సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కోవిడ్ పరీక్షల ధరలు తగ్గాయి. కొద్ది రోజులుగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో పరీక్షల సంఖ్య పెరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మ్యాప్ మై జినోమ్ సంస్థ ఎయిర్‌పోర్టులో కోవిడ్ పరీక్షల ధరలను తగ్గించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ ధర గతంలో రూ.4,500 ఉంటే ఇప్పుడు రూ.3,900కు తగ్గించారు. సాధారణ ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం ఇప్పటి వరకు రూ.999 ఉండగా తాజాగా రూ.750కి తగ్గించారు.
ఎయిర్‌పోర్టులో చార్జీలపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వ ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. నగరంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు కేవలం రూ.500 ఉన్న విషయాన్ని అధికారులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. దీంతో ఎయిర్‌పోర్టులో పరీక్షలు నిర్వహిస్తున్న మ్యాప్ మై జినోమ్ సంస్థ ధరలను తగ్గించినట్లు అధికారులు తెలిపారు.
ప్రయాణికుల రద్దీ..
►కొద్ది రోజులుగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. వివిధ దేశాల నుంచి ప్రతి రోజు సుమారు 5వేల మంది ప్రయాణికులు నగరానికి చేరుకుంటున్న ట్లు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం యూరప్ దేశాలు, న్యూజిలాండ్, సింగపూర్, తదితర 11 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రం ఆర్టీపీసీఆర్ పరీక్షలను తప్పనిసరి చేసింది.
►ఈ 11 దేశాల నుంచి ప్రతి రోజు వచ్చే సుమారు 500 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నా రు. ఆయా దేశాల నుంచి బయలుదేరే సమయంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసుకొన్నప్పటికీ ఎయిర్‌పోర్టులో మ రోసారి పరీక్షించి నెగెటివ్ వచి్చన వారిని ఇళ్లకు అనుమతినిస్తున్న సంగతి తెలిసిందే.
సమర్థంగా పరీక్షలు...
►ఐసీఎంఆర్ ఆమోదించిన మ్యాప్ మై జినోమ్ సంస్థ గతేడాది నవంబరు నుంచి ఎయిర్‌పోర్టు లో ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్, ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహిస్తోంది. నమూనాలు సేకరించిన అర్ధ గంట వ్యవధిలోనే ఫలితాలను తెలుసుకొనేందుకు ర్యాపిడ్ ఆరీ్టపీసీఆర్ దోహదం చేస్తోంది.
►ఆర్టీపీసీఆర్ పరీక్షలో మాత్రం కొంత సమయం పట్టవచ్చు. సుమారు 200 మంది టెక్నీషియన్‌లు మ్యాప్ మై జినోమ్ లేబొరేటరీలో నిరంతరం విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు, బెంగళూర్ తదితర విమానాశ్రయాల్లోనూ మ్యాప్ మై జినోమ్ సేవలందజేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment