
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆగస్ట్‌లో 66 లక్షల మంది విమాన ప్రయాణం చేశారు. జూలైతో పోలిస్తే ఈ సంఖ్య 31 శాతం అధికమని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ‘ప్రయాణికుల సంఖ్య పరిమితి అధికమవడం, మహమ్మారి తగ్గుముఖం పట్టడం ఈ పెరుగుదలకు కారణం. జూలైలో దేశీయంగా 51 లక్షల మంది వివిధ నగరాలను చుట్టి వచ్చారు. 2020 ఆగస్ట్‌తో పోలిస్తే గత నెలలో ప్రయాణికుల సంఖ్య 131 శాతం అధికమైంది. గతేడాది ఈ కాలంలో 28.3 లక్షల మంది ప్రయాణం చేశా రు. ఆగస్ట్‌లో కోలుకోవడం జరిగినప్పటికీ సె కండ్ వేవ్ కారణంగా డిమాండ్‌పై ఒత్తిడి కొనసాగుతోంది. కస్టమర్లు అవసరమైతే మాత్రమే ప్రయాణిస్తున్నారు’ అని ఇక్రా తెలిపింది.
అధికమైన సరీ్వసులు..
దేశవ్యాప్తంగా 2021 ఆగస్ట్‌లో 57,500 విమాన సరీ్వసులు నడిచాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 28,834 మాత్రమే. ఈ ఏడాది జూలైతో పోలిస్తే గత నెలలో 22 శాతం పెరుగుదల. ఆగస్ట్‌లో సగటున 1,900 సరీ్వసులు నమోదయ్యాయి. 2020 ఆగస్ట్‌లో ఇది 900 మాత్రమే. 2021 జూలైలో ఈ సంఖ్య 1,500 ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సగటున రోజుకు 2,000 సరీ్వసులు నడవడం గమనార్హం. ఆగస్ట్‌లో ఒక్కో విమానంలో సగటున 114 మంది ప్రయాణించారు. జూలైలో ఈ సంఖ్య 106 ఉంది. ఇక విమాన టికెట్ల ధరలను ఆగస్ట్ 12–31 మధ్య 10–13 శాతం పెంచేందుకు పౌర విమానయాన శాఖ అనుమతిచి్చంది’ అని ఇక్రా వివరించింది.