో పాన్ అనుసంధానం చేయని వారు పెద్దసంఖ్యలో ఉన్నారు. తాజా డెడ్‌లైన్‌లోగా ఈ రెండింటినీ లింక్ చేసుకోవాల్సి ఉండగా వీటి అనుసంధానానికి అవసరమైన దశలను చూద్దాం. ఆధార్‌తో పాన్ లింక్ చేసుకోవడం సులభమే. అయితే కొన్ని సందర్భాల్లో రెండు అనుసంధానం కాకపోవచ్చు. ఆధార్, పాన్ కార్డుల్లో పేరు, జెండర్, పుట్టిన తేదీ వంటి వివరాలు వేర్వేరుగా ఉన్నా కూడా రెండు లింక్ కావు. ఆధార్ కార్డును యూఐడీఏఐ జారీ చేస్తే, పాన్ కార్డును ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. పాన్, ఆధార్ కార్డుల్లో పేరు, జెండర్, పుట్టిన తేదీ వంటి వివరాలు వేర్వేరుగా ఉంటే అప్పుడు ఆధార్, పాన్ కార్డుల్లో వివరాలను సరిచేయాలి. ఆధార్ కార్డులో తప్పుగా ఉన్న పేరును మార్చుకోవాలంటే https://ssup.uidai.gov.in/ssup/login.html లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ఆన్లైన్లో లేదా ఎన్రోల్మెంట్ సెంటర్‌కు వెళ్లి ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఆదాయ పన్నుశాఖ వెబ్సైట్ https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html లో పాన్ వివరాలను సరిచేసుకోవచ్చు. వివరాలు ఏమీ తప్పుగా లేకపోతే ఆన్లైన్, ఎస్ఎంఎస్, పాన్ కేంద్రాల్లో రెండింటిని లింక్ చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా 567678 లేదా 56161 నెంబర్‌కు యూఐడీపాన్ 12 అంకెల ఆధార్ పది అంకెల పాన్ నెంబర్‌ను ఎస్ఎంఎస్ పంపడం ద్వారా పాన్ ఆధార్ లింకేజ్‌ను పూర్తిచేయవచ్చు. ఇక నేరుగా ఆదాయపన్ను శాఖ వెబ్సైట్ www.incometaxindiaefiling.gov.in లోకి వెళ్లి పాన్ (యూజర్ ఐడీ), పాస్వర్డ్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి ప్రొఫైల్ సెట్టింగ్ ట్యాబ్‌పై క్లిక్ చేసి లింక్ ఆధార్ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ మీ పాన్ ఆధార్ నెంబర్‌తో లింక్ అయినట్టు మెసేజ్ కనిపంచనిపక్షంలో అక్కడ కనిపించే ఫామ్‌లో మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి. ఒకసారి మీ వివరాలు సబ్మిట్ చేసిన తర్వాత స్క్రీన్‌పై సక్సెస్ మెసేజ్ కనిపిస్తుంది. చదవండి : ఆధార్- పాన్ లింకింగ్ : డెడ్‌లైన్ మిస్సయితే భారీ షాక్.. -
ఆధార్- పాన్ లింకింగ్ : డెడ్‌లైన్ మిస్సయితే భారీ షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్-పాన్ అనుసంధానానికి ఆదాయ పన్నుశాఖ తాజా డెడ్‌లైన్ మార్చి 31ని మిస్ అయితే పాన్‌కార్డుదారులకు భారీ షాక్ తప్పదు. ఈ గడువులోగా ఆధార్-పాన్ లింకేజ్ పూర్తిచేయడంలో విఫలమైతే పాన్ కార్డు పనిచేయకపోవడంతో పాటు రూ 10,000 జరిమానా విధించనున్నట్టు ఐటీ శాఖ తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. పనిచేయని పాన్ కార్డు వాడినట్టు తేలితే వారికి ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 272 బీ కింద రూ 10,000 పెనాల్టీ విధిస్తారు. పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడంలో విఫలమైన వారు పన్ను చెల్లింపులు మినహా బ్యాంక్ ఖాతా తెరిచేందుకు గుర్తింపు కార్డుగా వాడటం వంటి వెసులుబాటు ఉన్నా రూ 50,000 మించి లావాదేవీలు జరిపే క్రమంలో రూ 10,000 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయని వారి పాన్ ఏప్రిల్ 1 నుంచి పనిచేయదు..అయితే ఆధార్‌తో అనుసంధానం పూర్తి చేసిన అనంతరం వారి పాన్ కార్డు తిరిగి పనిచేస్తుంది. చదవండి : ఆధార్‌తో పాన్ లింకింగ్ ఇలా.. -
ఆధార్‌తో లింకు కాకుంటే పాన్ కట్
న్యూఢిల్లీ: శాశ్వత ఖాతా నెంబరు (పాన్) విషయంలో ఆదాయ పన్ను శాఖ తుది హెచ్చరికను జారీ చేసింది. ఆధార్ నెంబర్‌తో పాన్ కార్డు అనుసంధానం తప్పదని ఇప్పటికే పలు సార్లు సూచించి, గడువు తేదీలను పొడగిస్తూ వచ్చిన ఐటీ శాఖ.. లింక్ కాని పాన్ కార్డులను పనిచేయకుండా (ఇన్ ఆపరేటివ్) చేయనున్నామని శుక్రవారం ప్రకటించింది. ఇందుకు మార్చి 31వ తేదీని గడువుగా నిర్ణయించింది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 139ఏఏ సబ్ సెక్షన్ (2) ప్రకారం.. 2017 జూలై ఒకటి వరకు జారీ చేసిన పాన్ కార్డులకు ఆధార్ అనుసంధానం తప్పనిసరని, పేర్కొన్న గడువు తేదీ లోపు లింక్ చేయకుంటే ఇన్ఆపరేటివ్ చేసేందుకు ఇన్‌కం ట్యాక్స్ రూల్స్‌లో 114ఏఏఏ చేర్చినట్లు ప్రకటించింది. జనవరి 27 నాటికి 30.75 కోట్ల పాన్లకు ఆధా ర్ అనుసంధానం జరగ్గా, ఇప్పటికీ 17.58 కోట్ల పాన్ కార్డులు లింక్ కాలేదని వెల్లడించింది. -
పాన్ - ఆధార్ లింకింగ్ : మరోసారి ఊరట
సాక్షి, ముంబై: ఆధార్‌తో పాన్ వివరాలను లింక్ చేయని వారికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) వారికి శుభవార్త అందించింది. పాన్ - ఆధార్ లింకింగ్ తేదీని పొడిగిస్తూ ఆదాయపు పన్ను శాఖ సోమవారం రాత్రి ట్వీట్ చేసింది. నేటితో( డిసెంబర్ 31, 2019) గడువును దీనిని మరో మూడు నెలల పాటు పొడిగించింది. ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 139ఏఏ లోని ఉప-సెక్షన్ 2 కింద పేర్కొన్న విధంగా పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించడానికి వచ్చే ఏడాది (2020) మార్చి 31వ తేదీ వరకు దీనిని పొడిగించింది. పాన్-ఆధార్ లింకింగ్‌ను ఇప్పటికే పలుమార్లు పొడిగించిన సీబీడీటీ తాజాగా గడువును పొడిగించడం ఇది ఎనిమిదోసారి. పాన్-ఆధార్ అనుసంధానం ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కేంద్రం తప్పనిసరి చేసింది. ఇటీవల ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారికి తప్పనిసరి అయింది. డిసెంబర్ 31వ తేదీలోపు ఆధార్ అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు చెల్లదని ఐటీ శాఖ తెలిపింది. -
ఫ్రీగా పాన్ ఇవ్వలేదని పెదవి కొరికేశాడు..!
లక్నో: ఉచితంగా పాన్ ఇచ్చేందుకు నిరాకరించిన దుకాణ యజమాని చెవి, పెదవి కొరికేశాడో యువకుడు. లక్నోలోని అలంబాగ్‌లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తాగిన మైకంలో పాన్ ఫ్రీగా ఇవ్వమని అడగగా.. ఇవ్వనని పాన్ షాపు యజమాని చెప్పడంతో ఈ గొడవ జరిగింది. వెంటనే గాయపడిన పాన్ షాపు యజమానిని స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వివరాల్లోకెళ్తే.. శాలు(28) అనే ఓ వీడియో గ్రాఫర్ మంగళవారం రాత్రి పాన్ తీసుకునేందుకు ఓ షాపు వద్దకు వెళ్లాడు. అప్పటికే ఆలస్యమవడంతో పాన్ షాప్ యాజమాని సత్యేంద్ర దుకాణాన్ని మూసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన శాలు తనకు ఫ్రీ గా కిళ్లీ ఇవ్వాలని బెదిరింపులకు దిగాడు. కుదరదని షాపు యజమాని సత్యేంద్ర చెప్పడంతో కోపంతో వెంటనే పక్కనే ఉన్న రాయితో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా యజమాని ఎడమ చెవి, కింది పెదవిని కొరకడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాలైన సత్యేంద్రను గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం అతడిని ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: 'ఆయనకు ఉత్తమ కామాంధుడి అవార్డు ఇవ్వండి' -
ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్.. అన్నిటికీ ఒకటే కార్డు
న్యూఢిల్లీ: ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి అనేక గుర్తింపు కార్డుల స్థానంలో దేశవ్యాప్తంగా ఒకే ఒక్క బహుళార్థక గుర్తింపు కార్డు ఉండాల్సిన అవసరముందని హోం మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. సమాచారాన్నంతటినీ డిజిటల్ రూపంలోకి తీసుకువచ్చేందుకు 2021లో దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణకు మొబైల్ యాప్‌ను వాడనున్నట్లు ప్రకటించారు. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, జనగణన కమిషనర్ కార్యాలయ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేసిన అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ.. ‘2021 నాటి జనాభా లెక్కల సేకరణకు మొట్టమొదటి సారిగా మొబైల్ ఫోన్ అప్లికేషన్‌ను ఉపయోగించనున్నాం. జనగణనలో ఇదో విప్లవాత్మకమైన మార్పు కానుంది. అన్ని వివరాలను ఒకే కార్డులో నిక్షిప్తం చేసేందుకు ఇది సాయపడుతుంది’ అని వివరించారు. దేశ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలకు, సంక్షేమ పథకాలకు 2021 జనాభా లెక్కలే ప్రాతిపదికగా మారనున్నాయన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ‘‘దేశంలోని 130 కోట్ల మందికి జనాభా లెక్కల సేకరణ వల్ల కలిగే లాభాలను వివరించాలి. ప్రభుత్వ పథకాలకు ఈ జాబితా, వివరాలను ఎలా ఉపయోగకరమో తెలియజేయాలి. ఈ సమాచారం దేశ పురోగతిలో కీలకమైన పాత్ర పోషిస్తుంది’’అన్నారు. 2011 జనగణన ఆధారంగా కేంద్రం చేపట్టిన 22 సంక్షేమ పథకాల్లో విజయవంతంగా అమలవుతున్న ‘ఉజ్వల’, ‘బేటీ బచావో బేటీ పఢావో’ ఉన్నాయన్నారు. అధికారులూ పుణ్యం కట్టుకోండి..! జనాభా లెక్కలను నిజాయతీతో నిర్వహించడం ద్వారా అధికారులు పుణ్యం కట్టుకోవాలని, జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని హోం మంత్రి కోరారు. జనగణన మున్సిపాలిటీ వార్డుల హద్దులు నిర్ణయించడం మొదలుకొని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలను గుర్తించడం వరకూ ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఇప్పటివరకూ ప్రభుత్వం అరకొర పద్ధతుల్లోనే సంక్షేమ పథకాలను చేపట్టిందని, గత ప్రభుత్వాలు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయకపోవడమే దీనికి కారణమని వ్యాఖ్యానించారు. 2021 నాటి జనగణనపై హోం మంత్రి మాట్లాడుతూ.. మంచు ప్రాంతాలతో కూడిన జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో రెఫరెన్స్ డేట్ 2020 అక్టోబరు ఒకటో తేదీ కాగా దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు 2021 మార్చి 21గా ఉండనుందని చెప్పారు. మొత్తం 16 భాషల్లో రూ.12 వేల కోట్ల ఖర్చుతో జనగణన చేపట్టనున్నామని వివరించారు. దీంతోపాటు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కోసం కూడా వివరాలు సేకరిస్తామని మంత్రి తెలిపారు. దేశవ్యాప్త ఎన్ఆర్సీకి ఈ జాబితా ప్రాతిపదిక కావచ్చునని అధికారుల అంచనా. -
ఆధార్‌తో ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారా? మీకో గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) శుభవార్త అందించింది. పాన్ లేకుండా కేవలం ఆధార్ ద్వారా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినవారికి ఆదాయపన్ను శాఖ ఆటోమేటిక్‌గా పాన్ కార్డును జారీ చేయనుంది. ఈ మేరకు సీబీడీటీ సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది. సీబీడీటీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం వ్యక్తిగతంగా ఆధార్ నెంబరు ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వారికి ఆటోమేటిక్‌గా పాన్ కార్డును ఇవ్వనుంది. బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విధంగా ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు ఆధార్ కార్డును ఉపయోగించడం అంటే పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసినట్లుగా పరిగణింస్తున్నట్టు సీబీడీటీ స్పష్టం చేసింది. ఈ నిబంధనలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని, త్వరలోనే పాన్ జారీ చేసే ప్రక్రియను ప్రారంభిస్తామని సీబీడీ ఛైర్మన్ పీసీ మోడీ తెలిపారు. ఆధార్ కార్డులో వినియోగదారుడి పేరు, పుట్టిన తేదీ, జండర్, ఫోటో, అడ్రస్, తదితర వ్యక్తిగత వివరాలను యూఐడీఏఐ ద్వారా ఆదాయ పన్ను శాఖ సేకరించి దాని ఆధారంగా 10 అంకెల పాన్ కార్డును జారీ చేస్తామన్నారు. పాన్ కార్డులేని పన్ను చెల్లింపుదారులు ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఆధార్ కార్డును ఉపయోగించు కోవచ్చునని ఆదాయపన్ను చట్టం ప్రకారం పాన్‌కు ఆధార్ ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. -
సుమోటోగా పాన్ జారీ
న్యూఢిల్లీ: పాన్, ఆధార్‌ను అనుసంధానించే దిశగా ఆదాయ పన్ను శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కేవలం ఆధార్‌తోనే ఐటీ రిటర్నులు దాఖలు చేసే వారికి సుమోటో ప్రాతిపదికన పాన్ (పర్మనెంట్ అకౌంటు నంబరు) జారీ చేసే యోచన ఉన్నట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ తెలిపారు. పాన్ లేని వారు ఆధార్ నంబరుతోనైనా ఐటీ రిటర్నులు దాఖలు చేయొచ్చంటూ బడ్జెట్లో ప్రతిపాదన చేసిన నేపథ్యంలో ఇకపై పాన్ అవసరం ఉండదా అన్న ప్రశ్నలకు స్పందిస్తూ మోదీ ఈ మేరకు సమాధానమిచ్చారు. ‘ఈ ప్రతిపాదన అర్థం? పాన్ పూర్తిగా నిరుపయోగంగా మారుతుందని కాదు. పాన్ లేకుండా.. కేవలం ఆధార్ మాత్రమే ఉన్న పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేసేందుకు ఇది అదనపు సదుపాయంగా మాత్రమే భావించాలి‘ అని ఆయన చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో అసెసింగ్ అధికారి తనంత తానుగా పాన్ నంబరును కేటాయించవచ్చని మోదీ వివరించారు. ప్రస్తుతం దేశీయంగా 120 ఆధార్ నంబర్లు, 41 కోట్ల పాన్ నంబర్లు జారీ అయ్యాయి. వీటిల్లో 22 కోట్ల పాన్ లు మాత్రమే ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. -
ఇలా చేయకపోతే.. మీ పాన్ రద్దు
న్యూఢిల్లీ : మీరు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేస్తారా? పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేశారా. చేయకపోతే త్వరపడండి. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలులో పాన్‌కార్డు, ఆధార్ లింకుచేయకపోతే పాన్‌కార్డు రద్దయ్యే ప్రమాదం ఉంది. ఇన్‌కం టాక్స్ రిటర్నలతో అను సంధానం కాని ప్యాన్లను రద్దుచేస్తామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) ఛైర్మన్ సుశీల్ చంద్ర తాజాగా వెల్లడించారు. ఆధార్, పాన్‌కార్డు నంబర్ల లింకింగ్‌కు గడువు ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో సిబిడిటి ఛైర్మన్ ఈ హెచ్చరిక చేశారు. బయోమెట్రిక్ ఐడి ఆధార్‌ను పాన్‌కార్డుతో తక్షణమే లింక్‌చేయాలని సిబిడిటి ఛైర్మన్ తెలిపారు. అసోచామ్ సదస్సులో పాల్గొన్న సుశీల్‌చంద్ర పాన్ ఆధార్ లింకింగ్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఐటిశాఖ ఇప్పటివరకూ 42 కోట్ల పాన్ నెంబర్లను జారీచేయగా, వీటిలో 23 కోట్ల పాన్‌కార్డులు మాత్రమే లింక్ అయ్యాయని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వచ్చే మార్చి 31వ తేదీలోపు లింక్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే ఆధార్‌ను పాన్‌కార్డుతో లింక్చేస్తే పాన్‌కార్డును బ్యాంకు ఖాతాతో లింక్ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇలా చేయడం వల్ల సంక్షేమపథకాలు అర్హులైన వ్యక్తులకు అందుతున్నాయా లేదా అన్నది కూడా తెలుసుకునే వీలుంటుందన్నారు. కాగా సుప్రీంకోర్టు ఆదాయపు పన్ను రిటర్నుల్లో విధిగా ఆధార్‌ను పాన్‌తో లింక్‌చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే బ్యాంకు ఖాతాలు, మొబైల్ సేవలకు పాన్ లింకింగ్ తప్పనిసరి కాదు. -
కార్డు పోయిందా? పొందడం సులువే!
గుంటూరు, తుళ్లూరు: గతంలో ప్రతి ఒక్కరూ తమ వెంట ఫోన్ బుక్, అవసరమైన వాళ్లు కాలిక్యులేటర్, నగదు ఉంచుకునేవారు. కాలం మారుతోంది. అవసరాలు పెరుగుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరుణంలో ఇప్పుడు వివిధ రకాల కార్డులు భాగస్వామ్యం అయ్యాయి. ఆధార్, ఓటర్, రేషన్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఏటీఎం, పాస్‌పోర్ట్ తదితర కార్డులను సిటిజన్లు అధికంగా వినియోగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఒకానొక కార్డును వినియోగించాల్సి వస్తోంది. ఆర్థిక లావాదేవీల కోసం ఏటీఎం కార్డు ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యమైంది. ఎప్పుడు దేని అవసరం వస్తుందో చెప్పలేని పరిస్థితుల్లో అన్నీ ఒకేచోట ఉంచుకోవాల్సి వస్తోంది. అనుకోని పరిస్థితుల్లో మొత్తం కార్డులన్నీ ఒకేసారి పోగొట్టుకుంటే ఏమి చేయాలి? వాటిని తిరిగి ఎలా పొందాలన్న సందేహం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇందుకు కంగారు పడాల్సిన అవసరం లేదని, కొంత సమయం తరువాత పొందే సదుపాయం ఉంది. ఆధార్ కార్డు భారతీయుడిగా గుర్తింపు ఉండాలి అంటే ఆధార్‌కార్డు తప్పనిసరి. ఎక్కడికెళ్లినా గుర్తింపు కోసం దీనినే అడుగుతున్నారు. ప్రభుత్వ పథకాలు వర్తించాలంటే ఆధార్ తప్పనిసరి చేశారు. ఏ కార్డును పొందాలన్నా కూడా ఇది అవసరం. ఇలా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఆధార్‌కార్డు పోతే టోల్ ఫ్రీ నంబర్ 18001801947 కి కాల్ చేసి పూర్తి వివరాలతో ఫిర్యాదుచేయాలి. ఇలా చేస్తే ఎలాంటి రుసుం లేకుండా కొత్త కార్డును మళ్లీ పోస్టులో పంపిస్తారు. అలాగే ఆధార్ వెబ్‌సైట్‌కు వెళ్లి help@uiadi.gov.in లో పూర్తి సమాచారాన్ని పొందుపరిచి మళ్లీ కార్డును పొందవచ్చు. పాస్‌పోర్టు పాస్‌పోర్టు పోగొట్టుకుంటే ముందుగా స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. వారు విచారణ జరిపి పాస్‌పోర్టు లభించకుంటే నాన్ ట్రేస్డ్ ధ్రువపత్రం జారీ చేస్తారు. అనంతరం పాస్‌పోర్ట్ అధికారి, హైదరాబాద్ పేరిట, రూ.1000 డీడీ తీయాలి. రెండింటినీ జతపరచి దరఖాస్తు చేసుకోవాలి. ఆ శాఖ ప్రాంతీయ అధికారి విచారణ చేసి కార్యాలయానికి సమాచారం అందిస్తారు. విచారణ పూర్తయిన మూడు నెలల అనంతరం డూప్లికేట్ పాస్‌పోర్టు జారీ చేస్తారు. తత్కాల్ పాస్‌పోర్టు అయిన పక్షంలో నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించాలి.వివరాలకు www.ceoandhra.nic.in ను సంప్రదించడం ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ఓటరు కార్డు ఓటరు గుర్తింపు కార్డు కూడా చాలా విధాలుగా పౌరులకు ఉపయోగ పడుతుంది. కేవలం ఓటు వేయడానికే కాకుండా నివాస, జనన తేదీ ధ్రువపత్రంగా కూడా కొన్ని సందర్భాల్లో దీనిని అడుగుతుంటారు. ఓటరు గుర్తింపు కార్డును పోగొట్టుకుంటే పోలింగ్ బూత్, కార్డు నంబర్‌తో రూ.10 రుసుం చెల్లించి మీ సేవా కేంద్రాల్లో మళ్లీ కార్డును పొందవచ్చు. కార్డు నంబర్ ఆధారంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా కార్డును పొందవచ్చు. ఓటరు గుర్తింపు కార్డు కోసం మరిన్ని వివరాలకు www. passportindia.gov.in ను సందర్శించి తెలుసుకోవచ్చు. రేషన్‌కార్డు కుటుంబ అవసరాలకు రేషన్‌కార్డు చాలా కీలకం. కేవలం ప్రభుత్వం అందించే సరుకుల కోసమే కాక పలు ధ్రువపత్రాలు పొందేందుకు రేషన్‌కార్డును కీలక ఆధారం. తెల్లకార్డు ఉంటే ప్రభుత్వం వైద్య ఆరోగ్య పథకం కూడా వర్తిస్తుంది. అత్యంత ప్రాధాన్యం ఉన్న రేషన్ కార్డును పొగొట్టుకుంటే బాధితులు www. icfs2.ap.gov.in వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. అక్కడ ఉన్న user name: guest, password: guest123 లాగిన్ అయి రేషన్‌కార్డు నంబర్‌ను వేసి రేషన్ జిరాక్స్ కాపీ ప్రతిని పొందవచ్చు. దీని ద్వారా ఏపీ ఆన్లైన్ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే తహసీల్దార్ పరిశీలించి నామమాత్రపు రుసుంతో అదే నంబర్‌పై కార్డును జారీ చేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ వాహనం నడిపేందుకు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. అది పోతే వెంటనే స్థానికంగా ఉండే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయలి. వారందించే నాన్ ట్రేస్డ్ పత్రంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ప్రతిని ఎల్ఎల్డీ దరఖాస్తుకు జత చేసి ఆర్డీఓ కార్యాలయంలో అందించాలి. అలాగే రూ.10 బాండ్ పేపర్‌పై కార్డు పోవడానికి కారణాలను అందజేయాల్సి ఉంటుంది. నెల రోజుల్లో తిరిగి అధికారుల నుంచి కార్డును పొందవచ్చు. www.aptransport.org నుంచి ఎల్ఎల్డీ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని మరిన్ని వివరాలు పొందవచ్చు. అందులోని వివరాలను పొందుపరచడం ద్వారా కూడా పోయిన కార్డును పొందవచ్చు. ఏటీఎం కార్డు ఏటీఎం కార్డు పోగొట్టుకున్నా ఎవరైనా దొంగతనం చేసినా ముందుగా సంబంధిత బ్యాంకు వినియోగదారుల సేవా కేంద్రంలో ఫిర్యాదు చేయాలి. పూర్తి సమాచారం అందించి కార్డును వెంటనే బ్లాక్ చేయించాలి. తరువాత ఫిర్యాదు ఆధారంగా బ్యాంకులో కొత్తకార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంకు మేనేజర్ ఈ విషయాన్ని నిర్ధారించుకుని కొత్తకార్డును జారీ చేస్తారు. ఇందుకోసం ఆయా బ్యాంకుల నిర్ణీత మొత్తంలో చార్జీలు వసూలు చేస్తాయి. పాన్ కార్డు ఆర్థిక లావాదేవీల్లో పాన్‌కార్డు ఇప్పుడు చాలా అవసరం. ఆదాయపన్ను శాఖ అందించే పాన్(పర్మినెంట్ అకౌంట్ నంబర్) కార్డు పోగొట్టుకుంటే సంబంధిత ఏజెన్సీలో కొత్తకార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు పాత కార్డు జిరాక్స్, రెండు కలర్ ఫోటోలు, నివాస, గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు జత చేయాలి. కొత్త కార్డు కోసం అదనంగా రూ.90 చెల్లించాలి. కొత్తకార్డు వచ్చే సరిని మూడు వారాల సమయం పట్టవచ్చు. www.nsdl.pan అనే వెబ్ సైట్లో మరింత సమాచారం తెలుసుకోవచ్చు. -
కారు కోసం కట్టుకున్న భార్యను..
చండీగఢ్ : కారు కొనటానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కట్టుకున్న భార్యను పెనంతో కొట్టి చంపాడు ఓ భర్త. ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పంజాబ్‌లోని మొహలి జిల్లాకు చెందిన మమన్‌దీప్ కౌర్(28), భర్త గురుప్రీత్ సింగ్‌తో కలిసి జిరక్పూర్లో నివాసముంటోంది. గురుప్రీత్ సింగ్ 10 సంవత్సరాలు లండన్‌లో ఉండి సంవత్సరం క్రితమే ఇండియాకు తిరిగి వచ్చాడు. ఆనాటి నుంచి ఉద్యోగానికి వెళ్లకుండా అదనపు కట్నం కావాలంటూ భార్యను వేధించేవాడు. గత కొద్దినెలలుగా కారు కొనటానికి డబ్బులు కావాలని మమన్‌దీప్‌ను ఇబ్బంది పెట్టేవాడు. క్యాబ్ సర్వీస్ మొదలుపెట్టడానికి ఇంటి నుంచి డబ్బులు తెమ్మంటూ హింసించే వాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. గురువారం గొడవ తారాస్థాయికి చేరటంతో ఆగ్రహానికి గురైన గురుప్రీత్ ఆమెను పెనంతో కొట్టి చంపి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆమె సోదరుడు గురుప్రీత్‌కు ఫోన్ చేయగా.. అతని మాటలు అనుమానానికి దారితీశాయి. అనుమానంతో చెల్లెలి కోసం ఇంటికి వెళ్లి చూడగా.. సోదరి విగతజీవిగా పడి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న గురుప్రీత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
‘పాన్–ఆధార్’ గడువు పెంపు
న్యూఢిల్లీ: పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకునేందుకు గడువును ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(సీబీడీటీ) జూన్ 30 వరకు పొడిగించింది. మార్చి 31తో ముగియాల్సిన ఈ గడువును పెంచుతూ మంగళవారం ఒక ప్రకటన జారీచేసింది. ఆధార్‌తో పాన్ లింకేజీకి చివరి తేదీని పొడిగించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. మొబైల్, బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడానికి గడువును సుప్రీంకోర్టు ఇటీవలే నిరవధికంగా పొడిగించిన నేపథ్యంలోనే సీబీడీటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాలకు లభించని పొడిగింపు సంక్షేమ పథకాలను ఆధార్‌తో అనుసంధానించుకోవడానికి గడువును పొడిగించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఆ గడువు మార్చి 31తో ముగియనుంది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తిరస్కరించింది. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడటానికి పటిష్ట చట్టం రూపొందించాల్సిన అవసరం ఉందంది. ప్రైవేట్ సంస్థలు ఆధార్ సమాచారాన్ని బహిర్గతం చేయకుండా తీసుకుంటున్న చర్యలేంటని ఆధార్ ప్రాధికార సంస్థను ప్రశ్నించింది. యూఐడీఏఐ కేంద్రీయ డేటా నిల్వ కేంద్రం నుంచి సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశాల్లేవని ఆ సంస్థ తెలిపింది. -
పన్ను ఎగవేతదారుల నుంచి భారీగా నగదు
పన్ను ఎగవేతదారులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం భారీగానే చుక్కలు చూపిస్తోంది. బ్యాంకు ఖాతాలకు, రెండు లక్షలు దాటిన ఆర్థిక వ్యవహారాలకు పాన్ కార్డును తప్పనిసరి చేయడంతో, దాంతో పాటు ఆధార్ లింక్ చేయడం వంటి వాటితో పన్ను ఎగవేతదారులకు ప్రభుత్వం గండికొడుతోంది. తాజాగా అదనపు రిటర్నులలో రూ.1.7 కోట్ల ఫైల్ చేశారని, దీంతో మొత్తంగా ప్రభుత్వం డిసెంబర్ వరకు రూ.26,500 కోట్లు ఆర్జించినట్టు తెలిసింది. ఇన్-హౌజ్ సమాచారంతోనే నాన్-ఫైలర్స్‌ను ఆదాయపు పన్ను శాఖ గుర్తిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్‌కు తెలిపారు. ఈ డేటాను టీడీఎస్, టీసీఎస్ ద్వారా సేకరించిన ఎక్కువ విలువ ఉన్న లావాదేవీలతో ట్యాలీ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం పాన్ నెంబర్‌ను రూ.2 లక్షలకు పైన జరిపే లావాదేవీలు ప్రాపర్టీ, షేర్లు, బాండ్లు, ఇన్సూరెన్స్, విదేశీయ ప్రయాణం వంటి అన్నింటికీ తప్పనిసరి చేసినట్టు చెప్పారు. గతేడాది 35 లక్షల నాన్-ఫైలర్స్‌ను గుర్తించామని, ఆ ముందటేడాది ఈ సంఖ్య 67 లక్షలుగా ఉండేదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. నాన్-ఫైలర్స్‌ను గుర్తించిన అనంతరం పలు కేటగిరీలోకి కేసులను వర్గీకరించి, మానిటర్ చేస్తున్నట్టు అరుణ్‌జైట్లీ తెలిపారు. రిటర్నులు ఫైల్ చేయాలని టార్గెట్ చేసిన గ్రూప్‌లుకు టెక్ట్స్ మెసేజ్‌లు, ఈమెయిల్స్‌ను పంపుతున్నట్టు కూడా పేర్కొన్నారు. వారి స్పందనలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రాజెక్ట్ ఇన్సైట్ అనే కొత్త మెకానిజం ద్వారా మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. -
వారానికి పాన్ కార్డు అప్లికేషన్స్ ఎన్నో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖకు పాన్ కార్డ్ కోసం రోజుకు సగటున 15నుంచి 25లక్షల దరఖాస్తులు అందుతున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే కేవలం కొన్ని గంటలు లేదా రెండువారాల్లో పాన్ కార్డులను జారీ చేస్తున్నట్టు అయితే ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. పాన్‌కార్డు దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి , పాన్‌కార్డు కేటాయింపు కోసం కొన్ని గంటల నుండి రెండు వారాలు సమయం పడుతోందని ఆర్థిక శాఖ సహాయమంత్రి శివ్ ప్రతాప్ శుక్లా లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. వారానికి సగటున 25లక్షల దాకా అప్లికేషన్స్ ఐటీ శాఖకు అందుతున్నాయని శుక్లా తెలిపారు. జనవరి 28, 2018 నాటికి, మొత్తం 20,73,434 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. పాన్ కార్డు జారీకి రెండు సర్వీసు ప్రొడైవర్లు ఎన్ఎస్డిఎల్ ఇ-గోవ్ , యూటీఐఐటీఎస్ (NSDL e-Gov and UTIITS) ఆదాయ పన్నుశాఖ కలిసి పనిచేస్తోందన్నారు. అలాగే పాన్ కార్డుతోపాటు ఇ పాన్ కార్డు ఒకేసారి జారీ చేస్తున్నామని వివరించారు. పాన్‌కార్డు జారీ ప్రక్రియ ఆలస్యమైనా, నిబంధనలు ఉల్లంఘించినా భారీ జరిమానా విధించేలా సర్వీసు ప్రొవైడర్లతో ఒప్పందం ఉన్నట్టు స్పష్టం చేశారు. -
ఆధార్-పాన్ అనుసంధానంపై గుడ్‌న్యూస్
సాక్షి న్యూఢిల్లీ: ఆధార్ గుర్తింపు కార్డుతో పాన్ కార్డు అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. మరికొద్ది రోజుల్లో ముగియనున్న ఈ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది (2018)మార్చి 31 వరకు పొడగిస్తూ ఆర్థికమంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. లింక్ చేసే ప్రక్రియను సులభతరం చేసేందుకు గడువును మార్చి 31, 2018 వరకు పొడిగించామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆధార్,పాన్ లింకింగ్ గడువును 2018, మార్చి 31 వరకు పెంచుతున్నట్టుగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. కాగా ఆదాయపు పన్ను దాఖలుకోసం శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) ఆధార్ నంబర్ జతచేయడాన్ని తప్పని సరి చేసింది. ఈ నేపథ్యంలో ఆధార్-పాన్ లింకింగ్ ప్రస్తుత గడువు ఈ డిసెంబర్ 31తో ముగుస్తున్న సంగతి తెలిసిందే. CBDT extends date till 31.3.18 for linking of Aadhaar with PAN https://t.co/5mLiy2sf6b — Ministry of Finance (@FinMinIndia) December 8, 2017 -
పాన్, అడ్రస్ ప్రూఫ్ దుర్వినియోగం కాకుండా చూసుకోండి..
ప్రస్తుతం ప్రతిదానికి ఆధార్ తప్పనిసరి అవుతోంది. ఇక ఆర్థిక లావాదేవీలకు వచ్చేసరికి ఆధార్ సహా పాన్, బ్యాంక్ అకౌంట్ వంటి పలు వివరాలు అవసరమౌతున్నాయి. ఈ విధంగా మనం మన విలువైన వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకుంటున్నాం. ఇది తప్పనిసరి. ఇలా చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో డేటా తస్కరణ జరిగే ప్రమాదమూ ఉంది. మన అకౌంట్ ద్వారా మనకు తెలియకుండానే ఏదో ఒక ఆర్థిక లావాదేవీ జరిగితే తప్ప మనకు మన వివరాలను ఎవరో దొంగలించారని తెలియదు. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో చాలానే జరుగుతున్నాయి. అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలోనే డబ్బులు మాయమౌతున్నాయి. వ్యక్తిగత వివరాలను, విలువైన సమాచారాన్ని సాధ్యమైనంత వరకు పబ్లిక్‌గా ఎవరితోనూ పంచుకోకూడదు. మరీముఖ్యంగా ఫేస్బుక్, ట్వీటర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ, ఆన్‌లైన్‌లోనూ వ్యక్తిగత వివరాలను ఉంచడం కానీ, షేర్ చేయడం కానీ చేయకూడదు. తెలియని నెంబర్ నుంచి వచ్చే కాల్స్‌కి, వివరాలు తెలుసుకునేందుకు చేసే కాల్స్‌కు సమాధానమివ్వకూడదు. మీ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని కొందరు ఫోన్ చేస్తుంటారు. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇతర దేశాల్లోని స్నేహితుల నుంచి డబ్బులు పంపమని వచ్చిన ఈ–మెయిల్స్‌కు రిప్లయ్ ఇవ్వకండి. ఎవ్వరికైనా పాన్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ డాక్యుమెంట్లను ఇచ్చేటప్పుడు, ఏ పనికోసమైతే వాటిని ఇస్తున్నారో ఆ వివరాలను పత్రాలపై రాయండి. దీని ద్వారా డాక్యుమెంట్లు మిస్యూజ్ కాకుండా చూసుకోవచ్చు. -
డిసెంబర్ 31 వరకూ ఆధార్–పాన్ అనుసంధానం!!
-
డిసెంబర్ 31 వరకూ ఆధార్–పాన్ అనుసంధానం!!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆధార్–పాన్ అనుసంధానానికి గడువు పొడిగించింది. డిసెంబర్ 31 వరకు ఆధార్, పాన్ రెండింటిని అనుసంధానం చేసుకోవచ్చు. ‘పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్ధం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తాజాగా పాన్‌తో ఆధార్ అనుసంధాన గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే సెప్టెంబర్ 30 వరకు రిటర్న్స్ దాఖలుకు అవకాశం కలిగిన పన్ను చెల్లింపుదారులందరికీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్‌కు, ఆడిట్ రిపోర్ట్‌ల సమర్పణకు అక్టోబర్ 31 వరకు గడువునిచ్చిందని తెలిపింది. కాగా పన్ను చెల్లింపుదారులు వారి పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడానికి గతంలో ఇచ్చిన గడువు గురువారం (ఆగస్ట్ 31)తో ముగిసింది. ఆధార్‌కు సంబంధించిన కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని కోర్టు నవంబర్‌లో విచారించనుంది. అలాగే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు ఆధార్ తప్పనిసరని ప్రభుత్వం ఇదివరకే పేర్కొంది. ఆధార్‌లేని వారు సెప్టెంబర్ 30లోపు ఆధార్ పొందాలని తెలిపింది. అయితే ఈ గడువును తాజాగా డిసెంబర్ చివరకు పొడిగించింది. ఈ నేపథ్యంలోనే పాన్, ఆధార్ అనుసంధాన గడువునూ పొడిగించిం ది. ఇక ప్రజలు డిసెంబర్ చివరి వరకు ఆధార్‌ను బ్యాంక్ ఖాతాలతో లింక్ చేసుకోవచ్చు. -
పాన్, ఆధార్ లింక్‌పై గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. పాన్ నెంబర్‌తో ఆధార్‌ను లింక్ చేసుకునే ప్రక్రియ గడువును మరో నాలుగు నెలల పాటు ఆదాయపు పన్ను శాఖ పొడిగించింది. దీంతో పాన్‌తో, ఆధార్‌ను లింక్ చేసుకునే తుది గడువుగా డిసెంబర్ 31ను నిర్దేశించింది. పాన్‌తో ఆధార్‌ను జతచేయాలని ఇటీవలే కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి తుది గడువు కూడా నేటితోనే ముగియబోతుంది. ఆఖరి రోజున ఈ గడువును పెంచుతున్నట్టు ఆదాయపు పన్ను శాఖ చెప్పింది. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోకపోతే, పన్ను రిటర్న్‌లు ఫైల్ చేసే ప్రక్రియ ముందుకు సాగదని ఆదాయపు పన్ను శాఖ అంతకముందు చెప్పింది. 2017 ఆగస్టు 5 వరకు ఆదాయపు పన్ను రిటర్న్‌లు ఫైల్ చేసిన వారికి ఇది అతిపెద్ద ఊరటగా కనిపిస్తోంది. ఐటీఆర్ ఫైల్ చేసే తుదిగడువును ఆగస్టు 5 వరకు పొడిగించిన కేంద్రప్రత్యక్ష పన్ను బోర్డు, అదనంగా ఆ పన్ను చెల్లింపుదారులకు పాన్‌ను ఆధార్‌తో ఆగస్టు 31 వరకు లింక్ చేసుకోవాలని ఆదేశించింది. చాలామంది పన్ను చెల్లింపుదారులు, పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోకపోవడం వల్లే ఐటీఆర్‌ను ఫైల్ చేయలేకపోయారని తెలిసింది. అటు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా ఆధార్ కార్డును అనుసంధానం చేసుకునే ప్రక్రియ గడువును డిసెంబర్ 31 వరకు పెంచాలని సుప్రీంకోర్టు నిన్ననే(బుధవారం) ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్ కూడా మరో మూడు నెలలపాటు ఈ గడువును పొడిగించనున్నామని కోర్టుకు చెప్పారు. -
పన్ను చెల్లింపుదార్ల కోసం ఐటీ యాప్
న్యూఢిల్లీ: పన్నుల చెల్లింపులు, పాన్ దరఖాస్తు ప్రక్రియ మొదలైన వాటిని మరింత సులభతరం చేసేలా ఆదాయ పన్ను శాఖ తాజాగా మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆదాయ పన్ను శాఖకు, అసెసీలకు మధ్య వారధిలా ఉపయోగపడేలా రూపొందించిన ఈ ’ఆయకర్ సేతు’ యాప్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఆవిష్కరించారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇది పనిచేస్తుంది. పన్ను చెల్లింపుదారులకు మరింత మెరుగైన సర్వీసులు అందించేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ యాప్‌ను రూపొందించినట్లు మంత్రి చెప్పారు. దీనితో పన్నుల చెల్లింపులు, పర్మనెంట్ అకౌంటు నంబరుకు దరఖాస్తు చేయడం, పాన్ కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేయడం వంటి పనులను ఎవరి సహాయం అవసరం లేకుండా ఇంటి వద్ద కూర్చునే అసెసీ సులభంగా పూర్తి చేసుకోవచ్చని ఆయన వివరించారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే కాకుండా 7306525252కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో యాప్ ద్వారానే ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ఆప్షన్‌ను కూడా సీబీడీటీ అందుబాటులోకి తేనుంది. పన్నుల చెల్లింపునకు సంబంధించిన కీలకమైన తేదీలు, ఫారమ్‌లు, నోటిఫికేషన్స్ మొదలైనవి రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు ఐటీ శాఖ పంపనుంది. ఎస్ఎంఎస్ అలర్ట్‌లు కావాలనుకునే వారు ఆయకర్ సేతు మాడ్యూల్లో తమ మొబైల్ నంబర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. -
ఆధార్‌తో 7 కోట్ల పాన్ నంబర్లు అనుసంధానం
గత నెలలో కోటికి పైగా అనుసంధానం న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 7.36 కోట్ల మంది పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్) హోల్డర్లు తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు. గత నెలలోనే ఏకంగా ఒక కోటి మంది పైగా అనుసంధానం చేసుకున్నట్లు ఆదాయ పన్ను విభాగం అధికారి వివరించారు. ఆదాయ పన్ను రిటర్న్‌ల ఈ–ఫైలింగ్ కోసం జూలై 1 నుంచి ఆధార్‌తో పాన్ కార్డు అనుసంధానం చేసుకోవడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మొత్తం 30 కోట్ల పైచిలుకు పాన్ హోల్డర్లు ఉండగా, దాదాపు 115 కోట్ల మంది ప్రజానీకానికి ఆధార్ నంబర్లు కేటాయించడం జరిగింది. -
ఎస్ఎంఎస్తో పాన్-ఆధార్ అనుసంధానం
న్యూఢిల్లీ: పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానాన్ని ఆదాయ పన్ను శాఖ మరింత సరళ తరం చేసింది. కేవలం ఒక ఎస్ఎంఎస్ ద్వారా పాన్ నంబర్‌కు ఆధార్చ నంబర్‌ను లింక్ చేసే విధానాన్ని బుధవారం ప్రకటించింది. ఈ మేరకు పన్నుచెల్లింపుదారులు తమ ఆధార్ కార్డు నెంబరును అనుసంధానం చేయాల్సిందిగా కోరింది. ఇటీవల ఐటీ వెబ్సైట్లో ఆధార్ లింక్ కోసం కొత్త లింక్‌ను ప్రకటించిన ఐటీ శాఖ తాజాగా ఎస్ఎంఎస్ ద్వారా ఆధార్‌ను లింక్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ప్రముఖ జాతీయ దినపత్రికలలో జారీ చేసిన ప్రకటనల్లో ఎస్ఎంఎస్ ద్వారా వీటిని ఎలా లింక్ చేయాలో వివరించింది. పాన్, ఆధార్ నెంబర్లను 567678 లేదా 56161 నెంబర్లకు ఎస్ఎంఎస్ సెండ్ చేయాలని చెప్పింది. మరిన్ని వివరాలకు ఐటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా కోరింది. కాగా జూలై 1, 2017 నుండి పాన్ కార్డు దరఖాస్తు కు ఆధార్ నంబర్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. -
పాన్‌తో ఆధార్ అనుసంధానికి కొత్త లింక్
న్యూఢిల్లీ: పాన్ కార్డుతో ఆధార్ నెంబర్ అనుసంధానం కోసం ఆదాయపన్ను శాఖ కొత్త వెసులుబాటును (ఇ-ఫెసిలిటీ) గురువారం ప్రారంభించింది. సంస్థ వెబ్ సైట్ లో https://incometaxindiaefiling.gov.in/ పేరుతో కొత్త లింక్‌ను లాంచ్ చేసింది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి పాన్ నెంబరు తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఈ సదుపాయాన్ని ప్రారంభించింది. పాన్ తో ఆధార్ అనుసంధాన ప్రక్రియను మరింత సులభం చేస్తూ ఆదాయ పన్నుశాఖ ఇ-ఫైలింగ్ వెబ్ సైట్ లో ఈ కొత్త లింక్‌ను పొందు పర్చింది. ఒక వ్యక్తి యొక్క రెండు ప్రత్యేక గుర్తింపులను (పాన్, ఆధార్ ) అనుసంధానించటానికి హోం పేజ్‌లో దీన్ని సృష్టించింది. అయితే పాన్, ఆధార్ లలో నమోదు చేసిన వివరాలు ఒకేలా ఉండాలని ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది. యుఐడిఎఐ (ఇండిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుండి వెరిఫికేషన్ తర్వాత, ఈ లింక్ ధృవీకరిస్తుందని ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. ఐటీ ఈ ఫైలింగ్ వెబ్సైట్లో లాగిన్ అవసరం లేకుండానే ఎవరైనా ఈ లింక్ ద్వారా ఆధార్, పాన్ నంబర్లను అనుసంధానించుకోవచ్చని తెలిపింది. అలాగే పాన్, ఆధార్ కార్డులలో డేట్ ఆఫ్‌బర్త్, జెండర్ తదితర వివరాలు సరిపోలాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ(వన్‌టైం పాస్వర్డ్) లేదా ఈ మెయిల్ పంపుతామని చెప్పింది. ఆర్థిక చట్టం 2017 ప్రకారం ఐటీఆర్ దాఖలుకు ఆధార్ తప్పనిసరి. అలాగే పాన్ దరఖాస్తుకు ఆధార్ నెంబర్ తప్పనిసరి అనే నిబంధన 2017 జూలై నుంచి అమలుకానుంది. -
ఆధార్-పాన్ లింక్ పై తీర్పు రిజర్వు
పాన్ కార్డుకు, ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఆధార్ లింక్ తప్పనిసరి చేసే అంశంపై తీర్పును ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును రిజర్వులో పెట్టింది. దీనిపై అన్ని పార్టీలు తమ స్పందనలు మంగళవారం వరకు తెలుపాలని జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన అపెక్స్ కోర్టు బెంచ్ ఆదేశించింది. ఆధార్ అత్యంత సురక్షితమైనదని, దీనిలో ఎలాంటి నకిలీకి అవకాశముండదని అటార్ని జనరల్ ముఖుల్ రోహత్గి సుప్రీంకోర్టు బెంచ్ కు తెలిపారు. దాదాపు పది లక్షల పాన్ కార్డులను రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. దేశవ్యాప్తంగా 113.7 కోట్ల ఆధార్ కార్డులు జారీ చేస్తే ఒక్క నకిలీ కూడా బయటపడలేదని ఆయన మంగళవారం సుప్రీం ముందు చెప్పారు. అయితే ఆధార్ సిస్టమ్ పూర్తిగా రుజువు లేనిదని, దీన్ని కూడా నకిలీ చేయొచ్చని పిటిషన్ దారుల తరుఫున లాయర్లు తమ వాదనలు వినిపించారు. ఇటీవలే సుమారు 14కోట్లు (13కోట్ల 5లక్షల) ఆధార్‌కార్డులు, పదికోట్లకు పైగా బ్యాంకు ఖాతాల సమాచారం లీక్ అయిందని తాజా రిపోర్ట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపింది. -
పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం ఎలా?
న్యూఢిల్లీ: భారతీయ పౌరులకు బయోమెట్రిక్ డేటా ఆధారంగా ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డు ఆధార్ కార్డ్. ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకం చేయడానికి, నల్లధనాన్ని అరికట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా తాజాగా ఆర్థిక శాఖ పాన్‌కార్డుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసింది. పాన్, పన్ను రిటర్న్‌లు దాఖలు కోసం ఆధార్ తప్పనిసరి. ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేసేందుకు పాన్‌తో ఆధార్ అనుసంధానాన్ని జులై 1 నుంచి తప్పనిసరి చేసింది ప్రభుత్వం. డిసెంబరు 31 తుది గడువుగా ప్రకటించింది. ఈ గడువు ముగిసిన తర్వాత పాన్ ఇన్వాలిడ్ అవుతుందని కేంద్రం హెచ్చరిస్తోంది. పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం ఎలా? మొదట పన్ను చెల్లింపుదారులఇన్కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి. ఇదివరకే యూజర్ ఖాతా కలిగి ఉన్నవారు నేరుగా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నేరుగా లాగిన్ అయితే సరిపోతుంది.లాగిన్ అయిన తర్వాత ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్కడ లింక్ ఆధార్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ పేరు, పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలను ఎంటర్ చేయాలి. ఈ వివరాలను ఆటోమేటిగ్గా సరిచూస్తుంది. క్రాస్ చెక్ పూర్తయిన తర్వాత మీ నంబరు, క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే.. నిమిషాల్లో ఈ ఆధార్ లింకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. వివరాలన్నీ సరిపోలితేనే ఈ అనుసంధాన ప్రక్రియ సజావుగా జరుగుతుంది. అనుసంధానం పూర్తయిన వెంటనే సమాచారం అందుతుంది. పాన్‌తో పాటు ఆధార్ అనుసంధానం చేయని పక్షంలో కొన్ని రోజుల తర్వాత పాన్ పనికిరాకుండా పోతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే ఆధార్ లేని వారు దాని కోసం దరఖాస్తు చేయాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. ఒకవేళ ఈ మధ్యే ఆధార్ కోసం దరఖాస్తు చేసుకొని వుంటే అనుసంధానం చేసేటప్పుడు ఎన్రోల్మెంట్ నంబరు వేస్తే చాలు. -
పాన్ లేకుండా భారీ మొత్తంలో డిపాజిట్లు
న్యూఢిల్లీ : డీమానిటైజేషన్ తర్వాత అక్రమదారులకు కొమ్ముకాసి బ్యాంకు అధికారులు మోసాలకు పాల్పడినట్టు మరోసారి రుజువైంది. డీమానిటైజేషన్ తర్వాత కొన్ని వారాల్లోనే దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లోకి రూ.1.13 లక్షల కోట్లకు పైగా పెద్దమొత్తంలో డిపాజిట్లు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా వచ్చి చేరాయని హిందూస్తాన్ టైమ్స్ రివీల్ చేసింది. ప్రభుత్వం డేటా ఆధారంగా ఈ విషయాలను హిందూస్తాన్ టైమ్స్ వెలుగులోకి తెచ్చింది. గుజరాత్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ లావాదేవీలు సగానికి కంటే పైగా, అంటే మూడో వంతు డిపాజిట్లు అనుమానిత డిపాజిట్లేనని వెల్లడించింది. అనుమానిత లావాదేవీలను మానిటర్ చేసే ప్రభుత్వ ఏజెన్సీ ఫైనాన్సియల్ ఇంటిలిజెన్సీ యూనిట్(ఎఫ్ఐయూ) ఈ డిపాజిట్లను అనుమానిత లావాదేవీలుగా తేల్చింది. అవినీతికి వ్యతిరేకంగా, నకిలీ ధనంపై ఉక్కుపాదం మోపుతూ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు నవంబర్ 8న పేర్కొంది. పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వం, రూ.2.5 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్లు పన్ను పరిశీలనలోకి వస్తాయని వెల్లడించింది. కానీ కొంతమంది బ్యాంకు అధికారులు ఖాతాదారుల అక్రమ సొమ్ము డిపాజిట్లకు సాయపడినట్టు తెలిసింది. రద్దయిన నోట్లను కొత్త కరెన్సీలోకి అక్రమంగా మార్చుతూ పట్టుబడిన బ్యాంకు అధికారులను సస్పెండ్ చేయడం, అరెస్ట్ చేయడం వంటి కఠినచర్యలు చేపట్టినప్పటికీ, కొంతమంది బ్యాంకుల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి కూడా. నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 వరకు మొత్తం బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డిపాజిట్లు రూ.7.33 లక్షల కోట్లు కాగా, వాటిలో రూ.1.13 లక్షల కోట్లకు అసలు ఎలాంటి డాక్యుమెంట్లు కానీ, పాన్ కానీ లేనట్టు వెల్లడైంది. రూ.50వేల మొత్తంలో డిపాజిట్లు దాటిన వారికి పాన్ తప్పనిసరి. పన్ను ఎగవేతలను గుర్తించడానికి పాన్ వివరాలు ఎంతో సహకరిస్తాయి. మరోవైపు జన్ ధన్ అకౌంట్లను కూడా వాడి బ్యాంకు అధికారులు అక్రమ డిపాజిట్ దారులకు సాయపడినట్టు వెల్లడైంది. -
ఇక నిమిషాల్లో పాన్ కార్డు
న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను శాఖ జారీచేసే శాశ్వత ఖాతా సంఖ్య(పాన్ కార్డు) కావాలంటే వారాల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితికి ఇక చెల్లుచీటి కానుంది. నిమిషాల్లో పాన్ కార్డు ఇక మీ ముందుకు రానుంది. అంతేకాక ఇన్ కమ్ ట్యాక్స్ ను స్మార్ట్ ఫోన్ ద్వారానే చెల్లించేలా అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. పన్ను చెల్లింపుదారులకు సులువుగా ఆధార్ కార్డు ఈ-కేవైసీ ఫెసిలిటీ ద్వారా పాన్ కార్డును జారీచేసేలా కేంద్రప్రత్యక్ష పన్నుల బోర్డు ప్రణాళికలు రచిస్తోంది. ఒకవేళ సిమ్ ను ఈ-కేవైసీ ద్వారా జారీచేస్తే, పాన్ కార్డు కూడా ఇవ్వడం కుదురుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రెండు, మూడు వారాలు పడుతున్న ఈ పని ఇక ఐదు లేదా ఆరు నిమిషాల్లో ముగించేయొచ్చని పేర్కొంటున్నారు. మొదట నెంబర్ జారీచేసి, తర్వాత కార్డు డెలివరీ చేసేలా చూస్తున్నారు. ఇప్పటికే జతకట్టిన సీబీడీటీ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు కొత్త కంపెనీల స్థాపనకు పాన్ కార్డును నాలుగు గంటల్లో జారీచేసేలా పనిచేస్తున్నాయి. -
చిచ్చా.. జర పాన్ మానేయ్: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం నాటి కేసుకు సంబంధించి బుధవారం బోయిగూడ రైల్వే కోర్టులో హాజరయ్యేందుకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు పద్మారావు, కేటీఆర్ సహా పలువురు వచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన చర్చ జరిగింది. పద్మారావును కేటీఆర్ చిచ్చా అని పిలుస్తున్నారు. కేటీఆర్‌ను పద్మారావు రామ్ అని సంబోధిస్తారు. వీరిద్దరూ ఎక్కడ కలుసుకున్నా ‘చిచ్చా.. జర పాన్ , జర్ధాలు తినడం మానేయ్’ అని కేటీఆర్.. పద్మారావుకు సలహా ఇస్తారట. కోర్టు ఆవరణలోనూ కేటీఆర్ ఇదే విధంగా పద్మారావుకు సూచించారు. దీనికి స్పందించిన పద్మారావు ‘రామ్.. నీకు ఏ అలవాటు లేకే గదా! నన్ను పాన్ మానేయ్ అంటున్నావ్. నువ్వు కూడా ఈ చాక్లెట్లు తినూ..’ అంటూ కేటీఆర్‌కు ఇవ్వబోయారు. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వారు. -
ఇక ఒక్కరోజులోనే పాన్ కార్డు!
న్యూఢిల్లీ : డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ దాఖలుతో ఇక కంపెనీలు కేవలం ఒక్క రోజులోనే పాన్, టాన్ రిజిస్ట్రేషన్లను పొందనున్నాయి. దీనికోసం ఆదాయపు పన్ను విభాగం చర్యలు ప్రారంభించేసింది. పాన్, టాన్ రిజిస్ట్రేషన్ ను సులభతరం చేసేందుకు ఈ మేరకు చర్యలను ప్రారంభించినట్టు ఆదాయపు పన్ను విభాగం తెలిపింది. అదేవిధంగా సాధారణ వ్యక్తులు కూడా పాన్‌ను తేలికగా.. తక్కువ సమయంలో పొందేందుకు ఆధార్ ఆధారిత ఈ-సిగ్నేచర్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. పాన్ కార్డును, టాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నంబర్(టాన్)ను కంపెనీలకు త్వరగా అందించడానికి ఎన్ఎస్డీఎల్ ఈగవర్నమెంట్, యూటీఐఐటీఎస్ఎల్ లాంటి పాన్ సర్వీసు ప్రొవైడర్స్ కు డిజిటల్ సంతక ఆధారిత అప్లికేషన్ ను ప్రవేశపెట్టినట్టు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. ఈ కొత్త ప్రక్రియతో ఆన్ లైన్ లో అప్లికేషన్ ను నమోదుచేసిన ఒక్క రోజులోనే పాన్, టాన్ లను కంపెనీలకు అందిస్తామని పేర్కొంది. అదేవిధంగా సాధారణ అప్లికెంట్స్ కు కూడా ఆధార్ ఆధారిత అప్లికేషన్ ప్రక్రియను పాన్ సర్వీసు ప్రొవేడర్లు ఎన్ఎస్డీఎల్ ఈగవర్నమెంట్ ద్వారా అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. ఆధార్ ఆధారితంగా సాధారణ వ్యక్తులకు జారీచేసే పాన్ సర్వీసులతో, పేపర్ లెస్ అప్లికేషన్ ప్రక్రియను ఉచితంగా అందించడమే కాక, డ్యూప్లికేట్ పాన్ సమస్యను అధిగమించవచ్చని ఆదాయపు పన్ను విభాగం తెలిపింది. ఈ అప్లికేషన్ల యూఆర్ఎల్ లింక్స్ డిపార్ట్ మెంటల్ వెబ్సైట్ ఇన్కమ్టాక్స్ఇండియా.గవర్నమెంట్.ఇన్ లోని హోమ్ పేజ్ పై "ఇంపార్ట్టెంట్ లింక్స్"లో అందుబాటులో ఉండనున్నాయి.. -
7లక్షల మందికి ఐటీశాఖ నోటీసులు!
న్యూఢిల్లీ : పన్ను ఎగవేత తనిఖీ నేపథ్యంలో ఏడు లక్షల మంది పన్నుచెల్లింపుదారులకు ఆదాయపు పన్ను విభాగం నోటీసుల జారీ చేసింది. ఈ నోటీసుల జారీ ద్వారా అధిక విలువ కల్గిన లావాదేవీలు లేదా బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్లు ఉన్న పన్ను చెల్లింపుదారుల పాన్ వివరాలను ఆదాయపు పన్ను విభాగం సేకరించనుంది. ఈ లావాదేవీలకు సంబంధించిన చాలా మంది పన్ను చెల్లింపుదారుల పాన్ వివరాలు ఐటీ డిపార్ట్ మెంట్ లో నమోదై లేవని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ తాజా నోటీసులతో వారి పాన్ వివరాలను ఐటీ విభాగం సేకరించనుంది. బ్లాక్ మనీని నిరోధించడంలోనూ, పన్ను ఎగవేతదారులను కనుగోవడంలోనూ పది అంకెల పాన్ నెంబర్ చాలా కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నెంబర్ తోనే పన్నుఎగవేతదారులను ఐటీ డిపార్ట్ మెంట్ గుర్తిస్తోంది. అధిక విలువ కల్గిన లావాదేవీల వివరాలు ఐటీ డిపార్ట్ మెంట్ వద్ద నమోదవుతాయి. సేవింగ్స్ ఖాతాల్లో నగదు డిపాజిట్ లు రూ.10లక్షల కంటే ఎక్కువ ఉన్నవారు, రూ.30లక్షలకంటే ఎక్కువ మొత్తంలో కొనుగోలు/ అమ్మకం నిర్వర్తించేవారి ఈ లావాదేవీ వివరాలు రికార్డు అయి ఉంటాయి. కానీ ఈ లావాదేవీలకు సంబంధించి చాలా మంది పాన్ వివరాలు ఐటీ విభాగం వద్ద లేవని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇన్-హోస్ కంప్యూటర్ టెక్నిక్ తో 14లక్షల నాన్-పాన్ లావాదేవీల వివరాలను ఐటీ డిపార్ట్ మెంట్ సేకరించింది. వీరిలో 7లక్షల మందిని అత్యంత ప్రమాదకరమైన గ్రూపుగా ఐటీ డిపార్ట్ మెంట్ గుర్తించింది. నోటీసులు పొందిన వ్యక్తుల సౌలభ్యానికి ఈ-ఫైలింగ్ పోర్టల్ ను ఐటీ విభాగం డెవలప్ చేసింది. లెటర్ అందిన వ్యక్తులు తమ పాన్ నెంబర్ ను ఎలక్ట్రిక్ గా కూడా నమోదుచేసుకునే సౌకర్యాన్ని అందించింది. ఈ-ఫైలింగ్ వెబ్ సైట్ లోకి పార్టీలు లాగిన్ అయి, లెటర్లో పంపిన ప్రత్యేక లావాదేవీ సంఖ్యతో, వారి లావాదేవీని పాన్ కార్డుతో తేలికగా లింక్ చేసుకోవచ్చు. -
రిటర్నులు ఎందుకు వేయాలి?
చాలా మంది రిటర్నులు ఎందుకు వేయాలని అడుగుతారు. పాన్ ఉంటే వేయాలా.. ఆదాయం లేకపోయినా వేయాలా.. బంగారం కొనుగోలు చేస్తే వేయాలా.. ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు. ఎన్ని ప్రశ్నలు వేసినా ఒకే ఒక సమాధానం. రిటర్నులు దాఖలు చేయండి. ఎందుకంటే.... మీ వయసును బట్టి బేసిక్ లిమిట్ ఉంటుంది. బేసిక్ లిమిట్‌కు మించి మీ నికర ఆదాయం ఉంటే రిటర్నులు దాఖలు చేయాలి. ఈ విషయంలో ఎప్పుడూ చట్ట ప్రకారమే నడుచుకోండి. రిటర్నులు దాఖలుతో ఇతరత్రా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చట్టాన్ని గౌరవించండి! చట్టాన్ని అనుసరించడం మన బాధ్యత. కంపెనీలలో డెరైక్టర్లు రిటర్నులు దాఖలు చేయాలి. భాగస్వామ్య సంస్థలలో భాగస్వాములు కూడా రిటర్నులు వేయాలి. కొత్త నిబంధనల ప్రకారం మీకు విదేశాలలో బ్యాంకు అకౌంట్ ఉన్నా రిటర్నులు దాఖలు తప్పనిసరి. అలాగే విదేశాల్లో ఆస్తులు ఉన్నా, విదేశీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినా రిటర్నులు వేయండి. ట్యాక్సబుల్ ఇన్కమ్ లేకపోయినా విదేశాలలో ఉన్న అంశాలను రిటర్నులలో పొందుపరచాలి. రిఫండ్ పొందాలంటే.. ప్రతిచెల్లింపులు చేసేవారు టీడీఎస్ చేస్తున్నారు. అంటే మూలంలోనే కోత. కొంత మందికి ట్యాక్సబుల్ ఇన్కమ్ దాటకపోయినా కోత తప్పటం లేదు. అధికారులకు భయం ఎక్కువగా ఉండటం వలన కోతలను అమలు పరుస్తున్నారు. కోత పడిందంటే పన్ను ఖజానాలో జమయ్యినట్లే. ఇలాంటి సందర్భంలో రిటర్నులు దాఖలు చేస్తే కాని రిఫండ్ మీకు రాదు. కాబట్టి రిటర్నులు దాఖలు చేయాల్సిందే. అంతే కాదు రిఫండ్ ఉంది అంటే ఆన్లైన్లో దాఖలు చేయాలి సుమా. డిడక్షన్ల క్లెయిమ్ ఎలా? అందరికీ సెక్షన్ 80 కింద డిడక్షన్లు ఉంటాయి. 80 సీ, 80 డీ, 80 డీడీ, 80 ఈ.. ఇలా ఎన్నో. వీటి అన్నింటికీ కాగితాలు ఉండాలి. రిటర్నులతోపాటు జతపరచకపోయినప్పటికీ భద్రపరచుకోవాలి. స్థూల ఆదాయం లో నుంచి వీటిని మినహాయిస్తారు. క్లెయిమ్ మార దు. కానీ స్థూల ఆదాయం మారొచ్చు. అందుకని డిడక్షన్లు సరిగ్గా క్లెయిమ్ చేస్తూ రిటర్నులు వేశారంటే.. మీరు మీ డిడక్షన్లన్నింటినీ డిక్లేర్ చేసినట్లు. ఉదాహరణకు మీ స్థూల ఆదాయం 3 లక్షలు. 80 సీ కింద రూ. 1,50,000 చెల్లించారు. ట్యాక్సబుల్ ఇన్కమ్ రూ.1,50,000. పన్ను భారం లేదు. ఇటువంటి సందర్భాల్లో ఏదేని కారణం వల్ల ఆదాయం రూ.1,00,000 పెరిగిందనుకోండి. అప్పుడు గతంలో మీరు చేసిన క్లెయిమ్ ఇప్పుడు మీ పన్ను భారాన్ని తగ్గిస్తుంది. షేర్లు అమ్ముతున్నారా.. షేర్ల లావాదేవీలలో నష్టం రావచ్చు. లాభాలు పొందొచ్చు. చాలా మంది ఇటువంటి లావాదేవీలను డిక్లేర్ చేయడం లేదు. బేసిక్ లిమిట్ దాటకపోతే.. అస్సలు పట్టించుకోవడం లేదు. ఇన్కమ్ సరే.. లావాదేవీల్లో నష్టం రావొచ్చు. ఈ నష్టాన్ని డిక్లేర్ చేయడం వలన మీకొచ్చే షేర్ల మీద ఆదాయం పడిపోవచ్చు. తద్వారా పన్ను భారం తగ్గుతుంది. అలా సర్దుబాటు కాకపోయినా రాబోయే సంవత్సరాల్లో సర్దుబాటు చేయవచ్చు. అందుకే కచ్చితంగా ఈ లావాదేవీలను చూపిస్తూ రిటర్నులు దాఖలు చేయండి. అమెరికా నుంచి అబ్బాయి డబ్బు పంపిస్తే! విదేశాల నుంచి అబ్బాయి/అమ్మాయి/ఇతరులు మీకు డబ్బు పంపుతున్నారా? భయపడనక్కర్లేదు. అక్కడ పన్ను చెల్లించిన ఆదాయం మీ అకౌంట్లో పడింది. ఇక్కడ పన్ను పడదు. కానీ మీరు చూపించాలి. అలాగే గ్రాట్యుటీ, జీవిత బీమా వంటి పన్నుకు గురికాని ఆదాయాలనూ డిక్లేర్ చేస్తూ రిటర్నులు దాఖలు చేయాలి. మరిన్ని ప్రయోజనాలు.. వీసా అధికారులు, బ్యాంక్ ఆఫీసర్లు, మీకు రుణమిచ్చే వారు, క్రెడిట్ కార్డు సంస్థలు, కొన్ని క్లబ్బులు, సంస్థలు... ఇలా ఎందరో ఆదిలోనే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు అడుగుతున్నారు. పన్ను భారం లేకపోయినా.. బేసిక్ లిమిట్ దాటకపోయినా.. వీటి విలువ అపారం. అందరూ వీటిని విశ్వసిస్తున్నారు. వీటి మీద ఆధారపడే మీకు ఎన్నో పనులు జరుగుతాయి. కాబట్టి ఇక ఆలస్యం ఎందుకు. రిటర్నులు వేయడానికి ఉపక్రమించండి. - ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య -
ఆదాయ పన్ను శాఖ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ : ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతకు పాల్పడేవారిపై ఆదాయపు పన్ను విభాగం కొరడా ఝళిపించనుంది. పన్ను చెల్లించని వారిపట్ల కఠినంగా స్పందించిన ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పన్ను డిఫాల్టర్ల పాన్ కార్డ్ బ్లాక్ చేయడం, గ్యాస్ సబ్సిడీలను రద్దు చేయడంతో పాటు రుణాలు మంజూరుకాకుండా చేయడం లాంటి చర్యలను తీసుకోబోతుంది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ చర్యలు మొదలు పెట్టడానికి పకడ్బందీ చర్యలకు దిగింది. ఎక్కువ మంది పన్నులను తప్పించుకోవడం, ఎగవేతకు పాల్పడుతుండటంతో వీటిని నిరోధించడానికి ఈ చర్యలను ఎన్నుకుంది. దీనికి సంబంధించి అన్ని పత్రాలను తయారుచేసింది. పీటీఐ నుంచి అనుమతిని కూడా పొందింది. ఈ నిర్ణయం మూలంగా ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగొట్టే వారి పాన్ (పర్మినెంట్ అకౌంట్ నెంబర్) కార్డును బ్లాక్ చేస్తారు. డిఫాల్టర్లకు ఇకమీదట దేశంలో ఎక్కడా కూడా రుణాలు మంజూరు కావు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఓవర్ డ్రాప్ట్ సౌకర్యం కూడా రద్దు కానుంది. వారికి ఇన్నాళ్లుగా వచ్చే గ్యాస్ సబ్సిడీ సౌకర్యాన్ని కూడా ఉపసంహరించుకోవాలని ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రతిపాదించడంతో, డిఫాల్టర్లకు ఈ సౌకర్యాన్ని కూడా తీసేస్తున్నట్టు పేర్కొంది. ఈ చర్యలు డిఫాల్టర్లకు ఆటంకంగా మారి, పన్ను చెల్లిస్తారని ఆదాయపు పన్ను విభాగం చెప్పింది. బ్లాక్ చేసిన పాన్ కార్డులను రిజిస్ట్రార్ ఆఫ్ ప్రాపర్టీస్ లకు పంపనుంది. దానివల్ల వాళ్ల ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాలు కూడా సాధ్యం కావని ఆదాయపు పన్ను విభాగం పేర్కొంది. టాక్స్ ఆఫీసులన్నింటికీ డిఫాల్టర్ల సమాచారం వెళ్తుందని, దానివల్ల దేశమంతటా ఎక్కడ కూడా డిఫాల్టర్లు రుణాలు, సబ్సిడీలు పొందలేరని పన్ను అధికారులు పేర్కొన్నారు. క్రెడిట్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ (సిబిల్) డేటాను ఆదాయపు పన్ను విభాగం సబ్ స్క్రైబ్ చేసుకోవాలని నిర్ణయించింది. ఈ సబ్ స్క్రిప్షన్ తో డిఫాల్టర్ల ఆర్థిక లావాదేవీల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. పన్నులను రాబట్టుకోవడం, ఆస్తులను ఫ్రీజ్ చేయడం వంటి చర్యలు చేపట్టనున్నట్టు తెలిపింది. గతేడాది మొదట్లోనే డిఫాల్టర్ల సమాచారాన్ని "నేమ్ అండ్ షేమ్"గా పేర్కొంటూ ఎక్కువ పన్ను ఎగవేతదారులు వివరాలను జాతీయ పత్రికలలో, అధికారిక వెబ్ పోర్టల్ లో పొందుపర్చడం ప్రారంభించింది. -
పాన్ కోసం వెళ్లి.. ప్రాణాలు కోల్పోయాడు
కాచిగూడ: పాన్ తెచ్చుకుందామని వెళ్లిన ఓ వ్యక్తిని ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబలించింది. రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. కాచిగూడ ఇన్స్పెక్టర్ డి.రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కార్వాన్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖాజా (58) మటన్ వ్యాపారం చేస్తుంటాడు. శనివారం ఉదయం మటన్ తెచ్చేందుకు స్కూటర్‌పై చెంగిచెర్లకు వెళ్లి తిరిగి వస్తుండగా కాచిగూడ నింబోలిఅడ్డ చౌరస్తాలో స్కూటర్‌ను రోడ్డుపక్కన ఆపి, ఎదురుగా ఉన్న పాన్‌షాపులో పాన్ తెచ్చుకునేందుకు వెళుతుండగా యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ యాదయ్యను అదుపులోకి తీసుకున్నారు. కాచిగూడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బిల్లు రూ.50 వేలు దాటితే ‘పాన్’ తప్పనిసరి
హోటల్ బిల్లు, విదేశీ ప్రయాణ టికెట్లు మొదలైన వాటికి వర్తింపు * జనవరి 1 నుంచి అమల్లోకి * దేశీయంగా నల్లధనం కట్టడికి కేంద్రం చర్యలు న్యూఢిల్లీ: నల్లధనం చలామణిని కట్టడి చేసే దిశగా కేంద్రం నిబంధనలు కఠినతరం చేసింది. హోటల్ బిల్లులు, విదేశీ ప్రయాణ టికెట్లు మొదలైన వాటి కి రూ. 50,000కు మించి నగదు రూపంలో జరిపే చెల్లింపులకు పాన్ (పర్మనెంటు అకౌంటు నంబరు) తప్పనిసరి చేసింది. లగ్జరీయేతర అంశాలకు సంబంధించి నగదు లావాదేవీల విషయంలో రూ. 2 లక్షలు దాటితేనే పాన్ నంబరు తప్పక ప్రస్తావించాల్సి ఉంటుంది. ఇక చిన్న ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చేలా రూ. 50,000 పైచిలుకు పోస్టాఫీస్ డిపాజిట్లకు పాన్ తప్పనిసరి నిబంధనను కేంద్రం తొలగించింది. మరోవైపు పాన్ తప్పనిసరిగా పేర్కొనాల్సిన స్థిరాస్తి క్రయ, విక్రయాల లావాదేవీ విలువ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచింది. ఇది అందుబాటు ధరలోని గృహాలు కొనుగోలు చేసే వారికి ఊరటనివ్వనుంది. గతంలో రూ. 5 లక్షల విలువ చేసే స్థిరాస్తుల క్రయ,విక్రయాలకు కూడా పాన్ తప్పనిసరి చేయాలని కేంద్రం భావించింది. తాజా నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. బ్లాక్‌మనీ చలామణి ఎక్కువగా జరిగే ఆభరణాలు.. బులియన్ కొనుగోళ్ల లావాదేవీ విలువ రూ. 2 లక్షలు మించితే పాన్ పేర్కొనక తప్పదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పరిమితి రూ. 5 లక్షలకు మించి ఉంది. మరోవైపు, రూ. 2 లక్షలకు మించిన అన్ని నగదు లావాదేవీలకు పాన్ నంబరును పేర్కొన డం తప్పనిసరిగా చేస్తూ త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో తెలిపారు. 2015-16 బడ్జెట్ ప్రసంగంలో రూ. 1 లక్ష పైగా విలువ చేసే క్రయ, విక్రయ లావాదేవీలన్నింటికీ పాన్ తప్పనిసరి చేయనున్నట్లు ప్రకటించినా జైట్లీ తాజాగా ఆ పరిమితిని పెంచారు. బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపుల దాకా .. క్యాష్ కార్డులు లేదా ప్రీపెయిడ్ సాధనాల కొనుగోలుకు రూ. 50,000కు మించి నగదు చెల్లింపులు జరిపినా లేదా అన్‌లిస్టెడ్ కంపెనీల్లో షేర్ల కొనుగోలుకు రూ. 1లక్షకు పైగా చెల్లించినా పాన్ తప్పనిసరి కానుంది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాలు మినహా ఇతరత్రా బ్యాంకు ఖాతాలేవీ తెరవాలన్నా పాన్ తప్పదని అధియా వివరించారు. విలాసవంతమైన ఖర్చులు అయినందున.. హోటల్, విదేశీ పర్యటన బిల్లులను ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు అధియా పేర్కొన్నారు. రూ. 2 లక్షలు మించిన మిగతా అన్ని నగదు లావాదేవీలకూ పాన్ నంబరు తప్పనిసరన్నారు. ఇది తాత్కాలికమేనని, అంతిమంగా ఈ పరిమితిని రూ. 1 లక్షకు తగ్గించడమే తమ ఉద్దేశమని ఆయన వివరించారు. కొన్నింట ఊరట.. సిసలైన లావాదేవీలకు నిబంధనల చిక్కులు తొలగించేందుకు, అదే సమయంలో భారీ లావాదేవీల వివరాలను సరిగ్గా రాబట్టేందుకు మరికొన్ని చర్యలు తీసుకున్నట్లు అధియా చెప్పారు. ఇందులో భాగంగానే స్థిరాస్తి కొనుగోలు, విక్రయాల లావాదేవీ విలువ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచినట్లు వివరించారు. హోటల్, రెస్టారెంటు బిల్లుల పరిమితిని రూ. 25,000 నుంచి రూ. 50,000కు పెంచినట్లు పేర్కొన్నారు. ఇక, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో షేర్ల క్రయ,విక్రయాల విలువనూ రూ. 50,000 నుంచి రూ. 1 లక్షకు పెంచినట్లు వివరించారు. బేసిక్ ల్యాండ్‌లైన్ లేదా సెల్‌ఫోన్ కనెక్షన్ తీసుకునే విషయంలో పాన్ నిబంధనను సడలించినట్లు అధియా తెలిపారు. రూ. 50,000కు మించిన నగదు డిపాజిట్లు లేదా ఒకే రోజున అంత మొత్తం విలువ చేసే బ్యాంక్ డ్రాఫ్ట్/పే ఆర్డర్లు/ బ్యాంకర్స్ చెక్ మొదలైనవి తీసుకున్నా, రూ. 50,000 జీవిత బీమా ప్రీమియం చెల్లింపులకు పాన్ తప్పనిసరి నిబంధన యథాప్రకారంగా కొనసాగుతుందని ఆయన వివరించారు. బ్లాక్‌మనీపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) .. రూ. 1 లక్ష పైగా విలువ చేసే అన్ని రకాల వస్తువులు, సర్వీసుల క్రయ,విక్రయాలకు పాన్ నంబరు తప్పనిసరి చేయాలంటూ సూచించిన నేపథ్యంలో కేంద్రం తాజా చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
వరక్ మెరుపు
టక్కుం... టక్కుం... టక్కుం... అంటూ పాతనగరం షాలిబండ దారిలో లయబద్ధంగా శబ్దం వినిపించటాన్ని గమనించారా? తదేక దృష్టితో కొందరు కార్మికులు సుత్తులతో చిన్న తోలు సంచిపై కొడుతుంటే వచ్చే శబ్దాలివి. అలా గంటల తరబడి వారి శ్రమ కొనసాగుతుంది. ఆ శబ్దాల వెనక పెద్ద చారిత్రక నేపథ్యమే ఉంది. నిర్మాణాలు, రుచులు, కళలు... అన్నింటా ఆర్భాటం, ప్రత్యేకత ఉండాలనే తత్వం కుతుబ్షాహీలది. కిళ్లీ అంటేనే ప్రత్యేకం... దాని రూపులో ఆర్భాటం లేకుంటే ఏం బాగుంటుందనుకున్న పాదుషాలు దానికి ‘మెరుపు’ అద్దారు. అదే ‘వరక్’. దాన్ని తయారు చేసేప్పుడు వచ్చేదే ఆ శబ్దం. భాగ్యనగరం అనగానే రాచరిక ఠీవీ ఒకలబోసే రాజప్రాసాదాల నిర్మాణం.. వాటిల్లో హొయలుబోయే విదేశీ నిర్మాణ కౌశలం.. షాహీ దస్తర్‌ఖానాలో కొత్త రుచుల భోజనం.. గానాభజానాలతో ఖుషీ.. సంగీత నృత్య కార్యక్రమాలను తిలకిస్తూ కిళ్లీని ఆస్వాదించటం.. కళ్లముందు కదలాడే నాటి దృశ్యాలివి. కిళ్లీకి బంగారు పూత అద్దటం ఆ ఆడంబరాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ఇలా వన్నెలద్దే సంప్రదాయమే వరక్ కళ. అది దేశంలో తొలుత లక్నోలో ప్రారంభమైంది. ఆదిలో దీన్ని యునానీ మందుల్లో వినియోగించటం ప్రారంభించారు. వెండి, బంగారాల్లో ఔషధ గుణాలుండటమే దీనికి కారణం. ఆ తర్వాత మిఠాయిలు, కిళ్లీల వాడకం మొదలైంది. తమలపాకు కిళ్లీ చుట్టాక దానిపైన వెండి, బంగారు పూతలనద్దటం రాచరిక దర్పానికి గుర్తుగా భావించేవారు. తొలి నాళ్లలో ఉన్నత కుటుంబాలకే పరిమితమైన ఈ సంప్రదాయం క్రమంగా ఇతర లోగిళ్లకూ పాకింది. వాడకం పెరిగే సరికి వాటి తయారీ కూడా విస్త్రృతమైంది. లక్నోలో ప్రారంభమైన ఈ పద్ధతి ఆ తర్వాత వారణాసి, జైపూర్, హైదరాబాద్‌లకు సోకింది. ఇప్పటికీ ఈ నగరాల్లో వరక్ తయారీ ఓ కుటుంబ పరిశ్రమ. నగరంలో కేవలం చార్మినార్- షాలిబండ దారిలో మాత్రమే దర్శనమిస్తుంది. ఇదీ విధానం... యంత్రాల ప్రమేయం లేని కళాత్మక ప్రక్రియ వరక్. మిఠాయిలు, పాన్లు కొన్నప్పుడు వాటిపై కనిపించే తెల్లటి పూతను నిశితంగా పరిశీలిస్తే తెలుస్తుంది అది ఎంత నాజూకుగా ఉంటుందో. పూత రేకులోని పొరకంటే సన్నగా ఉంటుంది. వెండి, బంగారాన్ని అంత పలచగా తయారు చేయటం సాధారణ విషయం కాదు. పూర్తిగా చేతి తయారీ కావటం విశేషం. అర్ధ రూపాయంత నమూనాలో ముందుగా ముడిసరుకును సిద్ధం చేస్తారు. అది పలచటి రేకులాగా ఉంటుంది. దీన్ని ప్రత్యేకంగా రూపొందించిన తోలు సంచిలో ఉంచుతారు. పుస్తకంలో కాగితాల మాదిరిగా ఆ సంచీలో 250 వరకు తోలు కమ్మలు ఉంటాయి. ఒక్కో కమ్మ కింద ఒక్కో వెండి బిళ్లనుంచి సుత్తిలాంటి పనిముట్టుతో ఏకంగా మూడు గంటల సేపు కొడుతూ పోతారు. ఆ దెబ్బలకు వెండి/బంగారు బిళ్లలు బాగా సాగి అతి పలచటి పొరల్లాగా తయారవుతాయి. వీటిని జాగ్రత్తగా తీసి పుస్తకాల్లోని కాగితాల మధ్య భద్రపరుస్తారు. 10 గ్రాముల వెండి/బంగారం నుంచి 160-175 పొరలు తయారవుతాయి. వీటిని మిఠాయిలు, కిళ్లీలు, కబాబ్స్‌లో అలంకరణగా వాడతారు. విమర్శలు తప్పలేదు... ఈ పొరల తయారీపై కొంత కాలంగా విమర్శలు చుట్టుముట్టాయి. తయారీ క్రమంలో ఆ పొరలు చిరిగిపోకుండా ఉండేందుకు తయారీదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందుకోసం తోలు సంచీలోని ఆకుల మధ్య జంతువుల పేగులతో తయారైన లీవ్స్ (ఇవి మెత్తగా, దృఢంగా ఉంటాయి)ను వాడుతున్నారని కొందరు పేర్కొంటున్నారు. వీటి మధ్యలో వెండి రేకులుంచి సుత్తితో కొడుతూ ఉండటం వల్ల ఆ పొరలు చిరిగిపోకుండా చాలా పలచగా సాగుతాయి. ఇదే క్రమంలో పేగులతో తయారైన లీవ్స్ నుంచి మాంసపు ముక్కలు వెండి రేకులకు అతుక్కుంటున్నాయని, వాటిని అలాగే స్వీట్లు, కిళ్లీలకు అద్ది అమ్ముతున్నారని వారు విమర్శిస్తున్నారు. - గౌరీభట్ల నర్సింహమూర్తి -
ఉమ్మితే..ఇకపై జైలుపాలే!
ఆరోగ్య మంత్రి దీపక్ సావంత్ సాక్షి, ముంబై: పాన్, గుట్క నమిలి ఎక్కడబడితే అక్కడ ఉమ్మి వేసేవారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దీపక్ సావంత్ చెప్పారు. దీనికోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం తేవాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. క్షయ రోగానికి ఊతమిచ్చే గుట్క, పాన్వంటి పదార్థాలను నమిలి రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేసే వారి వల్ల క్షయరోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. గడిచిన ఐదేళ్ల కాలం ఏకంగా 35 మంది సిబ్బంది క్షయతో చనిపోయారు. శివ్డీలోని టీబీ ఆస్పత్రిలో రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లకు, సిబ్బందికి క్షయ సోకింది. దీంతో ఇష్టానుసారం ఉమ్మివేస్తూ రోగాలను విస్తరింపజేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సావంత్ చెప్పారు. ఇదివరకు ఇలాంటి వారిపై కఠినమైన చట్టం లేదు. బీఎంసీ అధికారులు కేవలం రూ.200 జరిమాన వసూలుచేసి వదిలేస్తున్నారు. కొత్త చట్టంలో జరిమానా డబ్బులు పెంచడం, జైలు శిక్ష విధించడం లాంటి కఠిన చర్యలు ఉంటాయి.