విమానాల్లో వైఫై.. ఫ్రీగా ఇంటర్నెట్‌ | Air India launches Wi Fi on domestic flights | Sakshi
Sakshi News home page

విమానాల్లో వైఫై.. ఫ్రీగా ఇంటర్నెట్‌

Published Thu, Jan 2 2025 7:00 PM | Last Updated on Thu, Jan 2 2025 7:18 PM

Air India launches Wi Fi on domestic flights

విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) దేశీ, విదేశీ రూట్లలో నడిపే ఫ్లయిట్స్‌లో వైఫై (Wi-Fi) ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సర్వీసులను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఎయిర్‌బస్‌ ఏ350, బోయింగ్‌ 787–9 రకం విమానాలతో పాటు నిర్దిష్ట ఎయిర్‌బస్‌ ఏ321నియో ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.

దేశీయంగా ఫ్లయిట్స్‌లో వైఫై సర్వీసులను ప్రవేశపెట్టిన తొలి విమానయాన సంస్థ తమదేనని ఈ సందర్భంగా కంపెనీ తెలిపింది. దేశీ రూట్లలో ప్రస్తుతానికి వీటిని కాంప్లిమెంటరీగా అందిస్తున్నట్లు వివరించింది. క్రమంగా అన్ని విమానాల్లోనూ ఈ సేవలు ప్రవేశపెడతామని పేర్కొంది.

విమానాలు 10,000 అడుగుల ఎత్తు దాటాకా ప్రయాణికులు తమ ల్యాప్ టాప్‌లు, టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లను వైఫైకి కనెక్ట్‌ చేసుకుని ఇంటర్నెట్‌ సేవలు ఆస్వాదించవచ్చు. ప్రస్తుతానికి ఈ సదుపాయాన్ని ఉచితంగానే అందుబాటులోకి తెచ్చినట్లు ఎయిర్‌ ఇండియా ప్రకటించించింది.

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ రూట్లలో పైలట్ ప్రోగ్రామ్‌గా గతంలో ఈ సర్వీసును ప్రారంభించింది. వీటిలో న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ వంటి ప్రధాన గమ్యస్థానాలు ఉన్నాయి. ఇప్పుడు దేశీయ రూట్లలో కూడా దీన్ని అమలు చేస్తున్నారు. వై-ఫై సేవలను క్రమంగా ఇతర విమానాలకు కూడా విస్తరిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement