
న్యూఢిల్లీ: తత్కాల్ ప్రయాణికులకు రైల్వేశాఖ గురువారం శుభవార్త తెలిపింది. తత్కాల్ కింద బుక్‌చేసుకున్న టికెట్లపై 100 శాతం రీఫండ్‌ను అందించనున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. ఈ–టికెట్లతో పాటు కౌంటర్‌లో తీసుకున్న టికెట్లకు కూడా రీఫండ్ వర్తిస్తుందని పేర్కొంది. కింద పేర్కొన్న ఐదు సందర్భాల్లో టికెట్ ధర మొత్తాన్ని ప్రయాణికులకు తిరిగి చెల్లిస్తామంది.
1) ఒకవేళ రైలు రాక మూడు గంటలు అంతకన్నా ఎక్కువ ఆలస్యమైనప్పుడు.
2) రైలును దారి మళ్లించినప్పుడు.
3) రైలును దారి మళ్లించిన తర్వాత ప్రయాణికులు ట్రైన్ ఎక్కాల్సిన స్టేషన్ లేదా దిగాల్సిన స్టేషన్ లేదా రెండూ కొత్త మార్గంలో లేకపోతే.
4) ప్రయాణికులు ఎక్కాల్సిన కోచ్‌ను రైలుకు అనుసంధానించకపోతే, అధికారులు ప్రయాణికులకు ప్రత్యామ్నాయం కల్పించనప్పుడు.
5) రైలులో రిజర్వేషన్ చేసుకున్నదానికి బదులుగా లోయర్ క్లాస్‌లో ప్రయాణించేందుకు ప్రజలు ఇష్టపడకపోతే (ఒకవేళ ప్రయాణికులు ఇందుకు అంగీకరిస్తే రెండు టికెట్లకు మధ్య ఉన్న తేడాను రైల్వేశాఖ ఆ ప్రయాణికుడికి చెల్లిస్తుంది).
Comments
Please login to add a commentAdd a comment