Air passenger traffic
-
ఆకాశవీధిలో రోజూ 4.3 లక్షల మంది
భారతీయ విమానయాన సంస్థలు ఆగస్టు నెలలో 1.31 కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చినట్లు గణాంకాలు వెల్లడయ్యాయి. అంటే రోజూ దాదాపు 4.3 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. 2023 ఆగస్టులో విమాన ప్రయాణికుల సంఖ్య 1.24 కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే వీరి సంఖ్య ఈసారి 5.7 శాతం పెరిగింది. జులైలో నమోదైన 1.29 కోట్లమంది ప్రయాణికులతో పోలిస్తే ఇది ఎక్కువే. ఈమేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నివేదిక విడుదల చేసింది.డీజీసీఏ నివేదికలోని వివరాల ప్రకారం..గత నెలలో విమానాల ఆలస్యం కారణంగా 1,79,744 మంది ప్రయాణికులు ప్రభావితం చెందారు. వీరికి పరిహారంగా విమానయాన కంపెనీలు సుమారు రూ.2.44 కోట్లు వెచ్చించాయి. విమానాల రద్దు కారణంగా 38,599 మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వీరికి రూ.1.14 కోట్లు నష్టపరిహారం ఇచ్చారు. ఆగస్టులో మొత్తం 728 మంది ప్రయాణికులకు వివిధ కారణాల వల్ల బోర్డింగ్ సదుపాయాన్ని అందించలేదు. దాంతో రూ.77.96 లక్షలు పరిహారం చెల్లించారు.2024 జనవరి-ఆగస్టులో దేశీయ విమానయాన సంస్థల్లో 10.5 కోట్లమంది ప్రయాణించారు. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో ఈ సంఖ్య 10.06 కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే 4.82 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. సమయపాలన పరంగా ఆగస్టులో ఆకాసా ఎయిర్ 71.2 శాతం కచ్చితత్వంతో విమానాలు నడిపి మొదటిస్థానంలో నిలిచింది. తర్వాత స్థానంలో విస్తారా (68.6 శాతం), ఏఐఎక్స్ కనెక్ట్ (66.8 శాతం), ఇండిగో, ఎయిర్ ఇండియా(66 శాతం), అలయన్స్ ఎయిర్(55.3 శాతం), స్పైస్‌జెట్ (31 శాతం) నిలిచాయి. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై విమానాశ్రయాల నిర్వహణ ఆధారంగా ఆన్‌టైమ్ ఫర్ఫార్మెన్స్ (ఓటీపీ)ను లెక్కించారు.జూన్‌తో పోలిస్తే జులైలో 3.1 శాతం పెరిగిన మార్కెట్ వాటా ఆగస్టులో 2.3 శాతానికి పడిపోయింది. గతనెలలో ఇండిగో 62.4 శాతం, ఎయిర్ ఇండియా 14.7 శాతం, విస్తారా 10.3 శాతం, ఏఐఎక్స్ కనెక్ట్ 4.5 శాతం, ఆకాసా ఎయిర్ 4.4 శాతం, అలయన్స్ ఎయిర్ 0.9 శాతం మార్కెట్ వాటా నమోదు చేశాయి.ఇదీ చదవండి: ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేతవిమాన ప్రయాణాలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం టైర్ 2, 3 నగరాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. దాంతో విమాన ప్రయాణికులు పెరుగుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. దాంతోపాటు విమానయాన కంపెనీల మధ్య పోటీ ఏర్పడి టికెట్ ధరలో రాయితీలు, ఆఫర్లు ప్రకటిస్తుండడంతో ప్యాసింజర్ల సంఖ్య పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
గగనవీధిలో పెరుగుతున్న ప్రయాణికులు.. ఒకే రోజు భారీ రికార్డు..
వేసవికాలం కావడంతో దేశంలోని చాలామంది సమ్మర్ సెలవులు, ఇతర విహారయాత్రలు చేస్తూంటారు. ఈ తరుణంలో ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. దాంతో దేశంలో విమాన ప్రయాణీకుల రద్దీ పెరుగుతోంది. ఒక్కరోజే దాదాపు 5 లక్షల మంది ప్యాసింజర్లు దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయాణించి రికార్డు నెలకొల్పారు. ఆదివారం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల మధ్య నడిచిన 6,128 విమాన సర్వీసుల్లో ఏకంగా 4,71,751 మంది ప్రయాణించినట్టు తేలింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తాజాగా వివరాలు వెల్లడించింది. కరోనాకంటే ముందు విమాన ప్రయాణీకుల సగటు (3,98,579)తో పోల్చితే ఇది 14 శాతం అధికం. గతేడాది ఏప్రిల్ 21న 5,899 విమాన సర్వీసుల్లో 4,28,389 మంది ప్రయాణించారు. ఈ ఏడాది జనవరి-మార్చిలో దేశీయ విమానయాన సంస్థల సర్వీసుల్లో ప్రయాణించినవారు 3.91కోట్లుగా ఉన్నట్టు గత వారం భారతీయ విమానయాన నియంత్రిత సంస్థ డీజీసీఏ తెలిపింది. గత ఏడాది ఇదే వ్యవధిలో ప్యాసింజర్లు 3.75కోట్లుగా ఉన్నారు. దీంతో వార్షిక వృద్ధి 4.38 శాతంగా నమోదైందని తెలిపింది. ఇదీ చదవండి: టాప్ 3 కంపెనీల్లో 64 వేలమందికి లేఆఫ్స్..! ‘ఆర్థికాభివృద్ధి, ప్రభుత్వ విధానాలు, అందుబాటు ధరల్లో విమాన సేవలందించే సంస్థలు విస్తరిస్తున్నాయి. రోజురోజుకూ సరికొత్త స్థాయికి ప్యాసింజర్ల సంఖ్య చేరుతుంది. భవిష్యత్తులో ఇది మరింత పెరుగనుంది’ అని విమానయాన మంత్రిత్వ శాఖ తన అధికారిక ‘ఎక్స్’(ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది. -
ఆకాశవీధిలో 15.4 కోట్ల ప్రయాణికులు
భారత్ నుంచి విదేశాలకు వెళ్లేవారితోపాటు డొమెస్టిక్ విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 2023-24లో అంతకుముందు ఏడాదితోపోలిస్తే 13 శాతం మేర ప్రయాణికుల రద్దీ పెరిగినట్లు ఇక్రా నివేదిక ద్వారా తెలిసింది. దాంతో 2023-24 ఏడాదిలో విమానాల్లో ప్రయాణించినవారి సంఖ్య 15.4 కోట్లకు చేరినట్లు నివేదికలో తెలిపింది. నివేదికలోని వివరాల ప్రకారం..కరోనాకు ముందు విమానాల్లో ఎంతమంది ప్రయాణించేవారో వారి సంఖ్యను తాజా గణాంకాలు అధిగమించాయి. 2019-20లో 14.2 కోట్ల మంది డొమెస్టిక్ విమానాల్లో ప్రయాణించారు. కేవలం 2024 మార్చిలోనే దేశీయ విమానాల్లో 1.35 కోట్ల మంది ప్రయాణించారని అంచనా. ఫిబ్రవరిలో ప్రయాణించిన 1.26 కోట్ల మంది కంటే ఈ సంఖ్య 6.9శాతం అధికం. ఏడాదివారీగా చూసినా 4.9 శాతం పెరిగింది. ఇదీ చదవండి: అలర్ట్.. 48 గంటల్లో యుద్ధం.. భారత వాణిజ్యంపై ప్రభావం ఎంతంటే.. దేశీయ విమానయాన పరిశ్రమకు 2022-23లో నికరంగా రూ.17,000కోట్లు-రూ.17,500 కోట్ల నష్టం వాటిల్లింది. అయితే అది 2023-24, 2024-25లలో రూ.3,000 కోట్లు-రూ.4,000 కోట్లకు పరిమితం కావొచ్చు. ఫిబ్రవరితో ముగిసిన 2023-24 తొలి 11 నెలల్లో దేశీయ విమాన సంస్థల్లో ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ 2.7 కోట్లుగా నమోదైంది. 2022-23 ఇదే సమయంతో పోలిస్తే ఇది 25% అధికంగా ఉంది. -
ఆగస్ట్‌లో విమాన ప్రయాణికుల్లో వృద్ధి
న్యూఢిల్లీ: దేశీ విమాన ప్రయాణికుల రద్దీ ఆగస్ట్‌లో 5 శాతం పెరిగింది. 1.02 కోట్ల మంది విమాన సేవలను వినియోగించుకున్నట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ఆగస్ట్ నెలకు సంబంధించి ఈ రంగంపై ఒక నివేదికను గురువారం విడుదల చేసింది. జూలై నెలలో విమాన ప్రయాణికుల సంఖ్య 97 లక్షలతో పోలిస్తే 5 శాతం పెరిగినట్టు పేర్కొంది. ఇక 2021 ఆగస్ట్ నెల గణాంకాలతో పోల్చి చూస్తే 52 శాతం పెరిగినట్టు తెలిపింది. ఇక కరోనా ముందు సంవత్సరం 2019 ఆగస్ట్ నెల గణాంకాల కంటే 14 శాతం తక్కువే ఉన్నట్టు వివరించింది. విమాన సర్వీసులు పూర్తి సాధారణ స్థాయికి చేరుకోవడంతోపాటు, కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోయినందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల రద్దీ వేగంగా పుంజుకోవచ్చని ఇక్రా అంచనా వేసింది. భారత ఎయిర్‌లైన్స్ సంస్థలకు సంబంధించి విదేశీ ప్రయాణికుల సంఖ్య ఆగస్ట్‌లో 19.8 లక్షలుగా ఉందని, కరోనా ముందు నాటితో పోలిస్తే ఇది 32 శాతం అధికమని తెలిపింది. 2022 మొదటి ఐదు నెలల్లో దేశీ విమాన ప్రయాణికుల సంఖ్య 5.24 కోట్లుగా ఉంటుందని, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 131 శాతం అధికమని ఇక్రా పేర్కొంది. విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు పెరిగిపోవడంతో ఎయిర్‌లైన్స్ ఆదాయం రికవరీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిదానంగా ఉంటుందని అంచనా వేసింది. దీనికితోడు పరిశ్రమపై ద్రవ్యోల్బణ ప్రభావం సైతం ఉంటుందని పేర్కొంది. -
జూలైలో విమాన ప్రయాణికుల రద్దీ 26% వృద్ధి
ఇది రికార్డు స్థాయి... న్యూఢిల్లీ: దేశీ విమాన ప్రయాణికుల రద్దీ జూలైలో 26 శాతం వృద్ధి చెందింది. రెండంకెల వృద్ధి నమోదుకావడం ఇది వరుసగా 24వ సారి. ప్రయాణికుల పెరుగుదలకు తక్కువ టికెట్ ధరలు కారణంగా ఉన్నాయి. దేశీ విమానయాన కంపెనీలు జూలైలో 85.08 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. గతేడాది ఇదే నెలలో అవి చేరవేసిన ప్రయాణికులు సంఖ్య 67.62 లక్షలు. ఇదివరకు ప్రయాణికుల రద్దీ వృద్ధి గరిష్ట స్థాయి 25%గా ఉండేది. ఇప్పుడు ఆ రద్దీ వృద్ధి 26 శాతమనే కొత్త గరిష్ట స్థాయికి చేరింది. దేశీ విమానయాన సంస్థలు ఈ ఏడాది జనవరి-జూలై మధ్యకాలంలో 561 లక్షల మందిని గమ్యాలకు చేరిస్తే.. గతేడాది ఇదే సమయంలో 456 లక్షల మందిని గమ్యాలకు అంటే 23 శాతం వృద్ధి . టాప్‌లో ఇండిగో: మార్కెట్ వాటా పరంగా చేస్తే ఇండిగో అగ్రస్థానంలో ఉంది. జూన్‌లో 37.9%గా ఉన్న దీని మార్కెట్ వాటా జూలైకి 39.8%కి చేరింది. ఇక దీని తర్వాతి స్థానాల్లో జెట్ ఎయిర్వేస్ (16.3%), ఎయిర్ ఇండియా (14.8 శాతం), స్పైస్‌జెట్ (11.7 శాతం) ఉన్నాయి.