
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అనుబంధ సంస్థ ఎన్‌పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ (NBSL)కి చెందిన భారతీయ పేమెంట్ యాప్ భీమ్, ‘భారత్ కా అప్నా పేమెంట్స్ యాప్’గా తన స్థానాన్ని పటిష్టం చేసుకునేలా కొత్త బ్రాండ్ ప్రచార కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. చెల్లింపు విధానాల్లో మార్పులు వచ్చే కొద్దీ.. నగదు విషయాల్లో విశ్వసనీయతకు భారతీయులిచ్చే ప్రాధాన్యతకు నిదర్శనంగా ‘పైసోం కా కదర్’ పేరిట ఈ ప్రచార కార్యక్రమం ఉంటుంది.
ఎన్‌పీసీఐ ప్రారంభించిన ఈ కొత్త కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రజల రోజువారీ చెల్లింపు అవసరాలను తీర్చే విధంగా రూపొందింది. ఇది పేమెంట్స్ యాప్‌గా భీమ్ (BHIM) స్థానాన్ని ఇది మరింత పటిష్టం చేసే విధంగా ఉంటుంది. టిల్ట్ బ్రాండ్ సొల్యూషన్స్ డిజైన్ చేసిన ఈ క్యాంపెయిన్‌లో అయిదు బ్రాండ్ ఫిలింలు ఉంటాయి.
యాప్ వినియోగ సౌలభ్యాన్ని తెలియజేసేలా భీమ్ విశ్వసనీయత, భద్రత, కస్టమర్ - ఫస్ట్ విధానాలు, సిసలైన సమ్మిళితత్వానికి సంబంధించిన కీలక విలువలను హైలైట్ చేసేవిగా ఉంటాయి. అందరికీ చేరువయ్యేలా మొత్తం తొమ్మిది భారతీయ భాషల్లో ఈ ఫిలింలు విడుదలవుతాయి.
కస్టమర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండే భీమ్ 3.0ని ఈ క్యాంపెయిన్ ఆవిష్కరిస్తుంది. ఇది 15 కంటే ఎక్కువ భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది. ఇంటర్నెట్ అంతగా ఉండని ప్రాంతాల్లోనూ ఇది పని చేస్తుంది. ఖర్చుల విభజన, ఫ్యామిలీ మోడ్, వ్యయాల విశ్లేషణ, యాక్షన్ నీడెడ్ రిమైండర్లు మొదలైన మనీ మేనేజ్‌మెంట్ సాధనాలు ఇందులో ఉంటాయి.