ఆకాశవీధిలో 15.4 కోట్ల ప్రయాణికులు | Indian Aviation Industry Net Loss Will Be Anticipated To Decrease | Sakshi
Sakshi News home page

వైమానిక పరిశ్రమకు తగ్గనున్న నష్టాలు.. ఇక్రా నివేదిక

Published Sat, Apr 13 2024 1:33 PM | Last Updated on Sat, Apr 13 2024 3:33 PM

Indian Aviation Industry Net Loss Will Be Anticipated To Decrease - Sakshi

భారత్‌ నుంచి విదేశాలకు వెళ్లేవారితోపాటు డొమెస్టిక్‌ విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 2023-24లో అంతకుముందు ఏడాదితోపోలిస్తే 13 శాతం మేర ప్రయాణికుల రద్దీ పెరిగినట్లు ఇక్రా నివేదిక ద్వారా తెలిసింది. దాంతో 2023-24 ఏడాదిలో విమానాల్లో ప్రయాణించినవారి సంఖ్య 15.4 కోట్లకు చేరినట్లు నివేదికలో తెలిపింది. 

నివేదికలోని వివరాల ప్రకారం..కరోనాకు ముందు విమానాల్లో ఎంతమంది ప్రయాణించేవారో వారి సంఖ్యను తాజా గణాంకాలు అధిగమించాయి. 2019-20లో 14.2 కోట్ల మంది డొమెస్టిక్‌ విమానాల్లో  ప్రయాణించారు. కేవలం 2024 మార్చిలోనే దేశీయ విమానాల్లో 1.35 కోట్ల మంది ప్రయాణించారని అంచనా. ఫిబ్రవరిలో ప్రయాణించిన 1.26 కోట్ల మంది కంటే ఈ సంఖ్య 6.9శాతం అధికం. ఏడాదివారీగా చూసినా 4.9 శాతం పెరిగింది.

ఇదీ చదవండి: అలర్ట్‌.. 48 గంటల్లో యుద్ధం.. భారత వాణిజ్యంపై ప్రభావం ఎంతంటే..

దేశీయ విమానయాన పరిశ్రమకు 2022-23లో నికరంగా రూ.17,000కోట్లు-రూ.17,500 కోట్ల నష్టం వాటిల్లింది. అయితే అది 2023-24, 2024-25లలో రూ.3,000 కోట్లు-రూ.4,000 కోట్లకు పరిమితం కావొచ్చు. ఫిబ్రవరితో ముగిసిన 2023-24 తొలి 11 నెలల్లో దేశీయ విమాన సంస్థల్లో ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ 2.7 కోట్లుగా నమోదైంది. 2022-23 ఇదే సమయంతో పోలిస్తే ఇది 25% అధికంగా ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement