
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2022 ఫిబ్రవరి 21 నాటికి 2.07 కోట్ల పన్ను చెల్లింపుదారులకు రూ.1.83 లక్షల కోట్ల రిఫండ్‌లు చెల్లించినట్టు వెల్లడించింది. వ్యక్తిగత ఆదాయపన్ను రిఫండ్‌లు రూ.65,498 కోట్లు, కార్పొరేట్ పన్ను రిఫండ్‌లు రూ.1.17 లక్షల కోట్ల చొప్పున ఉన్నట్టు తెలిపింది. ఇందులో 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1.67 కోట్ల పన్ను చెల్లింపుదారులకు చేసిన రూ.33,819 కోట్ల రిఫండ్‌లు కూడా ఉన్నట్టు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment