
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా నవంబర్‌లో 1.42 కోట్ల మంది విమాన ప్రయాణం సాగించారు. 2023 నవంబర్‌తో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య గత నెలలో 11.9 శాతం అధికం కావడం గమనార్హం. గతేడాది ఇదే కాలంలో 1.27 కోట్ల మంది విమానయానం చేశారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకారం.. 2024 అక్టోబర్‌లో దేశీయ విమాన ప్రయాణికుల(Air passengers) సంఖ్య 1.36 కోట్లుగా ఉంది.
ఇదీ చదవండి: విభిన్న రంగుల్లో నంబర్ ప్లేట్లు.. ఎందుకలా..
ఈ ఏడాది జనవరి–నవంబర్ కాలంలో భారత్‌లో వివిధ నగరాల మధ్య 14.64 కోట్ల మంది రాకపోకలు సాగించారు. వార్షిక వృద్ధి 5.91 శాతం నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలంలో ఈ సంఖ్య 13.82 కోట్లుగా ఉంది. దేశీయ మార్కెట్ పరంగా ఇండిగో 63.6 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. ఎయిరిండియా 24.4 శాతం, అకాశా ఎయిర్ 4.7, స్పైస్‌జెట్ 3.1 శాతం వాటాతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అలయన్స్ ఎయిర్ 0.7 శాతం వాటాతో స్థిరంగా ఉంది. ఎయిరిండియా(Air India)లో విస్తారా విలీనం నవంబర్‌లో పూర్తి అయింది. గత నెలలో విమానాల ఆలస్యం కారణంగా 2,24,904 మంది ప్రయాణికులపై ప్రభావం చూపింది.
Comments
Please login to add a commentAdd a comment