న్యూఢిల్లీ : ఆదాయపన్ను శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) ఆధారంగా సంస్థల రిటర్నుల దాఖలు వివరాలను షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు తెలుసుకునే ఏర్పాటును (ఐటీఆర్ ఫైలింగ్ కాంప్లియన్స్) ఆదాయపన్ను శాఖ ప్రారంభించింది. భారీ మొత్తాల్లో నగదును ఖాతాల నుంచి తీసుకుంటున్న వారు ఇప్పటి వరకు రిటర్నులు దాఖలు చేయలేదని డేటా ఆధారంగా తెలుస్తోందని ఆదాయపన్ను శాఖ తెలిపింది. ఇటువంటి వ్యక్తులు రిటర్నులు దాఖలు చేసేలా చూసేందుకు, నల్లధనాన్ని నియంత్రించేందుకు కేంద్రం చట్టంలో పలు సవరణలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. నగదు ఉపసంహరణలు రూ.20 లక్షలు, అంతకుమించి చేస్తే టీడీఎస్ అమలు ఇందులో భాగమే. (స్కూల్‌నెట్ ఇండియా విక్రయానికి ఓకే..)
ఐటీ రిఫండ్స్... రూ.98,625 కోట్లు
ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ గడచిన ఐదు నెలల్లో (2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్1వ తేదీ వరకూ) 26.2 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు రూ.98,625 కోట్ల రిఫండ్స్ ఇచ్చింది. బుధవారం వెలువరించిన సవరిత గణాంకాల ప్రకారం– 24,50,041 లక్షల మంది వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు జరిపిన రిఫండ్స్ విలువ రూ.29,997 కోట్లు. కార్పొరేట్ల విషయంలో 1,68,421 లక్షల మందికిపైగా పన్ను చెల్లింపుదారులకు జరిపిన రిఫండ్స్ విలువ రూ.68,628 కోట్లు. కోవిడ్–19 మహమ్మారి సవాళ్లు విసురుతున్న ప్రస్తుత సమయంలో ఎటువంటి జాప్యం లేకుండా పన్ను చెల్లింపుదారులకు సంబంధిత సేవలు సకాలంలో అందాలని ఆదాయపు పన్ను శాఖను కేంద్రం నిర్దేశించింది. పన్ను రిఫండ్స్ ఎప్పటికప్పుడు జరగాలని స్పష్టం చేసింది. (ఫార్చూన్ ‘40’లో అంబానీ వారసులు)
Comments
Please login to add a commentAdd a comment