న్యూఢిల్లీ: లాక్‌డౌన్ మొదటి దశ కాలంలో విమాన టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు పూర్తి రీఫండ్ లభిస్తుందని పౌర విమానయాన శాఖ స్పష్టంచేసింది. కోవిడ్–19 వైరస్ కట్టడిలో భాగంగా ఈ ఏడాది మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు తొలి విడత లాక్‌డౌన్ కొనసాగగా, ఈ కాలంలో బుకింగ్స్ చేసుకున్న విమాన ప్రయాణికులకు రద్దు రుసుము ఏమీ లేకుండా పూర్తి మొత్తం నగదు రూపంలో వెనక్కు వస్తుందని తెలిపింది. మే 3 వరకు ప్రయాణాలకు టికెట్ కొన్న వారికి ఇది వర్తిస్తుందని వివరించింది. పేర్కొన్న కాలంలో నగదుకు బదులుగా భవిష్యత్తు ప్రయాణానికి ఉపయోగపడే క్రెడిట్ అందనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ అంశంపై విమానయాన శాఖ గురువారం స్పష్టతనిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment