
సాక్షి, హైదరాబద్: అంతర్జాతీయ ప్రయాణాలు చేసే ముందు ప్రయాణికులు ఒకసారి తమ పాస్‌పోర్టును పరిశీలించుకోవాలని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే సమయానికి 6 నెలల లోపు పాస్‌పోర్టు గడువు ముగిసిపోతున్నట్లయితే దాన్ని పునరుద్ధరించుకోవాలని ఆయన సూచించారు.
మైనర్ పాస్‌పోర్టులు 5 ఏళ్ల గడువుకే అందిస్తామని తల్లిదండ్రులతో పాటు మైనర్లు ప్రయాణం చేస్తున్నట్లయితే వారి పాస్‌పోర్టులు ఒక సారి చూసుకోవాలని తెలిపారు. ఎక్కువ ప్రయాణాలు చేసే వారు జంబో పాస్‌పోర్టు ఎంచుకోవాలన్నారు. పాస్‌పోర్టు అపాయింట్‌మెంట్‌ను 3సార్లు రీ షెడ్యూల్ చేసుకోవచ్చని, అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఫిర్యాదుల కోసం 1800258 1800,040–277715333,040–27715115 నెంబర్లకు ఫోన్ చేయవచ్చన్నారు.
చదవండి:
పాస్‌పోర్ట్ కవర్ ఆర్డర్ చేస్తే ఏకంగా పాస్‌పోర్టే వచ్చింది
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఇదే!
Comments
Please login to add a commentAdd a comment