న్యూఢిల్లీ: ప్రాంతీయ విమానయాన కనెక్టివిటీ ప్రభుత్వానికి ప్రాధాన్యతాంశంగా కొనసాగుతుందని పౌర విమానయాన శాఖ కార్యదర్శి వుమ్లున్మాంగ్ వుల్నామ్ తెలిపారు. సీప్లేన్‌ల కార్యకలాపాల కోసం తగిన వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ‘దేశంలో విమానయాన రంగం వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితం దేశీయంగా 11 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు.
ఈ సంఖ్య రెట్టింపై 22 కోట్లకు చేరుకుంది. 2029 నాటికి దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 40 కోట్లను తాకుతుంది. విమాన ప్రయాణం పట్ల ప్రజల్లో ఆకాంక్ష ఉంది’ అని వివరించారు. సేవలు అందించని, లేదా తక్కువ సేవలందించే ఎయిర్‌పోర్టుల నుండి ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మెరుగుపరచడంతోపాటు విమాన ప్రయాణ వ్యయానిన మరింత తగ్గించడం ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ (ఆర్‌సీఎస్) పథకం లేదా ఉడాన్ లక్ష్యంగా పెట్టుకుంది.
1.46 కోట్ల మంది..
హెలికాప్టర్లు, సీప్లేన్‌ల కార్యకలాపాలను పెంచడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని వుమ్లున్మాంగ్ వివరించారు. 2016 అక్టోబర్‌లో ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం ప్రారంభమైంది. దీని కింద 2024 నవంబర్ 30 నాటికి 13 హెలిపోర్ట్‌లు, 2 వాటర్ ఏరోడ్రోమ్‌లుసహా సేవలు అందించని, తక్కువ సరీ్వస్‌లు ఉన్న 87 విమానాశ్రయాలను కలుపుతూ 613 మార్గాలు అందుబాటులోనికి వచ్చాయి. రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ కింద ఇప్పటివరకు 2.86 లక్షల సర్వీసుల ద్వారా 1.46 కోట్ల మంది దేశీయంగా వివిధ నగరాలకు రాకపోకలు సాగించారని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 2024 డిసెంబర్‌లో పార్లమెంటుకు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment