Refunds
-
ఆదాయపన్ను రిఫండ్లు వేగవంతం
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ నుంచి పన్నుకు సంబంధించిన రిఫండ్లు గడిచిన ఐదేళ్లలో వేగవంతమయ్యాయి. పన్ను చెల్లింపుదారులు తమకు రావాల్సిన బకాయిలను ఆదాయపన్ను శాఖ నుంచి వేగంగా పొందుతున్నారు. రిఫండ్ కోసం వేచి ఉండే కాలం గణనీయంగా తగ్గినట్టు సీఐఐ నిర్వహించిన సర్వేలో 89 శాతం మంది వ్యక్తులు, 88 శాతం సంస్థలు చెప్పడం గమనార్హం. ఈ సర్వే వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఐఐ సమరి్పంచింది. తమ అంచనా పన్ను బాధ్యతకు మించి టీడీఎస్ చెల్లించలేదని 75.5 శాతం మంది వ్యక్తులు, 22.4 శాతం సంస్థలు ఈ సర్వేలో చెప్పాయి. రిఫండ్ ఏ దశలో ఉందన్న విషయం తెలుసుకోవడం సులభంగా మారినట్టు 84 శాతం మంది వ్యక్తులు, 77 శాతం సంస్థలు తెలిపాయి. ఆదాయపన్ను రిఫండ్ క్లెయిమ్ సౌకర్యవంతంగా ఉన్నట్టు 87 శాతం మంది వ్యక్తులు, 89 శాతం సంస్థలు చెప్పాయి. పన్ను ప్రక్రియ ఆటోమేషన్‌కు సంబంధించి ప్రభుత్వం ఇటీవలి కాలంలో తీసుకున్న ఎన్నో చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నట్టు సీఐఐ ప్రెసిడెంట్ ఆర్ దినేష్ తెలిపారు. ‘‘గడిచిన ఐదేళ్లలో ఆదాయపన్ను రిఫండ్లను పొందే విషయంలో వ్యక్తులు, సంస్థలు వేచి ఉండే కాలం గణనీయంగా తగ్గడం ప్రోత్సాహకరంగా ఉంది. ప్రభుత్వం తీసుకున్న విరామం లేని ఎన్నో చర్యలు ఈ ప్రక్రియను మరింత సులభంగా, సమర్థవంతంగా మార్చేశాయి’’అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. -
IT refund scam: తెలుసుకోండి: లేదంటే కొంప కొల్లేరే!
IT Refund Scam: ఆదాయ పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు ఒక ఎత్తయితే.. రిఫండ్ రావడం మరో ఎత్తు. రిటర్న్స్ దాఖలు యుగియడంతో రీఫండ్ ప్రక్రియ కూడా షురూ అయింది. దీంతో తమ ఐటీఆర్ వెరిఫికేషన్ పూర్తయిన రీఫండ్ ఎపుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది. దీన్నే అవకాశంగా తీసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతారు. ఫేక్ మెసేజ్‌లతో పన్ను చెల్లింపుదారులు మభ్యపెట్టి, వారి ఖాతాలను ఖాళీ చేస్తున్న కొత్త స్కామ్ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఐటీ రీఫండ్ మెసేజ్‌లపై అప్రమత్తంగా ఉండాలని పీఐబీ హెచ్చరించింది. ఏమిటీ మెసేజ్ దీనిక థ కమామిష్ష ఏమిటో ఒకసారి చూద్దాం. ఇదీ స్కాం ఇటీవల కాలంలో చాలా మందికి ఈ తరహా మెసేజ్ లు వచ్చాయి “Dear Sir, You have been approved for an income tax refund of ₹15,490/-, the amount will be credited to your account shortly. Please verify your account number 5XXXXX6755. If this is not correct, please update your bank account information by visiting the link below’’ ఇలాంటి మెసేజ్ వచ్చిందా? ఐటీ విభాగం నుంచి వచ్చిందని బావించి వెంటనే తప్పులో కాలేసారో, భారీ నష్టాల్ని మూటగట్టుకోవాల్సి ఉంది. (లగ్జరీ ఎస్టేట్ కొనుగోలు చేసిన జెఫ్ బెజోస్: ప్రియురాలి కోసమేనా?) ఆదాయ పన్ను రీఫండ్ కు అనుమతి లభించింది. ఈ రీఫండ్ డైరెక్టుగా రావాలంటే.. బ్యాంక్ ఖాతాను అప్ డేట్ చేసుకోవాలి అంటే మనల్ని బురిడీ కొట్టిస్తారు. ఆ మెసేజ్ ను నమ్మి, వారు అడిగిన వివరాలను ఇవ్వకండి.ఎందుకంటే ఇది సైబర్ నేరస్తులకొత్త ఎత్తుగడ.వాస్తవానికి ఇలాంటి సందేశాలేవీ ఐటీ విభాగం పంపదు. ఇది నకిలీ మెసేజ్ అని, సైబర్ నేరస్తుల కొత్త తరహా మోసమని గుర్తించాలని పీఐబీ ఫాక్ట్ చెక్ ట్వీట్ చేసింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. (గుడ్ న్యూస్: అమెరికా షాక్, దిగొస్తున్న పసిడి) A viral message claims that the recipient has been approved for an income tax refund of ₹ 15,490.#PIBFactCheck ✔️ This claim is 𝐅𝐚𝐤𝐞. ✔️ @IncomeTaxIndia has 𝐧𝐨𝐭 sent this message. ✔️𝐁𝐞𝐰𝐚𝐫𝐞 of such scams & 𝐫𝐞𝐟𝐫𝐚𝐢𝐧 from sharing your personal information. pic.twitter.com/dsRPkhO3gg — PIB Fact Check (@PIBFactCheck) August 2, 2023 రీఫండ్ ఎలా వస్తుంది? ఐటీ రీఫండ్ అర్హత ఉన్న పన్ను చెల్లింపుదారులకు, సంబంధిత (వాలిడేషన్ సమయంలో ఇచ్చిన) బ్యాంక్ ఖాతాకు ఆ రీఫండ్ మొత్తం జమ అవుతుంది. బ్యాంక్ వివరాలను అప్ డేట్ చేయమని కానీ, బ్యాంక్ ఖాతా వివరాలను తెలపమని కానీ, ఓటీపీ, పిన్, పాస్ వర్డ్ వంటి రహస్య, వ్యక్తిగత వివరాలను వెల్లడించమని కానీ కోరుతూ ఐటీ విభాగం ఎలాంటి సందేశాలను పంపించదు అనేది గమనించాలి. రీఫండ్ ఎపుడు వస్తుంది? ఆదాయపు పన్ను వాపసు స్వీకరించడానికి పట్టే సమయం పూర్తిగా ఆదాయపు పన్ను శాఖ అంతర్గత ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, మీరు మీ రిటర్న్‌ను ఇ-ధృవీకరించిన తర్వాత 90 రోజులు. కానీ 7 నుండి 120 రోజులు పడుతుంది. రీఫండ్ ప్రక్రియను వేగవంతం చేసేలి ఆదాయపు పన్ను శాఖ ఫిబ్రవరి 2021న కొత్త రీఫండ్ ప్రాసెసింగ్ సిస్టమ్‌ను అమలు చేసింది. ఎలా చెక్ చేసుకోవాలి? యూజర్ ID, పాస్వర్డ్, పుట్టిన తేదీ / ఇన్కార్పొరేషన్ తేదీ , క్యాప్చాతో ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కి లాగిన్ అయ్యి, రీఫండ్ స్టాటస్‌ను చెక్ చేసుకోవచ్చు. -
ఈ–స్కూటర్ కస్టమర్లకు చార్జర్ డబ్బు వాపస్
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాలతో పాటు చార్జర్లను విడిగా కొనుగోలు చేసిన కస్టమర్లకు సదరు చార్జర్ల డబ్బును వాపసు చేయనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్, ఎథర్ ఎనర్జీ తెలిపాయి. ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. స్వార్ధ శక్తులు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ విద్యుత్ వాహనాల పరిశ్రమ గత కొన్నాళ్లుగా అసాధారణంగా వృద్ధి చెందినట్లు సోషల్ మీడియా సైట్ ట్విటర్లో ఓలా పేర్కొంది. ఈ నేపథ్యంలో కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అర్హులైన కస్టమర్లందరికీ చార్జర్ల డబ్బును తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. అయితే, ఎంత మొత్తం చెల్లించనున్నదీ మాత్రం వెల్లడించలేదు. ఇది సుమారు రూ. 130 కోట్లు ఉండొచ్చని అంచనాలు నెలకొన్నాయి. ఇక, ఈవీ స్కూటర్లతో కలిపే చార్జర్లను విక్రయించే అంశంపై భారీ పరిశ్రమల శాఖతో కొన్నాళ్లుగా చర్చలు జరుపుతున్నట్లు ఎథర్ ఎనర్జీ తెలిపింది. చట్టబద్ధంగా ఇలా చేయాల్సిన అవసరం లేనప్పటికీ వాహనాలతో పాటే చార్జరును కూడా ఇచ్చేలా తమ నిబంధనలు మార్చుకున్నట్లు వివరించింది. అలాగే 2023 ఏప్రిల్ 12కు ముందు కొనుగోలు చేసిన వాహనాల విషయంలో చార్జర్లకు వసూలు చేసిన మొత్తాన్ని రిఫండ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఇదే తరహాలో టీవీఎస్ మోటార్ కంపెనీ తాము రూ. 20 కోట్లు పైచిలుకు వాపసు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. -
ఎయిరిండియాకు భారీ షాక్, మిలియన్ డాలర్ల జరిమానా
సాక్షి, ముంబై: టాటా-గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కరోనా మహమ్మారి సమయంలో విమానాలను రద్దు చేయడం లేదా మార్చిన కారణంగా ప్రయాణీకులకు రీఫండ్లను అందించడంలో తీవ్ర జాప్యం చేసినందుకుగాను భారీ జరిమానా విధించాలని అమెరికా ఆదేశించింది. 121.5 మిలియన్ డాలర్లు (దాదాపు 990 కోట్ల రూపాయలు) రీఫండ్‌తోపాటు జరిమానాగా 1.4 మిలియన్ డాలర్లు (రూ.11.35 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. ఇదీ చదవండి: చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో: అమెజాన్ సంచలన నిర్ణయం! 600 మిలియన్ డాలర్లకు పైగా వాపసు చెల్లించడానికి అంగీకరించిన ఆరు విమానయాన సంస్థలలో ఎయిరిండియా కూడా ఒకటని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ సోమవారం ప్రకటించింది. ఎయిరిండియా ‘రిఫండ్ ఆన్ రిక్వెస్ట్’ విధానం, తమ పాలసీకి విరుద్ధంగా ఉందని పేర్కొంది. తమ రవాణాశాఖ నిబంధనల ప్రకారం విమానాన్ని రద్దు చేసినా లేదా మార్పు చేసినా చట్టబద్ధంగా టిక్కెట్లను వాపసు చేయాలని, ఈ మేరకు ఎయిరిండియాకు ఆదేశించినట్లు రవాణా కార్యదర్శి పీట్ బుట్టిగీగ్ తెలిపారు. అలాగే ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ 222 మిలియన్ డాలర్లతోపాటు 2.2 మిలియన్ల డాలర్లు పెనాల్టీ చెల్లించాల్సిఉందన్నారు. (ElonMusk: తీవ్ర వాదన, ఊడిపోయిన ఉద్యోగం, అసలేం జరిగిందంటే?) -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు 24 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు స్థూలంగా సెప్టెంబర్ 8వ తేదీ నాటికి 24 శాతం పెరిగి రూ.8.98 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. రిఫండ్స్ మినహాయింస్తే, నికర వసూళ్లు 16.25 శాతం ఎగసి రూ.7.45 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏప్రిల్–అక్టోబర్ 8 మధ్య రిఫండ్స్ గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 81 శాతం పెరిగి రూ.1.53 లక్షల కోట్లుగా నమోదయినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. మొత్తం వసూళ్లలో వ్యక్తిగత ఆదాయపు పన్ను ( సెక్యూరిటీస్ ట్రాన్జాక్షన్ పన్నుసహా) 32 శాతం పెరగ్గా, కార్పొరేట్ పన్ను ఆదాయాలు 17 శాతం ఎగశాయని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. గత ఆర్థిక సంవత్సరం (2021–22) ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.10 లక్షల కోట్లు. 2022–23లో ఈ వసూళ్ల లక్ష్యం రూ.14.20 లక్షల కోట్లు. ఇందులో కార్పొరేట్ పన్ను వసూళ్ల అంచనా రూ.7.20 లక్షలుకాగా, వ్యక్తిగత పన్ను వసూళ్ల అంచనా రూ.7 లక్షల కోట్లు. తాజా గణాంకాల ప్రకారం, నికర వసూళ్లు (రూ.7.45 లక్షల కోట్లు) బడ్జెట్ అంచనాల్లో దాదాపు 52 శాతం దాటడం గమనార్హం. దేశంలో పలు రంగాలు మందగమనంలో ఉన్నప్పటికీ, ఎకానమీ పురోగతికి సంకేతమైన ప్రత్యక్ష పన్ను వసూళ్లు భారీగా పురోగమిస్తుండడం శుభ సూచికమని నిపుణులు పేర్కొంటున్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ప్రతినెలా దాదా పు రూ.1.45 లక్షల కోట్లుగా నమోదవుతున్నాయి. -
ఐటీఆర్‌ల ప్రాసెసింగ్ వేగవంతం చేయండి
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రిఫండ్ల (ఐటీఆర్) ప్రాసెసింగ్‌ను, రిఫండ్ల జారీని వేగవంతం చేయడంపై మరింతగా దృష్టి పెట్టాలని ఐటీ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. అలాగే ఫిర్యాదులను కూడా సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొ న్నారు. సీబీడీటీ అధికారులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆమె సంక్లిష్టమైన, ప్రత్యేకమైన కేసులేవైనా ఉంటే న్యాయస్థానానికి పంపే వి« దానాన్ని కూడా పరిశీలించాలని సూచించారు. అవసరమైతే సీబీడీటీ (కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బో ర్డు) ఏడాదిలో ఒక వారం రోజుల పాటు కేసుల పరిష్కరణకు కేటాయించవచ్చని మంత్రి పేర్కొన్నారు. ప్రత్యక్ష పన్ను వసూళ్లు 23 శాతం అప్ : ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకూ నికర 23 శాతం పెరిగి 7.04 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) డైరెక్టర్ నితిన్ గుప్తా ఈ వివరాలను ఐటీ అధికారుల అవార్డు ప్రదాన కార్యక్రమంలో తెలియజేశారు. 2021–22లో ఆదాయపు, కార్పొరేట్ పన్ను వసూళ్లు భారీగా రూ.14.09 లక్షల కోట్లుగా నమోదయినట్లు పేర్కొన్నారు. ఆదాయపు పన్ను ఈ–ఫైలింగ్ పోర్టల్‌లో లోపాలు దాదాపు తొలగిపోయినట్లు తెలిపారు. జూలై 31వ తేదీ నాటికి 5.83 కోట్ల పన్ను రిటర్న్స్ ఈ పోర్టల్ ద్వారా దాఖలయినట్లు పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో ఒక్కరోజులో 72 లక్షల రిటర్న్స్ దాఖలయినట్లు కూడా వెల్లడించారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వేతన జీవుల ఐటీఆర్ దాఖలు తుదిగడువు జూలై 31వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. కాగా, ఐటీ రిఫండ్స్ ఇప్పటి వరకూ రూ.1.41 లక్షల కోట్లు జరిగినట్లు వెల్లడించిన గుప్తా, గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఈ విలువ 83 శాతం పెరిగినట్లు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని రూ.14.20 లక్షల కోట్లుగా కేంద్ర బడ్జెట్ నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో కార్పొరేట్ పన్ను వసూళ్ల అంచనా రూ.7.20 లక్షలుకాగా, వ్యక్తిగత పన్ను వసూళ్ల అంచనా రూ.7 లక్షల కోట్లు. -
డబుల్‌పేమెంట్ జరిగిందా? స్టాక్మార్కెట్లో నష్టాలా? రిఫండ్ ఎలా?
ప్ర. నా పాన్ అకౌంటు, బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేశాను. డిపార్ట్మెంట్ వారు ‘‘రిఫండ్ ఫెయిల్’’ అని మెసేజీలు పంపుతున్నారు. బ్యాంకు వారిని సంప్రదిస్తే, ‘‘ఈ సమస్య మాది కాదు.. ఆదాయ పన్ను శాఖదే’’ అంటున్నారు. ఏం చేయాలి? – రాజు లక్ష్మి, ఈమెయిల్ ద్వారా జ. ఇటువంటి సమస్యలు చాలా వస్తున్నాయి. నిజంగా రెండూ అనుసంధానం అయిన పక్షంలో ‘‘రిఫండ్ ఫెయిల్’’ అయిందంటున్నారు కాబట్టి రెండు వైపులా చెక్ చేయండి. బ్యాంకులో మళ్లీ సంబంధించిన కాగితాలివ్వండి. ఆ తతంగం ముగిసిన తర్వాత డిపార్ట్మెంట్ సైట్లోకి వెళ్లి మీ రిఫండ్ క్లెయిమ్ బ్యాంకు వివరాలను అప్డేట్ చేసి, రీవేలిడేట్ చేయండి. సాంకేతిక సమస్యల వల్ల రికార్డులను అప్డేట్ చేయడంలో జాప్యం జరుగుతోంది. రీవేలిడేట్ చేసిన తర్వాత రిఫండు వస్తుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రాసెసింగ్‌లో ఉండి ఉంటే ఫర్వాలేదు. లేదంటే పోర్టల్‌లో ఒక కంప్లెయింట్ ఇవ్వండి. గ్రీవెన్సును నమోదు చేయవచ్చు. ( జ. సీపీసీ నుండి 143 (1) సమాచారం వచ్చింది. ‘‘సమాచారం మెయిల్‌కి పంపుతున్నాము. డిమాండ్ ఉంది .. చెల్లించాలి’’ అని ఉంది. ఏం చేయాలి. – కర్ణ, ఈ–మెయిల్ ద్వారా జ. గత వారాల్లో 143 (1) సమాచారం గురించి సవివరంగా తెలియజేశాం. 143 (1) సెక్షన్ సమాచారం కోసం, మెయిల్ కోసం వేచి ఉండండి. ఆ ఆర్డరులో ఏయే కారణాల వల్ల డిమాండ్ ఏర్పడిందో విశ్లేషించండి. అది కరెక్టు అయితే చెల్లించండి. కాకపోతే విభేదిస్తూ జవాబు ఇవ్వవచ్చు. సరిదిద్దవచ్చు. తగినకాలంలో సమాధానం ఇవ్వడం మర్చిపోవద్దు. ప్ర. నేను ఉద్యోగిని. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నా. నష్టం వచ్చింది. జీతం రూ. 5,00,000 దాటింది. రిటర్ను వేయాలా? ట్యాక్స్ ఎంత చెల్లించాలి? – మహ్మద్ షకీర్, ఈ–మెయిల్ ద్వారా జ. ఒక వ్యక్తికి ఒక పాన్ ఉండాలి. అలాంటి వ్యక్తి ఎన్ని సోర్స్‌ల ద్వారా ఆదాయం వచ్చినా ఒకే రిటర్నులో చూపించి ఒకేసారి వేయాలి. మీరు మీ జీతం వివరాలు, స్టాక్ మార్కెట్ వ్యవహారాలతో కలిపి ఒక రిటర్ను వేయాలి. స్టాక్ మార్కెట్లో 31-03-2023 నాటికి ఏర్పడ్డ లాభనష్టాలను తేల్చి, తెలుసుకుని వేయాలి. మీ బ్రోకింగ్ సంస్థ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. అన్ని వివరాలుంటే తప్ప పన్ను భారం నిర్ధారించలేము. ప్ర. ప్రభుత్వం డిడక్ట్ చేసిన టీడీఎస్ ఫారం 26ఏఎస్‌లో నమోదు కాలేదు. ఆ మేరకు డైరెక్టుగా చెల్లించి, రిటర్న్ దాఖలు చేశాను. ఈ నెలలో టీడీఎస్ పద్దులు నమోదయ్యాయి. – సుధా భరత్, ఈ-మెయిల్ ద్వారా జ. ఫారం 26ఏఎస్‌లో చెల్లింపుల గురించి మనం గత వారమే తెలుసుకున్నాం. ఎంట్రీలు ఆలస్యంగా పడటం, పడకపోవడం, తప్పులు పడటం వంటి ఉదాహరణలు ఎన్నో ఉంటున్నాయి. మీ కేసులో డబుల్ పేమెంటు జరిగినట్లు. మీరు చేసిన చెల్లింపు, టీడీఎస్ ఒకే ఆర్థిక సంవత్సరానికి సంబంధించినట్లయితే ఈ లోపల డిపార్టుమెంటు వారు అసెస్మెంటు చేసి రిఫండు ఇస్తారు. లేదా మీ అంతట మీరే స్వయంగా రివైజ్ చేసుకోవచ్చు. ఏదేనీ కారణం వల్ల ఎంట్రీలు తప్పుగా పడితే సరిదిద్దండి. సంవత్సరం మారితే డబుల్ పేమెంటు కాదు. ఒకే సంవత్సరానికి సంబంధించి, ఒకే ఆదాయం అయితే మీకు రిఫండు వస్తుంది. కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య -
శుభవార్త..వారికి రూ. 1.75 లక్షల కోట్ల రిఫండ్..!
ఎగుమతిదారులకు మార్చితో ముగిసిన క్రితం ఆర్థిక సంవత్సరంలో (2021–22) రూ.1.75 లక్షల కోట్ల డ్యూటీ డ్రాబ్యాక్, జీఎస్టీ రిఫండ్స్ జరిపినట్లు పరోక్ష పన్నులు, కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ (సీబీఐసీ) చైర్మన్ వివేక్ జోహ్రీ ‘సివిల్ సర్వీసెస్ డే’ కార్యక్రమంలో తెలిపారు. ఈ–కామర్స్ ద్వారా రత్నాలు, ఆభరణాల ఎగుమతులను సులభతరం చేయడానికి తమ శాఖ ఒక పథకంపై కసరత్తు చేస్తోందని ఆయన వెల్లడించారు. రిఫండ్స్ త్వరిత గతిన జరగడానికి, ఎగుమతిదారులకు వర్కింగ్ క్యాపిటల్ సౌలభ్యతకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 2021–22లో డ్యూటీ డ్రాబ్యాక్ పంపిణీ రూ.24,000 కోట్లుకాగా, జీఎస్టీ రిఫండ్స్ విలువ రూ.1.51 లక్షల కోట్లని వివరించారు. 2020–21తో పోత్చితే ఇది 33 శాతం అధికమని వివరించారు. రెవెన్యూ పురోగతికి తమ శాఖ తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటున్నట్లు తెలిపారు. డిజిటలైజేషన్ ప్రణాళికలను ఆయన ప్రస్తావిస్తూ, ‘‘ప్రత్యేక ఆర్థిక జోన్ల (ఎస్ఈజెడ్) యూనిట్లకు వర్తించే కస్టమ్స్ ప్రాసెస్ మొత్తం డిజిటలైజేషన్ చేసే విషయంపై కసరత్తు చేస్తున్నాము. ఇ–కామర్స్ ద్వారా రత్నాలు– ఆభరణాల ఎగుమతుల కోసం పథకాలను రూపొందించడంపై దృష్టి సారిస్తున్నాము. దేశీయంగా ఇప్పటికే ఈ విధానం అమలవుతోంది. ఈ–కామర్స్ ద్వారా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూర్చాలన్నది మా ప్రధాన ఉద్దేశం’’ అని అన్నారు. ఎగుమతులు–దిగుమతులు, ఇందుకు సంబంధించి చెల్లింపుల పరిష్కార ప్రక్రియలో ఈ–కామర్స్‌కు పెద్దపీట వేయడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ దిశలో ఆయా అంశాలను సరళీకరించి, హేతుబద్దీకరించడంపై కీలక చర్య తీసుకుంది. ఇందుకు వీలుగా ప్రస్తుత నిబంధనలను సవరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒక ముసాయిదా మార్గదర్శకాల పత్రాన్ని సెంట్రల్ బ్యాంక్ ప్రతిపాదించింది. ‘‘ఎగుమతి, దిగుమతులకు సంబంధించి చిన్న స్థాయి చెల్లింపుల పక్రియను ఈ కామర్స్ ద్వారా సులభతరం చేయడానికి తీసుకువస్తున్న ఆన్లైన్ ఎక్స్పోర్ట్–ఇంపోర్ట్ ఫెసిలిటేటర్స్’ అనే శీర్షికన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. బ్యాంకులు, ఇతర సంబంధిత వర్గాల నుంచి స్వీకరించిన అభిప్రాయాల ప్రాతిపదిక, సమగ్ర సమీక్ష అనంతరం తగిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది’’ అని ఇటీవల ఆర్బీఐ ప్రకటన సూచించింది. చదవండి: సిమెంటుకు పెరగనున్న డిమాండ్ -
ఇన్వెస్టర్ల రిఫండ్స్‌కు సెబీ రెడీ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పీఏసీఎల్ అక్రమ పథకాల అంశంలో ఇన్వెస్టర్లకు రిఫండ్స్‌ను అందించే చర్యలు ప్రారంభించింది. ఇందుకు జూన్ 30లోగా అసలు పత్రాలను(ఒరిజనల్ సర్టిఫికెట్లు) దాఖలు చేయవలసి ఉంటుందని ఇన్వెస్టర్లకు తెలియజేసింది. మాజీ చీఫ్ జస్టిస్ ఆర్ఎం లోధా అధ్యక్షతన సెబీ నియమించిన అత్యున్నత కమిటీ నుంచి ఎస్ఎంఎస్ అందుకున్న ఇన్వెస్టర్లకు మాత్రమే ఈ పథకమని సెబీ తెలియజేసింది. రూ. 10,001 మొదలు రూ. 15,000 వరకూ సొమ్మును ఆశిస్తున్న ఇన్వెస్టర్లకు మాత్రమే ఈ అవకాశమని స్పష్టం చేసింది. ఒరిజినల్ సర్టిఫికెట్లను ఈ ఏప్రిల్ 1 నుంచి జూన్ 30వరకూ అనుమతించనున్నట్లు వెల్లడించింది. పెరల్ గ్రూప్‌గా పేరున్న పీఏసీఎల్ కేసులో ఇన్వెస్టర్ల సొమ్మును వాపసు చేయమంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా సెబీ నిధుల వాపస్ చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే షురూ సెబీ ఏర్పాటు చేసిన కమిటీ పీఏసీఎల్ ఆస్తులను విక్రయించడం ద్వారా ఇప్పటికే రిఫండులకు శ్రీకారం చుట్టింది. ఇన్వెస్టర్ల వివరాలను ధ్రువపరచుకున్నాక దశలవారీగా సొమ్మును వాపసు చేయనుంది. వ్యవసాయం, రియల్టీ బిజినెస్‌ల పేరుతో పెరల్ గ్రూప్ ప్రజల నుంచి నిధులను సమీకరించిన సంగతి తెలిసిందే. చట్టవిరుద్ధ కలెక్టివ్ పెట్టుబడి పథకాల(సీఐఎస్) ద్వారా పీఏసీఎల్ రూ. 60,000 కోట్లు సమీకరించినట్లు సెబీ గుర్తించింది. సొమ్ము వాపసును ఆశిస్తున్న ఇన్వెస్టర్లు ముంబైలోని సెబీ ప్రధాన కార్యాలయానికి ఒరిజనల్ పత్రాలను పంపించవలసి ఉంటుంది. ఇన్వెస్టర్ల సొమ్ము రిఫండ్ చేయడంలో వైఫల్యంతో 2015 డిసెంబర్లో సెబీ పీఏసీఎల్ గ్రూప్‌సహా.. తొమ్మిదిమంది ప్రమోటర్లు, డైరెక్టర్ల ఆస్తుల అటాచ్‌మెంట్‌ను చేపట్టింది. -
టైముకు రాదు.. రీఫండ్ చేయరు... వీళ్లతో ఎలా వేగేది ?
ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్య, రైల్వే బుకింగ్‌లో వెయిటింగ్ సమస్య అదే ఎయిర్‌లైన్స్ అయితే ప్రయాణికులకు ఏ కష్టాలు ఉండవు అనుకుంటూ పొరపాటే. ఎర్రబస్సయినా ఎయిర్‌బస్ అయినా వాటిలో కామన్ పాయింట్ కస్టమర్లను ఇబ్బంది పడటం. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇదే నిజం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థ తాజాగా విడుదల చేసిన రిపోర్టు ఇదే విషయం చెబుతోంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థ 2022 ఫిబ్రవరికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఇందులో గతేడాదితో పాటు గత నెలతో పోల్చుతూ ప్రస్తుతం ఫిబ్రవరి నెలలో ఏవియేషన్ సెక్టార్ ఎలా చెబుతూ పలు గణాంకాలు ప్రచురించింది. ఇందులో కస్టమర్లు ఏ అంశాలపై ఎక్కువ ఫిర్యాదులు చేస్తున్నారు, విమానాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయంటూ పలు వివరాలను ప్రకటించింది. రీఫండ్ ఇబ్బందులు డీజీసీఏ ప్రకటించిన వివరాల్లో అందరినీ ఆశ్చర్యపరిచేలా విమాన ప్రయాణికులకు కూడా రీఫండ్ సమస్యను ఎదుర్కొంటున్నట్టు తెలిసింది. డీజీసీఏకి అందుతున్న ఫిర్యాదుల్లో నూటికి 31 శాతం కేవలం రీఫండ్ సమస్య మీదనే వస్తున్నాయి. వాస్తవానికి ఎయిర్ ట్రావెల్ కస్టమర్లకు వీఐపీ ట్రీట్మెంట్ లభిస్తుంది. ట్రావెల్ ఏజెంట్లు మొదలు టిక్కెట్ బుకింగ్ యాప్‌లు, విమాన సర్వీసు సంస్థలు బాగానే ట్రీట్ చేస్తాయి. కానీ ఏదైనా అనివార్య కారణాల వల్ల విమానం రద్దయినా లేదా టిక్కెట్ క్యాన్సిల్ చేసుకున్నా.. వాటికి తాలుకు నగదు ప్రయాణికులకు తిరిగి చెల్లించడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. మంచి విమానం కావాలి రీఫండ్ కంటే ఎక్కువగా విమాన ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్న అంశం విమానం గురించి. ఫ్లైట్ చార్జీలు, స్టాఫ్ బిహేవియర్, లగేజ్ లాంటి కీలక అంశాలన్నీ పట్టించుకునే స్థితిలో విమాన ప్రయాణికులు ఉండటం లేదు. ఎందుకంటే వాళ్ల ప్రధాన ఫిర్యాదులే విమానం మీద ఉంటున్నాయి. ఆలస్యంగా ప్రయాణించడం మొదలు సీట్లు కంఫర్ట్‌గా లేకపోవడం వరకు 34 శాతం ఫిర్యాదులు విమానాల మీదే ఉంటున్నాయి. ఇవే ప్రధానం రోజురోజుకి విమానయాన రంగం దేశంలో పుంజుకుంటోంది. ద్వితీయ శ్రేణి నగరాలకు ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు ఉదాన్లాంటి పథకాలను కేంద్రం అమలు చేస్తోంది. ఈ తరుణంలో విమాన ప్రయాణికుల్లో దాదాపు 60 శాతానికిపైగా కేవలం విమానాలు(34 శాతం), రీఫండ్(31 శాతం) ఫిర్యాదులు అందుతుండటం శుభపరిణాం కాదని నిపుణులు అంటున్నారు. సర్వీసుల నిర్వాహాణ, నగదు చెల్లింపుల విషయంలో మరింత జాగ్రత్తగా సర్వీస్ ప్రొవైడర్లు వ్యవహరించేలా డీజీసీఏ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆలస్యం ఎందుకంటే? ఆలస్యం వల్ల అనేక సార్లు ప్రయాణాలు రద్దవుతుంటాయి. ముఖ్యంగా కనెక్టింగ్ ఫ్లైట్ జర్నీ చేసే వాళ్లకు ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. మన దగ్గర విమానాలు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం రియాక్షనరీ 58 శాతం ఉంది. అంటే ఎవరైనా ప్రయాణికులు ఆలస్యం రావడం, కనెక్టింగ్ ఫ్లైట్ రాకపోవడం ఇలా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండే కారణాల వల్ల విమానాలు ఆలస్యం అవుతున్నాయి. మన దగ్గర ఏవియేషన్ సెక్టార్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఇదే తరహా పనితీరు ఉంటే నూట నలభై కోట్ల జనాభాలో కనీసం 20 శాతం మంది విమాన ప్రయాణాలు రెగ్యులర్ చేసినా తట్టుకోవడం కష్టంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. -
ఐటీ రిఫండ్.. రూ.1.83 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2022 ఫిబ్రవరి 21 నాటికి 2.07 కోట్ల పన్ను చెల్లింపుదారులకు రూ.1.83 లక్షల కోట్ల రిఫండ్లు చెల్లించినట్టు వెల్లడించింది. వ్యక్తిగత ఆదాయపన్ను రిఫండ్లు రూ.65,498 కోట్లు, కార్పొరేట్ పన్ను రిఫండ్లు రూ.1.17 లక్షల కోట్ల చొప్పున ఉన్నట్టు తెలిపింది. ఇందులో 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1.67 కోట్ల పన్ను చెల్లింపుదారులకు చేసిన రూ.33,819 కోట్ల రిఫండ్లు కూడా ఉన్నట్టు ప్రకటించింది. -
పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్.. రూ.1.44 లక్షల కోట్లు రీఫండ్..!
పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖ తీపికబురు అందించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 1.38 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ఖాతాల్లో రూ.1.44 లక్షల కోట్లకు పైగా ఆదాయపు పన్ను జమ చేసినట్లు ఐటీ విభాగం తెలిపింది. సీబీడీటీ తెలిపిన వివరాల ప్రకారం.. 1, ఏప్రిల్, 2021 నుండి 20 డిసెంబర్ మధ్య కాలంలో ఆదాయపు పన్ను శాఖ 1.38 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులకు రూ.1,44,328 కోట్లను రీఫండ్ చేసినట్లు తెలిపింది. ఇది కాకుండా రూ. 2.11 లక్షలకు కార్పొరేట్ కేసులలో రూ.95,133 కోట్లను రీఫండ్ చేసినట్లు తెలిపింది. 1,35,35,261 సంస్థలకు రూ.49,194 కోట్ల ఆదాయపు పన్ను రీఫండ్లు జారీ చేసినట్లు పేర్కొంది. CBDT issues refunds of over Rs. 1,44,328 crore to more than 1.38 crore taxpayers from 1st Apr,2021 to 20th December,2021. Income tax refunds of Rs. 49,194crore have been issued in 1,35,35,261 cases &corporate tax refunds of Rs. 95,133crore have been issued in 2,11,932cases(1/2) — Income Tax India (@IncomeTaxIndia) December 22, 2021 (చదవండి: "మెర్రీ క్రిస్మస్" మెసేజ్ ఖరీదు ఇన్ని లక్షలా.. స్పెషల్ ఏంటి?) -
రెట్రో ట్యాక్స్‌పై కెయిర్న్ ఆఫర్‌కు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: రెట్రో ట్యాక్స్ వివాదాలను సత్వరం పరిష్కరించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కెయిర్న్ ఎనర్జీ సమర్పించిన ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం అంతర్జాతీయ కోర్టుల్లో భారత్‌పై వేసిన కేసులన్నింటినీ కెయిర్న్ ఉపసంహరించుకోవడం ప్రారంభిస్తుంది. ఇది పూర్తయ్యాక, కంపెనీకి ప్రభుత్వం దాదాపు రూ. 7,900 కోట్ల పన్నులను రీఫండ్ చేయనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కేసుల ఉపసంహరణకు మూడు–నాలుగు వారాలు పట్టొచ్చని వివరించాయి. గత లావాదేవీలకు కూడా పన్నులు విధించేందుకు వెసులుబాటు నిచ్చే చట్ట సవరణ (రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్) ద్వారా ట్యాక్స్‌లు వసూలు చేయడంపై కెయిర్న్ సహా పలు కంపెనీలు, కేంద్రం మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదం కావడంతో ఈ చట్టాన్ని పక్కన పెట్టి, ఆయా కంపెనీల నుంచి వసూలు చేసిన పన్నులను తిరిగి ఇవ్వడం ద్వారా వివాదాలకు ఫుల్స్టాప్ పెట్టాలని కేంద్రం భావించింది. అయితే, ఇందుకోసం భారత్‌పై అంతర్జాతీయ కోర్టుల్లో పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని సంస్థలకు షరతు విధించింది. దానికి అనుగుణంగానే కెయిర్న్ తాజా ఆఫర్ ఇచ్చింది. -
టెక్స్ టైల్ ఎగుమతిదారులకు ఊరట
న్యూఢిల్లీ: జౌళి ఎగుమతిదారులకు భరోసా కల్పిస్తూ కేంద్రం కీలక చర్య తీసుకుంది. ఆర్ఓఎస్సీటీఎల్ (రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లెవీస్) స్కీమ్‌ను పొడిగిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. జూలై 14న కేంద్ర క్యాబినెట్ ఈ పథకం పొడిగింపునకు ఆమోదముద్ర వేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం, దుస్తుల ఎగుమతిదారులు 2024 మార్చి వరకూ తమ ఎగుమతులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర పన్నులపై రాయితీలను పొందగలుగుతారు. ఈ స్కీమ్ కింద వస్త్రాలపై గరిష్టంగా 6.05 శాతం వరకూ రాయితీ అందుతుంది. రెడీమేడ్స్‌పై ఈ రేటు 8.2 శాతం వరకూ ఉంది. అంతర్జాతీయ పోటీకి దీటుగా... అంతర్జాతీయంగా ఈ రంగంలో పోటీని ఎదుర్కొనడానికి ఎగుమతిదారులకు తాజా నిర్ణయం దోహదపడుతుందని వస్త్ర ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) చైర్మన్ ఏ శక్తివేల్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బంగ్లాదేశ్, వియత్నాం, మయన్మార్, కాంబోడియా, శ్రీలంక వంటి దేశాల నుంచి పోటీని ఎగుమతిదారులు తట్టుకోగలుగుతారని పేర్కొన్నారు. స్థిరమైన పన్ను రేట్ల వల్ల ఈ రంగంలోకి భారీ పెట్టుబడులు వస్తాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరపాలన్న లక్ష్యంలో వేసిన తొలి అడుగుగా దీనిని అభివర్ణించారు. ఎగుమతుల పురోగాభివృద్ధికే కాకుండా ఈ రంగంలో స్టార్టప్స్ ఏర్పాటుకు, ఉపాధి అవకాశాల మెరుగుదలకు కూడా ఈ చర్య పరోక్షంగా దోహపడుతుందని అభిప్రాయపడ్డారు -
ఐటీ రిఫండ్స్ రూ.43,991 కోట్లు
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) రిఫండ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) జూలై 26 వరకూ రూ.43,991 కోట్లని ఆ శాఖ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో వ్యక్తిగత ఆదాయపు పన్ను రిఫండ్స్ రూ.13,341 కోట్లని , కార్పొరేట్ పన్ను రిఫండ్స్ రూ.30,650 కోట్లని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి జూలై 26 మధ్య 21.03 లక్షల మందికి ఈ రిఫండ్స్ జరిగినట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) ఒక ప్రకటనలో పేర్కొంది. వీరిలో వ్యక్తిగత ఆదాయపు పన్ను విభాగంలో 19,89,912 మంది ఉండగా, కార్పొరేట్ కేసులు 1,12,567 ఉన్నాయని తెలిపింది. -
ఏజెంట్లు, ప్రయాణీకులకు రిఫండ్స్ ఎలానో చెప్పండి
న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో విమాన ప్రయాణాలకు సంబంధించి ముందుగా బుక్ చేసుకున్న టిక్కెట్ల రద్దు విషయంలో ఏజెంట్లు, ప్రయాణీకులకు రిఫండ్స్ ఎలా జరుపుతారన్న అంశంపై మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉందని అత్యున్నత న్యాయస్థానం బుధవారం కేంద్రానికి స్పష్టం చేసింది. రిఫండ్స్ విధివిధానాలు, ప్రక్రియపై వివరణ ఇస్తూ, ఈ నెల 25వ తేదీలోపు తాజా అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయమూర్తులు అశోక్ భూషన్, ఆర్ సుభాషన్ రెడ్డి, ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేంద్రానికి స్పష్టం చేసింది. ఇప్పటికే దాఖలు చేసిన అఫిడవిట్లో పూర్తి స్పష్టత లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్వయంగా పేర్కొనడం దీనికి నేపథ్యం. అటు పాసింజర్లు, ఇటు విమానయాన సంస్థల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రిఫండ్స్ విషయంలో కేంద్రం తగిన పరిష్కార విధానాన్ని రూపొందించిందని అంతకుముందు విమానయాన, డీజీసీఏల తరఫున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. -
బ్యాంకులకు ఐటీఆర్ దాఖలు వివరాలు
న్యూఢిల్లీ : ఆదాయపన్ను శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) ఆధారంగా సంస్థల రిటర్నుల దాఖలు వివరాలను షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు తెలుసుకునే ఏర్పాటును (ఐటీఆర్ ఫైలింగ్ కాంప్లియన్స్) ఆదాయపన్ను శాఖ ప్రారంభించింది. భారీ మొత్తాల్లో నగదును ఖాతాల నుంచి తీసుకుంటున్న వారు ఇప్పటి వరకు రిటర్నులు దాఖలు చేయలేదని డేటా ఆధారంగా తెలుస్తోందని ఆదాయపన్ను శాఖ తెలిపింది. ఇటువంటి వ్యక్తులు రిటర్నులు దాఖలు చేసేలా చూసేందుకు, నల్లధనాన్ని నియంత్రించేందుకు కేంద్రం చట్టంలో పలు సవరణలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. నగదు ఉపసంహరణలు రూ.20 లక్షలు, అంతకుమించి చేస్తే టీడీఎస్ అమలు ఇందులో భాగమే. (స్కూల్‌నెట్ ఇండియా విక్రయానికి ఓకే..) ఐటీ రిఫండ్స్... రూ.98,625 కోట్లు ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ గడచిన ఐదు నెలల్లో (2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్1వ తేదీ వరకూ) 26.2 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు రూ.98,625 కోట్ల రిఫండ్స్ ఇచ్చింది. బుధవారం వెలువరించిన సవరిత గణాంకాల ప్రకారం– 24,50,041 లక్షల మంది వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు జరిపిన రిఫండ్స్ విలువ రూ.29,997 కోట్లు. కార్పొరేట్ల విషయంలో 1,68,421 లక్షల మందికిపైగా పన్ను చెల్లింపుదారులకు జరిపిన రిఫండ్స్ విలువ రూ.68,628 కోట్లు. కోవిడ్–19 మహమ్మారి సవాళ్లు విసురుతున్న ప్రస్తుత సమయంలో ఎటువంటి జాప్యం లేకుండా పన్ను చెల్లింపుదారులకు సంబంధిత సేవలు సకాలంలో అందాలని ఆదాయపు పన్ను శాఖను కేంద్రం నిర్దేశించింది. పన్ను రిఫండ్స్ ఎప్పటికప్పుడు జరగాలని స్పష్టం చేసింది. (ఫార్చూన్ ‘40’లో అంబానీ వారసులు) -
ఆ విమాన టికెట్ల రద్దుకు పూర్తి రీఫండ్
న్యూఢిల్లీ: లాక్డౌన్ మొదటి దశ కాలంలో విమాన టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు పూర్తి రీఫండ్ లభిస్తుందని పౌర విమానయాన శాఖ స్పష్టంచేసింది. కోవిడ్–19 వైరస్ కట్టడిలో భాగంగా ఈ ఏడాది మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు తొలి విడత లాక్డౌన్ కొనసాగగా, ఈ కాలంలో బుకింగ్స్ చేసుకున్న విమాన ప్రయాణికులకు రద్దు రుసుము ఏమీ లేకుండా పూర్తి మొత్తం నగదు రూపంలో వెనక్కు వస్తుందని తెలిపింది. మే 3 వరకు ప్రయాణాలకు టికెట్ కొన్న వారికి ఇది వర్తిస్తుందని వివరించింది. పేర్కొన్న కాలంలో నగదుకు బదులుగా భవిష్యత్తు ప్రయాణానికి ఉపయోగపడే క్రెడిట్ అందనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ అంశంపై విమానయాన శాఖ గురువారం స్పష్టతనిచ్చింది. -
కోవిడ్-19 : పన్ను చెల్లింపుదారులకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో వ్యక్తులు, సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో ఆయా వ్యాపార సంస్థలు, వ్యక్తులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పన్ను రిఫండ్లను తక్షణమే చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ 5 లక్షల వరకూ పెండింగ్‌లో ఉన్న అన్ని ఐటీ రిఫండ్స్‌ను తక్షణమే చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో 14 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఇక జీఎస్టీ, కస్టమ్ రిఫండ్స్‌నూ తక్షణం చెల్లించాలని నిర్ణయించడంతో చిన్నమధ్యతరహా సంస్ధలు సహా దాదాపు లక్ష వాణిజ్య సంస్థలు లబ్ధి పొందనున్నాయి.రూ 18,000 కోట్ల పన్ను రిఫండ్లను ప్రభుత్వం పరిష్కరించనుంది. చదవండి : లాక్డౌన్ టైమ్ : చిన్నారులనూ వేధిస్తున్నారు -
యూజర్ల ’అన్క్లెయిమ్డ్’ మొత్తం విద్యానిధికే
న్యూఢిల్లీ: వివిధ కారణాలతో యూజర్లు క్లెయిమ్ చేసుకోని డబ్బును నిర్దిష్ట కాలావధి తర్వాత ’టెలికం వినియోగదారుల విద్యా, రక్షణ నిధి’కి బదలాయించాలంటూ టెల్కోలను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశించింది. సాధారణంగా .. అధికంగా వసూలు చేసిన చార్జీలను, సెక్యూరిటీ డిపాజిట్లు మొదలైనవి యూజర్లకు టెల్కోలు రిఫండ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఏ కారణం వల్లనైనా రిఫండ్ చేయలేకపోయిన పక్షంలో ఆ మొత్తాన్ని టెలికం నిధికి జమ చేయాలి. కానీ, ఆపరేటర్లు డిపాజిట్ చేసే నగదు విషయంలో వ్యత్యాసాలు ఉంటున్నాయని ట్రాయ్ పరిశీలనలో తేలింది. దీనిపై టెల్కోలతో భేటీ అయింది. ఆడిటింగ్‌లో అధిక బిల్లింగ్ విషయం వెల్లడైనప్పుడు మాత్రమే కొన్ని టెల్కోలు ఆ మొత్తాన్ని డిపాజిట్ చేస్తున్నట్లు తేలింది. అలాగే మరికొన్ని సంస్థలు లావాదేవీ ఫెయిలైన సందర్భాల్లో సెక్యూరిటీ డిపాజిట్లు, ప్లాన్ చార్జీల వంటివి రీఫండ్ చేసేందుకు వినియోగదారుల వివరాలు సరిగ్గా దొరక్కపోయినప్పుడు, ఆ మొత్తాలను విద్యా నిధిలో జమ చేస్తున్నాయి. దీంతో ఈ అంశంపై స్పష్టతనిచ్చేందుకు ట్రాయ్ తాజాగా సంబంధిత నిబంధనలను సవరించింది. అన్క్లెయిమ్డ్ మొత్తం.. ఏ కేటగిరీకి చెందినదైనా, పన్నెండు నెలల వ్యవధి లేదా చట్టబద్ధంగా నిర్దేశించిన గడువు పూర్తయిపోయిన పక్షంలో విద్యా నిధికి జమ చేయాలంటూ స్పష్టతనిచ్చింది. -
ఆ నిధులపై హక్కులు మాకే...
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు (ఆర్‌కామ్) ఐటీ రిఫండ్ రూపంలో వచ్చిన రూ. 260 కోట్ల నిధులపై పూర్తి హక్కులు తమకే ఉంటాయని బ్యాంకులు స్పష్టంచేశాయి. ఇదే విషయాన్ని నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్‌కు (ఎన్సీఎల్ఏటీ) చెప్పాయి. తమకు చెందాల్సిన నిధులతో ఎరిక్సన్కి ఇవ్వాల్సిన బాకీలను ఆర్‌కామ్ తీరుస్తానంటే కుదరదని తెగేసి చెప్పాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎరిక్సన్కు చెల్లించడం కోసం రిటెన్షన్, ట్రస్ట్ ఖాతాలో ఉన్న ఐటీ రిఫండ్ నిధులను ఉపయోగించుకునేలా అనుమతించాలంటూ ఆర్‌కామ్ వేసిన పిటీషన్‌పై మంగళవారం విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా బ్యాంకుల తరఫున సీనియర్ అడ్వకేట్ నీరజ్ కిషన్ కౌల్ వాదించారు. ఆర్‌కామ్ దివాలా ప్రక్రియ ప్రారంభానికి ముందే రిటెన్షన్, ట్రస్ట్ ఖాతా ఏర్పాటైందని, దానికి, ప్రస్తుత కేసుకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. ఎరిక్సన్ బాకీల భారాన్ని ఆర్‌కామ్ బ్యాంకులపై రుద్దడం కుదరదని తెలిపారు. ఈ కేసు విచారణను బుధవారానికి వాయిదాపడింది. -
తత్కాల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: తత్కాల్ ప్రయాణికులకు రైల్వేశాఖ గురువారం శుభవార్త తెలిపింది. తత్కాల్ కింద బుక్‌చేసుకున్న టికెట్లపై 100 శాతం రీఫండ్‌ను అందించనున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. ఈ–టికెట్లతో పాటు కౌంటర్లో తీసుకున్న టికెట్లకు కూడా రీఫండ్ వర్తిస్తుందని పేర్కొంది. కింద పేర్కొన్న ఐదు సందర్భాల్లో టికెట్ ధర మొత్తాన్ని ప్రయాణికులకు తిరిగి చెల్లిస్తామంది. 1) ఒకవేళ రైలు రాక మూడు గంటలు అంతకన్నా ఎక్కువ ఆలస్యమైనప్పుడు. 2) రైలును దారి మళ్లించినప్పుడు. 3) రైలును దారి మళ్లించిన తర్వాత ప్రయాణికులు ట్రైన్ ఎక్కాల్సిన స్టేషన్ లేదా దిగాల్సిన స్టేషన్ లేదా రెండూ కొత్త మార్గంలో లేకపోతే. 4) ప్రయాణికులు ఎక్కాల్సిన కోచ్‌ను రైలుకు అనుసంధానించకపోతే, అధికారులు ప్రయాణికులకు ప్రత్యామ్నాయం కల్పించనప్పుడు. 5) రైలులో రిజర్వేషన్ చేసుకున్నదానికి బదులుగా లోయర్ క్లాస్‌లో ప్రయాణించేందుకు ప్రజలు ఇష్టపడకపోతే (ఒకవేళ ప్రయాణికులు ఇందుకు అంగీకరిస్తే రెండు టికెట్లకు మధ్య ఉన్న తేడాను రైల్వేశాఖ ఆ ప్రయాణికుడికి చెల్లిస్తుంది). -
మూవీ టిక్కెట్లపై పేటీఎం బంపర్ ఆఫర్
వీకెండ్లలో చాలామంది స్నేహితులతో సినిమాకు వెళ్దామని ప్లాన్స్ వేసుకుంటుంటారు. ఒక్కోసారి ఈ ప్లాన్స్ ఫ్లాప్ అవుతుంటాయి. కొంతమంది పొరపాటున వేరే సినిమాకు టిక్కెట్ బుక్ చేసుకోబోయే, మరో సినిమాకు బుక్ చేసుకుంటుంటారు. ఇలాంటి సందర్భాల్లో టిక్కెట్ క్యాన్సిలేషన్ చేసుకుందామంటే, ఆ డబ్బులు దండగ. ఇక అవి వెనక్కి రావు. ఏం చేయలేక పాలపోలేక చాలామంది తెగ తికమకపడిపోతుంటారు. ఈ చిక్కులను పరిష్కరించడానికి పేటీఎం తన ప్లాట్‌ఫామ్ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మూవీ టిక్కెట్లను బుక్ చేసుకుని, క్యాన్సిల్ చేసుకుంటే, పూర్తి మొత్తాన్ని రీఫండ్ చేయనున్నట్టు తెలిపింది. అయితే దీనికోసం స్వల్పంగా తొమ్మిది రూపాయల ఛార్జీ చెల్లించాలి అంతే. అది కూడా టిక్కెట్ బుక్ చేసుకునేటప్పుడే కట్టాలి. దీనికోసం పేటీఎం క్యాన్సిలేషన్ ప్రొటెక్ట్ అనే కొత్త ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్‌తో షో ప్రారంభం కావడానికి మూడు గంటల ముందు టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకోవచ్చు. పేటీఎం ప్రస్తుతం తీసుకొచ్చిన క్యాన్సిలేషన్ ప్రొటెక్ట్ దాని ప్రత్యేకమైన ఫీచరేమీ కాదు. బుక్‌మైషో ఇప్పటికే రిజర్వు టిక్కెట్ ఫీచర్‌తో ఇలాంటి సౌకర్యాన్నే అందిస్తోంది. రిజర్వు టిక్కెట్ ఫీచర్‌తో ఎలాంటి చెల్లింపులు లేకుండా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. దీని వల్ల నగదును కోల్పోయే అవసరం లేకుండానే షో ప్రారంభానికి గంట ముందు టిక్కెట్‌ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. బుక్‌మైషో దీన్ని పరిమితి సినిమాలకు మాత్రమే ఆఫర్ చేస్తోంది. అయితే తాజాగా పేటీఎం తీసుకొచ్చిన ఈ ఫీచర్ కూడా యూజర్లందరికీ అందుబాటులో లేదంట. సైట్లో టిక్కెట్ల కోసం వెతికే కస్టమర్లకు మాత్రమే దీన్ని అందుబాటులోకి తెచ్చిందని తెలిసింది. క్యాన్సిలేషన్ అవసరం పడుతుంది అనుకునేవారు టిక్కెట్ కొనుగోలుతో పాటు ఒక్కో టిక్కెట్‌పై తొమ్మిది రూపాయలు చెల్లించాలి. మూడు గంటల ముందు టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి వస్తే, పేటీఎం క్యాష్‌బ్యాక్ రూపంలో మొత్తం నగదు రీఫండ్ చేస్తోంది. ఒక్కో స్క్రీనింగ్‌కు పరిమితి సంఖ్యలో సీట్లకు మాత్రమే ఈ ఫీచర్‌ను అందుబాటులో ఉంచుతోంది. ఇది కూడా పరిమిత సినిమాలకు మాత్రమే. -
గదుల ముందస్తు బుకింగ్ రద్దు చేస్తే రిఫండ్
-
గదుల ముందస్తు బుకింగ్ రద్దు చేస్తే రిఫండ్
- టీటీడీ ఈవో సింఘాల్ వెల్లడి - కంపార్ట్మెంట్లలో ఉచిత ఫోన్, హెల్ప్‌డెస్క్ సౌకర్యం సాక్షి, తిరుమల: ఆన్లైన్లో ముందస్తుగా బుక్ చేసుకున్న గదులు తిరిగి రద్దు చేసుకుంటే ఆ సొమ్మును రిఫండ్ చేస్తామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. గది పొందిన తర్వాత కూడా నిర్ణీత సమయాని కంటే ముందుగా ఖాళీ చేసినా కొంత నగదు తిరిగి చెల్లిస్తామని శుక్రవారం ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాకు వెల్లడించారు. సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ తర్వాత జూలై నుంచి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు తమ బంధువులతో మాట్లాడేందుకు వీలుగా ఉచితంగా ఫోన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి, ప్రతి కంపార్ట్‌మెంట్‌లోనూ జూన్ నెలాఖరులోగా ఫోన్లు అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. లక్కీడిప్ పద్ధతిలో ఆర్జిత సేవాటికెట్లు సెప్టెంబర్‌కు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈనెల 16 ఉదయం 11 గంటల నుంచి లక్కీడిప్ పద్ధతిలో కేటాయిస్తామని ఈవో తెలిపారు. ఈ కొత్త విధానంలో మొదటి మూడు రోజులపాటు భక్తులు కోరుకున్న సేవా టికెట్ల కోసం నమోదు చేసుకుంటారని, ఆ తర్వాత కంప్యూటర్ ర్యాండమ్ విధానంలో లక్కీడిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తామన్నారు. యాగఫలంతో విస్తారంగా వర్షాలు.. తిరుమలలో ఐదు రోజుల పాటు నిర్వహించిన కారీరిష్టియాగం, వరుణజపం ఫలితంగా వర్షాలు విస్తారంగా కురిసి దేశం, రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని టీటీడీ ఈవో సింఘాల్ ఆకాంక్షించారు. శుక్రవారం పారువేట మండపం, వరాహస్వామి ఆలయాల్లో పూర్ణాహుతి కార్యక్రమంతో వరుణయాగం ముగిసింది. వరుణదేవుని అనుగ్రహం కోసం ఈ యాగం నిర్వహించామని, తద్వారా దేశంలో సాగునీరు, తాగునీటి ఇబ్బందులు తొలగి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉంటారన్నారు. జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ.. కంచి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి ఆశీస్సులతో సుమారు 30 మంది రుత్వికులు ఈ యాగం నిర్వహించారన్నారు. -
మోసపోతే ‘రిఫండ్’ రాదు!!
ట్యాక్స్ రిఫండ్ల పేరిట ఆన్లైన్ మోసాలు - ఫోన్లు చేసి కూడా వివరాల తస్కరణ సాక్షి, బిజినెస్ విభాగం : సుధీర్‌కు ఓ మెయిలొచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్ నుంచి పంపిస్తున్నట్లుగా దాన్లో ఉంది. ‘’సీబీడీటీ మొదటి త్రైమాసిక పన్ను రిఫండ్లను ప్రాసెస్ చేయటం పూర్తయింది. మీరు రూ.22,046.23 రూపాయల పన్ను అధికంగా చెల్లించారు. దాన్ని రిఫండ్‌కు సంబంధించిన ప్రాసెస్ కూడా పూర్తయిపోయింది. మీ రిఫండ్ క్లెయిమ్ చేయాలంటే ఈ కింది లింకును క్లిక్ చేయండి’’ అనేది దాని సారాంశం. సుధీర్ అప్పటికే గత ఏడాది రిటర్ను ఫైల్ చేసి... నిజంగానే ఐటీ రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నాడు. దీంతో నిజమేననుకుని లింకు క్లిక్ చేశాడు. వెంటనే మరో పేజీ ఓపెనయింది. ఇన్‌కమ్‌ట్యాక్స్ ఇండియా పేరిట ఓపెననైన ఆ పేజీలో... మీ బ్యాంకును సెలక్ట్ చేయండి... అనే పేజీ ఉంది. తనది ఎస్బీఐ కనక ఆప్షన్ ఎంచుకుని క్లిక్ చేశాడు. వెంటనే ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంక్ హోమ్‌పేజీ ఓపెనైపోయింది. దాన్లో తన ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవుదామనుకుంటూనే... ఒక్క క్షణం ఆలోచించాడు. ‘‘రిఫండ్ రావాలంటే నేను నా ఇంటర్నెట్ బ్యాంకులో ఎందుకు లాగిన్ అవ్వాలి?’’ అని. ఆ ఆలోచనే సుధీర్‌ను కాపాడింది. అందులో గనక లాగిన్ అయి ఉంటే... సుధీర్ వివరాలన్నీ మోసగాళ్లకు చేరి... తన అకౌంట్ ఒక్క నిమిషంలో ఖాళీ అయిపోయేది. ఎందుకంటే ఆ పేజీ అచ్చం ఎస్బీఐ ఇంటర్నెట్ పేజీలానే ఉన్నా... అది మోసగాళ్లు పంపిన ఫిషింగ్ పేజీ. మోసగాళ్లు ఎంతకు తెగబడుతున్నారనేందుకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఎందుకంటే ఇది రిఫండ్ల సీజన్. ఉద్యోగులంతా ఐటీ రిటర్నులు వేసే ఉంటారు. ఎంతో కొంత రిఫండ్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అందుకే ఈ రిఫండ్ల మోసాన్ని ఎంచుకున్నారు మాయగాళ్లు. అంతేకాదు!! ఇపుడు ఫోన్లు చేసి కూడా... మీకు రిఫండ్ రావాల్సి ఉంది... మీరు గనక ఎస్బీఐ కస్టమర్ అయితే 1 నొక్కండి. ఐసీఐసీఐ కస్టమర్ అయితే 2 నొక్కండి అంటూ ఐవీఆర్ఎస్ ద్వారా వినిపిస్తున్నారు. అలా నొక్కుతూ పోతే... మన వివరాలన్నీ మోసగాళ్ల చేతుల్లోకి వెళతాయన్న మాట. ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండని చెప్పేదే ఈ కథనం. ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ల విషయంలో ఒక్కటి గుర్తుంచుకోండి. మీరు మీ రిటర్ను వేసేటపుడే రిఫండ్ క్లెయిమ్ చేసి ఉంటారు. ఆ రిఫండ్ నేరుగా మీరిచ్చిన బ్యాంకు ఖాతాలోకి వస్తుంది. ఒకవేళ ఖాతా ఇవ్వకుంటే... మీ చిరునామాకు చెక్కు వస్తుంది. అంతేతప్ప మళ్లీ మీరు ఆన్లైన్లో క్లెయిమ్ చెయ్యాల్సిన అవసరం ఉండదు. జాగ్రత్త మరి!! -
పెనాల్టీలను తప్పించుకోవచ్చు..
రిటర్నుల దాఖలుకు ఈ నెల 5తో గడువు తేదీ అయిపోయింది. కాకపోతే ఏదైనా కారణం వల్ల రిటర్న్ దాఖలు చేయనివారు చింతించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వేసినా పర్వాలేదు. టీడీ ఎస్, అడ్వాన్స్ ట్యాక్స్ ద్వారా మొత్తం పన్ను భారం మార్చి 2016లో చెల్లించిన ట్లయితే... ఈ రోజు/రేపు అంటే గడువు తేది తర్వాత రిటర్న్ దాఖలు చేయవచ్చు. అదనంగా వడ్డీ చె ల్లించాల్సిన పనిలేదు. ఎటువంటి ప్రమాదం లేదు. గాబరా పడనక్కర్లేదు. వెంటనే వేయండి. ఒకవేళ రిఫండ్ క్లెయిమ్ చేయ్యాలనుకోండి. ఈ రోజు వేసినా మీ రిఫండ్ మీకు వస్తుంది. మీ రిఫండ్‌కి ఏ ఢోకా లేదు. అయితే డిపార్ట్మెంట్ వారు మీకు రిఫండ్ మీదిచ్చే నామమాత్రపు వడ్డీ మాత్రం ఇవ్వరు. ఇది స్వల్పంగా ఉంటుంది.గడువు తేది దాటిపోయింది. రిటర్నులు వేయలేదు. పన్ను భారం పూర్తిగా కాకుండా కొంత భాగమే చెల్లించారు. ఈ సందర్భాల్లో మీకు అదనంగా వడ్డీ వడ్డిస్తారు. చెల్లించవలసిన ప్రతి వంద కి.. నెలకి 25 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలి. బయటి నుంచి ఎక్కువ వడ్డీకి అప్పు తెచ్చి పన్నులు చెల్లించడం కన్నా.. ఒకటి లేదా రెండు నెలల జాప్యం జరిగి రిటర్నులు ఆలస్యంగా వేయడంతో వడ్డీ మినహా ఎలాంటి నష్టం లేదు. కానీ ఎక్కువ మొత్తం బకాయి ఉన్నప్పుడు ఈ వడ్డీలు తడి సి మోపెడవుతాయి. వడ్డీ చెల్లించడం వలన ఆదాయం పెరగదు. వడ్డీని ఖర్చుగా పరిగణించరు. వ్యాపారం, స్టాక్ మార్కెట్ వ్యవహారాలు, ఇంటి రుణ వడ్డీ, క్యాపిటల్ గెయిన్ వంటి అంశాల్లో నష్టం వాటిల్లిన సందర్భాల్లో గడువు తేదిలోపు రిటర్నులు వేయకపోతే ఈ నష్టాన్ని బదిలీ చేయరు. సకాలంలో వేయడం వలన ఇలాంటి నష్టాల్ని వచ్చే సంవత్సరానికి బదిలీ చేస్తారు. ఇలా చేయడంతో ఈ నష్టం మేరకు వచ్చే సంవత్సరంలో ఆదాయం తగ్గుతుంది. ఫలితంగా పన్ను భారమూ తగ్గుతుంది. ఇది ఎంతో ప్రయోజనకరం. దీనిని దృష్టిలో ఉంచుకొని రిటర్నులు సకాలంలో వేయాలి. 2015-16 ఆర్థిక సంవత్సరం రిటర్నును 31.03.2017లోగా దాఖలు చేయకపోతే పెనాల్టీలు వేస్తారు. అలాగే సెల్ఫ్ అసెస్మెంట్ పన్ను కట్టకపోయినా.. అసెస్మెంట్ జరిపిన తర్వాత డిమాండ్ చెల్లించకపోయినా పెనాల్టీలు పడతాయి. ఇంచుమించు ప్రతి తప్పుకి పెనాల్టీలు ఉన్నాయి. వీటి వలన మీ ట్రాక్ రికార్డ్ పాడవుతుందన్న విషయం. కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్.మూర్తి & కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
రిటర్నులు ఎందుకు వేయాలి?
చాలా మంది రిటర్నులు ఎందుకు వేయాలని అడుగుతారు. పాన్ ఉంటే వేయాలా.. ఆదాయం లేకపోయినా వేయాలా.. బంగారం కొనుగోలు చేస్తే వేయాలా.. ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు. ఎన్ని ప్రశ్నలు వేసినా ఒకే ఒక సమాధానం. రిటర్నులు దాఖలు చేయండి. ఎందుకంటే.... మీ వయసును బట్టి బేసిక్ లిమిట్ ఉంటుంది. బేసిక్ లిమిట్‌కు మించి మీ నికర ఆదాయం ఉంటే రిటర్నులు దాఖలు చేయాలి. ఈ విషయంలో ఎప్పుడూ చట్ట ప్రకారమే నడుచుకోండి. రిటర్నులు దాఖలుతో ఇతరత్రా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చట్టాన్ని గౌరవించండి! చట్టాన్ని అనుసరించడం మన బాధ్యత. కంపెనీలలో డెరైక్టర్లు రిటర్నులు దాఖలు చేయాలి. భాగస్వామ్య సంస్థలలో భాగస్వాములు కూడా రిటర్నులు వేయాలి. కొత్త నిబంధనల ప్రకారం మీకు విదేశాలలో బ్యాంకు అకౌంట్ ఉన్నా రిటర్నులు దాఖలు తప్పనిసరి. అలాగే విదేశాల్లో ఆస్తులు ఉన్నా, విదేశీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినా రిటర్నులు వేయండి. ట్యాక్సబుల్ ఇన్కమ్ లేకపోయినా విదేశాలలో ఉన్న అంశాలను రిటర్నులలో పొందుపరచాలి. రిఫండ్ పొందాలంటే.. ప్రతిచెల్లింపులు చేసేవారు టీడీఎస్ చేస్తున్నారు. అంటే మూలంలోనే కోత. కొంత మందికి ట్యాక్సబుల్ ఇన్కమ్ దాటకపోయినా కోత తప్పటం లేదు. అధికారులకు భయం ఎక్కువగా ఉండటం వలన కోతలను అమలు పరుస్తున్నారు. కోత పడిందంటే పన్ను ఖజానాలో జమయ్యినట్లే. ఇలాంటి సందర్భంలో రిటర్నులు దాఖలు చేస్తే కాని రిఫండ్ మీకు రాదు. కాబట్టి రిటర్నులు దాఖలు చేయాల్సిందే. అంతే కాదు రిఫండ్ ఉంది అంటే ఆన్లైన్లో దాఖలు చేయాలి సుమా. డిడక్షన్ల క్లెయిమ్ ఎలా? అందరికీ సెక్షన్ 80 కింద డిడక్షన్లు ఉంటాయి. 80 సీ, 80 డీ, 80 డీడీ, 80 ఈ.. ఇలా ఎన్నో. వీటి అన్నింటికీ కాగితాలు ఉండాలి. రిటర్నులతోపాటు జతపరచకపోయినప్పటికీ భద్రపరచుకోవాలి. స్థూల ఆదాయం లో నుంచి వీటిని మినహాయిస్తారు. క్లెయిమ్ మార దు. కానీ స్థూల ఆదాయం మారొచ్చు. అందుకని డిడక్షన్లు సరిగ్గా క్లెయిమ్ చేస్తూ రిటర్నులు వేశారంటే.. మీరు మీ డిడక్షన్లన్నింటినీ డిక్లేర్ చేసినట్లు. ఉదాహరణకు మీ స్థూల ఆదాయం 3 లక్షలు. 80 సీ కింద రూ. 1,50,000 చెల్లించారు. ట్యాక్సబుల్ ఇన్కమ్ రూ.1,50,000. పన్ను భారం లేదు. ఇటువంటి సందర్భాల్లో ఏదేని కారణం వల్ల ఆదాయం రూ.1,00,000 పెరిగిందనుకోండి. అప్పుడు గతంలో మీరు చేసిన క్లెయిమ్ ఇప్పుడు మీ పన్ను భారాన్ని తగ్గిస్తుంది. షేర్లు అమ్ముతున్నారా.. షేర్ల లావాదేవీలలో నష్టం రావచ్చు. లాభాలు పొందొచ్చు. చాలా మంది ఇటువంటి లావాదేవీలను డిక్లేర్ చేయడం లేదు. బేసిక్ లిమిట్ దాటకపోతే.. అస్సలు పట్టించుకోవడం లేదు. ఇన్కమ్ సరే.. లావాదేవీల్లో నష్టం రావొచ్చు. ఈ నష్టాన్ని డిక్లేర్ చేయడం వలన మీకొచ్చే షేర్ల మీద ఆదాయం పడిపోవచ్చు. తద్వారా పన్ను భారం తగ్గుతుంది. అలా సర్దుబాటు కాకపోయినా రాబోయే సంవత్సరాల్లో సర్దుబాటు చేయవచ్చు. అందుకే కచ్చితంగా ఈ లావాదేవీలను చూపిస్తూ రిటర్నులు దాఖలు చేయండి. అమెరికా నుంచి అబ్బాయి డబ్బు పంపిస్తే! విదేశాల నుంచి అబ్బాయి/అమ్మాయి/ఇతరులు మీకు డబ్బు పంపుతున్నారా? భయపడనక్కర్లేదు. అక్కడ పన్ను చెల్లించిన ఆదాయం మీ అకౌంట్లో పడింది. ఇక్కడ పన్ను పడదు. కానీ మీరు చూపించాలి. అలాగే గ్రాట్యుటీ, జీవిత బీమా వంటి పన్నుకు గురికాని ఆదాయాలనూ డిక్లేర్ చేస్తూ రిటర్నులు దాఖలు చేయాలి. మరిన్ని ప్రయోజనాలు.. వీసా అధికారులు, బ్యాంక్ ఆఫీసర్లు, మీకు రుణమిచ్చే వారు, క్రెడిట్ కార్డు సంస్థలు, కొన్ని క్లబ్బులు, సంస్థలు... ఇలా ఎందరో ఆదిలోనే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు అడుగుతున్నారు. పన్ను భారం లేకపోయినా.. బేసిక్ లిమిట్ దాటకపోయినా.. వీటి విలువ అపారం. అందరూ వీటిని విశ్వసిస్తున్నారు. వీటి మీద ఆధారపడే మీకు ఎన్నో పనులు జరుగుతాయి. కాబట్టి ఇక ఆలస్యం ఎందుకు. రిటర్నులు వేయడానికి ఉపక్రమించండి. - ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య -
రిటర్నులు ఎందుకు..?
చాలామంది రిటర్నులు ఎందుకు వెయ్యాలి అని అడుగుతారు. పాన్ ఉంటే వెయ్యాలి.. పాన్ లేకపోతే మంచిదే కదా.. మనం అస్సలు రిటర్ను వేయనక్కర్లేదు కదా.. మాకు ఆదాయం లేదు.. అయినా వెయ్యాలా? బంగారం ఉంటే.. కొంటే వెయ్యాలా? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు .. ఎన్ని ప్రశ్నలు వేసినా ఒకే ఒక్క జవాబు.. రిటర్నులు దాఖలు చేయండి. ఎందుకంటే.. మీ వయస్సును బట్టి బేసిక్ లిమిట్ ఉంటుంది. బేసిక్ లిమిట్ దాటి మీ నికర ఆదాయం ఉంటే రిటర్ను దాఖలు చేయాలి. నికర ఆదాయాన్ని లెక్కించండి. ఇదంతా చట్టాల కోసమేనని ఆలోచించకండి. దీనివల్ల ఇతరత్రా కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. చట్టాన్ని గౌరవించండి.. పైన చెప్పిన విధంగా చట్టప్రకారం మీ గురుతరబాధ్యత నిర్వర్తించండి. కంపెనీల్లో డెరైక్టర్లూ రిటర్నులు దాఖలు చేయాలి.. భాగస్వామ్య సంస్థల్లో భాగస్వాములూ వేయాలి. కొత్త నిబంధనల ప్రకారం మీకు విదేశాలలో బ్యాంకు అకౌంటున్నా.. రిటర్నులు వేయాలి. విదేశాల్లో ఆస్తులున్నాయి.. రిటర్నులు వేయాలండి. అంతే కాకుండా విదేశీ సంస్థల్లో పెట్టుబడులుంటే రిటర్నులు దాఖలు చేయాలి. ట్యాక్సబుల్ ఇన్‌కం లేకపోయినా విదేశాల్లో ఉన్న అంశాలను రిటర్నుల్లో పొందుపర్చాలి. రీఫండ్లు పొందాలంటే,, చెల్లింపులు చేసే ప్రతివారు టీడీయస్ చేస్తున్నారు. అంటే మూలాల్లోనే కోత. కొంతమందికి ట్యాక్సబుల్ ఇన్‌కం దాటకపోయినా కోత తప్పటం లేదు. అధికారులకు భయం ఎక్కువవటం వలన కోత అమలు పరుస్తున్నారు. కోత పడిందంటే పన్ను ఖజానాకు జమయినట్లే. ఇలాంటి సందర్భంలో రిటర్నులు దాఖలు చేస్తే కానీ రీఫండ్ మీకు రాదు. కాబట్టి రిటర్నులు దాఖలు చేయాల్సిందే. అంతే కాదు. రీఫండ్ ఉంది అంటే.. ఆన్లైన్లో దాఖలు చేయాలి సుమా. డిడక్షన్లు క్లెయిమ్ చేయాలంటే.. అందరికీ సెక్షన్ 80 కింద డిడక్షన్లు ఉంటాయి. 80సీ, 80డీ, 80డీడీ, 80ఈ .. ఇలా ఎన్నో ఉన్నాయి. వీటి అన్నింటికి కాగితాలు ఉండాలి. రిటర్నులతో బాటు జతపర్చకపోయినా భద్రపర్చుకోవాలి. క్లెయిం కోసం స్థూల ఆదాయం లోంచి వీటిని మినహాయిస్తారు. కానీ స్థూల ఆదాయం మారవచ్చు.. ఉద్యోగస్తులకు ఎరియర్స్ రావొచ్చు.. ఇతరులకు గత ఆదాయం ఇప్పుడు రావొచ్చు. అందుకని డిడక్షన్లు సరిగ్గా క్లెయిమ్ చేస్తూ రిటర్నులు వేశారంటే మీరు మీ డిడక్షన్లన్నింటినీ డిక్లేర్ చేసినట్లే. ఉదాహరణకు.. మీ స్థూల ఆదాయం రూ. 3 లక్షల యితే.. 80సీ కింద రూ. 1,50,000 చెల్లించారనుకోండి.. ట్యాక్సబుల్ ఇన్‌కం రూ. 1,50,000 అవుతుంది.. పన్ను భారం ఏదు. ఇటువంటి సందర్భంలో ఏదైనా కారణం వలన ఆదాయం రూ. 1,00,000 పెరిగిందనుకోండి.. గతంలో మీరు చేసిన క్లెయిమ్ ఇప్పుడు మీ పన్ను భారం తగ్గిస్తుంది. షేర్లు అమ్ముతున్నారా.. షేర్ల లావాదేవీలలో.. నష్టం రావొచ్చు.. లాభం రావొచ్చు. చాలా మంది ఇటువంటి లావాదేవీలను డిక్లేర్ చేయడం లేదు. బేసిక్ లిమిట్ దాటకపోతే అస్సలు పట్టించుకోవడం లేదు. ఇన్‌కం సరే, లావాదేవీల్లో నష్టం రావచ్చు. ఈ నష్టాన్ని డిక్లేర్ చేయడం వలన మీకొచ్చే షేర్ల మీద వచ్చే ఆదాయం తగ్గుతుంది. తద్వారా పన్ను భారం తగ్గుతుంది. అలా సర్దుబాటు కాకపోయినా.. రాబోయే 8 సం.లు సర్దవచ్చు. అందువలన ఖచ్చితంగా ఈ లావాదేవీలను చూపించుతూ రిటర్నులు దాఖలు చేయండి. అమెరికా నుంచి అబ్బాయి పంపిస్తే.. విదేశాల నుంచి మీ అబ్బాయి/అమ్మాయి లేదా దగ్గర బంధువులు డబ్బులు పంపుతున్నారా. భయపడక్కర్లేదు. అక్కడ పన్ను చెల్లించిన ఆదాయం, మీ అకౌంటులో పడింది. ఇక్కడ పన్ను పడదు. కానీ మీరు చూపించాలి. అలాగే ఎన్నో ఆదాయాలు పన్నుకి గురికానివి ఉన్నాయి. గ్రాట్యుటీ, జీవిత బీమా మొదలైనవి ఆ కోవకి చెందినవే. ఇవన్నీ డిక్లేర్ చేస్తూ రిటర్నులు వేయండి. డిపార్ట్మెంట్ వారు అడిగినప్పుడు వివరణలు ఇవ్వవచ్చు. మరెన్నో ప్రయోజనాలు.. వీసా అధికారులు, బ్యాంకు అధికారులు, మీకు అప్పు ఇచ్చే వాళ్లు, క్రెడిట్ కార్డు సంస్థలు, కొన్ని క్లబ్బులు, కొన్ని సంస్థలు.. ఇలా ఎందరో ఆదిలోనే అడుగుతున్నారు మీ ఇన్‌కం ట్యాక్స్ రిటర్నులు. పన్ను భారం లేకపోయినా.. బేసిక్ లిమిట్ దాటకపోయినా వీటి విలువ అపారం. అందరూ వీటిని విశ్వసిస్తున్నారు. వీటి మీద ఆధారపడే మీకు ఎన్నో పనులు జరుగుతాయి. కాబట్టి ఇక ఆలస్యం ఎందుకు.. రిటర్నులు వేయడానికి ఉపక్రమించండి. - ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్‌లావణ్య