ఇది రికార్డు స్థాయి...
న్యూఢిల్లీ: దేశీ విమాన ప్రయాణికుల రద్దీ జూలైలో 26 శాతం వృద్ధి చెందింది. రెండంకెల వృద్ధి నమోదుకావడం ఇది వరుసగా 24వ సారి. ప్రయాణికుల పెరుగుదలకు తక్కువ టికెట్ ధరలు కారణంగా ఉన్నాయి. దేశీ విమానయాన కంపెనీలు జూలైలో 85.08 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. గతేడాది ఇదే నెలలో అవి చేరవేసిన ప్రయాణికులు సంఖ్య 67.62 లక్షలు.
ఇదివరకు ప్రయాణికుల రద్దీ వృద్ధి గరిష్ట స్థాయి 25%గా ఉండేది. ఇప్పుడు ఆ రద్దీ వృద్ధి 26 శాతమనే కొత్త గరిష్ట స్థాయికి చేరింది. దేశీ విమానయాన సంస్థలు ఈ ఏడాది జనవరి-జూలై మధ్యకాలంలో 561 లక్షల మందిని గమ్యాలకు చేరిస్తే.. గతేడాది ఇదే సమయంలో 456 లక్షల మందిని గమ్యాలకు అంటే 23 శాతం వృద్ధి .
టాప్‌లో ఇండిగో: మార్కెట్ వాటా పరంగా చేస్తే ఇండిగో అగ్రస్థానంలో ఉంది. జూన్‌లో 37.9%గా ఉన్న దీని మార్కెట్ వాటా జూలైకి 39.8%కి చేరింది. ఇక దీని తర్వాతి స్థానాల్లో జెట్ ఎయిర్‌వేస్ (16.3%), ఎయిర్ ఇండియా (14.8 శాతం), స్పైస్‌జెట్ (11.7 శాతం) ఉన్నాయి.