Air passengers
-
ఆకాశవీధిలో రోజూ 4.3 లక్షల మంది
భారతీయ విమానయాన సంస్థలు ఆగస్టు నెలలో 1.31 కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చినట్లు గణాంకాలు వెల్లడయ్యాయి. అంటే రోజూ దాదాపు 4.3 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. 2023 ఆగస్టులో విమాన ప్రయాణికుల సంఖ్య 1.24 కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే వీరి సంఖ్య ఈసారి 5.7 శాతం పెరిగింది. జులైలో నమోదైన 1.29 కోట్లమంది ప్రయాణికులతో పోలిస్తే ఇది ఎక్కువే. ఈమేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నివేదిక విడుదల చేసింది.డీజీసీఏ నివేదికలోని వివరాల ప్రకారం..గత నెలలో విమానాల ఆలస్యం కారణంగా 1,79,744 మంది ప్రయాణికులు ప్రభావితం చెందారు. వీరికి పరిహారంగా విమానయాన కంపెనీలు సుమారు రూ.2.44 కోట్లు వెచ్చించాయి. విమానాల రద్దు కారణంగా 38,599 మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వీరికి రూ.1.14 కోట్లు నష్టపరిహారం ఇచ్చారు. ఆగస్టులో మొత్తం 728 మంది ప్రయాణికులకు వివిధ కారణాల వల్ల బోర్డింగ్ సదుపాయాన్ని అందించలేదు. దాంతో రూ.77.96 లక్షలు పరిహారం చెల్లించారు.2024 జనవరి-ఆగస్టులో దేశీయ విమానయాన సంస్థల్లో 10.5 కోట్లమంది ప్రయాణించారు. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో ఈ సంఖ్య 10.06 కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే 4.82 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. సమయపాలన పరంగా ఆగస్టులో ఆకాసా ఎయిర్ 71.2 శాతం కచ్చితత్వంతో విమానాలు నడిపి మొదటిస్థానంలో నిలిచింది. తర్వాత స్థానంలో విస్తారా (68.6 శాతం), ఏఐఎక్స్ కనెక్ట్ (66.8 శాతం), ఇండిగో, ఎయిర్ ఇండియా(66 శాతం), అలయన్స్ ఎయిర్(55.3 శాతం), స్పైస్‌జెట్ (31 శాతం) నిలిచాయి. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై విమానాశ్రయాల నిర్వహణ ఆధారంగా ఆన్‌టైమ్ ఫర్ఫార్మెన్స్ (ఓటీపీ)ను లెక్కించారు.జూన్‌తో పోలిస్తే జులైలో 3.1 శాతం పెరిగిన మార్కెట్ వాటా ఆగస్టులో 2.3 శాతానికి పడిపోయింది. గతనెలలో ఇండిగో 62.4 శాతం, ఎయిర్ ఇండియా 14.7 శాతం, విస్తారా 10.3 శాతం, ఏఐఎక్స్ కనెక్ట్ 4.5 శాతం, ఆకాసా ఎయిర్ 4.4 శాతం, అలయన్స్ ఎయిర్ 0.9 శాతం మార్కెట్ వాటా నమోదు చేశాయి.ఇదీ చదవండి: ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేతవిమాన ప్రయాణాలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం టైర్ 2, 3 నగరాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. దాంతో విమాన ప్రయాణికులు పెరుగుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. దాంతోపాటు విమానయాన కంపెనీల మధ్య పోటీ ఏర్పడి టికెట్ ధరలో రాయితీలు, ఆఫర్లు ప్రకటిస్తుండడంతో ప్యాసింజర్ల సంఖ్య పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
గగనవీధిలో పెరుగుతున్న ప్రయాణికులు.. ఒకే రోజు భారీ రికార్డు..
వేసవికాలం కావడంతో దేశంలోని చాలామంది సమ్మర్ సెలవులు, ఇతర విహారయాత్రలు చేస్తూంటారు. ఈ తరుణంలో ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. దాంతో దేశంలో విమాన ప్రయాణీకుల రద్దీ పెరుగుతోంది. ఒక్కరోజే దాదాపు 5 లక్షల మంది ప్యాసింజర్లు దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయాణించి రికార్డు నెలకొల్పారు. ఆదివారం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల మధ్య నడిచిన 6,128 విమాన సర్వీసుల్లో ఏకంగా 4,71,751 మంది ప్రయాణించినట్టు తేలింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తాజాగా వివరాలు వెల్లడించింది. కరోనాకంటే ముందు విమాన ప్రయాణీకుల సగటు (3,98,579)తో పోల్చితే ఇది 14 శాతం అధికం. గతేడాది ఏప్రిల్ 21న 5,899 విమాన సర్వీసుల్లో 4,28,389 మంది ప్రయాణించారు. ఈ ఏడాది జనవరి-మార్చిలో దేశీయ విమానయాన సంస్థల సర్వీసుల్లో ప్రయాణించినవారు 3.91కోట్లుగా ఉన్నట్టు గత వారం భారతీయ విమానయాన నియంత్రిత సంస్థ డీజీసీఏ తెలిపింది. గత ఏడాది ఇదే వ్యవధిలో ప్యాసింజర్లు 3.75కోట్లుగా ఉన్నారు. దీంతో వార్షిక వృద్ధి 4.38 శాతంగా నమోదైందని తెలిపింది. ఇదీ చదవండి: టాప్ 3 కంపెనీల్లో 64 వేలమందికి లేఆఫ్స్..! ‘ఆర్థికాభివృద్ధి, ప్రభుత్వ విధానాలు, అందుబాటు ధరల్లో విమాన సేవలందించే సంస్థలు విస్తరిస్తున్నాయి. రోజురోజుకూ సరికొత్త స్థాయికి ప్యాసింజర్ల సంఖ్య చేరుతుంది. భవిష్యత్తులో ఇది మరింత పెరుగనుంది’ అని విమానయాన మంత్రిత్వ శాఖ తన అధికారిక ‘ఎక్స్’(ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది. -
ఆకాశవీధిలో 15.4 కోట్ల ప్రయాణికులు
భారత్ నుంచి విదేశాలకు వెళ్లేవారితోపాటు డొమెస్టిక్ విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 2023-24లో అంతకుముందు ఏడాదితోపోలిస్తే 13 శాతం మేర ప్రయాణికుల రద్దీ పెరిగినట్లు ఇక్రా నివేదిక ద్వారా తెలిసింది. దాంతో 2023-24 ఏడాదిలో విమానాల్లో ప్రయాణించినవారి సంఖ్య 15.4 కోట్లకు చేరినట్లు నివేదికలో తెలిపింది. నివేదికలోని వివరాల ప్రకారం..కరోనాకు ముందు విమానాల్లో ఎంతమంది ప్రయాణించేవారో వారి సంఖ్యను తాజా గణాంకాలు అధిగమించాయి. 2019-20లో 14.2 కోట్ల మంది డొమెస్టిక్ విమానాల్లో ప్రయాణించారు. కేవలం 2024 మార్చిలోనే దేశీయ విమానాల్లో 1.35 కోట్ల మంది ప్రయాణించారని అంచనా. ఫిబ్రవరిలో ప్రయాణించిన 1.26 కోట్ల మంది కంటే ఈ సంఖ్య 6.9శాతం అధికం. ఏడాదివారీగా చూసినా 4.9 శాతం పెరిగింది. ఇదీ చదవండి: అలర్ట్.. 48 గంటల్లో యుద్ధం.. భారత వాణిజ్యంపై ప్రభావం ఎంతంటే.. దేశీయ విమానయాన పరిశ్రమకు 2022-23లో నికరంగా రూ.17,000కోట్లు-రూ.17,500 కోట్ల నష్టం వాటిల్లింది. అయితే అది 2023-24, 2024-25లలో రూ.3,000 కోట్లు-రూ.4,000 కోట్లకు పరిమితం కావొచ్చు. ఫిబ్రవరితో ముగిసిన 2023-24 తొలి 11 నెలల్లో దేశీయ విమాన సంస్థల్లో ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ 2.7 కోట్లుగా నమోదైంది. 2022-23 ఇదే సమయంతో పోలిస్తే ఇది 25% అధికంగా ఉంది. -
విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 30 నిమిషాలే టైమ్!
Airlines Baggage : విమాన ప్రయాణికులకు శుభవార్త. ఫ్లైట్ దిగిన తర్వాత బ్యాగేజీకి కోసం ఎయిర్‌పోర్టుల్లో గంటలకొద్దీ ఎదురుచూడాల్సిన దుస్థితి ప్రయాణికులకు తప్పనుంది. విమానాశ్రయాలలో ప్రయాణికులకు వేగంగా బ్యాగేజీ డెలివరీని అందించాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) దేశంలోని ఏడు విమానయాన సంస్థలను ఆదేశించింది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో బ్యాగేజీ రాకపోకలను నెలల తరబడి పర్యవేక్షించిన బీసీఏఎస్ అనుమతించదగిన వెయిటింగ్ టైమ్ మించిపోతుందనే ఆందోళనలను ఉటంకిస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆపరేషన్, మేనేజ్మెంట్ మరియు డెలివరీ అగ్రిమెంట్ ప్రకారం (OMDA) ప్రమాణాల ప్రకారం.. చివరి చెక్-ఇన్ బ్యాగేజీ చేరుకున్న 30 నిమిషాలలోపు డెలివరీ అయ్యేలా చూడాలని ఎయిర్ ఇండియా, ఇండిగో, అకాస, స్పైస్‌జెట్, విస్తారా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కనెక్ట్ , ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలకు బీసీఏఎస్ సూచించింది. ఈ ఆదేశాలు అమలు చేయడానికి విమానయాన సంస్థలకు ఫిబ్రవరి 26 వరకు బీసీఏఎస్ సమయం ఇచ్చింది. బీసీఏఎస్ జనవరిలో ఆరు ప్రధాన విమానాశ్రయాల్లోని బెల్ట్ ప్రాంతాలలో బ్యాగేజీ చేరే సమయాన్ని ట్రాక్ చేయడానికి పర్యవేక్షణ ప్రక్రియను ప్రారంభించింది. పనితీరు మెరుగుపడినప్పటికీ నిర్దేశించిన ప్రమాణాల కంటే ఇది ఇంకా తక్కువగా ఉందని సమీక్ష వెల్లడించింది. ఇంజన్ షట్‌డౌన్ అయిన 10 నిమిషాలలోపు మొదటి బ్యాగ్ బెల్ట్‌కు చేరుకోవాలని, చివరి బ్యాగ్ 30 నిమిషాలలోపు చేరుకోవాలని ఓఎండీఏ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. పర్యవేక్షణ ప్రక్రియ ప్రస్తుతం ఆరు ప్రధాన విమానాశ్రయాలలోనే కేంద్రీకృతమై ఉన్నప్పటికీ బీసీఏఎస్ నిర్వహించే అన్ని విమానాశ్రయాలలో తప్పనిసరి ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని విమానయాన సంస్థలను ఆదేశించింది. -
జూన్‌లో విమానయానం జూమ్..
దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య జూన్‌లో 1.25 కోట్లుగా నమోదైంది. గతేడాది జూన్‌లో నమోదైన 1.05 కోట్లతో పోలిస్తే 19 శాతం పెరిగింది. గో ఫస్ట్ కార్యకలాపాలు నిలి్చపోయిన నేపథ్యంలో ఇండిగో, ఎయిరిండియా, విస్తార, ఎయిర్‌ఏíÙయా ఇండియా, ఆకాశ ఎయిర్ తమ తమ మార్కెట్ వాటాలను పెంచుకున్నాయి. అయితే, స్పైస్‌జెట్ మార్కెట్ వాటా మాత్రం మరింత తగ్గింది. ఈ ఏడాది జనవరిలో ఇది 7.3 శాతంగా ఉండగా జూన్‌లో 4.4 శాతానికి పడిపోయింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 79 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా ఇండిగో.. 63.2 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. టాటా గ్రూప్‌లో భాగమైన ఎయిరిండియా, ఎయిర్‌ఏíÙయా ఇండియా (ప్రస్తుతం ఏఐఎక్స్ కనెక్ట్‌గా పేరు మారింది) విమానాల్లో వరుసగా 12.37 లక్షలు, 10.4 లక్షల మంది ప్రయాణం చేశారు. ఎయిరిండియా మార్కెట్ వాటా 9.7 శాతంగాను, ఎయిర్‌ఏíÙయా ఇండియా వాటా 8 శాతంగాను ఉంది. 10.11 లక్షల మంది ప్రయాణికులతో విస్తార 8.1 శాతం, 6.18 లక్షల ప్యాసింజర్లతో ఆకాశ ఎయిర్ 4.9 శాతం వాటాను దక్కించుకున్నాయి. అటు స్పైస్‌జెట్ 5.55 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. మరోవైపు, సమయ పాలన విషయంలో 88.3 శాతం ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్తో (ఓటీపీ) విస్తార అగ్రస్థానంలో నిల్చింది. ఇండిగో, ఆకాశ ఎయిర్ (చెరి 87.6 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కీలకమైన హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు విమానాశ్రయాల్లో డేటా ఆధారంగా ఓటీపీని లెక్కించారు. -
విమాన ప్రయాణాల జోరు..
ముంబై: గత నెల దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 1.32 కోట్లుగా నమోదైంది. గతేడాది మే నెలలో నమోదైన 1.14 కోట్లతో పోలిస్తే 15 శాతం పెరిగింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గణాంకాల ప్రకారం ఇండిగో మార్కెట్ వాటా ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో 57.5 శాతం నుంచి 61.4 శాతానికి పెరిగింది. మొత్తం 81 లక్షల మందిని ఇండిగో గమ్యస్థానాలకు చేర్చింది. టాటా గ్రూప్ కంపెనీలైన ఎయిరిండియా, ఎయిర్ఏషియా ఇండియా, విస్తారాల మార్కెట్ వాటా వరుసగా 9.4 శాతం, 7.9 శాతం, 9 శాతంగా నిల్చింది. ఎయిరిండియా 12.44 లక్షల మందిని, విస్తారా 11.95 లక్షల మందిని, ఎయిర్ఏషియా ఇండియా 10.41 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. ఈ మూడింటికి కలిపి 26.3 శాతం మార్కెట్ వాటా లభించింది. గతేడాది ఆగస్టులో ప్రారంభమైన ఆకాశ ఎయిర్ మార్కెట్ వాటా ఏప్రిల్‌తో పోలిస్తే 4 శాతం నుంచి 4.8 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దివాలా ప్రక్రియ ఎదుర్కొంటున్న గో ఫస్ట్ సంస్థ మే 3 నుంచి విమాన సర్వీసులు నిలిపివేసింది. సమయపాలన విషయంలో ఆకాశ ఎయిర్ అగ్ర స్థానంలో (92.6 శాతం) నిల్చింది. -
భారీగా పెరిగిన విమాన ప్రయాణికులు.. లాభాల్లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ
న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. నష్టాలను వీడి రూ. 3,400 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2021–22) దాదాపు రూ. 804 కోట్ల నికర నష్టం ప్రకటించగా.. 2020–21లో మరింత అధికంగా రూ. 3,176 కోట్ల నష్టం నమోదైంది. గతేడాది ప్రధానంగా దేశీ విమాన ప్రయాణికులు భారీగా పెరగడంతో కంపెనీ ఆర్థికంగా బలపడింది. వెరసి కరోనా మహమ్మారి బయటపడ్డాక కంపెనీ తిరిగి లాభాల బాట పట్టడం గమనార్హం! కాగా.. ఇవి ప్రొవిజనల్ ఫలితాలు మాత్రమేనని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆడిట్ తదుపరి కంపెనీ తుది పనితీరు వెల్లడికానున్నట్లు తెలియజేశాయి. 2022లో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 47 శాతం జంప్‌చేసి 12.32 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది ఈ సంఖ్య 8.38 కోట్లు మాత్రమే. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో ప్రయాణికుల సంఖ్య 52 శాతం ఎగసి 3.75 కోట్లకు చేరింది. ఇదీ చదవండి: ఈక్విటీలలో భారీ పెట్టుబడులు.. ఇప్పటివరకూ రూ.30,945 కోట్లు -
విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో ‘డిజి యాత్ర’ ప్రారంభం
గన్నవరం: విమాన ప్రయాణికుల బోర్డింగ్ ప్రక్రియను సులభతరం చేసే డిజియాత్ర సేవలు శుక్రవారం నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందుబాటులోకి వచ్చాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సేవలను ప్రారంభించారు. అనంతరం ఆయన డిజియాత్ర సేవలను ఉపయోగించుకుని ఇండిగో విమానంలో తిరుపతికి వెళ్లారు. అంతకుముందు మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. విమానాశ్రయాల్లో ప్రయాణికుల ప్రవేశాలను సులభతరం చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. దీనివల్ల చెక్ ఇన్, బోర్డింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి మాట్లాడుతూ.. గత నెల రోజులుగా దీనిని ప్రయో గాత్మకంగా పరీక్షించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 9,500 మంది ప్రయాణికులు డిజియాత్ర అప్లికేషన్‌ను రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఇది కాగిత రహిత విధానమని.. ఫేషియల్ రికగ్నైజేషన్ ఆధారంగా ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తలశిల రఘురాం, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, ఎయిర్పోర్ట్ జాయింట్ జీఎం సూర్యభగవానులు, టెర్మినల్ మేనేజర్ అంకిత్, ఎయిర్పోర్ట్ ఏసీపీ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. -
విమాన టికెట్ డౌన్‌గ్రేడ్ చేస్తే రీయింబర్స్మెంట్
న్యూఢిల్లీ: ప్రయాణికులు బుక్ చేసుకున్న టికెట్లను ఎయిర్‌లైన్స్ ఏకపక్షంగా డౌన్‌గ్రేడ్ చేస్తుండటంపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ కొత్త నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం టికెట్‌ను డౌన్‌గ్రేడ్ చేస్తే, దేశీ రూట్లలో ప్రయాణాలకు సంబంధించి టికెట్ ఖర్చులో 75 శాతం మొత్తాన్ని ప్యాసింజర్లకు ఎయిర్‌లైన్స్ చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ రూట్ల విషయంలో ప్రయాణ దూరాన్ని బట్టి టికెట్ ఖర్చుల్లో 30–75 శాతం వరకు (పన్నులు సహా) రీయింబర్స్ చేయాలి. ఇవి ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయని డీజీసీఏ సీనియర్ అధికారి బుధవారం తెలిపారు. ప్యాసింజర్లు నిర్దిష్ట తరగతిలో ప్రయాణించేందుకు బుక్ చేసుకున్న టికెట్‌ను విమానయాన సంస్థలు వివిధ కారణాలతో దిగువ తరగతికి డౌన్‌గ్రేడ్ చేస్తున్న ఉదంతాలు ఇటీవల పెరిగిన సంగతి తెలిసిందే. -
విమాన ప్రయాణికులు @ 12.73 కోట్లు
ముంబై: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య డిసెంబర్లో 12.73 కోట్లుగా నమోదైంది. అంతక్రితం డిసెంబర్‌తో పోలిస్తే దాదాపు 14 శాతం వృద్ధి చెందింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గురువారం విడుదల చేసిన నెలవారీ గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2021 డిసెంబర్లో 11.20 కోట్ల మందిని దేశీ ఎయిర్‌లైన్స్ గమ్యస్థానాలకు చేర్చాయి. తాజాగా గత నెలలో ఇండిగో ద్వారా 69.97 లక్షల మంది ప్రయాణించారు. ఎయిరిండియా 11.71 లక్షల ప్యాసింజర్లను, విస్తారా 11.70 లక్షలు, ఎయిర్ఏషియా 9.71 లక్షలు, స్పైస్‌జెట్ 9.64 లక్షలు, గో ఫస్ట్ 9.51 లక్షలు, ఆకాశ ఎయిర్ 2.92 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. మార్కెట్ వాటా పరంగా చూస్తే ఇండిగోకు 55.7 శాతం, ఎయిరిండియాకు 9.1 శాతం, విస్తారాకు 9.2 శాతం, ఎయిర్‌ఏషియాకు 7.6 శాతం, ఆకాశ ఎయిర్‌కు 2.3 శాతం ఉంది. నాలుగు కీలకమైన మెట్రో ఎయిర్‌పోర్టుల్లో సమయ పాలనలో ఇండిగో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. -
ఏవియేషన్ పరిశ్రమ.. వీ షేప్ రికవరీ!
న్యూఢిల్లీ: దేశీ పౌరవిమానయాన పరిశ్రమ వీ ఆకారంలో బలమైన రికవరీ చూస్తోందని (ఎలా పడిపోయిందో, అదే మాదిరి కోలుకోవడం) ఈ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. దేశీ ప్రయాణికుల సంఖ్యలోనూ బలమైన వృద్ధి కనిపిస్తోందంటూ, రానున్న సంవత్సరాల్లోనూ ఇది కొనసాగుతుందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా వరుసగా రెండేళ్లపాటు ఏవియేషన్ పరిశ్రమ గడ్డు పరిస్థితులను చూడడం తెలిసిందే. గతేడాది చివరి నుంచి పుంజుకున్న పరిశ్రమ ఈ ఏడాది బలమైన వృద్ధిని చూస్తుండడం గమనార్హం. రోజువారీ ప్రయాణికుల సంఖ్య 4 లక్షలకు పైనే నమోదవుతోంది. ప్రయాణికుల సంఖ్య ఎంతో ఉత్సాహకరంగా ఉందంటూ, ఈ ఏడాది నవంబర్ నాటికి 111 మిలియన్లకు చేరుకుందని సింధియా వెల్లడించారు. వాయు మార్గంలో ప్రయాణించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారంటూ, అందుకే ఈ స్థాయి గణాంకాలు నమోదవుతున్నట్టు వివరించారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఏవియేషన్ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై ఆయన విపులంగా మాట్లాడారు. పౌర విమానయాన శాఖ గణాంకాల ప్రకారం గత మంగళవారం 2,883 దేశీ సర్వీసుల్లో 4,15,426 మంది ప్రయాణించారు. ‘‘కరోనా ముందు 2019లో సగటు రోజువారీ ప్రయాణికుల సంఖ్య 4.15 లక్షలుగా ఉండగా, గడిచిన రెండు వారాల్లో దీనికి మించి ప్రయాణిస్తుండడం ఎంతో ఆనందాన్నిస్తోంది. డిసెంబర్ 24న 4.35 లక్షల మంది ప్రయాణించారు’’అని మంత్రి పేర్కొన్నారు. కోవిడ్ కేసులు ఆందోళనకరం.. ప్రపంచవ్యాప్తంగా చైనా, దక్షిణకొరియా, జపాన్, యూరప్ దేశాల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళకర విషయమేనని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ‘‘మేము ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. అందుకే ఆరోగ్యశాఖ సూచనలకు అనుగుణంగా భారత్‌కు వచ్చే ప్రయాణికుల్లో 2 శాతం మందికి స్క్రీనింగ్ (పరీక్షలు) నిర్వహిస్తున్నాం. అదృష్టం కొద్దీ ప్రస్తుతం ఎక్కువ కేసులు రావడం లేదు. ఈ విషయంలో కొంత వేచి చూసే ధోరణి అవసరం’’అని చెప్పారు. అంత రద్దీని అంచనా వేయలేదు.. ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో తీవ్ర రద్దీ కారణంగా ప్రయాణికులు ఎన్నో ఇక్కట్లు ఎదుర్కోవడం తెలిసిందే. పండుగల సమయంలో అంత రద్దీని తాము అంచనా వేయలేదని సింధియా చెప్పారు. ‘‘నిజానికి ఇది విమానాశ్రయాల బాధ్యత. డిమాండ్‌కు అనుగుణంగా ప్రయాణికులకు ఎలాంటి అవాంతరాల్లేని ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత వాటిపై ఉంది. రద్దీ వేళల్లో విమానాశ్రయాల సామర్థ్యానికి అనుగుణంగా ట్రాఫిక్‌ను కట్టడి చేయడం, సామర్థ్యాన్ని విస్తరించడం దీనికి పరిష్కారం’’అని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ఢిల్లీ విమానాశ్రయంతోపాటు, పలు ఇతర విమానాశ్రయాల్లో రద్దీపై పౌర విమానయాన శాఖకు భారీగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పౌర విమానయాన శాఖ పలు దిద్దుబాటు చర్యలకు దిగడం గమనార్హం. ఇప్పుడు ఢిల్లీ విమానాశ్రయంలో రద్దీ వేళల్లో ట్రాఫిక్‌ను నియంత్రించామని, మరిన్ని గేట్లు తెరిచామని మంత్రి చెప్పారు. ముంబై, బెంగళూరు విమానాశ్రయాల్లోనూ ఇదే తరహా చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇక అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ 2019తో పోలిస్తే 20–25 శాతం తక్కువగా ఉన్నట్టు తెలిపారు. -
విశాఖపట్నం ఎయిర్‌పోర్టు.. ప్రయాణికుల రద్దీతో కళకళ
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి అధికమవుతోంది. ఈ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే వారి సంఖ్య ఊపందుకుంటోంది. కోవిడ్ ప్రభావం నుంచి కోలుకుని మళ్లీ పూర్వపు స్థితికి చేరుకుంటోంది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈనెల 17న ఈ విమానాశ్రయం తొమ్మిది వేల మంది ప్రయాణికుల మైలు రాయిని అధిగమించింది. 2020 మార్చి నుంచి కోవిడ్ తొలి, మలి విడతలో తీవ్ర ప్రతాపం చూపింది. దీంతో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. కోవిడ్ ఉధృతి తగ్గిన తర్వాత కూడా మునుపటి స్థాయిలో ప్రయాణికులు రాకపోకలు చేయడం లేదు. అందుకనుగుణంగా విమానయాన సంస్థలు కూడా తమ సర్వీసులను కుదించుకున్నాయి. కొన్ని నెలల నుంచి కోవిడ్ ప్రభావం తగ్గి, సాధారణ స్థాయికి వచ్చింది. దీంతో దాదాపు రెండున్నరేళ్ల అనంతరం ఈ విమానాశ్రయం ప్రయాణికుల రద్దీతో కళకళలాడుతోంది. నవంబర్ వరకు వీరి సంఖ్య రోజుకు 6,000–7,000 వరకు ఉండగా డిసెంబరు నుంచి అది మరింత పెరుగుతూ వస్తోంది. ఈ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే చాలా విమానాలు కొన్నాళ్ల నుంచి నూరు శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఇలా ఈనెల ఆరంభం నుంచి రోజుకు 7000–9000 మంది ప్రయాణికుల సంఖ్య నమోదవుతోంది. శనివారం 9,183 మంది ఈ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించారు. వీరిలో దేశీయ ప్రయాణికులు 8,838 మంది, అంతర్జాతీయ ప్రయాణికులు 345 మంది ఉన్నారు. గత ఏడాది డిసెంబర్లో ఇదే సమయానికి ఒకే రోజు గరిష్టంగా ఎనిమిది వేల మంది ప్రయాణించారు. ఈ విమానాశ్రయం నుంచి సగటున రోజుకు 56 విమాన సర్వీసులు (రానుపోను) రాకపోకలు సాగిస్తున్నాయి. కోవిడ్ రెండో దశ తర్వాత ఈ విమానాశ్రయం నుంచి గత డిసెంబర్ నెల మొత్తమ్మీద 2.5 లక్షల మంది వెళ్లి వచ్చారు. అయితే 2022 జనవరి నుంచి ఒమిక్రాన్ బెడదతో మార్చి వరకు విమాన ప్రయాణాలు నెలకు సగటున ఆరేడు వేలతో రెండు లక్షలలోపే నమోదయ్యాయి. కోవిడ్‌కు ముందు ఇలా.. కోవిడ్‌కు ముందు 2018–19లో ఈ విమానాశ్రయం నుంచి 28 లక్షల మంది, 2019–20లో 27 లక్షల మంది, 2020–21లో 16 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు జరిపారు. ఈ ఏడాది వీరి సంఖ్య 23 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల తాకిడి కోవిడ్‌కు ముందు నాటి పరిస్థితికి వస్తుందని భావిస్తున్నట్టు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ కె.శ్రీనివాసరావు ‘సాక్షి’కి చెప్పారు. దేశ, విదేశాల నుంచి విశాఖకు ఈ శీతాకాలం సీజనులో పర్యాటకులు అధికంగా వస్తుండడం, కోవిడ్ తీవ్రత తగ్గడం విమాన ప్రయాణికుల తాకిడి పెరగడానికి దోహదపడుతోందని ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డీఎస్ వర్మ ‘సాక్షి’కి తెలిపారు. (క్లిక్ చేయండి: సాధారణ చార్జీలతోనే సంక్రాంతి బస్సులు) -
ఈ ప్రయాణం నరకప్రాయం!
ప్రయాణమంటే... సుఖవంతంగా సాగాలని కోరుకుంటాం. సుఖంగా, సౌకర్యంగా, సత్వరంగా, సకాలంలో చేరడం కోసమే విమాన ప్రయాణాలను ఎంచుకుంటాం. కానీ, మన దేశంలో ఇప్పుడు అవి నరకప్రాయంగా మారుతున్నాయా? కొండవీటి చేంతాడంత క్యూలు... బోర్డింగ్ కోసం గంటల కొద్దీ నిరీక్షణ... చీకాకుపరిచేటన్ని చెకింగ్లు... నిలిచే జాగా లేని రద్దీ... ఎటుచూసినా లగేజ్... ట్రాలీల కొరత... విమానాల జాప్యం... ఇదీ ఇప్పుడు పరిస్థితి. రోజూ 1200 విమానాలతో, ఏటా 6.9 కోట్ల ప్రయాణికులతో దేశంలోకెల్లా బిజీగా ఉండే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత వారంగా ఇవే దృశ్యాలు. ఎయిర్పోర్ట్ కాస్తా చేపల బజారులా తయారైందంటూ ఫోటోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. సాక్షాత్తూ పౌర విమానయాన మంత్రి సోమవారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకొని, రద్దీ నివారణ చర్యలపై చర్చించాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా విమానాశ్రాయాల్లోని లోటుపాట్లపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ప్రస్తుతం గంటలో గమ్యం చేరే దేశీయ విమాన ప్రయాణికులు సైతం గడువు కన్నా కనీసం మూడున్నర గంటల ముందే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో రిపోర్ట్ చేయాల్సిన దుఃస్థితి. వేరే లగేజ్ లేకుండా, 7 కిలోల హ్యాండ్ బ్యాగేజీ ఒక్కటే తెచ్చుకొమ్మని ఇండిగో లాంటి విమానయాన సంస్థలు సూచి స్తున్న పరిస్థితి. దేశంలోకెల్లా అతి పెద్దదైన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో టీ1, టీ2, టీ3 అని మూడు టెర్మినల్స్ ఉన్నాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు కొన్ని దేశీయ సర్వీసులూ టీ3 నుంచే నడు స్తుంటాయి. తాజా పరిణామాలతో రద్దీ ఎక్కువగా ఉండే కీలక సమయాలైన ఉదయం, సాయంత్ర వేళల్లో విమానాల సంఖ్యను తగ్గించాలనే యోచన చేస్తున్నారు. కొన్ని సర్వీసులను టీ3 నుంచి ఇతర టెర్మినల్స్‌కు మార్చాలని భావిస్తున్నారు. అయితే, ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలే. పది రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామంటున్న మంత్రివర్యులు దృష్టి పెట్టాల్సింది శాశ్వత పరిష్కారాలపైన! ఒక్క ఢిల్లీలోనే కాదు... పుణే, ముంబయ్, బెంగళూరుల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. హైదరాబాద్‌లో సైతం మొన్నటిదాకా వేర్వేరుగా ఉన్న జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికుల నిష్క్రమణ మార్గాన్ని ఇటీవల టెర్నినల్ విస్తరణ కోసమంటూ ఒకేచోటకు మార్చారు. అలా ఒకేచోట జనం కేంద్రీకృతమై, ఒత్తిడి పెరిగినట్లు వార్త. ప్రపంచీకరణతో పెరుగుతున్న రద్దీకి తగ్గట్టు కొన్నేళ్ళుగా దేశంలో పలు విమానాశ్రయాల ఆధునికీకరణ సాగింది. తీరా ఢిల్లీ వ్యవహారంతో అవన్నీ భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు జరగలేదని అనుమానం కలుగుతోంది. కొత్తగా గోవాలో మోపా వద్ద కట్టిన ఎయిర్ పోర్ట్ యాత్రిక సామర్థ్యం 44 లక్షలే. అది ఇప్పటికే ఉన్న డాబోలిమ్ ఎయిర్పోర్ట్ కన్నా తక్కువ సత్తా కావడం విడ్డూరం. అనేక దేశాల్లో కోవిడ్ నిర్బంధాలు ఎత్తివేసేసరికి దేశీయంగా, అంతర్జాతీయంగా కసికొద్దీ ప్రయాణాలు చేయడం పెరిగింది. ఇబ్బడిముబ్బడైన ఈ జనంతో ఎయిర్‌పోర్టుల్లో, ఎయిర్‌లైన్స్‌లో ఇప్పుడున్న వసతులపై ఒత్తిడి అధికమైంది. గత ఆదివారం ఒక్క ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచే 4.27 లక్షల మందికి పైగా ప్రయాణించారనేది పరిస్థితికి చిరు సూచన. కోవిడ్ నిబంధనలు ఎత్తేశాక ఈ ఏడాది జూలైలో యూరప్‌లోని పలు విమానాశ్రయాల్లో ఇలాంటి గందరగోళమే నెలకొంది. లండన్‌లోని ప్రసిద్ధ హీత్రూ విమానాశ్రయంలోనూ ఇదే కథ. కరోనా కాలంలో విస్తరణ ప్రణాళిక లకు బ్రేకులు పడ్డ విమానాశ్రయాలు ఇప్పుడు మళ్ళీ ఆ పనులను పట్టాలెక్కించాల్సి ఉంది. ప్రయాణికుల చెకింగ్ పద్ధతి ప్రకారం సాగకపోవడం, విమానాశ్రయ అధికారుల్లో అలసత్వం లాంటి కారణాలతో ఢిల్లీలో గందరగోళం నెలకొంది. ఎయిర్‌లైన్స్ చెక్–ఇన్ కౌంటర్లలో సిబ్బంది లేకపోవడం, ఉన్నా అరకొరగా ఉండడం రద్దీకి దారి తీస్తోంది. సెక్యూరిటీ చెక్ చేయాల్సిన నిపుణు లైన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బంది కూడా తక్కువున్నారు. సీఐఎస్ఎఫ్ ఉద్యోగాలను 3 వేలకు పైగా రద్దు చేసి, వాటి స్థానంలో అనుభవం లేని 2 వేల కన్నా తక్కువ ప్రైవేట్ భద్రతా సిబ్బందిని పెట్టడం లాంటి స్వీయ తప్పిదాలు సవాలక్ష. వీటిని తక్షణం సరిదిద్దాలి. బ్యాగేజ్, బిల్లింగ్ నుంచి బోర్డింగ్ దాకా అన్నిటా 5జి సహా ఆధునిక సాంకేతికతను ఆశ్రయించడం ఓ మార్గం. అంతర్జాతీయ ప్రయాణం చేసి వస్తున్నవారి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ ఇప్పటికీ గంటన్నర నుంచి రెండు గంటలు పడుతోంది. ప్రస్తుతానికి విమానంలోనే వివరాలు నింపే పద్ధతి పెడతా మంటున్నా, డిజిటలీకరణ మంచి పరిష్కారం. సంవత్సరాంతపు సెలవులు, పండగలతో రానున్నది ప్రయాణాల కాలం. దాంతో, రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు కావాల్సింది సరైన వ్యూహరచన, ప్రణాళికాబద్ధంగా ప్రాథమిక వసతులు. కౌంటర్లనూ, సిబ్బందినీ పెంచాలి. స్మార్ట్ సిటీల్లా స్మార్ట్ ఎయిర్‌పోర్ట్‌లు కావాలి. ప్రపంచశ్రేణి టెర్మినల్స్ ఏర్పాటు చేయాలి. ఇప్పటికైనా ఢిల్లీ, హైదరాబాద్, ముంబయ్ – ఇలా ఊరికో రకం కాక అన్నిచోట్లా ఒకే ప్రామాణిక సెక్యూరిటీ ప్రోటోకాల్ తేవాలి. ముఖం చూసి గుర్తించే బయోమెట్రిక్ పద్ధతే అదే బోర్డింగ్ పాస్‌గా ‘డిజి యాత్ర’ విధానాన్ని ఇటీవలే 3 ఎయిర్‌పోర్టుల్లో తెచ్చారు. మొక్కుబడిగా కాక దాన్ని అన్నిచోట్లా విస్తరించడం, అవగాహన పెంచడం అవసరం. ప్రపంచంలోని 10 రద్దీ విమానాశ్రయాల్లో ఢిల్లీ, ముంబయ్ చేరనున్న వేళ ఇలాంటి క్షేత్రస్థాయి అంశాలపై శ్రద్ధ కీలకం. అలసత్వం వహిస్తే, పదేపదే ఢిల్లీ కథే! -
కోవిడ్ పూర్వ స్థాయికి అంతర్జాతీయ ప్రయాణికులు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ నుంచి విదేశీ రూట్లలో రాకపోకలు సాగించే అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య ఇది కోవిడ్ పూర్వ స్థాయిలో 96–97 శాతం స్థాయికి చేరవచ్చని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. 2022–23లో ఇది 32.9 కోట్లు – 33.2 కోట్ల స్థాయిలో ఉండవచ్చని పేర్కొంది. 2024 మార్చి ఆఖరు నాటికి అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ .. కోవిడ్ ముందు స్థాయిని దాటేయొచ్చని వివరించింది. కోవిడ్–19పరమైన ఆంక్షల నేపథ్యంలో దాదాపు రెండేళ్ల తర్వాత ఈ ఏడాది మార్చి 27 నుంచి అంతర్జాతీయ రూట్లలో పూర్తి స్థాయి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇక్రా అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మూడు నెలలుగా అప్.. అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సంఖ్య గత మూడు నెలలుగా క్రమంగా పెరుగుతోంది. జూన్ నెలలో కోవిడ్ పూర్వ స్థాయిలో 79 శాతానికి చేరింది. మొత్తం (దేశీ, అంతర్జాతీయ) విమాన ప్యాసింజర్ల సంఖ్య.. కోవిడ్ ముందు స్థాయిలో 88 శాతానికి పెరిగిందని ఇక్రా సీనియర్ అనలిస్ట్ అభిషేక్ లాహోటి తెలిపారు. పలు కీలక దేశాల్లో విమాన సేవలు తిరిగి ప్రారంభం కావడం, ప్రయాణాలపై ఆంక్షల తొలగింపు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు పూర్తి సామర్థ్యాలతో పనిచేస్తుండటం తదితర అంశాలు అంతర్జాతీయ ప్యాసింజర్ల ట్రాఫిక్ పెరగడానికి దోహదపడుతోందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, మే నెలతో పోలిస్తే జూన్‌లో దేశీయంగా విమాన ప్రయాణికుల రద్దీ కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే 98 శాతం నుంచి 91 శాతానికి తగ్గింది. వేసవి సెలవులు ముగియడం, పాఠశాలలు తెరుచుకోవడం, విహారయాత్రలు తగ్గడం వంటి అంశాలు ఇందుకు కారణమని లాహోటి వివరించారు. -
దేశీ విమానయానం 59% అప్..
ముంబై: గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 59 శాతం పెరిగి 8.4 కోట్లకు చేరి ఉంటుందని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. తాము ముందుగా అంచనా వేసిన 8–8.2 కోట్లతో పోలిస్తే ఇది కొంత ఎక్కువే అయినా.. కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే దాదాపు 40 శాతం తక్కువని సంస్థ వైస్ ప్రెసిడెంట్ సుప్రియో బెనర్జీ తెలిపారు. భౌగోళిక–రాజకీయ సమస్యలతో ఆకాశాన్నంటుతున్న విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలు సమీప కాలంలోనూ ఏవియేషన్ పరిశ్రమకు సవాలుగా కొనసాగే అవకాశం ఉందన్నారు. పరిశ్రమ లాభదాయకతను నిర్దేశించే అంశాల్లో ఇవి కీలకంగా ఉంటాయని బెనర్జీ పేర్కొన్నారు. ఇక్రా నివేదిక ప్రకారం.. మహమ్మారి ప్రభావాలు తగ్గుముఖం పడుతూ.. విమానయానం పుంజుకుంటున్న నేపథ్యంలో సీక్వెన్షియల్ ప్రాతిపదికన మార్చిలో ప్రయాణికుల సంఖ్య 37 శాతం పెరిగి 1.06 కోట్లుగా నమోదైంది. ఫిబ్రవరిలో ఇది 77 లక్షలుగా ఉంది. గతేడాది మార్చితో (78 లక్షలు) పోలిస్తే 35 శాతం వృద్ధి చెందింది. ఫ్లయిట్లు 12 శాతం వృద్ధి.. గతేడాది మార్చితో పోలిస్తే ఫ్లయిట్ల సంఖ్య 12 శాతం పెరిగి 71,548 నుంచి 80,217కి చేరిందని ఇక్రా తెలిపింది. ఫిబ్రవరితో పోలిస్తే సర్వీసులు 42 శాతం పెరిగాయి. కోవిడ్–19 థర్డ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం పట్టడం, టీకాల ప్రక్రియ వేగం పుంజుకోవడం, ప్రయాణాలపై ఆంక్షలను ఎత్తివేస్తుండటం వంటి అంశాలు ఇందుకు దోహదపడినట్లు ఇక్రా వివరించింది. ఒక్కో ఫ్లయిట్లో ప్రయాణికుల సంఖ్య ఫిబ్రవరిలో సగటున 135గా ఉండగా మార్చిలో 132గా నమోదైంది. దాదాపు రెండేళ్ల అంతరాయం తర్వాత మార్చి 27 నుండి అంతర్జాతీయ విమానయాన సర్వీసులు ప్రారంభం కావడం ఏవియేషన్ రంగానికి సానుకూలాంశమని ఇక్రా పేర్కొంది. రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా తలెత్తిన భౌగోళిక–రాజకీయ సమస్యలు, క్రూడాయిల్ రేట్ల పెరుగుదల వంటి అంశాలతో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏటీఎఫ్ ధరలు 93 శాతం ఎగిసినట్లు వివరించింది. ఏవియేషన్ రంగానికి ఏటీఎఫ్ ధరలపరమైన సవాళ్లు కొనసాగుతాయని, 2023 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయాలపై ఇవి తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఇక్రా తెలిపింది. -
7 శాతం పెరిగిన విమాన ప్రయాణికులు
న్యూఢిల్లీ: ఒకవైపు కరోనా మహమ్మారి కోరలు చాచినా కానీ, మరోవైపు దేశీయంగా విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య 2021 డిసెంబర్లో 6.7 శాతం పెరిగింది. మొత్తం 1.12 కోట్ల మంది దేశీయంగా విమాన ప్రయాణం చేసినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. మొత్తం మీద 2021లో దేశీయ విమాన సర్వీసుల్లో 8.38 కోట్ల మంది ప్రయాణించారు. 2020లో 6.3 కోట్ల మందితో పోలిస్తే 33 శాతం పెరిగింది. కరోనా మహమ్మారి విమానయాన రంగంపై ఎక్కువ ప్రభావం చూపించడం తెలిసిందే. ఇండిగో వాటా 55 శాతం ► ఇండిగో విమానాల్లో 2021 డిసెంబర్లో 61.41 లక్షల మంది ప్రయాణించారు. మొత్తం ప్రయాణికుల్లో 54.8 శాతం ఇండిగోను ఎంచుకున్నారు. ► గోఫస్ట్ (గతంలో గోఎయిర్) విమానాల్లో 11.93 లక్షల మంది ప్రయాణించారు. ► స్పైస్‌జెట్ విమాన సర్వీసులను 11.51 లక్షల మంది వినియోగించుకున్నారు. సాధారణంగా రెండో స్థానంలో ఉండే స్పైస్‌జెట్ మూడో స్థానానికి పడిపోయింది. ► ఎయిర్ ఇండియా విమానాల్లో 9.89 లక్షల మంది, విస్తారా విమాన సర్వీసుల్లో 8.61 లక్షల మంది, ఎయిరేషియా విమానాల్లో 7.01 లక్షల మంది, అలియన్స్ ఎయిర్ సర్వీసుల్లో 1.25 లక్షల మంది చొప్పున ప్రయాణించారు. ► ఆక్యుపెన్సీ రేషియో లేదా లోడ్ ఫ్యాక్టర్ (సీట్ల భర్తీ)లో స్పైస్‌జెట్ మెరుగ్గా 86 శాతాన్ని డిసెంబర్లో నమోదు చేసింది. ఆ తర్వాత ఇండిగో 80.2%, విస్తారా 78.1%, గోఫస్ట్ 79%, ఎయిర్ ఇండియా 78.2 శాతం, ఎయిరేషియా 74.2% చొప్పున ఆక్యుపెన్సీ రేషియోను సాధించాయి. ► బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై నగరాల నుంచి సకాలంలో సర్వీసులు నడిపించడంలో ఇండిగో 83.5 శాతంతో మొదటి స్థానంలో ఉంది. ► గోఫస్ట్ 83 శాతం, విస్తారా 81.5 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
అంతర్జాతీయ ప్రయాణికులకు అలర్ట్..
సాక్షి, హైదరాబద్: అంతర్జాతీయ ప్రయాణాలు చేసే ముందు ప్రయాణికులు ఒకసారి తమ పాస్‌పోర్టును పరిశీలించుకోవాలని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే సమయానికి 6 నెలల లోపు పాస్‌పోర్టు గడువు ముగిసిపోతున్నట్లయితే దాన్ని పునరుద్ధరించుకోవాలని ఆయన సూచించారు. మైనర్ పాస్‌పోర్టులు 5 ఏళ్ల గడువుకే అందిస్తామని తల్లిదండ్రులతో పాటు మైనర్లు ప్రయాణం చేస్తున్నట్లయితే వారి పాస్‌పోర్టులు ఒక సారి చూసుకోవాలని తెలిపారు. ఎక్కువ ప్రయాణాలు చేసే వారు జంబో పాస్‌పోర్టు ఎంచుకోవాలన్నారు. పాస్‌పోర్టు అపాయింట్మెంట్ను 3సార్లు రీ షెడ్యూల్ చేసుకోవచ్చని, అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఫిర్యాదుల కోసం 1800258 1800,040–277715333,040–27715115 నెంబర్లకు ఫోన్ చేయవచ్చన్నారు. చదవండి: పాస్‌పోర్ట్ కవర్ ఆర్డర్ చేస్తే ఏకంగా పాస్‌పోర్టే వచ్చింది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఇదే! -
ప్రయాణికులకు ఊరట.. ఆర్టీపీసీఆర్ @రూ. 750
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కోవిడ్ పరీక్షల ధరలు తగ్గాయి. కొద్ది రోజులుగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో పరీక్షల సంఖ్య పెరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మ్యాప్ మై జినోమ్ సంస్థ ఎయిర్‌పోర్టులో కోవిడ్ పరీక్షల ధరలను తగ్గించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ ధర గతంలో రూ.4,500 ఉంటే ఇప్పుడు రూ.3,900కు తగ్గించారు. సాధారణ ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం ఇప్పటి వరకు రూ.999 ఉండగా తాజాగా రూ.750కి తగ్గించారు. ఎయిర్‌పోర్టులో చార్జీలపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వ ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. నగరంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు కేవలం రూ.500 ఉన్న విషయాన్ని అధికారులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. దీంతో ఎయిర్‌పోర్టులో పరీక్షలు నిర్వహిస్తున్న మ్యాప్ మై జినోమ్ సంస్థ ధరలను తగ్గించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ.. ►కొద్ది రోజులుగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. వివిధ దేశాల నుంచి ప్రతి రోజు సుమారు 5వేల మంది ప్రయాణికులు నగరానికి చేరుకుంటున్న ట్లు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం యూరప్ దేశాలు, న్యూజిలాండ్, సింగపూర్, తదితర 11 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రం ఆర్టీపీసీఆర్ పరీక్షలను తప్పనిసరి చేసింది. ►ఈ 11 దేశాల నుంచి ప్రతి రోజు వచ్చే సుమారు 500 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నా రు. ఆయా దేశాల నుంచి బయలుదేరే సమయంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసుకొన్నప్పటికీ ఎయిర్‌పోర్టులో మ రోసారి పరీక్షించి నెగెటివ్ వచి్చన వారిని ఇళ్లకు అనుమతినిస్తున్న సంగతి తెలిసిందే. సమర్థంగా పరీక్షలు... ►ఐసీఎంఆర్ ఆమోదించిన మ్యాప్ మై జినోమ్ సంస్థ గతేడాది నవంబరు నుంచి ఎయిర్‌పోర్టు లో ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్, ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహిస్తోంది. నమూనాలు సేకరించిన అర్ధ గంట వ్యవధిలోనే ఫలితాలను తెలుసుకొనేందుకు ర్యాపిడ్ ఆరీ్టపీసీఆర్ దోహదం చేస్తోంది. ►ఆర్టీపీసీఆర్ పరీక్షలో మాత్రం కొంత సమయం పట్టవచ్చు. సుమారు 200 మంది టెక్నీషియన్లు మ్యాప్ మై జినోమ్ లేబొరేటరీలో నిరంతరం విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు, బెంగళూర్ తదితర విమానాశ్రయాల్లోనూ మ్యాప్ మై జినోమ్ సేవలందజేస్తోంది. -
విమాన ప్రయాణికులు పెరుగుతున్నారు...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆగస్ట్‌లో 66 లక్షల మంది విమాన ప్రయాణం చేశారు. జూలైతో పోలిస్తే ఈ సంఖ్య 31 శాతం అధికమని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ‘ప్రయాణికుల సంఖ్య పరిమితి అధికమవడం, మహమ్మారి తగ్గుముఖం పట్టడం ఈ పెరుగుదలకు కారణం. జూలైలో దేశీయంగా 51 లక్షల మంది వివిధ నగరాలను చుట్టి వచ్చారు. 2020 ఆగస్ట్‌తో పోలిస్తే గత నెలలో ప్రయాణికుల సంఖ్య 131 శాతం అధికమైంది. గతేడాది ఈ కాలంలో 28.3 లక్షల మంది ప్రయాణం చేశా రు. ఆగస్ట్‌లో కోలుకోవడం జరిగినప్పటికీ సె కండ్ వేవ్ కారణంగా డిమాండ్‌పై ఒత్తిడి కొనసాగుతోంది. కస్టమర్లు అవసరమైతే మాత్రమే ప్రయాణిస్తున్నారు’ అని ఇక్రా తెలిపింది. అధికమైన సరీ్వసులు.. దేశవ్యాప్తంగా 2021 ఆగస్ట్‌లో 57,500 విమాన సరీ్వసులు నడిచాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 28,834 మాత్రమే. ఈ ఏడాది జూలైతో పోలిస్తే గత నెలలో 22 శాతం పెరుగుదల. ఆగస్ట్‌లో సగటున 1,900 సరీ్వసులు నమోదయ్యాయి. 2020 ఆగస్ట్‌లో ఇది 900 మాత్రమే. 2021 జూలైలో ఈ సంఖ్య 1,500 ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సగటున రోజుకు 2,000 సరీ్వసులు నడవడం గమనార్హం. ఆగస్ట్‌లో ఒక్కో విమానంలో సగటున 114 మంది ప్రయాణించారు. జూలైలో ఈ సంఖ్య 106 ఉంది. ఇక విమాన టికెట్ల ధరలను ఆగస్ట్ 12–31 మధ్య 10–13 శాతం పెంచేందుకు పౌర విమానయాన శాఖ అనుమతిచి్చంది’ అని ఇక్రా వివరించింది. -
విమానం ఎక్కాలంటే ‘యాంటిజెన్’ మస్ట్
సాక్షి, హైదరాబాద్: ఇకపై విమాన ప్రయాణం చేయాలంటే యాంటిజెన్ పరీక్ష తప్పనిసరి. కరోనా లక్షణాలు లేనివారినే విమానంలోకి అనుమతిం చాలని భావిస్తున్న పౌర విమానయాన సంస్థ ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిసింది. ఒకవేళ అందు లో పాజిటివ్‌గా తేలితే ప్రయాణాలను రద్దు చేసేలా ఆంక్షలు విధించేటట్లు ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం. లాక్డౌన్ తర్వాత అంతర్జాతీయ ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ తప్పనిసరి చేసినట్లుగానే దేశీయ ప్రయాణాల్లో ‘యాంటిజెన్ ’ను తప్పనిసరి చేయాలని భావిస్తున్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. సెకండ్ వేవ్ ఉధృతి దృష్ట్యా ఇప్పటికే వందల విమానాలు రద్దయ్యాయి. కొందరు ప్రయాణికులు స్వచ్ఛందంగానే తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న లాక్డౌన్ నిబంధనలు, కర్ఫ్యూల వంటి వాటితో కూడా రాకపోక లు స్తంభించాయి. ఈ క్రమంలోనే విమానం బయలుదేరడానికి ముందు యాంటిజెన్ పరీక్ష చేసుకుంటే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ‘మ్యాప్ మై జీనోమ్’ ల్యాబొరేటరీలో పరీక్షలు నిర్వహించనున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ వంటివి అమలు చేస్తున్నట్లుగానే ఇక నుంచి ‘యాంటిజెన్ ’కూడా తప్పనిసరి చేయనున్నారు. విదేశీ ప్రయాణాలకు మాత్రం 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకోవాలనే నిబంధన ఉంది. ప్రామాణికమైన ల్యాబొరేటరీల్లో చేసే పరీక్షలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. 200 విమానాలు రద్దు... కోవిడ్ సెకండ్ వేవ్‌తో విమానాల రాకపోకలు స్తం భించాయి. హైదరాబాద్ నుంచి వివిధ నగరాలకు రాకపోకలు సాగించే విమానాలు ప్రయాణికులు లేక వెలవెలబోతున్నాయి. రోజుకు 30 నుంచి 40 విమానాల వరకు రద్దవుతున్నట్లు అధికారులు తెలిపారు. వారంలో సుమారు 200లకు పైగా డొమెస్టిక్ విమానాలు రద్దయ్యాయి. సెకండ్ వేవ్‌కు ముందు దేశవ్యాప్తంగా 70 నగరాలకు హైద రాబాద్ నుంచి ప్రతి రోజు 330 విమానాలు రాకపోకలు సాగించేవి. ఇప్పుడు వీటి సంఖ్య 250కి తగ్గింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో నెలకు లక్ష మంది ప్రయాణించారు. మార్చి నుంచి క్రమంగా రద్దీ తగ్గుతూ.. ఏప్రిల్‌లో బాగా పడిపోయింది. గత నెల 40 నుంచి 50 వేల మంది ప్రయాణించి ఉండవచ్చునని అంచనా. మే నెల ఆరంభం నుంచి రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు సైతం ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. తప్పనిసరిగా వెళ్లవలసిన వాళ్లు ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపారాల దృష్ట్యా రాకపోకలు సాగించేవాళ్లే ఎక్కువగా ఉన్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ‘సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టి, వివిధ రాష్ట్రాల్లో ఆంక్షలను సడలిస్తే రాకపోకలు తిరిగి సాధారణ స్థాయికి చేరుకోవచ్చు. కానీ, ప్రయాణికుల భద్రత దృష్ట్యా యాంటిజెన్ టెస్ట్ తప్పనిసరిగా ఉంటుంది’ అని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. చదవండి: కరోనా: ఐవర్‌మెక్టిన్‌తో తగ్గుతున్న మరణాల ముప్పు! -
ఫ్లైట్ దిగారు.. పత్తా లేరు
సాక్షి, బనశంకరి: బ్రిటన్‌లో కొత్త రకం కరోనా గుబులు నెలకొన్న తరుణంలో ఆ దేశంతో పాటు విదేశాల నుంచి బెంగళూరుకు చేరుకున్నవారిలో చాలా మంది అడ్రస్ లేరు. కరోనా పర్యవేక్షణ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బ్రిటన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన 1,614 మందిలో 26 మందికి కరోనా పాజిటివ్ అని వెల్లడైందని వైద్య ఆరోగ్య మంత్రి సుధాకర్ తెలిపారు. ఆయన సోమవారం విధానసౌధలో విలేకరులతో మాట్లాడారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారికి నిమ్హాన్స్లో ఆరోగ్య పరీక్షలను నిర్వహించి కేంద్రానికి నివేదిక పంపించామన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ప్రభుత్వ ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నామని, వీరిలో కరోనా స్ట్రెయిన్ తరహా కొత్తరకం లక్షణాలు కనబడలేదని, ఎవరూ హోం క్వారంటైన్లో లేరని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో చాలామంది ఆచూకీ లభించలేదని, అందులో బ్రిటన్ నుంచి వచ్చినవారు ఉన్నారని, చాలామంది మొబైల్ స్విచ్చాఫ్ చేసుకున్నారని, వారి ఆచూకీ కనిపెడుతున్నామని తెలిపారు. పోలీసుల సహాయంతో వారి జాడను కనిపెట్టడానికి హోంమంత్రి బొమ్మైతో చర్చించామని, రెండురోజుల్లోగా వారి ఆచూకీ కనిపెడతామన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన నివేదికలను ఐసీఎంఆర్ పరీక్షించి వైరస్ రకంపై ప్రకటన చేస్తుందన్నారు. కొత్త ఏడాదిని నిరాడంబరంగా ఆచరించాలని విజ్ఞప్తి చేశారు. మంగళూరు వచ్చిన కేరళ విద్యార్థులకు కోవిడ్ తీర నగరంలో కోవిడ్ కలకలం చెలరేగింది. కేరళ నుంచి మంగళూరుకు వచ్చిన 15 నర్సింగ్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. జనవరి 1 నుంచి మంగళూరులో కాలేజీలు ప్రారంభం అవుతుండడంతో కేరళ నుంచి వచ్చిన 613 విద్యార్థులు మంగళూరు సిటి నర్సింగ్, రుక్మిణి శెట్టి నర్సింగ్ కాలేజీలకు చేరుకున్నారు. ఆరోగ్య శాఖ సిబ్బంది టెస్టులు చేయగా వీరిలో 15 మందికి పాజిటివ్ అని తెలిసింది. 613 మందిలో 200 మందికి మాత్రమే కరోనా టెస్ట్‌లు చేశారు. మిగతావారికీ కూడా జరిపితే మరిన్ని పాజిటివ్‌లు వచ్చే అవకాశముందని భయపడుతున్నారు. 15 మంది బాధితులకు హాస్టల్లో ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. వీరికి వచ్చింది మామూలు కోవిడా, లేక స్ట్రెయిన్ రకమా అనేది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోవిడ్ మార్గదర్శకాలను పాటించలేదని ఈ రెండు నర్సింగ్ కాలేజీలకు ప్రభుత్వం షోకాజ్ నోటీస్‌లు జారీచేసింది. -
తగ్గిన విమాన ప్రయాణికుల సంఖ్య
న్యూఢిల్లీ: దేశీయ విమానయాన రంగంపై కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. దేశీయంగా ఈ సెప్టెంబర్‌లో మొత్తం 39.43 లక్షల మంది విమాన ప్రయాణం చేశారు. గతేడాది ఇదే నెలలో పోలిస్తే ఇది 66 శాతం తక్కువని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. అయితే జూలై, ఆగస్ట్లతో పోలిస్తే సెప్టెంబర్‌లో విమాన ప్రయాణికులు పెరిగారు. సమీక్షించిన నెలలో అత్యధికంగా ఇండిగో లో 22.6 లక్షల మంది తర్వాతి స్థానంలో స్పెస్‌జెట్‌లో 5.3 లక్షలమంది ప్రయాణించారు. అలాగే ఎయిరిండియా, ఎయిర్ఏషియా, విస్తరా, గోఎయిర్ విమానాల్లో వరుసగా 3.72 లక్షలు, 2.35 లక్షలు, 2.58 లక్షల మంది ప్రయాణించినట్లు డీజీసీఏ గణాంకాలు చెబుతున్నాయి. ఆక్యుపెన్సీ రేటు 57–73 శాతం: భారతీయ విమాన సంస్థల ఆక్యుపెన్సీ రేటు సెప్టెంబర్‌లో 57 నుండి 73 శాతం మధ్యలో ఉంది. అత్యధికంగా స్పైస్‌జెట్‌లో ఆక్యుపెన్సీ రేటు 70 శాతంగా ఉంది. ఇతర ప్రధాన సంస్థలైన విస్తరా, ఇండిగో, ఏయిర్ ఏషియా ఇండియా, గోఎయిర్, ఎయిరిండియాల ఆక్యుపెన్సీ రేట్లు వరుసగా 66.7 శాతం, 65.4 శాతం, 58.4 శాతం, 57.9 శాతం, 57.6 శాతంగా నమోదైనట్లు డీజీసీఏ తెలిపింది. సైకిళ్లకు గిరాకీ పెంచిన కరోనా న్యూఢిల్లీ: కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టాలతో అల్లాడుతుండగా భారత్‌లో సైకిళ్ల అమ్మకాలు మాత్రం స్పీడందుకున్నాయి. గడిచిన 5 నెలల్లో సైకిళ్ల అమ్మకాలు రెండింతల వృద్ధిని సాధించాయి. ఎలాంటి ఖర్చు లేకుండా తక్కువ, మధ్యస్థాయి గమ్యస్థానాలను చేరుకోవచ్చనే అభిప్రాయంతో పాటు ఆరోగ్య భద్రత, ఫిట్నెస్ తదితర అంశాల దృష్ట్యా ప్రజలు వీటి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది మే నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో మొత్తం 41,80,945 సైకిళ్లు అమ్ముడుపోయినట్లు అఖిల భారత సైకిల్ తయారీ సమాఖ్య(ఏఐసీఎంఏ) తెలిపింది. కరోనా సంక్షోభంతో ప్రజలకు ఆరోగ్య భద్రత, రోగనిరోధశక్తి పెంపు ఆవశ్యకతల పట్ల అవగాహన పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సైకిళ్ల వాడకమనేది ఆశాజనకంగా మారింది. డిమాండ్ ఒక్కసారిగా ఉపందుకోవడంతో పలు నగరాల్లో సైకిళ్ల కొరత ఏర్పడింది. వినియోగదారులు కొత్త సైకిళ్ల రాక కోసం ఎదురుచూసే పరిస్థితులు నెలకొన్నాయి. ‘‘దేశవ్యాప్తంగా సైకిళ్లకు అనూహ్యరీతిలో డిమాండ్ పెరిగింది. ఈ 5 నెలల్లో అమ్మకాలు 100 శాతానికి వృద్ధిని సాధించాయి. ఈ స్థాయిలో డిమాండ్ నెలకొనడం ఇదే మొదటిసారి కావచ్చు’’ అని ఏఐసీఎంఏ సెక్రటరీ జనరల్ కేబీ థాకూర్ తెలిపారు. 40శాతం క్షీణించనున్నలగ్జరీ కార్ల మార్కెట్! న్యూఢిల్లీ: భారత లగ్జరీ కార్ల తయారీ మార్కెట్ ఈ ఏడాదిలో 40 శాతం క్షీణించే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. పరిశ్రమ డిమాండ్ ఇప్పటికే ఒత్తిడిలో కూరుకుపోయిన నేపథ్యంలో మొత్తం తయారీ పరిమాణం 40 శాతానికి పైగా తగ్గుతాయని ఇక్రా తెలిపింది. గతేడాది అమ్ముడుపోయిన 35 వేల లగ్జరీ కార్లతో పోలిస్తే ఈ ఏడాదిలో 21వేల కార్లు మాత్రమే అమ్ముడుపోయే అవకాశం ఉందని ఇక్రా అంటుంది. ఇదే ఏడాదిలో పాసింజర్ వాహన (పీవీ) విభాగపు డిమాండ్ నెమ్మదిగా సాధారణ స్థాయికి చేరుకుంటుందని రేటింగ్ సంస్థ పేర్కొంది. -
పారాసిటమాల్ మింగి.. దర్జాగా ఇంటికి..!
సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి వస్తున్నవారు విమానం దిగాక థర్మల్ స్క్రీనింగ్‌కు దొరక్కుండా ఉండేందుకు జ్వరానికి ఉపయోగించే పారాసిటమాల్ మాత్రలు వేసుకుంటున్నారు. విమానం దిగేందుకు గంట ముందు ఈ మాత్రలు వేసుకుంటున్నారు. దీంతో శరీర ఉష్ణోగ్రతలు తగ్గి స్క్రీనింగ్‌లో దొరక్కుండా ఇదో ఉపాయాన్ని వెతుక్కుంటున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్న వారిని ‘సీ’కేటగిరీ కింద భావించి నేరుగా ఇళ్లకు పంపుతారు. ఇంటి దగ్గరే ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. (తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు) జ్వరం ఉంటే ఎక్కడ గాంధీ ఆస్పత్రి లేదా క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుందోననే భయంతో మరోదారిలో బయటపడుతున్నారు. ఈ విషయం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి వచ్చింది. ఇదే విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేసింది. ఇలాంటి కేసుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రెండ్రోజుల కిందట ఇలాగే దుబాయి నుంచి వచ్చిన ఓ వ్యక్తి పారాసిటమాల్ వేసుకొని, థర్మల్ స్క్రీనింగ్‌కు దొరక్కుండా నేరుగా ఇంటికే వెళ్లాడు. దీనిపై ఒకరు వైద్య ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేశారు. (కరోనా.. కోటి రూపాయల నజరానా) యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తుండంతో విమానాశ్రయాలతో పాటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రద్దీ ప్రదేశాల్లో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టు, పార్లమెంట్ సహా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. కోవిడ్-19 అనుమానితులను క్వారంటైన్ కేంద్రాలకు తరలించి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. (కరోనా: తెర వెనుక హీరోపై ప్రశంసలు) -
బెంగళూరు తర్వాత హైదరాబాదీల దూకుడు
సాక్షి, హైదరాబాద్: విమాన ప్రయాణంలో తెలుగు రాష్ట్రాలు టాప్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాయి. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాల వృద్ధిలో దేశంలో బెంగళూరు తొలి స్థానంలో ఉండగా, హైదరాబాద్ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తిరుపతిలు సైతం భారీ వృద్ధిని సాధించాయి. తాజాగా ఇండియన్ ఎయిర్పోర్ట్ అథారిటీ విడుదల చేసిన వార్షిక నివేదికలో అంతర్జాతీయ టెర్మినల్ కలిగిన మహా నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్ దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాల్లో మొదట్రెండు స్థానాల్లో నిలబడ్డాయి. ప్రయాణికుల సంఖ్యలో ఢిల్లీ, ముంబైలు తొలి రెండు స్థానాల్లో ఉన్నా 2018–19 కాలంలో వృద్ధిని సాధించలేకపోయాయి. దేశీయ ప్రయాణాల్లో ముంబైలో ఏకంగా 2017–18తో పోలిస్తే 1.3 శాతం ప్రయాణికులు తగ్గిపోగా, అంతర్జాతీయ ప్రయాణికుల్లో 5.7 శాతం వృద్ధితో దేశంలోని మిగిలిన మెట్రో నగరాల వరసలో చివరకు చేరింది. బెంగళూరు–భాగ్యనగరం పోటాపోటీ బెంగళూరు–హైదరాబాద్‌లో ఫ్లైట్ జర్నీ విషయంలో పోటాపోటీగా నిలబడ్డాయి. ఐటీ, సినిమా, ఫార్మా, హెల్త్, ఎడ్యుకేషన్ రంగాలు భారీగా విస్తరించటంతో జాతీయ సగటు కంటే ఈ రెండు నగరాలు అత్యధిక ప్రయాణికులతో తొలి రెండు స్థానాలను దక్కించుకున్నాయి. దేశీయ ప్రయాణాల్లో బెంగళూరు 24.8 శాతం ప్రయాణికుల వృద్ధితో తొలి స్థానంలో నిలబడితే, హైదరాబాద్ 20.4 శాతం వృద్ధితో రెండో స్థానంలో నిలిచింది. మూడ్నాలుగు స్థానాల్లో చెన్నై, కోల్‌కతా మహా నగరాలు నిలిచాయి. ఇక విదేశీ ప్రయాణాల్లో 17.5 శాతం వృద్ధితో బెంగళూరు మొదటి స్థానంలో నిలిస్తే.. 8.1 శాతం వృద్ధితో హైదరాబాద్ రెండో స్థానం దక్కించుకుంది. విజయవాడ, తిరుపతిలు సైతం.. ఇక దేశీయ విమానాశ్రయాలు కలిగిన పట్టణాల విషయంలో తిరుచ్చి మొదటి ప్లేస్‌లో ఉండగా, విజయవాడ, తిరుపతి పట్టణాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఇటీవలి కాలంలో ఫ్లైట్ కనెక్టివిటీ పెరగటంతోపాటు ప్రయాణాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. దీంతో ఒక్క ఏడాదిలోనే 57.9 శాతం వృద్ధితో దేశంలోని దేశీయ విమానాశ్రయ కేటగిరిలో రెండో స్థానంలో నిలిచింది. -
ఇక ఆ బుకింగ్‌లకు డిజిటల్ ఐడీ
న్యూఢిల్లీ: విమాన టికెట్ బుకింగ్‌కు ప్రత్యేకమైన డిజిటల్ ఐడిని రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. విమానాశ్రయంలోకి ప్రవేశించేటప్పుడు ఎయిర్ ట్రావెలర్లు ఆధార్, పాన్ లాంటి ఇతర గుర్తింపుకార్డుల కాపీలను తీసుకెళ్లడం తప్పనిసరి. అయితే ఇక మీదట విమాన ప్రయాణికుల సౌలభ్యం కోసం డిజిటల్ యూనిక్ ఐడెంటిఫికేషన్ను పద్ధతిని ప్రవేశ పెట్టేందుకు విమానయాన మంత్రిత్వశాఖ ప్రతిపాదనలు సిద్దం చేసింది. మరో మూడు నెలల్లో దీన్ని మాండేటరీ చేయనుంది. దీనికోసం ఒక టెక్నికల్ టీంను కూడా ఏర్పాటు చేసింది. ఎయిర్ టికెట్ బుకింగ్ సమయంలో "డిజిటల్ ప్రత్యేక గుర్తింపు" అవసరాన్ని ప్రవేశపెట్టాలని మంత్రిత్వశాఖ యోచిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ప్రస్తుతం ఆధార్, పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య), పాప్‌పోర్ట్ నంబర్ లాంటి ఇతర అనలాగ్ యూనిక్ ఐడీ ఉన్నప్పటికీ ఈ తరహాలోనే ఒక డిజిటల్ ప్రత్యేక గుర్తింపు కోసం మంత్రిత్వ శాఖ ప్రతిపాదించినట్టు చెప్పారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి తగిన సలహాలను అందించడంకోసం డిజిటల్ ట్రావెలర్ వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 30 రోజులలో తన రిపోర్ట్ సమర్పించమని కోరినట్టు చెప్పారు. అనంతరం ఇతర పరిశ్రమ వాటాదారుల సలహాలను కూడా ఆహ్వానించనున్నట్టు సిన్హా తెలిపారు. ఈ ప్రతిపాదనను మంత్రిత్వ శాఖ అధ్యయనం చేస్తోందనీ, ప్రయాణీకుల భద్రత, సౌకర్యం గోప్యతల ఆధారంగా విస్తృతమైన సంప్రదింపుల అనంతరం నిర్ణయం తీసుకుంటా మన్నారు. ఈ పథకంలో ఆధార్ తప్పనిసరి కాదు. కానీ ఇతర డిజిటల్ గుర్తింపు ఒక ఆప్షన్‌గా ఉంటుందని మంత్రి చెప్పారు. అయితే ప్రయాణీకులు కోరుకుంటే ఇప్పటికీ బోర్డింగ్ పాస్‌ను తీసుకునే అవకాశం ఉంటుందని విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి తెలిపారు. Air travellers already require analog unique ID. A digital unique ID such as Aadhar, PAN, passport number, etc. is now proposed 2/2 — Jayant Sinha (@jayantsinha) June 8, 2017 Chaired a discussion on #DigiYatra with industry stakeholders and asked them to submit recommendations in 30 days. pic.twitter.com/snq3omLX83 — Jayant Sinha (@jayantsinha) June 8, 2017