డబుల్‌పేమెంట్‌ జరిగిందా? స్టాక్‌మార్కెట్లో నష్టాలా? రిఫండ్‌ ఎలా? | Tax Related issues expert advise and opinion in telugu | Sakshi
Sakshi News home page

డబుల్‌పేమెంట్‌ జరిగిందా? స్టాక్‌మార్కెట్లో నష్టాలా? రిఫండ్‌ ఎలా?

Published Mon, Aug 22 2022 11:48 AM | Last Updated on Mon, Aug 22 2022 5:30 PM

Tax Related issues expert advise and opinion in telugu - Sakshi

ప్ర. నా పాన్‌ అకౌంటు, బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేశాను. డిపార్ట్‌మెంట్‌ వారు ‘‘రిఫండ్‌ ఫెయిల్‌’’ అని మెసేజీలు పంపుతున్నారు. బ్యాంకు వారిని సంప్రదిస్తే, ‘‘ఈ సమస్య మాది కాదు.. ఆదాయ పన్ను శాఖదే’’ అంటున్నారు. ఏం చేయాలి? – రాజు లక్ష్మి, ఈమెయిల్‌ ద్వారా 

జ. ఇటువంటి సమస్యలు చాలా వస్తున్నాయి. నిజంగా రెండూ అనుసంధానం అయిన పక్షంలో ‘‘రిఫండ్‌ ఫెయిల్‌’’ అయిందంటున్నారు కాబట్టి రెండు వైపులా చెక్‌ చేయండి. బ్యాంకులో మళ్లీ సంబంధించిన కాగితాలివ్వండి. ఆ తతంగం ముగిసిన తర్వాత డిపార్ట్‌మెంట్‌ సైట్లోకి వెళ్లి మీ రిఫండ్‌ క్లెయిమ్‌ బ్యాంకు వివరాలను అప్‌డేట్‌ చేసి, రీవేలిడేట్‌ చేయండి. సాంకేతిక సమస్యల వల్ల రికార్డులను అప్‌డేట్‌ చేయడంలో జాప్యం జరుగుతోంది. రీవేలిడేట్‌ చేసిన తర్వాత రిఫండు వస్తుంది. మీరు చెక్‌ చేసుకోవచ్చు. ప్రాసెసింగ్‌లో ఉండి ఉంటే ఫర్వాలేదు. లేదంటే పోర్టల్‌లో ఒక కంప్లెయింట్‌ ఇవ్వండి. గ్రీవెన్సును నమోదు చేయవచ్చు.  (

జ. సీపీసీ నుండి 143 (1) సమాచారం వచ్చింది. ‘‘సమాచారం మెయిల్‌కి పంపుతున్నాము. డిమాండ్‌ ఉంది .. చెల్లించాలి’’ అని ఉంది. ఏం చేయాలి.  – కర్ణ, ఈ–మెయిల్‌ ద్వారా 

జ. గత వారాల్లో 143 (1) సమాచారం గురించి సవివరంగా తెలియజేశాం. 143 (1) సెక్షన్‌ సమాచారం కోసం, మెయిల్‌ కోసం వేచి ఉండండి. ఆ ఆర్డరులో ఏయే కారణాల వల్ల డిమాండ్‌ ఏర్పడిందో విశ్లేషించండి. అది కరెక్టు అయితే చెల్లించండి. కాకపోతే విభేదిస్తూ జవాబు ఇవ్వవచ్చు. సరిదిద్దవచ్చు. తగినకాలంలో సమాధానం ఇవ్వడం మర్చిపోవద్దు. 

ప్ర. నేను ఉద్యోగిని. స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నా. నష్టం వచ్చింది. జీతం రూ. 5,00,000 దాటింది. రిటర్ను వేయాలా? ట్యాక్స్‌ ఎంత చెల్లించాలి?  – మహ్మద్‌ షకీర్, ఈ–మెయిల్‌ ద్వారా 
జ. ఒక వ్యక్తికి ఒక పాన్‌ ఉండాలి. అలాంటి వ్యక్తి ఎన్ని సోర్స్‌ల ద్వారా ఆదాయం వచ్చినా ఒకే రిటర్నులో చూపించి ఒకేసారి వేయాలి. మీరు మీ జీతం వివరాలు, స్టాక్‌ మార్కెట్‌ వ్యవహారాలతో కలిపి ఒక రిటర్ను వేయాలి. స్టాక్‌ మార్కెట్లో 31-03-2023 నాటికి ఏర్పడ్డ లాభనష్టాలను తేల్చి, తెలుసుకుని వేయాలి. మీ బ్రోకింగ్‌ సంస్థ ఒక స్టేట్‌మెంట్‌ ఇస్తుంది. అన్ని వివరాలుంటే తప్ప పన్ను భారం నిర్ధారించలేము. 

ప్ర. ప్రభుత్వం డిడక్ట్‌ చేసిన టీడీఎస్‌ ఫారం 26ఏఎస్‌లో నమోదు కాలేదు. ఆ మేరకు డైరెక్టుగా చెల్లించి, రిటర్న్‌ దాఖలు చేశాను. ఈ నెలలో టీడీఎస్‌ పద్దులు నమోదయ్యాయి.  – సుధా భరత్, ఈ-మెయిల్‌ ద్వారా 

జ. ఫారం 26ఏఎస్‌లో చెల్లింపుల గురించి మనం గత వారమే తెలుసుకున్నాం. ఎంట్రీలు ఆలస్యంగా పడటం, పడకపోవడం, తప్పులు పడటం వంటి ఉదాహరణలు ఎన్నో ఉంటున్నాయి. మీ కేసులో డబుల్‌ పేమెంటు జరిగినట్లు. మీరు చేసిన చెల్లింపు, టీడీఎస్‌ ఒకే ఆర్థిక సంవత్సరానికి సంబంధించినట్లయితే ఈ లోపల డిపార్టుమెంటు వారు అసెస్‌మెంటు చేసి రిఫండు ఇస్తారు. లేదా మీ అంతట మీరే స్వయంగా రివైజ్‌ చేసుకోవచ్చు. ఏదేనీ కారణం వల్ల ఎంట్రీలు తప్పుగా పడితే సరిదిద్దండి. సంవత్సరం మారితే డబుల్‌ పేమెంటు కాదు. ఒకే సంవత్సరానికి సంబంధించి, ఒకే ఆదాయం అయితే మీకు రిఫండు వస్తుంది.   


కేసీహెచ్‌ ఏవీఎస్‌ఎన్‌ మూర్తి, కేవీఎన్‌ లావణ్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement