వేసవికాలం కావడంతో దేశంలోని చాలామంది సమ్మర్ సెలవులు, ఇతర విహారయాత్రలు చేస్తూంటారు. ఈ తరుణంలో ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. దాంతో దేశంలో విమాన ప్రయాణీకుల రద్దీ పెరుగుతోంది. ఒక్కరోజే దాదాపు 5 లక్షల మంది ప్యాసింజర్లు దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయాణించి రికార్డు నెలకొల్పారు. ఆదివారం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల మధ్య నడిచిన 6,128 విమాన సర్వీసుల్లో ఏకంగా 4,71,751 మంది ప్రయాణించినట్టు తేలింది.
ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తాజాగా వివరాలు వెల్లడించింది. కరోనాకంటే ముందు విమాన ప్రయాణీకుల సగటు (3,98,579)తో పోల్చితే ఇది 14 శాతం అధికం. గతేడాది ఏప్రిల్ 21న 5,899 విమాన సర్వీసుల్లో 4,28,389 మంది ప్రయాణించారు. ఈ ఏడాది జనవరి-మార్చిలో దేశీయ విమానయాన సంస్థల సర్వీసుల్లో ప్రయాణించినవారు 3.91కోట్లుగా ఉన్నట్టు గత వారం భారతీయ విమానయాన నియంత్రిత సంస్థ డీజీసీఏ తెలిపింది. గత ఏడాది ఇదే వ్యవధిలో ప్యాసింజర్లు 3.75కోట్లుగా ఉన్నారు. దీంతో వార్షిక వృద్ధి 4.38 శాతంగా నమోదైందని తెలిపింది.
ఇదీ చదవండి: టాప్ 3 కంపెనీల్లో 64 వేలమందికి లేఆఫ్స్..!
‘ఆర్థికాభివృద్ధి, ప్రభుత్వ విధానాలు, అందుబాటు ధరల్లో విమాన సేవలందించే సంస్థలు విస్తరిస్తున్నాయి. రోజురోజుకూ సరికొత్త స్థాయికి ప్యాసింజర్ల సంఖ్య చేరుతుంది. భవిష్యత్తులో ఇది మరింత పెరుగనుంది’ అని విమానయాన మంత్రిత్వ శాఖ తన అధికారిక ‘ఎక్స్’(ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment